myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం  

“గిలక”వ్యాధి లేదా Hernia అంటే శరీరంలో గజ్జలు భాగం, ఉదరం వంటి మృదు కణజాలం ఉన్న చోట్లలో, లేదా బలహీనమైన మెత్తని కండరాలున్నచోట్లలోని లోపలి భాగం లేదా అవయవం పైకి పొడుచుకొని వచ్చి “ఉబ్బు” లేదా గిలక రూపంగా కనబడుతుంది. ఈ ఉబ్బునే “గిలక” లేదా Hernia అంటారు. హెర్నియా వ్యాధిరకాల్లో గజ్జల్లో వచ్చేవే అత్యంత సాధారణమైనవి. గజ్జల్లో వచ్చేవి కొన్ని సూటిగా పొడుచుకొనిపైకొచ్చినట్లుండేవి, వంకర తిరిగుండే గిలకలూ ఉంటాయి. ఇంకా, పొత్తికడుపు, బొడ్డు,  కడుపు భాగంలో, రొమ్ముకు-కడుపుకు మధ్యభాగంలో (ఆపరేషన్ వల్ల అయిన కత్తిగాటు కారణంగా) తొడ పైభాగంలో వచ్చే గిలకలూ ఉంటాయి. హెర్నియా (గిలక) వ్యాధి లక్షణాలేవంటే అదున్నచోట బలుపు, ఉబ్బు, వాపు లేక నొప్పి ఉంటాయి. ఆపరేషనే (శస్త్ర చికిత్స) గిలక సమస్యకు పరిష్కారం. హెర్నియా వల్ల దెబ్బ తిన్న కండరాలను వాటి సరైన స్థానానికి చేర్చి పొడుచుకొచ్చిన చోట ఆపరేషన్ కోసం వైద్యులు చేసే చీలిక లేదా రంద్రాన్ని కుట్టేసి పూడ్చేస్తారు. వాపు, నొప్పి, శస్త్రచికిత్స చేసిన చోటి నుండి స్రావం హెర్నియా యొక్క  ఉపద్రవలక్షణాలుగా చెప్పవచ్చు. హెర్నియాకు ఆపరేషన్ చేసిన తర్వాత మంచి ఫలితాలుంటాయి. హెర్నియాకు ఒకసారి ఆపరేషన్ చేయించుకుని నయం చేసుకున్న తర్వాత బహుశా అది మళ్ళీ రాదనే చెప్పవచ్చు. హెర్నియాకు ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే కొన్నిసార్లు మరణం సంభవించే ప్రమాదం ఉంది.

 1. హెర్నియా రకాలు - Types of Hernia in Telugu
 2. హెర్నియా అంటే ఏమిటి? - What is a Hernia in Telugu
 3. గిలక వ్యాధి (హెర్నియా) లక్షణాలు - Hernia symptoms in Telugu
 4. హెర్నియా కారణాలు మరియు ప్రమాద కారకాలు - Hernia causes and risk factors in Telugu
 5. గిలకవ్యాధి నివారణ - Prevention of Hernia in Telugu
 6. గిలకవ్యాధి నిర్ధారణ - Diagnosis of Hernia in Telugu
 7. హెర్నియా చికిత్స - Hernia treatment in Telugu
 8. హెర్నియా రోగ నిరూపణ మరియు సమస్యలు - Hernia prognosis and complications
 9. గిలక వ్యాధి (హెర్నియా) కొరకు మందులు
 10. గిలక వ్యాధి (హెర్నియా) వైద్యులు

హెర్నియా రకాలు - Types of Hernia in Telugu

పొత్తికడుపు గోడ (ఆంత్రవేష్టనం) కు సంబంధించిన సాధారణ గిలక వ్యాధుల్ని కింద వివరిస్తున్నాం.

 • గజ్జల్లో గిలక (ఇంగునాల్ (Groin) హెర్నియా)
  గజ్జభాగంలో వచ్చే గిలకవ్యాధి స్త్రీలకంటే మగవారికే అత్యంత సాధాణంగా  వస్తుంటుంది. గజ్జల ప్రాంతంలో వచ్చే గిలక, పొత్తికడుపు కింది గజ్జల ముడతలో- తొడ యొక్క చర్మాన్ని కూడా కలుపుకుని ఉంటుంది.గజ్జల్లో హెర్నియా రెండు రకాలు. అవి ప్రత్యక్ష హెర్నియా, పరోక్ష హెర్నియా. ప్రత్యక్ష మరియు పరోక్ష హెర్నియాలు గజ్జల్లో, తొడకు ఎగువ ప్రాంతంలో ఉబికినట్లుండి ‘ఉబ్బు’ గా కనిపిస్థాయి. ఏదేమైనా, ప్రత్యక్షహెర్నియా, పరోక్ష హెర్నియా ఈ రెండు రకాల గజ్జల హెర్నియాల మధ్య భేదం తెలుసుకోవడం  వైద్యపరంగా ముఖ్యమైనది, ఎందుకంటే దీనికి చికిత్సప్రణాళిక నిర్ణయించడమనేది దీనిపైన్నే ఆధారపడుతుంది.

