జుట్టు సన్నబడటం వంటి సమస్యలు చిన్నవిగా అనిపించినా ఈ సమస్యలు పురుషులు మరియు మహిళలు ఇద్దరినీ బాధపెడుతున్నాయి. అనారోగ్యకరమైన జుట్టు ఎల్లప్పుడూ రూపాన్ని దెబ్బ తీయదు. ఆరోగ్యకరమైన జుట్టు మంచి ఆరోగ్యానికి మరియు మంచి జుట్టు సంరక్షణ అలవాట్లకు సంకేతం. ఒక వ్యక్తికి జుట్టు రాలడం, చుండ్రు లేకుండా పొడవాటి జుట్టు ఉన్నప్పటికీ, వారిని బాధపెట్టేది జుట్టు పరిమాణం లేదా జుట్టు మందం గురించిన చింత.

మీ జుట్టు సన్నగా ఉండటానికి వివిధ కారణాలు ఉన్నాయి. మీ జుట్టు నాణ్యతను నిర్ణయించడంలో ప్రాథమిక పాత్ర పోషిస్తున్న జన్యుశాస్త్రం సాధ్యమయ్యే కారకాల్లో ఒకటి. రాగి మరియు మాంగనీస్ లోపం, విటమిన్ డి లోపం, హైపోథైరాయిడిజం, ఒత్తిడి, హార్మోన్లు, కాలుష్యం, వృద్ధాప్యం, షాంపూలు, ఆహారం, నీరు తీసుకోవడం మరియు మొత్తం ఎంతమాత్రం నిద్రపోతున్నారు వంటి ఇతర అంశాలు.

మీకు సన్నని జుట్టు ఉంటే, మందపాటి జుట్టు పొందడానికి మీరు ఖరీదైన చికిత్సలు మరియు ఉత్పత్తులకు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. పొడవాటి మరియు ఒత్తైన జుట్టు పొందడానికి మీకు సహాయపడే అనేక సహజ నివారణలు ఉన్నాయి, వాటి గురించి ఈ వ్యాసం అన్వేషిస్తుంది.

 1. ఒత్తైన జుట్టు పొందడానికి గృహ చిట్కాలు - Home remedies to get thicker hair in Telugu
 2. ఒత్తైన జుట్టును పెంచేదెలా - How to grow thicker hair in Telugu
 3. ఉపసంహారం - Takeaway to get long and thick hair

జుట్టు చికిత్స కోసం పురుషులు మరియు మహిళలు వేలాది (రూపాయలు) ఖర్చు చేస్తారు. కానీ, పొడవుగా, మెరిసేటువంటి మరియు మందంగా ఉండే జుట్టును పొందటానికి సాధారణ గృహ చిట్కాలు మనకు తెలిస్తే ఎంత బాగుంటుంది కదూ? ఈ గృహ చిట్కాలవల్ల డబ్బును ఆదా చేయడమే కాకుండా, వివిధ రసాయన చికిత్సల నుండి మన జుట్టు దెబ్బతినకుండా కాపాడుకున్నట్లవుతుంది.

ఒత్తైన జుట్టు పొందడానికి ఆలివ్ ఆయిల్ - Olive oil to get thick hair in Telugu

ఆలివ్ నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి, ఇవి జుట్టులోకి చొచ్చుకుపోయి తగినంత తేమను అందిస్తాయి మరియు జుట్టు నష్టాన్ని తగ్గిస్తాయి.

ఆలివ్ నూనెను ఎలా ఉపయోగించాలి

ఆలివ్ నూనెను మీ జుట్టుకు కొన్ని నిమిషాలు లోతుగా మసాజ్ చేయండి. మీకు పొడిబారిన నెత్తి ఉంటే మీ నెత్తిపై ఆలివ్ నూనెతో మసాజ్ చేయవచ్చు. అత్యంత ప్రభావవంతమైన కండిషనింగ్ కోసం, మీ జుట్టును షవర్ క్యాప్‌లో చుట్టి, నూనెను 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు జుట్టుపై ఉండేలా నానబెట్టండి.

