కలబంద గురించిన విషయాల్ని ప్రపంచానికంతా చాటిచెప్పింది ఋగ్వేదమేనని మీకిప్పటికే తెలిసి ఉండచ్చు. “అలోవెరా” గా పిలువబడే కలబంద గొప్ప ఔషధగుణాలు గల్గిన మొక్క లేక మూలిక. దీన్నే “మంచి కలబంద”గా కూడా వ్యవహరిస్తారు.  

ప్రపంచంలోని ప్రతి ఇంటా కనిపించే ఈ కలబంద మొక్క అంతటి ప్రసిద్ధిని పొందడానికి ఇదో గొప్ప ఆహారపదార్థం కావడమే కారణం. అనేకమందికి సౌందర్య రహస్యంగా ఉపయోగపడుతున్న "మిస్టరీ ప్లాంట్" లేక “అద్భుత మొక్క” కలబంద. వాస్తవానికి, ఇది భారతదేశంలో “ఘ్రిత్కుమారి” అని కూడా ప్రసిద్ది చెందింది. ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, సంస్కృతంలో దీనిని "కుమారి" అని పిలుస్తారు, ఎందుకంటే స్త్రీలకు ఇది వారి ఋతుచక్ర క్రమబద్దీకరణకు మరియు దోషరహిత చర్మం పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది గనుక. మీరు గమనించే ఉంటారు కలబంద ఆకులు ఎప్పుడూ తాజాగానేగోచరిస్తుంది. అందుకే దోషరహితమైన చర్మానికిదో కానుక అని ఆయుర్వేద పరిశోధకులంటారు. అది ఆయుర్వేదం కావచ్చు లేదా మరేదైనా పాశ్చాత్య వైద్యపధ్ధతి అయినా కావచ్చు, ఆయా  సంప్రదాయిక ఔషధ-వైద్య పద్ధతుల్లో కలబందకు విశిష్ఠ స్థానం ఉంది.

రసం, కండపుష్టి దండిగా కల్గిన మొక్క కలబంద. చాలా దళసరిగా, గుజ్జును కల్గి ఉండే తన ఆకులను మరియు కాండాన్ని కలబంద నీటిని నిల్వ చేసుకునేటందుకు ఉపయోగిస్తుంది. కలబంద ఒక ఆసక్తికరమైన మొక్క. లేతగా రసపుష్టిని (టెండర్, జ్యుసి) కల్గి ఉంటుందిది. ఆయుర్వేదంలో, ముఖ్యముగా పేగులు మరియు కాలేయ ఆరోగ్యానికి సంబంధించి, కలబంద యొక్క ప్రయోజనకర ప్రభావాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త మరియు రచయిత “ప్లిని ది ఎల్డర్” ప్రకారం, కలబందను కుష్టు వ్యాధికి వ్రణాలచికిత్సలో ఉపయోగించవచ్చు అని చెప్పాడు. కలబంద మూలిక కేవలం భారత ఉపఖండంలో మాత్రమే గాక పురాతన ఈజిప్టు దేశ పత్రాల్లో కూడా ప్రస్తావన ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అంటే కలబందకు అంతటి ప్రజాదరణ ప్రపంచమంతటా ఉందన్నమాట. వాస్తవానికి, ఈజిప్టు దేశవాసులు కలబందను  "అమరత్వం యొక్క మొక్క" అని పిలిచేవారు. ప్రసిద్ధ ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన సౌందర్య పాలనలో కలబండను ఉపయోగించినట్లు నమ్ముతారు!

మీకు తెలుసా?

కలబంద యొక్క ప్రఖ్యాత  నామమైన “అలోవెరా” అరబిక్ శబ్దం, “అల్లొహ్” నుండి వచ్చింది. అల్లొహ్ అంటే “మెరిసే చేదు పదార్ధం” అని అర్థం. “వెరా” అనేది లాటిన్ పదం. “వెరా” కు అర్థం ‘నిజం’ అని.

కలబంద గురించిన కొన్ని వాస్తవాలు:   

 • వృక్తశాస్త్రం (బొటానికల్) పేరు: అలోయి బార్బడెన్సిస్ మిల్లర్
 • కుటుంబం: అస్సోడొలాసియే (లిలియాసియా)
 • సాధారణ పేరు: అలో వేరా, బర్న్ ప్లాంట్, ఘీ కుమారి, కుమారి.
 • సంస్కృతనామం: ఘ్రిత్కుమారి
 • ఉపయోగించే భాగాలు: ఆకులు
 • కలబంద యొక్క స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కలబంద (అలో వెరా) ఆఫ్రికాకు చెందినది.  కానీ కాలక్రమంలో కలబంద తన స్థానిక భూభాగాన్నొదిలి  మధ్య తూర్పు దేశాలు, భారతదేశంతో పాటు ప్రపంచంలోని అత్యంత పొడివాతావరణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. భారతదేశంలో ఇది రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర మరియు గుజరాత్లలో విరివిగా కనబడుతుంది.  
 • శక్తిశాస్త్రము: శీతలీకరణం (చల్లబరిచే స్వభావం)
 1. కలబంద యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of Aloe Vera in Telugu
 2. కలబంద మొక్కను ఉపయోగిస్తున్న రీతులు - Aloe vera plant and how it is used in Telugu
 3. కలబంద మోతాదు - Aloe vera dosage in Telugu
 4. కలబంద దుష్ప్రభావాలు - Side effects of aloe vera in Telugu

సాధారణంగా కలబందను కాలిన గాయాలు మరియు అన్నిరకాల చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు. మీలో కొందరికి ఇప్పటికే కలబంద గురించిన వివిధ ఉపయోగాల గురించి తెలిసే ఉంటుంది. ఎన్నో రోగాల్ని నయం చేసే “చిరు వింత” ఈ కలబంద. మరి కలబంద ప్రయోజనాలు, దాని యొక్క ఇతర చర్యల గురించి చూద్దాం.

