జీర్ణాశయ రుగ్మతలు - Digestive Disorders in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 14, 2018

October 29, 2020

జీర్ణాశయ రుగ్మతలు
జీర్ణాశయ రుగ్మతలు

జీర్ణాశయ రుగ్మతలు ఏమిటి?

కడుపు, చిన్న ప్రేగు మరియు పెద్దప్రేగుతో పాటు కాలేయం, పిత్తాశయం, పిత్తాశయ మార్గం మరియు కోమ్లాము (ప్యాంక్రియాస్) వంటి జీర్ణ వ్యవస్థ యొక్క అవయవాలకు సంబంధించిన వ్యాధులను సమగ్రంగా జీర్ణాశయ రుగ్మతలు లేదా జీర్ణ గ్రంధి లోపాలుగా పిలుస్తారు. అవి ప్యాంక్రియాటైటిస్, మలబద్ధకం, అతిసారం, క్రోన్స్ వ్యాధి, ఇర్రిటబిల్ బౌల్ సిండ్రోమ్ (IBS), గుండెల్లో మంట, పిత్తాశయ రాళ్లు, పెద్దప్రేగు నొప్పి, పుండ్లు, హెర్నియా వంటి మొదలైన విస్తృతమైన వ్యాధులగా ఉన్నాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కొన్ని సాధారణ లక్షణాలు జీర్ణాశయ రుగ్మతల యొక్క హెచ్చరిక సంకేతాలు అవి:

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

జీర్ణాశయ రుగ్మతలు క్రింద ఉన్న వాటిలో ఏదైనా ఒకటి లేదా అనేక కారణాల వలన కావచ్చు:

సాధారణ కారణాలు:

 • సూక్ష్మజీవ సంక్రమణ (ఇన్ఫెక్షన్)
 • జిఐటి (GIT) లో వాపు
 • జీర్ణ ఎంజైమ్ల యొక్క లోపం
 • ప్రేగులకు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం
 • పిత్తాశయ రాళ్లు ఏర్పడడం
 • వాపు నిరోధక మందుల దుష్ప్రభావాలు
 • ఒత్తిడి
 • ధూమపానం
 • మద్యం సేవించడం
 • కొవ్వు ఆహారాలు అధికంగా తీసుకోవడం
 • ఘాటుగా ఉండే ఆహారాలు
 • జన్యుపరమైన కారణాలు: కొన్ని జన్యువుల యొక్క వ్యక్తీకరణ (Expression) ప్యాంక్రియాటైటిస్, కాలేయ వ్యాధులు మరియు క్రోన్స్ వ్యాధి వంటి వ్యాధులకు కారణం కావచ్చు.
 • శస్త్రచికిత్స తరువాత కారణాలు (Post-surgical causes) : పిత్తాశయం యొక్క తొలగింపు లేదా ప్రేగుల్లో చిన్న భాగం యొక్క తొలగింపు  శస్త్రచికిత్సలు కొన్ని సార్లు జీర్ణ వ్యవస్థ వ్యాధులకు కారణమవుతాయి.
 • ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ మరియు దీర్ఘకాలిక వ్యాధులు (chronic diseases) ఉండటం: సోగ్రెన్స్ సిండ్రోమ్, రుమటోయిడ్ ఆర్థరైటిస్ మరియు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్ (SLE) వంటి వ్యాధులు జీర్ణ రుగ్మతలకు కారణమవుతాయి. కాలేయం, పెద్దప్రేగు మరియు క్లోమం యొక్క క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.
 • వయసు: వయస్సు పెరుగుదల కూడా జీర్ణ వ్యవస్థ బలహీనపడటానికి కారణమవుతుంది.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

జీర్ణాశయ రుగ్మతలు అనేవి జీర్ణ వ్యవస్థలో ఒకె అవయవాన్ని లేదా అనేక అవయవాలని ప్రభావితం చేయవచ్చు. రోగ నిర్ధారణ యొక్క మూడు ప్రాథమిక విషయాలు రోగి యొక్క ఆరోగ్య చరిత్ర, భౌతిక పరీక్ష మరియు ప్రయోగశాల ఆధారిత పరీక్షలు.

