• తె
 • తె

టెంకాయ లోని కొబ్బరి నుండి తీసేదే కొబ్బరి నూనె. పండిన టెంకాయలో లభించే కండ లేక గుజ్జు వంటి రుచికరమైన మరియు మనం తినదగిన భాగమే కొబ్బరి. మార్కెట్లో  వివిధ రకాల కొబ్బరి నూనెలు లభిస్తాయి, కొబ్బరి నుండి నూనెను సేకరించేందుకు చేపట్టే పధ్ధతిని బట్టి కొబ్బరి నూనె రకాలుంటాయి. కొబ్బరి నూనెలో సాధారణ రకాలు శుద్ధి చేసిన కొబ్బరి నూనె మరియు శుద్ధి చేయని (unrefined) కొబ్బరి నూనె అనే రకాలు ఉంటాయి.

కొబ్బరి నూనె గది ఉష్ణోగ్రత వద్ద సాధారణంగా గడ్డ కట్టి ఉంటుంది, ఎందుకంటే దాని అధిక ద్రవీభవన ఉష్ణోగ్రతా స్థానం - 76 ఫారిన్ హీట్ డిగ్రీలు. సరి అయిన రీతిలో భద్రపరిస్తే కొబ్బరి నూనె ఒక స్థిరమైన నిల్వ సామర్థ్యం (షెల్ఫ్ లైఫ్) కల్గి ఉంటుంది. కొబ్బరి నూనె  కొవ్వు ఆమ్లాల ప్రత్యేకమైన సమ్మేళనం మరియు మానవ శరీరంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్ల, ఈ నూనె వంటల్లో (తినడానికి) వాడటం కోసం బాగా అనుకూలంగా ఉంటుంది మరియు చర్మం మరియు జుట్టుకు తేమను కల్గించే ఏజెంట్ గా కూడా ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనె గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • కొబ్బరికాయ (టెంకాయ) శాస్త్రీయనామం: కొబ్బరి నూనెను కొబ్బరి నుండి సేకరించబడుతుంది. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా (Cocos Nucifera).
 • కుటుంబం పేరు: కొబ్బరి చెట్టు అరెకాసియా అని పిలువబడే తాటి చెట్టు కుటుంబానికి చెందినది.
 • సామాన్యమైన పేరు: హిందీలో నారియల్ తేల్ (Nariyal tel), కొబ్బరి నూనె
 • స్థానిక ప్రాంతం: ప్రపంచంలోని 90 కంటే ఎక్కువ దేశాలు కొబ్బరి చెట్లను పెంచుతున్నాయి. ప్రపంచంలో కొబ్బరి నూనెను ఉత్పత్తి చేసే అతిపెద్ద ఉత్పత్తిదారు ఫిలిప్పీన్స్ దేశం, తరువాత ఇండోనేషియా మరియు భారతదేశం కొబ్బరినూనె ఉత్పత్తిలో వరుసగా రెండు, మూడో స్థానాల్ని ఆక్రమిస్తాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ మొదలైనవి భారతదేశంలో కొబ్బరి చెట్లని పెంచే కొన్ని రాష్ట్రాలు. కోకోనట్ డెవెలప్మెంట్ బోర్డ్ అఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి  2014-15 గణాంకాల ప్రకారం, దక్షిణ భారతదేశంలో కేవలం 4 రాష్ట్రాలు భారతదేశంలో మొత్తం కొబ్బరి ఉత్పత్తిలో 90% వాటాని కలిగివున్నాయి. కోయంబత్తూర్ మరియు తిరుపూర్ లు భారతదేశంలో అతి పెద్ద కొబ్బరి ఉత్పత్తిదారులు.
 • కొబ్బరిని గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు: కొబ్బరికాయ (coconut) యొక్క పుట్టుక (మూలం) గురించి సమాచారం తెలియదు, కానీ శాస్త్రవేత్తల ప్రకారం, కొబ్బరి అనేది దక్షిణ పసిఫిక్ నుండి వచ్చిన ఒక చరిత్రపూర్వకాలపు మొక్క. వాస్కో డా గామా యొక్క ఓడలో ఉన్న నావికులు కొబ్బరిచెట్టుకు దానికా పేరును (కోకోనట్) పెట్టి ఉంటారని నమ్ముతారు.
 1. కొబ్బరి నూనె పోషణ వాస్తవాలు - Coconut oil nutrition facts in Telugu
 2. కొబ్బరి నూనె ఆరోగ్య ప్రయోజనాలు - Coconut oil health benefits in Telugu
 3. కొబ్బరి నూనె దుష్ప్రభావాలు - Coconut oil side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

