myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

అరటిపండ్ల గురించి ప్రాసభరితమైన పాటలు మరియు ఆసక్తికరమైన కథలు పిల్లలకోసమని చాలానే రచింపబడ్డాయి. ఈ రుచికరమైన మరియు పుష్టికరమైన పండ్లు పచ్చని ఆకులతో కూడిన అరటి చెట్టుకు కాస్తాయి. ఆంగ్లంలో అరటిపండును “బనానా” (బనానా) అంటారు. ఈ బనానా అనే పదాన్ని అరబిక్ పదమైన "బనాన్" నుండి తీసుకోబడింది.బనాన్ అంటే వేలికొనలు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అరటిపండ్లు పండుతాయి, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అరటి తోటలు విరివిగా కనిపిస్తాయి. అరటి పండ్ల కొరకే ఎక్కువగా అరటి మొక్కల్ని (పిలకల్ని) నాటి పంట పండిస్తారు; వృక్షశాస్త్రపరంగా ఈ అరటి ఓ రకమైన బెర్రీ లేక ‘మృదుఫలం.’ కొన్ని అరటి రకాల్ని కేవలం అలంకారం కోసం లేదా వాటి నార కోసం పండిస్తారు, ఇలాంటి రకాల అరటి చెట్లు చాలా బలంగా ఉంటాయి. సుమారు 110 వివిధ రకాల అరటి జాతులు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి మరియు వాణిజ్యం ప్రకారం, "అరటి" ని సాధారణంగా “మృదు మధుర ఫలం” గా సూచించబడుతుంది, అంటే తీపిరుచితో కూడిన మెత్తని పండు అని అర్థం. అందువల్ల, అరటిని భోజనానంతరం తినే ‘ఫలహార అరటి పండ్లు’ (డెజర్ట్ అరటి) అని కూడా పిలుస్తారు. ఈ పండ్ల యొక్క ఇతర వృక్షరకాలు ఇచ్చే పండ్లు గట్టిగాను మరియు గంజి-గంజిగా (starchier) ఉండే అరటి పండ్లను కాస్తాయి. వీటినే  సాధారణంగా “అరటి” చెట్లుగా పిలుస్తారు. పచ్చి అరటి కాయలను, అరటి చెట్టు భాగాల్ని ఎక్కువగా వంటలు, కూరలు వండడానికి ఉపయోగిస్తారు లేదా అరటి చెట్ల నుండి లభించే నార కోసం కూడా అరటిని పండిస్తారు.

అరటి బూడిదను ఉపయోగించి సబ్బులు తయారు చేస్తున్నారు. ఆసియాలో, నీడలో పెరిగే కొన్ని మొక్కలకోసం తన వెడల్పాటి ఆకులతో మంచి నీడను కల్పించే అరటి చెట్లను ఉపయోగించడం జరుగుతోంది. అలా అరటి చెట్ల నీడలో పెరిగే పంట రకాలేవంటే కోకోవ, కాఫీ, నల్ల మిరియాలు మరియు జాజికాయ తదితరాలు. అరటి యొక్క ఈ నీడనిచ్చే కారణంగానే, ఇతర పంటల తోటల్లో (plantations) అరటి చెట్లను కూడా మనం  చూడవచ్చు.

అరటి మొక్క పచ్చని ఆకులతో కూడిన అతిపెద్ద పుష్పించే చెట్టుగా లెక్కించబడింది. అందువలన, అరటి చెట్లను తరచుగా మాన్లు (trees) గా పొరబాటుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పండని అరటికాయలు ఎప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పచ్చి అరటి కాయలు ఎప్పుడూ  పసుపు రంగులో ఉండే పండిన అరటి పండ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. పచ్చిఅరటికాయ మాగి పసుపు రంగులోకి లేదా ఎర్రటి రంగులోకి మారుతుంది. అరటి ఆకు నిర్మాణం మెలికెలు కలిగి ఆకు పెద్దగా ఉంటుంది, మరియు ఆకు 2.65 మీటర్ల పొడవు మరియు 60 సెంమీ వెడల్పు పెరుగుతుంది. గట్టిగా వీచే గాలికి సులభంగా చిరిగిపోగలవు కూడా, అందుకే ఒకింత ముదిరిన అరటి ఆకులు చిరిగి చీలికల రూపంలో (frayed) కనబడతాయి.

ప్రపంచవ్యాప్తంగా 170 కంటే ఎక్కువ దేశాలు అరటిని పండిస్తున్నాయి. అరటిపండ్లను  ముఖ్యంగా దాని యొక్క పోషక ప్రయోజనాల కోసం ప్రేమపంచమంతటా పండించబడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్ధికవ్యవస్థను పెంచడంలో అరటి  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అరటి ఒక అద్భుతమైన ఆహారం (super food)గా పరిగణించబడుతుంది. అరటిపండు విటమిన్ B6 ను  అధికంగా కల్గి ఉంటుంది. కేలరీలు మరియు కొవ్వుల్ని తక్కువగా కల్గిన అరటి సులభంగా జీర్ణం అవుతుంది. అరటి పండును సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే, దీనిలో పీచుపదార్థాలు, విటమిన్ సి, పొటాషియం మరియు మెగ్నీషియం కలిగి ఉంటాయి కాబట్టి. అరటిపండ్లకు అర్ద చంద్రాకృతి లాంటి ఒక విలక్షణమైన ఆకారం ఉంటుంది దీని రూపం చాలా ఆకర్షణీయంగా ఉండి అందర్నీ ఆకర్షిస్తుంది. అరటి పండ్లు కోతులకు కూడా ఎంతో ఇష్టం!

