ఉసిరి (నెల్లికాయ) అనేది ఇంటింటా వినిపించే ఓ ప్రసిద్ధమైన పేరు. మెరిసే ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఉసిరి గురించి తెలియని వ్యక్తి ఈ దేశంలో ఉండరు. తెలుగువారు మరియు కన్నడిగులు ఉసిరిని “నెల్లికాయ” అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలోని పురాతన ఆయుర్వేద వైద్యం మందులలో ఉసిరి కూడా ఒకటి. “ఇండియన్ గూస్బెర్రీస్” “ఆమ్లా”గా పేరు పొందిన ఉసిరిని ప్రపంచమంతా ఉపయోగిస్తారు.

మీరు గనుక మూలికావైద్యం, గృహవైద్యం మందుల పట్ల మక్కువ గలవారైతే మీరు ఇప్పటికే పలు స్వస్థతా గుణాలున్న ఉసిరి యొక్క ప్రయోజనాల్ని పొందే ఉంటారు. సూక్ష్మజీవనాశక (యాంటీబయోటిక్) గుణాలు  మరియు మంచి పోషక విలువలున్న ఉసిరి మనకు అందుబాటులో (అంటే మన పెరట్లోనే) ఉంటే దీన్ని వాడకుండా ఉండడం చాలా కష్టం. అనామ్లజనకాలు (antioxidants) మరియు పోషకవిలువల్ని ఉసిరి దండిగా కల్గి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సంస్కృతంలో ఉసిరికి “ఆమ్లాకి” మరియు “ధాత్రీఫలం” అనే పేర్లున్నాయి. వాస్తవానికి, ఆమ్లాకి అంటే "తల్లి" అని ఒక అర్థం, “మాన్పు”  అని మరో అర్థం. అంటే అనేక మాన్పుడు గుణాలున్న ఉసిరికకు ఈ పేర్లు సముచితం.

అత్యంత ముఖ్యమైన ఆయుర్వేద గ్రంథాలలో “చరక సంహిత” మరియు “శుశ్రుత సంహిత”లనేవి రెండు. ఉసిరిని ఈ రెండు గ్రంథాలు “పునర్జీవమిచ్చే” మూలికగా పేర్కొన్నాయి.  ఇంతే కాదు, ఉసిరి భారత పురాణంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఉసిరిని విష్ణుదేవుని యొక్క కన్నీటి బిందువుగా భారతపురాణం అభివర్ణించింది. భారతదేశంలో శైవులకు రుద్రాక్ష ఎంత పవిత్రమో  వైష్ణవులకు వారి సంప్రదాయాల్లో ఉసిరి కాయకి కూడా అంతే పవిత్రత మరియు అంతే సమాన ప్రాముఖ్యతను కల్గి ఉంది. ఇంతటి పవిత్రత ఉండబట్టే ఉసిరికాయచెట్టు మరియు ఉసిరిపండ్లు భారతదేశంలో పవిత్రంగా పూజించబడుతున్నాయి. పాత సంప్రదాయాలు మరియు మూఢనమ్మకాల సంగతి పక్కన బెడితే ఉసిరికి  ఉన్న ప్రయోజనాలు మరియు మంచి లక్షణాలను పరిగణలోకి తీసుకుని ఆలోచించడం మంచిది గదా!

