కంటి రుగ్మతలు - Eye Disorders in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 19, 2018

July 31, 2020

కంటి రుగ్మతలు
కంటి రుగ్మతలు

కంటి రుగ్మతలు అంటే ఏమిటి?

కంటిలోని వేర్వేరు భాగాలకి  కలిగే సమస్యలను సమగ్రంగా సూచించడానికి ఉపయోగించే పదం కంటి రుగ్మతలు. కళ్ళు పొడిబారడం, కండ్లకలక, గ్లాకోమా, మాక్యులార్ డిజెనరేషన్, డయాబెటిక్ రెటినోపతీ, కంటిశుక్లం, కంటి చూపు బలహీనపడటం, మెల్ల కన్ను, దృష్టి (చూపు)  కోల్పోవడం అనేది ముఖ్యమైన కంటి రుగ్మతలు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కింద ఉన్న  సంకేతాలు మరియు లక్షణాలు వ్యక్తి కంటి రుగ్మతతో బాధపడుతున్నట్లు సూచిస్తాయి:

వీటి ప్రధాన కారణాలు ఏమిటి?

కంటి రుగ్మతలు వివిధ కారణాల వలన సంభవించవచ్చు. కంటి రుగ్మతలు యొక్క ముఖ్య కారణాలు క్రింది విధంగా ఉంటాయి:

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటి పరీక్షలు లక్షణాల యొక్క అంతర్లీన కారణం యొక్క నిర్ధారణలో సహాయపడతాయి. క్రింది విధాలుగా కంటి వైదులు, కంటి రుగ్మతలను నిర్దారిస్తారు:

 • కళ్ళను పరిశీలించడం.
 • దగ్గర ద్రుష్టి మరియు దూరదృష్టి వంటి దృష్టి లోపాల యొక్క తీవ్రతను తనిఖీ చేయడానికి వక్రీభవనం (Refraction) మరియు స్నెల్లైన్ (Snellen) పరీక్షలు.
 • విజువల్ ఫీల్డ్ టెస్టింగ్ (కంటి చూపు యొక్క పరిధిని పరీక్షించడం).
 • గోల్డ్ మెన్స్ పెరిమెట్రీ (Goldmann’s perimetry) మరియు అంస్లెర్స్ గ్రిడ్ (Amsler’s grid) పరధీయ మరియు కేంద్ర దృష్టిని (peripheral and central vision) తనిఖీ చేయడానికి.
 • కంటి యొక్క ఫండస్ (అంతర్గత భాగాన్ని) ను చూడడానికి ఫండోస్కోపీ (Fundoscopy).
 • టోనోమెట్రీ (Tonometry)  కళ్ళ యొక్క ఒత్తిడిని కొలవడానికి.
 • ఇషిహరా రంగు ప్లేట్లు (Ishihara colour plates) రంగు అంధత్వ  (colour blindness) తనిఖీ కోసం.

కంటి రుగ్మతల యొక్క చికిత్స సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంటి రుగ్మతల చికిత్సలు ఈ క్రింద ఉన్నాయి:

 • కళ్ళజోడులు, కాంటాక్ట్  లెన్స్ లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి (చూపు) ని సరిచేయడం.
 • పొడి బారిన కళ్ళకు  ఔషధంలేని కంటి చుక్కలు (eyedrops) లేదా కంటి జెలుల్లూ.
 • అలెర్జీలు, గ్లాకోమా మరియు కంటి అంటురోగాలకు /ఇన్ఫెక్షన్లకు ఔషధ కంటి చుక్కలు (eyedrops).
 • డయాబెటిక్ రెటినోపతి కోసం లేజర్ చికిత్స.
 • కంటిశుక్లం మరియు రెటినాల్ డిటాచ్మెంట్ (కంటి రెటీనా వేరవడం)  వంటి వాటి కోసం శస్త్రచికిత్స.
 • మక్యూలర్ డిజెనరేషన్ (macular degeneration) నిర్వహించడానికి ఫోటోడైనమిక్ (Photodynamic) థెరపీ.
 • పొడిబారిన కళ్ళ చికిత్స కోసం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు పోషక పదార్ధాలు.

కొన్ని జీవనశైలి మార్పులు కూడా కంటి లోపాలను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి; ఆరోగ్యకరమైన మరియు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు తినాలి, ధూమపానం ఆపివేయాలి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచాలి, సన్ గ్లాసెస్ తో కళ్ళను కాపాడుకోవాలి, పనిచేసేటప్పుడు భద్రతా గాగుల్స్ను ఉపయోగించాలి మరియు మీ కళ్ళు తగినంత విశ్రాంతి ఇవ్వండి. సుదీర్ఘకాలం పాటు ఉన్న లక్షణాలు లేదా పునరావృత లక్షణాల విషయంలో, సలహా కోసం కంటి వైద్యుడుని సంప్రదించాలి.వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Eye Diseases
 2. American Optometric Association. Eye & Vision Problems. St. Louis, Missouri. [internet].
 3. National institute of eye. Eye Health Tips. National Institutes of Health. [internet].
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Common Eye Disorders
 5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Vision Health Initiative (VHI)

కంటి రుగ్మతలు వైద్యులు

Dr. Meenakshi Pande Dr. Meenakshi Pande Ophthalmology
22 वर्षों का अनुभव
Dr. Upasna Dr. Upasna Ophthalmology
7 वर्षों का अनुभव
Dr. Akshay Bhatiwal Dr. Akshay Bhatiwal Ophthalmology
1 वर्षों का अनुभव
Dr. Surbhi Thakare Dr. Surbhi Thakare Ophthalmology
2 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కంటి రుగ్మతలు కొరకు మందులు

కంటి రుగ్మతలు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।