myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ( క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా సి కె డి / క్రానిక్ రెనాల్ డిసీజ్) కలిగిన రోగులలో  మూత్రపిండాలు క్రమేపీ పనిచేయడం మానివేస్తాయి. అంటే వ్యాధి ముదరుతుండగా, మూత్రపిండాలకు అవి సాధారణంగా కొనసాగిస్తున్న రక్తం వడబోత అసాధ్యమవుతుంది. సి కె డి కి రెండు ముఖ్య కారణాలు మధుమేహం జబ్బు మరియు హెచ్చుస్థాయి రక్తపోటు. తొలిదశలో మూత్రపిండాలు ఎలాంటి జబ్బు లక్షణాలను చూపించవు. జబ్బు లక్షణాలు కనిపించని కారణంగా రక్తం మరియు మూత్రం సాధారణ వైద్యపరీక్ష లేదా చెకప్ జరిపించినప్పుడు జబ్బు నిర్ధారింపబడుతుంది. చికిత్స తర్వాత కూడా కిడ్నీల పనితీరు  మరింత చెడినప్పుడు, లేదా తొలి దశలలో సికెడీ  నిర్ధారింపబడనప్పుడు, రోగి చీలమండ వాపు, మూత్రంలో రక్తం , కండరాలలో తిమ్మిరి పెరగడం, తరచుగా మూత్రవిసర్జన జరపడం, కొద్దిపాటి శ్రమతో కూడా శ్వాసక్రియకు ఇబ్బంది ఏర్పడటం వంటి లక్షణాలను ఎదుర్కొంటాడు.  దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బుకు చికిత్స దాని కారణం పై ఆధారపడి ఉంటుంది. ఔషధాలతో పాటు, జీవనసరళిలో మార్పులు కూడా సికెడి నిర్వహణలో కీలకపాత్ర వహిస్తాయి. కిడ్నీ పనితీరు రోజురోజుకు అధ్వాన్నమవుతుంటే, రోగి కిడ్నీజబ్బు చివరి దశలో ఉన్నడని ఊహించవచ్చు. దీనిని ఎండ్-స్టేజ్ రెనాల్ డిసీజ్ (ఇ ఎస్ ఆర్ డి / రెనాల్ వైఫల్యం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు), దీనికి పర్యవసానం డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి. సికెడి రోగులలో ప్రతి 50 మందిలో ఒకరికి కిడ్నీ వైఫల్యం ఎదురవుతుంటుంది. మూత్రపిండాల వైఫల్యాన్ని, ఇతర దురవస్థలను నివారించడానికై  తొలిదశలో జబ్బు నిర్ధారణ ముఖ్యం.

 1. మూత్ర పిండ (కిడ్నీ) వైఫల్యం యొక్క లక్షణాలు - Symptoms of Chronic Kidney Disease in Telugu
 2. మూత్ర పిండ (కిడ్నీ) వైఫల్యం యొక్క చికిత్స - Treatment of Chronic Kidney Disease in Telugu
 3. మూత్ర పిండ వైఫల్యం కొరకు మందులు
 4. మూత్ర పిండ వైఫల్యం వైద్యులు

మూత్ర పిండ (కిడ్నీ) వైఫల్యం యొక్క లక్షణాలు - Symptoms of Chronic Kidney Disease in Telugu

దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు ( సికెడి) లక్షణాలలో ఇవి చేరి ఉంటాయి

తొలిదశలో లక్షణాలు

కిడ్నీ పనితీరులో చెప్పుకొనదగ్గ మోతాదులో న్యూనత ఎదురయినప్పటికీ, సాధారణంగా మానవ శరీరం విజయవంతంగా పనిచేయగలదు. దీనితో తొలిదశలలో కిడ్నీ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు ( సికెడి) బయటపడే స్థాయిలో లక్షణాలను చూపించదు. సికెడి తొలిదశ లక్షణాలు సామాన్యంగా అర్థరహితంగా ఉంటాయి. ఈ లక్షణాలలో ఇవి చేరి ఉంటాయి

సాధారణంగా క్రమం తప్పకుండా జరిపించే రక్తం లేదా మూత్రపరీక్షలు ఏవైనా ఎదురయ్యే సమస్యలను కనుగొంటే అప్పుడు తొలిదశలో దీర్ఘకాలిక కడ్నీ జబ్బును నిర్ధారించవచ్చు. తొలిదశలో జబ్బు నిర్ధారణ మరియు సికెడి కి చికిత్స జబ్బు మరింత  ముదరకుండా సహకరిస్తుంది లేదా నివరిస్తుంది.

