myUpchar Call

శృంగార సమయంలో నొప్పి లేదా డైస్పరేనియా అనేది లైంగిక సంభోగ సమయంలో స్త్రీ జననేంద్రియ నొప్పిని అనుభవించే పరిస్థితి. ఇది స్త్రీ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డిస్పెరేనియా యొక్క ప్రాబల్యం రేటు అధికంగా ఉంది, ఇది గణనీయమైన ఆర్థిక మరియు ఆరోగ్య భారాన్ని కలిగిస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు (వైద్యులు) దీని గురించి విచారించకపోవడం లేదా సిగ్గు కారణంగా మహిళలు దానిని ఎప్పుడూ వైద్యులకి నివేదించకపోవడం వల్ల సాధారణంగా డిస్స్పరేనియా లక్షణాలు  పైకి తెలియబడవు. ఆరోగ్య పరిస్థితులు, స్త్రీ జననేంద్రియ సమస్యలు, మందులు మరియు సామాజిక నమ్మకాలు వంటి అనేక అంశాలు స్త్రీ లైంగిక రుగ్మతల యొక్క అధిక ప్రాబల్యానికి దారితీశాయి. సెక్స్ సమయంలో నొప్పి, సాధారణమైనప్పటికీ, తరచుగా ఇది నిర్లక్ష్యం చేయబడే సమస్య. ప్రపంచ జనాభాలో 3% నుండి 18% మందిలో వరకు ఇది కనిపిస్తుంది.

డిస్స్పరేనియాతో బాధపడుతున్న మహిళలు తమ భాగస్వామి మరియు కుటుంబం నుండి సహకారం లేకపోవడం వల్ల మానసిక ఒంటరితనాన్ని అనుభవిస్తారు. శృంగార సమయంలో నొప్పి అనేది శృంగారంపై ఆసక్తి మరియు లైంగిక ప్రాధాన్యతల వంటి విషయాల పై కూడా ఆధారపడి ఉంటుందని నివేదించబడింది. ఇటువంటి అంశాలు లైంగిక భాగస్వామితో సరైన సంభాషణ లేకపోవడం అనే విషయాలతో బలంగా సంబంధం కలిగి ఉంటాయి. తగినంత ఫోర్ ప్లే లేకపోవడం, లూబ్రికేషన్ తగినంతగా లేకపోవడం మరియు బిగుతుదనం వంటివి తరచుగా బాధాకరమైన లైంగిక చర్యతో ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు, కటి భాగపు పరీక్ష లేదా స్పెక్యులం (speculum) పరీక్ష నొప్పిని పెంచుతాయి. రోగ నిర్ధారణ ప్రధానంగా వైద్య పరీక్ష ఆధారంగా ఉంటుంది మరియు వివరణాత్మక ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు శారీరక పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. డైస్పరేనియాకు దారితీసే అంతర్లీన ఆరోగ్య సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి పూర్తిగా ఇమేజింగ్ పరీక్షలు అవసరం కావచ్చు. తగిన చికిత్స కోసం శారీరక మరియు/లేదా మానసిక కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. చికిత్సలో సైకాలాజిస్ట్ లేదా లైంగిక ఆరోగ్య సలహాదారు (sexual health counsellor), వివాహ సలహాదారుతో కౌన్సెలింగ్, భాగస్వామితో ఉండే సఖ్యతను మెరుగుపరచడం మరియు శారీరక కారణాలకు చికిత్స చేయడం వంటివి ఉంటాయి.

అక్షరాస్యత రేటు పెరిగినప్పటికీ, భారతదేశంలో సెక్స్ ఇప్పటికీ ఒక నిషిద్ధంగా విషయంగా పరిగణించబడుతుంది. చాలా మందికి లైంగిక పరిజ్ఞానం లేదు మరియు అలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికిత్స కూడా తీసుకోరు. ప్రతి వ్యక్తి తమ భాగస్వామితో ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది వివాహం బంధంలోని ముఖ్య అంశాలలో ఒకటి.