ఒత్తైన జుట్టు పొందడానికి కొబ్బరి నూనె - Coconut oil to get thicker hair in Telugu

కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ నెత్తికి మరియు జుట్టుకు పోషణను అందిస్తాయి. అంతేకాక, జుట్టు కుదుళ్ళు మరియు నెత్తి చర్మం పైపొర లోపలికి కొబ్బరి నూనెకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఉండడంవల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.

కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి

మీ జుట్టును వెచ్చని కొబ్బరి నూనెను తీసుకుని వేలి కొనలని ఉపయోగించి తేలికగా మసాజ్ చేసి రాత్రిపూట అలాగే వదిలివేయండి. ఉదయం తేలికపాటి షాంపూతో కడగాలి.

ఒత్తైన జుట్టుకు ఆముదం - Castor oil for thick hair in Telugu

ఆముదంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, రిసినోలిక్ ఆమ్లం మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి, వీటితో పాటు అనేక ఇతర ఖనిజాలు మరియు ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇంకా, ఆముదం (కాస్టర్ ఆయిల్) బూజు, సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పని చేసే (యాంటీ-ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్) లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి జుట్టు పెరుగుదలను దెబ్బతీసే చర్మం-సంబంధ  అంటువ్యాధులతో (ఇన్ఫెక్షన్లతో) పోరాడటానికి సహాయపడుతుంది. ఈ నూనె (ఆముదం) జుట్టు ఒత్తుగా మరియు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

 ఆముదాన్ని ఎలా ఉపయోగించాలి

కొబ్బరి నూనె లేదా ఆవనూనె వంటి (క్యారియర్ నూనె లేదా పలుచని నూనెతో) కలిపిన కొన్ని టేబుల్ స్పూన్ల ఆముదాన్ని తీసుకొని మీ నెత్తికి మెత్తగా (మసాజ్) రుద్దండి. 2-6 గంటల తర్వాత జుట్టును కడగాలి.

అయినప్పటికీ, మీరు మీ జుట్టు మీద ఆముదాన్ని నేరుగా ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది మరియు దువ్వెనతో దువ్వేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది.

ఒత్తైన జుట్టుకు ఉసిరి (ఆమ్లా), శీకాయ మరియు కుంకుళ్ళు - Amla, shikakai and reetha for thick hair in Telugu

సంవత్సరాల తరబడి ఈ ఉసిరి (ఆమ్లా), శీకాయ మరియు కుంకుడుకాయ (రీతా) మిశ్రమాన్ని జుట్టు పెరుగుదల మరియు ఒత్తైన జుట్టు కోసం ఉపయోగించబడుతోంది. ఆమ్లా (ఆమ్లా) లేదా ఇండియన్ గూస్బెర్రీలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి దెబ్బతిన్న జుట్టు కణాలను సరిచేయడానికి సహాయపడతాయి. కుంకుడుకాయలు (రీతా) ఇనుము యొక్క గొప్ప మూలం, శీకాయ (షికాకై) విటమిన్ సి యొక్క గొప్ప మూలం మరియు మీ జుట్టు యొక్క పిహెచ్ విలువను తగ్గిస్తుంది మరియు సహజ నూనెలను కలిగి ఉంటుంది. ఈ ఉసిరి, శీకాయి, కుంకుడుకాయ మిశ్రమం జుట్టు రాలడం మరియు జుట్టు సన్నబడటమనే సమస్యల్ని నిర్మూలించేందుకు  సహాయపడుతుంది.

మందపాటి జుట్టుకు ఉసిరి, శీకాయి మరియు కుంకుళ్లను ఎలా ఉపయోగించాలి

మీరు ఉసిరి, శీకాయి, కుంకుడు కాయల్ని కలిపి రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయమే నానబెట్టిన ఆ  మిశ్రమం నుండి నీటిని వడకట్టుకోవాలి. షాంపూ లేకుండా మీ జుట్టును కడగడానికి ఉదయం ఈ వడగట్టిన మిశ్రమం నీటిని వాడండి.

