myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

చక్కెర ఉత్పత్తికి ఉపయోగించే చెరకు గడ్డిజాతికి చెందినది. చెరకు గడలు పొడవుగా ఉండి సంవత్సరం పొడుగునా లభిస్తాయి.  మరోవైపు, “చెరకు రసం” అనేది చెరకు గడల్ని యంత్రాల సాయంతో (గానుగలో కావచ్చు) పిప్పిచేసి తీసే చిక్కని పానకం. చెక్కుతీసిన (peeled) లేక ముడి చెఱకు గడలపైన ఉండే పట్ట (hard ply on sugarcane)ను తొలగించిన చెరకు గడల్ని మిల్లులో పెట్టి పిప్పి చేసినపుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా ఆస్వాదించే రుచికరమైన ‘చెఱకు రసం’ పానీయం సృష్టించడం జరుగుతుంది.

దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో చెరకు పుట్టింది, ఇక చెరకు గడల నుండి చక్కెర ఉత్పత్తి మొదలైంది ఉత్తర భారతదేశంలోనే అని చెప్పబడుతోంది.  అనేక సంస్కృత మరియు పాళీ గ్రంథాల్లో చక్కెర ఉత్పత్తి గురించి సూచించాయి. సంస్కృత పదం ‘శర్కర’ (Sarkara), నుండి చెరకు శాస్త్రీయ పేరు ‘శాచ్చారం’ ను తీసుకున్నారని ఊహించబడుతోంది,  తెలుస్తోంది, అంతేగాక పురాతన భారతదేశం నుండి గ్రహించి ఉంటారన్న తిలివిడికి ఇది సాక్ష్యంలా నిలుస్తోంది.

మధ్యప్రాచ్య దేశాల  నుండి వ్యాపారులు చక్కెరను మధ్యధరా ప్రాంతానికి పరిచయం చేశారు, అటుపైన ఇది స్పానిష్ మరియు పోర్చుగీసు రైతుల ద్వారా అమెరికాలోకి ప్రవేశించింది. కొలంబస్ తన రెండవ సముద్రయానంలో అమెరికాకు వెళ్ళినపుడు (కనుగొన్నపుడు) అక్కడి నుండి కరీబియన్ ద్వీపాలకు చెరకును తీసుకొచ్చారు, ఆ తర్వాత అది యూరప్కు రవాణా చేయబడినది. ఈ సమయంలో బానిసల వ్యాపారంలో చెరకు సాగు చాలా ముఖ్యమైనది.

దానిలో ఉన్న అనామ్లజనకాలు కారణంగా చెరకు రసం శరీరం మీద అద్భుతాలు చేస్తాయి. ఈ అనామ్లజనకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు రోగనిరోధకతను పెంచడంలో సహాయపడతాయి. చెరకు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు ఇతర ఎలెక్ట్రోలైట్స్ వంటి ఖనిజాలను కూడా సమృద్ధిగా కల్గి ఉంటుంది, ఇది నిర్జలీకరణానికి ఓ గొప్ప నివారిణిగా పని చేస్తుంది.

చెరకులో కొన్ని పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రదేశాల్లో, చెరకు నుండి రసాన్ని తీసిన తర్వాత మిగిలివున్న చెరకు పిప్పిని కాగితంలా పరివర్తించబడుతోంది. చెట్ల నుంచి తయారైన కాగితం మాదిరిగా కాకుండా, ఈ చెరకు కాగితం పర్యావరణ అనుకూలమైనది మరియు పునర్వినియోగపరచదగినది (recyclable). కొన్ని సందర్భాల్లో, చెరకును జీవ ఇంధనం (biofuel) వలె కూడా ఉపయోగిస్తారు మరియు ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తారు.

చెరకు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): సకారమ్ ఆఫీషినరమ్ (Saccharum officinarum)
 • కుటుంబ పేరు: పోయేసియె (Poaceae)
 • సాధారణ పేరు: చెరకు, ఈఖ్ , కరిమ్బూ, గన్నా
 • ఉపయోగించే భాగాలు: చెఱకు మొక్క యొక్క కాండాన్ని చక్కెర ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం:   చెరకు బ్రెజిల్, భారతదేశం, చైనా, థాయిలాండ్, మరియు ఫ్లోరిడా, లూసియానా, టెక్సాస్ మరియు హవాయి వంటి యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రాంతీయ భాగాలలో సాగు చేస్తారు. పెరూ ప్రపంచంలోనే చెరకు ఉత్పత్తిలో అగ్రగణ్య దేశం, దాని తరువాత జాంబియా అతిపెద్ద చెరకు ఉత్పత్తి చేసే దేశం.
 • ఆసక్తికరమైన వాస్తవం: గ్రీకు మరియు పర్షియన్ వ్యాపారులు తమ ప్రయాణంలో భారతదేశానికి వచ్చినపుడు మొట్టమొదట చెరకును చూచారు, అపుడు వాళ్ళు  చెరకును ఒక విలాసవంతమైన మరియు ఖరీదైన మసాలాగా పరిగణించారు.
 1. చెరకు రసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of sugarcane juice in Telugu
 2. చెరకు రసం దుష్ప్రభావాలు - Sugarcane juice side effects in Telugu
 3. ఉపసంహారం - Takeaway in Telugu

