పురుషాంగం నొప్పి - Pain in penis in Telugu

Dr. Anish Kumar GuptaMBBS,MS,DNB

December 24, 2018

September 11, 2020

పురుషాంగం నొప్పి
పురుషాంగం నొప్పి

సారాంశం

పురుషాంగములో నొప్పి (లేక పురుషాంగము నొప్పి) అనునది పురుషాంగము యొక్క తల, షాఫ్ట్, లేక బేస్ భాగములో సంభవిస్తుంది.  ఇది ముందోలు పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.  పురుషాంగములో నొప్పి అనునది గాయం, ప్రమాదాలు లేక ఏదైనా కలిపించని వ్యాధుల ఫలితముగా ఏర్పడుతుంది మరియు అన్ని వయస్సులు గల మగవారిపై ప్రభావము చూపుతుంది.  పురుషాంగములో నొప్పి అనునది అది ఏర్పడడానికి కారణమైన లోపల ఉన్న పరిస్థితి పైన ఆధారపడుతుంది.   ఇది హఠాత్తుగా ప్రారంభమవుతుంది (తీవ్రమవుతుంది) అనగా గాయాలు తగిలిన ప్రజలలో లేక నిదానముగా (క్రమముగా) పెరుగుతుంది మరియు కొంత కాలమునకు మరింత అధ్వాన్నముగా మారుతుంది.  పురుషాంగములో వచ్చే ఏ రకమైన నొప్పి అయినా ఆందోళనము కారణమవుతుంది, ప్రత్యేకముగా ఒకవేళ అంగస్తంభన సమయములో, లేక మూత్ర విసర్జన కష్టముగా ఉండడం లేక రక్త స్రావంతో కలిసి ఉండడం, అసాధారణముగా బయటకు రావడం, పుండ్లు, ఎర్రగా మారడం లేక వాపు వలన ఈ నొప్పి  సంభవిస్తుంది.

పురుషాంగం నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Penis Pain in Telugu

నొప్పి యొక్క ఖచ్చితమైన స్థానము పైన ఆధారపడి పురుషాంగములో నొప్పి యొక్క లక్షణాలు మారుతుంటాయి.  క్రింద ఇవ్వబడిన భాగాలు పాల్గొని ఉండవచ్చు లేక ప్రమేయం ఉండవచ్చు:

 • పురుషాంగము యొక్క మూలం (ఇది పొత్తి కడుపు గోడకు అనుసంధానం చేయబడిన పురుషాంగము యొక్క ఒక భాగము).
 • పురుషాంగము యొక్క ప్రధాన శరీరం లేక షాఫ్ట్.
 • పురుషాంగము యొక్క తల, ఇది పురుషాంగ శీర్షము లేక శిశ్నము అని కూడా తెలుపబడుతుంది. 
 • పురుషాంగము గుండా వెళ్లే మూత్రాశయ నాళము మరియు ఇది వీర్యమును అదే విధముగా మూత్రమును తీసుకెళ్తుంది.

పురుషాంగములో నొప్పి యొక్క లక్షణాలు హఠాత్తుగా ప్రారంభమవవచ్చు లేక కొంత సమయము తరువాత అభివృధ్ధి చెందవచ్చు.  నొప్పి మందకొడిగా, పదునుగా లేక సహముగా వణుకుచూ ఉండవచ్చు.  పురుషాంగ నొప్పి ఒక పురుషుని యొక్క సాధారణ కార్యకలాపాలు అనగా వ్యాయామం, మూత్ర విసర్జన లేక సంభోగములకు ఇబ్బంది కలిగించవచ్చు.  ఒక పురుషుడు క్రింద ఇవ్వబడిన లక్షణాలతో పాటు ఒకవేళ ఎప్పుడైనా పురుషాంగములో నొప్పిని అనుభవిస్తుంటే, అతడు వెంటనే డాక్టరును సంప్రదించాలి. 

 • అంగస్తంభన నాలుగు గంటలు లేక అంతకంటే ఎక్కువ సమయం ఉండడం.  ఈ పరిస్థితి ప్రియాపిస్మ్ అని తెలుపబడుతుంది మరియు ఇది ఒక అత్యవసర వైద్య పరిస్థితి.
 • లైంగిక సంభోగం లేక అంగస్తంభన సమయములో ఒక చీలిక లేక ఒక పేలుడు వంటి శబ్దం ఏర్పడుతుంది.
 • మూత్రవిసర్జన చేయుటలో అసమర్థత.
 • గజ్జ ప్రాంతం, వృషణములు లేక పురుషాంగములో క్రీడల ద్వారా గాయం లేక ప్రమాదం జరగడం.