పరోక్ష గౙ్జల హెర్నియా  (Indirect inguinal hernia)

 • పొత్తికడుపులో ఉండే పేగులవంటి భాగాలు గజ్జలు సందుల్లోని ‘లోతైన రింగ్’ లోనికి చొచ్చుకుని వచ్చి ‘బుడిపె’ లా పైకి కన్పించేదే పరోక్ష హెర్నియా. గిలక తిత్తి (hernial sac) గౙ్జల సందులోని ఉపరితల రింగు ద్వారా సాగి వృషణం లోనికి కూడా చొచ్చుకునివెళ్లి విస్తరించవచ్చు. ఈ గజ్జల నుండి వృషణం వరకు ఉండే దారి సాధారణంగా మనిషి జన్మించేందుకు ముందుగానే (తల్లి గర్భంలోనే) మూసుకుపోతుంది. కానీ చాలా కొందరిలో ఆ దారి అలా (పుట్టక) ముందే మూసుకుపోకుండా అలాగే ఉండడం వల్ల ఆ దారిగుండా హెర్నియా/ గిలక పెరిగేందుకు ఆష్కారమేర్పడుతుంది. ‘పరోక్ష గౙ్జల హెర్నియా’ మనిషికి ఏ వయసులోనైనా రావచ్చు మరియు ఇది హెర్నియా రకాల్లో అతి సాధారణమైంది. 
 • ప్రత్యక్ష గౙ్జల హెర్నియా (Direct inguinal hernia)ప్రత్యక్ష గౙ్జల హెర్నియా అనేది హెర్నియా రకాల్లో సంక్రమిక రకం. ప్రత్యక్ష గౙ్జల హెర్నియా (పిల్లలలో అసాధారణం), కడుపులో ఉన్న కండరాలు వంటి భాగాలు, ఉదర గోడ (సాధారణంగా హెస్సెల్బాచ్ యొక్క త్రిభుజం)లోని బలహీనప్రాంతంలో చొచ్చుకునిపోయి ఉపరితల గౙ్జల రింగ్ ద్వారా ఉబ్బి బయటకు పొడజూపుతాయి. ప్రత్యక్ష గిలక/హెర్నియా అప్పుడప్పుడు వృషణాల్లోకి కూడా దిగబడ్డం జరుగుతుంది.
 • తొడగిలక (Femoral Hernia)
  “ఫెమోరల్ కెనాల్” అని పిలువబడే తొడ సందునిర్మాణం ద్వారా పొత్తికడుపులోని కండరాది భాగాలు  చొచ్చుకుని వచ్చి ఉబ్బెత్తుగా, ‘బుడిపె’లాగా రూపుదిద్దుకుంటాయి. కాలు ఎగువన తొడ మధ్యభాగంలో సుమారుగా గజ్జల మడతలో ఈ బుడిపె చోటుచేసుకుంటుంది. ఈ తొడగిలక 2: 1 నిష్పత్తిలో పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లోనే కానవస్తుంది, అందునా ఇది తల్లులలో రెట్టింపు అవుతుంది. అయినప్పటికీ, గజ్జల హెర్నియాలు తరచుగా స్త్రీలలో ఎక్కువగా సంభవిస్తుంటాయి. తరువాతి స్థానం కత్తిగాటు  హెర్నియాది, తరువాత మూడోసాధారణ రకంలో తొడగిలక/Femoral Hernia ఉంటుంది. ఇది ఎక్కువగా ఎడమవైపు కంటే కుడి వైపున్నే వస్తుంటుంది మరియు 15-20% మహిళల్లో కుడి, ఎడమ-రెండు వైపులా వస్తుంటుంది.
 • బొడ్డుగిలక (Umbilical Hernia)
  మనిషిలో నాభి లేదా బొడ్డు అనేది పుట్టినప్పుడు బొడ్డుతాడును అంటిపెట్టుకుని ఉండే శరీరభాగం. బొడ్డుగిలక (umbilical hernia) సమస్య పిల్లలు మరియు నవజాత శిశువులకు సాధారణంగా వస్తుంటుంది. బొడ్డులో వాపుదేలి, బుడిపె రూపంలో బయటికి పొడుచుకొచ్చినట్లు కానవస్తుందిది. పొత్తికడుపు గోడ కండరాలలోని ఒక సందు- పుట్టకముందే మూసుకోకపోవడంవల్ల సంభవిస్తుంది. సాధారణంగా అందరిలో ఈ పొత్తికడుపు గోడ కండరాల సందు జననానికి ముందే మూసుకుపోతుంది.  బొడ్డుగిలక వ్యాధిని మూడు భాగాలుగా విభజించవచ్చు:
  •  నవజాత శిశువుల బొడ్డుగిలక
  •  శిశువులు మరియు పిల్లల యొక్క బొడ్డుగిలక
  •  వయోజనులు బొడ్డుగిలక (మగ: ఆడ, 1: 5).
 • కత్తిగాటు గిలక (Incisional Hernia)
 • కత్తిగాటు గిలకను “శస్త్ర-చికిత్సానంతర గిలక” (post-operative hernia) లేక “ఉదర-సంబంధ గిలక” అని కూడా పిలుస్తారు. ఇది పొత్తికడుపుపై ఏదేని  శస్త్రచికిత్స తర్వాత సాధారణంగా ఏర్పడే బలహీనమైన ఘాటు/మచ్చ వలన ఏర్పడుతుంది. ఇది స్త్రీలలో చాలా సాధారణం. కత్తిగాటు గిలక (incisional hernia)కు దారితీసే కారకాలు క్రింది విధంగా ఉన్నాయి:
  • పెరిటోనిటిస్/భిన్నాంత్రోదరము (లేదా దీన్నే పెరిటోనిటిస్ అంటారు-ఇది పొత్తికడుపు కుహరం లోపలి గోడల కండరపొర. పొత్తికడుపు అవయవాలన్నింటిని తనలో దాచుకుని రక్షిస్తుందిది) శస్త్రచికిత్సల తరువాతి క్రిమి దోషం లేదా డ్యూడెనియల్ (డ్యూడెనమ్ అని పిలువబడే చిన్న ప్రేగులలో ఒక పుండు) మరియు ఇతర కారకాలు.
