ఒకప్పుడు “గ్రీన్ టీ” అంటే అందరికీ తెలియని పానీయం. కాని ఇప్పుడు లక్షలాదిమందికి ఉదయం లేస్తూనే తీర్చుకోవాల్సిన ముఖ్యమైన కాలకృత్యాది అవసరాల్లో గ్రీన్ టీ సేవనం ఒకటైపోయింది. గ్రీన్ టీ మన జీవితాల్లోకి ఖచ్చితంగా ఒదిగిపోతుంది. టీ స్థాయి నుండి ఆరోగ్యాన్ని పెంపొందించే రసాస్వాద పానీయంగా గ్రీన్ టీ విలువ పెరిగిందిపుడు. నేను పందెం వేసి మరీ చెబుతున్నాను, “గ్రీన్ టీ గురించిన ప్రయోజనాల గురించి తెలిసీ కూడా నేనెందుకు దీన్నింతవరకూ తాగడం ప్రారభించలేద”న్న భావన మీలో ఇపుడే కలుగుతోంది కదూ! ఒకవేళ మీరు దీని రుచిని ఇష్టపడకపోయినా నేడు దాదాపు ప్రతి ఇంటిలోను చోటు సంపాదించుకున్న పానీయం గ్రీన్ టీ.  

మీకు తెలుసా?

వేల సంవత్సరాలకు పూర్వం టీ పానీయం పురాతన చైనాలో జన్మించింది. ఎవరు కనిపెట్టారీ టీ పానీయాన్ని అంటే, చైనా చక్రవర్తి షెన్నాంగ్ చేత కనుగొనబడింది అనేది చైనా పురాణాలు చెబుతున్నాయట. అది కూడా ఆ చక్రవర్తి ఈ పానీయాన్ని యాదృశ్చికంగా కనుగొన్నాడట. ఆసక్తికరంగా, షెన్నాంగ్ చక్రవర్తి "చైనా వైద్య పితామహుడి" గా కూడా పేరుపొందాడు. అయితే, ఈ టీ యాదృశ్చికంగా కనిపెట్టబడిందా, నిజంగానే కనిపెట్టబడిందా లేక బాగా ఆలోచించి ఓ సూత్రం (ఫార్ములా) ప్రకారం కనిపెట్టబడిందా అనే విషయాన్ని టీ ప్రేమికులే అన్వేషించాలీ మరి. ఎందుకంటే ఈ విషయం చరిత్రలో ఎక్కడో సమాధై ఉండొచ్చు. ఈ టీ-పానీయ సేవనం అనే సంస్కృతి చైనా నుండి జపాన్ కు విస్తరించింది, అంతలోనే ఇది కాస్తా ప్రపంచం మొత్తం ప్రజాదరణ పొందింది. ఇక, భారతదేశంలో టీ యొక్క నిజమైన చరిత్ర ఏమంత స్పష్టమైనది కాదు. కానీ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించక మునుపే “అడవి టీ” (గ్రీన్ టీ కావచ్చు) పేరిట భారతీయులు టీ పానీయం సేవించేవారన్న విషయం తెలిసింది.

  1. గ్రీన్ టీ రకాలు మరియు ఉపయోగం - Types of Green Tea and uses in Telugu
  2. గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు - Benefits of green tea in Telugu
  3. గ్రీన్ టీని ఎలా చేయాలి - How to make green tea in Telugu
  4. రోజులో ఎన్ని కప్పుల గ్రీన్ టీ సేవించొచ్చు? - How many cups of green tea can be taken per day in Telugu?
  5. గ్రీన్ టీ దుష్ప్రభావాలు - Green Tea Side Effects in Telugu
గ్రీన్ టీ ప్రయోజనాలు, దుష్ప్రభావాలు, వాడకం వైద్యులు

గ్రీన్ టీ రకాలు మరియు ఉపయోగం

మనకు టీ ఎక్కడ లభిస్తుంది? గ్రీన్ టీ అంటే ఏమిటి? గ్రీన్ టీ కంటే ఇతర రకాల టీ లు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ గ్రీన్ టీ మీ సాధారణ టీ కంటే మెరుగైనదా? అవును, మెరుగైనదే! అయితే, ఎలా? ఏవిధంగా గ్రీన్ టీ మామూలు టీ కంటే మెరుగైంది?లాంటి ప్రశ్నలు మనందరి మదిలో మెదుల్తాయి. ఈ ప్రశ్నలన్నింటికీ వరుసగా సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.

టీ పానీయంలో ఎన్ని రకాలున్నాయో ఆ అన్ని రకాలు కూడా ఒకే ఒక్క “టీ మొక్క” నుండే లభిస్తాయి. ఆశ్చర్యపోతున్నారా? అవును ఒకే రకమైన టీ మొక్క లేదా "టీ ప్లాంట్" నుండే రక రకాలైన టీ పానీయాలు లభిస్తాయి. ముడి తేయాకుల ‘ఆక్సిడెషన్ స్థాయి’ నుండి టీ- పానీయంలో రకాలు జనిస్తాయి. ఈ దిశలో ఆలోచిస్తే ‘బ్లాక్ టీ’ చాలా ఆక్సీకరణ చెందిన టీ మరియు ‘గ్రీన్ టీ’ ఆక్సీకరణ చెందని (unoxidized) టీ పానీయం. ప్రసిద్ధ “ఓలాంగ్ టీ” భాగశః ఆమ్లజనీకరణం (oxidisation) చేయబడింది. అయితే కొన్ని ఇతర రకాలైన టీ లు పులియబెట్టడం మూలంగా తయారవుతాయే కానీ ఎప్పుడూ ఆమ్లజనీకరణం చేయబడవు (Puerh tea).

టీ గురించి అవగాహన చేసుకునే దిశలో మీరు యోచిస్తుండగా మధ్యలో ఈ జీవశాస్త్ర పదం “ఆక్సిడేషన్” (లేదా ఆక్సీకరణం) వచ్చి అడ్డుపడుతోందా? దాని గురించి కూడా  వివరిస్తాం. ఆక్సిడేషన్ అంటే ఆహారం ద్వారా ఆక్సిజన్ (ప్రాణవాయువు)ను శోషణ చేయడం. జీవరసాయనికంగా ఆహారంలో మార్పులకు కారణమవుతుంది, ఇక్కడ ఈ టీ విషయంలో, ముడి టీ ఆకులు ఆ మార్పునకు లోనవుతాయి. కట్ చేసి పెట్టిన యాపిల్‌పండును ఎప్పుడైనా గమనించారా, అది గోధుమ రంగులోకి మారడం గమనించే ఉంటారు మీరు. అవునా? అదే ఆక్సీకరణం అంటే.  టీ తయారీ విషయంలో భాగశః ఆక్సీకరణం సహజమైంది, మరి మిగిలిన ఆ కొంత ఆక్సీకరణాన్నినియంత్రించిన పరిస్థితులు గల్గిన గదులలో చేయబడుతుంది. ఆ సమయంలో గదుల ఉష్ణోగ్రతను, తేమను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఆకులు ఒక నిర్దిష్ట స్థాయి ఆక్సీకరణ స్థాయిని చేరుకున్న తర్వాత, అప్పటి వరకూ జరుపుతున్న ఓ నిర్దిష్టస్థాయి వేడి ప్రక్రియ నిలిపివేయబడుతుంది. అయినప్పటికీ, ఆక్సీకరణ అనేది ఒక సహజ ప్రక్రియ మరియు పూర్తిగా నిలిపివేయబడదు.  కాని, టీకి ఓ మంచి నిల్వ ఉండే (shelf life) శక్తిని ఇవ్వడానికి ఆక్సీకరణ ప్రక్రియను తగినంతగా తగ్గించవచ్చు.