కొబ్బరి నూనె సంతృప్త కొవ్వురకానికి చెందిన లారిక్ యాసిడ్ ను పుష్కలంగా కల్గి ఉంటుంది. సంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి మంచిది కానప్పటికీ, కొబ్బరి నూనెలోని సంతృప్త కొవ్వు రకం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే మంచి కొవ్వుల (కొలెస్ట్రాల్) స్థాయిని పెంచుతుంది. మంచి కొవ్వులనే ఆంగ్లంలో HDL (high-density lipoproteins) గా వ్యవహరిస్తారు.

USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం కొబ్బరి నూనె యొక్క పోషక విలువ క్రింది విధంగా ఉంది:

పోషకాలు

100 గ్రాములకు విలువ

నీరు

0.03 గ్రా

శక్తి

892 కిలో కే

ఫాట్స్

99.06 గ్రా

 

మినరల్స్

100 g లకు విలువ

కాల్షియం

1 mg

ఐరన్

0.05 mg

జింక్

0.02 mg

 

విటమిన్లు

100 g లకు విలువ

విటమిన్ ఇ

0.11 mg

విటమిన్ K

0.6 μg

 

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

100 g లకు విలువ

సాచ్యురేటెడ్ (సంతృప్త)

82.475 g

అసంతృప్త

6.332 గ్రా

పాలీఅన్శాచ్యురేటెడ్ (పలు అసంతృప్త)

1.702 గ్రా

ట్రాన్స్

0.028 గ్రా

 • కొబ్బరి నూనెలో అధికంగా సాచురేటెడ్  ఫ్యాట్ ఉంటుంది. దీనిలో దాదాపు  50%  లారిక్ ఆసిడ్ ఉంటుంది. ఈ లారిక్ ఆసిడ్ మంచి కొలెస్టెరాల్ స్థాయిలు పెరగడానికి బాధ్యత వహిస్తుందని భావింపబడుతుంది. మంచి కొలెస్టెరాల్ గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయం చేస్తుంది. 
 • కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే లారిక్ ఆసిడ్ ఆకలిని తగ్గించడంలో బాధ్యత వహిస్తుంది. 
 • కొబ్బరి నూనెలో ఉండే గ్లిసెరాల్ మోనోలారెట్ మరియు లారిక్ ఆసిడ్లు కొన్ని రకాల బాక్టీరియాలపై ప్రభావంతమైన యాంటీమైక్రోబియల్ చర్యలు చూపుతాయని అధ్యయనాలు సూచించాయి. అలాగే శుద్ధి చెయ్యని కొబ్బరి నూనె కాండిడా వంటి ఫంగస్ పై వ్యతిరేక చర్యలను చూపుతుందని మరొక అధ్యయనం తెలిపింది.
 •  కొబ్బరి నూనె మంచి ‘మాయిశ్చరైజర్’ గా పనిచేస్తుంది మరియు దీనిని ఉపయోగించడం ద్వారా చర్మం పొడిబారిపోవడం లేదా జిరోసిస్ మరియు అటోపిక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. 
 • కొబ్బరి నునె జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని నిర్దారించబడింది. దీని జుట్టు రాలడం పై వ్యతిరేకంగా పోరాడుతుంది, అంతేకాక జుట్టు ప్రోటీన్ల నష్టాన్ని తగ్గించి అధికంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. 
 • కొబ్బరి నూనెలో అధికంగా ఉండే లారిక్ ఆసిడ్ ఒక మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్ (ఎంసిటి).  ఈ  ఎంసిటి  అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన అల్జీమర్స్  వ్యాధి ఉన్న రోగులలో మెదడు పనితీరు మెరుగు పడిందని తద్వారా అల్జీమర్స్ లక్షణాలు తగ్గాయని ఓక అధ్యయనం తెలిపింది.     
 • ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన ఆయుర్వేద ప్రక్రియ, దీనిని చేయడం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని మరియు దంత సమస్యలు తగ్గుతాయని భావిస్తారు . అధ్యయనాలు ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన ఫలితాలు చర్మం సమర్థవంతంగా ఉంటాయని  సూచిస్తున్నాయి.    