 • ఆరోగ్యకరమైన చర్మం కోసం ఒక నమ్మకమైన  ఔషధం కోసం చూస్తున్నట్లయితే, సహజ రూపంలో ఉండే  కలబంద జెల్లీని ఉపయోగించడం ఎంతో మంచిది.
 • ప్రేగు వాపు వ్యాధిలో కలబంద ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. అదనంగా, మలబద్దకాన్ని చికిత్స చేయడానికి కలబంద గుజ్జును తినడం మంచిదని సూచించబడింది, ఎందుకంటే ఇది చాలా మంచి భేదిమందు.
 • ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం వలెనే దంతారోగ్యంతో కూడిన నోటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. యాంటిబయోటిక్ మందులక్కూడా లొంగని నోటి వ్యాధుల పెరుగుదలతో మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించడానికి కలబంద ఒక సహజ ప్రత్యామ్నాయం.
 • కలబందలో  అనామ్లజని మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. క్రిమికారకాల వలన వచ్చే చర్మ వ్యాధులతో పోరాడటానికి కలబంద సహాయపడుతుంది.
 • కలబందలోని ఔషధగుణాలు రక్తంలోని చక్కర స్థాయిల్ని గణనీయంగా తగ్గించి మధుమేహ రోగులకు మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
 • కలబందలో ఉండే తేమ గుణాలు కేవలం చర్మ ప్రయోజనాలకే కాక నుదురు మరియు వెంట్రుకలకి కూడా మేలును చేకూరుస్తాయి .

మెరిసే చర్మసౌందర్యానికి కలబంద జెల్లీ - Aloe vera gel benefits for skin in Telugu

పలువురు పలు రకాల చర్మాన్ని కల్గి ఉంటారు, అలాంటి వారందరికీ నప్పే రకరకాల కలబంద క్రీములు, యాంటీ ఏజింగ్ లోషన్లు మార్కెట్లో లభ్హ్యమౌతున్నాయి.  అయితే వీటిని కొనే ముందు అవి ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయి అనే సంగతిని తెలుసుకోవాలి. మీరు గనుక ఆరోగ్యకరమైన మీ చర్మం కోసం నమ్మదగిన ఔషధం కోసం గనుక చూస్తున్నట్లయితే, సహజ రూపంలో ఉండే  కలబంద జెల్లీని ఉపయోగించడం మంచిది. సహజమైన కలబంద జెల్లీలో మార్కెట్లో దొరికే ఖరీదైన లోషన్లులో ఉండే అన్ని సారాంశాలు, అన్ని ప్రయోజనాలు ఉంటాయి. పైగా సహజంగా తయారు చేసుకున్న కలబంద జెల్లీ ఎటువంటి దుష్ప్రభావాలనూ కల్గించదు.  దిననిత్యం తినే మీ ఆహారంలో కలబందను కూడా కలిపి తీసుకుంటే చర్మంపై దద్దుర్లతో కూడిన మార్కులు (rashes),  అకాలంగా దాపురించే వృద్ధాప్య చిహ్నాలు మటుమాయం అవుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కలబందను చర్మలేపనంగా ఉపయోగించినప్పుడు, దీనికి సహజమైన తేమగుణం ఉండడం చేత చర్మంపై తన ఉద్దీపనాప్రభావం చూపిస్తుంది. కలబంద చర్మాన్ని ఎండిపోనీయదు, తేమను కల్పిస్తుంది. అలా తేమతో కూడిన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. మరి ఇలాంటి చర్మాన్నే గదా అందరూ కోరుకునేది.  కలబందను నిత్యం, నిరంతరం ఉపయోగించడం వల్ల అది చర్మాన్ని ఎల్లప్పుడూ చెమ్మపూరితంగా ఉండేట్జు చేసి చర్మ కణాలు వేగంగా పెరగడానికి తోడ్పడుతుంది. పెరిగిన చర్మకణాల కారణంగా చర్మం యొక్క స్థితిస్థాపకత (elasticity) మెరుగుపడుతుంది.

కలబంద జెల్లీ వృద్ధాప్య-వ్యతిరేక కార్యకలాపాలకు (anti-aging activities)  మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

 • కలబంద గాయాలను త్వరగా మాన్పుతుంది: పుండ్లు-గాయాల నివారణలలో వాడే అనేక మొక్కల్లో కలబంద ఒకటిగా సామాన్యజనం పరిగణిస్తున్నారు. కలబందకున్న ఈ మాన్పుడు గుణం వెనుక ఉన్న రహస్యాన్ని తెల్సుకునేటందుకు మెళుకువను అర్థం చేసుకునేందుకు విస్తృతమైన పరిశోధనలు  ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. పెరుగుదలకుపకరించే కొన్ని హార్మోన్లను కలబంద కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ హార్మోన్లు కొత్త చర్మం పునరుత్పత్తికి మరియు గాయం మానేందుకు సహాయపడే “ఫైబ్రోబ్లాస్టుల”నబడే చర్మ కణాలతో మిళితమై గాయం/పుండు చుట్టూ కొత్త చర్మ కణాలు పెరిగేందుకు తోడ్పడతాయి. కలబంద యొక్క పైపూత పదార్థాలు మరియు లోనికి పుచ్చుకునే ఔషధ, పానీయాది రూపాల్లో కూడా ఈ మానిపే (healing) లక్షణాలు సమానంగా ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. 