ఆలస్యపు లక్షణాలు

కిడ్నీ జబ్బును తొలిదశలలో కనుగొనకపోతే లేదా  చికిత్స జరిపించినప్పటికీ జబ్బు ముదిరితే, ఈ క్రింది లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.

 • కిడ్నీ చెడటం కారణంగా రక్తంలో క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ స్థాయిలలో అసమతౌల్యత ఏర్పడినప్పుడు  ఎముకల నొప్పి కలగడటం
 • నీటితేమ కారణంగా చేతులు, పాదములు మరియు చీలమండలలో తిమ్మిరి మరియు వాపు కలగడం.
 • అమ్మోనియా –వంటి వాసనతో కూడిన శ్వాస దుర్వాసన లేదా శరీరంలో వ్యర్థ పదార్థాల నిల్వ కారణంగా చేపల వాసన కలగడం
 • ఆకలి హరించుకుపోవడం మరియు బరువు కోల్పోవడం
 • వమనం
 • తరచుగా వెక్కిళ్లు
 • ఎక్కువ మార్లు మూత్రవిసర్జన,  ముఖ్యంగా రాత్రి వేళలో
 • శ్వాసక్రియకు ఆటంకం
 • ఆయాసం
 • మూత్రం లో లేదా మలం లో రక్తం పడటం
 • నిశ్చలతకు లేదా ఆలోచనలపై ఇబ్బంది
 • కండరాల తుమ్మిరి / దుస్సంకోచాలు
 • తొందరగా గాయాలు ఏర్పడటం
 • తరచుగా నీరు సేవించాలనే కోరిక
 • రుతుక్రమంలో లోపం
 • నిద్రలేమి
 • ఎక్కువ లేత రంగు లేదా ఎక్కువ నలుపు రంగుకు చర్మం మారడం
 • లైంగిక చర్యకు విముఖత

సికెడి చివరి దశను కిడ్నీ/ రెనాల్ వైఫల్యం (ఫెయిల్యూర్) లేదా చివరి దశ రెనాల్ జబ్బు (ఇఎస్ఆర్డి) అంటారు. అది దశలవారీగా డయాలిసిస్ కు లేదా కిడ్నీ మార్పిడికి దారితీయవచ్చు.

మూత్ర పిండ (కిడ్నీ) వైఫల్యం యొక్క చికిత్స - Treatment of Chronic Kidney Disease in Telugu

సికెడి జబ్బును నయం చేయడానికి వీలుకాదు, అయితే ఎదురవుతున్న లక్షణాలను వాసి చేయడానికి చికిత్స ఉద్దేశింపబడింది జబ్బు మరింత అధ్వాన్నం కాకుండా చర్య తీసుకొనవలసి ఉంటుంది . జబ్బు వైపరీత్యం, తీవ్రత ఆధారంగా  చికిత్స జరుగుతుంది.  

చికిత్సలో ఇమడిన ముఖ్యాంశాలు :

