బాదం పప్పులు అన్నవి పోషక గింజలు, ఇవి ఒక చిన్న షెల్‌లో ప్యాక్ చేయబడి ఉంటాయి.  సాధారణంగా బాదం అనే భారతీయ పేరుతో పిలువబడుతాయి, బాదం పప్పులు తినదగిన విత్తనాలు, ఇవి బాదం పండ్ల యొక్క గట్టి షెల్‌ లోపల ఏర్పడతాయి.   బాదం యొక్క ఆకారం సాధారణంగా గుడ్డు ఆకారం‌ కలిగి దాని ఒక వైపు పదునైన అంచుతో ఉంటుంది.  విత్తనం తెల్లటి రంగు కలిగిఉండి పలుచటి గోధుమ రంగు చర్మంతో కప్పబడి ఉంటుంది, వీటిని కొన్ని గంటల పాటు నీటిలో ముంచినప్పుడు, వాటి తోలు సాధారణంగా ఒలిచి వేయబడుతుంది.  

పీచ్‌లు, ఆపిల్స్, బేరి, రేగు, చెర్రీలు మరియు నేరేడు పండు వంటి ఇతర చెట్ల పండ్ల జాతితో పాటు బాదం కూడా రోసేసి (రోజ్) కుటుంబానికి చెందినవి.  మధ్య ఆసియా మరియు చైనా‌లో ఇవి పుట్టాయని వారు నమ్ముతారు.  ప్రస్తుతం, యునైటెడ్ స్టే‌ట్స్ బాదం ఉత్పత్తిలో అతి పెద్దదిగా ఉంది, దాని తర్వాత స్పెయిన్ మరియు ఇరాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి.  భారతదేశం‌లో, బాదం ఉత్పత్తి చేసే రెండు అతి పెద్ద  రాష్ట్రాలుగా జమ్ము & కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.  

ఎక్కువమంది ప్రజలు బాదం‌ను పచ్చిగా తినడానికి ఇష్టపడుతున్నప్పటికీ, ఇది విభిన్న రకాల వంటకాలలో ఉపయోగించబడుతుంది.  మధ్య ప్రాచ్యం‌లో, మిఠాయిలు మరియు స్నాక్స్ తయారీలో బాదం‌ ఉపయోగిస్తారు మరియు కాఫీలో కూడా జోడించబడ్డాయి.  కేక్స్, కుకీలు, నగట్, క్యాండీస్, స్నాక్ బారస్ అలాగే డిజర్ట్స్ పైన టాపింగ్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులలో ఇవి ఉపయోగించబడతాయి.  బాదం వెన్న, బాదం పాలు మరియు బాదం నూనె తయారీలో కూడా బాదం‌ను ఉపయోగిస్తారు.  

అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగినదిగా బాదం‌ను భావిస్తారు.  ఇవి ప్రొటీన్లు, ఖనిజాలు, విటమి‌న్లు మరియు ఫైబర్లను సమృద్ధిగా కలిగిఉంటాయి.  బాదం కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది, హృదయ సంబంధ సమస్యలు మరియు క్యా‌న్సర్‌ నివారణలో ఇది సహాయం చేస్తుంది.  డయాబెటిస్ రోగులకు ఇది ఒక ఆదర్శవంతమైన స్నాక్స్ ఎంపికగా ఉంటుంది. 

బాదం గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • శాస్త్రీయ నామం: ప్రునస్ డల్సీస్
 • కుటుంబం: రోసేసి.
 • వ్యవహారిక నామం: ఆల్మండ్స్, బాదం
 • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బాదం నైరుతి ఆసియా స్థానికతకు చెందిన ఒక చెట్టు.  ప్రునస్ డల్సీస్  అన్నది ఆర్థికంగా ముఖ్యమైన ఒక పంట చెట్టు, మధ్యధరా శీతోష్ణస్థితుల్లో ఇది ప్రధానంగా పెరుగుతుంది,  ప్రంపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70 శాతం యు.ఎస్. ఉత్పత్తి చేస్తుంది.  25 కంటే ఎక్కువ బాదం రకాలు కాలిఫోర్నియాలో పెరుగుతాయి. మార్కోనా మరియు వలె‌న్సియా బాదం స్పెయిన్ నుండి వస్తాయి, మరియు ఫెర్రాగ్నెస్ బాదం గ్రీస్ నుండి దిగుమతి చేయబడతాయి. మధ్య ప్రాచ్యం‌, భారత ఉపఖండం మరియు ఉత్తర ఆఫ్రికాలలో కూడా బాదం చెట్టు పెరుగుతుంది.
 1. బాదం పోషక విలువలు - Almond nutrition facts in Telugu
 2. బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of almonds in Telugu
 3. బాదం దుష్ప్రభావాలు - Almonds side effects in Telugu
 4. టేక్ అవే - Takeaway in Telugu