 • కాలిన బొబ్బల్ని నయం చేయడంలో కలబంద  ప్రభావశాలి: ఒకటో స్థాయి, రెండవ-స్థాయి కాలిన బొబ్బలు (first and second degree burns), ఎండతీవ్రత వల్ల ఏర్పడిన దద్దుర్లు, కాలిన గాయాల (బర్న్స్) చికిత్స కోసం ఆయుర్వేద వైద్యులు కలబంద జెల్లీని తమ రోగులకు  సూచిస్తున్నారు. కలబంద జెల్లీని సాధారణంగా ప్రభావిత ప్రాంతాల్లో, అంటే కాలిన బొబ్బలపైనా, గాయాలపైనా నేరుగా పూయడం ద్వారా వాడబడుతోంది. కాలిన (బర్న్) గాయాలు, బొబ్బల్ని నయం చేయడంలో వాజలేన్ పట్టీ/పూత కంటే కలబంద జెల్లీ  ప్రభావవంతమైన మరియు త్వరిత గుణకారిగా పని చేస్తుందని ఒక అధ్యయనం వాదిస్తోంది. గాయాలు మరియు పుండ్లను మాన్పడంలో వాజలిన్ పట్టీ/పూత సగటున 18-20 రోజులు తీసుకుంటే కలబంద జెల్లీ అదే గాయాల్ని సుమారు 12 రోజుల్లోనే నయం చేసిందని అధ్యయనంలో పరిశోధకులు  కనుగొన్నారు.

 • ఎండకు కమిలిన చర్మానికి ఔషధము: మీకు తెలుసా ఎండకు కందిన లేదా కమిలిపోయిన చర్మానికి కలబంద ఎలాంటి దుష్ప్రభావాల్లేని ఓ సహజమైన మరియు త్వరిత ఉపశమనకారి అని? ఎండకు కమిలిన చర్మం లేదా బొబ్బలేర్పడ్డపుడు ఎవరికైనా తటాలున గుర్తుకొచ్చే మొట్టమొదటి గృహచిట్కా మందు బహుశా కలబందేనని చెప్పచ్చు. ఇప్పటికే పేర్కొన్న చర్మ-సంబంధమైన   వైద్యప్రయోజనాలే కాకుండా, కలబంద జెల్లీ పైపూత వల్ల ఎండతీవ్రత కారణంగా కలిగే బొబ్బలు, చర్మం కమిలిపోవడానికి తక్షణ ఉపశమనకారిగా పని చేస్తుంది. పైగా దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

 • కలబంద​​ రేడియోధార్మికత యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది: కీమోథెరపీ రోగులలో రేడియో ధార్మికతకు సంబంధించిన చికిత్స కోసం అలోయి వేరా ప్రభావవంతంగా ఉపయోగించగలదని రోగి సర్వే-ఆధారిత ఆధారాలు చెబుతున్నాయి. కలబంద కలుపు మొక్కలు కంటే దెబ్బలను చికిత్స చేయడంలో కలబంద జెల్లు మరింత ప్రభావవంతమైనవి మరియు వేగవంతంగా ఉన్నాయని తదుపరి పరిశోధన పేర్కొంది.

కడుపులో వచ్చే అంటువ్యాధులు మరియు మలబద్ధకానికి కలబంద - Aloe vera for stomach infections and constipation

మీరు ఎంత తరచుగా కడుపు సమస్యలను ఎదుర్కొంటున్నారు? మీరు కూడా గుండెల్లో మంట  బాధపడుతున్నారు? ఇవి ఎర్రబడిన కడుపు లేదా GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) కలిగించే సంక్రమణ యొక్క లక్షణాలు కావచ్చు. ప్రేగు ఇన్ఫ్లమేటరీ  వ్యాధి (IBS) చికిత్సకు అలోయి వేరా యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇటీవల జరిపిన ఒక అధ్యయనం జరిగింది, ఇది చికిత్స చేసిన ఎర్రబడిన ప్రేగుల వ్యాధులలో కలబంద వేరా ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. అదనంగా, ఇది మలవిసర్జనకు చికిత్స చేయడానికి కలబంద రబ్బరును తినడానికి సూచించబడింది ఎందుకంటే ఇది చాలా మంచి భేదిమందు. ఏమైనప్పటికి, జొన్న లేదా రబ్బరు పాలు రూపంలో కలబంద వేరా తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే కలబంద రసం అవసరమైన వినియోగం కన్నా ఎక్కువ విరేచనాల కేసులు నమోదవుతున్నాయి.

ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు దంతాల కోసం కలబంద - Aloe vera for healthy gums and teeth in Telugu

మంచి ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు బలమైన పళ్ళు కలిగి ఉండాలని మనందరం కోరుకుంటాం. ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం వలెనే దంతారోగ్యంతో కూడిన నోటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. దంత-దావనాది కృత్యాలతో కూడిన జాగ్రత్తలు దీనికవసరం. యాంటిబయోటిక్ మందులక్కూడా లొంగని నోటి వ్యాధుల పెరుగుదలతో మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించకలబంద డానికి సహజ ప్రత్యామ్నాయం అవసరం. ఏవైనా దుష్ప్రభావాలు లేకుండా దంత ఫలకాలు మరియు జింజివైటిస్ తగ్గించడంలో జెల్ చాలా ప్రభావవంతమైనదని ఆయుర్వేదలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పేర్కొన్నాయి. నోటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా ఇది జరుగుతుంది. అదనంగా, కలబంద జెల్లీని పూయడం వల్ల కూడా నోటి పూతలను వేగంగా మరియు సమర్థవంతంగా నయం చేసుకోవచ్చు.

కలబంద అనామ్లజని మరియు యాంటీ బాక్టీరియల్ కూడా - Aloe vera as an antioxidant and antibacterial in Telugu

ఇటీవలి పరిశోధన తెలిపిన ప్రకారం, కలబందలో  అనామ్లజని మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు  కలిగి ఉంది. క్రిమికారకాలతో వచ్చే చర్మ వ్యాధులతో పోరాడటానికి కలబంద సహాయపడుతుంది. సంప్రదాయకంగా, మొటిమలు, చుండ్రు మరియు ఇతర సాధారణ బాక్టీరియాకారక చర్మ వ్యాధుల చికిత్సలో కలబండను ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఈ రంగంలో ఇంకా ఎక్కువ పరిశోధన జరగాల్సిన అవసరమవుతుంది. అందువల్ల, చర్మవ్యాధులకు కలబండను వాడడానికి ముందు మీ ఆయుర్వేద వైద్యుడ్ని సంప్రదించండి. గుండె జబ్బులు, మధుమేహం, మరియు న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో కలబంద ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం సూచించింది.