  • గతంలో శస్త్రచికిత్స చేసిన ప్రదేశం (ముఖ్యంగా ప్రసూతి శస్త్రచికిత్సల తరువాత ఏర్పడే బలహీనమైన మిడ్లైన్).
  • తగ్గిన కండరాల శక్తితో పాటు ఊబకాయం.
  • శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు తప్పుడు టెక్నిక్ వాడటం.
  • శస్త్రచికిత్స తర్వాత ఉదరం యొక్క వాపు మరియు నిరంతర దగ్గుకు కారణమయ్యే జలోదరము లేదా అసైటెస్ (ఉదరం లో అధిక ద్రవం యొక్క సేకరణ).
  • తప్పుడు శస్త్రచికిత్స కోతలు (ప్రధానంగా నరములు తెగ్గోసిన  ప్రదేశాలలో).
 • స్పిజిలియన్ హెర్నియా (Spigelian Hernia)
  స్పిజిలియన్ హెర్నియా కండర సందుల్లో వచ్చే గిలకవ్యాధి. స్పీజిలియన్ హెర్నియా అనేది కండర కణాల మధ్య ఉండే చిన్న చిన్న సందు ప్రదేశాల గుండా చొచ్చుకునిపోయి  ఏర్పడుతుంది. ఇది పునరావృత గర్భాలు, ఊబకాయం, వయసు పెరగడం, కండరాల క్షీణత, దగ్గు వలన కలిగే ఆకస్మిక అలసట, భారీ వస్తువులను ఎత్తడం వలన కల్గుతుంది. ఇది పురుషులు మరియు స్త్రీలలో సమానంగా సంభవిస్తుంది.
 • ఛాతీలో వచ్చే హెర్నియా (Epigastric Hernia)
  ఛాతీలో వచ్చే గిలకవ్యాధి అంటే నాభి పైన రొమ్ము ఎముక క్రింద ఉన్న ప్రాంతం (ఎపిగాస్ట్రిక్ ప్రాంతం) లో దాపురించేవ్యాధి. ఎపిగాస్ట్రిక్ హెర్నియా సాధారణంగా కొవ్వు కణజాలంతో కూడిఉంటుంది మరియు చాలా అరుదుగా ప్రేగులకు సోకుతుంది. ఎపిగాస్ట్రిక్ గిలకవ్యాధి బాగా కండలు కల్గిన పురుషులు మరియు శారీరక శ్రమ చేసే కార్మికుల్లో చాలా సాధారణం. ఎపిగాస్ట్రిక్ హెర్నియా తరచుగా నొప్పిలేకుండా ఉంటుంది, కానీ కొందరిలో మాత్రం ఇదున్న ప్రదేశాన్ని తాకడంతోనే చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా సందర్భాలలో ఎపిగాస్ట్రిక్ హెర్నియాలు జీర్ణకోశ పుండ్ల వ్యాధితో కూడుకుని ఉంటాయి.  
 • హియేటల్ హెర్నియా (Hiatal Hernia)
  హెర్నియా వ్యాధి సాధారణ రకాల్లో హియేటల్ హెర్నియా ఒకటి. రొమ్ముకు కడుపుకు ఉన్న నడిమిభాగము (డయాఫ్రమ్) రెండు ద్వారాలను కలిగి ఉంటుంది: ఒకటో ద్వారం అన్నవాహిక మరియు రెండవ ద్వారం బృహద్ధమని. (గుండెకు ఎడమపక్కన ఉండే పెద్దనెత్తుటి నాళమే బృహద్ధమని. ఈ బృహద్ధమని గుండె నుండి మిగిలిన శరీరానికి రక్తం తీసుకుపోయే పెద్ద రక్తనాళం). కడుపులో కొంత భాగాన్ని పైకి ఎత్తినప్పుడు గాని లేదా ఒత్తిడికి గురైనపుడు ఈ రెండు ద్వారాల్లో ఎదో ఒకదానిలోనికి చొచ్చుకునిపోయి ఈ హియెటల్ హెర్నియాకు దారి తీస్తుంది. ఈ రకం గిలకవ్యాధిలో పేగు మెలిపడి మూసి కొనిపోవుట జరిగి కడుపులో స్థితి మార్పుకు దారి తీస్తుంది. దీనివల్ల చాలా సందర్భాలలో గుండెల్లో మంట, నొప్పి, మరియు వాంతులు అవడం జరుగుతుంది.  
 • డియాఫ్రాగ్మాటిక్ హెర్నియా (Diaphragmatic Hernia)
  “డియాఫ్రాగ్మాటిక్” అనే ఈ రకమైన హెర్నియా సాధారణంగా పుట్టుకతో వచ్చే లోపము వలన కలుగుతుంది. ఇది కడుపు భాగం, ప్రేగులు , కాలేయం వంటి ఉదర అవయవాలను ఛాతీ కుహరంలోకి నెట్టడానికి కారణమవుతుంది. 
 • లుంబార్ హెర్నియా(Lumbar Hernia)
  లుంబార్ హెర్నియాలో ప్రాథమిక మరియు ద్వితీయ అని రెండు రకాలు. ప్రాథమిక లుంబార్ హెర్నియా చాలా అరుదైనది, మరియు గుర్తించదగిన కారణము లేకుండా శరీర నిర్మాణ లోపము వలన సంభవిస్తుంది. అయితే ద్వితీయ లుంబార్ గిలకవ్యాధి శస్త్రచికిత్స కారణంగా వస్తుంది మరియు ముఖ్యంగా మూత్రపిండవ్యాధుల శస్త్రచికిత్సల తరువాత సర్వసాధారణంగా వస్తుంది.  