అరటి గురించిన ప్రాథమిక వాస్తవాలు

 • వృక్షశాస్త్రంలో అరటి పేరు: ముసా అక్యూమినేట్ (Musa acuminate)
 • కుటుంబం: ముసాసెయే
 • జాతి: ముసా
 • సాధారణ పేరు: అరటి
 • సంస్కృతం పేరు: “కదళీ” ఫలం
 • అరటిచెట్టులో ఉపయోగించే భాగాలు: తోలు, గుజ్జు, పండ్లు మరియు కాండం.
 • అరటి పండే ప్రాంతాల పంపిణీ: ఇతర ఉష్ణమండల పండ్లు లాగానే అరటిపండ్లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్, మరియు కరేబియన్లలో పెరుగుతాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు అరటి ప్రధాన ఆహారంగా ఉంది. అన్ని అరటి రకాల్లో 15 నుండి 20% మాత్రమే వాణిజ్య ఉపయోగం కోసం ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేయబడుతున్నాయి.
 • అరటి గురించిన ఆసక్తికరమైన నిజాలు: తొలిగా ఉపయోగించిన అరటి యొక్క శాస్త్రీయ నామం ముసా స్యాపియంటం, అంటే అర్థం "జ్ఞానుల యొక్క ఫలము" అని. యాపిల్ పండు మరియు పుచ్చకాయలు వలె అరటిపండు కూడా నీటిలో తేలుతుంది. US లో అరటిని వాణిజ్యపరంగా పండించే ఏకైక ప్రదేశం హవాయ్, అయినా; ఒకప్పుడు దక్షిణ కాలిఫోర్నియా మరియు ఫ్లోరిడాలో కూడా అరటిని  పండించారు.
 1. అరటి పోషక వాస్తవాలు - Nutritional facts of banana in Telugu
 2. అరటిపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of bananas in Telugu
 3. అరటి యొక్క దుష్ప్రభావాలు - Side effects of banana in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

అరటిపండ్లు విటమిన్ సి, మరియు పొటాషియం యొక్క గొప్ప మూలం మరియు USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ఆధారంగా, 100 గ్రా అరటి పండులో కింది పోషక విలువలుంటాయి:

పోషక విలువలు

100 g లకు పోషక విలువ

నీరు

74.91 గ్రా

శక్తి

89 కిలో కేలరీలు

ప్రోటీన్

1.09 గ్రా

కొవ్వులు (ఫాట్స్)

0.33 గ్రా

కార్బోహైడ్రేట్

22.84 గ్రా

ఫైబర్

2.6 గ్రా

చక్కెరలు

12.23 గ్రా

మినరల్స్

 

కాల్షియం

5 mg

ఐరన్

0.26 mg

మెగ్నీషియం

27 mg

ఫాస్పరస్ 

22 mg

పొటాషియం

358 mg

సోడియం

1 mg

జింక్

0.15 mg

విటమిన్లు

 

విటమిన్ B1

0.031 mg

విటమిన్ B2

0.073 mg

విటమిన్ B3

0.665 mg

విటమిన్ B6

0.367 mg

విటమిన్ ఎ

3 μg

విటమిన్ సి

8.7 mg

విటమిన్ ఇ

0.10 mg

విటమిన్ కె 

0.5 μg

విటమిన్ B9

20 μg

(మరింత సమాచారం - విటమిన్ బి ప్రయోజనాలు మరియు మూలం)

మేము పైన చెప్పినట్లుగా, అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి శక్తికి మంచి వనరుగా మాత్రమే కాదు, గుండె, పేగులు, మూత్రపిండాలు మరియు ఇతర శరీర అవయవాలకు కూడా మంచివి. ఈ ప్రయోజనాల్లో కొన్ని క్రింద చర్చించబడ్డాయి.

