స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) - Strep Throat in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 10, 2019

July 31, 2020

స్ట్రెప్ థ్రోట్
స్ట్రెప్ థ్రోట్

స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) అంటే ఏమిటి?

స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) అనేది స్ట్రెప్టోకోకస్ పియోజెనిస్ (Streptococcus pyogenes ) అని పిలవబడే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక సంక్రమణం/ఇన్ఫెక్షన్, ఇది గొంతుక నొప్పి, వాపు మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. ఇది ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేస్తుంది అయినప్పటికీ, పిల్లలలో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • స్ట్రెప్ థ్రోట్ ముందుగా గొంతు నొప్పి మరియు అసౌకర్యంతో  మొదలవుతుంది, ఇది ప్రత్యేకించి మ్రింగుతున్నపుడు లేదా తింటున్నప్పుడు తీవ్రతరం అవుతుంది మరియు దురద కూడా కలుగుతుంది; అయితే, దగ్గు ఉండదు/రాదు.
 • మెడలోని శోషరస కణుపులు (లింఫ్ నొడ్లు) పెరగడం/విస్తరించడంతో పాటు టాన్సిల్స్ యొక్క  వాపు మరియు ఎరుపుదనం.
 • ఈ సంక్రమణ ఫలితంగా జ్వరం మరియు చలి సంభవిస్తాయి.
 • వ్యక్తికి  అలసట, తలనొప్పి మరియు జలుబు కూడా కలుగవచ్చు.
 • ఆకలిలేమి, వికారం, వాంతులు కూడా స్ట్రెప్ థ్రోట్ ఉన్న వ్యక్తులలో కనిపించే ఇతర సాధారణ లక్షణాలు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • గ్రూప్ A స్ట్రెప్టోకోకస్(Streptococcus) కు చెందిన, స్ట్రెప్టోకోకస్ పియోజెనిస్ (Streptococcus pyogenes) అనే బ్యాక్టీరియా వలన స్ట్రిప్ థ్రోట్ సంభవిస్తుంది.
 • దగ్గు లేదా తుమ్ము నుండి వచ్చే బిందువుల ద్వారా ఈ సంక్రమణం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికీ వ్యాపిస్తుంది.
 • ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండడం వలన కూడా స్ట్రిప్ థ్రోట్ సంభవించే ప్రమాదం ఉంది. అంటే వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం లేదా తాకడం వంటివి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

 • స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఇతర సూక్ష్మజీవుల సంక్రమణల/ఇన్ఫెక్షన్ల యొక్క లక్షణాల మాదిరిగానే ఉంటాయి. లక్షణాలు కనిపించిన తర్వాత, బ్యాక్టీరియాను గుర్తించడానికి వైద్యులు రాపిడ్ స్ట్రిప్ పరీక్ష (rapid strep test) అని పిలవబడే ఒక ప్రత్యేక పరీక్షను సూచిస్తారు, దీనిలో గొంతు స్వబును సేకరించి ప్రయోగశాలలో పరిశీలిస్తారు.
 • సంక్రమణ తనిఖీ కోసం మరియు ఏ ఇతర ప్రధాన ఆరోగ్య సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి రక్త పరీక్ష కూడా నిర్వహించబడుతుంది.

చికిత్స:

 • స్ట్రెప్ థ్రోట్ సంక్రమణల, ప్రాధమిక చికిత్స యాంటీబయాటిక్స్ ద్వారా ఉంటుంది. రోగి శరీరం నుండి  బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించడానికి యాంటిబయోటిక్ యొక్క ఏ మోతాదును విడిచిపెట్టరాదు (మందుల మోతాదును పూర్తిగా వాడాలి).
 • నొప్పి లేదా జ్వరం ఉన్నట్లయితే, అనాల్జేసిక్ (analgesic) మరియు యాంటిపైరెటిక్ (antipyretic) మందులు కూడా ఇవ్వబడతాయి.
 • మందుల యొక్క మోతాదును పూర్తిగా వాడకపోతే మళ్ళి స్ట్రెప్ థ్రోట్ సంభవించే ప్రమాదం ఉంటుంది లేదా మందులకు వ్యతిరేకంగా బాక్టీరియా నిరోధకతను (resistance) అభివృద్ధి చేసుకుంటుంది.వనరులు

 1. Kalra MG, Higgins KE, Perez ED. Common Questions About Streptococcal Pharyngitis. Am Fam Physician. 2016 Jul 1;94(1):24-31. PMID: 27386721
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Strep Throat
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Strep throat
 4. National Institute of Allergy and Infectious Diseases [Internet] Maryland, United States; Group A Streptococcal Infections.
 5. healthdirect Australia. Strep throat. Australian government: Department of Health
 6. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Streptococcal infection - group A

స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) కొరకు మందులు

స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।