డ్యూయల్ హెర్నియా, ప్రీవెసికాల్ హెర్నియా, లిట్రే యొక్క హెర్నియా, మేడెల్స్ హెర్నియా మరియు స్లైడింగ్ హెర్నియా వంటి కొన్ని ఇతర రకాల  హెర్నియాలు అరుదుగా కనిపిస్తాయి.

హెర్నియా అంటే ఏమిటి? - What is a Hernia in Telugu

శరీరంలో ఏదేని అంతర్గత అవయవం లేదా కొవ్వు కణజాలము తన చుట్టూ ఉన్న మృదు కణజాలం లేదా బలహీనమైన మెత్తని కండరాలున్నచోట్లలో పైకి పొడుచుకొని వచ్చి “బుడిపె” లాగానో లేదా “ఉబ్బు” గానో కనబడుతుంది, ఇలా పైకి పొడుచుకొచ్చే ఉబ్బునే “హెర్నియా” లేదా “గిలక” వ్యాధి అంటాము. హెర్నియా పురుషులు, మహిళలు మరియు చిన్నపిల్లలక్కూడా వస్తుంది. ఊబకాయుల్లో ఇది చాలా సర్వసాధారణం. పేగుల్లోని ఏదేని భాగం లేదా తిత్తి పొత్తికడుపు గోడల ఖాళీ లోనికి చొచ్చుకుని పోయి బుడిపె లేక “గిలక” లేదా హెర్నియాగా పైకి కనబడుతుంది. ఇలా పైకి పొడుచుకొచ్చిన దాన్నే “గిలక తిత్తి” (hernia sac) అని అంటారు. ఈ గిలక తిత్తిలోనికి పొత్తికడుపు వెలుపలి గోడ (ఆంత్రవేస్టనం), కడుపుభాగం, బోజ్జకొవ్వు, పేగుల్లోని కొంత భాగం చొచ్చుకొనివచ్చి ఉండచ్చు. తత్ఫలితంగా, బుడిపె లాగా పైకి ఉబికొచ్చి గిలకలాగా స్పష్టంగా కనబడుతుంది.

గిలక వ్యాధి (హెర్నియా) లక్షణాలు - Hernia symptoms in Telugu

గిలకవ్యాధి పొడజూపే లక్షణాలు చాలా వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు

 • కడుపు లేదా పొత్తికడుపు వంటి శరీర భాగాల్లో నొప్పిలేని ముద్దగానో లేక నొప్పితో కూడుకున్న వాపు గాని లేదా పొడుచుకొచ్చిన మృదువైన బుడిపెగా  గాని ఉద్భవించడం జరుగుతుంది, ఇలా బయటికి పొడుచుకొచ్చిన బుడిపెను తిరిగి కడుపులోనికి ఒత్తేసి, లోనికి నెట్టేసి సరిచేయచ్చు లేక అలా లోపలికి ఒత్తేయలేకనూ పోవచ్చు. ఉదరం లేదా కటి ప్రాంతంలో నొప్పి ఉండడం అనేది గిలకవ్యాధి (హెర్నియా) యొక్క సాధారణ లక్షణం.
 • అన్నిరకాల గిలక వ్యాధులు సమస్యాత్మకం కాదు,  నొప్పినీ కల్గించవు. అయితే, సామాన్యంగా, కొన్ని గిలకవ్యాధివల్ల అప్పుడప్పుడు నొప్పి, మండినట్లుండేది, ఒత్తిడి లేదా లాగినట్లుండడం జరుగుతుంది, ముఖ్యంగా తీవ్ర శారీరక శ్రమ చేసినపుడు పై లక్షణాలు కన్పిస్తాయి. తీవ్రమైన ఒత్తిడికి గురైన ఉదర కండరాలు గిలకవ్యాధి నొప్పికి కారకం.  
 • హియేటల్ హెర్నియాలో, ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఎగువ ఉదరంలో నిస్తేజంగా ఉండే నొప్పి ఉంటుంది. గిలకవ్యాధి (హెర్నియా)కి ప్రారంభంలోనే చికిత్స చేయకపోతే వ్యాధి పెరిగేకొద్దీ వాంతి కూడా సంభవిస్తుంది. (మరింత సమాచారం: కడుపు నొప్పి కారణాలు మరియు చికిత్స)
 • గజ్జల్లో వచ్చే హెర్నియాలో గడ్డలాంటి ఉబ్బు కలుగుతుంది. గజ్జల్లో ఉండే  నరాలు కూడా ఉబ్బులో భాగమైతే ఆ నరాలు వచ్చినపుడు తీక్షణమైన నొప్పి, మండినట్లుండే నొప్పి లేదా రెండింటిని కూడా కలిగించొచ్చు. మెలితిరిగి,  చనిపోయిన ప్రేగును కల్గిన గిలక వ్యాధి మరింత ముదిరితే వికారం, వాంతులు మరియు జ్వరం కూడా సంభవించవచ్చు.
 • పిల్లలలో బొడ్డుప్రాంతంలో వాపు సంభవించినపుడు “బొడ్డుగిలక” వ్యాధి వస్తుంది. పెద్దలలో కూడా బొడ్డు ప్రాంతంలోని వాపు కారణంగా బొడ్డు గిలక కనిపిస్తుంది. దగ్గినప్పుడు లేదా ఎక్కువ శ్రమ పడి అలసట కలిగినపుడు బొడ్డుగిలక వ్యాధి మరింత పెరుగుతుంది. అప్పుడప్పుడూ లాగినట్లుండే నొప్పి కూడా ఉంటుంది.
 • కత్తిగాటు గిలకవ్యాధి (Incisional hernia) ఎప్పుడు సంభవిస్తుందంటే శస్త్రచికిత్స అనంతరం నాలుగో రోజున సూత్ర రేఖ వెంట చీము వంటి ద్రవస్రావం కలగటాన్ని గుర్తించిన్నపుడు. దీన్నే ఈ వ్యాధికి సూచనగా గ్రహించొచ్చు. ఇంకా, శస్త్రచికిత్స సమయంలో సంక్రమణ చరిత్ర కూడా ఇందుకు ఒక సంకేతం. శస్త్రచికిత్సకు సంబంధించిన మచ్చ ప్రాంతంలో గుబ్బ  లేదా వాపు కనిపిస్తుంది.

