హెచ్.ఐ.వి. ఎయిడ్స్ - in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

November 12, 2018

March 06, 2020

హెచ్.ఐ.వి. ఎయిడ్స్
హెచ్.ఐ.వి. ఎయిడ్స్

సారాంశం

హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్, అది ఎయిడ్స్ వ్యాధిని, అనగా అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియెన్సీ సిండ్రోమ్ ను కలుగజేస్తుంది. మామూలుగా ఈ వైరస్ శరీర ద్రవాలను పరస్పర లైంగికంగా మార్పిడి చేసుకోవడం ద్వారా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులచే రక్తము ఎక్కించుకోవడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుండి బిడ్డకు వ్యాపిస్తుంది. ఈ వైరస్,శరీరము యొక్క అత్యంత రక్షణాత్మక వ్యవస్థ అయిన రోగనిరోధక వ్యవస్థను నిష్క్రియం చేస్తూ బలహీనపరుస్తుంది మరియు వ్యక్తిని ఇతర సంక్రమణలకు మరియు వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది. రెండు రకాల వైరస్ లు ఉన్నాయి, హెచ్ఐవి 1 మరియు హెచ్ఐవి 2.  ఈ వ్యాధి తీవ్రత స్థాయి నుండి దీర్ఘాకాలిక దశకు పురోగమిస్తుంది మరియు ఆఖరుకు ఎయిడ్స్ కు దారి తీస్తుంది, ఆ దశలో జీవితకాలము తగ్గిపోతుంది. 1 వ దశలో లక్షణాలు ఫ్లూ వంటి స్థితి నుండి వేర్వేరుగా ఉంటూ, దశ 2 లో అత్యంత క్షీణ పరిస్థితులు మరియు 3 వ దశలో మరింత తీవ్రమైన క్యాన్సర్ మరియు అవయవ వైఫల్యం వంటి సమస్యలు ఉంటాయి. మత్తుమందులు దుర్వినియోగపరచుకునే వారు, అసురక్షిత లైంగిక సంపర్కము కలిగియుండే వారు, మరియు సున్తీ చేయించుకోనివారు హెచ్ఐవి ని తెచ్చుకునే అధిక ప్రమాదములో ఉంటారు.

రక్త పరీక్షలు మరియు కొన్ని గృహ పరీక్షలు వ్యాధి స్థితిని నిర్ధారణ చేసుకోవడంలో సహాయపడతాయి, ఐతే ఫలితాన్ని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు తప్పనిసరిగా వెస్టర్న్ బ్లాట్ టెస్టును చేయించుకొని తీరాలి. హెచ్ఐవి/ఎయిడ్స్ కు నయము లేదు, ఐతే యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఎ.ఆర్.టి) తో దీర్ఘకాలం పాటు యాజమాన్యము చేసుకోవచ్చు. హెచ్ఐవి కొరకు అత్యధిక మందులు నిరోధకాలుగా ఉంటాయి, వైరస్ ప్రవర్ధమానం కావడానికి సహకరించే కొన్ని రకాల ప్రొటీన్లు రూపొందటాన్ని ఇవి అడ్డుకుంటాయి, కాగా మరి కొన్ని సిడి 4 కణాలు అనబడే కొన్నిరకాల రోగనిరోధక కణాలలోనికి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఆహారములో కొన్ని మార్పులు మరియు చికిత్స తీసుకోవడం కొరకు కుటుంబము నుండి మధ్ధతు మరియు మానసిక మరియు శారీరక ఒత్తిడితో జీవించడము పరిస్థితిని బాగుగా నిర్వహించుటకు సహాయము చేస్తుంది.   చికిత్స యొక్క దుష్ప్రభవాలు, సంబంధిత వ్యాధులు వంటి అనేక సమస్యలు కూడా ఉంటాయి, వీటి వృధ్ధి కారణముగా బలహీనమైన నిరోధక వ్యవస్థ మరియు క్యాన్సర్ ఏర్పడుతుంది, ఇది దశ 3 లో ఉన్న ప్రజలపై ప్రభావమును చూపుతుంది.  ఒకవేళ సకాలములో చికిత్స తీసుకున్నట్లయితే హెచ్ఐవి తో ఉన్న వ్యక్తులు ఇన్ఫెక్షన్ తో 50 సంవత్సరాల వరకూ చురుకైన జీవితం గడపగలుగుతారు మరియు ఎయిడ్స్ తో ఉన్న వ్యక్తులు తమ జీవిత కాలాన్ని మరో 10 సంవత్సరాలు పెంచుకోగలుగుతారు.