ఉసిరి (Amla) గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • ఔషధశాస్త్ర నామం/బొటానికల్ పేరు: ఫిలంథస్ ఎమ్బ్లికా లేదా ఎమ్బ్లికా అఫిసినాలిస్
 • కుటుంబం: ఫిలంథస్యే (Phyllanthaceae); యుఫోర్బిఎసే
 • సాధారణ పేరు: ఇండియన్ గూస్బెర్రీ, ఆమ్లా
 • సంస్కృతపేరు: ధత్రీ, అమలకా, అమలకి
 • ఉపయోగించే భాగాలు: ఫ్రూట్ (తాజా మరియు ఎండబెట్టిన), విత్తనాలు, బెరడు, ఆకులు, పువ్వులు.
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఆమ్లా భారతదేశానికి చెందినది, కానీ ఇది చైనా మరియు మలేషియాలో కూడా పెరుగుతుంది.
 • శక్తిశాస్త్రం: ఉసిరి కఫ, పిత్త మరియు వాత అనే మూడు దోషాలను సమతుల్యము  చేస్తుందని నమ్ముతారు. అయితే, ఆయుర్వేద వైద్యులు అది ఖచ్చితమైన శీతలీకరణ చర్యను కలిగి ఉందని, దానిని తిన్నపుడు కడుపులో తేలికగా ఉంటుందని చెప్తారు. 
 1. ఉసిరి పోషక లక్షణాలు - Nutritional qualities of Amla in Telugu
 2. ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of Amla (Indian Goosberry) in Telugu
 3. ఉసిరిని ఎలా ఉపయోగించాలి - How to use Amla in Telugu
 4. ఉసిరి మోతాదు - Amla dosage in Telugu
 5. ఉసిరి దుష్ప్రభావాలు ఉసిరి దుష్ప్రభావాలు - Amla side effects in Telugu
 • ఉసిరి అనేది విటమిన్ ‘సి’ కి నిలయమైన ప్రకృతిసిద్దమైన వనరుగా ఉంది. వాస్తవానికి ‘సి’ విటమిన్ యొక్క అత్యధిక సహజ వనరుల్లో ఇది ఒకటి. మరో ప్రత్యేకత ఏమంటే ఉసిరిలోని టానిన్లు (ఓ రకమైన ప్రకృతిసిద్ధమైన పదార్థ సమ్మేళనం) అనేవి వండిన తర్వాత కూడా విటమిన్ ‘సి’ గుణాలన్నింటినీ చెక్కు చెదరకుండా నిల్వ ఉంచుతుంది. విధాయితాహారం (ప్రాసెస్ చేసిన) గా మారిన ఉసిరిలో కూడా ఉసిరి గుణాలన్నీ చెక్కుచెదరకుండా ఉంటాయి.   
 • కాల్షియం, భాస్వరం మరియు ఐరన్ వంటి ఖనిజాలను ఉసిరి పుష్కలంగా కల్గిఉంది కనుక ఈ పుల్లని పండు ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణలో మనకు సహాయపడుతుంది.
 • ఎముకలో ఉన్న కెరోటిన్ మరియు విటమిన్ ‘ఎ’ కంటి చూపు మరియు జుట్టు పెరుగుదలకు చాలా దోహదం చేస్తాయి.
 • ఉసిరి అనామ్లజనకాల్ని, విటమిన్ E, మరియు విటమిన్ B కాంప్లెక్స్ లను కల్గి ఉండడం వల్ల అకాల వృద్ధాప్యాన్ని అరికడుతుంది, ఇంకా శరీరం నిర్వహించే వివిధ విధులకు సాయనాయకారిగా పనిచేస్తుంది.  
 • ఉసిరిలో ఉండే అధిక పీచు పదార్ధం జీర్ణక్రియలో మన  జీర్ణశయాంతర ప్రేగుల (ఆహార నాళము లేదా జీర్ణ నాళానికి ళము) కు ఓ అద్భుతమైన ఏజెంట్ గా పని చేస్తుంది.

మొక్కలలో ఉండే అనామ్లజనక పదార్థానికి ఉసిరి నిలయం. ఉసిరి యొక్క నిర్విషీకరణ లక్షణాలు మన కాలేయానికి ఓ మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. ఉసిరిని ఏ రూపంలో  సేవించినా మన శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యానికి ఉసిరి తోడ్పడుతుంది. ఉసిరిని నిరంతరంగా సేవిస్తుంటే శరీరం నుండి విషపదార్థాలను తొలగిస్తుంది. ఉసిరిలోని పునరుజ్జీవ, పోషక లక్షణాల కారణంగా ఎర్ర రక్త కణాలు మరియు ప్లీహం ద్వారా హేమోగ్లోబిన్ అభివృద్ధికి తోడ్పడతాయి. దీనివల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ, గుండె బలపడతాయి. అంతే కాదు. ఉసిరిలో ఉన్న ఖనిజాలు మరియు విటమిన్లు శరీరం మొత్తానికి ఆరోగ్యం సమకూర్చడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. ఇపుడు ఉసిరి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

ఉసిరి విటమిన్ ‘సి’ కి గొప్ప నిలయం - Amla is a rich source of Vitamin C

ఉసిరి విటమిన్ ‘సి’ ని కల్గి ఉండే ఉత్తమ సహజ వనరులలో ఒకటి. వాస్తవానికి ఇది నారింజ కన్నా 20-30 రెట్లు ఎక్కువ విటమిన్-సి ని కలిగి ఉంటుందని చెప్పబడింది. మానవ శరీరం సొంతంగా విటమిన్ ‘సి’ ని ఉత్పత్తి చేసుకోలేదు కనుక, ఈ విటమిన్ ను శరీరానికి భర్తీ చేయడానికి ఉసిరి లాంటి ప్రత్యేక ఆహార పదార్ధం చాలా అవసరం. శరీరంలో విటమిన్ సి లోపం ఏర్పడి దాపురించే వ్యాధి “స్కర్వీ.” దంత-చిగుళ్లలో రక్తస్రావం, చిగుళ్లు నల్లబడడం వంటి  లక్షణాలను స్కర్వీ కలిగి ఉంటుంది. ఉసిరి పండును రోజూ సేవించడం ద్వారా ఈ స్కర్వీ వ్యాధి నుండి బయటపడొచ్చు.

