పీచుపదార్థాలు అనేవి జీర్ణం కాని పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ఇవి ప్రధానంగా పండ్లు, తృణధాన్యాలు, వారి, గోధుమల వంటి గింజ ధాన్యాలు మరియు కూరగాయలతో సహా వివిధ మొక్కల వనరుల నుండి లభిస్తాయి. ఇవి జీర్ణించుకోలేని సెల్యులోజ్ (జీవకణ నిర్మాణ ద్రవ్యము లేక కర్రనార) మరియు పిండిపదార్థము కాని ‘లిగ్నిన్లు వంటి పదార్థాలతో తయారవుతాయి. చిన్న ప్రేగు నుండి, ఈ పీచుపదార్థాలు నేరుగా పెద్ద ప్రేగులోకి వెళతాయి, ఇక్కడ ఈ పీచుపదార్థాల (ఫైబర్) ఒక భాగం మాత్రమే పేగుల్లోని బ్యాక్టీరియా ద్వారా పులియబెట్టబడుతుంది.

అయితే, ఇంతకూ, మనకు పీచుపదార్థాలు (ఫైబర్) ఎందుకు కావాలి, దేనికి ఉపయోగపడతాయివి?

ఆహారానికి ఎక్కువ గాత్రాన్ని (bulk) అందించడానికి మరియు ప్రేగు కదలికలను నియంత్రించడానికి పీచుపదార్థాలు (ఫైబర్) అవసరం. పీచుపదార్థాలు జీర్ణం కావు, ఇవి మన పేగుల్లో ఎక్కువసేపు నిల్చి మనం కడుపు నిండిన భావం కలిగేలా చేసి ఆకలి బాధ లేని తృప్తికర అనుభూతిని మనకు కలిగిస్తుంది, తద్వారా మన భోజనాల మధ్యకాలం  అంతరం పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా సహాయపడుతుంది ఎందుకంటే వాళ్ళు తినే తక్కువ వ్యవధి (తరచు) భోజనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

అదనంగా, పీచుపదార్థాల్లో అధికంగా ఉండే ఆహారం మన కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఊబకాయం, మలబద్ధకం, పెద్దప్రేగు కాన్సర్, మొలలు (పైల్స్), మరియు గుండె వ్యాధుల వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఆహార పీచుపదార్థాల యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ సెరీయల్ కెమిస్ట్స్ చేత వీటికి “క్రియాత్మక ఆహారం” ("ఫంక్షనల్ ఫుడ్") అనే బిరుదును సంపాదించాయి.

 1. ఆహార పీచుపదార్థాల రకాలు - Types of dietary fiber in Telugu
 2. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు మరియు వాటి వనరులు - Fiber rich foods and sources in Telugu
 3. పీచుపదార్థాల ఆరోగ్య ప్రయోజనాలు - Fiber health benefits in Telugu
 4. పీచుపదార్థాల దుష్ప్రభావాలు - Fiber side effects in Telugu
 5. ఉపసంహారం - Takeaway in Telugu
Advertisement' height='1px' width='1px' ALT='Advertisement'/>

ఆహార పీచుపదార్థాలను (డైటరీ ఫైబర్‌ను) రెండు రకాలుగా వర్గీకరించవచ్చు:

1. కరగని ఆహార పీచుపదార్థాలు -  Insoluble dietary fiber

కరగని ఆహార పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్), పేరు సూచించినట్లుగానే, నీటిలో కరగవు. ఈ ఆహారపీచుపదార్థాలు మన ప్రేగులలోని నీటితో పాటు కలిసిపోయి అక్కడి ఆహారానికి గాత్రాన్ని (బల్క్) చేకూరుస్తాయి. కరగని పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు రవాణా సమయాన్ని పెంచుతాయి (ఆహారం పేగులో ఉండే సమయం) మరియు మనకు కడుపు నిండిన అనుభూతిని ఈ పీచుపదార్థాలు కలిగిస్తాయి. కరగని పీచుపదార్థాలు కిందివిషయాల్లో మనకు సహాయపడతాయి:

 • ప్రేగు కదలికను నియంత్రిస్తుంది
 • మలబద్దకాన్ని తగ్గించడం
 • బరువు తగ్గడం

పండ్ల తొక్కలు, గోధుమ ఊక, తృణధాన్యాలు మొదలైన వాటిలో కరగని పీచుపదార్థాలు ఎక్కువగా కనిపిస్తుంది.