మధుమేహం లేక చక్కెరవ్యాధికి కలబంద - Aloe vera for diabetes in Telugu

కలబందలోని ఔషధగుణాలు రక్తంలోని చక్కర స్థాయిల్ని గణనీయంగా తగ్గించి డయాబెటిక్ రోగులకు మీలు చేస్తుందని దీనిపై జరిగిన మూడు వేర్వేరు విస్తృత పరిశోధన లు చెబుతున్నాయి. చక్కెరవ్యాధి రోగులు కలబంద రాసా న్ని(juice) సేవించడం వల్ల వారిలోని చక్కర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధనలు తేల్చాయి. కలబందను చక్కర రోగులు మందుగా సేవించడం  ఎంతమాత్రం సురక్షితం, సురక్షిమే అయితే ఏ మోతాదులో తీసుకోవాలి అనే విషయాలపై తుది దశల్లో ఉన్న అధ్యయనాలు పరీక్షలు జరుపుతున్నాయి.

(మరింత సమాచారం: మధుమేహం)  

కేశవర్ధినిగా (జుట్టు ఆరోగ్యానికి) కలబంద - Aloe vera benefits for hair in Telugu

కలబందలో ఉండే తేమ ప్రభావాలు కేవలం చర్మ ప్రయోజనాలకే కాక తలపై చర్మానికి మరియు వెంట్రుకలకి కూడా మేలును చేకూరుస్తుంది. దీన్ని కేశవర్ధినిగా (హెయిర్ కండీషనర్గా) ఉపయోగించినప్పుడు ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సహాయపడుతుంది. తలమీది చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడి జుట్టు రాలిపోకుండా జుట్టుకు మెరుపును, నాజూకుతనాన్ని తెచ్చి పెడుతుంది. కలబంద విటమిన్లు మరియు ఫేనకద్రవాల్ని (ఎంజైమ్లను) పుష్కలంగా కల్గి ఉంది. జుట్టు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు వేగంగా పెరిగేందుకు తోడ్పడుతుంది.

కణుతులు ఏర్పడడాన్ని ఆపే కలబంద - Aloe vera as an anti-tumor agent in Telugu

కలబంద జెల్ మరియు కలబందసారంలో సోమం లేదా సెలీనియం (selenium), జింకు ఖనిజాలు, విటమిన్లు, రసాయనిక ఆమ్లద్రవాలు వంటి అనామ్లీకరణ పదార్థాలుండడం చేత శరీరంలో గడ్డలు కట్టడానికి దోహదం చేసే కణాల పెరుగుదలను వేగంగా పెరక్కుండా (as an antitumor medicine) అడ్డుకుంటాయి. కణతలు లేక గడ్డలేర్పడటాన్ని అరికట్టే (chemoprotective) తత్త్వం కలబందలో ఏమాత్రముందో తెల్సుకునేందుకు ఏర్పాటైన ఓ పరిశోధకుల బృందం పై విషయాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరికీ అందుబాటులోకొచ్చే చౌకైన మందును కనుక్కోవడమే ఈ పరిశోధకుల బృందం ధ్యేయం.

కొవ్వును (కొలెస్ట్రాల్) తగ్గించడానికి కలబంద - Aloe vera for lowering cholesterol in Telugu

మన శరీరంలో రక్తంలో చోటు చేసుకునే తక్కువ-సాంద్రత కొలెస్ట్రాల్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ను కలబంద తగ్గిస్తుందని, శరీరంలో "మంచి" లేదా అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుందని దీనిపై నిర్వహించిన విస్తృతమైన పరిశోధన తేల్చి చెబుతున్నాయి.  రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ ను తొలగించి అథెరోస్క్లెరోసిస్ (ధమనులలో రక్తప్రసారానికి అవరోధమయ్యే కొవ్వు నిల్వలు) వంటి వ్యాధులను కలబంద అరికట్టి ఆరోగ్యకరమైన హృదయాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తంలో తక్కువ సాంద్రత కల్గి ఉండే LDL కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) కారణంగా మన శరీరం సులభంగా బరువును కోల్పోవటానికి దారి తీస్తుంది. “జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ అండ్ విటమినానాలజీ”లో ప్రచురించబడిన ఒక పరిశోధనలో కలబంద వినియోగం కాలేయపు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని 25-30 శాతం తగ్గిస్తుందని సూచిస్తుంది.

(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్ చికిత్స)  

కలబంద విస్తృతమైన ఉపయోగాలను కలిగి ఉంది, కానీ దీన్ని ముఖ్యంగా చర్మసౌందర్యానికి, చర్మంవ్యాధులకు  మరియు పేగు-సంబంధ ప్రయోజనాలకు ఉపయోగించడం జరుగుతోంది.

కలబంద నుండి రెండు ప్రధాన పదార్థాలను పొందుతున్నాం:

 • జెల్: దళసరిగా ఉండే కలబంద ఆకు లోపలి భాగం నుండి పొందే వాసన లేని పదార్ధం. స్పష్టమైన పారదర్శకతను కల్గి ఉంటుందిది.   
 • లేటెక్స్ లేదా జ్యూస్ (రబ్బరులా సాగేటువంటి జిగట రసం): ఆకు యొక్క బయటి భాగం నుండి పొందిన పసుపు పదార్ధం.

కలబంద నుండి తీసిన రబ్బరు పాలు లేదా జ్యూస్ ను  భేదిమందు (విరేచనకారి)గా ప్రేగుల్లో కలిగే బాధను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి నిత్యం సేవించేందుకు సూచించబడలేదిది, అయితే కలబంద జెల్ ను తరచుగా వినియోగించుకోవచ్చు. కలబంద ఆకు నుండి లభ్యమయ్యే ఈ జెల్ చర్మవ్యాధులకు, చర్మసౌందర్య పోషణకు మరియు ఆరోగ్య ప్రయోజనాలకు విరివిగా ఉపయోగపడుతుంది.

