myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సారాంశం

స్పెర్మటోరియా అనేది పురుషులలో అనారోగ్య స్ఖలనాన్ని కలిగించే ఒక రుగ్మత, అంటే లైంగిక కార్యకలాపాలు లేకుండా వీర్యం యొక్క ఉత్సర్గం జరుగుట. అసంతులిత భావోద్వేగాలు, మద్యం వినియోగం, స్పెర్మటోరియా యొక్క కొన్ని కారణాలు. కొంతమంది నిద్రలో కలిగే స్ఖలనం నుండి బాధపడుతుంటారు. ఒక పురుషుడిలో తరచూ కలిగే స్పెర్మటోరియా అనేది శరీరం మీద ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. శరీరంలోని స్పెర్మ్­­ల యొక్క అదనపు ఉత్పత్తి కారణంగా స్పెర్మటోరియా అనేది కలుగుతుంది అని నమ్ముతారు, అయితే, ఖచ్చితమైన పరిశోధన ఏదీ అందుబాటులో లేదు. పురుషులు తరచుగా యుక్తవయసులో స్పెర్మటోరియాతో బాధ పడుతుంటారు, ఈ వయసులో హార్మోన్ల స్థాయి పెరుగుట అనేది సెమోన్ యొక్క ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది. స్పెర్మటోరియాలో, అదనపు వీర్యం శరీరం నుండి డిస్చార్జ్ అవుతుంది.

 1. అసంకల్పిత వీర్యస్ఖలనం అంటే ఏమిటి - What is Spermatorrhea in Telugu
 2. అసంకల్పిత వీర్యస్ఖలనం యొక్క లక్షణాలు - Symptoms of Spermatorrhea in Telugu
 3. అసంకల్పిత వీర్యస్ఖలనం యొక్క నివారణ - Prevention of Spermatorrhea in Telugu
 4. అసంకల్పిత వీర్యస్ఖలనం యొక్క చికిత్స - Treatment of Spermatorrhea in Telugu
 5. అసంకల్పిత వీర్యస్ఖలనం కొరకు డాక్టర్లు

అసంకల్పిత వీర్యస్ఖలనం అంటే ఏమిటి - What is Spermatorrhea in Telugu

స్పెర్మటోరియ అనేది ఒక అంగస్తంభన లేదా ఒక ఉద్వేగం (ఏ లైంగిక కార్యకలాపాలు లేకుండా) లేకుండా జరిగే వీర్యం యొక్క ఒక అసంకల్పిత ఉత్సర్గo. ఒక శృంగార కల కారణంగా రాత్రిపూట స్పెర్మటోరియా సంభవిస్తే. స్పెర్మేటోరియాలో, ఉత్సర్గం అనేది ఇతర ఉద్గారాలకు భిన్నంగా ఇది స్పెర్మ్­లను కలిగి ఉంటుంది. స్పెర్మ్­లనే వీర్యo లోని మూలకాలు, ఇవి గర్భధారణకు దారితీసే స్త్రీలలో అండ ఫలదీకరణకు కారణం అవుతాయి.

అసంకల్పిత వీర్యస్ఖలనం యొక్క లక్షణాలు - Symptoms of Spermatorrhea in Telugu

స్పెర్మతోరియాలో సాధారణంగా కనిపించే లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

అసంకల్పిత వీర్యస్ఖలనం యొక్క నివారణ - Prevention of Spermatorrhea in Telugu

స్పెర్మటోరియాను నివారించడానికి స్పష్టమైన మార్గాలు అంటూ ఏమీ లేవు, కానీ మీ స్పెర్మ్ యొక్క పనితీరు మరియు నాణ్యత మెరుగుపరచడానికి మీరు యోగాను అభ్యసించవచ్చు. ఆయుర్వేద వైద్యుడు మరియు ఇంటి నివారణలు సూచించే మూలికా నియమాలు కూడా స్పెర్మటోరియాను నివారించడంలో సహాయపడతాయి. వాటిలో కొన్ని క్రింది విభాగాలలో ప్రస్తావించబడ్డాయి.

అసంకల్పిత వీర్యస్ఖలనం యొక్క చికిత్స - Treatment of Spermatorrhea in Telugu

రాత్రి సమయంలో స్పెర్మటోరియా సంభవిస్తే, చికిత్స అవసరం లేదు. ఇలా జరగుతూ ఉండడం అనేది సాధారణంగా 20 సంవత్సరాల తరువాత తగ్గిపోతుంది. లైంగిక సంపర్కం లేదా హస్త ప్రయోగం తగ్గుతున్నప్పుడు రాత్రిపూట స్ఖలనాలు తరచుగా జరుగవచ్చు. స్పెర్మటోరియాను బట్టి మందులు ఇవ్వబడతాయి. హెర్బల్ నివారణలు స్పెర్మటోరియా చికిత్సకు సహాయపడతాయి.