2. కరిగే పీచుపదార్థాలు - Soluble dietary fiber

కరిగే పీచుపదార్థాలు నీటిలో కరిగి పేగులలో బంక లాగా లేదా ‘జెల్’ లాంటి పదార్థంగా మారతాయి. వీటిని ప్రధానంగా పండ్ల గుజ్జు, బార్లీ, విత్తనాలు మరియు ఎండుగింజలలో గుర్తించవచ్చు.

కొన్ని కరిగే ఆహార పీచుపదార్థాలు పేగులలో పులియబెట్టబడతాయి (సూక్ష్మజీవుల చర్య ద్వారా పిండిపదార్థాలు లేదా కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం) మరియు అందువల్ల పేగు యొక్క సూక్ష్మజీవులను (మైక్రోఫ్లోరాను) మార్చడానికి బాధ్యత వహిస్తాయి. మన ఆహారంలో అధిక భాగం వాస్తవానికి పేగులోని సూక్ష్మజీవులచే జీర్ణమవుతుంది కాబట్టి, ఒక నిర్దిష్ట రకం పీచుపదార్థాలు తినడం మన పేగు యొక్క ఆరోగ్యానికి నిర్ణయాత్మక అంశం కావచ్చు. కరిగే పీచుపదార్థాలు కిందివాటిలో కూడా సహాయపడతాయి:

 • కరిగే పీచుపదార్థం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
 • కరిగే పీచుపదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long time capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

ఆహార పీచుపదార్థాలు గోధుమలు, గోధుమలపొట్టు, వోట్స్ పొట్టు వంటి గింజధాన్యాల్లో మరియు పండ్లు మరియు కూరగాయలలో సహజంగా ఉంటాయి. ఆసియా జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ క్లినికల్ సైన్స్ పత్రిక ప్రకారం, రోజువారీ సిఫార్సు చేసిన పీచుపదార్థాల సేవన ప్రమాణం 25-30 గ్రాములు, దీన్ని తృణధాన్యాలు, గింజ ధాన్యాలు మరియు మొక్క-ఆధారిత ఉత్పత్తులను తినడం ద్వారా సాధించవచ్చు. మనం శాఖాహారం ఆహారంగా తీసుకుంటే, అది మనకు సరిపోయే రోజువారీ పీచుపదార్థాల పరిమాణాన్ని అందిస్తుంది. అయితే, మాంసాహార ఆహారాల్లో పీచుపదార్థాలు లేకపోవడం వల్ల ఎక్కువ పండ్లు, కూరగాయలను కలుపుకుని సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాల జాబితా ఇక్కడ ఉంది, మీరు మీ ఆహారంలో వీటిని సులభంగా చేర్చవచ్చు:

 • గోధుమలు, వోట్స్ మరియు క్వినో వంటి తృణధాన్యాలు
 • సైలియం ఊక
 • ఓట్స్ పొట్టు
 • గోధుమ తవుడు లేక ఊక
 • కాయధాన్యాలు (అలచందలు, వులవలు వంటివి)
 • బీన్స్ (ఫ్రెంచ్ బీన్స్, పెసలు బీన్స్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్)
 • సోయాబీన్
 • చాలా పండ్లు ( ఆపిల్ , పియర్, అత్తి పండ్లను , కోరిందకాయలు, నారింజ, అరటి)
 • ఖర్జూర పండ్లు
 • పిస్తాలు
 • పెకాన్లు (pecans)
 • బాదం
 • హాజెల్ నట్స్
 • వేరుశెనగ
 • క్యారెట్లు, బీట్రూట్ , బ్రోకలీ, ఆర్టిచోకెస్, బంగాళాదుంపల వంటి కూరగాయలు

మీ ఆహారం కోసం సరైన మొత్తాన్ని మరియు పీచుపదార్థాలు యొక్క మూలాలను తెలుసుకోవడానికి మీరు ఎల్లప్పుడూ డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించాలి.  

పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి, కొలెస్ట్రాల్ కోల్పోవటానికి మరియు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో మనకు సహాయపడుతాయి. అయినప్పటికీ, అధిక పీచుపదార్థాల ఆహారం యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు మలబద్దకాన్ని తగ్గించడం మరియు ప్రేగు కదలికలను నియంత్రించడం. ఇంకా, మొలలు (పైల్స్) మరియు గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆహారపీచుపదార్థాలు  చాలా బాగా సహాయపడుతాయి. పీచుపదార్థాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని పరిశీలిద్దాం.

 • మలబద్దకం నుండి ఉపశమనం కల్గిస్తుంది: పీచుపదార్థాలు ఆహారానికి గాత్రాన్ని అందిస్తాయి మరియు మలం మృదువుగా చేయడానికి సహాయపడుతాయి, తద్వారా జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా అది సులభంగా ప్రయాణించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది, ఇది ఆహారాన్ని సరైన రీతిలో మరియు సులభంగా జీర్ణం చేయడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా మలబద్దకాన్ని నివారిస్తుంది.
 • మొలల (పైల్స్) లక్షణాలకు ఉపశమనం కల్గిస్తుంది: మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా, పీచుపదార్థాలు ఆసన గోడలపై అధిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయి, తద్వారా మూలాల వ్యాధి లక్షణాలకు ఉపశమనం కల్గిస్తుంది.
 • బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది: మీ ఆహారంలో తగినంత మొత్తంలో పీచుపదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉందని అనిపించడం ద్వారా ఆకలి బాధలను తగ్గించవచ్చు. కొన్ని సంక్లిష్టమైన ఆహార ప్రణాళికల కంటే పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం బరువును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువు చేయబడింది.
 • కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: తెలియని యంత్రాంగం ద్వారా తక్కువ సాంద్రత (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం సహాయపడుతుందని పరిశోధన ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది ప్రేగులలో చిన్న-గొలుసు కొవ్వు ఆమ్లాలను కూడా ఉత్పత్తి చేస్తుంది, ఇది లిపిడ్ జీవక్రియతో జోక్యం చేసుకోవడం ద్వారా మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 • గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: శరీరంలోని అదనపు కొవ్వుల్ని (కొలెస్ట్రాల్‌ను) తొలగించి, రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా సిఫారసు చేయబడిన ఆహార పీచుపదార్థాల సేవనం ఆరోగ్యకరమైన హృదయానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ మరియు గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: పీచుపదార్థాలు ఒక రకమైన పిండిపదార్థమే (కార్బోహైడ్రేట్లు) అయినప్పటికీ, ఇది సులభంగా జీర్ణం అవ్వదు లేదా ప్రేగులలో కలిసిపోదు. దానివల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్‌స్థాయి  ఆకస్మికంగా శిఖరస్థాయికి చేరడాన్ని పీచుపదార్థాలు నివారించడం జరుగుతుంది.

మలబద్ధకం కోసం పీచుపదార్థాలు - Fiber for constipation in Telugu

పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు మలబద్దకాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. పీచుపదార్థాల యొక్క సర్వసాధారణ ప్రయోజనం ఏమిటంటే ఇవి ఆహారానికి గాత్రాన్ని కల్గిస్తాయి, తద్వారా  మలాన్ని మెత్తబరుస్తుంది. కానీ, వివిధ రకాలైన పీచుపదార్థాలు జీర్ణశయాంతర ప్రేగులపై వేర్వేరు ప్రభావాలను కలిగి ఉండవచ్చు. మీ ఆహారంలో పీచుపదార్థాల అంశం పేగు గుండా వెళ్ళడానికి తీసుకునే రవాణా సమయం పెరగొచ్చులేదా తగ్గవచ్చు. ఇది మీ ప్రేగులలో పెరిగే బ్యాక్టీరియా రకాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, తద్వారా ఆహార జీర్ణక్రియను నియంత్రిస్తుంది.