 • ఆరోగ్య చరిత్ర: ఆహారపు అలవాట్లు, జీవనశైలి మరియు మలవిసర్జన అలవాట్లును తెలుసుకోవడం, మరియు మానసిక స్థితి నిర్దారణ,అది వైద్యులకు తరువాతి నిర్దారణ పరీక్షలను నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది.
 • శారీరక పరీక్ష: చేతితో మరియు స్టెతస్కోప్ ద్వారా ఉదర పరీక్ష దాని ద్వారా ఉదరంలోని అసాధారణతలు గుర్తించవచ్చు.
 • ప్రయోగశాల ఆధారిత పరీక్షలు:
  • మల పరీక్ష
  • ఎండోస్కోపీ
  • జిఐటి (GIT) యొక్క ఇంట్యూబేషన్ (జీర్ణాశయంలో గొట్టం ద్వారా పరీక్ష)
  • లాపరోస్కోపిక్ పరీక్ష
  • ఉదర ద్రవ పరీక్ష
  • యాసిడ్ రిఫ్లక్స్ (acid reflux )
  • జిఐటి (GIT) యొక్క సాధారణ మరియు బేరియం ఎక్స్-రే కిరణాల పరీక్షలు, ఉదరం యొక్క ఎంఆర్ఐ (MRI) మరియు సిటి (CT) స్కాన్ వంటి ఇమేజింగ్ పద్ధతులు
  • ఉదరం యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్

రోగ నిర్ధారణ మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. ఈ క్రింది పద్ధతులు చికిత్సను విజయవంతం చేయవచ్చు:

 • ప్రేరేపిత కారకాలను గుర్తించడం: జీర్ణ సమస్యను మరింత తీవ్రతరం చేసే కొన్ని ఆహారపదార్థాల మీద మరియు అలవాట్ల మీద దృష్టి పెట్టాలి.  సరైన వైద్యులు మరియు ఆహార నిపుణుల సలహాతో, సమస్యను అధిగమించవచ్చు.
 • ఔషధప్రయోగం: యాంటీ-డయేరియా, వికారం వ్యతిరేక (anti-nausea), యాంటీ-ఎమిటిక్ (anti-emetic)  మరియు యాంటీబయాటిక్స్లను లక్షణాల మీద ఆధారపడి సూచించవచ్చు.
 • శస్త్రచికిత్స: రోగికి పిత్తాశయ రాళ్ళు, అప్పెండిసైటిస్ మరియు హెర్నియా వంటి రుగ్మతలు ఉంటె  శస్త్రచికిత్సను సిఫార్సు చేయవచ్చు.
 • ఎండోస్కోపీ: జీర్ణాశయంలో  రక్తస్రావం ఉంటే దానికోసం, హేమాస్టాటిక్ ఔషధాలు (haemostatic drugs) ఎండోస్కోపిక్ డెలివరీ ద్వారా ఇవ్వబడతాయి.

ఈ చికిత్సలు జీర్ణాశయ రుగ్మతల నుండి ఉపశమనాన్నీ అందించినప్పటికీ, కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు కూడా నివారణ చర్యలుగా పనిచేస్తాయి:

 • వ్యాయామం
 • యోగ మరియు ధ్యానం
 • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థిరమైన  తినే క్రమములు (సమయానుసారం)
 • పేగులలోని ఫ్లోరాని (కడుపులో ఉండే ఉపయోగకరమైన బాక్టీరియా) భర్తీ చేయడానికి ప్రోబయోటిక్స్ ను తీసుకోవడం.

రోజువారీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులతో జీర్ణాశయ రుగ్మతలను నివారించవచ్చు. మందులు మరియు శస్త్రచికిత్సతో పూర్తిగా జీర్ణాశయ లోపాల చికిత్స చేయవచ్చు. ఏవైనా ప్రత్యామ్నాయ చికిత్సను ఎంచుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.వనరులు

 1. Craig OF, Quigley EM. Current and emerging therapies for the management of functional gastrointestinal disorders. Ther Adv Chronic Dis. 2011 Mar;2(2):87-99. PMID: 23251744
 2. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Digestive Diseases
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Digestive Diseases
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Digestive diseases
 5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Digestive Diseases

జీర్ణాశయ రుగ్మతలు కొరకు మందులు

Medicines listed below are available for జీర్ణాశయ రుగ్మతలు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.