 1. డిస్పెరేనియా (సెక్స్ సమయంలో నొప్పి) అంటే ఏమిటి - What is Dyspareunia (pain during sex) in Telugu
 2. డిస్స్పరేనియా రకాలు - Types of Dyspareunia in Telugu
 3. శృంగార సమయంలో నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Pain during sex in Telugu
 4. శృంగార సమయంలో నొప్పికి కారణాలు - Causes of Pain during sex in Telugu
 5. డిస్స్పరేనియా నివారణ - Prevention of Dyspareunia in Telugu
 6. డిస్స్పరేనియా నిర్ధారణ - Dyspareunia diagnosis in Telugu
 7. శృంగార సమయంలో నొప్పికి చికిత్స - Treatment for Pain during sex in Telugu
 8. డిస్స్పరేనియా యొక్క రోగ సూచన మరియు సమస్యలు - Prognosis and complications of Dyspareunia in Telugu
శృంగార సమయంలో నొప్పి వైద్యులు

డైస్పరేనియా అనేది లైంగిక సంభోగ సమయంలో లేదా ఏదైనా లోపలికి  చొచ్చుకు వెళ్లే లైంగిక చర్య సమయంలో రహస్య (అంతర్గత) భాగాలలో నిరంతర లేదా పునరావృత నొప్పి. ఇది సాధారణంగా మహిళల్లో కనిపిస్తుంది కానీ, చాలా అరుదుగా, మగవారిలో కూడా నొప్పి లక్షణాలు నివేదించబడ్డాయి.

లైంగిక జీవితం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక, సామాజిక మరియు మానసిక పరిస్థితులతో పాటు వారి భాగస్వామి వలన కూడా ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు, ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం, ఇది చికిత్సను మరింత కష్టతరం చేస్తుంది. ఈ కారణాలు సరిగ్గా అర్థంకాబడలేదు మరియు తరచూ సంక్లిష్టంగా ఉంటాయి. ఈ రోజు వరకు, బాధాకరమైన శృంగారానికి సంబంధించిన అన్ని అధ్యయనాలు చిన్న చిన్న సమూహాలపై మాత్రమే జరిగాయి, మరియు చాలా సందర్భాలలో మహిళలు వీటి గురించి పైకి చెప్పకపోవడం వలన పరిశోధనలు ఎక్కువగా జరుగలేదు. అందువల్ల, ఇటువంటి అధ్యయనాలు మొత్తం జనాభాను  సూచించవు. 26-30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న బాగా చదువుకున్న మహిళల్లో స్త్రీ లైంగిక రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయని నివేదించబడింది.

Delay Spray For Men
₹349  ₹499  30% OFF
BUY NOW

డిస్స్పరేనియా రకాలు ఈ విధంగా ఉంటాయి:

 • ప్రాథమిక డిస్స్పరేనియా 
  శరీరక నిర్మాణ సంబంధమైన లోపాలు లేదా పునరుత్పత్తి అవయవాల సమస్యల వల్ల ఇది సంభవిస్తుంది మరియు శృంగార చర్య సమయంలో అనుభవించబడుతుంది. జనైటల్ హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్, పుట్టుకతో వచ్చే లోపాలు, యోని ద్వారం ఇరుకుగా ఉండడం, యోని కణజాల విచ్ఛిన్నం వంటి సమస్యల వల్ల ఇది సంభవించవచ్చు.
 • సెకండరీ డిస్స్పరేనియా
  ఈ రకం కటి భాగం యొక్క వ్యాధులతో ముడిపడి ఉంటుంది మరియు లోతైన ఒత్తిడి చర్యల  సమయంలో నొప్పి ఉంటుంది. ఇది సాధారణంగా గర్భాశయం యొక్క ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లేదా అండాశయాల లోపాలు వంటి కొన్ని పరిస్థితులలో కనిపిస్తుంది.
 • సూపర్ఫిషియాల్ డిస్స్పరేనియా
  సూపర్ఫిషియాల్ డిస్స్పరేనియాలో, సెక్స్ చేస్తున్నప్పుడు యోని ద్వారం మరియు చుట్టూ నొప్పి ఉంటుంది. (మరింత చదవండి - యోని నొప్పి కారణాలు మరియు చికిత్స)
 • డీప్ డిస్స్పరేనియా
  శృంగార సమయంలో కటి ప్రాంతంలో నొప్పి ఘాడంగా (అధికంగా) అనుభవించినప్పుడు దానిని డీప్ డిస్పెరేనియా అంటారు. ఇది సాధారణంగా గర్భాశయం లేదా సెర్విక్స్ లో ఉంటుంది. ఇది లైంగిక సంభోగం తర్వాత కొన్ని గంటల వరకు కూడా నొప్పి ఉంటుంది.

