myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పసుపు అనేది అల్లo యొక్క జాతికి సంబంధించినది. దక్షిణ ఆసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతున్న కర్కుమా లోంగా మొక్క యొక్క వేరు నుండి లభించే సుగంధ ద్రవ్యం. మొక్క యొక్క వేర్లు బల్బుల ఆకారంలో ఉంటాయి, ఇవి మూలవేరుని ఉత్పత్తి చేస్తాయి. ఇవి కాల్చబడి, ఎండబెట్టి ఆపై హాల్ది అని పిలువబడే పసుపు పొడిగా చూర్ణం చేయబడతాయి.

600 బి.సి. నాడు పసుపు ఒక రంగు కోసం మరియు అద్దకంగాను వాడబడేది. శ్వాస సమస్యలు, కీళ్ళవాతం, శరీర నొప్పి, మరియు అలసట వంటి వివిధ పరిస్థితులు కోసం ఆయుర్వేద మూలికా ఔషధాలను ఉపయోగించే భారతదేశంలో పసుపు ఒక దీర్ఘ ఔషధ చరిత్ర కలిగి ఉంది. ఇది దుస్తులను అద్దడానికి కూడా ఉపయోగించబడుతుంది. వాస్తవానికి, మార్కో పోలో 1280 లో చైనాకు ప్రయాణించినప్పుడు ఆయన పసుపును కుంకుమ పువ్వుతో పోల్చినట్లు తన నివేదికలను బట్టి తెలుస్తుంది. మధ్యయుగ ఐరోపాలో, పసుపును "ఇండియన్ కుంకుమ పువ్వు" అని అంటారు.

పసుపు ఒక మిరియాల చేదు రుచిని కలిగి ఉంటుంది మరియు కొన్నిసార్లు కలరింగ్ ఏజెంట్­గా వాడబడుతుంది. ఇది నిల్వ ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు, పాడి, రసాలు మరియు ఇతర ఆహార ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. పసుపు మొక్క యొక్క ఆకులు కూడా వంటకాల తయారీ మరియు ప్యాకింగ్ కోసం ఉపయోగించబడతాయి. ఈ ఆకులు ఆహారంలో వేరే రుచిని అందిస్తాయి.

పసుపు కూడా ఒక అద్భుతం మసాలా కానీ పాలలో కలిపినప్పుడు, దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పసుపులో కరిగే కర్సిమిన్ అని పిలువబడే రసాయన సమ్మేళనంతో పసుపు తయారు చేయబడుతుంది. ఒక చెంచా పసుపు పొడికి వేడి పాలు కలిపి పసుపు ముద్ద తయారు చేయబడుతుంది.

ప్రపంచంలోనే భారతదేశం ఒక అతి పెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారు. ఇందులో ఉన్న అధిక కర్సినిన్ వలన ప్రపంచంలోని ఉత్తమ ఉత్పత్తులలో ఒకటిగా భావించబడుతుంది. ప్రపంచ మొత్తం పసుపు ఉత్పత్తిలో 80% భారతదేశంలో లభిస్తుంది.

పసుపు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

 • బొటానికల్ పేరు: కుర్కుమా లోంగా
 • కుటుంబo: పసుపురంగు జింజిబరేసియా అనే అల్లం కుటుంబానికి చెందినది
 • సాధారణ పేరు: పసుపు, హల్ది (హిందీ)
 • సంస్కృత పేరు: హరిద్రా
 • వాడిన భాగాలు: వేర్లు లేదా రైజోమ్లు వైద్యంలో మరియు ఆహారంలో ఉపయోగించబడతాయి
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారతదేశం, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, తైవాన్, హైతీ, జమైకా, శ్రీలంక, మరియు పెరూ దేశాలలో పసుపు లభిస్తుంది అయితే ఇది దక్షిణాసియాలో ఎక్కువగా సాగు చేయబడుతుంది.
 • ఆసక్తికరమైన వాస్తవాలు: కర్కుమా లాంగ్ అనే పేరు అరబిక్ పేరు అయిన కర్కుమ్ మొక్క నుండి వచ్చింది. దీనిని జియాంగ్ హుయాంగ్ అని చైనీస్­లో అంటారు.
 1. పసుపు యొక్క పోషకాహార వాస్తవాలు - Turmeric nutrition facts in Telugu
 2. పసుపు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు - Turmeric health benefits in Telugu
 3. పసుపు యొక్క దుష్ప్రభావాలు - Turmeric side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

