పైన్ గింజలు లేదా చిల్గోజా గింజలు సతత హరితమైన పైన్ చెట్టు విత్తనాలు. మే-జూన్ నెలల్లో పూలు పూచే పైన్ చెట్టు ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో పైన్ గింజలతో కూడిన శంకువుల ఆకారంలో ఉండే పండిన కాయల్నిస్తుంది. ఈ గింజల్ని సంగ్రహించేందుకు ముందుగా విత్తనాలతో కూడిన పొలుసుల శంకువులను చెట్టు నుండి తెంపుతారు. ఈ శంకువులాంటి కాయల పొలుసుల్ని వేడి చేయడం ద్వారా ఆ పొలుసులు తెరుచుకుని లోపలఉండే పైన్ విత్తనాలు సులభంగా శంకువుల నుండి బయట పడతాయి. గిరి లేదా మగాజి అని కూడా పిలువబడే పైన్ గింజ పప్పు నూనెను కల్గి ఉంటుంది మరియు అవి చాలా సున్నితమైన రుచిని కలిగి ఉంటాయి.

ఈ విత్తనాలు తినదగినవి మరియు చాలా పోషకమైనవి. అన్ని రకాల పైన్ చెట్లు పైన్ కాయలు కాస్తాయి కానీ  చాలా తక్కువ రకాలు మాత్రమే, అంటే 20 రకాల పైన్ జాతులు, మనం తినదగినంత పెద్దవైన పైన్ గింజలుండే పైన్ కాయలు కాస్తాయి.

పండిన పైన్ కాయల్ని చెట్టు నుండి తెంపిన తరువాత, ఈ గింజల్ని శంఖువుల ఆకారంలో ఉండే వాటి కాయల నుండి వేడి చేసే ప్రక్రియ ద్వారా పైన్ గింజల్ని వడుపుకోవాలి. పైన్ కాయను తెంపిన తర్వాత వెంటనే గింజల్ని వడుపుకోవాలి, వాటిని భద్రపరచుకోవాలి, అలా కాకుండా, కాయలోనే అలాగే వదిలేస్తే వాటిలో ఉన్న నూనె కారణంగా అవి చెడిపోయే అవకాశం ఉంది. పైన్ గింజల్ని తాజాగా తినడం లేదా ఫ్రిజ్లో నిల్వ చేయడం తప్పక చేయాలి.

పైన్ గింజలు మంచి రుచికరమైనవిగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో లభిస్తాయి. గ్రేట్ బేసిన్ నుండి వచ్చిన స్థానిక అమెరికన్లు 10,000 కన్నా ఎక్కువ సంవత్సరాల నుండీ ఈ గింజలను పండిస్తున్నారు. పైయోలితిక్ శకంలో ఆసియా మరియు ఐరోపాల్లో పైన్ గింజలు బాగా ప్రాచుర్యం పొందాయి. వాస్తవానికి, వివిధ రకాల రోగాలకు ఈజిప్షియన్ వైద్యులు పిన్ గింజలను సూచించారు. రోమన్ సైనికులు ఈ గింజల రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. క్రీ.పూ. 300 నాటినుండి, అనేకమంది గ్రీకు రచయితలు పైన్ గింజల ప్రాశస్త్యాన్ని గురించి పేర్కొన్నారు. వాటికి వాయుహర గుణం లేక పొట్టలో పుట్టే గాలిని (gas) ను పోగొట్టేది (carminative) మరియు కఫహర (expectorant) లక్షణాలను కలిగి ఉంది. అలాగే, పైన్ గింజలు ఒక ఉద్దీపనకారిగా కూడా పనిచేయగలవు. ఇతర గింజలకు విరుద్ధంగా, చిల్గోజా యొక్క కెర్నలు అన్నింటికీ కొలెస్ట్రాల్ లేవు మరియు మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుల యొక్క గొప్ప వనరులు. లైకోపెనే, టోకోఫెరోల్, గలోకాటచిన్, కారోటెనాయిడ్ మొదలైనవి అనేక రకాల అనామ్లజనకాలు (చిల్గోజా) పైన్ గింజల్లో ఉన్నాయి. ఈ అనామ్లజనకాలు అన్ని వివిధ శరీర అవయవాల యొక్క సరైన పనితీరును చేసేందుకు సహాయపడతాయి. అంతేకాక, పైన్ గింజలను ఒక చర్మపు ఔషధ రూపంలోనూ ఉపయోగించవచ్చు, ఈ గింజలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పూర్ణరూప పైన్ గింజల్ని (Whole pine nuts) చాలామంది తింటారు.. ఒక పరిశోధన ప్రకారం,ఈ గింజల్ని వేయించినప్పుడు వాటిలోని అనామ్లజనకాలు స్థాయి గణనీయంగా పడిపోతుంది. అందువల్ల, వేయించిన పైన్ గింజలు తినడం కంటే, ఈ గింజల్ని పచ్చివిగానే తినడం మంచిదని సూచించడమైంది.

