బ్రాడీకార్డియా (గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం) - Bradycardia (Slow Heart Rate) in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 28, 2018

July 31, 2020

బ్రాడీకార్డియా
బ్రాడీకార్డియా

గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం (బ్రాడీకార్డియా) అంటే ఏమిటి?

బ్రాడికార్డియా లేదా ‘గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం” అనేది ఒక వ్యక్తి యొక్క గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువసార్లు కొట్టుకోవడం జరిగినప్పుడు దాపురించే పరిస్థితి.  ఆరోగ్యవంతుడైన వయోజనుడి గుండె చప్పుడు రేటు 60-100 మధ్య ఉంటుంది. గుండె తక్కువగా కొట్టుకోవడం (నెమ్మదించిన హృదయ స్పందన) సాధారణంగా క్రేడాకారులు (అథ్లెట్లు) మరియు వృద్ధుల్లో కనిపిస్తుంది. కొందరు యువకులు మరియు ఆరోగ్యవంతులైన  వ్యక్తులు కూడా గుండె తక్కువగా కొట్టుకోవడాన్ని అనుభవించవచ్చు. అయితే ఈ జబ్బు తమకుందనే విషయం తెలిసేదెపుడంటే, ఆ వ్యాధికి సంబంధించిన ఇతర లక్షణాలను కూడా వారు ఎదుర్కొన్నపుడే.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

బ్రాడీకార్డియాతో సాధారణంగా కనిపించే సంకేతాలు మరియు లక్షణాలు:

 • బలహీనత .
 • అలసట.
 • మూర్ఛ .
 • వికారం .
 • చమట్లు పట్టుట.
 • గందరగోళం.
 • శ్వాస తీసుకోవడంలో కష్టం .
 • తగ్గిన రక్తపోటు.
 • తేలికపాటి స్థాయి నుండి తీవ్రమైన  ఛాతీ నొప్పి .

‘గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం’ అనే పరిస్థితి దాపురించినా కూడా కొన్నిసార్లు మీరు ఎటువంటి వ్యాధి లక్షణాలను అనుభవించకపోవచ్చు.

బ్రాడీకార్డియా అనే పరిస్థితికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఇపుడిపుడే ప్రారంభమైన బ్రాడీకార్డియాకు రెండు కారణాలు ఉన్నాయి. అవి:

 • అంతర్గత కారణాలు (అంటే అంతర కారణాల వలన):
  • పెరుగుతున్న వయస్సు .
  • గుండెపోటు .
  • స్వయం ప్రతిరక్షక వ్యాధులు (రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలం పై దాడి జరపడం) దైహిక ముఖచర్మరోగం (ల్యూపస్), రుమాటాయిడ్ ఆర్థరైటిస్ మరియు స్క్లెరోడెర్మా వంటివి .
  • కండరాల బలహీనత (వృధా).
  • గుండె యొక్క సంక్రమణ.
  • గుండె యొక్క శస్త్రచికిత్సలు.
  • నిద్రలో శ్వాస నిరోధం (స్లీప్ అప్నియా లేక నిద్రలో శ్వాస ఆడకపోవడం).
  • జన్యుతత్వం (జెనెటిక్స్).
  • సినాట్రియల్ నోడ్ డిస్ఫంక్షన్ (సాధారణ హృదయ స్పందనకు బాధ్యత వహించే నరాలు పనిచేయకపోవడం).
 • బాహ్య కారణాలు (అనగా బయటి కారకాల వలన కలిగే ప్రభావాలు)
  • దగ్గు .
  • వాంతులు.
  • మూత్రం విసర్జించడం
  • మలం విసర్జించడం (స్టూల్ పాసేజ్).
  • బీటా బ్లాకర్స్, కాల్షియం చానెల్ బ్లాకర్స్ ( అధిక రక్తపోటు చికిత్స కోసం  ) మరియు యాంటీ-ఆర్రిథైమ్ వంటి మందులు (తీవ్రమైన, క్రమరహిత మరియు వేగవంతమైన హృదయ స్పందన రేటుకు)
  • హైపోథైరాయిడిజం (శరీరంలో తక్కువ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు).
  • తగ్గిన శరీర ఉష్ణోగ్రత (అల్పోష్ణస్థితి ).
  • మెదడుకు గాయం, వెన్నుపూసకు లేదా నరాలకు గాయం .
  • పొటాషియం స్థాయిలలో అసమానతలు.