 • అరటి శక్తిని అందిస్తుంది: అత్యంత సాధారణ చక్కెరలలో మూడున్నాయి. అవే-గ్లూకోజ్, ఫ్రూక్టోజ్ మరియు సుక్రోజ. అరటి ఈ మూడు చక్కెరల్ని పుష్కలంగా కల్గి ఉంది. ఈ చక్కెరలు మూడూ కలిసి స్థిరమైన వనరుతోకూడిన శక్తిని మనకందిస్తాయి, కాబట్టి మీరు మీ రోజువారీ పనిని సులభంగా నిర్వర్తించొచ్చు.
 • అరటి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది: శరీరంలో కావలసిన స్థాయిలో రక్తపోటును నిర్వహించడానికి ముఖ్యమైనదైన పొటాషియం యొక్క ఉత్తమ వనరులలో అరటి ఒకటి. రక్తపోటును తగ్గించే మందులకుండే సామర్థ్యాలన్నీ అరటిపండుకున్నాయని మరియు అరటిపండును  నిరంతరంగా తినడంవల్ల రక్తపోటు స్థాయిల్ని తగ్గిస్తుందని నివేదించబడింది.
 • పిల్లలకు ప్రయోజనకరంగా అరటి: పోషకాల విషయంలో అరటి గొప్పదిగా ఉండటంవల్ల అరటి చంటి పిల్లలకు మంచి ఆహారం. అరటి సులభంగా జీర్ణమవుతుంది మరియు ఇది అలెర్జీలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను కల్గించదు.  
 • ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది: అరటిలో అధిక పీచుపదార్థం (ఫైబర్) ఉండటంవల్ల మలబద్ధకం మరియు అతిసారం వంటి జీర్ణశయాంతర సమస్యలను నివారించడానికి ఇది ఓ పరిపూర్ణ ఆహారంగా పని చేస్తుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని బంధిస్తుంది, తద్వారా ఆహారానికి స్థూలత్వాన్ని అందిస్తుంది, దీనివల్ల మలవిసర్జనను మెరుగుపరుస్తుంది. అలాగే, పెద్దమొత్తంలో నీటిని పీల్చుకునేలా పెద్దపేగుకు అరటిసేవనం సహాయపడుతుంది మరియుప్రేగు కదలికలను క్రమబద్దీకరించడంలో అరటి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
 • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:  ఓ సహజ హైపోటెన్సివ్ ఆహారంగా ఉండటం వలన, అరటిపండు గుండెపోటు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ గుండె యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడే అనామ్లజనకాలు అరటిలో పుష్కలంగా ఉంటాయి.
 1. అరటి అసహన ప్రతిచర్యలకు కారణం కావచ్చు.

  మీరు ఆస్టిమా రోగి లేదా చెట్ల పుప్పొడి వంటి వాటికి అలెర్జీ పొందేవారై ఉంటే మీరు అరటిపండ్లు తినడం మంచిది కాదు. అరటిలో ఉన్న లేటెక్స్, హైపర్సెన్సిటీని కలిగిస్తుంది, ఇది కణాల స్వీయ-దాడికి దారి తీస్తుంది. శ్వాసలో గురక శబ్దం, దగ్గు, దురద పెట్టే గొంతు, జలుబుతో ముక్కు కారటం మరియు కళ్ళ వెంట నీళ్ళు కారడం వంటి లక్షణాలు అరటితో కలిగే అలెర్జీలో సాధారణం.

 2. మైగ్రెయిన్ తలనొప్పి

  మద్యపానీయంతో పాటు అరటిపండు తినడం మంచిపని కాదు, ఎందుకంటే, మత్తుపానీయంతో పాటు అరటిపండు కూడా తింటే పార్శ్వపు తలనొప్పి (migraine) మరింత పెరుగుతుంది.

 3. ఇతర దుష్ప్రభావాలు:

 • అరటి సేవనం పొట్టలో అధిక వాయువు ఏర్పడటానికి దారితీస్తుంది. (మరింత సమాచారం - ఉబ్బరం కోసం గృహ చిట్కాలు)
 • అరటి టైప్ 2 డయాబెటిస్కు కారణం కావచ్చు అని చెప్పబడింది .
 • అరటి మగతనిద్రకు కారణం అవుతుందనే నమ్మకం ఉంది.
 • ఇది దంత క్షయానికి కారణం కావచ్చు.

ఇతర పండ్లవలె కాకుండా, తాజా అరటిపళ్ళు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. పక్వానికొచ్చిన అరటికాయల్ని చెట్టు నుండి కోసినప్పటి నుండి అవి నిరంతరంగా మాగుతూనే ఉంటాయి. అరటి పండ్లను గది యొక్క ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. ఉదయంపూట తినే తృణధాన్యాల ఫలహారానికి లేదా వోట్మీల్కు అరటిపండ్లను కూడా కలుపుకుని తింటే ఫలహారం మరింత పోషకభరితమైన అల్పాహారంగా తయారవుతుంది. వేపుడు పదార్ధాలతో పాటు అరటిపండు గుజ్జును చేర్చి తింటే అది నూనె లేదా వెన్నలను భర్తీ చేయవచ్చు, అంటే నూనె, వెన్నెలకు సమానంగా అరటి పోషకాలనివ్వగలదు. బేకరీ తీపి చిరుతిండ్లు (మఫిన్స్), కుకీలు మరియు కేకులకు అరటిపండు గుజ్జును కలిపితే అవి తడిగా తయారై సహజమై తీపి రుచిని కలిగిస్తాయి. అరటితో ఓ మంచి రసపానీయాన్ని లేదా జ్యూస్ (smoothie) ను తయారు చేసుకుని తాగి ఆనందించండి. ఇతర భక్ష్యాల (eatables) లాగానే, అరటిపండుకు కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది; అరటిపండును ఎలా తినాలి అనేవిషయం మనపైనే ఆధారపడి ఉంటుంది.

और पढ़ें ...