శరీరానికి ప్రయోజనకరమైన అనేక పోషకాలను బాదం కలిగిఉంది.  ఈ కాయలు ప్రొటీన్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను సమృద్ధిగా కలిగిఉన్నాయి.  కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలకు గొప్ప వనరుగా కూడా బాదం కాయలు ఉన్నాయి. 

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. బాదం  క్రింద ఇవ్వబడిన పోషకాలను కలిగిఉంటుంది:

పోషకాలు విలువ, 100 గ్రా.లకు
శక్తి 571 కి.కేలరీ
ప్రొటీన్ 21.43 గ్రా.
కార్బోహైడ్రేట్ 21.43 గ్రా.
ఫైబర్ 10.7 గ్రా.
చక్కెరలు 3.57 గ్రా.
కొవ్వు 50 గ్రా.
ఖనిజాలు విలువ, 100 గ్రా.లకు
కాల్షియం 286 మి.గ్రా.
ఇనుము 3.86 మి.గ్రా.
మెగ్నీషియం 286 మి.గ్రా.
ఫాస్ఫరస్ 536 మి.గ్రా.
పొటాషియం 714 మి.గ్రా.
కాపర్ 1.07 మి.గ్రా.
మాంగనీస్ 2 మి.గ్రా.
విటమిన్లు విలువ, 100 గ్రా.లకు
విటమిన్ బి2 0.911 మి.గ్రా.
కొవ్వులు/కొవ్వు ఆమ్లాలు విలువ, 100 గ్రా.లకు
సంతృప్త కొవ్వు ఆమ్లాలు 3.57 గ్రా.
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 32.14 గ్రా.
బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 12.5 గ్రా.

(మరింత చదవండి: విటమిన్ బి ప్రయోజనాలు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.

బాదం కాయలు పోషకాలు మరియు ఖనిజాలకు ఒక గిడ్డంగిగా ఉన్నాయి, ఆరోగ్యాన్ని సరైన విధంగా కాపాడుకోవడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.  బాదం యొక్క శాస్త్రీయంగా నిరూపితమైన ఆరోగ్య ప్రయోజనాలు కొన్నింటిని మనం అన్వేషిద్దాము:

 • మెదడు కోసం: బాదం యొక్క అత్యంత గుర్తింపు పొందిన ప్రయోజనాలు మన మెదడు పైన ఉన్నాయి.  మెదడు పనితీరు మెరుగుపరుస్తున్నప్పుడు, బాదం కాయలు జ్ఞానము మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం‌లో కూడా సహాయం చేస్తాయి, అదేవిధంగా మీకు ఏర్పడే పార్కి‌న్స‌న్స్ మరియు అల్జీమర్స్ వ్యాధి యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తూ మతిమరుపును నివారిస్తుంది.
 • బరువు తగ్గడం కోసం: ప్రతీ రోజూ బాదం తినడం బరువు తగ్గడం‌లో సహాయపడుతుంది, నడుము చుట్టుకొలతను తగ్గించడం‌లో మరియు ఊబకాయం నివారించడం‌లో సహాయపడుతుంది.  తక్షణ ప్రీబయాటిక్ ఆరోగ్యం కారణంగా ప్రేగు ఆరోగ్యం మెరుగుపరచడం ద్వారా జీర్ణ ఆరోగ్యం మరియు పనితీరును మెరుగుపరచడం‌లో కూడా ఇది సహాయపడుతుంది.
 • కొలెస్ట్రాల్ కోసం: బాదం కాయలు ఎల్‌డి‌ఎల్ (తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం‌లో సహాయం చేస్తాయి మరియు అదే సమయం‌లో, మంచి రకమైన కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డి‌ఎల్ (అధిక-సాంద్రత లిపోప్రొటీన్) పెంచుతాయి.
 • ఎముకల కోసం: బాదం యొక్క వినియోగం ఎముకల ఆరోగ్యం మెరుపరచడం ద్వారా ఎముకల ద్రవ్యరాశి మరియు సాంద్రతను మెరుగుపరచడం‌లో సహాయపడుతుంది.
 • డయాబెటిస్ కోసం: సరైన గ్లైసెమిక్ నియంత్రణలో సహాయం చేస్తాయి మరియు భోజనం తర్వాత రక్తం‌లో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి కాబట్టి డయాబెటిస్ రోగం కలిగిన వ్యక్తులకు బాదం కాయలు చాలా మంచివి.  డయాబెటిస్ కలిగిన వారిలో ఆక్సీకరణ ఒత్తిడి మరియు మంట తగ్గించడం‌లో కూడా సహాయపడతాయి.
 • క్యా‌న్సర్ కోసం: బాదం కాయలు క్రమముగా వినియోగిస్తుంటే రొమ్ము క్యా‌న్సర్, ప్రొస్టేట్ క్యా‌న్సర్, పురీష క్యా‌న్సర్ మరియు పెద్ద ప్రేగు క్యా‌న్సర్‌లతో కలిపి అనేక రకాల క్యా‌న్సర్ల పైన రక్షణ ప్రభావాలను కలిగిఉంటాయి.  