హెర్నియా కారణాలు మరియు ప్రమాద కారకాలు - Hernia causes and risk factors in Telugu

కారణాలు  

బలహీనమైన శరీర కణజాలాలు (ఉదర కండరాలు మరియు అనుబంధ బంధన కణజాలం) గిలకవ్యాధుల ప్రమాదాన్ని పెంచే కారకాలుగా చెప్పచ్చు. కొంతమందిలో బలహీనమైన బంధన కణజాలం పుట్టుకతోనే వస్తుంది. ఇంకొంతమందిలో వయసు ముదిరేకొద్దీ బంధన కణజాలం బలహీనమవుతుంది. అనారోగ్యం లేదా పునరావృతమయ్యే శస్త్రచికిత్సల కారణంగా కూడా కండర కణజాలం మరియు కండరాలు బలహీనమవుతాయి. అంతేకాకుండా, కడుపు ఒత్తిడిని పెంచే నిరంతర కఠినమైన భౌతిక చర్యలు లేదా సంబంధిత పరిస్థితులు, అప్పటికే శరీరంలో ఉన్న గిలకవ్యాధి/ హెర్నియా మరింత క్షీణించేందుకు దోహదం చేస్తాయి. ఉదాహరణకి,

 • ఊబకాయంమూలంగా పొత్తికడుపులో ఒత్తిడి పెరుగుతుంది.
 • ఆకస్మికంగా భారీ బరువుల్ని ఎత్తినప్పుడు నిరంతరంగా వచ్చే దగ్గు.
 • ప్రేగుల కదలికలో ప్రయాస గాని బెణుకు గాని లేదా మూత్రవిసర్జన సమయంలో ప్రయాస.
 • ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల 
 • పోషకాహారాల కొరత కారణంగా.
 • మగవారిలో పొడజూపిన గిలకవ్యాధిని వైద్యుడిచేత పరీక్షించుకోక పోవడం.  
 • స్త్రీలలో ప్రసూతి శస్త్రచికిత్సలు లేదా పలుసార్లు గర్భం ధరించడం మూలాన.  . పొత్తికడుపులో ద్రవ సేకరణ.

ప్రమాద కారకాలు

గిలకవ్యాధికి సంబంధం ఉన్న అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. ఉదాహరణకు  

 • వారసత్వం. కుటుంబంలోనివారికి/పూర్వీకులకు గిలకవ్యాధి కల్గిన చరిత్ర.  
 • ధూమపానం.
 • మలబద్ధకం.
 • ఆటలు (sports) ఆడేసమయంలో గాయం కావడం.
 • ఊబకాయం.
 • ఊపిరితిత్తుల పరిష్టితి. ఉబ్బసం మరియు సిఓపిడి (COPD,Chronic obstructive pulmonary disease) వ్యాధులతో  సహా.
 • గర్భం మరియు కానుపు నొప్పులు.
 • జలోదరము (Ascites), శస్త్రచికిత్స, స్టెరాయిడ్స్ మరియు మత్తుమందుల దురుపయోగం.

గిలకవ్యాధి నివారణ - Prevention of Hernia in Telugu

గిలకవ్యాధి (హెర్నియా) నివారణ ఆ వ్యాధి రకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి,