మంచి కొవ్వులకు కొబ్బరి నూనె - Coconut oil for cholesterol in Telugu

కొబ్బరి నూనెలో ప్రతి 100 గ్రాములకు 82 గ్రాముల సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సాధారణంగా, సంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి చెడుగా భావించబడతాయి, ఎందుకంటే ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని పెంచుతుంది. సంతృప్త కొవ్వులతో కూడిన ఆహారం సంభావ్య గుండె సమస్యలకు దారితీస్తుంది.  

కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు ఉన్నప్పటికీ, ఈ కొవ్వులో దాదాపు 50% లారిక్ ఆమ్లం ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచడానికి ఈ లారిక్ యాసిడ్ బాధ్యత వహిస్తుంది. HDL లేదా మంచి కొలెస్ట్రాల్, గుండె మరియు శరీర ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. కొరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) తో 116 మంది వ్యక్తుల బృందంపై జరిపిన అధ్యయనం కొబ్బరి నూనె గణనీయంగా HDL స్థాయిని పెంచిందని తెలిపింది.

(మరింత చదువు: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

కొబ్బరి నూనె ఆకలిని అణిచివేస్తుంది - Coconut oil suppresses appetite in Telugu

కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు మీ ఆకలిని తగ్గిస్తాయి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది మోస్తరు గొలుసుల ట్రైగ్లిజరైడ్ (MCT) గా పరిగణించబడుతుంది. ఒక వైద్య అధ్యయనంలో, ఆరుగురు ఆరోగ్యవంతులైన పురుషులకు  కొంత కాలం పాటు పొడవాటి గొలుసుల ట్రైగ్లిజరైడ్లు మరియు మోస్తరు గొలుసుల ట్రైగ్లిజరైడ్లు (LCT మరియు MCT) కల్గిన ఆహార పదార్ధాలను భిన్నమైన మొత్తాలలో ఇవ్వబడ్డాయి. ఈ అధ్యయనం, LCT లలో ఉన్న ఆహారాన్ని తిన్న పురుషులతో పోలిస్తే, MCT లు కల్గిన ఆహార పదార్థాలను తిన్న పురుషులు తక్కువ కేలరీలను సగటున వినియోగించినట్లు వెల్లడించింది. అల్పాహారం అధికంగా ఉన్న MCT లను తిన్న  పురుషులు తక్కువ ఆకలిని కలిగి ఉన్నారని, 14 మంది పురుషులున్న మరొక అధ్యయనం తెలిపింది.

బరువు కోల్పోయేందుకు కొబ్బరి నూనె - Coconut oil for weight loss in Telugu

సంప్రదాయకంగా, కొబ్బరి నూనె బరువు కోల్పోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. కొబ్బరి నూనెలో మోస్తరు శృంఖల ట్రైగ్లిజరైడ్లు (MCT)ను కలిగి ఉన్న కారణంగా, ఇది ఊబకాయం వ్యక్తుల బరువును తగ్గించేందుకు పని చేస్తుంది. MCT లకు బదులు దీర్ఘ శృంఖల ట్రైగ్లిజరైడ్స్ (LCT) ను మార్చడం వల్ల శరీర బరువు తగ్గిపోవచ్చని 13 మంది వ్యక్తులపై చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది.