లైంగిక చర్య సమయంలో నొప్పి అనేదే ఒక ప్రాథమిక లక్షణం. దీనితో పాటు:

 • శృంగార సమయంలో మంట, చిరిగిపోయిన మరియు కారుతున్న సంచలనాలు.
 • యోనిలో లేదా ఏదైనా కటి భాగంలో నొప్పి.
 • పెనిట్రేషన్ (అంగంలోపలికి పెట్టె సమయం) లో లేదా ఒత్తిడి సమయంలో నొప్పి.

ఇటువంటి అనుభూతులు సాన్నిహిత్యంగా ఉండే సమయాలలో లైంగిక ప్రేరేపణ మరియు ఆనందాన్ని తగ్గిస్తాయి. యోని యొక్క విస్తరణ మరియు లూబ్రికెషన్  తగ్గడం కూడా నొప్పికి దారితీస్తాయి.

కారణాలు

డిస్స్పరేనియా యొక్క కారణం నొప్పి యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది, అంటే అది పైపైన  లేదా లోతుగానా అనే దాని బట్టి ఉంటుంది.

మహిళల్లో డిస్స్పరేనియా 

 • ఉపరితల నొప్పి (Superficial pain)
  • తగినంత లూబ్రికెషన్ లేకపోవడం 
   బాధాకరమైన లైంగిక చర్యకు ఒక కారణం ఏమిటంటే, లూబ్రికెషన్ కు  అవసరమైన ద్రవాలను యోని స్రవించదు. తగినంత లూబ్రికెషన్ లేని కారణంగా, యోని పొడిగా అనిపిస్తుంది మరియు అందువల్ల, అంగం చొచ్చుకువెళ్లడం బాధాకరంగా మారుతుంది. ఫోర్‌ప్లే సరిపోకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ, మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయి, దీనివల్ల యోని యొక్క పొర పొడిగా మరియు పలుచగా మారుతుంది. చనుబాలిచ్చే సమయంలో కూడా, ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల యోని పొడిగా మారుతుంది.
  • మందులు
   అలెర్జీలు, అధిక రక్తపోటు, మత్తుమందులు మరియు జనన నియంత్రణ కోసం మందుల వాడకం వంటివి యోని పొడిబారడం వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి  తద్వారా లైంగిక చర్యను బాధాకరమైన అనుభవంగా మారుస్తాయి.
  • సున్నితత్వం పెరిగడం 
   జననేంద్రియాల యొక్క అధికమైన సున్నితత్వం నొప్పికి దారితీస్తుంది. వెజైనిస్మస్ (Vaginismus), యోని కండరాల యొక్క అసంకల్పిత సంకోచం. ఇది కూడా బాధాకరమైన శృంగారానికి దారితీస్తుంది.
  • సంక్రమణ మరియు గాయం
   జనైటల్ హెర్పెస్ లేదా బార్తోలిన్ గ్రంథుల [Bartholin glands](యోని ద్వారానికి ఇరువైపులా ఉన్న చిన్న గ్రంథులు) సంక్రమణ , మరియు వాపు మరియు మూత్ర మార్గము యొక్క సంక్రమణ బాధాకరమైన సంభోగానికి కారణం కావచ్చు. జననేంద్రియాల చుట్టూ తామర (కాంటాక్ట్ డెర్మటైటిస్) వంటి చర్మ సమస్యలు కూడా డిస్స్పరేనియాకు దారితీయవచ్చు. వజైనల్ వాష్ లను ఉపయోగించడం, యోని మీద నీటిని అధికంగా ఉపయోగించి శుభ్రంచేయ్యడం మరియు పెర్ఫ్యూమ్ సబ్బులు వాడటం వల్ల జననేంద్రియ ప్రాంతంలో చికాకు, మంట మరియు నొప్పి కూడా వస్తుంది. ప్రమాదాలు మరియు శస్త్రచికిత్సల వల్ల జననేంద్రియ అవయవాలకు గాయాలు, ప్రసవ సమయంలో చేసిన కోత వంటివి (దీనిని ఎపిసియోటమీ [episiotomy] అంటారు) సెక్స్ సమయంలో కూడా నొప్పిని కలిగిస్తాయి. వల్వోడెనియా (వల్వా చుట్టూ నొప్పి) వంటి సమస్యలు కూడా బాధాకరమైన శృంగారానికి ఒక సాధారణ కారణం.
  • అలర్జీలు
   జెల్లీలు లేదా ఇతర రకాల గర్భనిరోధక ఫోమ్లు మరియు క్రీమ్లు లేదా లేటెక్స్ కండోమ్‌లకు అలెర్జీ ఉండడం అనేది కూడా సంభోగాన్ని బాధాకరంగా చేస్తుంది.
  • జనన లోపాలు