కలబంద ఆకుకు ఒక గాటును పెట్టడం ద్వారా జెల్ను మొక్క నుండి నేరుగా పొందవచ్చు. ఏదేమైనా, మొక్క యొక్క ముడి రబ్బరు లేదా పూర్తి ఆకులను అట్లాగే తినడం మంచిది కాదు, ఎందుకంటే ఇది శరీరానికి హాని కలిగించేది కావచ్చు.

శుద్ధి చేసి తయారు చేసిన ఉత్పత్తుల రూపాల్లో కలబంద జెల్ మరియు జ్యూస్ మార్కెట్లో  వినియోగదార్లకు అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక శుద్ధి చేయబడ్డ కలబంద జెల్ కోసం మార్కెట్లోకి వెళ్ళినపుడు "flash pasteurized” అనే పదాలు ఆ కలబంద ప్రోడక్ట్ పైన ఉంటేనే కొనండి. ఎందుకంటే, flash pasteurized అని ప్రోడక్ట్ పైన రాసుంటే మీరు కొనదలచిన కలబంద జెల్ ఔషధ ప్రయోజనాలు కోల్పోకుండా (సూక్ష్మజీవులను తొలగించి) శుద్దీకరించబడ్డది అని ఉత్పత్తిదారులు వినియోగదార్లకు సూచిస్తున్నారన్నమాట.  

ప్రస్తుతం, కలబందను నేరుగా సేవించేందుకు అనువుగా ఉండే  జెల్ మరియు జ్యూస్ రూపాల్లో ఉండే ప్రోడక్ట్ వినియోగదార్లకు మార్కెట్లో లభిస్తోంది. అంతే గాక కలబంద ఇపుడు పానీయాలు మరియు సౌందర్యవర్ధక ఉత్పత్తుల పరిశ్రమల్లోకి కూడా ప్రవేశించింది. వాణిజ్య పరిశ్రమ కలబందను పాలు, టీ, క్రీములు, మిఠాయి, పౌడర్ ( కలబంద పౌడర్ను ఐస్ క్రీమ్లు, పెరుగు, మరియు లస్సీలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు), ముఖప్రక్షాళన క్రీము (ఫేస్ వాష్), లోషన్లు మరియు ఇతర చర్మసౌందర్యవర్ధక  ఉత్పత్తులను తయారు చేయడంలో ఉపయోగిస్తోంది. మృదువైన కలబంద జెల్ క్యాప్సూల్స్ మార్కెట్లో వినియోగదార్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ జెల్ క్యాప్సూల్స్ సేవించడానికి మరియు సౌందర్యవర్ధక చేర్మలేపనంగా ఉపయోగించవచ్చు.

మీకు తెలుసా కలబంద గాలిని శుద్ధి చేసే ఓ మంచి శుద్ధికారి. నాసా (NASA) సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద గాలిని పరిశుభ్రంగా ఉంచుతుంది మరియు ఇది చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి మరింత ఆక్సిజన్ను అందించడంలో సహాయపడే పలు మొక్కల్లో ఇదీ ఒకటి.

ఇంట్లో పెరటి మొక్కగా కలబంద

కలబంద కఠినమైన మొక్క. అంటే కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని బతగ్గలిగే మొక్కన్నమాట. నీళ్లు పోస్తే చాలు ఇంటిలోపలా (indoors) ఇంటి బయటా (outdoors) కూడా కలబంద బాగా పెరుగుతుంది. సస్యపోషణ ఏమంత అక్కర లేని మొక్క ఇది. (ఇండోర్ మొక్కలు బహిరంగ ప్రదేశాల్లోని మొక్కల కంటే నెమ్మదిగా పెరుగుతాయి) ఇది ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో 12-27 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య పెరుగుతుంది.

మీరు చల్లని ప్రదేశాల్లో నివాసముంటున్నట్లైతే కలబంద  మీ ఇండోర్ మొక్కల్లో గనుక ఉంటే దాన్ని పగలు ఎండలో ఉంచి సాయంత్రం ఇంటి లోపలికి తీసుకురావడం ఉత్తమం.

కలబందను పెంచేందుకు దాని ఆకును కోసి (leaf cutting) కుంపట్లోనో, భూమిలోనే నాటుతారు. లేదా కలబంద మోసుల్ని (కలబంద తల్లి మొక్క నుండి మొలిచిన చిన్న చిన్న మొక్కలు) తీసుకొచ్చి నాటుకుని పెంచుకోవచ్చు. అయితే, నిపుణులైన తోటమాలి చెప్పేదేమంటే ఆకు కత్తిరింపులు కంటే కలబంద మోసుల్ని నాటడమే ఉత్తమం, ఎందుకంటే కలబందఆకు కత్తిరింపుల్ని నాటడం, వాటిని పెంచడం ఒకింత కష్టంతో కూడుకున్న పని.

కలబందను ఇలా నాటాలి:

 • తడి నేలలో మోసులు (offshoots) కల్గిన తల్లికలబంద మొక్క నుండి ఒక పిల్లమొక్కను ఎంచుకుని దాని వేర్ల పర్యంతం తడి మట్టిని తొలగించండి.
 • ఆ చిన్నమొక్కను వేర్లతో బాటు తల్లిమొక్క నుండి ఓ కత్తి సాయంతో వేరు చేసి తీసుకోండి. మోసుకు వేర్లు సురక్షితంగా ఉండేట్లు చూసుకోండి.
 • వేరు చేసిన కలబంద మోసును (చిన్న మొక్క)  సారవంతమైన మట్టితో ముందే సిద్ధం చేసుకున్నకుండీలో నాటి నీరు పోయండి.