పైన్ గింజల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • శాస్త్రీయ పేరు నామం: పినిస్ జెరార్డియానా (Pinus gerardiana)
  • కుటుంబం: పినాసీఎ
  • సాధారణ పేరు: చిల్గోజా , పైన్ గింజలు
  • సంస్కృత నామం: నికోచక్
  • ఉపయోగించే భాగాలు: పైన్ గింజ అనేది చిల్గోజాలో అత్యంత తినదగిన భాగం.
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం:  పైన్ గింజ (చిల్గోజా) వాయువ్య హిమాలయాలకు చెందినది. ఇది 1800-3350 మీటర్ల ఎత్తులో వాయువ్య భారతదేశం, ఆఫ్గనిస్తాన్, మరియు పాకిస్తాన్ లలో పెరుగుతుంది.
  • తమాషాకరమైన వాస్తవం: హిమాలయాల్లో పెరిగే పైన్ గింజల పేరు నెజీ . ఈ పైన్ చెట్లు 1800 మరియు 3500 మీటర్ల మధ్య ఎత్తులో పెరుగుతాయి. పైన్ గింజలు  అత్యంత ముఖ్యమైన నగదు పంటగా స్థానిక మార్కెట్లో అధిక ధరను కలిగి ఉన్నాయి.
  1. పైన్ గింజల పోషక వాస్తవాలు - Pine nuts nutrition facts in Telugu
  2. పైన్ గింజల ఆరోగ్య ప్రయోజనాలు - Pine nuts health benefits in Telugu
  3. పైన్ గింజల సేవనంవల్ల దుష్ప్రభావాలు - Pine nuts side effects in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

ప్రతి 100 గ్రాముల పైన్ గింజల సేవనం వేర్వేరు విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషక ప్రయోజనాలను మనకందిస్తాయి. పైన్ గింజలు కొవ్వు పదార్థాన్ని అధికంగా కల్గి ఉంటాయి మరియు అవి అధిక కాలరీలను కూడా కలిగి ఉంటాయి. చిల్గోజా లేదా పైన్ గింజలు ప్రోటీన్లకి మంచి మూలం .

ఇది పీచుపదార్థాన్ని (ఫైబర్) కలిగి ఉంటుంది. ఇది విటమిన్ కె మరియు విటమిన్ ఇ వంటి విటమిన్లను సమృద్ధిగా కల్గి ఉంటుంది. ఇది రిబోఫ్లావిన్, థయామిన్, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఇనుము మరియు ఫాస్ఫరస్ (వంటి ఖనిజాల్ని కలిగి ఉంటుంది).

యూ.యస్.డి.ఏ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల ఎండిన పైన్ గింజలు కింది పోషక విలువలను కలిగి ఉంటుంది

పోషకాలు

100 గ్రాములకు 

నీరు

2.28 గ్రా

శక్తి

667 కిలో కేలరీలు

మాంసకృత్తులు (ప్రోటీన్)

13.69 గ్రా

కొవ్వులు (ఫాట్స్)