బాదం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది - Almonds reduce cholesterol in Telugu

వివిధ రకాల శరీర విధులకు కొలెస్ట్రాల్ అవసరమవుతుంది.   అయితే, రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి, అవి - తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్ (ఎల్‌డి‌ఎల్) మరియు అధిక-సాంద్రత లిపోప్రొటీన్ (హెచ్‌డి‌ఎల్). హెచ్‌డి‌ఎల్ ఆరోగ్యకరమైనదిగా భావించబడుతుంటే (మంచి కొలెస్ట్రాల్), ఎల్‌డి‌ఎల్ లో పెరుగుదల అన్నది గుండె సంబంధ వ్యాదులు వచ్చే ప్రమాదాన్ని పెంచడం‌తో నేరుగా సహసంబంధం కలిగిఉంటుంది.  బాదం కాయలు తీసుకోవడం ఎల్‌డి‌ఎల్ స్థాయి మరియు మొత్తం కొలెస్ట్రాల్ (టిసి) స్థాయిలు తగ్గడానికి దారితీసిందని, కొలెస్ట్రాల్ యొక్క హెచ్చు స్థాయిలు కలిగిన 20 మంది వ్యక్తుల పైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం సూచించింది.  మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డి‌ఎల్) స్థాయిల్లో  పెరుగుదల కూడా ఇక్కడ సూచించబడింది.

బాదం, శరీరం నుండి బయటకు ఎల్‌డి‌ఎల్ (చెడు కొలెస్ట్రాల్) విడుదలను ప్రేరేపించడం‌తో పాటు హెచ్‌డి‌ఎల్ యొక్క స్థాయిని పెంచుతుందని మరొక అధ్యయనం వెల్లడించింది.   బాదం యొక్క కొలెస్ట్రాల్- తగ్గించే ప్రభావాలు వెనుక ఉండే ఖచ్చితమైన విధానం తెలియకపోయినప్పటికీ, బాదం ఒక అద్భుతమైన హైపోకొలెస్టెరోలెమిక్ ‌గా(కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది) పనిచేస్తుందని మరియు అందువల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం‌లో సహాయపడుతుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

(మరింత చదవండి: అధిక కొలెస్ట్రాల్ చికిత్స)

బాదం క్యా‌న్సర్‌ను నివారిస్తుంది - Almond prevents cancer in Telugu

బాదం మరియు ఇతర కాయలు వివిధ రకాల  క్యా‌న్సర్ అనగా ప్రొస్టేట్ క్యా‌న్సర్రొమ్ము క్యా‌న్సర్పెద్ద ప్రేగు మరియు పురీష క్యా‌న్సర్వంటి వివిధ రకాల క్యా‌న్సర్లకు వ్యతిరేకంగా రక్షణ ప్రభావాలు కలిగిఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాయల యొక్క క్రమమైన వినియోగం క్యా‌న్సర్ మరణాల తగ్గుదలకు కూడా సంబంధం కలిగిఉంది.  యాంటిఆక్సిడంట్ మరియు యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను బాదం పప్పు కలిగియుంది కాబట్టి, అది క్యా‌న్సర్ కణాల పెరుగుదల మరియు వ్యాప్తిని నిరోధించడం‌లో సహాయపడుతుంది.  అంతేకాకుండా, ఆల్ఫా-టోకోఫెరాల్ అన్నది బాదం‌లోని కీమోప్రొటెక్టివ్ సమ్మేళనాలలో ఒకటిగా కనుగొనబడింది.