బ్రాడీకార్డియా అనే జబ్బును నిర్ధారించేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి?

‘గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం’ అనే జబ్బు ఉన్నట్లు అనుమానించిన రోగి యొక్క రోగకారకాల్ని తెలుసుకునేందుకు డాక్టర్ రోగి వైద్య పరిస్థితులు మరియు ఔషధాల గురించి వివరణాత్మక చరిత్రను అడిగి తెల్సుకుని, తదనంతరం రోగి శారీరక పరీక్షను కూడా నిర్వహిస్తాడు. బ్రాడీకార్డియాని నిర్ధారించడానికి, మీ డాక్టర్ ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ECG) అని పిలువబడే ఒక ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తారు, ఇది గుండె కొట్టుకోవడంతో ఏదైనా అసాధారణతలుంటే గుర్తించేందుకు. ఇతర పరీక్షలు కూడా నిర్వహించవచ్చు, ఉదాహరణకు, రక్త పరీక్ష (హైపోథైరాయిడిజం లేదా ఎలెక్ట్రోలైట్ అసమతౌల్యాన్ని కనిపెట్టేందుకు), స్లీప్ అప్నియా టెస్ట్, ఎలక్ట్రోఫిజియాలజీ టెస్ట్ (క్రమరహిత హృదయ స్పందన యొక్క ఖచ్చితమైన కారణం తెలుసుకోవడం కోసం) మరియు ఒత్తిడి పరీక్ష (పనిలో గుండె యొక్క ప్రతిస్పందన లేదా ఒత్తిడిని తెలుసుకునేందుకు).

మీరు గతంలో ఈ వ్యాధికి సంబంధించిన ఏ లక్షణాలను అనుభవించకపోయినా కూడా సాధారణ వైద్య తనిఖీల సమయంలో బ్రాడికార్డియా బయటపడే అవకాశం ఉంది.

సాధారణంగా, ఈ వ్యాధికి సంబంధించిన ఏ లక్షణాలో లేనివారికి చికిత్స ఇవ్వబడదు. గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడమనే వ్యాధి లక్షణాలు ఆ వ్యాధి కారణం మీద ఆధారపడి లక్షణాలు మారుతూ ఉంటాయి. గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడమనే వ్యాధి ఓ నిర్దిష్టమైన ఔషధం సేవించడంవల్ల దాపురించి ఉంటే, ఆ మందు మోతాదును  తగ్గించడమో లేదా పూర్తిగా నిలిపివేయబడుతుంది. గుండె కొట్టుకోవడానికి దోహదపడే గుండెలోని సైనస్ నోడ్ కణాలు పనిచేయకపోవడంతో (sinus node dysfunction), దాపురించే రుగ్మతకు విరుగుడుగా లేదా హృదయ స్పందన రేటును సాధారన స్ట్యాయికి తెచ్చెదుకు ఒక పేస్ మేకర్ ను చికిత్సలో భాగంగా ఉపయోగించబడుతుంది.వనరులు

 1. American Heart Association, American Stroke Association [internet]: Texas, USA AHA: Management of Symptomatic Bradycardia and Tachycardia
 2. American Heart Association, American Stroke Association [internet]: Texas, USA AHA: Exercise Stress Test
 3. John Wiley and Sons. [Internet]. Wiley Blackwell.United States; Bradycardia.
 4. Fred M. Kusumoto, Mark H. Schoenfeld. [Internet]. Journal of the American College of Cardiology November 2018 Bradycardia Guideline Hub.
 5. Hafeez Y, Grossman SA. Sinus Bradycardia. [Updated 2019 May 14]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.

బ్రాడీకార్డియా (గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం) కొరకు మందులు

బ్రాడీకార్డియా (గుండె తక్కువ వేగంతో కొట్టుకోవడం) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।