   జనన లోపాలు, పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలు అని కూడా అంటారు, యోని లోపల అడ్డంకి ఉండడం, యోని యొక్క అసంపూర్ణ నిర్మాణం లేదా యోని ద్వారాన్ని అడ్డుకునే పొర (రంధ్రము లేని హైమెన్) వంటివి బాధాకరమైన శృంగారానికి దారితీయవచ్చు.
 • లోతైన నొప్పి (Deep pain)
  అంగం లోతుగా చొచ్చుకుపోయేటప్పుడు లోతైన నొప్పి కలుగుతుంది. ఈ క్రింద ఇవ్వబడినటువంటి వంటి కొన్ని పరిస్థితులలో నొప్పి తీవ్రమవుతుంది:
  • అస్వస్థత
   లైంగిక సంక్రమణ వ్యాధులు, ఫైబ్రాయిడ్లు, తిత్తులు (సిస్ట్ లు), కణితులు, గర్భాశయం సాగిపోవడం (గర్భాశయంలోని ఒక భాగం యోనిలోకి నొప్పికి దారితీసినప్పుడు), ఎండోమెట్రియోసిస్ (ఫెలోపియన్ గొట్టాలు మరియు అండాశయాలు వంటి ఇతర అవయవాలలో గర్భాశయ పొర యొక్క పెరుగుదల), పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (గర్భాశయ ద్వారం మరియు ఫెలోపియన్ గొట్టాలు యొక్క ఇన్ఫెక్షన్లు సంభోగ సమయంలో నొప్పిని కలిగిస్తాయి), ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ప్రేగు యొక్క సున్నితత్వం మరియు వాపు పెరగడం), మొలలు మరియు రెట్రోవర్టెడ్ గర్భాశయం (గర్భాశయం వెనుకకు వంపుతిరిగి ఉండడం) ఇవన్నీ శృంగార సమయంలో మరియు/లేదా తరువాత తీవ్ర నొప్పికి దారితీస్తాయి.
  • చికిత్సలు లేదా శస్త్రచికిత్సా విధానాలు
   శస్త్రచికిత్సా విధానాల ఫలితంగా ఏర్పడే మచ్చలు/గాయాలు ఇబ్బందికి దారితీయవచ్చు లేదా గర్భాశయం, మూత్రాశయం మరియు మూత్రపిండాల వంటి కటి ప్రాంతంలోని భాగాల క్యాన్సర్లకు రేడియేషన్ చికిత్స చేయడం అనేది బాధాకరమైన సంభోగానికి దారితీస్తుంది.
  • మానసిక కారణాలు
   నిరాశ, ఆందోళన, అపరాధం, సిగ్గు, ఇబ్బంది, శారీరక స్వరూపం గురించి చింత, సాన్నిహిత్య మరియు సంబంధం లేదా వైవాహిక జీవితంలో సమస్యల గురించి ఆందోళన చెందడం వంటివి లైంగిక కోరిక తగ్గిపోవడానికి దారితీస్తాయి. భాగస్వామి యొక్క లైంగిక సమస్యలు కూడా సెక్స్ సమయంలో స్త్రీని ఆందోళనకు గురి చేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. కావలసిన స్థాయి సెక్స్ లేదనే చిన్న అసమతుల్యత కూడా మహిళల్లో లైంగిక ప్రతిస్పందనలను మారిపోవడానికి దారితీస్తుంది, అది సంభోగాన్ని బాధాకరంగా చేస్తుంది. శస్త్రచికిత్స చేయించుకున్న స్త్రీలలో శరీరం కొద్దిగా మారవచ్చు ఇది వారిలో లైంగిక కోరికను తగ్గించవచ్చు. క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం మరియు థైరాయిడ్ వ్యాధులు వంటి కొన్ని వైద్య సమస్యలు కూడా లైంగిక ప్రతిస్పందనలను మారుస్తాయి మరియు అందువల్ల శృంగారం బాధాకరంగా ఉంటుంది.
  • ఒత్తిడి మరియు మానసిక సమస్యలు
   ఒత్తిడితో కూడిన పరిస్థితిలో, కటి భాగంలోని కండరాలు సంకోచించి బిగుతుగా మారతాయి. ఇది సంభోగం సమయంలో నొప్పికి దారితీస్తుంది.
  • లైంగిక వేధింపుల చరిత్ర
   సాన్నిహిత్య సమయాలలో భావోద్వేగాలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. లైంగిక సంభోగ సమయంలో నొప్పి ప్రతికూల భావోద్వేగ జ్ఞాపకాల (negative emotional memories) ద్వారా ప్రభావితమవుతుంది. అత్యాచారం, ఇతర బాధాకరమైన లైంగిక అనుభవాలు వంటి లైంగిక వేధింపుల చరిత్ర, భాగస్వామి పట్ల కోపం వంటివి నొప్పిని రేకెత్తిస్తాయి. సమ్మతి లేకుండా లైంగిక చర్య చెయ్యడం కూడా నొప్పిని కలిగిస్తుంది.