పసుపు 26% మాంగనీస్ మరియు 16% ఐరన్­ కలిగి ఉంటుంది. ఇది అధికంగా ఫైబర్, విటమిన్ B6, పొటాషియం, విటమిన్ సి మరియు మెగ్నీషియం కూడా సమృద్ధిగా కలిగి ఉంటుంది. రసాయన సమ్మేళనం అయిన కర్కుమిన్ కలిగి ఉండుట కారణంగా ఇది చికిత్సా లక్షణాలను కలిగి ఉన్నట్లు చెప్పబడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకంగా కూడా పని చేస్తుంది.

USDA న్యూట్రియంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రా పసుపు క్రింది పోషక విలువలను కలిగి ఉంటుంది:

పోషకాహారం 100 గ్రా.లలో దాని విలువ
నీరు 12.85 గ్రా.
శక్తి 312 కిలో కేలరీలు
ప్రోటీన్ 9.68 గ్రా.
కొవ్వు 3.25 గ్రా.
కార్బోహైడ్రేట్ 67.14 గ్రా.
ఫైబర్ 22.7 గ్రా.
చక్కెరలు 3.21 గ్రా.
ఖనిజ లవణాలు  
కాల్షియం 168 మి.గ్రా.
ఐరన్ 55 మి.గ్రా.
మెగ్నీషియం 208 మి.గ్రా.
పాస్పరస్ 299 మి.గ్రా.
పొటాషియం 2080 మి.గ్రా.
సోడియం 27 మి.గ్రా.
జింక్ 4.50 మి.గ్రా.
విటమిన్లు  
విటమిన్ B6 0.107 మి.గ్రా.
విటమిన్ సి 0.7 మి.గ్రా.
విటమిన్ ఇ 4.43 మి.గ్రా.
విటమిన్ కె 13.4 మి.గ్రా.
కొవ్వులు  
సాచురేటెడ్ ఫేటీ ఆమ్లాలు 1.838 గ్రా.
మొనోసాచురేటెడ్ ఫేటీ ఆమ్లాలు 0.449 గ్రా.
పాలీసాచురేటెడ్ ఫేటీ ఆమ్లాలు 0.756 గ్రా.
ట్రాన్స్ ఫేటీ ఆమ్లాలు 0.056 గ్రా.
 • ఒక యాంటి ఇన్ఫ్లమేటరీ­గా: పసుపు తరచుగా దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల కారణoగా, ఇది గాయం మరియు దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే తీవ్ర నొప్పి నుండి  ఉపశమనం కలిగించుటలో సహాయపడుతుంది.
 • ఒక యాంటీ ఆక్సిడెంట్ గా: పసుపులో ఉండే కర్కమిన్ అనే కాంపౌండ్, యాంటీ ఆక్సిడెంట్ పొటెన్షియల్ మరియు యాంటీ ఏజింగ్ మూలికా ప్రభావాన్ని అందిస్తుంది. దీని స్వేచ్ఛా రాడికల్ శుద్ది చర్యలు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది మరియు వృద్ధాప్య ఆలస్యాన్ని కలిగిస్తుంది.
 • కీళ్ళనొప్పుల కొరకు: యాంటీ ఇన్ఫ్లమేటరీ­గా, కీళ్ళ నొప్పి మరియు అసౌకర్యం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 • మెదడు కోసం: సరైన మెదడు పనితీరులో పసుపు సహాయపడుతుంది మరియు అల్జీమర్స్ వ్యాధి మరియు మాంద్యంనకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పని చేయవచ్చు.
 • గుండె కోసం: గుండె సంబంధిత రుగ్మతల వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తూ గుండె నాళాలు మరియు గోడలకు కలిగే నష్టం తగ్గించడంలో కర్కుమిన్ సహాయపడుతుంది.
 • క్యాన్సర్­కు వ్యతిరేకంగా: అసాధారణ క్యాన్సర్ నిరోధించేటప్పుడు కర్కుమిన్ క్యాన్సరుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, లుకేమియా, లింఫోమా మరియు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వ్యవస్థ యొక్క కొన్ని క్యాన్సర్లకు వ్యతిరేకంగా కార్యాచరణ కనుగొనబడటం జరిగింది.
 • నోటి ఆరోగ్యానికి: గింజవిటిస్ మరియు పీరియోడోంటిటిస్ వంటి పంటి చిగురు సమస్యల యొక్క నిర్వహణలో పసుపు దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా ఉపయోగించబడుతుంది. నోటి సంబంధిత క్యాన్సరుకి వ్యతిరేకంగా సరియైన చర్య కూడా కనుగొనబడింది
 1. గుండె ఆరోగ్యానికి పసుపుతో చికిత్స - Turmeric for heart health in Telugu
 2. మెదడు యొక్క ఆరోగ్యానికి పసుపుతో చికిత్స - Turmeric for brain health in Telugu
 3. పసుపు యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు - Turmeric antioxidant properties in Telugu
 4. పసుపు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేయుట - Turmeric as an anti-inflammatory in Telugu
 5. పసుపు క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది - Turmeric prevents cancer in Telugu