మీరు రెగ్యులర్ గా తాగే టీ సాధారణంగా పాలు మరియు పంచదారతో ఉడికించిన బ్లాక్ టీ. బ్లాక్ టీ కి పాలు మరియు పంచదార కలిపితే మీ ఆరోగ్యానికి మంచి కంటే మరింత హాని చేస్తుందని వాదించే వారు కొందరున్నారు. కానీ ఆ వాదనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. కాబట్టి, దీన్ని గురించి శాస్త్రీయ ప్రమాణాల లేకపోవడంతో, మీ శరీర తత్వానికి ఏది సరిపోతుందో దాని గురించి పోషకాహార నిపుణులతో సంప్రదింపులు జరిపి నిర్ణయించుకోవచ్చు.

మూలికలతో తయారైన టీ రకాలు (హెర్బల్ టీస్) టీ మొక్కకు బదులుగా హైబిస్కస్, జాస్మిన్, చమోమిలే వంటి వివిధ మొక్కల నుండి తయారు చేస్తారు. కాబట్టి, అవి గ్రీన్ టీగా పరిగణించబడవు. అయినప్పటికీ, చాలా రకాలైన రుచులు కల్గిన గ్రీన్ టీ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పుదీనా గ్రీన్ టీ, మల్లెల గ్రీన్ టీ, నిమ్మకాయ గ్రీన్ టీ వంటివి.   మార్కెట్ కు వెళ్ళినపుడు టీ ఉత్పత్తి యొక్క యదార్ధత (genuinity) కోసం దానిపై లేబుల్ను తనిఖీ చేయడం మంచిది.

చాలా రకాలైన టీ బ్రాండ్ల టీ పొడి ప్యాక్ చేయబడకుండా, అంటే లూజ్ గా, మార్కెట్లో లభిస్తుంది. అయితే, మీరు టీ ని అమితంగా ఇష్టపడేవారైతే, మరీ అందులోనూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ నే ఉపయోగిస్తూ ఉన్నట్లైన, అలాంటి నాణ్యమైన టీ పొడి “టీ బ్యాగులు” రూపంలో లభిస్తుంది. వాటిని ఎన్నుకొని కొనవచ్చు. ఇలాంటి బ్రాండ్ టీ పొడులు క్యాప్సుల్స్ రూపంలో మరియు టాబ్లెట్ల రూపంలో కూడా లభిస్తుంది.

“డీకాఫీనేటెడ్” (Decaffeinated) గ్రీన్ టీ రకంలో కెఫిన్ పదార్థాన్ని తొలగించి ఉంటారు. కఫిన్ పదార్థాన్ని తట్టుకోలేని లేక తాగలేని వారికి ఇలాంటి కఫిన్  తొలగించిన గ్రీన్ టీ అందుబాటులో ఉంది. ఇలాంటి టీ లో “యాంటీ-ఆక్సిడెంట్లు” తక్కువుంటాయి. అయితే డీకాఫీనేటెడ్ టీ మరియు మామూలు టీ ల మధ్య భేదాన్ని వివరించే అధ్యయనాలు ఏవీ లేవు.   

గ్రీన్ టీ రకాలు - Types of Green Tea in Telugu

టీ ప్రపంచపు తలుపులు తడితే టీ రకాల్లో చాలా రకాలు ఉన్నాయన్న సంగతి అవగతమవుతుంది. ఒక్క జపాన్ లోనే కనీసం 10 ప్రముఖ రకాలైన టీ రకాలను పండిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీ లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పాలంటే మరో కొత్త వ్యాసమే రాయాల్సి ఉంటుంది. అయినా విజ్ఞానం కోసం కొన్ని రకాలైన గ్రీన్ టీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • సెంచా గ్రీన్ టీ:
    సెంచా గ్రీన్ టీ అనేది జపాన్లో దొరికే అతి సామాన్యమైన టి మరియు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని తయారీలో టీ  ఆకులను ఉడికిస్తారు. సేన్చా జపనీయుల గ్రీన్ టీలో అత్యంత సాధారణ రూపం మరియు ఇది సిద్ధం చేయడానికి సులభమైనది. ముడి ఆకులు ఉడికిస్తారు, ఆక్సీకరణను ఆపడానికి ఉడికించన టీ ఆకుల్ని చుట్టలుగా చుట్టి ఎండబెట్టి వాటికి సంప్రదాయ ఆకృతిని ఇస్తారు. వినియోగదారులు ఆ ఆకుల్ని అతి సులభంగా ఓ కప్పు నీటిలో వేడి చేసుకుని టీ గా తాగుతారు.  
  • గైకోరో గ్రీన్ టీ:
    సెంచా గ్రీన్ టీ కి గైకోరో గ్రీన్ టీ కి వ్యత్యాసం ఉంది. అంటే టీ ఆకులను కోసుకోవడంలో (అంటే టీ ఆకు సంగ్రహం) వ్యత్యాసం ఉంది. గైకోరో గ్రీన్ టీ తయారీలో టీ ఆకుల్ని కోసేందుకు 20 రోజులు ముందుగానే టీ మొక్కల్ని ఒక బట్టతో కాపీ ఉంచుతారు. ఇలా చేయడం వల్ల టీ ఆకులు మరింత సువాసనను సంతరించుకుంటాయి. టీ ఆకుల్లో కాటెచిన్ల సంఖ్య ను తగ్గించేందుకు ఇలా బట్ట కప్పుతారు.  ఈ టీ యొక్క మరొక రకం, కబుసేచా.” గైకోరో గ్రీన్ టీ కి చాలా సారూప్యంగానే టీ మొక్క పెరుగుతుండీ రకంలో, కాని టీ మొక్క ఒక వారం పాటు మాత్రమే బట్టతో కప్పబడుతుంది .
  • మచ్చా గ్రీన్ టీ:
    “తెన్చా” అని పిలవబడే మరొక రకపు గ్రీన్ టీ రకాన్ని పొడిగా మార్చడాన్ని “మచ్చా గ్రీన్ టీ” పొడి అని అంటారు. తెన్చా టీ మొక్క గైకోరో గ్రీన్ టీ మొక్క లాగానే నీడలో పెరుగుతుంది, కానీ బట్టతో మొక్కకు చేసే “కవరింగ్” సమయం 20 రోజులు కంటే ఎక్కువగా ఉంటుంది. మరియు ఆకుల్ని రోలింగ్ చేయకుండా ఎండబెట్టబడతాయి. టెన్చా టీ, అది రవాణా చేయబడటానికి కాస్త ముందు దాన్ని పొడిగా మారుస్తారు. దాన్నే “మచ్చా గ్రీన్ టీ” పొడి గా పిలువబడుతుంది.
  • చైనీస్ గన్పౌడర్ టీ:
    ఈ రకం “చైనీస్ గన్పౌడర్ గ్రీన్ టీ” కి దాని పేరు ఎలా వచ్చిందంటే దాని తయారీలో టీ ఆకుల్ని ఉడకబెట్టిన తర్వాత  ఓ ప్రత్యేకమైన రూపంలో చుట్టబడతాయి. దీనికి ఓ ప్రత్యేకమైన పొగకు- సంబంధించిన వాసన (స్మోకీ రుచి) కలిగి ఉండడం వల్ల దీనికి “చైనీస్ గన్పౌడర్ టీ అనే పేరు స్థిరపడింది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