హెచ్.ఐ.వి. ఎయిడ్స్ యొక్క లక్షణాలు - Symptoms of HIV-AIDS in Telugu

వ్యాధి యొక్క దశలను బట్టి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అవి ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

తీవ్రమైన హెచ్..వి ఇన్ఫెక్షన్

ఇన్ఫెక్షన్ సోకిన నాలుగు వారాల లోపున, తీవ్ర దశలో ఉన్నవారు ఈ క్రింది వాటిని అనుభవించవచ్చు:

ఈ దశలో లక్షణాలు కొంత కాలంపాటు ఎక్కువగా బయటపడకుండా ఉంటాయి.

దీర్ఘకాలిక హెచ్..వి ఇన్ఫెక్షన్

ఈ దశలో, తీవ్రదశ యొక్క లక్షణాలు మాయం కావడం ప్రారంభమైనట్లుగా కనిపించడం సాధారణం, అయినప్పటికీ వ్యక్తి ఇంకా ఇన్ఫెక్షన్ ని మోస్తూనే ఉంటారు.  ఈ దశ అంతటా మరియు ప్రత్యేకించి చివరలో, ఈ వైరస్ సిడి4 కణాల గణనను పాడు చేస్తుంది మరియు కాలం గడిచే కొద్దీ తత్ఫలితంగా వైరస్ మరింత శక్తివంతమై సిడి4 కణాల గణన చాలా పడిపోతుంది. వ్యక్తి మూడవ మరియు అంతిమ దశకు చేరుకొనే కొద్దీ, లక్షణాలు ఎక్కువగా వృద్ధి కావడం మొదలవుతుంది.

ఎయిడ్స్

ఈ దశలో శరీరం అత్యంత బలహీనంగా ఉంటుంది. అవకాశవ్యాధులు అనబడే అనేక ఇన్ఫెక్షన్లు అగుపించడం ప్రారంభిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను ఎందుకు అలా అంటారంటే, అవి, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తియొక్క బలహీనపడిన రోగనిరోధక వ్యవస్థ ఫలితంగా వృద్ధి అవుతాయి మరియు వాటిలో అనేకం మామూలుగా హెచ్ఐవి లేని ఆరోగ్యవంతులైన వ్యక్తులలో ఎటువంటి లక్షణాలనూ కలిగించవు. ఈ ఇన్ఫెక్షన్లలో కొన్ని:

  • న్యుమోనియా, ఇది పొడి దగ్గుతో పాటు కలిసి వస్తుంది.
  • పోటు తో పాటుగా మస్తిష్కపు ఇన్ఫెక్షన్-టాక్సోప్లాస్మోసిస్ అనబడే లక్షణాలు.
  • గొంతు మరియు నోటిలో యీస్ట్ ఇన్ఫెక్షన్లు (నోటి దురదవ్యాధి).
  • ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ప్రత్యేకించి క్రిప్టోకోకస్ చే, మెనింజైటిస్ కు దారితీస్తూ.
  • వైరల్ ఇన్ఫెక్షన్లు పురోగతి చెంది బహుళదృష్టి ల్యూకో ఎన్సెఫాలోపతీగా (మెదడు యొక్క తెల్లని పదార్థము వివిధ స్థలాల్లో పాడు కావడం పురోగమిస్తూ) మారి, తత్ఫలితంగా మరణానికి దారి తీస్తుంది.
  • నోరు, చర్మము, గొంతు లేదా ముక్కు మరియు ఇతర శరీరావయవముల క్యాన్సర్, కపోసీస్ సార్కోమా అనబడే ఒక స్థితి యొక్క లక్షణాత్మక అంశాలుగా ఉంటాయి.
  • అవయవ భాగాల లింఫోమా లేదా క్యాన్సర్.

హెచ్.ఐ.వి. ఎయిడ్స్ యొక్క చికిత్స - Treatment of HIV-AIDS in Telugu

హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ మరియు ఎయిడ్స్ రెండూ ఎటువంటి నివారణను కలిగియుండలేదు, చికిత్స యొక్క దృష్టి అంతా కలిగియున్న వైరస్ పైన ఉంటుంది మరియు పరిస్థితి మరింత హీనస్థితికి వెళ్ళకుండా నివారించడానికి ప్రయత్నము చేస్తుంది.   ఈ విధమైన థెరపీ( చికిత్స) కు ఉపయోగించే పదమును యాంటిరెట్రోవైరల్ థెరపీ (ఎఆర్ టి) అంటారు, ఇది వివిధ మందుల యొక్క కలయిక ద్వారా వైరస్ ను మరియు దానిని అరికట్టే చర్యలలో తప్పనిసరిగా పాల్గొంటుంది.  ఈ ప్రక్రియకు తోడ్పడే మందులు:

  • నాన్-న్యూక్లోసైడ్ రివర్స్ ట్రాన్ స్క్రిప్టేస్ నిరోధకాలు (ఎన్ఎన్ఆర్టిఐ లు) అనునవి మందులు, ఇవి హెచ్.ఐ.వి యొక్క అబివృధ్ధిని పెంచుటకు కావలసిన కొన్ని ప్రొటీన్లను నాశనము చేయుటలో సహాయపడతాయి.
  • ప్రొటీస్ నిరోధకాలు అనునవి మరొక మందుల యొక్క సెట్, ఇది కూడా హెచ్.ఐ.వి యొక్క అబివృధ్ధిని పెంచుటకు కావలసిన ప్రొటీస్ అని పిలువబడే ప్రొటీన్లను నిరోధిస్తుంది.
  • ఫూజన్ నిరోధకాలు అనునవి మందులు, ఇవి సిడి4 కణాలలోనికి ప్రవేశించే హెచ్.ఐ.వి ని నివారిస్తుంది మరియు తద్వారా సిడి4 లెక్కను చెక్కుచెదరకుండా ఉంచుతుంది.
  • ఇంటగ్రేజ్ నిరోధకాలు అనునవి ఇంటగ్రేజ్ అని పిలువబడే ఆవశ్యకమైన ప్రొటీన్ ను నిరోధించడము ద్వారా సిడి4 కణాల యొక్క డిఎన్ఎ తో ఫ్యూజింగ్ నుండి హెచ్.ఐ.వి యొక్క జన్యు పదార్థమును నిరోధిస్తుంది.

జీవనశైలి యాజమాన్యము

హెచ్ఐవి ఇన్ఫెక్షన్/ఎయిడ్స్ కొరకు చికిత్స తీసుకుంటున్నవారికి స్నేహితులు మరియు కుటుంబము నుండి ఎంతో ఎక్కువ సహాయం అవసరం కావచ్చు. చికిత్స కొనసాగుతూనే ఉంటుంది మరియు ఇబ్బందిగా కూడా ఉంటుంది కాబట్టి, వ్యక్తులకు ఈ క్రింది సహాయం అవసరం కావచ్చు:

  • ఆరోగ్యసంరక్షణ వసతులకు రాకపోకలు సాగించుట
  • ఆర్థిక సహాయము
  • ఉపాధి చేయూత
  • న్యాయ సహాయము
  • స్వీయ మరియు పిల్లల రక్షణ
  • భావోద్వేగ మద్దతు మరియు స్నేహితులు, కుటుంబము మరియు సమాజము నుండి స్వీకారము.

జీవనశైలికి చేయవలసిన మార్పులలో, మత్తుమందులు మరియు మద్యం అతివినియోగం వంటి అలవాట్లు మానివేయుట, మరియు ఆరోగ్యకరంగా తినే అలవాట్లు చేసుకొనుట.  ఆహార ఎంపికలలో ఇవి ఉంటాయి:

  • ఎక్కువగా పళ్ళు, కూరగాయలు మరియు ధాన్యాలు తినడం.
  • గ్రుడ్లు మరియు మాంసాహారమును నివారించుట, లేదా ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్ రాగల అవకాశాలు పెంచే ఆహారాన్ని మానివేయుట. సాధ్యమైనంతవరకూ వండిన ఆహారపదార్థాలు ఎంపిక చేసుకొనుట.
  • సకాలములో చికిత్స తీసుకొనుట.
  • రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి ప్రత్యామ్నాయ చికిత్స తీసుకొనుట.
  • సాధ్యతగా ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం కలిగిన తక్షణమే వైద్య సహాయమును పొందుట. ఎందుకంటే హెచ్ఐవి తో జీవిస్తున్న వారిలో ఇన్ఫెక్షన్లు త్వరితంగా విజృంభించి వేగంగా తీవ్రతరమవుతాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW


వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; HIV/AIDS
  2. University of California San Francisco [Internet]. San Francisco, CA: Department of medicine; Superinfection
  3. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; HIV Overview.
  4. Ferri FF. Ferri's Clinical Advisor 2018. In: Ferri's Clinical Advisor 2018. Philadelphia, Pa: Elsevier; 2018.
  5. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; USPHS/IDSA Guidelines for the Prevention of Opportunistic Infections in Persons Infected with Human Immunodeficiency Virus.

హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

హెచ్.ఐ.వి. ఎయిడ్స్ కొరకు మందులు

Medicines listed below are available for హెచ్.ఐ.వి. ఎయిడ్స్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.