 • కత్తిగాటు గిలకవ్యాధులను (Incisional hernias) నివారించడానికి, అధిక ఒత్తిడికి కారణమయ్యే చర్యలు చేపట్టకూడదు. శస్త్రచికిత్స తరువాత భారీ వస్తువులని మోయడం, మలవిసర్జన సమయంలో ప్రయాస, మరియు అధిక దగ్గు వంటివాటిని నివారించుకోవాలి. మితిమీరిన ఒత్తిడిని ఎదుర్కొనే శ్రమ తీసుకోకుండా పుష్కల విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
 • ఊబకాయం మరియు అధిక బరువును కల్గిఉండటం కత్తిగాటు గిలకవ్యాధికి ప్రమాద కారకాలు, కనుక, మీ బరువును అదుపులో ఉంచడం ఉత్తమం.
 • అంతేకాకుండా, సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, శస్త్రచికిత్సాసంబంధమైన కత్తిగాటు ప్రాంతాన్నిస్టెరిలైజ్ (క్రిమిసంహారచర్యలు) చేయడం ద్వారా శుభ్రపరుచుట, కట్టుకట్టడం, వైద్యుడికి తరచూ చూపించి చికిత్స తీసుకోవడం వంటి చర్యలు కత్తిగాటు గిలకవ్యాధిని తగ్గించేందుకు సహాయపడతాయి.
 • శస్త్రచికిత్సా గాయాల యొక్క మెరుగైన వైద్యం కోసం ధూమపానాన్ని పూర్తిగా మానుకోవడం చాలా అవసరం. ఈ చర్య కూడా కత్తిగాటు గిలకవ్యాధి (ఇన్సిజనల్ హెర్నియస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 • డయాబెటిస్, రక్తహీనత, మరియు రక్తపోటు (అధిక రక్తపోటు/ అల్ప రక్తపోటు) వంటి వ్యాధులను సరైనరీతిలో చికిత్సద్వారా నయం చేసుకుంటే “కత్తిగాటు గిలకవ్యాధి” నుండి కూడా త్వరగా కోలుకోవచ్చు. (మరింత సమాచారం: అధిక రక్తపోటు చికిత్స)
 • మల విసర్జన, మూత్రవిసర్జన సమయంలో ప్రయాస పడుతున్నట్లైతే, ఆ ప్రయాసను “పొత్తికడుపు గిలకవ్యాధి”, “కత్తిగాటు గిలకవ్యాధి” విషయంలో తగ్గించుకోవాలి. భారీ వస్తువులను ఎత్తడమనే చర్యను సాధ్యమైనంతవరకూ పూర్తిగా విడనాడాలి. బరువైన వస్తువులను ఎత్తేపని చేసేటపుడు మోకాళ్లపైకి వంగడం ద్వారా చేయాలి గాని నేరుగా  వీపును వంచడం ద్వారా చేయకూడదు.

గిలకవ్యాధి నిర్ధారణ - Diagnosis of Hernia in Telugu

 • గిలకవ్యాధి (హెర్నియా) విశ్లేషణకు వైద్యుడిచేత చేయించుకునే ఓ వివరణాత్మక శారీరక పరీక్ష సరిపోతుంది. నిటారుగా నిలబడితే చాలు గిలకవ్యాధికి సంబంధించిన  కండరాల వాపు లేదా ఉబ్బు కనిపిస్తుంది. లేదా నేరుగా మీ చేతిని వాపు/ఉబ్బుపై వేసి స్పృశించడం ద్వారా లేక కిందికి వంగి పరీక్షించుకోవడం ద్వారానూ తెలుసుకోవచ్చు.
 • అల్ట్రాసౌండ్లు ప్రక్రియ సాయంతో తొడలో దాపురించే గిలకవ్యాధిని చూడవచ్చు. ప్రేగుల్లో అవరోధం ఉన్నట్లు అనుమానమొస్తే X-రే సాయంతో పరీక్షించొచ్చు. గతంలో అయితే, 'హెర్నియాగ్రామ్' అనే ప్రక్రియ ద్వారా పరీక్షించేవారు, కానీ అందులో ఉన్నటువంటి శరీరం లోపలికి పరికరాలను జొప్పింపచేసే క్రియ కారణంగా దాన్ని ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది.
 • సిటి (CT) & ఎంఆర్ఐ (MRI) స్కాన్ లను కొన్ని సందర్భాల్లో సూచించవచ్చు.
 • బేరియం అని పిలువబడే ఖనిజరంగును కొన్ని వ్యాధినిర్ధారణా పరీక్షలకు వినియోగించడం అవసరమవుతుంది. “బేరియం మీల్ స్టడీ” అని దీన్ని పిలుస్తారు. పరీక్ష చేయించుకునే వ్యక్తి చేత ఈ బేరియం రంగు కల్గిన పదార్థాన్ని త్రాగించడమో లేక తినిపించడమో జరుగుతుంది. జీర్ణాశయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి జీర్ణవాహికలో ఉన్నట్లయితే ఎక్స్-రేలో ఈ రంగుద్వారా చూసి కనుక్కోవచ్చు.
 • ఎండోస్కోపీ పద్ధతిలో కెమెరా బిగించిన సన్నని గొట్టాన్ని నోటి ద్వారా కడుపులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. హియేటల్ హెర్నియా విషయంలో ఈ ఎండోస్కోపీ ని ఉపయోగిస్తారు. అంతర్గత లోపాలను చూసేందుకు మరియు హియేటల్ హెర్నియాను నిర్ధారించడానికి ఎండోస్కోపీని రోగికి నిర్వహిస్తారు.

హెర్నియా చికిత్స - Hernia treatment in Telugu

శస్త్రచికిత్స (Surgery)

శస్త్రచికిత్సే గిలకవ్యాధిని నయం చేసుకునేందుకు సరైన ఎంపిక. గిలక ఉబ్బులోనికి చొచ్చుకొచ్చిన భాగాల్ని లేదా అవయవాల్ని ఉదరంలోని వాటి యథా స్థానాల్లోకి నెట్టడం లేదా పూర్తిగా తొలగించివేయడం మరియు కుట్లు వేసి  ఏర్పడిన రంధ్రాన్ని మూసివేయడం అనేది ఉంటుందీశస్త్ర చికిత్సలో. గిలక ఏర్పడడానికి కారణమైన బలహీనమైన కణజాలం మరియు కండరాలకు మద్దతు (supportive) గా మెష్ (సింథెటిక్ లేదా జంతు-సంబంధ పదార్థంతో తయారైన కృత్రిమమైన వలవంటిది)  ఉపయోగించబడుతుంది.