గ్రీన్ టీని నిత్యం సేవిద్దాం అనే ఆలోచన మదిలో కొచ్చిన వెంటనే మనకు అన్పించే మరో విషయమేంటంటే గ్రీన్ టీ ఆరోగ్యకరమైనదేనా? అనే ప్రశ్న. లేదా ఇది కేవలం ఈ ఆధునిక కాలంలో వస్తున్న ఊకదంపుడు ప్రచారం స్టంటేనా. శుభవార్త ఏమిటంటే గ్రీన్ టీ రుచిలో కొంచెం చేదుగా ఉన్నా దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వివిధ రుచుల్లో లభిస్తుంది.  వాస్తవానికి, గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు టీ ఆకుల్లో దాగి ఉన్న ప్రత్యేకమైన సహజ పదార్థ సమ్మేళనాల వల్ల మనకు చేకూరుతాయి. టీ ఆకులోని ఈ పదార్థాలను “కెటెచిన్లు” అని పిలుస్తారు. తేయాకును (టీ పోవెడెర్ కూడా కావచ్చు) ను మరగబెట్టినపుడు కెటెచిన్లు నీటిలో కరిగిపోయి టీ డికాక్షన్ గా తయారవుతాయి. వేడి వేడిగా మనం చప్పరించే గ్రీన్ టీ యొక్క కొన్ని ప్రయోజనాలను గురించి ఇపుడు పరిశీలిద్దాం. 

  • ఆయుర్వేద వైద్యుల ప్రకారం, గ్రీన్ టీ లో కెఫిన్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది మెదడు కణాలపై ప్రత్యక్ష ప్రేరణను కలిగిస్తుంది.దాంతో మెదడుని ఉత్తేజపరుస్తుంది.
  • గ్రీన్ టీ పై జరిపిన అనేక పరిశోధనలు చెబుతున్నదేమిటంటే, గ్రీన్ టీ నిజంగానే శరీర బరువును  తగ్గించుకోవడానికి ప్రభావవంతంగా పని చేస్తుందని సూచిస్తున్నాయి.
  • గుండె-సంబంధ  వ్యాధులను తెచ్చిపెట్టే  అత్యంత సాధారణ లక్షణాలను తగ్గించడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • సూక్ష్మజీవుల వల్ల కలిగే చెడు ప్రభావాన్ని అరికట్టే సహజ ఉత్పత్తుల అవసరం చాలా ఉంది. ఇలాంటి సహజ ఉత్పత్తులు సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి శరీరంలో వాటి వృద్ధిని కష్టతరం చేస్తాయి. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • గ్రీన్ టీ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చెడుశ్వాసను పోగొట్టేందుకు పని చేస్తాయి. చిగుళ్లవ్యాధులు,  లేదా దంత సమస్యలు చెడుశ్వాస వంటి వాటి లక్షణాల పై గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
  • వాడేసిన గ్రీన్ టీ సంచులను (small poaches) అంటే ఉబ్బిన కన్నులకు లేపన ఔషధంగా వాడవచ్చు.
  • గ్రీన్ టీ పోషకాంశాలకు (విటమిన్లకు) నిలయం. ముఖ్యంగా విటమిన్ B, C మరియు E లు గ్రీన్ టీలో సమృద్ధిగా ఉన్నాయి. ఈ విటమిన్లు జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి.
  • ప్రతి రోజు గ్రీన్ టీని తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం చాలా తక్కువ అని అధ్యయనాలు చెప్తున్నాయి.
  • గ్రీన్ టీలోని “పాలిఫేనోల్స్”అని పిలువబడే ఒక రకమైన జీవసంబంధమైన సమ్మేళనాలు కీళ్ల నొప్పులు, కీళ్లవాపులకు శక్తివంతంగా పని చేస్తాయి.
  • గ్రీన్ టీ యొక్క యాంటీఆక్సిడెంట్ గుణాలు  న్యూరోప్రొటెక్టివ్ (మెదడు కణాలను రక్షిస్తుంది మరియు న్యూరాన్స్ యొక్క నష్టాన్ని నివారిస్తుంది)గా పని చేస్తాయి.
  • గ్రీన్ టీ  స్వీయ రోగనిరోధక వ్యాధులు (auto immune disorders) నుంచి రక్షిస్తుంది, అది T కణాలను నియంత్రణలో ఉంచడంలో సహాయం చేస్తుంది.
  • ప్రతి రోజు గ్రీన్ టీని సేవించడం వలన రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు అని అధ్యయనాలు చెప్తున్నాయి.    

గ్రీన్ టీ సమర్థవంతమైన సూక్ష్మజీవనాశిని - Green tea is an effective antimicrobial in Telugu