ఉసిరి కంటి చూపును మెరుగుపరుస్తుంది - Amla improves eyesight

దృష్టి-సంబంధ, కంటి దోషాలకు కూడా ఉసిరి మేలు చేస్తుంది. మీ అస్పష్టమైన చూపు కారణంగా మీరు ఉపయోగిస్తున్న చదివే అద్దాలు (reading glaases) కంటికి బరువై అలసిపోతున్నారా? మీ పరిస్థితిని గమనించి మీ స్నేహితులు మీకు కాంటాక్ట్ లెన్సులు, లేజర్స్ సిఫార్సు చేస్తున్నారా? ఇదంతా మిమ్మల్ని కలవరపెడుతోందా? కంటి చూపును మెరుగుపరిచేందుకు తోడ్పడే చాలా ముఖ్యమైన కరోటెనోయిడ్లు మరియు విటమిన్ ‘ఎ’ లను ఉసిరి దండిగా కల్గి ఉంది. అదనంగా, ఉసిరిలో ఉన్న విటమిన్ సి మన కంటిలో ఉన్న రెటీనా కణాలపై ఉద్దీపనా ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, కంటి-సంబంధ సమస్యలకు మరియు దృష్టి-దోష నివారణకు ఆయుర్వేద వైద్యులు ఉసిరిని అత్యుత్తమ ముందుగా సిఫారస్ చేయడంలో ఆశ్చర్యం కల్గించదు. రోజుకు రెండుసార్లు ఉసిరి రసాన్ని సేవిస్తే కంటి చూపును మెరుగుపరుచుకోవడంలోగుణాత్మక మార్పుల్ని గమనించవచ్చు.

బరువు కోల్పోవడానికి ఉసిరి - Amla for weight loss in Telugu

బరువు పెరగడానికి దారితీసే అతి సాధారణ కారణాలలో జీర్ణ వ్యవస్థ లోపాలు ఒకటి. తిన్న ఆహారమంతా జీర్ణం కాకుండా పొట్టలో నిల్వ అవడం, దాన్ని శరీరం బహిష్కరించలేక పోవడం, శరీరం ఆహారంలోంచి తగినంతగా పోషకాలను గ్రహించలేక పోవడం జరిగినట్లయితే, శరీరంలో అనవసరమైన బరువు చేరడం మొదలవుతుంది. ఈ అదనపు బరువును కోల్పోయి తిరిగి ఎలాంటి బాదరబందీ లేని తేలికైన శరీరాన్ని పొందడానికి ఉసిరితో కూడిన అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది, మూత్రవిసర్జనకు దోహదం చేసే ఉసిరిసేవనం. ఉసిరి మూత్రవర్ధకం. అధిక బరువున్నవారి శరీరంలో అవసరానికి మించిన నీరు, లవణాలు ఉండి అదనపు బరువులో ఇవేపెద్ద భాగాన్ని కలిగి ఉంటాయి. ఉసిరిసేవనం శరీరం నుండి ఈ అదనపు నీరు మరియు లవణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇంకా, ఉసిరి పీచుపదార్థాన్ని ఎక్కువగా కల్గి ఉంటుంది గనుక ఆకలిని తగ్గించి మీరు తక్కువ తినడానికి దోహదం చేస్తుంది. తద్వారా, అధికంగా ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువ సార్లు భోంచేయడం వంటి చర్యల్ని ఉసిరిసేవనం గణనీయంగా తగ్గిస్తుంది. ఆకలిని తట్టుకునే శక్తిని పెంచి, భోజనానీకీ -భోజనానికీ మధ్య ఉండే సమయాన్ని  పెంచుతుంది ఉసిరి. చివరగా, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకునేటందుకు మరియు ఆహారంలోంచి పోషకాలను రక్తంలోకి బదిలీ చేయడానికి ఉసిరి సేవనం మీకు సహాయపడుతుంది. రోజువారీగా శరీరంలో అధిక పోషకాల్ని శరీరానికి అందించి మిమ్మల్ని చురుకైనవారిగా మారుస్తుంది ఉసిరి. కాబట్టి, మీరు ఇంకా దేనికి వేచి చూస్తున్నారు? అద్భుతమైన ఈ ఉసిరిపండును మీ ఆహారంలో రోజూ తీసుకోండి, అధిక బరువును సులభంగా వదిలించుకోండి.

(మరింత సమాచారం: బరువు తగ్గుదలకు ఆహార విధాన పట్టిక)

మలవిసర్జనను క్రమబద్ధం చేస్తుంది ఉసిరి - Amla for regulating bowel movement

ఉసిరిలోని పీచు పదార్థం తిన్న ఆహారానికి స్థూలత్వాన్ని చేకూరుస్తుంది. ఉసిరి సేవనంతోపాటు తగినంతగా నీటిని తీసుకున్నప్పుడు అది పొట్టలోని మలాన్ని మృదువుగా చేస్తుంది, తద్వారా మలవిసర్జనను (bowl movement) సక్రమంగా నియంత్రిస్తుంది. అంతేకాక, ఉసిరి స్వాభావికమైన శీతలీకరణ గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి ఇది కడుపులో అప్పుడప్పుడు కలిగే మంటను తగ్గించి  ఉపశమనాన్నిస్తుంది. అందుకే వేడితత్వం కల్గినశరీరం గలవారికి ఉసిరిసేవనం చాలా మంచిది.

రోగనిరోధకతకు ఉసిరి - Amla for immunity

ఉసిరిలో ఉండే అనామ్లీకరణ (యాంటీఆక్సిడెంట్) లక్షణాలు మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే మందు (ఇమ్మ్నోమోడాలేటర్)గా పని చేస్తుంది. రోజువారీ ఆహారంలో ఉసిరిని కూడా తీసుకుంటే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. (తెల్లరక్తకణాలు శరీరంలో ప్రవేశించే బ్యాక్టీరియాను చంపుతాయి) తద్వారా, వేగవంతమైన మరియు మరింత ప్రభావవంతమైన రోగనిరోధక శక్తిని ఉసిరి మనకందిస్తుంది.  