 • జీవనసరళిలో మార్పులు:
  ఈ మార్పులు  హెచ్చుస్థాయిలో ఆరోగ్యకల్పనకు సిఫారసు చేయబడినాయి. డాక్టరు ఈ క్రింది మార్పులు చేపట్టాలని సలహా ఇవ్వవచ్చు :
  • పొగత్రాగడం నిలిపివేయండి
  • సమతుల్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవింఛండి.
  • మీరు రోజు తీసుకొనే ఉప్పు స్థాయిని  6 గ్రాముల కంటే తక్కువ చేయండి.
  • రోజులో కనీసం 30 నిమిషాలపాటు వారానికి 5 రోజులు వ్యాయామం చేయండి
  • మద్యం సేవించే మోతాదును వారానికి 14 అల్కహాల్ యూనిట్లకు పరిమితి చేయండి.
  • శరీరం బరువు తగ్గించుకొని మీ వయసుకు ఆమోదమైన ఆరోగ్యకరమైన బరువు      స్థాయిని నిర్వహించండి.
  • మీకు మీరే వైద్యచికిత్స జరపకండి
 • ఔషధాలు
  మధుమేహం, హెచ్చు రక్తపోటు లేదా హెచ్చు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను అదుపుచేయడానికి మందులు సూచిస్తారు.
 • మధుమేహం వ్యాధిగ్రస్తులు  ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, రక్తంలో గ్లూకోస్ స్థాయిని సరిచూసుకోవడానికై తరచు క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోవాలి.
 • హెచ్చుస్థాయి రక్తపోటు ఉన్నవారికి రక్తం పోటును అదుపుచేయడానికై డాక్టరు  ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైం ( ఏసిఐ ) నిరోధకాలను సూచించవచ్చు . వాటి ఉత్తరోత్తర సమస్యల (సైడ్ ఎఫెక్ట్స్) పరిష్కారానికై  డాక్టరు ఆంజియోటెన్సిన్ -2 రిసెప్టర్ బ్లాకర్ ( ఏ ఆర్ బి )ను సూచించవచ్చు. చికిత్స లక్ష్యం  రక్తంపొటును 140/ 90 ఎంఎం /హెచ్ జి స్థాయిలో ఉంచడం.
 • రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపు చేసే స్టాటిన్స్ ను సూచించవచ్చు
 • చీలమండలు లేదా చేతులలో వాపునకు డైయూరెటిక్ మందులను, ఉప్పుపై పరిమితిని, ద్రవాహారాలను  సూచించవచ్చు
 • దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు కొనసాగితే  అది రక్తలోపానికి దారితీయవచ్చు, దానికి ఇనుము పోషకాహారాలను సూచించవచ్చు లేదా హార్మోన్ ‘ ఎరిత్రోపోయింటిన్’ ను ఎక్కించవచ్చు. అది హెచ్చు ఆర్ బి సి లను ఉత్పత్తి చేస్తుంది.
 • తీవ్రరూపం దాల్చిన సికెడి రోగులకు డయాలిసిస్ అవసరం కావచ్చు.
 • హెచ్చుస్థాయిలో కిడ్నీకి నష్టం వాటిల్లిన లేదా రెనాల్ ఫెయిల్యూర్  సందర్భంలో కిడ్నీ మార్పిడి అవసరం కావచ్చు.
 • మద్దతు (ఉపశమన / సంప్రదాయవాద) చికిత్స
  మీరు డయాలిసిస్ కు వెళ్లకూడదని లేదా కిడ్నీ మార్పిడి చేయించుకొనకూడదని  నిర్ణయించుకొంటే లేదా అవి మీకు సరిపడకపోతే, మీ ఆరోగ్య పరిరక్షకుడు మీకు మద్దతు కల్పించే ప్రక్రియను సూచించవచ్చు. మద్దతు చికిత్స  రెనాల్ విఫలత లక్షణాల అదుపునకు, నివారణకు ఉద్దేశించబడింది. వీటిలో మానసిక, వైద్య మరియు ప్రయోగాత్మక చికిత్స చేరినవి. ఇవి వ్యక్తిగతంగా మరియు కుటుంబపరంగా ఉపకరిస్తాయి.

జీవన విధానం నిర్వహణ
మీరు కొన్ని సులభమైనట్టి జీవనవిధానాలను అమలు చేయడం ద్వారా మీ మూత్రపిండాలను చక్కటి పనితీరులో ఉంచుకొనవచ్చు. వాటిలో చేరినవి:

 • తక్కువ సోడియం కలిగిన ఆహారాన్ని సేవించడం, డబ్బాలలో ఆహారపదార్థాలను ఉపయోగించకపోవడం, ఎందుకంటే వాటిలో సోడియం హెచ్చుగా ఉంటుంది.
 • రోజుకు కనీసం 30 నిమిషాలపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ఈత మరియు వేగంగా నడక శారీరకంగా చురుకుగా  ఉండేందుకు మంచి ఐచ్చికాలు. అయితే ఇదివరకు మీరు శారీరకంగా చురుకుగా లేనట్లయితే  మీ ఆరోగ్య పరిరక్షణ బృందంతో చర్చిండండి. వారినుండి మీకు ఏలాంటి వ్యాయామం సరిపడుతుందో గ్రహించండి
 • తాజా పళ్లు, కొరగాయలు, పూర్తిధాన్యం, బీన్స్, చర్మంతీసిన తర్కీకోడి, లేదా సాధారణ కోడిమాంసం, పలుచటి చేపలు, తక్కువ కొవ్వు కలిగిన పాలు లేదా జున్ను. చక్కెర మరియు  తీపుకలిపిన పానీయాలను వాడకండి. తక్కువ కెలరీలు కలిగిన ఆహారాన్ని ఎంపిక చేసుకోండి.  కొవ్వు కలిగిన పదార్థాలను ఉప్పు , కొవ్వు మరియు చక్కెరను వాడకండి
 • ఆరోగ్యకరమైన బరువుపై దృష్ట ఉంచండి. ఊబకాయం మీ మూత్రపిండాలపై  హెచ్చు పనిభారాన్ని మోపుతుంది. సుశిక్షితులైనట్టి వ్యాయామ , ఫిట్ నెస్ నిపుణుని తరపీదులో  పనిచేయండి. మీ బరువు అదుపునకై శిక్షణ పొందిన ఆహార నిపుణుని సలహా పాటించండి
 • అవసరమైనంత మోతాదులో నిద్రించండి. రోజుకు 7 నుండి 8 గంటలపాటు నిద్రించడం లక్ష్యంగా ఉంచుకోండి. ఆ మాత్రం నిద్ర మీ మొత్తం ఆరోగ్యానికి, మరియు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరం. ఇది మీ రక్తపోటును మరిఉయు చక్కెర స్థాయిని పరిశీలిస్తుంది.
 • కిడ్నీ డ్యామేజ్ కు దోహదం చేసే ధూమపానాన్ని వదలివేయండి . పొగ త్రాగడాన్ని వదలడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
 • మానసిన ఒత్తిడి మరియు మానసిన మాంద్యాన్ని అదుపుచేయడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక ఒత్తిడి మీ రక్తంపోటును, రక్తంలో గ్లూకోస్ స్థాయిని  పెంచుతుంది. మనసుకు ఆహ్లాదం కలిగించే సంగీతాన్ని వినదం, ప్రశాంతమయిన మరియు శాంతిని కల్పించే పనులపై దృష్టిని కేంద్రీకరించడం లేదా ధ్యానం వంటివి  ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి.
 • ఔషధాలను సకాలంలో క్రమం తప్పకుండా ఉపయోగించండి. లేదా డాక్టరు సూచనల ప్రకారం మందులను తీసుకోండి.
Dr. Vijay Kher