అయితే, బాదం‌ కాయలలోని కీమోప్రొటెక్టివ్ మరియు యాంటి-క్యా‌న్సర్ లక్షణాల నిర్ధారణకు మరికొన్నిఅధ్యయనాలు ఇంకా అవసమవుతాయి.

మెదడు కోసం బాదం కాయల ప్రయోజనాలు - Almonds benefits for brain in Telugu

మన వయస్సు పెరుగుతున్న కొద్దీ, మన మెదడు అనేక వరుస మార్పుల గుండా వెళుతుంది.  వృద్దుల మెదడు, జ్ఞానం మరియు జ్ఞాపకశక్తిని కోల్పేయే అవకాశం ఎక్కువగా కలిగిఉంది.  పరిశోధన ప్రకారం, బాదం కాయలు జ్ఞాపకశక్తిని కోల్పోవడం నిరోధించడం మాత్రమే కాకుండా, న్యూరోడిజనరేటివ్ వ్యాధులైనటువంటి పార్కి‌న్స‌న్స్ మరియు అల్జీమర్స్వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం‌లో ప్రభావవంతంగా ఉంటుంది. పాలీఫినాల్స్, టోకోఫెరాల్, విటమిన్ బి9 మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వంటి సమ్మేళనాలను బాదం  కలిగిఉంటుంది. ఈ సమ్మేళనాలు వయస్సు-సంబంధిత మెదడు రుగ్మతలను ఆలస్యం చేస్తాయి లేదా నిరోధిస్తాయి.

బాదం నిర్వహణ మతిమరుపును నివారించిందని ఒక ప్రిక్లినికల్ అధ్యయనం సూచించింది.  బాదం‌లోని ఎసిటైల్కోలిన్ అని పిలువబడే ఒక రసాయనం కూడా జ్ఞాపకశక్తి పెరుగుదలకు దారితీస్తుంది.  ఇంకా, బాదం‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడు ద్వారా సులభంగా గ్రహించబడతాయి, ఈ ఫ్లేవనాయిడ్స్ న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు చూపిస్తాయి.

జీర్ణక్రియ కోసం బాదం - Almonds for digestion in Telugu

మీ కడుపులో మంచి బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను ప్రీబయోటిక్స్ సమ్మేళనాలు ప్రేరేపిస్తాయి.  ప్రేగు ఆరోగ్యం నిర్వహణలో ఈ బ్యాక్టీరియా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మరియు మన శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడని కొన్ని జీర్ణక్రియ ఎంజైములను కూడా ఇవి సమకూరుస్తాయి.  పీచు పదార్థాలు మరియు ఇతర బయోయాక్టివ్ భాగాల యొక్క ఉనికి కారణంగా బాదం కాయలు మరియు బాదం కాయల చర్మం ప్రీబయోటిక్ ప్రబావాలు కలిగిఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

క్రమంగా బాదం వినియోగించడం వలన బైఫైడోబ్యాక్టీరియం వంటి మంచి బ్యాక్టీరియా యొక్క జనాభా పెరిగిందని మరియు హానికరమైన బ్యాక్టీరియా యొక్క సంఖ్య తగ్గిందని 48 మంది వ్యక్తుల నుండి తీసుకున్న ఫేకాల్ నమూనాల పైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం చూపించింది. ఈ బ్యాక్ఱీరియా చేత స్రవించబడిన జీర్ణక్రియ ఎంజై‌మ్ యొక్క చర్యలో కూడా మార్పు జరిగిందని, ఇది ప్రీబయాటిక్ ప్రబావం యొక్క మధ్యవర్తిత్వం‌లో సహాయపడింది.