పురుషులలో డిస్స్పరేనియా

మగవారిలో, బాధాకరమైన లైంగిక చర్య వీటి వలన ప్రేరేపించబడవచ్చు:

 • పురుషాంగానికి  చికాకు (ఇర్రిటేషన్) కలిగించే అలెర్జీలు.
 • ఫోర్‌స్కిన్ (ముందోలు) బిగుతుగా ఉండడం.
 • పురుషాంగం యొక్క నిర్మాణ అసాధారణతలు.
 • ప్రోస్టేట్ గ్రంథి లేదా వృషణాల వ్యాధులు.
 • లైంగిక వేధింపులు.

ప్రమాద కారకాలు

బాధాకరమైన శృంగార అవకాశాలను పెంచే కారకాలు:

 • వయసు
  చిన్న వయసు ఉన్న స్త్రీలలో బాధాకరమైన సెక్స్ సాధారణం, దాదాపు సగం మంది ఆడవారు వారి మొదటి సంభోగ సమయంలో నొప్పిని అనుభవించినట్లు తెలిసింది. మెనోపాజ్ సమయంలో ఉన్న మరియు మెనోపాజ్ జరిగి చాలా సంవత్సరాలు ఐన మహిళల్లో తీవ్రమైన బాధాకరమైన లైంగిక సంభోగం ఎక్కువగా కనిపిస్తుంది.
 • అస్వస్థత
  కొంతమంది వ్యక్తులలో, ఒక నిర్దిష్ట వ్యాధి యొక్క ఉనికిని లైంగిక వాంఛను ప్రేరేపించడంతో సమస్యకు తద్వారా బాధాకరమైన శృంగారానికి దారితీస్తుంది. పురుషులలో అంగస్తంభన లోపం, మధుమేహం మరియు గుండె జబ్బులు వంటి అనారోగ్యాలు కూడా బాధాకరమైన శృంగార ప్రమాదాన్ని పెంచుతాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Oil by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic oil is recommended by our doctors to lakhs of people for sex problems (premature ejaculation, lack of erection in the penis, lack of libido in men) with good results.
Men Massage Oil
₹399  ₹449  11% OFF
BUY NOW

డిస్స్పరేనియాను వీటి ద్వారా నివారించవచ్చు:

 • లైంగిక సంపర్కానికి ముందు సరైన పరిశుభ్రత పాటించడం.
 • లైంగిక సంక్రమణలను నివారించడానికి సురక్షితమైన సెక్స్ ను పాటించడం.
 • నీటి ఆధారిత లూబ్రికెంట్ జెల్లీలను ఉపయోగించడం. పెట్రోలియం జెల్లీని వాడటం నివారించాలి, ఎందుకంటే ఇది నీటిలో కరగదు మరియు యోని ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
 • ప్రసవం జరిగిన ఆరు వారాల తర్వాత లైంగిక సంభోగాన్నితిరిగి ప్రారంభించడం మంచిది. హార్మోన్ల మార్పులు యోని పొడిబారడానికి దారితీయవచ్చు అందువల్ల లూబ్రికెంట్ల ఉపయోగం సిఫార్సు చేయబడుతుంది.
 • భాగస్వామితో మంచి సంభాషణ మరియు శృంగారం గురించిన ఆలోచనల ఒకరితో ఒకరు పంచుకోవాలి.
 • లైంగిక చర్య ముందు యోనిలో తగినంత లూబ్రికేషన్ రావడానికి సహాయపడేందుకు తగినంత ఫోర్ ప్లే అవసరం.

డిస్స్పరేనియా యొక్క రోగ నిర్ధారణ వీటి ద్వారా చేయబడుతుంది:

 • వైద్య చరిత్ర
  వైద్యులు వ్యక్తి యొక్క వివరణాత్మక వైద్య చరిత్రను తెలుసుకుంటారు, అతను/ఆమె అనుభవిస్తున్న నొప్పి, స్థానం, తీవ్రత మరియు లైంగిక భంగిమ గురించి తెలుసుకుంటారు. బహుళ లైంగిక భాగస్వాములు ఉన్న సందర్భంలో, ప్రతి భాగస్వామి వల్ల నొప్పి సంభవిస్తుందా అని వైద్యులు తెలుసుకుంటారు. శస్త్రచికిత్సా విధానాలు, అనారోగ్యాలు, మునుపటి లైంగిక చరిత్ర, ఔషధ అలెర్జీలు, గర్భనిరోధకాలు మరియు ప్రసూతి చరిత్ర గురించి కూడా వైద్యులు అడుగుతారు. ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటం మరియు వివరాలను దాచకుండా నిజాయితీగా సమాధానం ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఈ సమాధానాలు నొప్పికి గల కారణానికి ఆధారాలు ఇస్తాయి.
 • కటి భాగపు పరీక్ష (Pelvic examination)
  మంట, ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా శరీర నిర్మాణ లోపాలను తనిఖీ చేయడానికి వైద్యులు జననేంద్రియ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. నొప్పి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడానికి వైద్యులు జననేంద్రియ ప్రాంతం మీద ఒత్తిడి కూడా కలిగించవచ్చు. యోనిని పరిశీలించడానికి స్పెక్యులం అనే పరికరాన్ని ఉపయోగించవచ్చు. బాధాకరమైన సెక్స్ గురించి ఫిర్యాదు చేసే మహిళలు కటి పరీక్షలో తరచూగా ఉండే తేలికపాటి ఒత్తిడిని కూడా భరించలేరు. సాధారణంగా ఆ సమయంలో పరీక్షను ఆపమని మహిళ వైద్యుడిని అభ్యర్థిస్తుంది. మల పరీక్ష కూడా చేయవచ్చు.
 • పరిశోధనలు (Investigations)
  జననేంద్రియ ప్రాంతానికి సమీపంలో వైద్యులు ఏదైనా అసాధారణత లేదా సంక్రమణను కనుగొంటే, వారు మరింత పరిశోధన కోసం ఒక చిన్న కణజాల నమూనాను తీయవచ్చు. బాధాకరమైన లైంగిక సంభోగం యొక్క ఇతర కారణాల కోసం పెల్విక్ అల్ట్రాసౌండ్ కూడా సూచించబడవచ్చు. ఎండోమెట్రియోసిస్ వంటి లోతైన ఆరోగ్య సమస్యలను నిర్ధారించడానికి హిస్టెరోస్కోపీ (hysteroscopy) లేదా లాపరోస్కోపీ (laparoscopy) వంటి ఇతర ప్రత్యేక పరీక్షలను వైద్యులు సిఫార్సు చేయవచ్చు. బాహ్య పరీక్షల ద్వారా నిర్ధారించలేని అంతర్గత వైద్య పరిస్థితుల కోసం లాపరోస్కోపీ అనే పరీక్షను ఉపయోగిస్తారు దీనిలో సన్నని గొట్టంలో అమర్చిన కెమెరాను ఉదర చర్మం మీద చిన్న కోత కోసి లోపలికి పంపిస్తారు తద్వారా అంతర్గత పరిస్థితిని అంచనా వేస్తారు. హిస్టెరోస్కోపీలో, అసాధారణతలను పరిశీలించడానికి గర్భాశయం లోపలికి కెమెరా పంపబడుతుంది.