పురుషాంగములో నొప్పికి సంబంధించిన ఇతర లక్షణాలు:

 • వీర్యములో రక్తం ఉండడం.
 • పురుషాంగము పైన మచ్చలుగా లేక రంగులేనటువంటి గాయాలు ఉండుట.
 • అంగస్తంభన వైఫల్యం లైంగిక ప్రవేశం కొరకు తగినంత అంగస్తంభన సాధించచగలిగిన సామర్థ్యం లేకపోవడం, లేక ప్రేరేపణ ద్వారా కాకుండా ఏర్పడిన బాధాకరమైన అంగస్తంభన.
 • మూత్రవిసర్జన బయటకు రావడం.
 • పురుషాంగము యొక్క వాపు మరియు మంట.
 • మూత్రవిసర్జనకు సంబంధించిన లక్షణాలు అనగా:
  • తరచుగా మార్పులు ఏర్పడడం.
  • మూత్రం కొంచెం కొంచెం (చొంగగా) కారడం.
  • మూత్రవిసర్జన ప్రారంభములో కష్టముగా ఉండడం.
  • బాధాకరమైన మూత్రవిసర్జన.
  • మూత్రవిసర్జన సమయములో మంటతో కూడిన స్పందన కలిగి ఉండడం.
 • పొక్కులు పురుషాంగము పైన ఏర్పడటం.
 • శీఘ్ర స్కలనం
 • మూత్రాశయం, ప్రొస్టేట్ గ్రంథి, వృషణాలు లేక పొత్తి కడుపులో నొప్పి. (ఎక్కువగా చదవండి - కడుపునొప్పి కారణాలు మరియు చికిత్స)
 • పురుషాంగము పైన పుండ్లు లేక గాయాలు.
 • దురద పురుషాంగములో ఏర్పడడం.
 • గజ్జ ప్రాంతములో గడ్డలు ఏర్పడడం.
 • ముందోలు క్రింద ఒక మందపాటి ఉత్సర్గం చేరడం.
 • లైంగిక కోరికల విషయములో గణనీయమైన మార్పులు ఏర్పడడం.

పురుషాంగం నొప్పి యొక్క చికిత్స - Treatment of Penis Pain in Telugu

పురుషాంగములో నొప్పి రావడానికి దారితీసిన కారణాలపైన సాధారణముగా  చికిత్స అనునది ఆధారపడి ఉంటుంది. ప్రారంభములో కొన్ని పరిస్థితులకు ఏ విధమైన చికిత్స అవసరముండదు, కొన్నింటికి వెంటనే వైద్య చికిత్స అవసరమవుతుంది.

 • మందులు
  యుటిఐలు, ప్రొస్టేట్ గ్రంథి యొక్క శోథము మరియు  మూత్రాశయములో మంటఅను ఇన్ఫెక్షన్ల కొరకు యాంటిబయాటిక్స్ రికమెండ్ చేయబడ్డాయి.  ప్రొస్టేట్ గ్రంథి యొక్క వాపుల ద్వారా ప్రభావితం చెందిన మూత్రమార్గం యొక్క కుదింపులను తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ అనునవి సూచించబడ్డాయి.  నొప్పి నుండి ఉపశమనానికి ఇతర మందులు అనగా (స్టెరాయిడ్ శోథ నిరోధక మందులు)  నాన్ స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమ్మేటరీ మందులు (NSAIDs) అనునవి కూడా సూచించబడ్డాయి.
 • ప్రత్యామ్నాయ చికిత్సలు
  కొన్ని విధానాలు అనగా ఆక్యుపెంచర్ (సూదులమందు), నీటి స్నానాలు, మసాజ్ థెరపీ, వ్యాయామాలు వంటివి నొప్పిని తగ్గించడములో సహాయపడతాయి.  మూలికా మందులు వాడడానికి ప్రారంభించడానికి ముందుగా మీ డాక్టరుతో సంప్రదించండి, ఎందుకనగా ఇవి కొన్ని మందులయొక్క ప్రభావమును మార్పుచేస్తాయి.
 • శస్త్ర చికిత్స
  పురుషాంగము నుండి ముందోలును తొలగించడానికి సున్నతి అను విధానమును నిర్వహిస్తారు.  ఈ విధానము ఫిమోసిస్ (బిగుసుకున్న చర్మము) మరియు పారాఫిమోసిస్ కలిగిఉన్న ప్రజలకు సూచించబడినది.
 • ఇతర చికిత్సా విధానాలు
  పురుషాంగములో క్యాన్సర్ కలిగిన ప్రజలకు కీమోథెరపీతో పాటు రేడియేషన్ థెరపీ కూడా సూచించబడినది.

జీవనశైలి నిర్వహణ

పురుషాంగములో నొప్పిని మేనేజ్ చేయడానికి మరియు పురుషాంగమును ఆరోగ్యముగా ఉంచడానికి ఇక్కడ కొన్ని విధానాలు కలవు.