(మరింత చదవండి: జీర్ణక్రియను మెరుగుపరచడం ఎలా)

డయాబెటిస్ కోసం బాదం - Almonds for diabetes in Telugu

టైప్ 2 డయాబెటిస్ అన్నది శరీరం సరిగ్గా ఇ‌న్సులిన్‌ను ఉపయోగించుకోలేనటువంటి  ఒక పరిస్థితి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది.  టైప్ 2 డయాబెటిస్ గల ప్రజలకు బాదం ఒక ఆదర్శవంతమైన చిరుతిండి ఎంపికగా ఉంటుంది.  24 వారాల పాటు టైప్ 2 డయాబెటిస్ రోగులపైన బాదం కాయల యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక అధ్యయనం జరిగింది. అందరు వ్యక్తులలో గణనీయమైన గ్లైసెమిక్ నియంత్రణ (రక్త చక్కెర స్థాయిల తగ్గుదల) గుర్తించబడింది.  అయినప్పటికీ, ఇది పెరిగిన ఇ‌న్సులిన్ సున్నితత్వం వలన ఏర్పడలేదు.  బాదం కాయలు, శరీరం‌లో ‌ఇ‌న్సులిన్ సున్నితత్వాన్ని ప్రభావితం చేయడానికి బదులుగా ఇ‌న్సులిన్ యొక్క సరైన నిర్వహణ ద్వారా గ్లైసెమిక్ నియంత్రణలో ప్రభావవంతంగా బాదం పనిచేసాయని అధ్యయనం నిర్ధారించింది.

భోజనం తర్వాత రక్త గ్లూకోజ్ స్థాయిల్ని బాదం కాయలు తగ్గించాయని మరియు ఎక్కువ సమయం పాటు కడుపునిండిన అనుభూతిని అందించాయని 14 మంది పెద్దల పైన చేసిన ఒక క్లినికల్ అధ్యయనం సూచించింది.  బాదం కాయలలోని కొవ్వు ఆమ్లాల ఉనికి కారణంగా వాటికి ఈ లక్షణం ఆపాదించబడింది.  అయినా, డయాబెటిస్ నిర్వహణలో కొంత చికిత్సా సామర్థ్యాన్ని బాదం కలిగిఉంది.

ఒక యాంటి-ఇన్‌ఫ్లమేటరీగా బాదం కాయలు - Almonds as an anti-inflammatory in Telugu

బాదం మరియు అక్రోట్లు వంటి గింజలు యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిఉన్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.   అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, యాంటిఆక్సిడంట్లు, ఆహార ఫైబర్స్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను ఈ కాయలు కలిగిఉండడమే దీనికి కారణం.  ఈ కాయల యొక్క క్రమమైన వినియోగం కొన్ని ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్ల యొక్క స్థాయిల్లో తగ్గుదలకు దారితీసిందని, ఇది క్రమంగా ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను తగ్గించిందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఆక్సీకరణ ఒత్తిడి అన్నది ఒక పరిస్థితి, హానికరమైన స్వేచ్చా రాడికల్స్ (సింగ్లెట్ ఆక్సిజన్) మరియు ఈ స్వేచ్చా రాడికల్స్‌కు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షించడానికి పనిచేసే యాంటిఆక్సిడంట్ల మధ్య అసమతుల్యత కారణంగా ఏర్పడిన పరిస్థితి.  పరిశోధన ప్రకారం, దీర్ఘకాల ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాల మంటకు దారితీస్తుంది, అది మన శరీరం వివిధ వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది.  

12 వారాల పాటు బాదం వినియోగం, టైప్ 2 డయాబెటిస్ రోగులకు సంబంధించి ఇన్‌ఫ్లమేషన్ మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించిందని ఒక క్లినికల్ అధ్యయనం వెల్లడించింది.

(మరింత చదవండి: ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల లక్షణాలు)

ఆరోగ్యకరమైన ఎముకల కోసం బాదం - Almonds for healthy bones in Telugu

ఓస్టియోక్లాస్ట్స్ అన్నవి ఒక రకమైన కణం, ఇది ఎముక విచ్చిన్నానికి బాధ్యత వహిస్తుంది, ఈ ప్రక్రియ గుండా ఎముక కణజాలం విచ్చిన్నం చేయబడుతుంది.  బాదం వినియోగం ఎముక సాంద్రతను పెంచడం‌లో సహాయ పడుతుంది మరియు ఎముక విచ్చిన్న కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