68.37 గ్రా

కార్బోహైడ్రేట్లు 

13.08 గ్రా

ఫైబర్స్

3.7 గ్రా

చక్కెరలు

3.59 గ్రా

మినరల్స్

100 గ్రాములకు

కాల్షియం

16 mg

ఐరన్

5.53 mg

మెగ్నీషియం

251 mg

ఫాస్ఫరస్ 

575 mg

పొటాషియం

597 mg

సోడియం

2 mg

జింక్

6.45 mg

విటమిన్లు

100 గ్రాములకు

విటమిన్ సి

0.8 mg

విటమిన్ బి1

0.364 mg

విటమిన్ బి2

0.227 mg

విటమిన్ బి3

4.387 mg

విటమిన్ బి6

0.094 mg

విటమిన్ బి9

34 mg

విటమిన్ ఎ

1 μg

విటమిన్ ఇ

9.33 mg

విటమిన్ కె 

53.9 μg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

100 గ్రాములకు

సంతృప్త కొవ్వులు (సాచ్యురేటెడ్)

4.899 గ్రా

మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు

18.764 గ్రా

పాలీఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు

34.071 గ్రా

 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

పైన్ గింజలు గుండె, కళ్ళ ఆరోగ్యానికి మంచిది. పైన్ గింజలు అనామ్లజనకాలుగా మన శరీరంలో అనుకూల ప్రయోజనాల్ని కల్గిస్తాయి. ఇంకా, పైన్ గింజలు శక్తిని పెంచేవి (బూస్టర్ల) గా, ఆకలిని అణచివేసే ఆహారంగా, చక్కెరవ్యాధి రోగులకు మేలు చేసే ఆహారంగా పని చేస్తాయి. ఎముకలకు, కడుపు ఆరోగ్యానికి, ఉదరకుహర రోగాలకు మరియు క్యాన్సర్కు కూడా  పైన్ గింజలు పని చేస్తాయి.

  • పైన్ గింజలలో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి, ఇవన్నీ గుండె ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడతాయని చెప్పబడుతున్నాయి.
  • పైన్ గింజలలో ‘ల్యూటిన్ ’ అనే కెరోటినాయిడ్ అధికంగా ఉంటుంది. ఇది కంటిఆరోగ్యానికి సహాయపడుతుంది. వయసు ఆధారిత మాక్యూలర్ డిజెనెరేషన్ కు వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది.
  • పైన్ గింజలలో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు, ప్రోటీన్లు మరియు ఐరన్ వంటి శక్తిని/బలాన్ని మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి. అంతేకాక వీటిలో మెగ్నీషియం కూడా పుష్కలంగా  ఉంటుంది. ఇవన్నీ శక్తిని ప్రేరేపిస్తాయి.
  • పైన్ గింజలను తినడం వలన బరువు తగ్గుతారు, ఎందుకంటే వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు కొలిసిస్టోకైనిన్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తాయి. ఇది ఒక ఆకలిని తగ్గించే  ఎంజైమ్.
  • పైన్ గింజలు ఇన్సులిన్ సేన్సిటివిటిని తగ్గిస్తాయని తెలుస్తుంది తద్వారా రక్తం నుండి గ్లూకోస్ ఎక్కువగా గ్రహించబడుతుంది ఇది మధుమేహాన్ని తగ్గిస్తుంది. అంతేకాక వీటికి చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.
  • పైన్ గింజలు విటమిన్ కె కు మంచి వనరులు ఇవి ఎముక బలానికి సహాయపడతాయి, ఆస్టియోపొరోసిస్ చికిత్సకు ఉపయోగపడతాయి, అలాగే ఎముక ఫ్రాక్చర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • పైన్ గింజలను క్రమముగా తీసుకోవడం వలన అది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిలో అధికంగా ఫైబర్ ఉంటుంది అది కడుపులోని సహజ మైక్రోఫ్లోరా పెరుగుదలకు ఎంతో సహాయం చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి పైన్ గింజలు - Pine nuts for heart in Telugu

పైన్ గింజలను (చిల్గోజా గింజలు) గుండె ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఈ గింజలు మోనోఅన్సాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం మరియు మాంగనీస్లను పుష్కలంగా కల్గి ఉంటాయి, ఇవన్నీ ఆరోగ్యకరమైన గుండె నిర్వహణకు మద్దతునిస్తాయని చెప్పబడుతున్నాయి. పైన్ గింజల్లో పైనొలెనిక్  ఆమ్లం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను శరీరానికి కావలసిన స్థాయిలో నిర్వహిస్తుంది. ఇవి చెడు కొవ్వుల్ని (low density lipoprotein-LDL) ను తగ్గిస్తాయని నమ్ముతారు. ఈ గుణం కాలేయం యొక్క చెడు కొవ్వుల్ని పెంచడం ద్వారా సాధించబడింది. రక్తంలో చెడుకొవ్వుల (LDL) తక్కువ నిర్వహణ అథెరోస్క్లెరోసిస్, అధిక రక్తపోటు మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కారణమవుతాయి .