ఒత్తైన జుట్టు కోసం మెంతి గింజలు - Methi dana or fenugreek seeds for hair thickness in Telugu

మెంతి గింజలు లేదా మెథి దానాను సంప్రదాయకంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. మునుపటి అధ్యయనం మెంతి గింజలతో చికిత్స జుట్టు రాలడం, నెమ్మదిగా పెరుగుతున్న జుట్టు లేదా జుట్టు సన్నబడటం వంటి జుట్టు  రుగ్మతలకు సహాయపడుతుందని నిర్ధారించింది. జుట్టు సన్నబడే సమస్యకు మెథి దానా లేదా మెంతులు నిజంగా బాగా సహాయపడతాయని ఫలితాలు సూచించాయి. అలాగే, మెంతిలో ఉండే ప్రోటీన్లు మరియు నికోటినిక్ ఆమ్లం జుట్టు సన్నబడే సమస్యను పరిహరించడంలో సహాయపడుతుంది.

ఒత్తైన జుట్టుకు మెంతి గింజలను ఎలా ఉపయోగించాలి

నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి (రుబ్బి) , రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను మిశ్రమానికి జోడించండి. మీ జుట్టుకు ఈ మెంతి గింజల పేస్ట్‌ను ప్రతి వారం 30 నిమిషాలుపాటు పట్టించడం వల్ల జుట్టు మందంగా, ఒత్తుగా మరియు బలంగా ఉండటమే కాకుండా జుట్టులో చుండ్రు ఉంటే దాన్ని తగ్గించడానికి లేదా నిర్మూలించడానికి కూడా సహాయపడుతుంది.

ఒత్తైన జుట్టు పొందడానికి గుడ్డు సొనతో పూత - Egg mask to get thicker hair in Telugu

గుడ్లు జుట్టుకు ప్రోటీన్లు, ఫోలేట్లు మరియు విటమిన్ డి లను అందిస్తాయి. గుడ్లలో సల్ఫర్, ఐరన్, జింక్, సెలీనియం, ఫాస్పరస్ మరియు అయోడిన్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి, ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కోడి గుడ్డులో జుట్టు పెరుగుదల కారకం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఒత్తైన జుట్టుకు గుడ్లను ఎలా ఉపయోగించాలి

ఒకటి లేదా రెండు గుడ్లు కొట్టి తడి జుట్టు మీద రాయండి. గోరువెచ్చని నీరు మరియు షాంపూతో కడగడానికి ముందు జుట్టుకు రాసిన గుడ్డును ఓ ముప్పై నిమిషాలపాటు అలాగే  ఉండనివ్వండి. ఉత్తమ ప్రభావం కోసం వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి.

ఒత్తైన జుట్టును పొందడానికి కలబంద గుజ్జు - Aloe vera gel to get thicker hair in Telugu

జుట్టు పరిమాణాన్ని పెంచడానికి కలబంద ఉత్తమ మరియు సహజమైన మార్గాలలో ఒకటి. సరిగ్గా ఉపయోగించినప్పుడు, ఒత్తైన మరియు మెరిసే జుట్టు పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. కలబంద మీ నెత్తికి అవసరమైన పోషకాలు మరియు తేమను అందిస్తుంది.

కలబందను ఎలా ఉపయోగించాలి

కలబందను మీ నెత్తికి అంటుకుని ఒక గంటపాటు ఆరనివ్వండి, తరువాత షాంపూ చేసి స్నానం చేశాక గమనించండి మీ జుట్టు మందంగా, ఒత్తుగా మరియు మెరుపును సంతరించుకుని ఉంటుంది. కలబందను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు పరిమాణాన్ని సహజంగా పెంచుతుంది. స్వచ్ఛమైన కలబంద జెల్ ను రాత్రిపూట జుట్టుకు పూయండి మరియు ఉదయం నీటితో కడిగేయండి.