గుండె ఆరోగ్యానికి పసుపుతో చికిత్స - Turmeric for heart health in Telugu

డబ్ల్యు.హెచ్.ఓ ప్రకారం, ఇస్కీమిక్ వ్యాధి అనేది ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన మరణాలకు కారణం. గుండె సంబంధిత వ్యాధులకు కారణాలు చాలా కావచ్చు, కానీ ఆరోగ్యకరమైన గుండెను కలిగి ఉండుటకు  మన ఆహార అలవాట్లను మరియు జీవనశైలిని మనం ఎల్లప్పుడూ మార్చుకోవచ్చు. పరిశోధన ప్రకారం, కర్కిమిన్ గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడానికి లేదా రివర్స్ చేయడానికి సహాయపడే మూలికల్లో ఒకటి. కర్కోమిన్ ఎండోథెలియల్ కణాలపై, గుండె యొక్క రక్త నాళాల యొక్క లైనింగ్, గుండెకు కలిగే నష్టాన్ని తారుమారు చేస్తూ పనిచేస్తుంది. వ్యాయామం చేయుటం వలన అది వాస్కులర్ ఎండోథెలియంపై నునుపైన పనితీరుపై అద్భుతంగా ప్రభావాలను కలిగి ఉంటుందని మన అందరికీ తెలుసు. అంతేకాక, ఎండోథెలియం యొక్క పనితీరు ఫలితాలను పసుపు కలిగి ఉన్నట్లు ఒక అధ్యయనం ప్రకారం తెలుస్తుంది. పసుపు నిరంతర వాడుక దీర్ఘకాలంలో మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

(ఇంకా చదవండి: గుండె వ్యాధి లక్షణాలు)

మెదడు యొక్క ఆరోగ్యానికి పసుపుతో చికిత్స - Turmeric for brain health in Telugu

పసుపు మీ గుండెకు ఉపయోగపడటం మాత్రమే కాకుండా, మెదడు యొక్క పనితీరు మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మెదడులో ఉత్పన్నమైన న్యూరోట్రాఫిక్ కారకం (బి.డి.ఎన్.ఎఫ్) అనేది మెదడు యొక్క ప్రధాన భాగమైన ఒక ప్రోటీన్ రకం అని ఒక పరిశోధన వెల్లడించింది. ఇది నరాల కణాల పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. మరొక అధ్యయనంలో నిరాశ మరియు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు బి.డి.ఎన్.ఎఫ్ యొక్క క్లిష్టమైన తక్కువ స్థాయిలను కలిగి ఉంటారు. మానవులలో బి.డి.ఎన్.ఎఫ్ యొక్క సహజ ఉత్పత్తిని ప్రేరేపించడంలో వ్యాయామం ఉపయోగకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా, పసుపు కూడా ఇదే రకపు ఫలితాలను చూపిస్తున్నది.