కళ్ళకు పైన్ గింజలు - Pine nuts for eyes in Telugu

పైన్ గింజల (లేదా చిల్గోజాలు)లో ‘ల్యూటిన్ ’ అని పిలువబడే కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. వయసు-సంబంధిత మాక్యులర్ (కంటికి సంబంధించినది) క్షీణత (AMD (Age-related macular degeneration) కు వ్యతిరేకంగా పోరాడటానికి లుటెయిన్ సహాయపడుతుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రెటినా మధ్యలో రెండు మిల్లీమీటర్ల వెడల్పులో కంటి వెనుక భాగంలో మాకులా అనేది ఉంటుంది. కాలంతోబాటు,  మాక్యులా మరియు రెటీనా వ్యాధికి గురై, దెబ్బతినవచ్చు. అయినప్పటికీ, లూటీన్ అనేది సహజ కంటి వర్ణద్రవ్యం, కాబట్టి ఇది మాక్యులర్ ప్రాంతాన్ని కాపాడుతుంది. మకులాలోని ఈ వర్ణద్రవ్యం ఒక నీలం-కాంతి ఫిల్టర్ వలె పనిచేస్తుంది మరియు కాంతి ద్వారా ఆక్సీకరణ నుండి కంటిని కాపాడుతుంది. కంటి ఆరోగ్యానికి లుటైన్లో అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

(మరింతసమాచారం: మాక్యులర్ డిజెనరేషన్  నివారణ )

యాంటీయాక్సిడెంట్స్ గా పైన్ గింజలు - Pine nuts as antioxidants in Telugu

పైన్ గింజలు అనామ్లజనకాలకు నిలయం. వీటిలో ఎ, బి, సి, డి, ఇ విటమిన్లు మరియు ల్యూటిన్ (lutein) ఉన్నాయి. అనామ్లజనకాలు (యాంటీఆక్సిడెంట్స్) వయసు-సంబంధిత క్షీణతకు మూల కారణమైనస్వేచ్ఛా రాశులతో పోరాడుతాయి. అందువలన, పైన్ గింజలు మన ఆరోగ్యానికి కీలకమైనవి మరియు మన వయస్సు పెరుగుదల రేటును ఇవి నియంత్రిస్థాయని నమ్ముతారు.

మన శరీరాలు అనామ్లజని లక్షణాలు కలిగిన అనేక పోషకాలను పంపిణీ చేస్తాయి మరియు ప్రతిక్షకారిని ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి. అయితే, పైన్ గింజలసేవనం వయసు పెరిగిన ప్రభావాన్ని కనబడనీయదు. నిరంతరంగా, ఓ క్రమపద్ధతిలో పైన్ గింజల్ని తినడంవల్ల అనామ్లజనకాలకు దోహదపడి, చర్మంపై ఏర్పడే ముడుతలు ఆలస్యంగా ఏర్పడేట్టుగా చేస్తుంది, దానివల్ల మీరు దీర్ఘకాలంపాటు యవ్వనంతో వుండేట్లుగా కనబడటానికి పైన్ గింజలసేవనం సహాయపడుతుంది.

(మరింత సమాచారం: యాంటీఆక్సిడెంట్ ఆహార వనరులు)

శక్తిని అందించే బూస్టర్ల వంటివి పైన్ గింజలు - Pine nuts as energy boosters in Telugu

పైన్ గింజలు ఏకఅసంతృప్తకొవ్వులు (monounsaturated fats), ప్రోటీన్లు మరియు ఇనుము వంటివి ఇతర పోషకాలలో పాటు కలిసి ఉంటాయి, ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం, మెగ్నీషియం (మగ్నము) దీర్ఘకాలిక బలహీన జబ్బుతో (క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్తో) బాధపడుతున్న రోగులకు సహాయపడుతుంది. పైన్ గింజలు మంచి మెగ్నీషియం మూలంగా ఉన్నాయని, అందుకే అవి శక్తిని పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజూ సగం కప్పు పైన్ గింజలను తినడంవల్ల సిఫార్సు చేయబడిన రోజువారీ మెగ్నీషియం మొత్తంలో సగాన్ని అందిస్తుంది, ఇది ఒక భారీ ప్రయోజనమే.