పైనాపిల్, ప్లమ్, మరియు అల్లం మరియు ఉల్లిపాయలు, మరియు  కందమూలాలు వంటి ఆహారాలు మీరు తినవచ్చు, ఇవి స్పెర్మటోరియోను నిర్వహించుటలో సహాయపడతాయి.

స్పెర్మటోరియా కొరకు హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి:

 • రాత్రిపూట నానబెట్టిన బాదాముతో ఒక గ్లాసుడు పాలు
 • రెండు లేదా మూడు కుంకుపువ్వు రెమ్మలతో ఒక గ్లాసు వెచ్చని పాలు.
 • మూడు లేదా నాలుగు వెల్లుల్లి పలుకులు రోజూ నమలడం.
 • వెచ్చని మేక పాలతో అశ్వగంధ, బాలా, మరియు విదర్ యొక్క మిశ్రమాన్ని మూలికా విధానంలో సేవించాలి (ఆవు పాలు కంటే మేక పాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి, కానీ మేక పాలు అందుబాటులో లేకుంటే, ఆవు పాలు కూడా పనిచేస్తాయి).
 • ప్రతిరోజూ సగం టేబుల్ స్పూన్ ఆస్పరాగస్­­ మరగించిన ఒక కప్పు నీరుతో తీసుకోవాలి.
 • ప్రతిరోజూ ఉదయం పాలతో ఒక టేబుల్ స్పూన్ లాజ్వంతీ పొడి కలిపి తీసుకోవాలి.

జీవనశైలి నిర్వహణ

మీరు స్పెర్మటోరియోని నిర్వహించడంలో సహాయపడే స్వీయ-సంరక్షణ చిట్కాల జాబితా ఈ క్రింద నీయబడినది:

 • ఒక తేలికపాటి విందు తీసుకోవాలి
 • రాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు ఒక గట్టి పరుపు ఉపయోగించటానికి ప్రయత్నించాలి.
 • టైట్­గా ఉంటె లోదుస్తులను ధరించరాదు
 • పుష్కలంగా పోషకాలు కలిగిన ముడి, తాజా కూరగాయలు మరియు పండ్లు మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి.
 • మద్యం వినియోగం పరిమితంగా ఉండాలి.
 • ప్రేరేపకము లేకుండానే వీర్య స్కలనము జరుగుట సాధారణంగా వేకువజామున/ ఉదయపు మొదటి కొన్ని గంటల్లో జరుగుతుంది, కావున అలారం సెట్ చేసి వేకువజామునే మేల్కొవాలి.
 • మీ జననేంద్రియ ప్రాంతం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
 • మలబద్ధకంతో బాధపడుతుంటే డాక్టరుని సంప్రదించాలి.
 • కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను పటిష్టపరచడం ద్వారా మీరు స్పెర్మటోరియా నివారించేలా సహాయపడుతుంది. ఐదు సెకండ్ల పాటు మీ పెల్విక్ ఫ్లోర్ కండరాలు (మీ మూత్రాశయం, ప్రేగు, మరియు మూత్రపు నాళానికి సహాయపడే కండరములు) కుదింపు చేయాలి. అయిదు సెకన్ల వరకు కుదింపు చేసిన తరువాత అయిదు సెకన్ల వరకు విశ్రాంతి తీసుకోవాలి. మీ శ్వాస వేగం సాధారణంగా ఉండాలి ఈ వ్యాయామం 10 సార్లు వరకు చేయండి మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు అసౌకర్యంగా భావిస్తే, కొంత సమయం పాటు ఆపుచేసి మరల ప్రారంభించండి.
 • మసాలా ఆహారాలు తినవద్దు
 • చల్లని నీటిలో స్నానం చెయ్యాలి .
 • నిద్రకు ముందు మీ మూత్రాశయం ఖాళీ చేయాలి
 • మంచానికి వెళ్ళే ముందు నీటిని త్రాగరాదు
 • మంచి పుస్తకాలు చదవడం మరియు సంగీతం వినడం వంటి అలవాట్ల వలన మనసును మళ్ళించి ఏదైనా వ్యాపకంలో ఉండేలా చేయాలి.
Dr. Tarun

Dr. Tarun

सेक्सोलोजी

Dr. Ghanshyam Digrawal

Dr. Ghanshyam Digrawal

सेक्सोलोजी

Dr. Pahun Tiwari

Dr. Pahun Tiwari

सेक्सोलोजी

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...