అధికంగా-కరిగే పీచుపదార్థాలు  తీసుకోవడం వల్ల లాక్టోబాసిల్లస్ (Lactobacillus) మరియు ఫీకాలిబాక్టీరియం (Faecalibacterium) వంటి పేగు బాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా యొక్క రెండు రకాలు  ఆరోగ్యకరమైన పేగు నిర్వహణకు మరియు ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆహార పీచుపదార్థాలను తగిన మొత్తంలో దిననిత్య ఆహారంలో చేర్చడంవల్ల మలబద్దకాన్ని తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని 2012 లో నిర్వహించిన RCT ల యొక్క మెటా-విశ్లేషణ (రాండమ్ క్లినికల్ ట్రయల్స్) నిర్ధారిస్తుంది.

బరువు తగ్గడానికి పీచుపదార్థాలు - Fiber for weight loss in Telugu

పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాల్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? కరగని పీచుపదార్థాలు మీ ఆహారానికి గాత్రాన్ని జోడిస్తుంది మరియు పెద్దప్రేగు రవాణా సమయాన్ని పెంచుతుంది, తద్వారా మీరు ఎక్కువ కాలంపాటు కడుపు నిండిన అనుభూతి చెందుతారు. ఇది తగ్గిపోయిన ఆకలికి దారితీస్తుంది, చివరకు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అన్నల్స్  ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్  పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం,  కొన్ని సంక్లిష్టమైన ఆహార ప్రణాళికలతో పోలిస్తే పీచుపదార్థాల యొక్క రోజువారీ సిఫార్సు మోతాదు తీసుకోవడంవల్ల ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

కొలెస్ట్రాల్ కోసం పీచుపదార్థాలు - Fiber for cholesterol in Telugu

శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అధిక పీచుపదార్థాలు డైట్ల పాత్రను అంచనా వేయడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలన్నిటిలో, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం యొక్క పరిపాలన తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (చెడు కొలెస్ట్రాల్) మరియు ట్రైగ్లిజరైడ్ కొవ్వుల స్థాయిలలో గణనీయమైన తగ్గింపుకు దారితీస్తుందని కనుగొనబడింది. అయినప్పటికీ, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (మంచి కొలెస్ట్రాల్) లో ఇప్పటివరకు స్పష్టమైన ప్రభావం కనిపించలేదు.

ఆరోగ్యకరమైన శరీర కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి కరిగే పీచుపదార్థాలు  సహాయపడే ఖచ్చితమైన విధానం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కానీ, శరీరంలోని పిత్త జీవక్రియలో జోక్యం చేసుకోవడం ద్వారా ఇది హైపోకోలెస్టెరోలెమిక్ (శరీర కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం) గా పనిచేస్తుందని ఇటీవలి పరిశోధన పేర్కొంది.

ఇంకా, కొన్ని రకాల పీచుపదార్థాలు  పేగులలో కిణ్వ ప్రక్రియకు లోనవుతాయి, ఎసిటేట్ మరియు బ్యూటిరేట్ వంటి చిన్న-గొలుసు కొవ్వు ఆమ్లాలు (SCFA) ఏర్పడతాయి. ఈ SCFA లు శరీరంలోని లిపిడ్ల జీవక్రియలో జోక్యం చేసుకోవడం ద్వారా శరీర కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

(మరింత చదవండి: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

పీచుపదార్థాలు రక్తపోటును తగ్గిస్తుంది - Fiber reduces blood pressure in Telugu

రక్తపోటుపై పీచుపదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాల విషయానికి వస్తే, ఆధారాలు స్పష్టంగా లేవు. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం జంతు నమూనాలలో తక్కువ ధమనుల రక్తపోటుతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, వివిధ పీచుపదార్థాలు వనరులపై వ్యక్తిగత అధ్యయనాలు మరింత సమాచారం ఇచ్చేవిగా ఉంటాయి. పైలట్ అధ్యయనంలో, వోట్స్ తినడంవల్ల రక్తపోటు ఉన్నవారిలో సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటును తగ్గిస్తుందని కనుగొనబడింది (అధిక బిపితో బాధపడుతున్న వ్యక్తులు).