చెరకురసం మూత్రవిసర్జనకారిగా, బరువును పెంచే కారకంగా, నిర్జలీకరణ నివారిణిగా, పచ్చకామెర్ల మందుగా, జీర్ణక్రియను పెంచేదిగా, క్యాన్సర్ నివారిణిగా పని చేయగలదని చెప్పబడుతోంది.

 • చెరకురసం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా మూత్రవిసర్జనకు తోడ్పడుతుంది. చెరకు రసాన్ని సంప్రదాయక మూత్రవిసర్జనకారిగా ఉపయోగిస్తారు. అంతేకాక మూత్రపిండాలకు సంబంధించిన రుగ్మతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది .  
 • అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను చెరకు రసం అందింస్తుంది  అంతేకాక బరువు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు మరియు ఖనిజాలు కూడా చెరకు రసంలో ఉంటాయి.
 • బరువు చాలా తగ్గిపోయినప్పుడు చెరకు రసం బరువును పెంచే దివ్యౌషధంలా  పని చేస్తుంది అలాగే బరువు పెరగాలనుకునే వారికి ఇది ఒక సమర్థవంతమైన బరువు పెంచే మందు
 • చెరకు రసంలో ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి, ఇది అలసటకు లేదా నీరసానికి ఒక అద్భుతమైన ముందుగా పనిచేస్తుంది. బలహీనంగా ఉండేవాళ్లు లేదా ఒత్తిడికి గురైయ్యేవారు ఒక  గ్లాసెడు చెరకు రసాన్ని తరచుగా తాగాలని సిఫారసు చేయబడుతుంది.
 • చెరకు రసం కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిది, మరియు దీనిని కామెర్లకు ఒక అద్భుతమైన పరిషారంగా చెప్తారు. చెరుకు ఆల్కలీన్ ఆహార పదార్థం అయినందున, ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా చెరకురసం కాలేయ సమస్య తగ్గి వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
 • చెరకు రసం పొటాషియం యొక్క గొప్ప వనరు,ఇది కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్ల పై పోరాడటానికి సహాయపడుతుంది మరియు వాటి వలన కలిగే సమస్యల నుండి కూడా కాపాడుతుంది.  
 • పొటాషియంకు మంచి వనరుగా, చెరుకు రసం pH స్థాయిలను సమతుల్యంలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
 • చెరకులో యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి మరియు అందువల్ల ఇది యాంటీ-క్యాన్సర్ ఎజెంట్ గా పనిచేస్తుంది. చెరకు రసంలో ఉండే  అనేక సమ్మేళనాలు రాడికల్-స్కావెంజెన్ సామర్ధ్యం కలిగి ఉంటాయి.
 • చెరకురసం ఊపిరితిత్తుల, మెలనోమా , పెద్దప్రేగు, ప్రోస్టేట్, అండాశయం మరియు మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ కణాలపై  వ్యతిరేక చర్యలను చూపినట్లు పరిశోధనలు కనుగొన్నాయి.
 1. మూత్రవిసర్జనకారిగా చెరకు రసం - Sugarcane juice as a diuretic in Telugu
 2. బరువును పెంచేందుకు చెరకు రసం - Sugarcane juice for weight gain in Telugu
 3. నిర్జలీకరణకు చెరకు రసం - Sugarcane for dehydration in Telugu
 4. కామెర్లకు చెరకు రసం - Sugarcane juice for jaundice in Telugu
 5. జీర్ణక్రియకు చెరకు రసం - Sugarcane juice for digestion in Telugu
 6. క్యాన్సర్ కు చెరకు రసం - Sugarcane juice for cancer in Telugu