Dr. Vijay Kher

गुर्दे की कार्यवाही और रोगों का विज्ञान

Dr. Shyam Bihari Bansal

Dr. Shyam Bihari Bansal

गुर्दे की कार्यवाही और रोगों का विज्ञान

Dr. Pranaw Kumar Jha

Dr. Pranaw Kumar Jha

गुर्दे की कार्यवाही और रोगों का विज्ञान

మూత్ర పిండ వైఫల్యం కొరకు మందులు

మూత్ర పిండ వైఫల్యం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
TelmichekTelmichek 40 Mg Tablet51
RamistarRAMISTAR 1.25MG CAPSULE30
TetanTETAN 20MG TABLET 10S45
ArbitelArbitel 20 Mg Tablet30
HopaceHOPACE 10MG CAPSULE 10S125
TelsartanTELSARTAN 20MG ACTIV TABLET 28S0
Telsartan HTELSARTAN H 40MG TABLET 10S0
TelmikindTELMIKIND 20MG TABLET 30S44
Telma HTELMA H 40MG TABLET 10S0
EnvasENVAS 10MG TABLET 10S65
Nebicard TNEBICARD-T TABLET120
Co DiovanCo Diovan 160 Mg/25 Mg Tablet677
Tazloc TrioTazloc Trio 40 Mg Tablet94
Cardace TabletCardace 1.25 Mg Tablet55
Hopace HHOPACE H 10MG TABLET 10S0
Telma TabletTelma 40 MG Tablet165
Orofer SOrofer S 100 Mg Injection225
PolycapPOLYCAP CAPSULE 10S200
PolytorvaPolytorva 10 Mg/150 Mg/2.5 Mg Kit84
Telma AmTelma 80 MG AM Tablet253
Telmiride AmTelmiride Am 40 Mg Tablet0
Misart HMISART H 40/12.5MG TABLET 10S44
Telmikaa MtTelmikaa Mt 25 Mg Tablet52
Telmisafe AmTelmisafe Am 40 Mg Tablet58
Missile HMissile H 40 Mg/12.5 Mg Tablet56

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Kidney Foundation [Internet] New York; About Chronic Kidney Disease
 2. National Health Service [Internet]. UK; Chronic kidney disease.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Chronic kidney disease
 4. Lameire N, Van Biesen W. The initiation of renal-replacement therapy--just-in-time delivery. N Engl J Med. 2010 Aug 12. 363(7):678-80. PMID: 20581421
 5. Jha. V., Garcia-Garcia. G., Iseki. K., et. al. Chronic kidney disease: Global dimension and perspectives. Lancet. Jul 20, 2013;382(9888):260-272. https://www.ncbi.nlm.nih.gov/pubmed/23727169. PMID: 23727169
 6. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Chronic Kidney Disease (CKD).
 7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Glomerular filtration rate
 8. Song E-Y, McClellan WM, McClellan A, et al. Effect of Community Characteristics on Familial Clustering of End-Stage Renal Disease. American Journal of Nephrology. 2009;30(6):499-504. doi:10.1159/000243716. PMID: 19797894
 9. National Health Service [Internet]. UK; Diabetes.
 10. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Managing Diabetes.
और पढ़ें ...