(మరింత సమాచారం: రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా)

రక్త శుద్దీకరణకు ఉసిరి - Amla for blood purification

రక్తం మన శరీరంలో దేన్నైనా ప్రసారం చేసే (లేదా బదిలీ) ఓ  ప్రాథమిక మాధ్యమం. శరీర అవయవాలకు అవసరమైన ప్రాణవాయువును మరియు పోషక అంశాలను అందించడం  మరియు శరీరం నుండి విషతుల్య పదార్థాలను తొలగించడం రక్తం చేసే ముఖ్య విధులు. మన శరీరంలోని రక్తం యొక్క స్వచ్ఛతకు మన జీవనశైలి, తీసుకునే మందులు మరియు ఆహారపు అలవాట్లు వంటి అంశాలు, జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడికి లోనవడం, లేదా మధుమేహం (చక్కెరవ్యాధి) వంటి వ్యాధులకు గురవడం వంటివి  బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రక్తం స్వచ్ఛతకు హానిని కూడా కలిగించొచ్చు. ఇది రక్తం స్వచ్ఛత యొక్క హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పేర్కొన్న ఈ సమస్యలు రక్తం యొక్క శుభ్రపరిచే ప్రక్రియను తగ్గిస్తాయి. పైగా రక్తం నిండా విషతుల్య పదార్థాలను నింపవచ్చు. తద్వారా, మోటిమలు, చర్మం గాయాలు లేదా అకాల వృద్ధాప్యం వంటి పరిస్థితులను దాపురిస్తాయి. రక్తంలో ఇలా విషపదార్థాలు చోటు చేసుకోవడం వల్ల దాని ప్రభావం శరీరం యొక్క అన్ని అవయవాల సాధారణ విధులకు అడ్డంకుల్ని ఏర్పరచవచ్చు. తద్వారా ఇతర అంటువ్యాధులు, తదితర జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. ఉసిరి ఓ అద్భుతమైన నిర్విషీకరణ (డిటాక్సిఫైయర్) పదార్ధం, ఇది రక్తంలో ఉన్న మలినాలను తొలగించడానికి ఓ మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది. మూత్రప్రేరేపణకారి (diuretic) అయిన ఉసిరి శరీరం నుండి అన్ని అదనపు లవణాలను తొలగించి, రక్తంలోని అశుద్ద పదార్థాలను బహిష్కరించి రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. అదనంగా, ఉసిరి తనకున్న పోషక ప్రభావాల కారణంగా ఆక్సిజన్-వాహక ఎర్ర రక్త కణాలు మరియు హేమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచుతుంది. ఇలా జరగడం మూలంగా శరీరం అంతటా ఆక్సిజన్ యొక్క ఉత్తమ ప్రసరణకు దారి తీస్తుంది. మీకిప్పటికే  తెలిసినట్లుగా, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలెక్కువగా ఉంటే మొత్తం శరీరంలోని మలినాలు కూడా తక్కువైపోతాయి.

ఉసిరి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది - Amla for cholestral in Telugu

పచ్చి ఉసిరికాయ కానీ లేదా ఉసిరి చూర్ణాన్ని గాని రోజువారీగా తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ (కొవ్వు) స్థాయిలలో గణనీయమైన తగ్గుదలను గమనించొచ్చు. కొవ్వును నిరోధించే ఏజంటుగా ఉసిరి పనిచేస్తుంది. మరో అధ్యయనం ప్రకారం, శరీరంలోని కొలెస్టరాల్ స్థాయి తగ్గిపోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా, కాలేయ వాపు  వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉసిరిలోని “క్రోమియం” అనే పదార్ధం కారణంగా ధమనులలో ఫలకాన్ని (కొవ్వు నిక్షేపాలు) తొలగించడంలో సహాయపడుతుంది, తద్వారా ధమనుల్లో రక్తం గడ్డ కట్టడమనేది నివారింపబడి గుండెపోటు ప్రమాదం తప్పుతుంది.

(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్ చికిత్స)

డయాబెటిస్ వ్యాధికి ఉసిరి - Amla for diabetes

ఉసిరి రసాన్ని రోజూ సేవిస్తే శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలు ఉత్తేజితమై మరింత ఇన్సులిన్ ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇలా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ హార్మోను రక్తం నుండి గ్లూకోజ్ను తీసుకుని కాలేయంలో నిల్వ చేస్తుంది, తద్వారా, రక్తంలో చక్కెర స్థాయిల్లో తగ్గుదలకు దారితీస్తుంది. చక్కెరవ్యాధి రోగుల  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉసిరి గుణకారిగా పనిచేస్తుందని మరియు ఉసిరి అత్యంత సాధారణమైన డయాబెటిక్ ఔషధాల్లో (anti-diabetic medicine) ఒకటి అని ఇటీవలి అధ్యయనం పేర్కొంది.

