గర్భవతుల్లో రక్తహీనత - Anemia in Pregnancy in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

March 06, 2020

గర్భవతుల్లో రక్తహీనత
గర్భవతుల్లో రక్తహీనత

గర్భవతుల్లో రక్తహీనత అంటే ఏమిటి?

అభివృద్ధి చెందుతున్న దేశాలలో రక్తహీనత అనేది సాధారణమైనది. గర్భధారణ సమయంలో, పెరుగుతున్న పిండానికి, అలాగే తల్లికి తగినన్ని పోషకాలను మరియు ఆక్సిజన్ను అందించడానికి అధిక రక్త ఉత్పత్తి అవసరం. అదనం రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అధిక శాతంలో ఇనుము (హేమోగ్లోబిన్ ఏర్పడటానికి అవసరమైనది) మరియు ఇతర పోషకాలు అవసరమవుతాయి. శరీరానికి అవసరమైనంత ఇనుము మరియు ఇతర పోషకాలు లేనట్లయితే, ఈ అదనపు అవసరం నెరవేర్చబడదు, ఫలితంగా గర్భధారణ సమయంలో గర్భసంబంధమైన రక్తహీనత లేదా రక్తహీనత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి సాధారణంగా తేలికపాటిదే కానీ కొన్నిసార్లు తీవ్ర రూపందాల్చుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం గర్భధారణ సమయంలో తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ (Hb <11g / dL) ఉంటే దానిని గర్భాధారణ రక్తహీనత అని పిలుస్తారు. గర్భధారణ సమయంలో రక్తహీనత నెలతక్కువ పుట్టుక, తక్కువ బరువుతో బిడ్డ పుట్టుట మరియు తల్లి మరణానికి కూడా కారణమవుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రక్తహీనత యొక్క సాధారణ లక్షణాలు:

ప్రధాన కారణాలు ఏమిటి?

గర్భవతుల్లో రక్తహీనత సాధారణంగా ఇనుము తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, పుండ్లు, ఋతుచక్రాలలో లేదా గర్భధారణ ముందు అధిక రక్తస్రావం, రక్తం దానం చేసిన తర్వాత ఉత్పత్తి శాతం కంటే తక్కువగా ఎర్రరక్త కణాల స్థాయి పడిపోయినప్పుడు రక్తహీనత సంభవించవచ్చు. రక్తహీనత యొక్క అత్యంత సాధారణ కారణాలు ఇనుము-లోపం మరియు ఫోలిక్ యాసిడ్ లోపం. పెరిగిన ప్లాస్మా వాల్యూమ్ (రక్త కణాలు కలిగి ఉన్న గడ్డి రంగు జిగట ద్రవం) కు అనుగుణంగా ఎర్ర రక్త కణం ఉత్పత్తి యొక్క అదనపు అవసరం (రక్తంలోని కణాల భాగం - RBCs) కారణంగా గర్భధారణ స్వయంగా రక్తహీనతకు కారణమవుతుంది.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

రోగనిర్ధారణ సాధారణంగా మహిళ యొక్క లక్షణాలు మీద ఆధారపడి ఉంటుంది, కానీ గర్భధారణ సమయంలో, ఏ దశలోనైనా, పూర్తి రక్త గణన (complete blood count) (CBC) పరీక్ష హేమోగ్లోబిన్ (Hb) స్థాయిలను పరీక్షించటానికి తప్పనిసరి. Hb స్థాయి, సాధారణంగా 10-11g / dL కంటే తక్కువగా ఉంటే, రక్తహీనతగా భావిస్తారు. ఇది సాధారణంగా తేలికపాటిది. ఒక స్త్రీ రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, వెంటనే మీన్ కార్పస్కులర్ వాల్యూమ్ (mean corpuscular volume) (MCV) పరీక్ష అవసరమవుతుంది. సీరం ఫెర్రిటిన్(serum ferritin) (ఇనుము) యొక్క కొలత, హేమోగ్లోబినోపెతిస్ (haemoglobinopathies) (హెమోగ్లోబిన్ అణువుల యొక్క రుగ్మత) గురించి తెలుసుకోవడానికి హేమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్ (haemoglobin electrophoresis), సీరం ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ B12 స్థాయిలు కొలవడం వంటివి ఈ MCV పరీక్ష లోనే ఉంటాయి.

చికిత్స సాధారణంగా అంతర్లీన కారణం పై ఆధారపడి ఉంటుంది. ఐరన్ మరియు విటమిన్ అనుబంధకాలు చికిత్సచేయడానికి సూచించబడతాయి. ఐరన్- మరియు ఫోలేట్ అధికంగా ఉండే ఆహార విధానాన్ని హేమోగ్లోబిన్ స్థాయిలలో వేగంగా అభివృద్ధి చేయటానికి సూచించవచ్చు. అంతే కాకుండా, అరుదైన మరియు తీవ్రమైన కేసులలో వైద్యుల సలహా ప్రకారం రక్తాన్ని ఎక్కించే అవసరం పడవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహరం యొక్క ఉదాహరణలు - మాంసం, గుడ్లు, ఆకు కూరలు, గింజలు, కాయధాన్యాలు, బీన్స్ మరియు టోఫు. విటమిన్ సి మరింత ఇనుము యొక్క మరింత శోషణను సులభతరం చేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు నారింజ, టమోటాలు, స్ట్రాబెర్రీలు, కివిపళ్ళు మరియు బెల్ మిరియాలు వంటి సిట్రస్ పండ్లు.వనరులు

  1. American Pregnancy Association. Anemia During Pregnancy. [internet]
  2. J.B.Sharma, Meenakshi Shankar. Anemia in Pregnancy. JIMSA October - December 2010 Vol. 23 No. 4. [internet]
  3. OA Idowu. Anaemia in pregnancy: A survey of pregnant women in Abeokuta, Nigeria. Afr Health Sci. 2005 Dec; 5(4): 295–299. PMID: 16615838
  4. Lara A. Friel. Anemia in Pregnancy. University of Texas Health Medical School at Houston. Manual Professional Version. [internet]
  5. National Institute of Health and Family Welfare. Anaemia during pregnancy (Maternal anemia). Health and Family Welfare. [internet]

గర్భవతుల్లో రక్తహీనత కొరకు మందులు

గర్భవతుల్లో రక్తహీనత के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।