మరొక 20 మంది ఊబకాయం పురుషులపై చేసిన అధ్యయనంలో, కొబ్బరి నూనెవాడకంవల్ల  నడుము చుట్టుకొలత తగ్గించవచ్చని సూచించింది.

కొబ్బరి నూనె మహిళల్లో కూడా ఉదరభాగపు ఊబకాయం తగ్గించటంలో సమర్థవంతంగా పని చేస్తుందని నిరూపించబడింది. 20 ఏళ్ళు మరియు 40 సంవత్సరాల మధ్య వయస్సున్న 40 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనం కొబ్బరి నూనెను 12 వారాలపాటు ఆహారంతో కలిపి తింటే పొట్టలో కొవ్వు నిక్షేపపాల్ని తగ్గించవచ్చని సూచించింది.

(మరింత చదువు: బరువు తగ్గుదల ఆహారవిధాన పట్టిక)

సూక్ష్మజీవినాశినిగా కొబ్బరినూనె - Coconut oil as an antimicrobial in Telugu

కొబ్బరి నూనెలో ఉన్న లారిక్ ఆమ్లం మరియు గ్లిసరాల్ మోనోలారేట్ లేదా మోనోలారిన్ అనేవి స్టెఫిలోకాకస్ ఆరియస్ అని పిలువబడే కొన్ని రకాల బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచించాయి. చర్మం సంక్రమణ మరియు మొటిమల సిండ్రోమ్ వంటి చిన్న సమస్యలకు మరియు మెనింజైటిస్ మరియు టాక్సిక్ షాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కొబ్బరినూనె సమర్థంగా పనిచేస్తుందని అధ్యయనాలు తెలిపాయి.  

సాధారణ అంటురోగకారక ఈస్ట్-కాండిడాకు వ్యతిరేకంగా శుద్ధి చేయని (వర్జిన్) కొబ్బరి నూనె ప్రభావాన్ని అంచనా వేయడానికి మరొక అధ్యయనం నిర్వహించబడింది. కొబ్బరి నూనె కాండిడా యొక్క పెరుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని  మరియు కాండిడా జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు కూడా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చని ఈ అధ్యయనం నిర్ధారించింది.

(మరింత చదువు: ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు)

చర్మానికి కొబ్బరి నూనె - Coconut oil for skin in Telugu

కొబ్బరి నూనె కేవలం వంట నూనెగానే కాకుండా మన చర్మానికి అద్భుతమైన ఉపయోగాలనిస్తుంది. కొబ్బరి నూనెని చర్మానికి తేమను  కల్గించే ‘మాయిశ్చరైజర్’ గా ఉపయోగించవచ్చు, పొడి చర్మం లేదా జిరోసిస్ చర్మవ్యాధి చికిత్సకు కొబ్బరి నూనెను  వాడుతారు. ఓ 34 మంది రోగుల బృందానికి కొబ్బరి నూనెను 2 వారాలపాటు రోజుకు రెండుసార్లు కాళ్లపై రాయమని చెప్పబడ్డారు. వారలాగే చేయగా పొడిచర్మం సమస్య పూర్తిగా మాయమైనట్లు గుర్తించడం జరిగింది. కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చని మరియు పొడి చర్మం నివారణకు సమర్థవంతంగా ఉపశమనం కలిగిస్తుందని ఈ పరిశోధన నిర్ధారించింది.

అటోపిక్ చర్మశోథ (Atopic dermatitis- AD) అనేది దురద మరియు చర్మం ఎర్రబారడంతో వచ్చే ఒక చర్మ రుగ్మత. ఈ రుగ్మతతో చర్మం తనలో తేమను (నీటిని) నిలుపుకునే సామర్త్యాన్ని కోల్పోయి చర్మం పొడిబారి పోతుంది. క్లినికల్ ట్రయల్ లో, ఈ చర్మ పరిస్థితిలో 117 మంది పీడియాట్రిక్ రోగుల బృందం వారి చర్మంపై కొబ్బరి నూనెను 8 వారాల పాటు ఉపయోగించమని కోరడం జరిగింది. అధ్యయనం ముగింపులో, అటోపిక్ డెర్మటైటిస్ యొక్క లక్షణాలను తగ్గించడంలోను, చర్మానికి తేమను  కల్గించడంలోను (చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో) కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుందని గమనించబడింది.