అకాల వృద్ధాప్యానికి ఉసిరి - Amla for anti-aging in Telugu

ఈ ప్రపంచంలో వృద్ధాప్యం పట్ల ప్రతి ఒక్కరికీ ఒకింత ఏహ్యభావం ఉంటుందనే చెప్పవచ్చు. చిరుప్రాయంలోనే వచ్చే ముసలితనాన్ని ఎవరూ ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ తాము ఎప్పటికీ యువకుడిగానే ఉండాలని కోరుకుంటారు. యవ్వనవంతమైన చర్మం కావాలని కలలు గని, దాన్ని వెంటనే నిజజీవితంలో సాధించడం కూడా జరిగింది అంటే అది ఎంతో అనుకూలమైన విషయం కాదా?  మన శరీరంలో సాధారణంగా జరిగే జీవక్రియ చర్యల ఫలితంగానే వయసు పెరగడం, ముసలితనం దాపురించడం జరుగుతుంది. స్వేచ్ఛా రాశులకు (free radical) కలిగే హానిని మన శరీరంలో ఏర్పడే వయసు పెరిగిపోయే క్రమానికి ఓ పెద్ద కారణంగా పేర్కొంటున్నారు. దురదృష్టవశాత్తు వయసు ముదరడమనే దాన్ని ఆపలేం, ఎందుకంటే మన శరీరంలో జరిగే జీవక్రియల కారణంగానే ఇది (వయసు పెరగడం) జరుగుతుంది. వయసు పెరగడమనేది నిలిపివేయబడదు. రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి మరియు ఆధునిక జీవనశైలి వయసుమీరడమనే ఈ సమస్యను, అగ్నికి ఆజ్యం తోడైనట్లు, మరింత తీవ్రతరం చేస్తాయి. వీటిని ఎదుర్కోవటం దాదాపు అసాధ్యం. ఈ స్వేచ్ఛా రాశులతో   పోరాడే ఏకైక మార్గం ఏదంటే అనామ్లజనకాల యొక్క మోతాదును పుచ్చుకోవడమే. మరి అలాంటి అనామ్లజనకాల్ని పుష్కలంగా కల్గిన ఉసిరి మీకు అందుబాటులోనే ఉంది. ఇది శుభవార్తే గదా మరి. పోషకాహారాలు మరియు అనామ్లజనకాల (యాంటీఆక్సిడెంట్ లు)కు నిలయమైన ఉసిరిసేవనం అనామ్లజని నష్టాన్ని తగ్గించడమే గాక చర్మానికి పునర్జీవాన్ని ప్రసాదించి విటమిన్లు మరియు పోషక పదార్ధాలతో పుష్టీకరిస్తుంది. ఉసిరిసేవనం వల్ల చర్మం ఆరోగ్యదాయకంగా మరియు యౌవనదాయకంగా  కనిపించేలా చేస్తుంది.

ఉసిరితో జుట్టుకు ఎంతో మేలు - Amla for hair in Telugu

భారత ప్రజలు ఉసిరిని మానవుడు గుర్తు పెట్టుకోలేనంత పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఉసిరి వాడకం వల్ల వర్ణమయమైన మరియు మెరిసే జుట్టును పొందవచ్చానే విషయం భారతదేశంలో సామాన్య ప్రజలు చాలామందికే బాగా తెలుసు. జుట్టు రాలడాన్ని నివారించేందుకు కొబ్బరి నూనె-ఉసిరి మిశ్రమం బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఉసిరిసేవనం, ఉసిరి నూనెను నిత్యం జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు మంచి పోషణ నిచ్చి జుట్టురాలడాన్ని తగ్గిస్తుంది, వెంట్రుకలు పెరగడానికి దోహదపడుతుంది. ఉసిరిసేవనం వల్ల  ఆరోగ్యవంతమైన మరియు మెరిసే జుట్టు మీ స్వంతమవుతుంది. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జుట్టుకు కలిగే నష్టాన్ని నివారించి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఉసిరి నూనె వాడకం పురుషుల్లో వచ్చే బట్టతల నివారణకు పనిచేస్తుందని, ఇది నిరూపితమైన పరిష్కారం అని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం, జుట్టు రాలడానికి కారణమయ్యే “5 ఆల్ఫా రిడక్టేజ్” ను ఉసిరి నూనె శక్తివంతంగా నివారించి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి ఉసిరి - Amla for bones and teeth

ఎముకల నష్టానికి కారణమయ్యే “ఆస్టియోక్లాస్ట్లు”  అనే కణాలను ఉసిరి నిరోధించి బోలు ఎముకల వ్యాధిని అదుపు చేస్తుంది. ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని సేవించడం వల్ల ఆస్టియోక్లాస్ట్లు పెరగకుండా నిరోధింపబడి ఎముకలు పెళుసుబారడం తగ్గుతుంది. ఈ విధంగా, ఉసిరి వినియోగం వల్ల ఎముకలు సుదీర్ఘ కాలంవరకూ బలంగా ఉంటాయి. ఇంకా, మన శరీరంలో ఎముకలు మరియు దంతాలు-రెండింటి ఆరోగ్యానికి కాల్షియమ్ చాలా అవసరం. అలాంటి కాల్షియంను కల్గిన ఉసిరి సేవనం కారణంగా శరీరంలో కాల్షియం శోషణ పెరుగుతుంది. కాబట్టి, మీ ఆహారంలో ఉసిరిని ఓ భాగం చేసుకుంటే వయస్సుకు సంబంధించి దాపురించే ఎముకవిరగడమనే వ్యాధిని నివారించడమే కాక, ఎముకల్ని, దంతాల్ని మరింత పటిష్ఠపరుస్తుంది.  