మూత్రవిసర్జనకారిగా చెరకు రసం - Sugarcane juice as a diuretic in Telugu

చెరకు రసాన్ని సంప్రదాయకంగా మూత్రవిసర్జనకారిగా ఉపయోగిస్తారు. చెరకు రసం మూత్రపిండాల సరైన పనితీరును నిర్ధారిస్తుంది, చెరకు రసాన్ని సాధారణంగా సేవిస్తుంటే మూత్రం యొక్క స్పష్టమైన మరియు వేగవంతమైన ప్రవాహానికి  తోడ్పడుతుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరం నుండి అదనపు విషాన్ని తొలగించడం ద్వారా, అధిక రక్తపోటు , మూత్ర నాళాల అంటువ్యాధులు మరియు ఇతర మూత్రపిండాల సంబంధిత వ్యాధులను నివారించడంలో చెరకురసం మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

బరువును పెంచేందుకు చెరకు రసం - Sugarcane juice for weight gain in Telugu

సంప్రదాయిక నమ్మకం ప్రకారం, చెరకు రసాన్ని నిరంతరంగా ఓ క్రమబద్ధమైన పద్ధతిలో సేవిస్తే బరువు పెరుగుటానికి తోడ్పడుతుంది. శరీరాన్ని మెరుగుపరచడంలో మరియు శరీరం యొక్క సరైన నిర్వహణ కోసం అవసరమైన కార్బోహైడ్రేట్ల ఆరోగ్యకరమైన రకాన్ని అందించడంలో సహాయపడే పోషకాలు మరియు ఖనిజాలను చెరకు రసం కలిగి ఉంది. అందువల్ల, వ్యక్తుల బరువు ప్రమాదకరమైన తక్కువ స్థాయికి పడిపోయినపుడు చెరకు రసం వారి బరువును పెంచే దివ్యౌషధంలా  పని చేస్తుంది లేదా కొన్ని అదనపు కిలోల బరువు పెరగాలనుకునే వారికి ఇది ఓ సమర్థవంతమైన బరువు పెంచే మందుగా పనిచేస్తుంది.

(మరింత చదువు: బరువును పెంచడంలో తోడ్పడే ఆహారావిధాన పట్టిక)

నిర్జలీకరణకు చెరకు రసం - Sugarcane for dehydration in Telugu

చెరకు రసం ముఖ్యమైన ఖనిజాలను అధిక పరిమాణంలో కల్గి ఉంటుంది, ఇది అలసటకు లేదా నిశ్శక్తికి అద్భుతమైన చికిత్సగా పనిచేస్తుంది. బలహీనంగా ఉండేవాళ్లు లేదా ఒత్తిడికి గురైన వ్యక్తులు ఓ గ్లాసెడు చెరకు రసాన్ని తరచుగా తాగాలని ప్రోత్సహిస్తారు, తద్వారా వారి దేహాలు చల్లబడి తిరిగి శక్తిని పుంజుకుంటాయి. రోజులో కోల్పోయిన ఎలెక్ట్రోలైట్లు మరియు కార్బోహైడ్రేట్ ద్రవాన్ని (CHOs) శరీరానికి అందించి చెరకు రసం వ్యక్తి సేదదీరేట్లు  చేసి కొత్తశక్తిని పుంజుకునేలా సహాయపడుతుంది.

వ్యాయామం అనంతరం, సాదా నీరు బదులు చెరకు రసం సేవిస్తే, మన కండరాల్లోని శర్కరాజనకాల్ని(glucogens) పునఃసంయోజనం చేసే ‘రీహైడ్రేషన్ పానీయం’గా పనిచేసి శరీరంలో కోల్పోయిన జలాన్ని తిరిగి నింపుతుంది. అథ్లెట్లు మరియు భారీ వ్యాయామాలలో మునిగిపోయే వ్యక్తులకు చెరకురసాన్ని సిఫారసు చేయటానికి గల కారణాల్లో ఇది ఒకటి.

(మరింత చదువు: నిర్జలీకరణ కారణాలు మరియు చికిత్స)

కామెర్లకు చెరకు రసం - Sugarcane juice for jaundice in Telugu

కామెర్ల వ్యాధిలో కాలేయం పనిచేయకుండా పోతుంది మరియు పిత్తాశయం పైత్యరస వర్ణద్రవాన్ని(bilirubin)ఎక్కువగా ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది, ఈ ‘పైత్యరసం వర్ణద్రవం’ అనేది పైత్యరసంలోని పసుపు భాగాన్ని తయారుచేసే రసాయనం. దీని ఫలితంగా, ఈ రుగ్మత ప్రభావిత వ్యక్తి చర్మం మరియు గోర్లు పసుపు రంగులోకి పాలిపోవడం వంటి లక్షణాలను చూపుతారు.