కలబంద మొక్కను పెంచడం సులభమే అయినా, నాటిన కలబంద మొక్కకు నీళ్లు పోయడం చాలా ముఖ్యం. సరైన నీటి పోషణ లేకపోతే మొక్క ఎండిపోయి అంతరించిపోతుంది.

ఇంట్లోనే కలబంద జెల్లీని తయారు చేయడం ఎలా?

కలబంద జెల్లీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేయవచ్చు. కలబంద మొక్క నుండి ఒక ఆకును కట్ చేసి ఇపుడు ఒక గిన్నెలో కత్తిరించిన కలబంద ఆకు (కత్తిరించిన భాగం కిందికి ఉండేలా చూసుకుని)ను ఉంచండి. దళసరిగా ఉండే  కత్తిరించిన కలబంద ఆకునుండి పసుపురంగు ద్రవం గిన్నెలోకి స్రవించడం ప్రారంభిస్తుంది. ఆకు నుండి ద్రవం కారడం ఆగిన తర్వాత ఆకును కడగాలి. కడిగిన కలబంద ఆకుపైన ఉండే తొక్కను (పైపోర) ఓ కత్తితో తీసేయండి. ఇపుడు మీకు స్పష్టమైన, పారదర్శకతతో కూడిన కలబంద జెల్లీ/జెల్ సిద్ధమైంది. మీరు దీన్ని వెంటనే ఉపయోగించుకోవచ్చు లేదా తదుపరి  వినియోగానికి ఫ్రీజర్లో భద్రపరచనూవచ్చు. ఈ జెల్ ఫ్రీజర్లో ఒక వారం వరకు ఉంటుంది.

కలబంద జెల్లీని నొప్పి లేదా పుండ్లున్న చోట్లలో ఎవరైనా సరే పైపూతగా పూయవచ్చు (కానీ తమ శరీర తత్వానికి కలబంద సహజంగానే  పడదు, ఎలర్జీ అవుతుంది అనుకునే కొందరు తప్ప). దీనివల్ల ఎక్కువ దుష్ప్రభావాలు సామాన్యంగా ఉండవు. చర్మలేపనంగా ఉపయోగించే కలబంద క్రీములు, లోషన్లు మరియు ద్రవాహారంగా  తీసుకునే కలబంద పానీయాలు మొదలైనవాటి మోతాదు ఆయా ఉత్పత్తిలో కలబంద ఎంత ప్రమాణంలో (quantity) ఉందన్న దానిపై ఆధారపడి ఉంతుంది. కలబంద రసం లేదా పానీయం విషయానికొస్తే, సాధారణంగా, రోజువారీగా ఒక ఔన్స్ లేదా రెండు టేబుల్ స్పూన్లు మోతాదును కడుపులోకి పుచ్చుకోవడం సురక్షితమైందిగా భావిస్తారు. అయితే కలబందను పుచ్చుకునేవారి వయస్సు, లింగం మరియు వారి ఒంటి లక్షణాలు వంటి కారకాల మీద కూడా కలబంద మోతాదు ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ ఆహారంతో పాటుగా కలబందను కూడా సేవించాలనుకునేందుకు ముందుగా, లేదా కలబంద లేపనాదుల్ని ఉపయోగించేందుకు ముందు అర్హుడైన ఆయుర్వేద వైద్యుడ్ని అడిగి సలహా సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమం.