జుట్టుకు కొబ్బరి నూనె - Coconut oil for hair in Telugu

కొబ్బరి నూనె జుట్టుకు కూడా మంచిది అని నిరూపించబడింది. ఇది ఒక ప్రభావవంతమైన జుట్టు కండీషనర్గా పరిగణించబడుతోంది మరియు వివిధ జుట్టు ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. ఓ 30 మంది బృందంతో కూడిన వైద్య అధ్యయనంలో కొబ్బరి నూనెను వారి జుట్టుకు రాసుకొని గమనించగా, ఆ 30 మంది వ్యక్తుల్లో జుట్టు చిట్లడం గణనీయంగా తగ్గిపోయిందని గమనించబడింది. జుట్టును  దువ్వినపుడు ఏర్పడే జుట్టు నష్టాల్ని నివారిస్తుందని అధ్యయనంలో గమనించబడింది. కాబట్టి, కొబ్బరి నూనె వివిధ రకాలైన జుట్టు నష్టాలను ఎదుర్కోవడంలో సమర్థవంతమైనది. బలహీనమైన జుట్టు (weak hair)కు, జుట్టు రాలిపోయే సమస్యలకు కారణం జుట్టు ప్రోటీన్ల నష్టమేనని నివేదించడమైంది, ఈ సమస్యలను కొబ్బరి నూనె గణనీయంగా తగ్గించగలదని నివేదించబడింది.

ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియకు కొబ్బరి నూనె - Coconut oil for oil pulling in Telugu

ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ ఒక పురాతన ఆయుర్వేదిక పద్దతి, ఈ ప్రక్రియలో సుమారు 20 నిముషాల పాటు నోటిలో నూనెను పుక్కిట నిండా తీసుకుని పుక్కిలించడం జరుగుతుంది. ఈ పద్ధతి యొక్క పనితీరు ప్రభావానికి ఎలాంటి అధ్యయనసహితమైన  ఆధారాలు లేనప్పటికీ, ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు దంత సమస్యలను నిరోధించడానికి బాగా ఉపకరిస్తుందని నమ్ముతారు. ఆయిల్ పుల్లింగ్ లో పుక్కిలింతకు ఎక్కువగా ఉపయోగించే నూనె (చమురు) నువ్వుల నూనె లేదా పొద్దుతిరుగుడు గింజల నూనె. కానీ ఈ పద్ధతిలో పుక్కిలింతకు కొబ్బరి నూనె కూడా సమర్థవంతమైనదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొబ్బరి నూనె యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు చేయబడ్డాయి. ఒక వైద్య (క్లినికల్) అధ్యయనంలో, 60 మంది బాలురు మరియు బాలికలు 30 రోజులపాటు కొబ్బరి నూనెను 20 నిముషాలపాటు రోజూ పుక్కిలించే (ఆయిల్ పుల్లింగ్) ప్రక్రియను క్రమంగా చేపట్టేటట్లు చేశారు. అధ్యయనం ముగింపులో, కొబ్బరి నూనె రోజువారీ పుక్కిలింత పండ్లపై ఫలకం ఏర్పడడాన్ని ప్రభావవంతంగా అరికడుతుంది అని నిర్ధారించబడింది మరియు దంత చిగుళ్లవాపు (జింజివైటిస్) వంటి నోటి వ్యాధుల్ని నివారించడానికి నూనెతో పుక్కిలింత (oil pulling) ను వాడవచ్చు అని నమ్మబడుతోంది.