పరిశోధనల పురోభివృద్ధితో, చాలా వ్యాధులకు నేడు “యాంటీబయాటిక్స్” (అంటే సూక్ష్మకీటక నాశిని మందులు) మందుల షాపుల్లో లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు ప్రాణాంతకమైనవిగా భావించబడిన అనేక వ్యాధులు ఇప్పుడు నయమైపోతున్నాయి. ఇది అభివృద్ధి చెందిన సాంకేతికత వల్లనే సాధ్యమైంది. కానీ, విజయవంతమైన ఔషధ పరిశోధనలు మందులక్కూడా లొంగని అతి సూక్ష్మజీవుల (microbes) సమస్యను కొత్తగా సృష్టి చేసింది, ఇది మానవాళికి ఓ భిన్నమైన సవాలుగా మారింది. ఈ అతిసూక్ష్మజీవుల వల్ల కలిగే చెడు ప్రభావాన్ని విస్తృతంగా అరికట్టే సహజ ఉత్పత్తుల అవసరం చాలా ఉంది. ఇలాంటి సహజ ఉత్పత్తులు అతిసూక్ష్మజీవులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి శరీరంలో వాటి వృద్ధిని కష్టతరం చేస్తాయి. ఫంగల్, వైరల్ మరియు బ్యాక్టీరియల్ అంటువ్యాధులను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టీ ఆకులో ఉండే కెటెచిన్ల కారణంగానే గ్రీన్ టీకి  ఔషధగుణాలు ఏర్పడ్డాయి. గ్రీన్ టీ చాలా సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకుంటుందని మరియు వ్యాధిని కలిగించే బాక్టీరియాను సమర్థవంతంగా చంపేస్తుందని అధ్యయనకారులు చెబుతున్నారు. పైగా, గ్రీన్ టీ యొక్క (యాంటీమైక్రోబియాల్ ఎఫెక్ట్స్-MRSA- మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్) అతిసూక్ష్మజీవనాశక ప్రభావాలు ఔషధ-నిరోధక బాక్టీరియాపై ప్రభావవంతంగా పోరాడుతుంది. అయినప్పటికీ, వైద్య చికిత్సలలో గ్రీన్ టీ యొక్క ఈ అతిసూక్ష్మజీవనాశక ప్రభావాల్ని (యాంటీమైక్రోబయల్ కారకాన్ని) ఎలా సంపూర్ణముగా ఉపయోగించుకోవాలన్నదానిపై పరిశోధనలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.

స్వయం ప్రతిరక్షక వ్యాధులకు గ్రీన్ టీ - Green tea for autoimmune diseases in Telugu

ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణాలకు వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను సృష్టిస్తుంది. అలాంటి పరిస్థితుల్నే “స్వీయ రోగనిరోధక వ్యాధులు” అని వ్యవరిస్తారు. బలహీనమైన శరీరం మరియు రోగనిరోధక వ్యవస్థ అనేక సాధారణ అంటురోగాలకు గురయ్యే అవకాశం ఉంది. ఒకవ్యక్తి రోగనిరోధక వ్యవస్థకు విరుద్ధంగా అతని లేక ఆమె స్వంత రోగనిరోధక వ్యవస్థే పని చేస్తున్నందున, ఇలాంటివారికి చికిత్స చేయడం ఒక సాధారణ వ్యక్తికి చికిత్స చేయటం కన్నా చాలా కష్టం. ఒరెగాన్ స్టేట్ యునివర్సిటీ ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం, గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగకరమైంది. గ్రీన్ టీలో కొన్ని సమ్మేళనాలు నియంత్రిక “T   కణాల” (రోగనిరోధక వ్యవస్థలోని ఓ రకమైన కణాలివి, శరీర స్వంత కణాలపై దాడి చేయకుండా నిరోధించే వ్యవస్థ గా పని చేస్తాయి ఈ కణాలు.) స్థాయిలను పెంచుతుందని ఈ వ్యాసం సూచిస్తుంది. నియంత్రణాత్మక T కణాల సంఖ్య పెరగడంవల్ల క్రమంగా, రోగనిరోధక వ్యవస్థను శరీర సాధారణ కణాలపై దాడి చేయకుండా ఆపి, తద్వారా, స్వీయ రోగనిరోధక వ్యాధి తీవ్రతను తగ్గించడం చేస్తుంది.

గ్రీన్ టీలో క్యాన్సర్ కు విరుద్ధంగా పోరాడే సామర్థ్యం - Green tea anti-cancer potential in Telugu

ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో సంభవించే మరణాలకు గల ప్రధాన కారణాల్లో వారికి దాపురిస్తున్న రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇందుగ్గాను అనేక ఔషధాలున్నప్పటికీ రొమ్ము కాన్సర్ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది, మరీ ప్రత్యేకించి రొమ్ము కాన్సర్ యొక్క అధిక ప్రమాదం (high risk) ఉన్న వారికి (అంటే ఎవరి కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుంటుందో అట్టి వారికి ). ఇటీవలి అధ్యయనాలు సూచించేదేమంటే రొమ్ము క్యాన్సర్ కు అత్యంత సాధారణంగా ఉపయోగించే మందులతో పాటు గ్రీన్ టీని కూడా సేవింపజేసి చూడగా గ్రీన్ టీ క్యాన్సర్ కణాలను ప్రభావవంతంగా చంపడం మరియు శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని నిరోదించడమూ జరిగింది. గ్రీన్ టీలోని కెటెచిన్ లు క్యాన్సర్ కు  వ్యతిరేకంగా పని చేయడం జరిగి ఉండచ్చని, ఆ అధ్యయనం సూచించింది. అదనంగా, మూత్రాశయం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లో గ్రీన్ టీ సేవనంతో కలిగే క్యాన్సర్-నిరోధక చర్యలను అధ్యయనం చేయడం జరుగుతోంది. ఇందులో రేడియో ధార్మికత యొక్క మంటల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతోందని చెప్పడం జరుగుతోంది. అయినప్పటికీ, క్యాన్సర్ కణాలపై గ్రీన్ టీ యొక్క ఖచ్చితమైన చర్య ఏమిటనే దానికి ఆధారాలు అందుబాటులో లేవు, కనుక, ఈ దిశలో దీనికి సంబంధించి మరింత ఎక్కువ పరిశోధన జరగాల్సి ఉంది.

మతిమరుపు (అల్జీమర్స్) వ్యాధికి గ్రీన్ టీ - Green tea benefits in alzheimer’s in Telugu

మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) మరియు కంపవ్యాధి లేదా వణుకుడు జబ్బు (పార్కిన్సన్స్) వంటి వ్యాధులు నేడు చాలా సాధారణ నరాల-సంబంధమైన  వ్యాధులు. (అంటే ఇవి మెదడు కణాలను చంపే వ్యాధులు). ఈ వ్యాధుల ద్వారా మనిషిలో మెదడు కణాల క్షీణత, మానసిక లక్షణాలలో చిత్తవైకల్యం వంటి లక్షణాలు మరియు మనసు యోచించే తీరును (మేధను కోల్పోవడం) కోల్పోతుంది. ఈ నరాలకు సంబంధించిన వ్యాధుల (లేదా మెదడు కణాల్ని చంపేసే వ్యాధుల) లక్షణాలను తగ్గించడానికి గ్రీన్ టీలోని పదార్ధాలు గొప్ప చికిత్సగా పని చేస్తాయని ఇటీవలి అధ్యయనాలు  సూచిస్తున్నాయి. గ్రీన్ టీ యొక్క యాంటీఆక్సిడెంట్ గుణాలు న్యూరోప్రొటెక్టివ్ (మెదడు కణాలను రక్షిస్తుంది మరియు న్యూరాన్స్ యొక్క నష్టాన్ని నివారిస్తుంది)గా పని చేస్తుందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కీళ్ళనొప్పులకు గ్రీన్ టీ ప్రయోజనాలు - Green tea benefits for arthritis in Telugu

