వాటి ప్రత్యేకమైన రుచి మరియు సరళమైన రంగు వలన పిస్తాపప్పులు బాగా ప్రసిద్ధి చెందాయి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. జీడిపప్పు కుటుంబానికి చెందిన ఒక మొక్కగా, పిస్తాపప్పు మొక్క మధ్య ఆసియా మరియు తూర్పుమధ్య ప్రాంతాలలో పుట్టింది. తూర్పుమధ్య ప్రాంతాలలో వేలాది సంవత్సరాల నుండి పిస్తా మొక్కలు పెరుగుతున్నాయని నమ్ముతారు. పిస్తాపప్పులు బైబిల్ యొక్క పాత నిబంధనలో కూడా ప్రస్తావించబడ్డాయి, వాటి యొక్క గొప్ప చరిత్ర మరియు వాటిని విలువైన ఆహార వనరుగా దానిలో సూచించబడింది.
పురావస్తు శాస్త్రం, 6750 BC నాటికే పిస్తా విత్తనాలు సాధారణ ఆహారంగా ఉన్నాయని తెలుపింది. ఇవి ఇటలీ మరియు హిస్పానియాలోకి ప్రవేశించబడే వరకు సిరియాకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. పురాతత్వవేత్తలు (Archaeologists) ఈశాన్య ఇరాక్లోని త్రవ్వకాల ద్వారా,అవి అట్లాంటిక్ పిస్తా వినియోగాన్ని సూచిస్తున్నట్లు కనుగొన్నారు. ఆధునిక పిస్తా మొట్టమొదటిసారిగా మధ్యఆసియాలో కాంస్య యుగం (Bronze Age)లో సాగు చేయబడింది, దీనిలో ఆధునిక ఉజ్బెకిస్థాన్ నుండి మొదటి ఉదాహరణ వచ్చింది. ప్రస్తుతం, పిస్తాపప్పు ఆంగ్ల భాష మాట్లాడే దేశాలైన ఆస్ట్రేలియా, న్యూ మెక్సికో మరియు కాలిఫోర్నియాలలో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు 1854 లో ప్రవేశపెట్టబడిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ లో కూడా సాగు చేస్తున్నారు. 2014 లో, ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్, పిస్తా పప్పు యొక్క ప్రధాన ఉత్పత్తిదారులుగా, రెండు దేశాలు కలిసి మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 76% వాటాని ఉత్పత్తి చేసాయి.
రుచికరమైన చిరుతిండిగా మాత్రమే కాక, ఈ పిస్తాపప్పు పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన ప్రోటీన్లకు ఒక ముఖ్యమైన వనరు. ఇది గుండె మరియు మెదడు యొక్క ఆరోగ్యానికి అద్భుతముగా పనిచేస్తుంది మరియు పిస్తాపప్పులలో ఉన్న డైటరీ ఫైబర్ బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఒక చిరుతిండిగా, తాజాగా లేదా వేయించి లేదా ఉప్పు చల్లి, సలాడ్ పైన వేసుకుని, డ్రై ఫ్రూట్స్ తో కలిపి, కేకులు లేదా చేప లేదా మాంసం వంటి వాటితో కలిపి పిస్తాపప్పులను తినవచ్చు. వీటితో పాటు పిస్తాపప్పులను పిస్తాపప్పు ఐస్క్రీం, కుల్ఫి, పిస్తా బటర్, హల్వా మరియు చాక్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
పిస్తాపప్పుల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: పిస్తాసియా వేరా (Pistacia vera)
- కుటుంబ నామం: జీడిపప్పు కుటుంబం (అనకార్డియేసియే [Anacardiaceae]).
- సాధారణ నామం: పిస్తా, పిస్తా పప్పు
- ఉపయోగించే భాగాలు: వాస్తవానికి మనం పిస్తా పండు యొక్క విత్తనాలను తింటాం మరియు ఉపయోగిస్తాం.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఇరాన్, టర్కీ, చైనా, యునైటెడ్ స్టేట్స్, ఆఫ్ఘనిస్తాన్, మరియు సిరియా
- ఆసక్తికరమైన వాస్తవం: బాబిలోన్ యొక్క హంగింగ్ గార్డెన్స్ 700 BC కాలంలో పిస్తాపప్పు చెట్లను కలిగి ఉన్నట్లు చెప్పబడింది.