 • కలబందలో ఉండే రబ్బరులాంటి గుజ్జును నిరంతరంగా సేవించడం జీర్ణశయాంతర సమస్యలకు (gastrointestinal problems)   కారణమవుతుంది.
 • కలబందను వాడే విషయంలో కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు, అలాంటివారు కలబందను ఏరూపంలోనైనా సరే తీసుకోవటానికి ముందు వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
 • కలబంద జెల్లీని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు లోనికి సేవించేందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే అది పొట్టలో అసౌకర్యం కలుగజేసి అతిసారానికి కారణమవుతుంది.
 • గర్భిణీ స్త్రీలకు కలబందసేవనం సురక్షితం కాదు. ఎందుకంటే కలబందను సేవించిన కారణంగా గర్భస్రావాలు సంభవించినట్లు రిపోర్టులు ఉన్నాయి.
 • ఎండలోకి బయలుదేరివెళ్లే ముందు కలబంద జెల్లీని ముఖలేపనాదులకు వాడటం మూలంగా  దద్దుర్లు ఏర్పడడం, చర్మం కమిలిపోవడం (సన్ బర్న్స్) జరగొచ్చు.
 • మీరు ఇప్పటికే కొన్ని సూచించిన మందులను వాడుతూ ఉంటే గనుక మీ ఆహారంలో కలబందను కూడా జోడించి తినాలనుకుంటున్నట్లైన, ముందుగా వైద్య నిపుణుడి సలహా పొందండి. ఎందుకంటే ఇది ఇప్పటికే మీరు తీసుకుంటున్న ఔషధాల ప్రభావానికి అంతరాయం కలిగించే అవకాశయముంది.
Medicine NamePack SizePrice (Rs.)
Himalaya Anti Dandruff ShampooHimalaya Anti Dandruff Shampoo232.75
Ahaglow Face WashAhaglow Advanced Face Wash303.87
Acnelak SoapAcnelak Spot ON Cream112.0
AhaglowAhaglow Acne Control Moisturizing Gel353.85
Allsuth LotionAllsuth Lotion180.0
IMC Aloe Amla Candy IMC Aloe Amla Candy105.0
IMC Aloe Dental CreamIMC Aloe Dental Cream115.0
IMC Aloe Digest LiquidIMC Aloe Digest Liquid 160.0
IMC Aloe Herbocid TabletIMC Aloe Herbocid Tablet 360.0
IMC Aloe Jyoti Eye DropIMC Aloe Jyoti Eye Drop70.0
IMC Aloe Kofkare SyrupIMC Aloe Kofkare Syrup90.0
IMC Aloe Livkare TabletIMC Aloe Livkare DS Tonic120.0
IMC Aloe Mist LotionIMC Aloe Mist Lotion290.0
IMC Aloe Noni JuiceIMC Aloe Noni Juice 650.0
IMC Aloe Spriluna TabletIMC Aloe Spriluna Tablet360.0
Planet Ayurveda Aloe VitalsPlanet Ayurveda Aloe Vitals Capsule1215.0
Alograce CreamAlograce Cream150.0
Bakson's Apricot Aloevera with Neem & Cucumber ScrubBakson's Apricot Aloevera with Neem & Cucumber Scrub125.0
Asoglow Face WashAsoglow Face Wash298.0
Atogla LotionAtogla Resyl Lotion910.0
Ayur Herbals Astingent with Aloe VeraAyur Astingent50.0
Ayur Herbal All Purpose CreamAyur Herbal All Purpose Cream100.0
Ayur Herbal With Aloe Vera Massage CreamAyur Herbal With Aloe Vera Massage Cream100.0
IMC Ayurvedic Skin Care SoapIMC Ayurvedic Skin Care Soap 60.0
Baidyanath KumariasavaBaidyanath Kumariasava137.75
Bakson's Anti Aging LotionBakson's Anti Aging Lotion215.0
IMC Breast Fit CreamIMC Breast Fit Cream375.0
Calapure A LotionCalapure A Lotion69.3
Calosoft AfCalosoft-AF Lotion71.4
IMC Chayawan Gold PasteIMC Chayawan Gold Paste 295.0
Charak Cystolib Nutra TabletCystolib Nutra Tablet180.6
Vasu Dazzle Cool CreamVasu Dazzle Cool Cream90.0
Dermadew AloeDermadew Aloe Cream126.0
Dermadew Bact SoapDermadew Bact Soap175.0
DermadewDERMADEW CREAM 50GM2.1
Dersil Moisturising CreamDERSIL H BODY LOTION 200ML194.6
Himalaya Diaper Rash CreamHIMALAYA BABY DIAPER RASH CREAM 20GM60.8
Elovera Imf CreamElovera Imf Cream280.0
Elovera CreamElovera Body Wash255.5
Kudos Facial Bar with Kesar & ChandanKudos Facial Bar With Keshar and Chandan90.0
IMC Femi Tight GelIMC Femi Tight Gel 350.0
Glogeous Advanced Face Wash GelGLOGEOUS FACE WASH GEL 100ML556.5
HairgroHairgro Tablet35.0
Hairgro Plus GelHairgro Plus Gel112.0
IMC Heart Strong TabletIMC Heart Strong Tablet 360.0
IMC Herbal Aloe GelHerbal Aloe Cream180.0
IMC Herbal Aloe Hand WashIMC Herbal Aloe Hand Wash130.0
IMC Herbal Bal Shakti TonicIMC Herbal Bal Shakti Tonic 175.0
IMC Keshwin Hair Oil IMC Herbal Hair Oil 250.0
IMC Herbal Lip GlowIMC Herbal Lip Glow 80.0
IMC Herbal Urinorm SyrupIMC Herbal Urinorm Syrup 140.0
Himalaya Aloe & Cucumber Refreshing Body LotionHimalaya Aloe & Cucumber Refreshing Body Lotion 142.5
Himalaya Clarina Anti-Acne KitHimalaya Clarina Anti Acne Kit242.25
Himalaya Deep Cleansing Apricot Face WashHimalaya Deep Cleansing Apricot Face Wash123.5
Himalaya Dryness Defense Protein ShampooHimalaya Dryness Defense Protein Shampoo218.5
Himalaya Extra Moisturizing Baby SoapHimalaya Extra Moisturizing Baby Soap45.6
Himalaya Clarina Face WashHIMALAYA HERBAL PURIFYING NEEM FACE WASH 150ML (L)147.25
Himalaya Gentle Baby WipesHimalaya Gentle Baby Wipes171.0
Himalaya Gentle Daily Care Protein ConditionerHimalaya Gentle Daily Care Protein Shampoo427.5
IMC Aloe Vera JuiceIMC Aloe Vera Juice725.0
IMC Herbal Skin Toner BarIMC Herbal Skin Toner 85.0
Itchcam LotionItchcam Lotion397.7
IMC Jeevan Shakti RasIMC Jeevan Shakti Ras 450.0
Jiva Aloe Vera JuiceJiva Aloe Vera Juice220.0
Kairali's Herbal HairKairali's Herbal Hair Conditioner375.0
Kairali Kairheal OilKairali Kairheal Oil800.0
IMC Keshwin Hair ConditionarIMC Keshwin Hair Conditionar275.0
Khadi Green Apple ShampooKhadi Natural Green Apple Shampoo135.0
Khadi Natural Herbal Henna Tulsi Hair CleanserKhadi Natural Herbal Henna Tulsi Hair Cleanser160.0
Khadi Almond and Honey Facial ScrubKhadi Natural Almond and Honey Exfoliating Facial Scrub390.0
Khadi Honey and Vanilla ShampooKhadi Natural Honey and Vanilla Shampoo159.0
Kudos Neem Aloevera Face WashKudos Neem Aloevera Face Wash100.0
Meglow CreamMeglow Face Wash70.0
Menohelp SyrupMenohelp Syrup180.0
Charak Moha SoapMoha Herbal Face Wash125.0
Kairali Murivenna Oil Kairali Murivenna Oil160.0
IMC Pain Away OilPain Away Cream125.0
Baidyanath PanchasavaBaidyanath Panchasava109.25
Parasoft SoapParasoft Body Milk Lotion303.8
Patanjali Activated Carbon Facial FoamPatanjali Activated Carbon Facial Foam60.0
Patanjali Aloe VeraPatanjali Aloe Vera Juice Plain200.0
Patanjali Aloe Vera Kanti SoapPatanjali Aloe Vera Kanti Soap19.6
Patanjali Aloe Vera Moisturizing CreamPatanjali Aloevera Moisturizing Cream75.0
Patanjali Beauty CreamPatanjali Beauty Cream70.0
Patanjali Crack Heal CreamPatanjali Crack Heal Cream60.0
Patanjali Boro Safe CreamPatanjali Borosafe Antiseptic Cream45.0
Patanjali Orange Aloevera Face WashPatanjali Orange Aloevera Face Wash45.0
Patanjali Aloe Vera GelPatanjali Aloe Vera Gel80.0
Patanjali Hair ConditionerPatanjali Protein Hair Conditioner60.0
Patanjali Herbal Shaving CreamPatanjali Herbal Shaving Cream55.0
Patanjali Kesh KantiPatanjali Kesh Kanti Aloevera Hair Cleanser Shampoo119.0
Patanjali Body LotionPatanjali Saundarya Body Lotion 100.0
Patanjali Saundarya Face WashPatanjali Saundraya Orange Peel, Neem, Tulsi and Aloe Vera Face Wash90.0
IMC Protiwon Sugar Free Powder VanillaIMC Protiwon Sugar Free Powder Vanilla475.0
IMC Pyari Saheli DS SyrupIMC Pyari Saheli Syrup 140.0
Planet Ayurveda Radiant Skin Hair Nails FormulaPlanet Ayurveda Radiant Skin Hair Nail Formula Capsule1215.0
Reju Glow GelRejuglow Face Wash275.0
Sri Sri Tattva Exfoliating Face ScrubSri Sri Tattva Exfoliating Face Scrub49.5
Sri Sri Tattva Hydrating ConditionerSri Sri Tattva Hydrating Conditioner45.0
Sri Sri Tattva Quick Heal CreamSri Sri Ayurveda Quick Heal Cream54.0
SunprotekSunprotek 30+ Gel298.9
IMC Swadisht Pachan Churan PowderIMC Swadisht Pachan Powder130.0
TonengloTonenglo S Face Wash315.0
VenusiaVenusia Combo Cream337.96
VIS wash LotionVIS wash Lotion122.64
IMC Vita Diet TabletIMC Vita Diet Tablet 450.0
Zandu Herbal SoapZandu Herbal Soap29.02
Zandu KumaryasavaZandu Kumaryasava Syrup128.0
और पढ़ें ...