‘న్యూట్రిషన్ మెటబాలిజం మరియు కార్డియోవాస్కులర్ వ్యాధులు’ పత్రికలో ప్రచురించబడిన మెటా-ఎనాలిసిస్ ప్రకారం,  రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రోజుకు సగటున 9 గ్రా పీచుపదార్థాలను సుమారు 7 వారాల పాటు తీసుకోగా రక్తపోటును తగ్గిస్తుందని నివేదించబడింది. అదనంగా, ఆరోగ్యకరమైన వారితో పోలిస్తే అధిక రక్తపోటు ఉన్నవారికి రక్తపోటును తగ్గించడంలో అధిక పీచుపదార్థాలు ఆహారం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఇది సూచించింది.

(మరింత చదవండి: అధిక రక్తపోటుకు కారణాలు)

గుండె ఆరోగ్యానికి ఫైబర్ - Fiber for heart health in Telugu

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో హృదయ సంబంధ వ్యాధులు (లేక గుండెకండరాల రుగ్మతలు) ఒకటి. ఆహార పీచుపదార్థాలు యొక్క చర్య యొక్క ఖచ్చితమైన విధానం ఇంకా కనుగొనబడనప్పటికీ, గుండె-కండరాల వ్యాధుల (కొరోనరీ హార్ట్ డిసీజ్) వంటి హృదయ-సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది గట్టిగా సంబంధం కలిగి ఉంది  .

అధిక రక్తపోటు, ఊబకాయం మరియు హైపర్‌ కొలెస్టెరోలేమియా వంటి రుగ్మతల్ని తగ్గించడానికి పీచుపదార్థాలు అధికంగా ఉన్న ఆహారం దోహదం చేస్తుందని కనుక్కోబడింది. పేర్కొన్న రుగ్మతలు అథెరోస్క్లెరోసిస్ , గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి గుండె వ్యాధులతో నేరుగా ముడిపడి ఉంది.

చక్కెరవ్యాధికి పీచుపదార్థాలు - Fiber for diabetes in Telugu

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం యొక్క సామర్థ్యం గురించి, ప్రతిస్పందనలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. పీచుపదార్థాలు  ఒక రకమైన కార్బోహైడ్రేట్లు అయినప్పటికీ, వాటిని తక్షణమే జీర్ణించుకోలేము మరియు శరీరం కూడా గ్రహించదు. అందువలన, అధిక పీచుపదార్థాల ఆహారం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచదు. వాస్తవానికి, కరిగే పీచుపదార్థాలు  రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలియని ఓ యంత్రాంగం ద్వారా నియంత్రించగలదని సూచించబడ్డాయి.

ఇంకా, కరగని పీచుపదార్థాలు పేగులలో ఆహారాంశాల రవాణా సమయాన్ని పెంచడం ద్వారా గ్లైసెమిక్ సూచికను (రక్తంలో గ్లూకోజ్‌గా మార్చబడిన చక్కెర మొత్తం) తగ్గిస్తుంది.

(మరింత చదవండి: చక్కెరవ్యాధి సంరక్షణ)

పీచుపదార్థాలు పేగు (కొలొరెక్టల్) క్యాన్సర్‌ను నివారిస్తుంది - Fiber prevents colorectal cancer in Telugu

పేగు (కొలొరెక్టల్) క్యాన్సర్ నివారణలో ఆహార పీచుపదార్థాల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. క్రమబద్ధమైన ఓ సమీక్ష ప్రకారం, తృణధాన్యాలు మరియు గింజ ధాన్యాలు వంటి పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పేగు క్యాన్సర్ లేక (కొలొరెక్టల్ క్యాన్సర్‌కు రక్షణగా ఉంటుంది. వాస్తవానికి, ‘ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ సంస్థ ఆహార పీచుపదార్థాల సేవనాన్ని పేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుదలకు ముడిపెట్టింది.

