తెల్లబట్ట (ల్యూకోరియా) - White Discharge (Leucorrhea) in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 17, 2018

March 06, 2020

తెల్లబట్ట
తెల్లబట్ట

సారాంశం

తెల్లబట్ట మహిళల్లో కనిపించే సాధారణ మరియు మాములు స్థితి. ఇది ఒక పారదర్శక ద్రవం యొక్క స్రావం లేదా శ్లేష్మం, ఇది యోనిని తేమగా మరియు సరళతగా ఉంచి, యోని సంక్రమణలను నివారిస్తుంది.. ఒక మహిళ యొక్క వయోజన జీవితంలో యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు కలిగే హార్మోన్ల స్థాయిలో మార్పుల మూలంగా తెల్లబట్ట ఏర్పడుతుంది. దురదలేని తెల్లటి స్రావం మరియు తడిగా ఉండటం వంటివి తెల్లబట్ట యొక్క లక్షణాలు, ఇది హానిరహితమైనది మరియు ఎటువంటి సంక్లిష్టత లేకుండా పరిష్కరించవచ్చు. తెల్లబట్టకు గల ఇతర కారణాల్లో లైంగికేతర మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా ఉన్నాయి. ఈ సందర్భాలలో, దురద, ఎరుపుదనం, చెడు వాసన, అసౌకర్యం లేదా నొప్పి వంటి లక్షణాలు కూడా ఎదుర్కోవచ్చును. అటువంటి సంక్రమణలు సోకకుండా నివారించడానికి లేదా సంక్లిష్టతలను నివారించడానికి మందులు అలాగే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అధికంగా లేదా అసాధారణంగా ఉంటే తప్ప, తెల్లబట్టకు చికిత్స అవసరం లేదు.

తెల్లబట్ట (ల్యూకోరియా) అంటే ఏమిటి? - What is Leucorrhea in Telugu

ప్రపంచ జనాభాలో ఐదవ వంతు సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలను కలిగి ఉంటుంది. భారతదేశంలో, 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 19% మంది ఈ వయసు మహిళలు ఉన్నారు. భారతీయ మహిళలలో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో యోని ఉత్సర్గం నిర్లక్ష్యం చేయబడుతున్న సమస్య. మహిళా పునరుత్పాదక మార్గ సంక్రమణలు భారతదేశము మరియు బంగ్లాదేశ్లతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న ఒక ప్రజా ఆరోగ్య సమస్య. ఇక్కడ సంతానోత్పత్తి మార్గ సంక్రమణా సంఘటనలు 52-92% మధ్య ఉంటుంది. తెల్లబట్ట ఒక సహజ యోని స్రావం అయినప్పటికీ, ఇప్పటికీ ఇది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది. తెల్లబట్ట అనేది యుక్త వయసు మహిళలలో ఉండే ఒక లక్షణం అయినప్పటికీ, ఇది 3 నుంచి 10 ఏళ్ల వయస్సు మధ్య వయస్సున్న ఆడపిల్లల్లో కూడా చూడవచ్చు.

తెల్లబట్ట అనేది ఎటువంటి అంతర్లీనంగా వైద్య సమస్యలు లేకుండా యోని నుండి వచ్చే ఒక తెల్లటి స్రావం. క్లినికల్ ప్రాక్టీసులో, అన్ని రకాలైన స్రావాలు, తెలుపు లేదా పసుపు, ఏదైనాసరే రక్తం కలిగి ఉండకపోతే తెల్లబట్ట అనే అంటారు. సాధారణంగా స్త్రీల ఋతుచక్ర దశ మీద ఆధారపడి, యోని ద్రవం యొక్క రంగు, పరిమాణం మరియు చిక్కదనం మారుతూ ఉంటుంది. తెల్లబట్ట రంగు మరియు వాసన లేనిది, కానీ స్రావం ఎరుపుదనంతో పాటు ఆకుపచ్చ లేదా పసుపుగా ఉండి, దురద మరియు దుర్వాసనతో ఉంటే, ఇది పునరుత్పత్తి మార్గ సంక్రమణకు (ఆర్ టి ఐ) గుర్తుగా చెప్పవచ్చు.