వనరులు

 1. Amar Surjushe, Resham Vasani, and D G Saple. ALOE VERA: A SHORT REVIEW. Indian J Dermatol. 2008; 53(4): 163–166. PMID: 19882025
 2. Kulveer Singh Ahlawat and Bhupender Singh Khatkar. Processing, food applications and safety of aloe vera products: a review. J Food Sci Technol. 2011 Oct; 48(5): 525–533. PMID: 23572784
 3. Visuthikosol V et al. Effect of aloe vera gel to healing of burn wound a clinical and histologic study.. J Med Assoc Thai. 1995 Aug;78(8):403-9. PMID: 7561562
 4. Vinay K. Gupta, Seema Malhotra. Pharmacological attribute of Aloe vera: Revalidation through experimental and clinical studies. Ayu. 2012 Apr-Jun; 33(2): 193–196. PMID: 23559789
 5. Langmead L1, Makins RJ, Rampton DS. Anti-inflammatory effects of aloe vera gel in human colorectal mucosa in vitro. Aliment Pharmacol Ther. 2004 Mar 1;19(5):521-7. PMID: 14987320
 6. Soyun Cho et al. Dietary Aloe Vera Supplementation Improves Facial Wrinkles and Elasticity and It Increases the Type I Procollagen Gene Expression in Human Skin in vivo. Ann Dermatol. 2009 Feb; 21(1): 6–11. PMID: 20548848
 7. Fatemeh Nejatzadeh-Barandozi. Antibacterial activities and antioxidant capacity of Aloe vera. Org Med Chem Lett. 2013; 3: 5. PMID: 23870710
 8. Rajendra Kumar Gupta et al. Preliminary Antiplaque Efficacy of Aloe Vera Mouthwash on 4 Day Plaque Re-Growth Model: Randomized Control Trial. Ethiop J Health Sci. 2014 Apr; 24(2): 139–144. PMID: 24795515
 9. G Sujatha, G Senthil Kumar, J Muruganandan, T Srinivasa Prasad. Aloe Vera in Dentistry. J Clin Diagn Res. 2014 Oct; 8(10): ZI01–ZI02. PMID: 25478478
 10. Neda Babaee, Ebrahim Zabihi, Saman Mohseni, Ali Akbar Moghadamnia. Evaluation of the therapeutic effects of Aloe vera gel on minor recurrent aphthous stomatitis. Dent Res J (Isfahan). 2012 Jul-Aug; 9(4): 381–385. PMID: 23162576
 11. Yongchaiyudha S1, Rungpitarangsi V, Bunyapraphatsara N, Chokechaijaroenporn O. Antidiabetic activity of Aloe vera L. juice. I. Clinical trial in new cases of diabetes mellitus.. Phytomedicine. 1996 Nov;3(3):241-3. PMID: 23195077
 12. Ghannam N, Kingston M, Al-Meshaal IA, Tariq M, Parman NS, Woodhouse N. The antidiabetic activity of aloes: preliminary clinical and experimental observations.. Horm Res. 1986;24(4):288-94. PMID: 3096865
 13. El-Shemy HA1, Aboul-Soud MA, Nassr-Allah AA, Aboul-Enein KM, Kabash A, Yagi A. Antitumor properties and modulation of antioxidant enzymes' activity by Aloe vera leaf active principles isolated via supercritical carbon dioxide extraction. Curr Med Chem. 2010;17(2):129-38. PMID: 19941474
 14. Saini M1, Goyal PK, Chaudhary G. Anti-tumor activity of Aloe vera against DMBA/croton oil-induced skin papillomagenesis in Swiss albino mice.. J Environ Pathol Toxicol Oncol. 2010;29(2):127-35. PMID: 20932247
ऐप पर पढ़ें