ఈ శస్త్రచికిత్సను రెండు విధాలుగా చేయవచ్చు: 1. ఓపెన్ లేదా సంప్రదాయిక శస్త్రచికిత్స మరియు 2. అతి తక్కువగా జొప్పించే క్రమమున్న శస్త్రచికిత్స లేదా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స. సంప్రదాయిక ఓపెన్ శస్త్రచికిత్సలో, గిలక (ఉబ్బు)  ఉన్న చోట ఒక పొడవైన మరియు పెద్ద కట్ లేదా చీలిక చేసి లోపల ఉండే బలహీనమైన కండరాలకు వైద్యులు మరమ్మతులు చేస్తారు. లాపరోస్కోపిక్ లేదా “కీహోల్” శస్త్రచికిత్సలో, పలు చిన్న రంధ్రాలు లేదా కోతలు పెడతారు, తర్వాత ట్యూబ్-వంటి పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఒక మానిటర్ మీద వైద్యుడికి ఒక వివరణాత్మకమైన వీక్షణ పొందటానికి, అవసరమైన ప్రక్రియ నిర్వహించడానికి శస్త్రచికిత్సలో భాగంగా ఒక కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.  

గజ్జల్లో ఏర్పడ్డ గిలకవ్యాధులకు, హెర్నియోటమీ, హెనియోర్రఫ్ఫి, లేదా హెర్నియోప్లాస్టీ అనేవి కీలక శస్త్రచికిత్సా పద్దతులు. “కుంట్జ్ ఆపరేషన్,” ఆండ్రూ యొక్క ఇంబ్రికేషన్స్ (imbrications), లేదా మ్వేవే లేదా న్హ్యూస్ రిపేర్ వంటి ఇతర శస్త్రచికిత్స విధానాలను కూడా అవసరాన్ని బట్టి వైద్యుడు నిర్ణయిస్తాడు. ఇలాంటి అనేక రకాల గిలకవ్యాధుల్ని నయం చేయడానికి  వేర్వేరు శస్త్రచికిత్సలను చేస్తారు.

శస్త్రచికిత్స మాత్రమే గిలకవ్యాధికి ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. మీకు ఉన్న గిలకవ్యాధి ఎలాంటి ఆరోగ్య సమస్యల్నికలిగించనట్లయితే శస్త్రచికిత్స ఏమాత్రం అవసరము లేదు. అంతేకాకుండా, వయసై పోయిన ముసలివారికి, తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నవారికి శస్త్రచికిత్సను తప్పించవచ్చు.  

మందులు (Medications)

అప్పుడప్పుడు, హియాటల్ హెర్నియా సమయంలో, మందుల అంగడిలో  (over the counter medicines) దొరికే మందులు/ఉత్పత్తులు మరియు ఇతర మందులు కడుపు ఆమ్లం సమస్యని తగ్గిస్తాయని సూచించబడవచ్చు, తద్వారా మీరు ఎదుర్కొంటున్న అసౌకర్యం మరియు ఇతర లక్షణాలను ఉపశమనం చేస్తాయి. వీటిలో కొన్ని మందులు నొప్పిని సంహరించేవి,  కడుపులో ఉండే ‘హిస్టమిన్’ అనే పదార్థానికి వ్యతిరేకంగా పనిచేసే H-2 రిసెప్టర్ బ్లాకర్స్, యాంటాసిడ్లు మరియు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (కడుపు ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే మందులు).

జీవనశైలి నిర్వహణ (Lifestyle management)

ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా తరచుగా హియాటల్ హెర్నియా లక్షణాలకు చికిత్స చేయవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేవు. నాణ్యమైన మరియు పరిమాణపరంగా భారీ భోజనం చేయడం మానుకోవాలి. భోజనమైన తర్వాత వెంటనే పడుకోకూడదు మరియూ అధిక శ్రమతో కూడిన భౌతికమైన పనుల్ని చేయకూడదు. దట్టమైన మసాలాలు కల్గిన పదార్థాలు లేదా అతి పుల్లని ఆహారాలను తీసుకోవడం మానుకోవడం ద్వారా హియాటల్ హెర్నియా రోగులు ఆమ్లము తిరిగి తిరిగి ఊరడం (acid reflux) అనే సమస్యను తగ్గించవచ్చు. అంతేకాక, వ్యాధి లక్షణాలున్నంత వరకూ ధూమపానం పూర్తిగా మానుకోండి. శరీర బరువును అదుపులో ఉంచాలి, వ్యక్తి యొక్క ఎత్తుననుసరించి బరువును నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి.

కొన్ని వ్యాయామాలు శరీరంలో హెర్నియా వ్యాధి కల్గిన చోటు చుట్టూ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, అంతే కాకుండా  ఇవి కొన్ని వ్యాధిలక్షణాలను తగ్గించవచ్చు కూడా. అయినప్పటికీ, వ్యాయామాలను అర్హత కలిగిన మార్గదర్శకుని పర్యవేక్షణ లేకుండా అభ్యాసం చేయడం వలన వ్యాధి లక్షణాలను మరింత పెంచవచ్చు మరియు పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. అందువల్ల, ఒక ఫిజియోథెరపిస్టును సంప్రదించి, అతని/ఆమె పర్యవేక్షణలో వ్యాయామాలు చేసుకోవడం ఉత్తమం.

అవసరమైన అన్ని నివారణాచర్యలను చేపట్టిన తరువాత కూడా వ్యాధి లక్షణాలు ఉపశమనం కాకపోతే, గిలకవ్యాధి/హెర్నియాని నయం చేసుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.  