పసుపు యొక్క నిరంతర వినియోగం బి.డి.ఎన్.ఎఫ్ స్థాయిని పెంచుతుంది, ఫలితంగా మెదడును మెరుగుపరుస్తుంది, మెదడు వ్యాధులను తారుమారు చేస్తుంది మరియు మెదడు యొక్క పనితీరు సజావుగా ఉండేలా చూస్తుంది.

పసుపు యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు - Turmeric antioxidant properties in Telugu

మన వయసు పెరిగే కొలదీ, ఫ్రీ రాడికల్స్ సంఖ్య (రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు) విశేషంగా మన శరీరంలో పెరుగుతాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా రియాక్టివ్­గా ఉంటారు మరియు అవి ప్రోటీన్లు లేదా కొవ్వు ఆమ్లాలతో చర్యలు జరుపడం వలన ఆక్సీకరణ నష్టం జరగవచ్చు. మరీ ఎక్కువ ఫ్రీ రాడికల్స్ కలిగి ఉండటం వలన డి.ఎన్.ఎ మరియు కణాలను కూడా దెబ్బతీస్తుంది. ధూమపానం, వాయు కాలుష్యం, ఆహారంలో క్రిమిసంహారకాల స్థాయిలు, ఫ్రై చేయబడిన ఆహారాలు వంటి కారణాల వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ యొక్క స్థాయిలు పెరుగుతాయి. మన ఆహారంలో సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్­ అధికమ చేయడం ద్వారా మన శరీరంలోని స్వేచ్ఛా రాడికల్స్ యొక్క ప్రభావంపై మనము పోరాడవచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సహజంగా కూరగాయలు మరియు పండ్లలో ఉంటాయి. పసుపు ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అని ఒక పరిశోధనలో సూచించబడింది, ఇది ఈ ఫ్రీ రాడికల్స్­ను తటస్థీకరిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్­ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల, రోజువారీ ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుచున్నారు.

పసుపు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేయుట - Turmeric as an anti-inflammatory in Telugu

దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేయుటకు మరియు పరాన్న జీవులతో పోరాడటానికి సహాయపడుతుంది. మన శరీర వ్యవస్థలోకి ప్రవేశించే వ్యాధికారకాలతో పోరాడటానికి వాపు దోహదపడుతుంది. మొటిమలు లేదా చిన్నగా కట్ అవటం వలన కలిగే స్వల్పకాలిక వాపు మన శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది, కాని దాని శరీర కణజాలంపై దాడి జరిగి వాపు తీవ్రతరం అయినప్పుడు చింతించవలసి ఉంటుంది. దీర్ఘకాలిక వాపు, తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గుండె వ్యాధులు, జీవక్రియ సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. పసుపు వాయు శోషక లక్షణాలను కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది NF-kB (అణు కారకం కప్పా బీటా), కణాలలో వాపుతో జన్యువులను క్రియాశీలం చేసే అణువును ఆటంకపరుస్తుంది. పరమాణు స్థాయిలో వాపుపై పసుపు పోరాడుతుందని ఒక అధ్యయనం తెలియజేస్తుంది.

పసుపు క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది - Turmeric prevents cancer in Telugu

కణాల అసాధారణ పెరుగుదల అనేది క్యాన్సర్ వ్యాధికి దారి తీస్తుంది. పసుపులో ఉండే  కర్కమిన్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించబడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ఇది క్యాన్సర్ కణాల పెరుగుదల, అభివృద్ధి మరియు వ్యాప్తికి అణువు స్థాయిలో చికిత్స చేయుటకు ఉపయోగించబడుతుంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కర్కమిన్ అనేది జీర్ణశయాంతర కాన్సర్లు, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, నరాల కాన్సర్లు, అండాశయ క్యాన్సర్, లుకేమియా, మరియు లింఫోమా వంటి అనేక కాన్సర్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఒక పరిశోధన ప్రకారం, కర్కుమిన్ సాధారణ కణాలకు ఏవిధంగాను ప్రభావితం చేయదు కానీ వివిధ కణితుల కణాలను చంపే సామర్ధ్యం కలిగి ఉంటుంది. అందువల్ల, కర్కమిన్­ని వివిధ ఔషధాల తయారీలో ఉపయోగించవచ్చు ఇది ఒక ప్రయోజనకరమైన ఔషధ మొక్క, నిరూపించబడింది. అందువల్ల, పసుపు యొక్క నిరంతర వినియోగం క్యాన్సర్ వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది.