పైన్ గింజలు ఆకలిని అణచివేస్తాయి - Pine nuts suppress appetite in Telugu

బరువు కోల్పోవడం కోసం ప్రయత్నిస్తున్నవారికి పైన్ గింజలు తినడంవల్ల వారి కోరిక సిద్ధించడంలో సహాయపడతాయని నమ్ముతారు. పైన్ గింజలు నుండి ఉత్పన్నమైన కొవ్వు ఆమ్లాలు కోలిసిస్టోకినిన్ (సి.సి.కె.) ను అధిక మొత్తంలో విడుదల చేస్తాయి, ఇది ఆకలి-అణిచివేసే హార్మోన్.

అల్పాహారం తీసుకోవడానికి ముందు మూడు గ్రాముల పినోలెనిక్ యాసిడ్ (పైన్ గింజలలో ఉండే కొవ్వు ఆమ్లం) ను ఉపయోగించిన స్త్రీలకు పేగుల్లోని ఆహార శోషణ తగ్గుతుందని మరో పరిశోధన పేర్కొంది. అంతేకాక, వారు తినే ఆహారం కూడా 37 శాతం తగ్గినట్లు పరిశోధన తెలిపింది.

(మరింతసమాచారం: బరువు తగ్గుదల ఆహారవిధాన పట్టిక )

చక్కెరవ్యాధికి పైన్ గింజలు - Pine nuts for diabetes in Telugu

పైన్ గింజలు ఆరోగ్యకరమైనవి మరియు సువాసనాభరితమైనవే కాకుండా చక్కెరవ్యాధిని (మధుమేహం) నియంత్రించడంలోనూ సహాయపడుతాయి. ఈ గింజలు రక్తంలో గ్లూకోజ్ను పెంచేందుకు మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని(సెన్సిటివిటీని) పెంచడానికి సహాయపడతాయి. అదనంగా, ఇవి తక్కువ గ్లూకోజ్ సూచిక (గ్లైసెమిక్ ఇండెక్స్)ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది, అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.

ఒక వైద్య అధ్యయనంలో, 117 మంది చక్కెరవ్యాధి (మధుమేహం) కల్గిన వయోజనులకు మూడు నెలల పాటు వారి భోజనంలో భాగంగా పైన్ గింజల్ని కూడా వడ్డించారు. వారంతా కూడా నోటిద్వారా హైపోగ్లైసెమిక్ మందులను సేవించేటట్టు చూడబడింది. మరియు వారిలో ఎవరూ కూడా ఇన్సులిన్ మందులు తీసుకోలేదు. ఈ అధ్యయనం గురించిన వ్యాసం డయాబెటాలజీలో ప్రచురించబడింది. ఆ వ్యాసం ప్రకారం, 2వ రకం చక్కెరవ్యాధి (డయాబెటిస్) తో ఉన్న వ్యక్తుల రక్త-గ్లూకోజ్ (గ్లైసెమిక్) ల నియంత్రణకు కార్బోహైడ్రేట్లకు బదులు భోజనంలో గింజల్ని ఇవ్వడం జరగ్గా రక్త-గ్లూకోజ్ ల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది.

అందువల్ల, మీ భోజనంలో కొంత భాగాన్ని పైన్ గింజలతో ప్రత్యామ్నాయం (substitute) చేయటం వలన మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

ఎముకల కోసం పైన్ గింజలు - Pine nuts for bones in Telugu

పైన్ గింజలు విటమిన్ K కి మంచి మూలం, ఇది ఎముకలు నిర్మించడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ విటమిన్ బోలు ఎముకల వ్యాధి నివారణ మరియు చికిత్సలో సహాయపడుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి . ఇది ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుంది, కానీ అది ఎముక ఫ్రాక్చర్లు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది .

కాబట్టి, బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను పొందడానికి, ఆనందంగా జీవించేందుకు ఓ పిడికెడు పైన్ గింజల్ని తిని ఆనందించండి.

కడుపు ఆరోగ్యానికి పైన్ గింజలు - Pine nuts for stomach in Telugu

పైన్ గింజల్నినిరంతరం సేవించడంవల్ల మీ పేగులు ఆరోగ్యంగా ఉంటాయి, ఆరోగ్యకరమైన పేగులు కల్గి ఉంటే జీవితం మెరుగైన నాణ్యతతో సాగుతూ ఉంటుంది. పైన్ గింజల్లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచుపదార్థం (ఫైబర్) కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. పీచుపదార్థాన్ని (ఫైబర్) మన శరీరం జీర్ణం చేసుకోలేక పోయినా, పెద్దప్రేగులో సహజ మైక్రోఫ్లోరా వృద్ధికి ఇది ముఖ్యమైనది. అంతేకాదు, దానిలో ఉన్న పీచుపదార్థం మనకు కడుపు నిండిన అనుభూతిని చాలా పాటు పొందేందుకు సహాయపడుతుంది, అందువల్ల మనం అతిగా తినవలసిన అవసరం ఉండదు.

సీలియాక్ రోగులకు పైన్ గింజలు - Pine nuts for celiac patients in Telugu

పైన్ గింజ గ్లూటెన్-ఫ్రీ ఆహారాల్లో ఒకటి, అంటే జిగటపదార్ధం లేని ఆహారం ఇది. అందువల్ల, పైన్ గింజల్ని గ్లూటెన్-ఫ్రీ వంటకాలలో వాడే గొప్ప పదార్థాలుగా భావిస్తారు.

ఉదరకుహర వ్యాధికి (సిలియాక్ వ్యాధి) గురవుతూ, గోధుమలకు అసహనాన్ని (అలెర్జీ) ఎదుర్కొనేవాళ్ళు పైన్ గింజ వంటి ఫార్ములా వంటకాలను గొప్ప ప్రత్యామ్నాయాలుగా భావిస్తారు.

క్యాన్సర్ కోసం పైన్ గింజలు - Pine nuts for cancer in Telugu

క్యాన్సర్ ను నివారించడంలో ఓ పిడికెడు చిల్గోజా లేదా పైన్ గింజలు మనకు సహాయపడతాయి. న్యూట్రిషన్ రివ్యూస్లో ప్రచురించిన ఓ క్రమబద్ధ సమీక్ష మరియు మెటా-విశ్లేషణ ప్రకారం, పరిశోధకులు వ్యక్తుల రెండు గుంపుల్ని పోల్చారు; ఒక గుంపేమో వారానికి ఒకసారి మాత్రం పైన్ గింజలను తింటారు మరో గుంపు వారానికి 4-5 సార్లు తింటారు. వారంలో పైన్ గింజల్ని ఎక్కువసార్లు సేవించిన వ్యక్తుల్లో క్యాన్సర్ రావడానికి  15% తక్కువ ప్రమాదం ఉందని ఆ అధ్యయనకారులు కనుగొన్నారు, ముఖ్యంగా ప్యాంక్రియాటిక్, ఎండోమెట్రియల్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్లకు సంబంధించి ఈ పరిశోధన సాగింది.

పోషకాలకు నిలయమైన పైన్ గింజల (చిల్గోజా గింజలు) సేవనాన్ని ఎంచుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ, పైన్ గింజల్ని మితం మించి తింటే మరీ ఏమంత తీవ్రమైనవి కాని కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.

  • పైన్ గింజ సిండ్రోమ్ లేదా ‘పైన్ నోటి రుగ్మత'కు కారణం కావచ్చు 
    పైన్ గింజల్ని సాధారణంగానే నిరంతరం తినడంవల్ల మన రుచి రసాంకురాల (taste buds) గ్రహణవిధానంలో మార్పు రావచ్చు. పైన్ గింజల్ని తిన్న 12 నుండి 48 గంటల తర్వాత కొందరికి లోహారుచి (మెటాలిక్) మరియు చేదు రుచిని కల్గించినట్లు నివేదించారు. ఈ పరిస్థితినే ‘పైన్ గింజ సిండ్రోమ్’ లేదా ‘పైన్ మౌత్’ అని పిలుస్తారు. ఇది ఒక వారంపాటు ఉంటుందని చెప్పబడింది.
  • పైన్ గింజ అలెర్జీ
    గింజలు తింటే అలెర్జీకి గురయ్యే వ్యక్తుల సమూహాలు ఉండవచ్చు. పైన్ అలెర్జీ అనేది దద్దుర్లు మరియు దురద వంటి లక్షణాలను కలిగిస్తుంది . ఇది అజీర్ణం, ఉబ్బరం, శ్వాసలో కష్టపడటం , వాంతులు మరియు అతిసారాన్నికూడా కలిగించొచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

