మతిమరుపు - Amnesia in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 21, 2018

March 06, 2020

మతిమరుపు
మతిమరుపు

మతిమరపు అంటే ఏమిటి?

మనము సాధారణంగా కొన్ని మర్చిపోతూఉంటం లేకపోతే గందరగోళంగా కొన్ని విషయాలను తప్పుగా గుర్తుపెట్టుకుంటాం. ఇది సమాచారం ఎక్కువ అయినప్పుడు, ఒత్తిడి, కలవరం లేదా ఇతర కారణాల వల్ల జరుగుతుంది.కానీ ఇది ఆరోగ్య సమస్యల కారణంగా సంభవించినప్పుడు, వాస్తవాలు, అనుభవాలు మరియు సమాచారం వంటి మర్చిపోతున్నపుడు అది మతిమరుపు (ఆమ్నెసియా) గా పిలవబడుతుంది.

మతిమరుపు (ఆమ్నేసియా) ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మతిమరుపుతో బాధపడుతున్న ప్రజలుకు తామ గురించి మరియు వారి పరిసరాల గురించి తెలుస్తుంది, కానీ కొత్త సమాచారంతో బాధపడుతుంటారు. మతిమరుపు యొక్క ప్రధాన రకాలు కూడా పరిస్థితి యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి:

 • అంటేరోగ్రేడ్ (Anterograde) మతిమరువు (ఆమ్నేసియా)
  ఈ రకమైన మతిమరపులో, క్రొత్త సమాచారాన్ని గుర్తించడం మరియు గుర్తుంచుకోవడం కష్టం.
 • రెట్రోగ్రేడ్ (Retrograde)మతిమరువు (ఆమ్నేసియా)
  ఇది గత/పాత అనుభవాలు మరియు సమాచారం గుర్తుచేసుకోవడంలో కష్టంగా ఉంటుంది.

ఇతర లక్షణాలు:

 • స్థితి భ్రాంతి
 • తప్పుడు జ్ఞాపకాలు, అనగా, జ్ఞాపకాలను తప్పుగా గుర్తుతెచ్చుకుని,నిజమని నమ్మేవారు.

ప్రధాన కారణాలు ఏమిటి?

జ్ఞాపకం అనేది మెదడు యొక్క ఒక విధి. మెదడులోని ఏదైనా భాగం, ముఖ్యంగా థాలమస్, హిప్పోకాంపస్ లేదా ఇతర సంబంధితఅవయవాలు, జ్ఞాపకాలు మరియు భావోద్వేగాలకు బాధ్యత వహించేవి ప్రభావితం ఐతే, అది మతిమరుపుకి దారితీస్తుంది. ఆ కారణాలలో కొన్ని:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మతిమరుపు కోసం తనిఖీ చేయటానికి ఒక వివరణాత్మక పరీక్ష చేయబడుతుంది మరియు ఇది చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి వంటి ఇతర రుగ్మతల నుండి వేరు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వాటిని ఈ క్రింద చూడవచ్చు:

 • జ్ఞాపకశక్తి తగ్గుదల, దాని పురోగతి, ప్రేరేపకాలు, కుటుంబ చరిత్ర, ప్రమాదాలు మరియు క్యాన్సర్ లేదా నిరాశ, ఆకస్మిక మతిమరుపు వంటి పూర్వ వైద్య సమస్యల తనిఖీ కోసం ఒక వివరణాత్మకమైన ఆరోగ్య చరిత్ర గురించి వైద్యులు తెలుసుకుంటారు. వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి సరిగాలేనందున, సన్నిహిత కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు వైద్య సంప్రదింపు సమయంలో పాల్గొంటారు.
 • ప్రతిచర్యలు (reflexes), సమతుల్యత, జ్ఞాన ప్రక్రియలు మరియు నాడీ వ్యవస్థ మరియు మెదడు యొక్క ఇతర విధులు తెలుసుకోవడం కోసం భౌతిక పరీక్ష.
 • దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి తగ్గుదల, తీర్పు, ఆలోచన మరియు ప్రక్రియలు యొక్క సాధారణ సమాచారం కోసం పరీక్షలు.
 • అంటువ్యాధులు, ఆకస్మిక మతిమరుపు లక్షణాలు మరియు మెదడు నష్టం కోసం పరీక్షలు.

దాదాపు అన్ని సందర్భాల్లో, మతిమరపు నుంచి పూర్తిగా పూర్వస్థితికి చేరుకోలేము లేదా పాక్షికంగా తిరిగి చేరుకోవచ్చు. పూర్తి చికిత్స సాధ్యం కానందున ఈ పరిస్థితి యొక్క నిర్వహణ అనేది కీలకం ఉంది. తరచుగా ఉపయోగించే చికిత్స వ్యూహాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 • వృత్తి చికిత్స (occupational therapy) అనేది వ్యక్తులకి కొత్త సమాచారంతో వ్యవహరించేందుకు సహాయపడటానికి వ్యూహాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది మరియు ఇప్పటికే ఉన్న సమాచారాన్ని మరియు జ్ఞాపకాలను ఉపయోగించి వారి అనుభవాలను నిర్మించడానికి సహాయపడుతుంది.
 • మతిమరపు ఉన్నవారికి కొత్త టెక్నాలజీని ఉపయోగించడం నేర్పిస్తే అది వారి రోజువారీ కార్యకలాపాలను మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో ఫోన్లు, కొత్త వస్తువుల ఉపయోగం ఉంటుంది.
 • పోషకాహార అవసరాలను క్రమబద్ధీకరించడానికి మందులు మరియు ఏవైనా ఇతర అంశాలకు చికిత్స చేయడం వలన పరిస్థితి యొక్క మరింత క్షీణతను నివారించవచ్చు.వనరులు

 1. American Occupational Therapy Association. Dementia and the Role of Occupational Therapy. [internet]
 2. D Owen et al. Postgrad Med J. 2007 Apr; 83(978): 236–239. PMID: 17403949
 3. Department of Health & Human Services, Amnesia. State Government of Victoria, Australia. [internet]
 4. Richard J. Allen. Classic and recent advances in understanding amnesia. Version 1. F1000Res. 2018; 7: 331. PMID: 29623196
 5. Health On The Ne. Amnesia. [internet]

మతిమరుపు వైద్యులు

Dr. Hemanth Kumar Dr. Hemanth Kumar Neurology
3 वर्षों का अनुभव
Dr. Deepak Chandra Prakash Dr. Deepak Chandra Prakash Neurology
10 वर्षों का अनुभव
Dr Madan Mohan Gupta Dr Madan Mohan Gupta Neurology
7 वर्षों का अनुभव
Dr. Virender K Sheorain Dr. Virender K Sheorain Neurology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మతిమరుపు కొరకు మందులు

మతిమరుపు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।