ఒత్తైన జుట్టు పొందడానికి ఉల్లిపాయ రసం - Onion juice to get thick hair in Telugu

పెరుగు మరియు కొబ్బరి నూనెతో కలిపి ఫిల్టర్ చేసిన ఉల్లిపాయ రసం కలిపి జుట్టుకు వాడటం వల్ల కేవలం కొన్ని వారాల్లోనే ఒత్తైన భారీ జుట్టు లభిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడటం వల్ల ఈ చౌకైన సహజ నివారణ బాగా పనిచేస్తుంది, ఇది జుట్టు పరిమాణాన్ని పెంచుతుంది.

మందపాటి జుట్టుకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి

మీరు ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనె మరియు పెరుగుతో కలిపి మిశ్రమంగా కలపవచ్చు, మీ జుట్టు చివరలను తడిపే వరకు మరియు వెంట్రుకల కుదుళ్ళ మూలాల్లోకి చొచ్చుకుపోయే వరకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించండి. మంచి జుట్టు సాంద్రత కోసం వారానికి రెండుసార్లు దీన్ని పునరావృతం చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని బాగా రుబ్బి దాని రసాన్ని తీసుకోవచ్చు. మీ నెత్తికి, జుట్టుకు రసం వేసి రెండు మూడు గంటల తర్వాత కడిగేయండి.

ఒత్తైన జుట్టు కోసం అవిసె గింజలు - Flaxseeds for thick hair in Telugu

అవిసె గింజల్లో కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్లు ఉంటాయి, ఇవి రెండూ జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరగడానికి అవసరం. తాజా అధ్యయనం ప్రకారం, అవిసె గింజల నుండి వచ్చే కొవ్వు ఆమ్లాలు రుతువిరతికి చేరే మహిళలకు ఒత్తైన జుట్టునిచ్చి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి

ఓ కప్పులో మూడింటా ఒక భాగం (1/3 కప్పు) అవిసె గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. తరువాత మరుసటి రోజు ఉదయం లేచి అవిసె గింజలను నీటిలో ఉడకబెట్టండి. ఇది నురగలతో కూడిన జెల్లీ చిక్కదనాన్ని పొందిన తరువాత, దానిని చల్లబరచండి. ఎగిరిపడే ఒత్తైన జుట్టు పొందడానికి దీన్ని మీ జుట్టుకు రాయండి.

ఆరోగ్యాంగా, బలంగా ఉండడానికి మనం మంచి ఆహారం తినాలి. ‘You are what you eat’ వంటి ఆంగ్ల సామెతలు దీన్నే సూచిస్తాయి. ఈ సూత్రం మీ జుట్టుకు కూడా వర్తిస్తుంది. మీరు ఆరోగ్యంగా తింటే, మీ జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం, జుట్టు దాని పోషకాలను రక్తం నుండి తీసుకుంటుంది. పోషక లోపం జుట్టు కూర్పు మరియు పెరుగుదల రెండింటినీ దెబ్బ తీస్తుంది. ప్రత్యేకమైన పోషక లోపాలున్నవారు పొడి, జిగట మరియు నీరసమైన జుట్టును కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది మరియు జుట్టు రాలడమనే సమస్యను కూడా ఎదుర్కొంటారు.

కాబట్టి, ఉత్తమ జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్, ఖనిజాలు మరియు విటమిన్లు అధికంగా ఉన్న ఆహారం తినండి. దీని కోసం, ప్రతిరోజూ తాజా పండ్లు మరియు రసాలను తీసుకోవడాన్ని పెంచండి మరియు మీ భోజనంలో పాలు, ఎండిన పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కొవ్వు చేపలు, గుడ్లు మరియు చికెన్ ఉండేట్లు చూసుకోండి. బి-కాంప్లెక్స్ మరియు ముఖ్యంగా, బయోటిన్, ఆరోగ్యకరమైన జుట్టుకు గణనీయంగా ముఖ్యమైనవి. బయోటిన్ యొక్క ఆరోగ్యకరమైన ఆహార వనరులు ఏవంటే గుడ్లు, కాలేయం మరియు సోయా.