సంప్రదాయకంగా, చెరకు రసం కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిది, మరియు అది కామెర్లు వ్యాధికి ఒక అద్భుతమైన పరిహారం అని భావిస్తారు. చెరుకు ఆల్కలీన్ ఆహార పదార్థం అయినందున, ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా చెరకురసం కాలేయరుగ్మత మాని వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

అంతేకాక, చెరకులో ఉండే పోషకాలు కాలేయం కోలుకోవటానికే కాక శరీరాన్నిబలంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది, మరియు కాలేయం వ్యాధులకు ప్రయోజనకరమైన మందుగా లేదా సహాయక నివారిణిగా పని చేస్తుంది.

(మరింత చదువు: కాలేయ వ్యాధి చికిత్స)

జీర్ణక్రియకు చెరకు రసం - Sugarcane juice for digestion in Telugu

చెరకు రసం పొటాషియం యొక్క గొప్ప వనరుగా చెప్పబడుతుంది, ఇది జీర్ణ రసాల సమతుల్య స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కూడా కడుపులో వచ్చే అంటువ్యాధులపై పోరాడటానికి మరియు అవి హానికరమైన వ్యాధులుగా అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. పొటాషియం మూలంగా , చెరుకు రసం కూడా పిహెచ్ (pH) స్థాయిలను సమతుల్య స్థితిలో ఉంచడంలో సహాయం చేస్తుంది, తద్వారా ఆరోగ్యవంతమైన కడుపు పనితీరుకు దోహదం చేస్తుంది.

చెరకు రసంలో ప్రధాన భాగం నీరు కావడం వల్ల, ఇది మలాన్ని మృదువుగా అయ్యేట్లు సహాయపడుతుంది, ఆరకంగా ఇది మలబద్ధకానికి మందుగా పనిచేస్తుంది. .

(మరింత చదువు: జీర్ణక్రియను మెరుగుపరచడం ఎలా )

క్యాన్సర్ కు చెరకు రసం - Sugarcane juice for cancer in Telugu

చెరకు అనామ్లజనకాలు పుష్కలంగా ఉంటాయి మరియు అందువల్ల ఆంటిక్యాన్సర్ ఎజెంట్కు ఒక సంభావ్య మూలం. చెరకు రసంలో ఉన్న అనేక సమ్మేళనాలు ప్రామాణిక ఔషధాల కంటే ఎక్కువ రాడికల్-స్కావెంజెన్ సామర్ధ్యం చూపాయి. అంతేకాకుండా, చెరకు, ఊపిరితిత్తుల, మెలనోమా , పెద్దప్రేగు, ప్రోస్టేట్, అండాశయం మరియు మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా చెరకు నిరోధక చర్యను కూడా పరిశోధనలు కనుగొన్నాయి .

(మరింత చదువు: క్యాన్సర్ రకాలు)

తేనె తర్వాత, చెరకు సహజ చక్కెర యొక్క ఉత్తమ వనరులలో ఒకటిగా చెప్పబడుతుంది. మరియు మరెన్నో ఇతర సహజ ఆహార వస్తువుల మాదిరిగా, ఇది చాలా ఆరోగ్య సమస్యలకు ఒక పరిహారం వలె పనిచేస్తుంది, శరీరాన్ని ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, చెరకు వినియోగదారులకు హానికరం అని రుజువైన సందర్భాలు ఉన్నాయి, ఇదొక అద్భుతమైన గడ్డిజాతి పంటే కానీ,ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కల్గించవచ్చు.