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క లక్షణాలు - Symptoms of Leucorrhea in Telugu

సాధారణంగా, ఇన్ఫెక్షన్ సోకని తెల్లబట్ట అనేది ఒక పలచని, పారదర్శకమైన నీటి స్రావం. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, స్రావాల యొక్క మొత్తం, మందం మరియు రంగు మారుతూ ఉంటాయి. ఇది ఇతర లక్షణాలతో కూడా కూడి ఉంటుంది, ఇలా:

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క చికిత్స - Treatment of Leucorrhea in Telugu

మందులు

తెల్లబట్టకి కొంత కాలం యాంటీమైక్రోబియల్ మందులు వాడి చికిత్స చేయవచ్చును. అసాధారణమైన యోని స్రావాలకి, నిర్ధారించిన ఇన్ఫెక్షన్ యొక్క రకం మీద ఆధారపడి విధానాలు ఉంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు, సాధారణంగా యాంటీఫంగల్ మందుల కోర్సు సూచించబడుతుందిఏ చికిత్స లేకుండానే  BV యొక్క లక్షణాలు తగ్గుతాయి. హెర్పిస్ వ్యాధికి చికిత్స అందుబాటులో లేదు. యాంటీవైరల్ మందులు వ్యాప్తిని తగ్గిస్తాయి. సంక్రమణ సోకడాన్ని తగ్గించడానికి యాంటీవైరల్ మందులు కూడా ఇవ్వబడతాయి. ప్రస్తుతం, అనేక క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పటికీ ,హెర్పెస్ కోసం టీకా అందుబాటులో లేదు.

ఆహారంలో మెంతులు, ఎండిన కొత్తిమీర, పండిన అరటిపండ్లు వంటి హెర్బల్ రెమెడీలు చేర్చుకుంటే, తెల్లబట్టని అదుపు చేయవచ్చు. "రావి" చెట్టు, ఫికస్ రేసెమోసా, మరియు తెస్పియా నుండి తయారు చేసిన ఆయుర్వేద తయారీలు కూడా స్రావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

జీవనశైలి నిర్వహణ

మందులు మరియు మూలికా ఔషధాలతో పాటు, సరైన పరిశుభ్రతను పాటించడం ఉత్తమమైన మార్గం.

  • సింథటిక్ లోదుస్తులను ధరించవద్దు కాటన్ లేదా లినెన్ ప్యాంటీలను ధరించండి. మంట పుట్టించని సబ్బుతో శుభ్రపరుచుకోండి. జననాంగ ప్రాంతాన్ని అతిగా కడగవద్దు, ఎందుకంటే అది pH సమతుల్యాన్ని పాడుచేస్తుంది మరియు బ్యాక్టీరియా యొక్క పెరుగుదలకు కారణమవుతుంది.
  • యోని యొక్క సంక్రమణను నివారించడానికి మల విసర్జన తరువాత ముందు నుండి వెనక దిశగా శుభ్రపరుచుకోండి.
  • వాష్రూమ్ కి వెళ్లిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని శుభ్రపరుచుకోండి.
  • సమతుల్య ఆహారం తీసుకోండి.
  • విష పదార్ధాలను తొలగించడానికి ప్రతిరోజూ 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగండి..
  • వాకింగ్, జాగింగ్, యోగ, ధ్యానం వంటి తేలికైన వ్యాయామాలు చేయండి ఎందుకంటే అధిక వ్యాయామం తెల్లబట్టను పెంచవచ్చు.
  • ఎల్లప్పుడూ ఒక దంపతీ లైంగిక సంబంధాన్ని(ఒక సమయంలో ఒక లైంగిక భాగస్వామి మాత్రమే కలిగి ఉండటం) కొనసాగించండి.
  • ప్రతి లైంగిక చర్య సమయంలో రబ్బరు కండోమ్లను వాడండి.


తెల్లబట్ట (ల్యూకోరియా) వైద్యులు

Dr. Vrinda Khemani Dr. Vrinda Khemani Obstetrics & Gynaecology
6 वर्षों का अनुभव
Dr Megha Apsingekar Dr Megha Apsingekar Obstetrics & Gynaecology
4 वर्षों का अनुभव
Dr. Dyuti Navadia Dr. Dyuti Navadia Obstetrics & Gynaecology
1 वर्षों का अनुभव
Dr. Sheetal Aggarwal Dr. Sheetal Aggarwal Obstetrics & Gynaecology
15 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

తెల్లబట్ట (ల్యూకోరియా) కొరకు మందులు

తెల్లబట్ట (ల్యూకోరియా) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।