గొంతునొప్పికి ఉసిరి - Amla for sore throat

ఉసిరి నొప్పిని నయం చేసే గుణం గల్గిన మూలిక. కానీ అద్భుతంగా చెప్పదగిన విషయమేంటంటే ఆయుర్వేద వైద్యులు గొంతు నొప్పి చికిత్స కోసం అల్లంతో కలిపిన ఉసిరి రసాన్ని సిఫారస్ చేయడం. ఉసిరిలో ఉన్న విటమిన్ ‘సి’ చాలా మంచి అనామ్లజని (antioxidant). గొంతునొప్పికి కారణమయ్యే క్రిములను చంపడానికి అవసరమయ్యే శరీర సామర్థ్యాన్ని ఉసిరిసేవనం మెరుగుపరుస్తుంది. ఉసిరిలోని పోషక లక్షణాలు గొంతు యొక్క కండరాలను బలపరుస్తాయి.

ఉసిరి చెట్టు శరదృతువులో ఫలాలనిస్తుంది. పండని బెర్రీలు ఆకుపచ్చరంగు కలిసిన పసుపు రంగులో ఉంటాయి. పండిన ఉసిరి పండ్లు గోధుమ-బంగారు రంగులోకి మారుతాయి. ఉసిరిపండును అలాగే అంటే ముడి పండునే సేవించవచ్చు, కానీ ఈ ఉసిరి బెర్రీలు రుచి లో చాలా పుల్లని రుచిని కల్గి ఉంటాయి. మరి ఫుల్లగ్జ్నదే ఉసిరి అందరికీ రుచించక పోవచ్చు. అదృష్టవశాత్తూ, మార్కెట్లో ఉసిరితో చేసిన పలు రకాల ఉసిరి ఉత్పత్తులు లభిస్థాయి. అయితే, కొనేటప్పుడు, వాటిని పరిశీలించి కొనడం ఉత్తమం. ఉసిరికి కొంచం ఎక్కువగా చక్కెర చేర్చి ఉంటే అది మేలు కంటే హానినే ఎక్కువగా  కలిగించొచ్చు. మార్కెట్లో మీరు ఉసిరిని ఏ ఏ రూపాల్లో కొనుగోలు చేయవచ్చు అంటే, తాజాగా ఉండే ఉసిరి పండ్లు/ఉసిరికాయలు. ఇంకా, ఉసిరి పొడి, ఎండిన ఉసిరి పండు, ఆమ్ల మురబ్బా, క్యాండీలు, మాత్రలు మరియు క్యాప్సూల్స్, ఆమ్ల రసం, చట్నీ, జామ్, మరియు నూనెల రూపంలో ఉసిరి మార్కెట్లో లభిస్తుంది. ఉసిరిని “త్రిఫల” పొడి మరియు చ్యవనప్రశ్ (లేహ్యం) లలో ఒక మూలికగా వాడుతారు. త్రిఫలా, చ్యవనప్రశ్ లు చాలా సాధారణ ఆయుర్వేద ఉత్పత్తులు). అయితే, ఇలా మార్కెట్లో కొనకుండా వంట కోసం ఉసిరిని ఉపయోగించే నేర్పు మీలో ఉంటే, సహజమైన “హోమ్ రెమడీ”లని ప్రేమించేవారుగా, ఉసిరి వంటకాల్ని మీరు ఇంట్లోనే ఉసిరిఫలంతో వండుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఉసిరి వంటకాలు వండుకోవడమనేది చాలా ఉత్తమం.  

ఉసిరిని వినియోగించడానికి మూడు సులభమైన మరియు ప్రయోజనకరమైన మార్గాలను పరిశీలిద్దాం:

 • ఉసిరి జ్యూస్ - Amla juice 
  ​ఉసిరి జ్యూస్ (రసం) చేయడానికి, ముందుగా ఉసిరి పండ్ల (gooseberries) లోని విత్తనాల్ని తొలగించి సిద్ధమైన ఉసిరి పెచ్చుల్ని ఒక మిక్సర్లో మెత్తగా పేస్ట్ ను చేసుకోండి. ఇపుడు మిక్సర్ లోని పేస్ట్ కు కొంత నీటిని (మీ రుచికి తగినట్లు జ్యూస్  ఎంత చిక్కగా ఉండాలో నిర్ణయించుకుని) చేర్చండి. ఇపుడు మళ్ళీ గ్రైండర్ లో గ్రైండ్ చేసి జ్యూస్ ను ఓ జార్ (కూజా) లోనికి పోసుకుని భద్రపరచండి. కావాలనుకుంటే రుచి కోసం నల్ల మిరియాలు , అల్లం, కొత్తిమీర కూడా చేర్చి పేస్ట్ చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన వంటవాళ్ళు (చెఫ్స్) చెప్పిన ప్రకారం ఉసిరి జ్యూస్ కు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ నీ  కలపకుండా కనీసం వారం రోజులపాటు ఫ్రిజ్లో పాడవకుండా ఉంటుంది. కానీ ఒకవేళ, భద్రపరిచిన ఉసిరి జ్యూస్ వారం లోపలే రుచిలో మార్పు కానీ చెడిపోయినట్లు మీకనిపిస్తే దాన్ని సేవించకండి. ఉసిరి జ్యూస్ ను భద్రపరిచేందుకు సోడియం లాక్టేట్ ను సంరక్షణకారిని (preservator) గా వాడినట్లైతే ఒక నెల వరకు ఫ్రిడ్జ్ లో భద్రపరచుకోవచ్చు.  
 • ఉసిరి పచ్చడి - Amla chutney
  ఉసిరి పచ్చడి లేక ఉసిరి చెట్నీ చేయడం దాదాపు ఉసిరి జ్యూస్ ను చేసినట్లే. ఉసిరి పండ్ల నుండి వాటి లోపలుండే విత్తనాల్ని తొలగించి ఉసిరి ముక్కల్ని ఓ గ్రైండర్లోకి తీసుకోండి, దానికి అల్లం కొంత, రుచికి తగినంత ఉప్పు, మరియు దానిలో కొత్తిమీరను చేర్చండి. గ్రైండర్ లో పేస్ట్ తయారు చేయండి. తయారైన ఉసిరి పచ్చడి (చెట్నీ)ని ఒక గాజు కూజాలోకి తీసుకుని, అందులో ఎక్కువకాలం నిల్వ ఉండడానికి గాను నూనె ను చేర్చి బిరడా బిగించి ఫ్రిడ్జిలో భద్రపరచండి, కావలసినప్పుడల్లా వాడుకోండి. ఉసిరి పచ్చడి ఫ్రిజ్లో ఒక నెలపాటు ఉంటుంది.
 • ఉసిరి నూనె - Amla oil
  ఉసిరి నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బాగా కడిగి శుభ్రం చేసి, తడి లేకుండా ఆరబెట్టిన ఉసిరి పండ్లను నేరుగా (అంటే వాటిని కోయకుండా) కొబ్బరి నూనెతో నిండిన ఒక కంటైనర్ /కూజాలో వేసి ఓ వారం పాటు ఎండలో పెట్టండి. ఉసిరి పండ్లన్నీ కొబ్బరి నూనెలో పూర్తిగా మునిగి ఉండేట్లు చూసుకోండి. ఈ పధ్ధతి ద్వారా ఉసిరి నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. 4-5 రోజుల తర్వాత కూజాను ఒక సారి కదిల్చి చూడండి, ఉసిరిపండ్లపై బూజు లేదా ఫంగస్ వంటిది లేకుండా చూడండి. తేమతో కూడిన ఉసిరి పండ్లను ఇందుకు ఉపయోగిస్తే బూజు పెట్టే అవకాశం ఉంది. రోజూ వృద్ధిని గమనించండి. వారం తర్వాత ఉసిరిపండ్లను తొలగించేసి నూనెను ఉపయోగించుకోవచ్చు. లేదా ఉసిరిపండ్లను అలాగే కంటైనర్లో ఉండనిచ్చి నూనెను పైనుంచి తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఉసిరి పండ్ల నుండి పోషకాలు కొబ్బరినూనెలోకి విడుదల అవుతున్నంతకాలం నూనె ఉసిరి గుణాలతో బలవర్దకమవుతూ ఉంటుంది. ఉసిరిపండ్లలోని సారమంతా వచ్చేసిందనుకున్నపుడు వాటిని నూనెలోంచి వేరుచేసి పడేయొచ్చు. ఉసిరిపండ్లను ఉపయోగించే ముందు వాటిని నీటితో కడగడం వల్ల వాటి ఉపరితలంపై ఉండే దుమ్ము లేదా బాక్టీరియాలు తొలగిపోతాయి. నీటితో శుభ్రం చేసిన ఉసిరిపండ్లను ఎండలో ఆరబెట్టి, తర్వాత కొబ్బరినూనెలో వేయడం బాగుంటుంది.

ప్రత్యామ్నాయంగా ఉసిరి పొడి లేదా ఎండిన ఉసిరి (చెక్కల్ని)ని కూడా కొబ్బరి నూనెలో మునిగేటట్టుగా వేసుకుని ఉసిరినూనెను తయారు చేసుకోవచ్చు. మరో విధానంలో, ఉసిరి జ్యూస్ ను కొబ్బరి నూనె లో కలిపి తక్కువ మంటపై (on low flame) కొన్ని నిముషాల సేపు (అంటే 2 లేక 3 నిముషాలు కావచ్చు) వేడి చేసి దించేసుకోండి. ఇపుడు దీన్ని నేరుగా చర్మం లేదా నెత్తిపై చర్మానికి, జుట్టుకు పట్టించండి.