 • చెరకు రసం ఎక్కువసేపు గాలికి గురైనప్పుడు అది ఆక్సీకరణం లేక ఆక్సిడైజ్ పొందడం వలన దాన్ని తాగే ఎవరికైనా ప్రాణాంతకంగా మారుతుంది. మీరు సరైన నిల్వ పద్ధతులను అనుసరించని పక్షంలో లేదా వీధి వైపు అమ్మకందారుల నుండి చెరకు రసం కొనుగోలు చేస్తే ఇది అపరిశుభ్రంగా ఉన్నయెడల అపాయకరంగా భావించవచ్చు.
 • చెరకు కార్బొహైడ్రేట్ల యొక్క గొప్ప మూలం. ఇది కేలరీలలో కూడా గొప్పది. దీని అర్థం చెరకు రసం యొక్క అధిక వినియోగం శరీరానికి హాని కలిగించగలదు మరియు బరువు పెరుగుటకు దారి తీయవచ్చు.
 • చక్కెర చెరకు రసం వినియోగం దంత క్షయాల అవకాశాలను పెంచుతుందని స్టడీస్ సూచిస్తున్నాయి .
 • చెరకు చక్కెరవ్యాధి (డయాబెటిక్) రోగులకు మంచిది అని ఇప్పటికే తేలింది. అయినప్పటికీ, చెరకురసం సహజ చక్కెర అయినా, దాన్ని ఎక్కువగా సేవించడం హానికరమైనదిగా ఉంటుంది,  అందువల్ల, చెరకురసం సేవనాన్ని నియంత్రించేందుకు జాగ్రత్త తీసుకోవాలి.
 • చెరుకు రసం పరిశుభ్రమైన పరిస్థితులలో ఉత్పత్తి చేయకపోతే లేదా చెరకు గడలు సరిగా శుభ్రపరచకుండా ఉండకపోతే, అది వ్యాధికారక సూక్ష్మజీవులను కల్గి ఉండవచ్చు, అందువల్ల దీన్నుండి మనకు వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా, చెరకు గడల పైన పిచికారీ చేసిన రసాయనిక పురుగుమందుల ఉనికి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది.
 • సుదీర్ఘకాలం నుండి చెరకును జానపద ఔషధంగా వాడుతున్నారు మరియు ఇది అనేక రుగ్మతలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ, విషకారక భారీ ఖనిజాలను (ఉదా. కాడ్మియం, లెడ్ లేక సీసం) సూక్ష్మపోషకాలు (ఉదా. కాపర్, జింక్, మాంగనీస్) శరీరంలోకి వ్యాపింపచేయగల  సామర్థ్యం దీనికున్న కారణంగా చెరకు సేవనం మనుషులలో విష ప్రభావాలను ప్రేరేపిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, వృత్తిపర ద్రావకాలకు గురైన చెరకు రైతుల నోటి కుహరంలో ఫారింక్స్ క్యాన్సర్ లేక ఓరల్క్యావిటీ ప్రమాదం కనిపించింది.

చెరకు రసం అనేది భారతీయ కుటుంబాలల్లో, మరీ ముఖ్యంగా వారి వంటగదుల్లో, ప్రముఖ పాత్రను పోషించే ముఖ్యమైన పానీయం. చెఱకు గడ చక్కెరకు సహజ వనరుగా ఉండడమే కాకుండా, దీని రసం దప్పికను, అలసటను తీర్చే ఓ గొప్ప వేసవి పానీయం లక్షణాల్ని కూడా కల్గి ఉంది. చెరకు యొక్క ఆరోగ్య లక్షణాలు ప్రాచీన భారతదేశ (భాషల) లిపిలో కూడా ప్రస్తావించబడ్డాయనే వాస్తవం మానవులకు చెరకు ఎంత ప్రయోజనకరమో మరియు ఇది శరీర ఆరోగ్యాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలదోనన్న విషయాన్ని చెపుతోంది. అయినప్పటికీ, చెరకు రసం తాగేటపుడు జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే అధిక ప్రమాణంలో ఈ తియ్యని రసాన్నితాగితే మంచి కన్నా ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది.

और पढ़ें ...

References

 1. Amandeep Singh et al. Phytochemical profile of sugarcane and its potential health aspects. Literature Review · May 2015
 2. Richard P. Spencer. Potassium metabolism and gastrointestinal function; a review. The American Journal of Digestive Diseases February 1959, Volume 4, Issue 2, pp 145–158
 3. Amandeep Singh et al. Phytochemical profile of sugarcane and its potential health aspects . Pharmacogn Rev. 2015 Jan-Jun; 9(17): 45–54. PMID: 26009693
 4. J Karthikeyan, S Sankar Samipillai. Sugarcane in therapeutics. ResearchGate [Internet]
 5. Kommi Kalpana et al. The Effects of Ingestion of Sugarcane Juice and Commercial Sports Drinks on Cycling Performance of Athletes in Comparison to Plain Water . Asian J Sports Med. 2013 Sep; 4(3): 181–189. PMID: 24427476
 6. Frencken JE, Rugarabamu P, Mulder J. The effect of sugar cane chewing on the development of dental caries. J Dent Res. 1989 Jun;68(6):1102-4. PMID: 2808868
 7. Bruno Henrique Fumes et al. Determination of pesticides in sugarcane juice employing microextraction by packed sorbent followed by gas chromatography and mass spectrometry . Journal of Separation Science, 24 May 2016
 8. Alves VG et al. Phenolic compounds and anticancer activity of commercial sugarcane cultivated in Brazil. An Acad Bras Cienc. 2016 Sep;88(3):1201-9. PMID: 27598841
 9. Duarte-Almeida JM et al. Antiproliferative and antioxidant activities of a tricin acylated glycoside from sugarcane (Saccharum officinarum) juice. Phytochemistry. 2007 Apr;68(8):1165-71. Epub 2007 Mar 12. PMID: 17350657