(మరింత చదువు: పండ్లపై ఏర్పడే ఫలకానికి చికిత్స)

అల్జీమర్స్ రోగులకు కొబ్బరి నూనె ప్రయోజనాలు - Coconut oil benefits Alzheimer's patients in Telugu

అల్జీమర్స్ వ్యాధి వృద్ధులలో వచ్చే చిత్తవైకల్యం (మతిమరుపు) యొక్క అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఎవరికైనా అల్జీమర్స్ (అంటే మతి మరుపు లాంటి లక్షణాలతో)  సంభవించినపుడు వారి మెదడు పనితీరుకు అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి వారి రక్త నాళాల్లోని కణాలు తగినంత గ్లూకోజ్ను ఉపయోగించుకోలేవు. కొబ్బరి నూనె అల్జీమర్స్కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తగినంతగా సాక్ష్యాలు, ఆధారాలు లేనప్పటికీ, కొబ్బరి యొక్క శక్తి ప్రత్యామ్నాయ వనరుగా పనిచేస్తుందని నమ్ముతారు.

కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం మరియు  ఓ మధ్యరకం-శృంఖల ట్రైగ్లిజరైడ్లు (MCT)  పుష్కలంగా ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధి యొక్క ప్రారంభ దశ నుండి మధ్యదశలో బాధపడుతున్న రోగులకు మధ్యరకం-శృంఖల ట్రైగ్లిజరైడ్లు యొక్క మధ్యస్థ మోతాదులతో కూడిన కీటో ఆహారం ప్రయోజనకరంగా ఉంటుంది.

అల్జీమర్స్  వ్యాధి (AD) తో బాధపడుతున్న20 మంది రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, మధ్యరకం-శృంఖల ట్రైగ్లిజరైడ్లు పుష్కలంగా ఉన్న ఆహార పదార్ధాల సేవనంవల్ల ఆ రోగుల యొక్క మెదడు పనితీరులో మెరుగుదలకు దారితీసింది.

అయినప్పటికీ, మధ్యరకం-శృంఖల ట్రైగ్లిజరైడ్లు అల్జీమర్స్ కు పూర్తి ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం.

మూర్ఛరోగానికి కొబ్బరి నూనె కీటో ఆహారవిధానం - Coconut oil keto diet for epilepsy in Telugu

మూర్చరోగులకు పనికొచ్చే ‘కేటోజెనిక్ ఆహారం’ పిండిపదార్థాల్లో (కార్బోహైడ్రేట్లలో) చాలా తక్కువగా ఉంటుంది మరియు కొవ్వులో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం నుండీ మూర్ఛ రోగానికి చికిత్స చేయడానికి ఉపయోగించబడుతున్న కీటోజెనిక్ ఆహారాల్లోనే వివిధ రకాలున్నాయి. MCT (medium-chain triglycerides) లతో పాటు కీటోజెనిక్ ఆహారాన్ని ముఖ్యంగా పిల్లలలో మూర్ఛ వ్యాధి చికిత్సకు వాడుతున్నారు. 50 మంది రోగులతో కూడిన బృందంపై నిర్వహించబడిన ఒక అధ్యయనం ప్రకారం, MCTలను ఎక్కువగా కల్గిన కీటోజెనిక్ ఆహారం ఒక అద్భుతమైన మూర్చరోగ ఆహారంగా గోచరించింది. ఇందులో చాలాతక్కు దుష్ప్రభావాలు మాత్రమే కలిగాయి. MCTలను ఎక్కువగా కల్గిన కీటోజెనిక్ ఆహారాలు ఆకలి ఎక్కువగా ఉండే పిల్లలక మూర్ఛరోగ చికిత్సకు మంచి ఎంపికగా ఉండవచ్చని, అలాంటివారికి అవసరమయ్యే ఎక్కువ కేలరీలను కూడా ఇది అందిస్తుందని సూచించబడింది.