60 గ్రా.ల బాదం వినియోగం, 20% శాతం వరకు ఎముక విచ్చిత్తి ఏర్పడకుండా తగ్గించింది మరియు టార్ట్‌రేట్-నిరోధక ఆమ్ల ఫాస్ఫటేజ్ (ఓస్టియోక్లాస్ట్ ఎంజై‌మ్) కణాల సంఖ్యను 15% శాతం వరకు తగ్గించిందని 14 మంది పెద్ద వయస్సు గల వ్యక్తుల పైన చేసిన ఒక క్లినికల్ అధ్యయనం నిరూపించింది.   బాదం సప్లిమెంట్‌గా కలిగిన ఆహారం ఎముక ఆరోగ్యం మెరుగుపరచడం‌లో సహాయకరంగా ఉండవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

బరువు తగ్గడం కోసం బాదం - Almonds for weight loss in Telugu

ఊబకాయం అన్నది శరీరం‌లో కొవ్వు అధికంగా చేరడం వలన ఏర్పడుతుంది. బాదం కలిగినటువంటి తక్కువ-కేలరీ ఆహారం, నడుము చుట్టుకొలతను తగ్గించడం‌తో పాటు గణనీయంగా బరువును తగ్గిస్తుందని 65 మంది అధిక బరువు గల వ్యక్తుల పైన చేసిన ఒక క్లినికల్ అధ్యయనం నిరూపించింది.  ఎల్‌డి‌ఎల్ (చెడు కొలెస్ట్రాల్) యొక్క స్థాయిలో గణనీయమైన తగ్గుదల మరియు హెచ్‌డి‌ఎల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలో పెరుగుదల కూడా జరిగింది, ఇవి రెండూ కూడా శరీర బరువును ప్రభావితం చేసే అంతర్లీన కారకాలు.

 ప్రతీ రోజూ 50 గ్రా.ల బాదం తినేటటువంటి 108 మంది ఊబకాయం గల స్త్రీల పైన జరిగిన అదే అధ్యయనంలో, బాదం తీసుకోవడం బరువు తగ్గడం, నడుము చుట్టుకొలత తగ్గడం మరియు ఎల్‌డి‌ఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి దారి తీసిందని గమనించబడింది.  

(మరింత చదవండి: బరువు తగ్గడం కోసం ఆహార పట్టిక)

 • జీర్ణక్రియ సమస్య
  ఒకవేళ మీరు ఎక్కువగా బాదం వినియోగిస్తుంటే,   అది మలబద్దకంఉబ్బరం మరియు కడుపు నొప్పికి కారణం కావచ్చు, ఎందుకంటే బాదం‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
 • విటమిన్ అధికమోతాదు 
  మన రోజు వారీ అవసరం 15 మి.గ్రా.తో  పోలిస్తే 100 గ్రాముల బాదం (ఒక అరకప్పు) 25 మి.గ్రా. విటమిన్ ఇ కలిగిఉంటుంది. ఒకవేళ మీరు అధికంగా బాదం తీసుకుంటుంటే, మీరు  అతిసారంతలతిరగడం మరియు  దృష్టి మార్పులను వృద్ది చేయవచ్చు.
 • మూత్రపిండాలలో రాళ్లు
  బాదం ఆక్సలేట్‌ను సమృద్ధిగా కలిగిఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. మీ శరీరం కాల్షియం శోషించుకోకుండా ఆక్సలేట్స్ నిరోధిస్తాయి మరియు దానికి బదులుగా మీ మూత్రపిండాల్లో కాల్షియం-నిర్మితాన్ని ఏర్పరుస్తుంది.  అందువల్ల, ఒకవేళ మీరు కిడ్నీ రాళ్లతో బాధపడుతుంటే, మీరు బాదం తీసుకోవడాన్ని తగ్గించడం లేదా వాటిని తీసుకోవడాన్ని పూర్తిగా మానివేయడం మంచిది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.