డిస్స్పరేనియా చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు వీటిని కలిగి ఉండవచ్చు:

మందులు

 • బాధాకరమైన శృంగారానికి కారణమయ్యే అంటువ్యాధుల కోసం యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ లేదా నిర్దిష్ట మందులు సూచించబడతాయి. కారణాన్ని బట్టి నిర్దిష్ట చికిత్సను సూచించవచ్చు.
 • రుతువిరతి తర్వాత యోని పొడిబారడం నొప్పికి కారణమైతే, టాబ్లెట్ లేదా రింగ్ రూపంలో ఈస్ట్రోజెన్ కలిగిన సమయోచిత యోని క్రీమ్లు ఇవ్వవచ్చు. హార్మోన్ పునస్థాపన (రీప్లేస్మెంట్) చికిత్సను కూడా సూచించవచ్చు. పొడిబారడానికి కారణమయ్యే లేదా నొప్పికి దారితీసే లేదా లైంగిక ప్రతిస్పందనలను తగ్గడానికి కారణమయ్యే మందులను ఉపయోగిస్తుంటే అవి భర్తీ చేయబడతాయి, ఆపివేయబడతాయి లేదా వాటి మోతాదు తగ్గించబడుతుంది.

శస్త్రచికిత్స

తిత్తులు, కురుపులు మరియు శారీరక లోపాలను సరిదిద్దడానికి శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది.

వైద్యేతర చికిత్స (Non-medical treatment)

 • కెగెల్స్ (Kegels) వంటి యోని ఉపశమన (రిలాక్సేషన్) వ్యాయామాలు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
 • సాన్నిహిత్య (ఇంటిమసీ) సమస్యలను మెరుగుపరచడానికి, లైంగిక ఆరోగ్య సలహాదారుని (sexual health counsellor) సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జంటలు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకోవడానికి సహాయపడుతుంది. సెక్సువల్ కౌన్సెలింగ్ నొప్పికి కారణమయ్యే ప్రతికూల భావనల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
 • కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా లైంగిక చర్యకు సంబంధించిన ఆలోచన విధానాలను మార్చడానికి సహాయపడుతుంది.

జీవనశైలి నిర్వహణ

 • జంటలు పరస్పరం లైంగిక ఆనందాన్ని సాధించే మార్గాలను కనుగొనాలి. నోటి ద్వారా పేరేపణ (ఓరల్ స్టిమ్యులేషన్) , చేతులతో పేరేపణ లేదా వైబ్రేటర్ ఉపయోగించడం వంటి మార్గాల ద్వారా దీనిని సాధించవచ్చు.
 • ఉపరితల నొప్పిని తగ్గించడానికి, అనస్తేటిక్ ఆయింట్మెంట్ లేదా సిట్జ్ స్నానాల (వెచ్చని నీళ్లతో జననేంద్రియ భాగాలను శుభ్రం చేసుకోవడం) వాడకం చాలా సహాయపడుతుంది.
 • సంభోగం జరిపే ముందు తగినంత మొత్తంలో లూబ్రికెంట్ జెల్లీని ఉపయోగించండి. పెట్రోలియం జెల్లీకి బదులుగా నీటి ఆధారిత లూబ్రికెంట్లు వాడటం మంచిది, ఎందుకంటే పెట్రోలియం జెల్లీ వల్ల యోని పొడిగా తయారవుతుంది మరియు కండోమ్‌లు, డయాఫ్రాగమ్‌లు మరియు ఇతర గర్భనిరోధక పరికరాలను దెబ్బతింటాయి. పెట్రోలియం జెల్లీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఏవైనా అటువంటి ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు ఉత్పత్తులపై లేబుల్‌లను చదవడం గుర్తుంచుకోండి.
 • ఫోర్ ప్లే యొక్క వ్యవధిని పెంచండి. శరీరంలో ఈస్ట్రోజెన్ విడుదలను ఉత్తేజపరిచేందుకు ఎక్కువ సేపు ఫోర్ ప్లే సహాయపడుతుంది, తద్వారా సరైన లూబ్రికేషన్, మంచి ఉద్రేకం కలుగుతాయి మరియు అంగం చొచ్చుకుపోయేటప్పుడు నొప్పి తగ్గుతుంది. అంగం చొచ్చుకుపోవటం మరియు ఒకేసారి గట్టిగా రాసుకోవడం వంటి వాటి నియంత్రణ కోసం సంభోగం సమయంలో వేర్వేరు భంగిమలలో పాల్గొనండి.

