myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

రావి చెట్టును భారతదేశంలో పవిత్రమైందిగా భావిస్తారు. దీన్నే వృక్షశాస్త్రంలో ‘ఫెకస్ రిలిజియోసా’ అంటారు. ఇది భారతదేశ సంస్కృతిలో లోతుగా వేళ్లను పాతుకుని ఉంది, ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నమ్మడం జరుగుతోంది. కాబట్టి, దీనిని తరచుగా 'బోధి చెట్టు' గా సూచిస్తారు. సంప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని 'అశ్వత్త' వృక్షంగా వర్ణిస్తుంది, అంటే దీనర్థం, రావి చెట్టు 'జీవితం యొక్క చెట్టు' కు చిహ్నం అని.

ఫికస్ రిలిజియోసాను సాధారణంగా పవిత్రమైన అశ్వత్థము (the sacred fig) అని పిలుస్తారు, ఇది ఆసియా, ముఖ్యంగా భారతదేశం మరియు చైనా, యొక్క ఉష్ణమండల భాగాలకు చెందినది. ఇది విస్తృతమైన కాండంతో (ట్రీ -ట్రంక్) పెద్దది గా ఉండే చెట్టుగా  ఉంటుంది, దీని యొక్క వ్యాసం 3 మీటర్లు వరకు ఉంటుంది. చెట్టు యొక్క ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి మరియు విలక్షణమైన ఆకుచివరను (tip) ను కల్గి ఉంటుంది. చెట్టు యొక్క పండ్లు సాధారణంగా చిన్న చిన్న అత్తి పండ్లను లేదా చిన్న మేడిపండ్లను పోలి నేతగా ఉన్నపుడు ఆకుపచ్చగా  మరియు మాగి పండైనపుడు ఊదా రంగులోకి మారుతాయి.

రావిచెట్టు యొక్క జీవిత కాలం సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలోని “జయ శ్రీ మహా బోధి” రావిచెట్టు, మత ప్రాముఖ్యత కలిగిన అతిపురాతనమైన చారిత్రక చెట్టు' అని చెప్పబడింది. వాస్తవానికి దీని వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోనే పురాతనమైన చెట్టు అని చెప్పబడుతోంది.

రావి చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

 • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: ఫికస్ రిలిజియోసా (Ficus religiosa)
 • కుటుంబం: మోరసీయే (Moraceae)
 • సాధారణ పేరు: పవిత్రమైన అత్తి, బోధి చెట్టు, రావిచెట్టు, పీపల్ చెట్టు
 • సంస్కృత పేరు: అశ్వత్త , పిప్పల
 • రావి చెట్టు యొక్క ఉపయోగించే భాగాలు: ఆకులు, శాఖలు, పువ్వులు, పండ్లు, బెరడు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఉష్ణమండల ఆసియాకు చెందినది ప్రత్యేకించి, భారతదేశం మరియు చైనాల్లో ఎక్కువగా కనబడుతుంది.
 1. రావి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of peepal tree in Telugu
 2. రావి చెట్టు దుష్ప్రభావాలు - Side effects of peepal tree in Telugu

రావిచెట్టును పురాతన కాలం నుండి ప్రబలంగా సేవిస్తుండడంవల్ల దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేకం మరియు అవన్నీ సుస్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనవి, వాటి వివరాలు క్రింద వివరించబడ్డాయి.