గ్రీన్ టీ, కీళ్లనొప్పి చికిత్సల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. గ్రీన్ టీలోని “పాలిఫేనోల్స్” (ముఖ్యంగా ఎపిగాలోకెట్చిన్ -3 గల్లేట్) అని పిలువబడే జీవసంబంధమైన సమ్మేళనాలు కీళ్ల నొప్పులు, కీళ్లవాపులకు శక్తివంతంగా పని చేస్తాయి. గ్రీన్ టీ నొప్పినివారిణి మరియు అనామ్లజని కూడా అయినందున కీళ్లలో వచ్చే భరించరాని నొప్పులు మరియు వాపులు రెండు బాధలకూ  కూడా బాగా పని చేసి, ఉపశమనం కలుగజేస్తుంది. అమెరికాలో జరిపిన మరో అధ్యయనం, గ్రీన్ టీలో ఉన్న కీళ్లనొప్పి చికిత్సా విలువల్ని, ముఖ్యంగా “ఎపిగాలోకెట్చిన్ -3 గల్లేట్” ఉనికిని, దాని సమర్ధతని నిర్ధారించింది. గ్రీన్ టీ లోని “ఎపిగాలోకెట్చిన్ -3 గల్లేట్-ఎజిసిజి” యొక్క ఎముకను సంరక్షించే లక్షణాలు ‘బోలు ఎముకల వ్యాధి’ వంటి ఎముకల వ్యాధులను నయం చేయడానికి లేదా ఆ వ్యాధుల ఉధృతాన్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది. గ్రీన్ టీలో ఉన్న ఫ్లోరైడ్ యొక్క ప్రభావాన్ని కూడా విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. అయితే, ఈ గ్రీన్ టీ ఔషధం యొక్క మోతాదు మరియు దాన్ని మందుగా ఏవిధంగా సేవించాలి, లేదా మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలపై తగినంతగా అధ్యయన ఆధారాలు లేవు. అందువల్ల, కీళ్ళ రోగులకు సూచించేదేమంటే గ్రీన్ టీ ని సేవించేందుకు ముందుగా దానివల్ల కీళ్లనొప్పుల్ని మరింత విపరీతంగా పెంచే ప్రమాదాల్లాంటివి ఏమైనా ఉన్నాయా అని మీ వైద్యుడిని అడగండి. కీళ్లనొప్పులున్నవారు కూడా గ్రీన్ టీని సేవించడం మంచిదని వైద్యుడు చెబితే సేవించండి.

 

చక్కెరవ్యాధి రోగులకు గ్రీన్ టీ ప్రయోజనాలు - Green tea benefits for diabetes patients in Telugu

గ్రీన్ టీ శరీరంలో ఇన్సులిన్-సున్నితత్వాన్ని (సెన్సిటివిటీ) పెంచుతుందని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ టీ ని నిరంతరంగా సేవిస్తే ఈ ఇన్సులిన్ హార్మోన్ రక్తం నుండి ఎక్కువ గ్లూకోజ్ను తనలోకి గ్రహిస్తుంది, తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం జరుగుతుంది. జపనీయుల జనాభాపై జరిపిన అధ్యయనాల పరంపరలో తెల్సిందేమంటే ప్రతి రోజు గ్రీన్ టీని తాగేవారిలో చక్కెరవ్యాధి రావడానికి చాలా తక్కువ అవకాశముందని.

జుట్టు పోషణకు గ్రీన్ టీ ప్రయోజనాలు - Green tea benefits for hair in Telugu

గ్రీన్ టీ పోషకాంశాలకు (విటమిన్లకు) నిలయం. ముఖ్యంగా విటమిన్ B, C మరియు E లు గ్రీన్ టీలో సమృద్ధిగా ఉన్నాయి. ఈ విటమిన్లు జుట్టు కుదుళ్లను బలపర్చి కేశాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. అంతేకాకుండా, విటమిన్ సి ఓ బలమైన అనామ్లజని (యాంటీ-ఆక్సిడెంట్), దీనితోపాటు గ్రీన్ టీ లో ఉన్న కెటచిన్లు జుట్టు రాలడాన్ని అరికడతాయి. ఒత్తిడి మరియు పర్యావరణకాలుష్యం కారణంగా జుట్టు రాలడమనేడి మనకు వస్తుంది. స్త్రీపురుషులిరువురిలోనూ  టెస్టోస్టెరాన్ హార్మోన్ల కారణంగా వచ్చే జుట్టు రాలడం, బట్టతల సమస్యలకీ చేసే చికిత్సలో గ్రీన్ టీ లేపనం చాలా ప్రభావవంతమైన ఫలితాలనిస్తుంది జంతువులపైనా చేసిన ప్రయోగాలు మరియు ప్రయోగశాల పరీక్షలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ ప్రయోగాలు ఇంకా మనుషుల పైన జరగలేదు కాబట్టి గ్రీన్ టీ ని మీ జుట్టును శుభ్రం చేయడానికో లేదా పేస్ట్ లా లేపనంగా ఉపయోగించాలని మీరు భావిస్తున్న యెడల గ్రీన్ టీని ఉపయోగించేందుకు ముందు మీ డాక్టర్తో సంప్రదింపులు జరిపి సలహా తీసుకోవాలని మీకు సూచించడమైంది.

చర్మానికి గ్రీన్ టీ ప్రయోజనాలు - Green tea benefits for skin in Telugu

గ్రీన్ టీ లోని అనామ్లజనకాలు (యాంటీఆక్సిడెంట్ లు) మరియు నొప్పిని దూరం చేసే లక్షణాలు అకాల వృద్ధాప్య సమస్యను దరి చేరనియ్యదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రీన్ టీని ఒక సాధారణ పానీయంగా తీసుకుంటే మీ చర్మంలో మెరుపును తెచ్చుకోవాలన్న మీకల నిజమవుతుంది. గ్రీన్ టీ ని క్రమం తప్పకుండా సేవిస్తే అది శరీరంలో ఉండే యాంటీఆక్సిడెంట్ లు మరియు నొప్పినాశక లక్షణాల్ని పెంచి, తద్వారా వృద్ధాప్యానికి ప్రప్రథమంగా కారణమయ్యే చర్మపు ముడతల్ని నివారిస్తుంది. ఇదొక ఉత్తమమైన వృద్ధాప్య-వ్యతిరేక ఆహారంగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ రెగ్యులర్ వినియోగం శరీరంలో అనామ్లజనకాల సంఖ్యను పెంచడానికి ఉపకరిస్తుందని అంటారు. వాడేసిన గ్రీన్ టీ సంచులను (small poaches) వాచిపోయిన  కన్నులపై (అంటే ఉబ్బిన కన్నులకు) లేపన ఔషధంగా వాడతారు. వైద్యుల ప్రకారం, వాడేసిన గ్రీన్ టీ సంచులను ఉబ్బిన కనురెప్పలపై లేపనంగా రాసుకుంటే గ్రీన్ టీలోని కెఫిన్ పదార్ధం కళ్ళు చుట్టూ నరాలను నియంత్రించి కంటి ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచడం జరుగుతుంది. తద్వారా ఇది కళ్ళవాపును తగ్గిస్తుంది. కనుక, మీరెప్పుడైనా పనిలో ఎక్కువ గంటలు శ్రమించిన మీ కన్నులకు విశ్రాంతి అవసరం అని భావిస్తే వాడేసిన గ్రీన్ టీ సంచుల్ని ఉపయోగించి ఒత్తిడికి గురైన మీ కళ్ళకు ఉపశమనం కలిగించండి.