రోగ సూచన

డిస్స్పరేనియా అనేది కారణం మీద ఆధారపడి ఉంటాయి. చికిత్స యొక్క కోర్సును ప్రారంభించడానికి ముందు ప్రతి కేసును పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా, చాలా సందర్భాలలో వైద్య చికిత్స సహాయపడుతుంది. మునుపటి లైంగిక పరమైన గాయాల వలన బాధపడుతున్న వ్యక్తులలో గమనించిన దాని బట్టి, చికిత్స చాలా నెలలు వరకు కొనసాగవచ్చు, అటువంటి వ్యక్తులు పూర్తి నివారణ తర్వాత వారి లైంగిక జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. శారీరక పరమైన కారణం ఏదైనా బాధాకరమైన శృంగారానికి దారితీస్తుంటే, దానిని సరైన వైద్య చికిత్సతో తగించవచ్చు.

సమస్యలు

సాధారణంగా డిస్స్పరేనియా పెద్ద సమస్యలకు దారితీయదు. చాలా తరచుగా, వ్యక్తి యొక్క లైంగిక జీవితం, అలాగే వారి భాగస్వామి యొక్క లైంగిక జీవితం కూడా కలతపడుతుంది మరియు ఇబ్బంది లేదా సామాజిక నింద ఏర్పడుతుందేమో అన్న భయంతో వారు నిపుణుడితో లేదా వైద్యునితో మాట్లాడలేరు. జీవన నాణ్యత తగ్గిపోవడం అనేది శృంగార సమయంలో నొప్పికి గల అతి ముఖ్యమైన సమస్య మరియు ఇది భాగస్వామితో సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది.

Dr. Ashok kesarwani

Dr. Ashok kesarwani

Sexology
12 Years of Experience

Dr. Hemant Sharma

Dr. Hemant Sharma

Sexology
11 Years of Experience

Dr. Zeeshan Khan

Dr. Zeeshan Khan

Sexology
9 Years of Experience

Dr. Nizamuddin

Dr. Nizamuddin

Sexology
5 Years of Experience

వనరులు

 1. Sorensen J, Bautista KE, Lamvu G, Feranec J. Evaluation and Treatment of Female Sexual Pain: A Clinical Review. Cureus. 2018 Mar;10(3). PMID: 29805948
 2. Mishra VV, Nanda S, Vyas B, Aggarwal R, Choudhary S, Saini SR. Prevalence of female sexual dysfunction among Indian fertile females. Journal of mid-life health. 2016 Oct;7(4):154.
 3. Mitchell KR, Geary R, Graham CA, Datta J, Wellings K, Sonnenberg P, Field N, Nunns D, Bancroft J, Jones KG, Johnson AM. Painful sex (dyspareunia) in women: prevalence and associated factors in a British population probability survey. BJOG: An International Journal of Obstetrics & Gynaecology. 2017 Oct 1;124(11):1689-97.
 4. MSDmannual Professional version [internet].Dyspareunia. Merck Sharp & Dohme Corp. Merck & Co., Inc., Kenilworth, NJ, USA
 5. MSDmannual Consumer Version [internet].Dyspareunia. Merck Sharp & Dohme Corp. Merck & Co., Inc., Kenilworth, NJ, USA
 6. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; When Sex Is Painful
Read on app