 • అలెర్జీ (అసహనీయత) 
  కొబ్బరివల్ల లేదా కొబ్బరి నూనెవల్ల కల్గిన అసహనీయతల (అలెర్జీలు)కు  సంబంధించిన అనేకమైన కేసులేవీ నమోదు కాలేదు. ఒక సందర్భంలో, ఒక 8 నెలల శిశువు చేత  కొబ్బరిని కలిగిన ఒక పసిపిల్లల ఫార్ములాను సేవింపజేసిన తర్వాత తీవ్రమైన జీర్ణశయాంతర జబ్బు వచ్చిందని  నివేదించబడింది.చెట్టుకు కాచే గింజల్ని తినడంవల్ల అలెర్జీకి గురయ్యేవారు కొబ్బరి తినడంవల్ల కూడా  అలెర్జీకి గురవుతారని భావించడం కేవలం ఓ అపోహ మాత్రమే. కానీ వేరుశెనగ గింజలు మరియు ఇతర రకాల చెట్టు గింజలు తినడంవల్ల అలెర్జీకి గురైన 40 మంది పిల్లల్ని కల్గిన ఓ అధ్యయనంలో ఆ 40 మందిచేత కొబ్బరిని సేవింపజేసి చూడగా వారికెలాంటి అలెర్జీ కలగలేదని నిరూపితమైంది. మీరు ఇంతకు మునుపు కొబ్బరి నూనెను ఉపయోగించకపోతే, ఒక వైద్యుడిని సంప్రదించి, కొబ్బరినూనెతో కూడిన అలెర్జీ పరీక్ష చేయించుకున్న తర్వాతే కొబ్బరి నూనెను సేవించడం మంచిది.
 • కొబ్బరి నూనె మీ శరీరంలో చెడు కొలెస్టరాల్ యొక్క స్థాయిని పెంచుతుంది కొబ్బరి నూనెలో ఉన్న సంతృప్త కొవ్వులలో సగం లారిక్ యాసిడ్ ఉంటుంది. మన శరీరంలో మంచి కొవ్వుల (కొలెస్ట్రాల్) స్థాయిని పెంచుకోవడానికి లారిక్ యాసిడ్ బాధ్యత వహిస్తుంది. అయితే సంతృప్త కొవ్వులతో సంపన్నమైన ఏ ఆహారం  అయినా కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయినిపెంచుతుంది. చెడు కొవ్వుల (LDL) పెరుగుదల గుండె సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, మీరు హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, కొబ్బరి నూనె సరైన ఎంపిక కాదు.

కొబ్బరి నూనెను "సూపర్ఫుడ్" అని పిలుస్తారు, ఇది నిజమే. ఇది చర్మం మరియు మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. మితంగా సేవిస్తే కొబ్బరి నూనె మన శరీరానికి అద్భుతాలే చేస్తుంది.