ఉసిరి పండును అలాగే ముడిపండునే ఆహారంగానో లేక  మందుగానో వాడవచ్చు. అయితే ఉసిరిని సేవించే అతి సాధారణమైన మరియు సులభమైన మార్గం ఏదంటే ఉసిరి చూర్ణాన్ని మందుగా సేవించడం. సాధారణంగా, రోజుకు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ఉసిరి చూర్ణాన్ని ఖాళీ కడుపుతో  సేవించవచ్చునని సూచించబడింది. కొంతమంది ఆయుర్వేద వైద్యులు ప్రతి భోజనానికి తర్వాత కూడా ఉసిరి ని తీసుకొమ్మని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే, భోజనం తర్వాత ఉసిరిని తీసుకొంటే ఆహారం బాగా జీర్ణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉసిరిని తేనెలో మిళితం చేసుకుని గాని లేదా అల్లంతో కలిపి గాని గొంతునొప్పికి గాను మందుగా తీసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు ఉసిరి నూనెని ఉపయోగించవచ్చు, దీని వల్ల జుట్టు యొక్క అకాల నెరుపు (premature greying)ను కూడా ఆపవచ్చు.  ఉసిరి నూనెను సీకాయ లేక షికాకాయ్ నూనె (Acacia concinna oil)తో కలిపి కానీ లేదా బాదం నూనెలో మిళితం చేసి కానీ జుట్టుకు పట్టించొచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే, ఉసిరి యొక్క సరైన మోతాదు సదరు వ్యక్తి వయస్సు, లింగం మరియు ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉసిరి పండు మోతాదు పర్యావరణ అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఉసిరి-సంబంధమైన ఔషధాన్ని తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.

 • అధిక మొత్తంలో ఉసిరిని గనుక తింటే అది మేలు చేసేదానికి బదులు మలబద్ధకం సమస్యను తెచ్చి పెడుతుంది. అలా ఎక్కువగా ఉసిరికాయను లేదా ఉసిరి పచ్చడి తదితరాలను తిన్న తర్వాత నీళ్లు తగినంతగా తాగకపోతే కడుపు ఆరోగ్యానికి హాని కలగడం సంభవిస్తుంది. కొన్ని ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి, ఎందుకంటే ఉసిరి తిన్నాక తగినంతగా నీరు తాగకపోతే ఉసిరిలోని పీచుపదార్థాలు పేగుల్లో జరుపోవడానికి వీల్లేక చిక్కుకుపోయి గడ్డకట్టుకు పోవడం, తద్వారా ప్రేగుల్లో ఉపిరిసలుపని పరిస్థితి ఏర్పడి మలబద్దకాన్ని కల్గిస్తుంది.  
 • మీరు ఇప్పటికే విటమిన్ సి రిచ్ ఆహారాలకు సున్నితత్వాన్ని కలిగి ఉంటే, ఆమ్లా తీసుకోవడం మంచిది కాదు.
 • మీరు సాధారణంగా తక్కువ రక్త-గ్లూకోస్ స్థాయిలు కలిగి ఉంటే లేదా మధుమేహం కోసం సూచించిన ఔషధం ఉంటే అది ఒక సహజ హైపోగ్లైసిమిక్ (రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది) మరియు ఔషధం యొక్క చర్య జోక్యం ఎందుకంటే ఏ రూపంలో తినే ముందు మీ డాక్టర్ తో తనిఖీ ఉత్తమం .
 • ఆమ్ల అనేది ఒక సహజ మూత్రవిసర్జనగా, మీ శరీరాన్ని వేగంగా నీరు కోల్పోయేలా చేయడం వలన సాధారణ నీటి తీసుకోవడం కంటే తక్కువగా ఉన్న అమల యొక్క రెగ్యులర్ వినియోగం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మీరు మీ ఆహారంలో ఆమ్లాను జత చేస్తే మీ శరీరాన్ని బాగా ఉడకబెట్టడం ఉత్తమం.
 • గర్భిణీ స్త్రీలలో ఇప్పటివరకు ఎముక ప్రభావాలకు ఎటువంటి ఆధారాలు లేవు. అందువలన, మీరు గర్భవతిగా ఉంటే, మీ దినచర్యలో ఆమ్లా తీసుకోవడానికి ముందు వైద్యులు సలహా తీసుకోవాలని సూచించబడింది.
 • ఉసిరి యొక్క సహజ శీతలీకరణ ప్రభావం సాధారణ జలుబుతో బాధపడుతున్న ప్రజలకు వినియోగం కోసం ఇది సముచితం కాదు.

उत्पाद या दवाइयाँ जिनमें Amla है

వనరులు

 1. UAB Department of Anthropology [Internet] Amla Fruit in India
 2. Manayath Damodaran, Kesavapillai Ramakrishnan Nair. A tannin from the Indian gooseberry (Phyllanthus emblica) with a protective action on ascorbic acid. Biochem J. 1936 Jun; 30(6): 1014–1020. PMID: 16746112
 3. Guy Drouin, Jean-Rémi Godin, Benoît Pagé. The Genetics of Vitamin C Loss in Vertebrates. Curr Genomics. 2011 Aug; 12(5): 371–378. PMID: 22294879
 4. Krishnaveni M1, Mirunalini S. Therapeutic potential of Phyllanthus emblica (amla): the ayurvedic wonder.. J Basic Clin Physiol Pharmacol. 2010;21(1):93-105. PMID: 20506691
 5. National Health Portal [Internet] India; Amla
ऐप पर पढ़ें