పసుపు ప్రాచీన కాలం నుండి భారతీయ గృహాల్లో ఉపయోగించబడుతూ ఉంది. ఇటీవల, పశ్చిమ దేశాల్లో పసుపు బాగా ప్రజాదరణ పొందింది. పసుపు గొప్ప లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, ఏదైనా ఎక్కువ తీసుకోవడం హానికరం అనేది గుర్తుంచుకోవాలి.

 1. పసుపులో ఉండే కర్కుమిన్ అనేది అలెర్జీలను కలిగిస్తుంది ఎందుకంటే పసుపు కొందరు వ్యక్తులలో తాకడం వలన కలిగే అలెర్జీలకు కారణం కావచ్చు. ఇది చర్మవ్యాధికి కారణమవుతుంది. వ్యక్తులు పసుపును తాకినా లేదా సేవించినా దాని వలన చర్మ దద్దుర్లు మరియు అలెర్జీ ప్రతి చర్యలు కలుగవచ్చు.
 2. మధుమేహ వ్యాధి: కర్కుమిన్, పసుపులో ఉండే రసాయనo, మధుమేహం కలిగిన వారిలో రక్త చక్కెర స్థాయిని తగ్గిoచవచ్చు.
 3. పిత్తాశయం: ఇది మీ పిత్తాశయంలో ముఖ్యంగా పిత్తాశయ రాళ్లు లేదా పిత్త వాహిక అవరోధం విషయంలో మీరు పసుపు నివారణ చేయవలసినదిగా సూచించబడినది. జీర్ణాశయం యొక్క పిత్తాశయమును కర్కుమిన్ ప్రేరేపిస్తుంది అని ఒక పరిశోధన వెల్లడిస్తుంది.
 4. కడుపులో వికారo: పసుపు యాంటిసిడ్లతో జోక్యం చేసుకోవచ్చు. టాగమేట్, పెప్సిడ్, జంటాక్, నెక్సియం, లేదా ప్రీవాసిడ్ వంటి యాంటాసిడ్ ఔషధాలతో తీసుకున్నట్లయితే, అది కడుపులో యాసిడ్ పెరుగుటకు కారణం కావచ్చు. అధిక మోతాదు లేదా హార్మోన్ల యొక్క దీర్ఘకాలిక ఉపయోగం జీర్ణశయ వికారo వంటి సమస్యలకు మరియు కడుపు నొప్పికి కారణమవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 5. పసుపు ఉండే కర్కమిన్ గ్యాస్ట్రిక్ వలన దురదలు కలిగిస్తుంది, అది అతిసారం మరియు వికారం వంటి సాధారణ లక్షణాలకు దారి తీస్తుంది.

యుగాలుగా మన సంస్కృతిలో పసుపు ఒక భాగంగా ఉంది. దుష్ప్రభావాల కంటే పసుపు ఎక్కువ లాభాలను కలిగిస్తుంది, కానీ మీరు డయాబెటిక్ లేదా గర్భిణి అయినట్లయితే ప్రత్యేకంగా పసుపు ఏ రూపoలో అయినా తీసుకునే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది.

పసుపు అనేది మందులు మరియు ఆహార ఉత్పత్తులలో మాత్రమే కాకుండా, అనేక సహజ సౌందర్య చికిత్సలలో కూడా ఉపయోగించబడుతుంది. హల్ది, ఇది భారతదేశంలో తెలిసినంతవరకు, మన జీవితాల్లో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది, ఎందుకంటే వంటలో మాత్రమే కాకుండా ఔషధ మరియు సౌందర్య అంశాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది.