పేగుక్యాన్సర్ పై ఆహార పీచుపదార్థాల చర్య లేదా క్యాన్సర్ యొక్క ఏ దశలో ఆహార పీచుపదార్థం పని చేస్తుందనేది చాలా అస్పష్టంగా ఉన్నప్పటికీ, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంవల్ల అది పేగు (కొలొరెక్టల్) క్యాన్సర్‌తో ప్రతికూల సంబంధాన్ని కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మొలలకు (పైల్స్) పీచుపదార్థాలు - Fiber for piles in Telugu

మొలలు (పైల్స్) లేదా హేమోరాయిడ్లు అనబడే వ్యాధి పాయువులో మరియు దాని చుట్టుపక్కల అసాధారణంగా అధిక పీడనంతో కూడిన ఒత్తిడిని కల్గించి, అక్కడి రక్త నాళాలు మంటకు గురై తీవ్రనొప్పికి, అసౌకర్యానికి దారితీస్తాయి. అమెరికా ఆరోగ్య సంస్థ NIH (National Institutes of Health) ప్రకారం, ఊబకాయం, దీర్ఘకాలిక మలబద్ధకం మరియు తక్కువ పీచుపదార్థాల ఆహారసేవనం వంటి అంశాలు మొలలు (హేమోరాయిడ్ల వాపు) వ్యాధి వెనుక ఉన్న కారణాలు కావచ్చు. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంవల్ల మొలల (పైల్స్) యొక్క కొన్ని లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

పీచుపదార్థాలు పేగుల్లో మలాన్ని మృదువుగా చేస్తాయి మరియు పేగు గుండా మలం  సులభంగా వెళ్ళడానికి సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది మలబద్దకాన్ని తగ్గించడమే కాక, పాయువు (ఆసన) గోడలపై అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా పైల్స్ నుండి వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది.

(మరింత చదవండి: పైల్స్ చికిత్స)

 • తక్కువ నీరు తాగడంతో పాటు పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడంవల్ల ప్రేగుల్లో ఆహారం అడ్డుపడుతుంది. కాబట్టి, మీరు అధిక పీచుపదార్థాలతో కూడిన ఆహారం తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందాలనుకుంటే, మీ నీటి సేవనంపైన కూడా దృష్టి పెట్టి తగినంతగా నీటిని తాగేట్టుగా చూసుకోవడం మంచిది.
 • కొన్ని రకాల పీచుపదార్థాలు పేగులో పులియబెట్టిబడటానికి గురవుతాయి, దీనివల్ల కడుపులో ఉబ్బరం మరియు గ్యాస్ పెరిగే ప్రమాదం ఉంది.
 • పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారపదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు పనిచేసేవి (హైపోగ్లైసీమిక్)గా ప్రసిద్ధి పొందాయి, కాబట్టి చక్కెరవ్యాధితో ఉన్నవారు (డయాబెటిక్ పేషెంట్లు) వారికి సరిపోయే సరిఅయిన పీచుపదార్థాల ఆహారాల గురించి తెలుసుకోవడానికి వారి వైద్యుడిని సంప్రదించి తెల్సుకుని తినడం మంచిదని సూచించదమైంది.
 • పీచుపదార్థాలు సమర్థవంతమైన రక్తపోటును తగ్గించేవి (హైపోటెన్సివ్) అని కనుగొనబడింది. అల్ప రక్తపోటు (low blood pressure)తో బాధపడేవారు, అందుకు మందులు సేవిస్తున్న వాళ్ళు పీచుపదార్థాల అనుబంధకాహారాల్ని (సప్లిమెంట్లను) తినేందుకు ముందు పోషకాహార నిపుణుడితో మాట్లాడాలి.
 • అధిక పీచుపదార్థాలుండే ఆహారం తినడంవల్ల వల్ల ఇనుము మరియు జింక్ వంటి ఖనిజాల శోషణ తగ్గుతుంది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj hair oil
₹425  ₹850  50% OFF
BUY NOW