పైన్ గింజలు లేదా చిల్గోజాలని ఓ రుచికరమైన అల్పాహారంగా, కూరగాయల వంటకం లేదా పులుసు (సాస్) గా కూడా వండుకుని తినే పధ్ధతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.

పైన్ గింజల్ని మితం మించకుండా సేవిస్తే అవి నిజంగా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తాయి. పైన్ గింజల్ని ముడిగానే తినొచ్చు లేదా కాల్చినవి తినవచ్చు. ఓ గ్లాసెడు పైన్ గింజల్ని తింటే చాలు, పోషకాలు దండిగా ఉండే ఇవి, ఆకలిని దూరంగా ఉంచి కటిప్రదేశం చుట్టుకొలత పెరుగుదలని నిరోధిస్తుంది.


Medicines / Products that contain Pine nuts (Chilgoza)

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Classification for Kingdom Plantae Down to Species Daucus carota L.. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 12147, Nuts, pine nuts, dried. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  3. Rune Blomhoff et al. Health benefits of nuts: Potential role of antioxidants. British Journal Of Nutrition 96 Suppl 2(S2):S52-60 · December 2006
  4. Bradley W Bolling et al. The phytochemical composition and antioxidant actions of tree nuts . Asia Pac J Clin Nutr 2010;19 (1):117-123
  5. Keyvan Koushan et al. The Role of Lutein in Eye-Related Disease . Nutrients. 2013 May; 5(5): 1823–1839. PMID: 23698168
  6. Chen F et al. Carotenoid intake and risk of non-Hodgkin lymphoma: a systematic review and dose-response meta-analysis of observational studies. Ann Hematol. 2017 Jun;96(6):957-965. PMID: 28011986
  7. Lang Wu et al. Nut consumption and risk of cancer and type 2 diabetes: a systematic review and meta-analysis. Nutr Rev. 2015 Jul; 73(7): 409–425.
  8. Domenico Fusco et al. Effects of antioxidant supplementation on the aging process . Clin Interv Aging. 2007 Sep; 2(3): 377–387. PMID: 18044188
  9. American Nutrition Association. Magnesium and Chronic Fatigue Syndrome. [Internet]
  10. Emilio Ros. Health Benefits of Nut Consumption . Nutrients. 2010 Jul; 2(7): 652–682. PMID: 22254047
  11. Wilrike J Pasman et al. The effect of Korean pine nut oil on in vitro CCK release, on appetite sensations and on gut hormones in post-menopausal overweight women . Lipids Health Dis. 2008; 7: 10. PMID: 18355411
  12. Effie Viguiliouk et al. Effect of Tree Nuts on Glycemic Control in Diabetes: A Systematic Review and Meta-Analysis of Randomized Controlled Dietary Trials . PLOS ONE, July 30, 2014
  13. Pearson DA. Bone health and osteoporosis: the role of vitamin K and potential antagonism by anticoagulants. Nutr Clin Pract. 2007 Oct;22(5):517-44. PMID: 17906277
  14. Britt Burton-Freeman. Dietary Fiber and Energy Regulation . The Journal of Nutrition, Volume 130, Issue 2, February 2000, Pages 272S–275S
  15. Jéssica Pinto Polet et al. Physico-chemical and sensory characteristics of gluten-free breads made with pine nuts (Araucaria angustifolia) associated to other flours . Journal of Culinary Science & Technology, 11 Dec 2017
  16. Davide S. Risso et al. A potential trigger for pine mouth: a case of a homozygous PTC taster . Nutr Res. 2015 Dec; 35(12): 1122–1125. PMID: 26463018
Read on app