 • తెగిన గాయాలకు: వివిధ పరిశోధనల ప్రకారం రావిచెట్టు ఆకుల సారాలు తెగిన గాయాలను త్వరగా నయం చెయ్యడంలో సహాయపడతాయని తెలుస్తుంది. ఈ చెట్టు ఆకుల రసంలో గాయాలనను నయం చేసే లక్షణాలు ఉంటాయి.
 • చెక్కెర వ్యాధికి రావిచెట్టు: రావి చెట్టు బెరడు మరియు వేరులలో ఉండే β- సిటోస్టెరోల్-డి-గ్లైకోసైడ్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలలో తేలింది.
 • రావిచెట్టు యాంటీబాక్టీరియల్ గుణాలు: రావి చెట్టు వివిధ భాగాలలో ఉండే ఇథనాలిక్ సారాలు స్టాపైలాకోకస్ , సాల్మోనెల్లా పరాటిఫి, సాల్మోనెల్లా ఔరియుస్ , సాల్మోనెల్లా టైఫి వంటి అనేక బాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
 • యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: రావి చెట్టు బెరడు మరియు పండ్లలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి అవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చెయ్యడంలో సహాయపడతాయి.
 • రోగనిరోధక శక్తికి: పరిశోధనల ప్రకారం రావిచెట్టు బెరడు సారాలు యాంటీబాడీ ప్రతిచర్యలు/ప్రతి స్పందనలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయని తేలింది. ఇది రోగనిరోధక వ్యవస్థ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 • అల్జీమర్స్ కోసం: రావి చెట్టు బెరడు యొక్క మేథనోలిక్ సారాలలో  శక్తివంతమైన ఎసిటైల్కోలినెస్టెరేస్ (acetylcholinesterase) అనే ఎంజైమ్ ఉన్నట్లు గుర్తించబడింది. ఇది అసిటైల్ కోలిన్ యొక్క బ్రేక్ డౌన్ (పతనానికి) కి అవసరం అవుతుంది. రావి చెట్టు సారాలకు ఉన్న ఈ లక్షణం అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
 • క్యాన్సర్కు: రావి చెట్టు యొక్క అన్ని భాగాలకు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఒక పరిశోధన ప్రకారం రావి చెట్టులో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని తెలిసింది. అంతేకాక అవి ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి.

తగిన మోతాదులో ఉపయోగించినప్పుడు రావి సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు రావి ని సేవించినప్పుడు  కొన్ని దుష్ప్రభావాలను అనుభవిస్తారు. రావి సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలు క్రింద వివరించబడ్డాయి.

 • రావి చెట్టు చెట్టు ఆకు సారాన్ని (రసం), ఒక నెల వరకు ఔషధ మోతాదుల్లో సేవించినపుడు సాధారణంగా సురక్షితం. అయినప్పటికీ, అధిక మోతాదులో వినియోగిస్తే, రావిచెట్టు యొక్క రబ్బరు పాలు (latex) కొందరు వ్యక్తులలో జీర్ణవ్యవస్థలో రక్తస్రావాణ్ని కలిగిస్తుంది. రావి చెట్టు సారాన్ని తీసుకోవటానికి ముందు వైద్యుడి సలహాను తీసుకోవడం మంచిది.
 • రావిచెట్టు యొక్క సారాన్ని సేవించడంవల్ల కొంతమందిలో సూర్యుని పట్ల (ఎండకు) సున్నితత్వాన్ని కలిగిస్తుంది. అందువల్ల చర్మానికి రావిచెట్టు సారాన్ని పూసుకున్న వెంటనే ఎండలో బయటకు రావడం మంచిది కాదు.
 • రావిచెట్టు పండ్లు చర్మానికి అంటడంవల్ల కొంతమంది వ్యక్తులలో చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీలు కూడా సంభవించేందుకు కారణం కావచ్చు. అదనంగా, సహజమైన రబ్బరు పాలకు సున్నితంగా ఉండే వ్యక్తులు అత్తి చెట్లకు లేదా అత్తి పండ్లకు అలెర్జీ ప్రతిచర్యలు కలిగి ఉండవచ్చు.
 • గర్భిణీలు మరియు చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులు రావిచెట్టు సారాంశాల సేవనంవల్ల కలిగే ప్రభావం గురించి తెలిపే అధ్యయనాలు ఏవీ లేవు. కనుక, అటువంటి మహిళలలు రావిచెట్టు సారాంశాలు కల్గిన మందుల్ని ఉపయోగించేందుకు ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
 • రావి చెట్టు చక్కెరవ్యాధి (డయాబెటిక్)కి వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. రావిచెట్టు పదార్ధాల నుండి తయారైన మందుల్ని సేవించేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సమయానుసారంగా పర్యవేక్షించవలసి ఉంటుంది. శస్త్రచికిత్సా సమయంలో లేదా తర్వాత ఇటువంటి రావిచెట్టు సారాలతో కూడిన మందుల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బ తీస్తుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు కనీసం రెండు వారాల పాటు రావిచెట్టు సారాంశాల్ని ఉపయోగించకుండా ఉండాలని మీకు సలహా ఇవ్వడమైంది.
और पढ़ें ...