హెర్నియా రోగ నిరూపణ మరియు సమస్యలు - Hernia prognosis and complications

రోగ నిరూపణ

సమయానుసారంగా రోగనిర్ధారణ మరియు చికిత్స చేస్తే గిలకవ్యాధి-సంబంధిత  (హెర్నియాల్) చికిత్స యొక్క ఫలితం సాధారణంగా బాగుంటుంది. చికిత్సా ఫలితం యొక్క స్వభావం గిలకవ్యాధి యొక్క రకం మరియు దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది, ఇంకా,  ఇది గిలకవ్యాధిని (హెర్నియా) పెంచే కారకాల సంఖ్యను తగ్గించడంపైనా ఆధారపడి ఉంటుంది.

వృద్ధాప్యం, చాలా కాలం నుండి గిలకవ్యాధికి చికిత్స చేయించుకోకపోవడం లేక గిలక భాగంగా ఏర్పడ్డ భాగాల్ని సరిచేసి తిరిగి వాటిని (లోపమున్న చోటికి) యథాతథంగా చేర్చకుండా పోవడం వంటివి అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయే పరిస్థితి లేక ప్రేగుల్లో అడ్డంకులు ఏర్పడడం వంటి ప్రమాదకారకాలకు దారి తీస్తాయి. ఇవి వైద్యరీత్యా అత్యవసరమైన పరిస్థితులు (అంటే హుటాహుటిన చికిత్సనందించాల్సిన ప్రమాదకరమైనవి). పొత్తికడుపు గిలకవ్యాధి (హెర్నియా) సాధారణంగా పిల్లలలో పునరావృతం కాదు కాని, 10% మంది పెద్దవారిలో మరలా మరలా వచ్చే ప్రమాదముంది.

బాల్యం ప్రారంభంలోనే శస్త్రచికిత్స మరియు సకాలంలో రోగనిర్ధారణ చేయడం వల్ల గిలకవ్యాధి విషయంలో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి వీలుంది.  

ఉపద్రవాలు (Complications)

సాధారణంగా, గిలకవ్యాధి (హెర్నియా) శస్త్రచికిత్స తర్వాత వచ్చే సమస్యలు ఎక్కువ సంఖ్యలో ఏమీ లేవు. అయితే, ఒకవేళ అలాంటి సమస్యలేవైనా తలెత్తితే దానికి మరమ్మత్తుగా చేసే శస్త్రచికిత్సను చేయని ఎడల లేదా ఆ శస్త్రచికిత్సను సవ్యంగా చేయకపోతే, అది కొన్ని తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది, అవి:

 • తగ్గించేందుకు సాధ్యం కాని (Irreducibility) పరిస్థితి.
 • అడ్డంకిగా తయారైన గిలకవ్యాధి.
 • వ్రేలాడదీయబడిన హెర్నియా.
 • కందిపోయిన/ఎర్రబడిన హెర్నియా.
 • గిలకవ్యాధి ప్రాంతంలో మాంసాన్ని కుళ్ళబెట్టే (గాంగ్రెన్) పుండు.
 • శస్త్రచికిత్స చేసినచోట తిమ్మిరి.
 • గిలకవ్యాధి (హెర్నియా) చికిత్సకు ఉపయోగించే వలలాంటి జాలీ (mesh) ని రోగస్థితి తిరస్కరించడం.
Dr. Suraj Bhagat

Dr. Suraj Bhagat

गैस्ट्रोएंटरोलॉजी

Dr. Smruti Ranjan Mishra

Dr. Smruti Ranjan Mishra

गैस्ट्रोएंटरोलॉजी

Dr. Sankar Narayanan

Dr. Sankar Narayanan

गैस्ट्रोएंटरोलॉजी

గిలక వ్యాధి (హెర్నియా) కొరకు మందులు

గిలక వ్యాధి (హెర్నియా) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
RabletRablet 10 Mg Tablet65
R Ppi TabletR Ppi 20 Mg Tablet20
HelirabHelirab 20 Mg Injection49
OcidOCID 20MG CAPSULE 20S43
RabiumRabium 10 Mg Tablet15
RantacRantac 150 Mg Tablet18
Rekool TabletREKOOL 10MG TABLET 15S56
RabelocRABELOC 10MG TABLET 10S36
ZinetacZinetac 150 Mg Tablet17
AcilocAciloc 150 Tablet17
Rablet D CapsuleRablet D Capsule120
OmezOmez 10 Mg Capsule27
Razo DRazo D 30 Mg/20 Mg Capsule179
Rekool DRekool 40 D Capsule109
RazoRazo 10 Tablet46
Veloz DVeloz D 30 Mg/20 Mg Capsule103
Erb DsrErb Dsr 30 Mg/20 Mg Capsule60
Reden OReden O 2 Mg/150 Mg Tablet33
ZadorabZadorab Tablet34
R T DomR T Dom 10 Mg/150 Mg/20 Mg Tablet7
ZebraZebra 20 Mg Tablet0
Fast DsrFast Dsr 30 Mg/20 Mg Capsule52
AcifluxAciflux 20 Mg/150 Mg Capsule99
ZnrZnr 10 Mg Tablet76
Cyra ItCYRA IT CAPSULE101

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. InformedHealth.org. Hernias: Overview. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Hernias: Overview. 2016 Oct 6.
 2. United Consumer Financial Services.[internet]. University of California San Francisco, UCSF Medical Center, UCSF Department of Surgery, UCSF School of Medicine. Overview of Hernias.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hernia
 4. US Food and Drug Administration (FDA) [internet]; Hernia Surgical Mesh Implants: Information for Patients
 5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Hernias
और पढ़ें ...