అలాగే, కొన్ని గింజలు సెలీనియం యొక్క అధిక మూలం, ఇది ఆరోగ్యకరమైన తలచర్మం లేదా నెత్తికి అవసరం.

ఒత్తైన జుట్టుకు వేడి చికిత్సను మానుకోండి - Avoid heat treatment for thicker hair in Telugu

మీ జుట్టు సన్నబడకుండా ఉండటానికి హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్నెర్స్ మరియు కర్లర్స్ వంటి వేడిని పుట్టించే తాపన సాధనాలను ఉపయోగించకుండా ఉండండి. హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగించడం వల్ల మీ జుట్టులోని తేమ తగ్గడం వల్ల జుట్టు దెబ్బతింటుందని పరిశోధకులు చూపించారు. అదనంగా, 180-డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద స్ట్రెయిట్నెర్స్ మరియు కర్లర్లను ఉపయోగించడం వలన గణనీయమైన ప్రోటీన్ నష్టం జరుగుతుంది.

కాబట్టి, తల స్నానం (హెయిర్ వాష్) తర్వాత సహజంగా మీ జుట్టును ఆరబెట్టడానికి ప్రయత్నించండి లేదా మీ జుట్టును ఆరబెట్టుకోవడానికి మీ తలకు 15 సెంటీమీటర్ల దూరంలో హెయిర్ డ్రైయర్ని ఉంచుకుని మీ జుట్టును ఆరబెట్టుకోండి.

ఒత్తైన జుట్టు పొందడానికి రసాయన చికిత్సలకు ‘నో’ చెప్పండి - Say no to chemical treatments to get thicker hair in Telugu

బ్లీచింగ్ లేదా డైయింగ్ వంటి రసాయన చికిత్సలు జుట్టులోని లిపిడ్ అంశం తగ్గడానికి మరియు హెయిర్ ఫైబర్‌ను చీల్చడానికి దారితీస్తుంది. జుట్టు యొక్క రంగును మార్చడం, హైడ్రాక్సైడ్లతో లేదా థియోగ్లైకోలేట్ తో, జుట్టు దెబ్బతినడానికి మరియు విచ్ఛిన్నానికి కారణమయ్యే సున్నితమైన ప్రక్రియ. ఈ మార్పులను శాస్త్రవేత్తలు సూక్ష్మదర్శిని కింద పెట్టి పరీక్షగా గమనించారు. అందువల్ల, మీరు తెలివిగా జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎన్నుకోవాలి.

రసాయన రంగులకు బదులుగా, కొబ్బరి నూనెలో కలిపిన బీట్రూట్ దుంప రసం లేదా క్యారెట్ రసాన్ని ఉపయోగించి జుట్టులో ఎరుపు రంగు షేడ్స్ పొందవచ్చు. తేలికపాటి జుట్టును పొందడానికి జుట్టుకు నిమ్మరసాన్ని ఉపయోగించొచ్చు మరియు మీ జుట్టులో నారింజ రంగును పొందడానికి గోరింటాకు నిమ్మరసం మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.

ఒత్తైన జుట్టుకు విటమిన్ ఇ మందులు - Vitamin E supplements for thicker hair in Telugu

విటమిన్ ఇ చాలాకాలంగా చర్మం మరియు జుట్టుకు చికిత్సగా పరిగణించబడుతోంది. 2010 లో జరిపిన ఒక అధ్యయనంలో విటమిన్ ‘ఇ’ లో టోకోట్రియనాల్స్ ఉన్నాయని, ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదం చేస్తాయని చెప్పింది. విటమిన్ ఇ సహజంగా గింజలు, కూరగాయల నూనె, ఆకుకూరలు మరియు శెనగల వెన్నలో లభిస్తుంది.