పొట్టలోని చిన్న పేగులు, పెద్దపేగుల సరైన పనితీరుకు పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం చాలా ముఖ్యం. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కల్గించడమే కాక బరువును తగ్గించడానికి కూడా మనకు సహాయపడుతుంది. అయినప్పటికీ, పీచుపదార్థాలు అధికంగా తినడంవల్ల మలబద్దకం మరియు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

వనరులు

 1. UCSF Benioff Children's Hospital. Increasing Fiber Intake. University of California, San Francisco
 2. Prosky L. When is dietary fiber considered a functional food? Biofactors. 2000;12(1-4):289-97. PMID: 11216498
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Soluble vs. insoluble fiber
 4. Hannah D. Holscher. Dietary fiber and prebiotics and the gastrointestinal microbiota. Gut Microbes. 2017; 8(2): 172–184. PMID: 28165863
 5. Office of Disease Prevention and Health Promotion. Food Sources of Dietary Fiber. [Internet]
 6. Hollænder PL, Ross AB, Kristensen M. Whole-grain and blood lipid changes in apparently healthy adults: a systematic review and meta-analysis of randomized controlled studies. Am J Clin Nutr. 2015 Sep;102(3):556-72. PMID: 26269373
 7. Wang Y et al. Barley β-glucan reduces blood cholesterol levels via interrupting bile acid metabolism. Br J Nutr. 2017 Nov;118(10):822-829. PMID: 29115200
 8. Aleixandre A, Miguel M. Dietary fiber and blood pressure control. Food Funct. 2016 Apr;7(4):1864-71. PMID: 26923351
 9. Keenan JM, Pins JJ, Frazel C, Moran A, Turnquist L. Oat ingestion reduces systolic and diastolic blood pressure in patients with mild or borderline hypertension: a pilot trial. J Fam Pract. 2002 Apr;51(4):369. PMID: 11978262
 10. Hooda S et al. 454 pyrosequencing reveals a shift in fecal microbiota of healthy adult men consuming polydextrose or soluble corn fiber. J Nutr. 2012 Jul;142(7):1259-65. PMID: 22649263
 11. Jing Yang, Hai-Peng Wang, Li Zhou, Chun-Fang Xu. Effect of dietary fiber on constipation: A meta analysis. World J Gastroenterol. 2012 Dec 28; 18(48): 7378–7383. PMID: 23326148
 12. Erkkilä AT, Lichtenstein AH. Fiber and cardiovascular disease risk: how strong is the evidence? J Cardiovasc Nurs. 2006 Jan-Feb;21(1):3-8. PMID: 16407729
 13. Lipkin M, Reddy B, Newmark H, Lamprecht SA. Dietary factors in human colorectal cancer. Annu Rev Nutr. 1999;19:545-86. PMID: 10448536
 14. Nomura AM et al. Dietary fiber and colorectal cancer risk: the multiethnic cohort study. Cancer Causes Control. 2007 Sep;18(7):753-64. Epub 2007 Jun 8. PMID: 17557210
 15. Aune D et al. Dietary fibre, whole grains, and risk of colorectal cancer: systematic review and dose-response meta-analysis of prospective studies. BMJ. 2011 Nov 10;343:d6617. PMID: 22074852
 16. Andrew T Kunzmann et al. Dietary fiber intake and risk of colorectal cancer and incident and recurrent adenoma in the Prostate, Lung, Colorectal, and Ovarian Cancer Screening Trial1,2. Am J Clin Nutr. 2015 Oct; 102(4): 881–890. PMID: 26269366
 17. National Health Service [Internet]. UK; Haemorrhoids (piles).
 18. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Eating, Diet, & Nutrition for Hemorrhoids.
Read on app