చెడు శ్వాస నివారణకు గ్రీన్ టీ - Green tea for bad breath in Telugu

మీరు చెడు శ్వాసతో వ్యథపడుతున్నారా? చిగుళ్ల సమస్యలు కూడా మీకు ఇబ్బంది కల్గిస్తున్నాయా? అయితే మీకిది శుభవార్తే! గ్రీన్ టీ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీకున్న చెడుశ్వాసను పోగొట్టేందుకు పనికిరావచ్చు. చిగుళ్లవ్యాధులు,  లేదా దంత సమస్యలు చెడుశ్వాసకు ప్రాథమిక కారణాలుగా వైద్యులు సూచిస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం, గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్లు మీ నోటిలో హానికరమైన బాక్టీరియాను చంపి, తద్వారా చెడు శ్వాస సమస్యను తగ్గిస్తాయి. అదనంగా, గ్రీన్ టీ యొక్క దుర్గంధనాశని ప్రభావం మీకున్న చెడు శ్వాస సమస్యల్ని ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. గంధకం (సల్ఫర్) ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాల్ని తినడంతో వచ్చే చెడు శ్వాస సమస్యల్ని గ్రీన్ టీ సేవనం దూరం చేస్తుంది.

 

గుండెకు గ్రీన్ టీ ప్రయోజనాలు - Green tea benefits for heart in Telugu

గుండె, రక్తనాళాలకు సంబంధించిన (కార్డియోవాస్క్యులర్) వ్యాధులు ఇటీవలి శతాబ్దంలో మరింత ఎక్కువయ్యాయి. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే ఈ గుండె, రక్తనాళాల జబ్బులు దాపురించేవి. కానీ, ప్రస్తుతం కాలుష్యం, ఊబకాయం మరియు ఒత్తిడి వంటి కారకాల పెరుగుదలతో, ఈ గుండె, రక్తనాళాల జబ్బులు ఇప్పుడు యువ తరాలకు కూడా సమానంగా వ్యాపిస్తున్నాయి. గుండె-సంబంధ  వ్యాధులను తెచ్చిపెట్టే అత్యంత సాధారణ కారణాలను తగ్గించడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పరిశోధకుల ప్రకారం, మన శరీరంలోని స్వేచ్ఛా రాశులు (మన శరీరంలోని జీవక్రియలు, మనం ఎదుర్కొనే ఒత్తిడి లేదా కాలుష్యం వల్ల ఏర్పడిన ఓ రకమైన ఆక్సిజన్ రూపాలనే స్వేచ్చారాశులు అంటారు.) తక్కువ-సాంద్రత కల్గిన కొలెస్టరాల్ (లేదా చెడు కొలెస్ట్రాల్తో) తో కలిసి ధమనులగోడలపై ఫలకాలు (కొవ్వు నిల్వలు) ఏర్పరచి రక్తప్రసరణను అడ్డంకుల్ని కల్గిస్తాయి. రక్తప్రసరణను ఆటంకమేర్పడితే గుండె స్ట్రోకులు మరియు గుండెపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఓ అనామ్లజని అయిన గ్రీన్ టీ,  శరీరంలోని స్వేచ్ఛా రాశుల్ని తొలగించి ఆక్సీకరణ ప్రక్రియను నిలిపివేస్తుంది. తద్వారా సాధారణంగా వచ్చే గుండె సమస్యల ప్రమాదాన్ని గ్రీన్ టీ తగ్గిస్తుంది.

బరువు కోల్పోవడానికి గ్రీన్ టీ - Green tea for weight loss in Telugu

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతగా తోడ్పడుతుందన్న విషయం గురించి మీరు ఇటీవల విన్నారా? ఇదివరలో ఇప్పటికే గ్రీ టీ ని ఉపయోగించి ప్రయోజనం పొందిన వారు తమకు కల్గిన అద్భుత లాభాల గురించి మీకు వివరించారా? ఒకవేళ మీకు ఇంకా గ్రీన్ టీ, దాని ప్రయోజనాల గురించి తెలియకపోతే నేరుగా మీరే స్వయంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. బరువు కోల్పోవటానికి గ్రీన్ టీ  సహాయపడుతుందా లేదా అనే విషయం పై జరిపిన అనేక పరిశోధనలు చెబుతున్నదేమిటంటే గ్రీన్ టీ నిజంగానే ప్రభావవంతంగా పని చేస్తుందని. శరీర బరువును తగ్గించడంలో గ్రీన్ టీ బాగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ కెటెచిన్స్ మరియు కెఫీన్ పదార్థాలను కలిగి ఉంది. ఇవి రెండూ కలిసి శరీరం యొక్క జీవక్రియను పెంచడానికి ఉపకరిస్తాయి. ఇంకా, శరీరంలో పెరిగిన జీవక్రియ వల్ల ఎక్కువ శక్తి వేగంగా ఖర్చు చేయబడి శరీరంలోని మరింత కొవ్వు కరుగుతుందని ఆరోగ్య సిద్ధాంతాలు కూడా తెలియపరుస్తున్నాయి.  గ్రీన్ టీలో సాధారణంగా ఉండే కెటెచిన్స్ మరియు కెఫిన్లన్నింటినీ మన శరీరం ఎక్కువగా ఉపయోగించుకుంటుందని అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి. వైద్యుల ప్రకారం, గ్రీన్ టీ మనం నిత్యం చేసే సాధారణ వ్యాయామం మరియు తినే ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలకు గ్రీన్ టీ మరిన్ని ప్రయోజనాలను జతచేస్తుంది. కానీ, నియమ విరుద్ధంగా మీరు జంక్ ఫుడ్ తింటూ ఓ నియమితం లేని జీవనశైలిని కలిగి ఉంటే మటుకు గ్రీన్ టీ మీకేవిధంగానూ సాయపడదు. గ్రీన్ టీ ఓ అద్భుతం ఆరోగ్య ప్రదాయినిగా పని చేయాలి, మీ బరువు తగ్గాలి అంటే గ్రీన్ టీసేవనంతో పాటు నియమితమైం వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది.