పసుపు నిజంగా బహుళ ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుత సుగంధ ద్రవ్యం. ఒక చెంచా తేనెతో పసుపు కలిపిన ఒక గ్లాసు పాలు తీసుకోవడం అనే భారతీయ పద్ధతి వైద్యుని అవసరం లేకుండా చేస్తుంది.

और पढ़ें ...

References

 1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 02043, Spices, turmeric, ground. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; The top 10 causes of death.
 3. Wongcharoen W, Phrommintikul A. The protective role of curcumin in cardiovascular diseases. Int J Cardiol. 2009 Apr 3;133(2):145-51. PMID: 19233493
 4. Akazawa N et al. Curcumin ingestion and exercise training improve vascular endothelial function in postmenopausal women.. Nutr Res. 2012 Oct;32(10):795-9.PMID: 23146777
 5. DEVIN K. BINDERa, HELEN E. SCHARFMAN. Brain-derived Neurotrophic Factor. Growth Factors. 2004 Sep; 22(3): 123–131. PMID: 15518235
 6. V. Lobo, A. Patil, A. Phatak, N. Chandra. Free radicals, antioxidants and functional foods: Impact on human health. Pharmacogn Rev. 2010 Jul-Dec; 4(8): 118–126. PMID: 22228951
 7. Menon VP, Sudheer AR. Antioxidant and anti-inflammatory properties of curcumin. Adv Exp Med Biol. 2007;595:105-25. PMID: 17569207
 8. Biswas SK, McClure D, Jimenez LA, Megson IL, Rahman I. Curcumin induces glutathione biosynthesis and inhibits NF-kappaB activation and interleukin-8 release in alveolar epithelial cells: mechanism of free radical scavenging activity. Antioxid Redox Signal. 2005 Jan-Feb;7(1-2):32-41. PMID: 15650394
 9. Libby P. Inflammation in atherosclerosis. Nature. 2002 Dec 19-26;420(6917):868-74. PMID: 12490960
 10. Lumeng CN, Saltiel AR. Inflammatory links between obesity and metabolic disease. J Clin Invest. 2011 Jun;121(6):2111-7. PMID: 21633179
 11. Coussens LM, Werb Z. Inflammation and cancer. Nature. 2002 Dec 19-26;420(6917):860-7. PMID: 12490959
 12. Chainani-Wu N. Safety and anti-inflammatory activity of curcumin: a component of tumeric (Curcuma longa). J Altern Complement Med. 2003 Feb;9(1):161-8. PMID: 12676044
 13. Jayaraj Ravindran, Sahdeo Prasad, Bharat B. Aggarwal. Curcumin and Cancer Cells: How Many Ways Can Curry Kill Tumor Cells Selectively? AAPS J. 2009 Sep; 11(3): 495–510. PMID: 19590964
 14. Shrikant Mishra, Kalpana Palanivelu. The effect of curcumin (turmeric) on Alzheimer's disease: An overview. Ann Indian Acad Neurol. 2008 Jan-Mar; 11(1): 13–19.PMID: 19966973
 15. Chandran B, Goel A. A randomized, pilot study to assess the efficacy and safety of curcumin in patients with active rheumatoid arthritis. Phytother Res. 2012 Nov;26(11):1719-25. PMID: 22407780
 16. Menon VP, Sudheer AR. Antioxidant and anti-inflammatory properties of curcumin. Adv Exp Med Biol. 2007;595:105-25. PMID: 17569207
 17. Monika Nagpal and Shaveta Sood. Role of curcumin in systemic and oral health: An overview. J Nat Sci Biol Med. 2013 Jan-Jun; 4(1): 3–7. PMID: 23633828
 18. Rasyid A, Lelo A. The effect of curcumin and placebo on human gall-bladder function: an ultrasound study. Aliment Pharmacol Ther. 1999 Feb;13(2):245-9.PMID: 10102956
 19. National Center for Complementary and Integrative Health [Internet] Bethesda, Maryland; Turmeric