విటమిన్ ఇ సప్లిమెంట్లను ఎలా ఉపయోగించాలి

మీరు 2 టేబుల్ స్పూన్ల హెయిర్ ఆయిల్ తీసుకొని రెండు విటమిన్ క్యాప్సూల్స్ లోపలి భాగాన్ని వేరు చేసి అందులో నూనెను వేయండి. వాటిని కలపండి మరియు మీ జుట్టు మరియు నెత్తిమీద పూయండి. కొంతసేపు ఉంచండి మరియు 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

ఒత్తైన జుట్టుకు సల్ఫేట్ లేని షాంపూలు - Sulfate-free shampoos to have thick hair in Telugu

ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న షాంపూ లేదా కండీషనర్‌ను వాడడం మానుకోండి. సోడియం లారెల్ మరియు లారెత్ సల్ఫేట్లు చాలా షాంపూలలో శుభ్రపరచడానికి వాడే ఏజెంట్లు. రసాయన షాంపూలు మీ జుట్టుకు మంచిని చేకూర్చవు, బదులుగా, జుట్టు-నెత్తిచర్మాన్ని (క్యూటికల్స్) దెబ్బతీస్తాయి. కాబట్టి, ఈ ఉత్పత్తుల కోసం మీ షాంపూ యొక్క లేబుళ్ళను తనిఖీ చేయండి మరియు ఎల్లప్పుడూ సల్ఫేట్ లేని సహజ షాంపూలను ఉపయోగించుకోండి.

షాంపూలను వారానికి 2 లేదా 3 సార్లకు మించి వాడకండి.

వ్యక్తి జుట్టు పరిస్థితి వారి శరీరం యొక్క మొత్తం స్థితిని ప్రతిబింబిస్తుంది. నిర్దిష్ట పోషక లోపాలు లేదా ఏదైనా అనారోగ్యాల వల్ల జుట్టు పెరగడం ఆగిపోవచ్చు లేదా బలహీనపడవచ్చు. మందపాటి జుట్టు పొందడానికి కొన్ని విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి, కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేడి మరియు రసాయన చికిత్సలకు దూరంగా ఉండటం ఖచ్చితంగా సహాయపడుతుంది. కాబట్టి, నీటిని సమృద్ధిగా  తాగండి, తద్వారా మీ శరీరం జలీకరణం (హైడ్రేట్ గా) కల్గి ఉండేలా చూసుకోండి. సహజ ఉత్పత్తులు మరియు నూనెలను ఉపయోగించడం ద్వారా మీ జుట్టును బాగా చూసుకోండి.

और पढ़ें ...

వనరులు

 1. Emily L. Guo, Rajani Katta. Diet and hair loss: effects of nutrient deficiency and supplement use . Dermatol Pract Concept. 2017 Jan; 7(1): 1–10. PMID: 28243487
 2. Yoonhee Lee et al. Hair Shaft Damage from Heat and Drying Time of Hair Dryer . Ann Dermatol. 2011 Nov; 23(4): 455–462. PMID: 22148012
 3. França-Stefoni SA et al. Protein loss in human hair from combination straightening and coloring treatments. J Cosmet Dermatol. 2015 Sep;14(3):204-8. PMID: 26177865
 4. Maria Fernanda Reis Gavazzoni Dias. Hair Cosmetics: An Overview . Int J Trichology. 2015 Jan-Mar; 7(1): 2–15. PMID: 25878443
 5. B Satheesha Nayak et al. A Study on Scalp Hair Health and Hair Care Practices among Malaysian Medical Students . Int J Trichology. 2017 Apr-Jun; 9(2): 58–62. PMID: 28839388
 6. Lim Ai Beoy, Wong Jia Woei, Yuen Kah Hay. Effects of Tocotrienol Supplementation on Hair Growth in Human Volunteers . Trop Life Sci Res. 2010 Dec; 21(2): 91–99. PMID: 24575202
 7. Nakamura T et al. Naturally Occurring Hair Growth Peptide: Water-Soluble Chicken Egg Yolk Peptides Stimulate Hair Growth Through Induction of Vascular Endothelial Growth Factor Production. J Med Food. 2018 Jul;21(7):701-708. PMID: 29583066
 8. Zuzanna Sabina Goluch-Koniuszy. Nutrition of women with hair loss problem during the period of menopause Prz Menopauzalny. 2016 Mar; 15(1): 56–61. PMID: 27095961