మెదడుకు గ్రీన్ టీ ప్రయోజనాలు - Green tea benefits for brain in Telugu

దిననిత్యం మనం సేవించే గ్రీన్ టీ లో ఉండే “కెఫిన్” అనే పదార్ధం మన మెదడును పదునుదెలుస్తుందని మీకు తెలుసా? ఆయుర్వేద వైద్యులు చెప్పిన ప్రకారం, గ్రీన్ టీ లో మంచి కెఫిన్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది మెదడు కణాలపై ప్రత్యక్ష ప్రేరణను కలిగిస్తుంది.  మన మెదడు యొక్క పనితీరును కెఫిన్ ఏవిధంగా ప్రభావితం చేస్తుందన్న విషయంపై పలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఈ అధ్యయనాలు సూచించింది ఏమిటంటే మన మెదడులోని “అడెనోసిన్” అనే రసాయనిక పదార్థ చర్యను అడ్డుకుంటుంది. అలా అడెనోసిన్ స్థాయిల్ని కెఫీన్ తక్కువ చేయడం మూలంగా మెదడు కణాల కార్యకలాపాలు పెరుగుతాయని అధ్యయనాలు వివరించాయి. కెఫిన్ ను ఓ మోస్తరు పరిమాణంలో తీసుకోవడం వల్ల మన మెదడులో ఉద్దీపన ఏర్పడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే గాక, మెదడులో సమన్వయ ప్రక్రియ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పరిపూర్ణమైన ఓ కప్పు టీని ఇలా చేసుకోవాలి:

టీ ప్రేమికులు తమకు ఓ కప్పు పరిపూర్ణమైన టీని కాచుకోవడంలో వారికే స్వంతమైన ప్రత్యేకమైన పద్ధతుల్ని కలిగి ఉంటారు. కాని ఇక్కడ మీ కోసం ఓ కప్పు చక్కని వేడి గ్రీన్ టీని సాధారణంగా ఎలా చేసుకోవాలో వివరిస్తున్నాం.

  1. ఓ 2-3 గ్రాముల టీ ఆకుల్ని (లేదా సామాన్యంగా లభించే టీ పొడి) టీ కాచే పాత్రలో వేయండి.
  2. టీ పాత్రలోకి తగినంత మసలుతున్న వేడి వేడి నీటిని (20-100 ml ప్రమాణంలో మీరిష్టపడే రుచి వచ్చే విధంగా) టీ పొడికి చేర్చండి.
  3. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు గ్రీన్ టీ పొడిని వేడి వేడి నీటిలో బాగా నాననివ్వండి. (కొందరు వారు కోరుకున్న రుచి రావడం కోసం టీ ఆకుల్ని (పొడిని) కాస్త ఎక్కువసేపు వేడినీటితో నానేట్టు చేస్తారు)
  4. ఇపుడు వేడి వేడిగా ఉన్న గ్రీన్ టీ ని దించి టీ కప్పులోకి వంచుకోండి, సేవించండి.

కానీ, మీరు మరీ బద్దకస్తులైనపక్షంలో, ఈ బాదరబందీ అంతా ఎందుకులే  అనుకున్నపక్షంలో, సింగల్ కప్పుకు సరిపోయే “టీ బ్యాగ్” (చిట్టి సాచెట్ వంటిది)ను కప్పులోకి తీసుకున్న వేడి వేడి నీటిలో అద్దుకుని (వేడినీటిలోకి  గ్రీన్ టీ సారం కలిసిపోతుంది) గ్రీన్ టీని ఆస్వాదించొచ్చు.

ఇలా “టీ బాగ్” లను ఉపయోగించిన తర్వాత వాటిని పడవేయకుండా ఆ వాడిన గ్రీన్ టీ సంచులు ఉబ్బిన కళ్ళ చికిత్స కోసం సమయోచితంగా ఉపయోగించుకోవచ్చు.

“మచ్చా టీ” అనేది ముఖానికి లేపనం (face masks) గా వాడడం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ముదురు ఆకుపచ్చ టీ లేక మత్సా టీ ని ముఖానికి మాస్క్ లాగా వేసుకొనేందుకు కావలసిన పేస్ట్ తయారు చేయడానికి ఒక టీస్పూన్ గ్రీన్ టీ పొడికి ½ టీ స్పూన్ తేనెను కలిపి మిశ్రమాన్ని చేసి పేస్ట్ లా చేసుకోవచ్చు. ముఖానికి దీన్ని “ఫేస్ మాస్క్” లా రాసుకుని కడిగేసుకుంటే ముఖం తాజాగా కళకళ లాడుతుంది.

రోజులో ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే సురక్షితమే నని  భావిస్తారు. అయితే, ఖచ్చితమైన గ్రీన్ టీ మోతాదు ఆ వ్యక్తి శరీర రకం, శరీరధర్మము,  మరియు ఆ ఋతువు (సీజన్) మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, గ్రీన్ టీని నిత్యం సేవించాలనుకునే  విషయంలోను, దాని మోతాదు తదితర విషయాల గురించి ఓ పౌష్టికాహార నిపుణుడిని సంప్రదించడం మంచిదని మీకు  సూచించడమైంది.

 

 
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

మితమైన పరిమాణంలో గ్రీన్ టీ సేవిస్తే సురక్షితమే, కానీ అధికంగా సేవిస్తే మాత్రం దీనివల్ల అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది:

