నొప్పినివారుణుల దుష్ప్రభావాలు - Pain killer side effect in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 23, 2018

March 06, 2020

నొప్పినివారుణుల దుష్ప్రభావాలు
నొప్పినివారుణుల దుష్ప్రభావాలు

నొప్పినివారణ మందులు కలిగించే దుష్ప్రభావాలు ఏమిటి?

నొప్పి నివారరుణులు లేదా నొప్పి ఉపశమనకారి మందులు మాదకద్రవ్యాల (నార్కోటిక్స్)తో కూడుకుని ఉంటాయి. సాధారణంగా వీటిని శారీరక నొపుల్నుండి త్వరిత ఉపశమనం పొందడానికి వైద్యులచే సూచించబడతాయి. సాధారణ నొప్పి నివారణలలో ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, మరియు నేప్రోక్సెన్ ఉన్నాయి. ఇవి చాలా సాధారణంగా మందుల దుకాణాలలో వైద్యుని మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్) అవసరం లేకుండానే లభిస్తాయి. అయితే, ఈ నొప్పి నివారణ మందులను దీర్ఘకాలికంగా మరియు తరచుగా తీసుకోవడంవల్ల దుష్ప్రభావాలు తప్పవు.

నొప్పినివారుణుల ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రిస్క్రిప్షన్ పెయిన్ కిల్లర్ మందుల (అంటే వైద్యుడు సూచించే మందులు)  ఉపయోగంతో సంబంధం ఉన్న సాధారణ దుష్ప్రభావాలు:

పైన పేర్కొన్న లక్షణాలు ఔషధ వినియోగం తర్వాత వెంటనే గుర్తించబడవచ్చు. కొందరు వ్యక్తులలో, ఔషధాలు  తమ ప్రభావం చూపడం ప్రారంభమైన వెంటనే, వారు దుష్ప్రభావాలను అనుభవిస్తారు. అయినప్పటికీ, ఈ తక్షణ దుష్ప్రభావాలు తరచుగా నొప్పి నివారణలను తీసుకోని వ్యక్తులలో చాలా సాధారణం. వీటి (నొప్పి నివారిణుల) నిరంతర ఉపయోగంతో, ఈ లక్షణాలు తక్కువ స్పష్టమైనవిగా కనిపిస్తాయి కాని ఇతర తీవ్రమైన లక్షణాలు తలెత్తుతాయి:

  • వ్యసనం
    నొప్పి నివారణల వాడకంతో వచ్చే అతి పెద్ద ప్రమాదం దుర్వినియోగం మరియు వ్యసనం యొక్క ప్రమాదం. నొప్పినివారణ మందులు (పెయిన్కిల్లర్లు) సామాన్యంగా త్వరిత ఉపశమనాన్ని అందించే ఔషధాలతో తయారై ఉంటాయి మరియు కేంద్ర నాడీ వ్యవస్థను ఒక నిర్దిష్ట స్థాయికి తగ్గించి ఒక సుఖభ్రాంతి (ఉత్సాహభరిత) అనుభూతిని ఇస్తాయి. తరచుగా నొప్పిని తగ్గించే నొప్పినివారక మందుల్ని  ఉపయోగించే వ్యక్తులు ఆ మందులుకల్గించే ప్రభావానికి అలవాటుపడతారు మరియు అందువల్ల, అవసరం లేనప్పుడు కూడా వాటిని తీసుకోవడం ద్వారా ఔషధాలను దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు.
  • సహనం
    నొప్పి నివారణల తరచూ వాడకం ఔషధాల పట్ల ఎక్కువ సహనం కలిగించడానికి కారణమవుతుంది, అనగా అదే నొప్పి నివారిణి మందుల ప్రభావాన్ని పొందటానికి లేదా  ఆ మందు ఉపశమనం కల్గించడంలో ప్రభావవంతంగా పనిచేయాలంటే ఆ ఔషధాల మొత్తము లేదా మోతాదును పెంచి తీసుకోవాల్సి ఉంటుంది.
  • హార్మోన్ల అసమతుల్యత
    నొప్పి నివారణల యొక్క అధిక సేవనం పురుషులలో టెస్టోస్టెరోన్ యొక్క తక్కువ స్థాయికి దారితీస్తుంది మరియు మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుంది, అవేమంటే అధిక ఉష్ణం, ఋతు క్రమరాహిత్యాలు, మరియు తగ్గిపోయే లైంగికశక్తి వంటివి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

తీవ్ర నొప్పితో బాధపడుతున్న వ్యక్తులకు వారు ఆ నొప్పినుండి తక్షణ ఉపశమనం పొందడానికి నొప్పినివారిణులైన ఈ మందులు సూచించబడతాయి. అయినప్పటికీ, నొప్పిని తొలగించడానికి, క్యాన్సర్ వంటి అంత్యదశ (టెర్మినల్) అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి నొప్పినివారణ మందుల్ని బలమైన మోతాదులను (stronger doses) సూచించవచ్చు. నాడీ వ్యవస్థపై నిప్పినివారణ ఔషధం యొక్క మొద్దుబరిచే తత్త్వం లేక  స్పర్శరహిత ప్రభావాల కారణంగా దుష్ప్రభావాలు ఏర్పడతాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్య చరిత్ర, శారీరక పరీక్ష మరియు పరీక్షల ద్వారా నొప్పి నివారిణి యొక్క రక్త స్థాయిలను అంచనా వేయడం ద్వారా నిర్ధారణ జరుగుతుంది. డాక్టర్ సాధారణంగా నొప్పిని తగ్గించేమందుల్నితగ్గించమని లేదా మొత్తంగా వాటిని సేవించడం నిలిపివేయమని, నొప్పినివారిణులకు బదులు నొప్పిని ఎదుర్కోవడానికి సహజ నొప్పినివారణలను తీసుకోమని సలహా ఇవ్వచ్చు. పసుపు మరియు అల్లం వంటి సహజ ఆహార పదార్థాలు ప్రకృతిలో శోథ నిరోధకత మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

యోగా మరియు ధ్యానం వంటి ఇతర పరిష్కారాలు కూడా నొప్పి తగ్గించేమందులపై ఆధారపడటాన్ని తగ్గించటానికి సిఫారసు చేయబడవచ్చు.



వనరులు

  1. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. The Down Side and Side Effects of Painkillers.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pain medications - narcotics.
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pain Relievers.
  4. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Using medication: The safe use of over-the-counter painkillers. 2016 Apr 6 [Updated 2017 Aug 10].
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Medicines and side effects.