బాదం యొక్క అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటే, వారి ఆహారం‌లో బాదం‌లను ఎందుకు చేర్చకూడదు అనేదానికి ఎటువంటి కారణం లేదు.  ప్రతీ రోజూ కొన్ని బాదం కాయలు తీసుకోవడం, మీ శరీరానికి అవసరమైన, ముఖ్యమైన ఖనిజాలు మరియు కేలరీలను ఇది ఇస్తుంది.  ఇది మీ ఎముకలను రక్షించడం‌లో సహాయం చేస్తుంది, హృదయ సంబంధ వ్యాధులను నిరోధిస్తుంది మరియు ఇది ఒక అద్భుతమైన యాంటి-ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటిఆక్సిడంట్.  ఇది డయాబెటిస్ నియంత్రణలో కూడా సహాయం చేస్తుంది.  అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటే, బాదం అన్నవి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ యొక్క ఒక ఆదర్శవంతమైన ఎంపికగా ఉన్నాయి.   గుప్పిలి నిండుగా బాదం తీసుకొని తినడం మీ ఆకలిని సంతృప్తి పరుస్తుంది మరియు ఒక మంచి సమయం వరకూ మిమ్మల్ని కడుపు నిండిన అనుభూతితో ఉంచుతుంది.  అయితే, దేనినైనా మితంగా తీసుకోవడం మంచిదని ఎల్లప్పుడూ సూచించబడుతుంది, ఎందుకంటే బాదం యొక్క అధిక వినియోగం కడుపు ఇబ్బందికి మరియు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.


Medicines / Products that contain Almond

వనరులు

 1. United States Department of Agriculture Agricultural Research Service. Full Report (All Nutrients): 45279270, RAW ALMONDS. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. Bento AP, Cominetti C, Simões Filho A, Naves MM. Baru almond improves lipid profile in mildly hypercholesterolemic subjects: a randomized, controlled, crossover study. Nutr Metab Cardiovasc Dis. 2014 Dec;24(12):1330-6. PMID: 25149894
 3. Berryman CE, Fleming JA, Kris-Etherton PM. Inclusion of Almonds in a Cholesterol-Lowering Diet Improves Plasma HDL Subspecies and Cholesterol Efflux to Serum in Normal-Weight Individuals with Elevated LDL Cholesterol. J Nutr. 2017 Aug;147(8):1517-1523. PMID: 28615375
 4. Liu Z. Prebiotic effects of almonds and almond skins on intestinal microbiota in healthy adult humans. Anaerobe. 2014 Apr;26:1-6. PMID: 24315808
 5. Seema Gulati, Anoop Misra,Metab Syndr Relat Disord. 2017 Mar 1; 15(2): 98–105. PMID: 28051354 Ravindra M. Pandey. Effect of Almond Supplementation on Glycemia and Cardiovascular Risk Factors in Asian Indians in North India with Type 2 Diabetes Mellitus: A 24–Week Study.
 6. Mori AM, Considine RV, Mattes RD. Acute and second-meal effects of almond form in impaired glucose tolerant adults: a randomized crossover trial. Nutr Metab (Lond). 2011 Jan 28;8(1):6. PMID: 21276226
 7. Salas-Salvadó J, Casas-Agustench P, Murphy MM, López-Uriarte P, Bulló M. The effect of nuts on inflammation. Asia Pac J Clin Nutr. 2008;17 Suppl 1:333-6. PMID: 18296371
 8. Simone Reuter, Subash C. Gupta, Madan M. Chaturvedi, Bharat B. Aggarwal. Oxidative stress, inflammation, and cancer: How are they linked? Free Radic Biol Med. 2010 Dec 1; 49(11): 1603–1616. PMID: 20840865
 9. Liu JF et al. The effect of almonds on inflammation and oxidative stress in Chinese patients with type 2 diabetes mellitus: a randomized crossover controlled feeding trial. Eur J Nutr. 2013 Apr;52(3):927-35. PMID: 22722891
 10. Batool Z et al. Repeated administration of almonds increases brain acetylcholine levels and enhances memory function in healthy rats while attenuates memory deficits in animal model of amnesia. Brain Res Bull. 2016 Jan;120:63-74. PMID: 26548495
 11. Wien MA, Sabaté JM, Iklé DN, Cole SE, Kandeel FR. Almonds vs complex carbohydrates in a weight reduction program. . Int J Obes Relat Metab Disord. 2003 Nov;27(11):1365-72. PMID: 14574348
 12. Abazarfard Z, Salehi M, Keshavarzi S. The effect of almonds on anthropometric measurements and lipid profile in overweight and obese females in a weight reduction program: A randomized controlled clinical trial. J Res Med Sci. 2014 May;19(5):457-64. PMID: 25097630
 13. Platt ID et al. Postprandial effects of almond consumption on human osteoclast precursors--an ex vivo study. Metabolism. 2011 Jul;60(7):923-9. PMID: 20947104
Read on app