  1. గ్రీన్ టీలో “కెఫిన్” అనేది ఒక ప్రధాన భాగం. ఆందోళన, నిద్రలేమి మరియు విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాల్ని దీర్ఘకాలం నుంచి గ్రీన్  టీని సేవిస్తున్న వ్యక్తుల్లో గుర్తించదగిన మరియు (ఉపసంహరణ) లక్షణాలు.
  2. కొన్ని సందర్భాల్లో, గ్రీన్ టీ ని అధికంగా సేవించినవారికి కాలేయం నష్టం (కాలేయ-సంబంధమై రోగాలు) దాపురించినట్లు తెలియవచ్చింది. అయితే, “US ఫార్మాకోపోయియా” అనే పత్రిక ప్రచురించిన ఒక నివేదికలో తెలిపిన ప్రకారం, ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకున్నప్పుడు మాత్రమే గ్రీన్ టీ నుండి వెలువడే పదార్దాలు మన శరీరానికి విషపూరితంగా తయారవుతాయట.  కానీ, కొన్ని ఇతర పరిశోధనలు ఇటీవల వాదిస్తున్నదేమిటంటే గ్రీన్ టీ అసలు కాలేయానికి ఎలాంటి విషకారకం కానే కాదని సూచిస్తున్నాయి. అందువల్ల ఈ విషయమై చాలా విరుద్ధమైన సమాచారమే ఉంది. అందువల్ల మీకు ఇప్పటికే బలహీనమైన కాలేయం ఉన్నట్లయితే, గ్రీన్ టీ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించాల్సిందిగా మీకు సూచించడమైంది.
  3. మీరిప్పటికే కొన్ని ఔషధాలు మరియు మూలికలైన ఔషధాలను తీసుకుంటున్నట్లైన యెడల, వాటికి తోడు గ్రీన్ టీ సేవనం కూడా చేయాలనుకుంటే మీ డాక్టర్ ని సంప్రదించడం సురక్షితం. ఎందుకంటే, గ్రీన్ టీ కి ఇతర మందులు లేక మూలికా మందులతో ప్రతి చర్య (reaction)  చెందే అవకాశం ఉంది గనుక.
  4. మీరు రక్తహీనత జబ్బుని కలిగి ఉంటే, గ్రీన్ టీని త్రాగకుండా ఉండడమే ఉత్తమం, ఎందుకంటే గ్రీన్ టీ సేవనం తిన్న ఆహారం నుండి మనదేహానికి కావాల్సిన ఇనుమును పూర్తిగా విడుదల కాకుండా అడ్డుపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
  5. గ్రీన్ టీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల చక్కెరవ్యాధి ఉన్నవారు ఇప్పటికే డాక్టర్ సూచించిన డయాబెటిక్ మందులను సేవిస్తూ ఉన్నట్లయితే, వాటితో బాటు గ్రీన్ టీ ని కూడా సేవించాలని భావిస్తే గ్రీన్ టీ ని ఏ మోతాదులో తీసుకోవాలో డాక్టర్ ని అడిగి తెల్సుకుని ఆ ప్రకారమే సేవించండం ఉత్తమం.   
  6. గ్రీన్ టీ ని రోజూ 2 కప్పుల కంటే ఎక్కువ తీసుకుంటే మీ శరీరంలోని కాల్షియంను బయటకు నెట్టేస్తుంది, ఇది ప్రమాదం, ఎందుకంటే ఇది ఎముకలు బలహీనపడటానికి దారితీస్తుంది. కాబట్టి, గ్రీన్ టీని మితంగా  సేవించడమే మంచిది.
  7. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ సేవనం ప్రమాదం కాదు, అయినప్పటికీ, గ్రీన్ టీ లో కెఫిన్ ఉంది కాబట్టి గర్భవతులు ఈ పానీయాన్ని మితంగా మాత్రమే సేవించాలి. కాబట్టి, మీరు గర్భవతిగా ఉంటే, గ్రీన్ టీ సేవించాలనుకునేందుకు మొదలు మీ డాక్టర్తో మాట్లాడి, గ్రీన్ టీ యొక్క సరైన మోతాదును తెలుసుకోండి.  
  8. గ్రీన్ టీలో కెఫీన్ సమృద్ధిగా ఉంటుంది, అందువల్ల పిల్లలకు ఇది ఇవ్వడం మంచిది కాదు.
Dr. Dhanamjaya D

Dr. Dhanamjaya D

Nutritionist
15 Years of Experience

Dt. Surbhi Upadhyay

Dt. Surbhi Upadhyay

Nutritionist
3 Years of Experience

Dt. Manjari Purwar

Dt. Manjari Purwar

Nutritionist
11 Years of Experience

Dt. Akanksha Mishra

Dt. Akanksha Mishra

Nutritionist
8 Years of Experience


Medicines / Products that contain Green tea

వనరులు

  1. Sabu M Chacko. Beneficial effects of green tea: A literature review. Chin Med. 2010; 5: 13. PMID: 20370896
  2. Nehlig A1, Daval JL, Debry G. Caffeine and the central nervous system: mechanisms of action, biochemical, metabolic and psychostimulant effects.. Brain Res Brain Res Rev. 1992 May-Aug;17(2):139-70. PMID: 1356551
  3. Dietz C1, Dekker M1. Effect of Green Tea Phytochemicals on Mood and Cognition. Curr Pharm Des. 2017;23(19):2876-2905. PMID: 28056735
  4. Nobre AC1, Rao A, Owen GN. L-theanine, a natural constituent in tea, and its effect on mental state. Asia Pac J Clin Nutr. 2008;17 Suppl 1:167-8. PMID: 18296328
  5. Yiannakopoulou ECh. Green tea catechins: Proposed mechanisms of action in breast cancer focusing on the interplay between survival and apoptosis. Anticancer Agents Med Chem. 2014 Feb;14(2):290-5. PMID: 24069935
  6. Miyata Y. Anticancer Effects of Green Tea and the Underlying Molecular Mechanisms in Bladder Cancer. Medicines (Basel). 2018 Aug 10;5(3). pii: E87. PMID: 30103466
  7. Fritz H. Green tea and lung cancer: a systematic review. Integr Cancer Ther. 2013 Jan;12(1):7-24. PMID: 22532034
  8. Sueoka N. A new function of green tea: prevention of lifestyle-related diseases. Ann N Y Acad Sci. 2001 Apr;928:274-80. PMID: 11795518
  9. Liu K. Effect of green tea on glucose control and insulin sensitivity: a meta-analysis of 17 randomized controlled trials. Am J Clin Nutr. 2013 Aug;98(2):340-8. PMID: 23803878
  10. Haqqi TM. Prevention of collagen-induced arthritis in mice by a polyphenolic fraction from green tea. Proc Natl Acad Sci U S A. 1999 Apr 13;96(8):4524-9. PMID: 10200295
  11. Chwan-Li Shen, James K. Yeh, Jay Cao, Jia-Sheng Wang4. Green Tea and Bone metabolism. Nutr Res. 2009 Jul; 29(7): 437–456. PMID: 19700031
  12. Steinmann J1, Buer J, Pietschmann T, Steinmann E. Anti-infective properties of epigallocatechin-3-gallate (EGCG), a component of green tea. Br J Pharmacol. 2013 Mar;168(5):1059-73. PMID: 23072320
  13. Lodhia P. Effect of green tea on volatile sulfur compounds in mouth air. J Nutr Sci Vitaminol (Tokyo). 2008 Feb;54(1):89-94. PMID: 18388413
  14. Weinreb O1, Mandel S, Amit T, Youdim MB. Neurological mechanisms of green tea polyphenols in Alzheimer's and Parkinson's diseases. J Nutr Biochem. 2004 Sep;15(9):506-16. PMID: 15350981
  15. Zong-mao Chen, Zhi Lin. Tea and human health: biomedical functions of tea active components and current issues. J Zhejiang Univ Sci B. 2015 Feb; 16(2): 87–102. PMID: 25644464
  16. Kim YY. Effects of topical application of EGCG on testosterone-induced hair loss in a mouse model.. Exp Dermatol. 2011 Dec;20(12):1015-7. PMID: 21951062
  17. Kwon OS et al. Human hair growth enhancement in vitro by green tea epigallocatechin-3-gallate (EGCG).. Phytomedicine. 2007 Aug;14(7-8):551-5. Epub 2006 Nov 7. PMID: 17092697
Read on app