 • లైంగిక బాధ్యత కలిగి ఉండడం
  సుఖవ్యాదుల వంటి ఎటువంటి అనారోగ్యము లేనటువంటి ఏకదంపతీ (ఒకే భాగస్వామి) లైంగిక సంబంధాలను నిర్వహించడం.  ఒకవేళ వ్యక్తి 26 సంవత్సరాలలోపు వయస్సు గల వారైతే,    జననేంద్రియ మొటిమలునివారించడానికి మానవ పాపిలోమవైరస్ టీకాను తీసుకోవలసినదిగా సూచించండి. సంభోగం తరువాత పురుషాంగము యొక్క ముందోలును తిరిగి తన పూర్వస్థానమునకు తీసుకురావాలి.
 • మీరు వాడవలసిన మందులను తెలుసుకోవాలి
  వ్యాధికి సంబంధించి తీసుకోవాల్సిన మందులు, వాటి యొక్క ప్రొటోకాల్ మరియు సాధారణముగా ఏర్పడే దుష్పలితాలు గురించి  డాక్టరుతో చర్చించాలి.
 • ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవాలి
  మీ మానసిక ఆరోగ్యము పైన దృష్టి నిలపండి.  పురుషాంగములో నొప్పి ఫలితముగా ఏర్పడిన భయము, ఆందోళన, క్రుంగిపోవడం వంటి పేలవమైన మానస్థితి అనునది ఒక కౌన్సిలర్ లేక ఒక సైకాలజిస్ట్ (మనస్తత్వ శాస్త్రవేత్త) కు చూపించడం ద్వారా గుర్తించవచ్చు.  ప్రతీరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయిన్ టెయిన్ చేయాలి.  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదమును తగ్గించడానికి తగినంత ఏరోబిక్ మరియు హృదయనాళ సంబంధ యాక్టివిటీలను చేయాలి.

పురుషాంగం నొప్పి అంటే ఏమిటి? - What is Penis Pain in Telugu

అనేక అంతర్లీన పరిస్థితుల ఫలితముగా పురుషాంగములో నొప్పి ఏర్పడుతుంది.  పురుషాంగమునకు  గాయాలు అదేవిధముగా ఇన్ఫెక్షన్లు సంభవిస్తుంటాయి.  అధికభాగం పురుషులు కొన్ని గాయాల వలన లేక నొప్పిని పురుషాంగములో అనుభవిస్తారు.   పురుషాంగములో నొప్పికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలు వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యము పైన ప్రభావము చూపుతుంది మరియు భాగస్వామితో ఒత్తిడి, ఆందోళన సంబంధమునకు దారితీస్తుంది మరియు వ్యక్తి యొక్క ఆత్మ-విశ్వాసమును  దెబ్బతీస్తుంది.  కొన్ని పరిస్థితులు అనగా పురుషాంగ క్యాన్సర్, అధికముగా చికిత్స చేయబడుచున్ననూ కూడా ఇవి తీవ్రమైన మానసిక పరిణామాలు మరియు భయము మరియు ఆందోళనతో పాటు సామాజిక నిందకు కారణమవుతుంది.  అందువలన ముందుగా సమస్యలను గుర్తించుట అనునది చాలా ముఖ్యమైనది, అంతర్లీన సమస్యను సమర్థవంతముగా నిర్వహించుటను ఇది నిర్ధారిస్తుంది.  కొన్ని పరిస్థితులలో, కారణం స్పష్టముగా ఉంటుంది, అనగా క్రీడా సంబంధమైన గాయాలు మరికొంతమందిలో, పురుషాంగములో నొప్పి అనునది క్రమముగా వృధ్ధి చెందుతుంది, ఇది ఖచ్చితమైన కారణము గుర్తించుటను కష్టతరముగా మారుస్తుంది.

పురుషాంగములో నొప్పి అంటే ఏమిటి?

పురుషాంగములో ఏదైనా నొప్పి లేక అసౌకర్యము అనుభవిస్తుంటే, దానిని పురుషాంగములో నొప్పి లేక పురుషాంగ నొప్పి అని పిలుస్తారు.వనరులు

 1. Douglawi A, Masterson TA. Updates on the epidemiology and risk factors for penile cancer. Translational andrology and urology. 2017 Oct;6(5):785. PMID: 29184774
 2. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Penile Curvature (Peyronie's Disease).
 3. Thomas B. McGregor, John G. Pike, Michael P. Leonard. Pathologic and physiologic phimosis: Approach to the phimotic foreskin. Can Fam Physician. 2007 Mar; 53(3): 445–448. PMID: 17872680
 4. Merck Manual Professional Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Inc.; c2018. Priapism
 5. Urology Care Foundation [Internet]. American Urological Association; What are Prostatitis and Related Chronic Pelvic Pain Conditions?
 6. J. Curtis Nickel. Prostatitis. Can Urol Assoc J. 2011 Oct; 5(5): 306–315. PMID: 22031609
 7. Luzzi G. Male genital pain disorders. Sexual and Relationship Therapy. 2003 May 1;18(2):225-35.
 8. Luzzi GA, Law LA. The male sexual pain syndromes. International journal of STD & AIDS. 2006 Nov 1;17(11):720-6.
 9. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Erectile Dysfunction (ED).
 10. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Alcohol and Public Health
 11. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Human Papillomavirus (HPV)

పురుషాంగం నొప్పి వైద్యులు

Pallavi Tripathy Pallavi Tripathy General Physician
3 वर्षों का अनुभव
Dr Sarath Dr Sarath General Physician
Dr. Mukesh Prajapat Dr. Mukesh Prajapat General Physician
3 वर्षों का अनुभव
Dr. Hitesh Suthar Dr. Hitesh Suthar General Physician
2 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పురుషాంగం నొప్పి కొరకు మందులు

పురుషాంగం నొప్పి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।