उत्पाद या दवाइयाँ जिनमें Coconut oil है

వనరులు

 1. Pishan Chang et al. Seizure control by ketogenic diet-associated medium chain fatty acids . Neuropharmacology. 2013 Jun; 69: 105–114. PMID: 23177536
 2. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 04047, Oil, coconut. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 3. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. The truth about fats: the good, the bad, and the in-between. Harvard University, Cambridge, Massachusetts.
 4. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Ask the doctor: Coconut oil and health. Harvard University, Cambridge, Massachusetts.
 5. Cardoso DA et al. A COCONUT EXTRA VIRGIN OIL-RICH DIET INCREASES HDL CHOLESTEROL AND DECREASES WAIST CIRCUMFERENCE AND BODY MASS IN CORONARY ARTERY DISEASE PATIENTS. Nutr Hosp. 2015 Nov 1;32(5):2144-52. PMID: 26545671
 6. Stubbs RJ, Harbron CG. Covert manipulation of the ratio of medium- to long-chain triglycerides in isoenergetically dense diets: effect on food intake in ad libitum feeding men. Int J Obes Relat Metab Disord. 1996 May;20(5):435-44. PMID: 8696422
 7. Van Wymelbeke V et al. Influence of medium-chain and long-chain triacylglycerols on the control of food intake in men. Am J Clin Nutr. 1998 Aug;68(2):226-34. PMID: 9701177
 8. Mumme K, Stonehouse W. Effects of medium-chain triglycerides on weight loss and body composition: a meta-analysis of randomized controlled trials. J Acad Nutr Diet. 2015 Feb;115(2):249-63. PMID: 25636220
 9. Kai Ming Liau et al. An Open-Label Pilot Study to Assess the Efficacy and Safety of Virgin Coconut Oil in Reducing Visceral Adiposity ISRN Pharmacol. 2011; 2011: 949686. PMID: 22164340
 10. Assunção ML et al. Effects of dietary coconut oil on the biochemical and anthropometric profiles of women presenting abdominal obesity. Lipids. 2009 Jul;44(7):593-601. PMID: 19437058
 11. Jon J. Kabara et al. Fatty Acids and Derivatives as Antimicrobial Agents . Antimicrob Agents Chemother. 1972 Jul; 2(1): 23–28. PMID: 4670656
 12. Ruzin A, Novick RP. Equivalence of lauric acid and glycerol monolaurate as inhibitors of signal transduction in Staphylococcus aureus. J Bacteriol. 2000 May;182(9):2668-71. PMID: 10762277
 13. Ogbolu DO, Oni AA, Daini OA, Oloko AP. In vitro antimicrobial properties of coconut oil on Candida species in Ibadan, Nigeria. J Med Food. 2007 Jun;10(2):384-7. PMID: 17651080
 14. Neal EG, Cross JH. Efficacy of dietary treatments for epilepsy. J Hum Nutr Diet. 2010 Apr;23(2):113-9. PMID: 20487176
 15. Liu YM. Medium-chain triglyceride (MCT) ketogenic therapy. Epilepsia. 2008 Nov;49 Suppl 8:33-6. PMID: 19049583
 16. Agero AL, Verallo-Rowell VM. A randomized double-blind controlled trial comparing extra virgin coconut oil with mineral oil as a moisturizer for mild to moderate xerosis. Dermatitis. 2004 Sep;15(3):109-16. PMID: 15724344
 17. Evangelista MT, Abad-Casintahan F, Lopez-Villafuerte L. The effect of topical virgin coconut oil on SCORAD index, transepidermal water loss, and skin capacitance in mild to moderate pediatric atopic dermatitis: a randomized, double-blind, clinical trial. Int J Dermatol. 2014 Jan;53(1):100-8. PMID: 24320105
 18. Burnett CL et al. Final report on the safety assessment of Cocos nucifera (coconut) oil and related ingredients. Int J Toxicol. 2011 May;30(3 Suppl):5S-16S. PMID: 21772024
 19. Mhaskar S et al. Hair breakage index: an alternative tool for damage assessment of human hair. J Cosmet Sci. 2011 Mar-Apr;62(2):203-7. PMID: 21635848
 20. Rele AS, Mohile RB. Effect of mineral oil, sunflower oil, and coconut oil on prevention of hair damage. J Cosmet Sci. 2003 Mar-Apr;54(2):175-92. PMID: 12715094
 21. Peedikayil FC, Sreenivasan P, Narayanan A. Effect of coconut oil in plaque related gingivitis - A preliminary report. Niger Med J. 2015 Mar-Apr;56(2):143-7. PMID: 25838632
 22. Stephen C. Cunnane et al. Can ketones compensate for deteriorating brain glucose uptake during aging? Implications for the risk and treatment of Alzheimer's disease. The New York Academy of Sciences, 14 January 2016
 23. Reger MA et al. Effects of beta-hydroxybutyrate on cognition in memory-impaired adults. Neurobiol Aging. 2004 Mar;25(3):311-4. PMID: 15123336
 24. Couturier P et al. [A case of coconut oil allergy in an infant: responsibility of "maternalized" infant formulas]. Allerg Immunol (Paris). 1994 Dec;26(10):386-7. PMID: 7702732
 25. Lisa M. Stutius et al. Characterizing the Relationship Between Sesame, Coconut, and Nut Allergy in Children . Pediatr Allergy Immunol. 2010 Dec; 21(8): 1114–1118. PMID: 21073539
ऐप पर पढ़ें