తేనె మరియు నిమ్మలపై కొన్ని సమీక్ష కథనాలు ఉదాహరణకు "మానవ వ్యాధులలో సహజ తేనె యొక్క సాంప్రదాయ మరియు ఆధునిక ఉపయోగాలు" మరియు మానవ ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే క్రియాశీలమైన సహజ మెటాబోలైట్స్ వంటి విలువైనవాటికి నిధి అయిన సిట్రస్ పండ్లు" వారి చర్మ ప్రయోజనాల గురించి క్లూ ను అందిస్తాయి. నిమ్మ మరియు తేనె రెండూ యాంటియోక్సిడెంట్, మృతకణాలను తొలగించే, మెలనోజెనిసిస్ (మెలనిన్ తయారీ నివారించడం) మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయని ఈ సమీక్షలు చూపాయి అవి పిగ్మెంటేషన్ ను వదిలించుకోవటానికి, వాపు తగ్గించడానికి మరియు మీ చర్మాన్ని ఆరోగ్యకరంగా, ప్రకాశవంతంగా మరియు మెరిసేలా చేసేందుకు సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి?
మీరు తేనె మరియు నిమ్మ రసం చెరి ఒక టీస్పూన్ ఉపయోగించవచ్చు, వాటిని బాగా కలపండి, మరియు దాన్ని దూదితో అద్దండి. దీని తరువాత, ప్రభావితమైన ప్రదేశంను ఈ దూదితో వృత్తాకార కదలికలను ఉపయోగించి మర్దన చేసుకొని 15-20 నిమిషాలు పాటు ఉండనివ్వండి. మీరు 3-4 వారాల వ్యవధిలో ఇది రోజుకు రెండు సార్లు చేయవచ్చు. దాని పదార్థాలు సహజంగా ఉన్నందున మీరు దీనిని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.
విటమిన్ ఎ మరియు సి, మరియు కెరోటేన్లు ఉండటం వలన కీరదోసలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కీరదోసలో ఉండే జియాగ్జాంథిన్ మరియు లుటీన్ చర్మపు రంధ్రాలను తగ్గించడానికి, చర్మాన్ని తెల్లగా చేయడానికి మరియు చర్మ మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడతాయి
ఎలా ఉపయోగించాలి?
తాజా కీరదోస రసం తీసుకోండి మరియు ప్రభావిత చర్మంపై దాన్ని రాయండి. అరగంట సేపు అలా వదిలేయండి, కడిగి మరియు చర్మాన్ని పొడిగా ఉంచండి. ప్రభావిత చర్మంపైన మార్పులు కనబడేవరకు రోజూ ఒకసారి చేయండి.
లైకోపీన్ ఉనికి కారణంగా టమాటాలు వాటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి. లైకోపీన్ సూర్యకాంతి ద్వారా దెబ్బతిన్న మీ చర్మంపై పిగ్మెంటేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది
ఎలా ఉపయోగించాలి?
మీరు టమాటాలను మిశ్రమం చెయ్యవచ్చు లేదా టమాటా గుజ్జు తీసుకొని ఆలివ్ ఆయిల్ యొక్క కొన్ని చుక్కలతో కలపవచ్చు. ఈ పేస్ట్ ను మచ్చలున్న చర్మం పైన రాయండి. మీరు దానిని 15-20 నిమిషాలు పాటు ఉంచి, కొద్దిగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు 2-3 వారాలలో మార్పులను చూడడాన్ని ప్రారంభిస్తారు.
యు. వి. వి కిరణాల నుంచి మూలికల ద్వారా చర్మం యొక్క రక్షణపై ఒక పత్రిక పేర్కొంది, విటమిన్ సి, ఈ మరియు ఒలేక్ ఆమ్లాలు అవోకాడోలలో అధికంగా ఉంటాయి, ఇవి యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో మరియు చర్మంపై పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సమర్ధవంతమైనవి
ఎలా ఉపయోగించాలి?
ఒక ముక్క అవోకాడోను కోసి ఒక మృదువైన ముద్దలా తయారు చేసుకోండి మరియు ఒక నెల పాటు రోజుకి రెండుసార్లు నల్ల మచ్చల పైన రాయండి. మీరు ఈ ముద్దకు కొంచెం తేనె మరియు పాలు కలపవచ్చు మరియు ఆరే వరకు చర్మంపైన ఉంచండి గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఒక నెల పాటు రోజుకి ఒకసారి ఇలా చేయండి.
2014 లో నిర్వహించిన ఒక అధ్యయనం బొప్పాయి మరియు దాని విత్తనాల యాంటిఆక్సిడెంట్ ప్రభావాలపై ఆధారపడి ఉంది. పచ్చి బొప్పాయిలో మృతకణాలను తొలగించే మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి, ఇది చర్మ నష్టం జరగకుండా మృత చర్మ కణాలను తీసివేయడంలో సహాయం చేస్తుంది. కాబట్టి, మీ చర్మంపై పిగ్మెంటేషన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి?
మీరు ఒక మూడు అంగుళాల బొప్పాయి ముక్క తీసుకొని, సగం టీస్పూన్ తేనె, ఒక చిటికెడు పసుపు , కొన్ని చుక్కల నిమ్మరసం మరియు పాలు జోడించవచ్చు. మీరు వీటన్నిటిని కలిపి ఒక ముద్దలా తయారు చేసి మరియు మచ్చలున్న ప్రాంతంలో ప్రతిరోజూ రోజుకు రెండుసార్లు రాయండి. ఈ పేస్ట్ ను 20 నిముషాల పాటు చర్మం పైన ఉంచి తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కనీసం ఒక నెల పాటు ఇలా చేయండి
ఒక అధ్యయనం, "ముసా సేపియంటాం పై తొక్క నుండి తీయబడిన యాంటీఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీస్", లో అరటిపండు చాలా మంచి సహజమైన ఎక్సఫోలియేటెర్ మరియు యాంటీఆక్సిడెంట్ అని కనుగొనబడింది. ఇది మృత చర్మ కణాలను తీసివేయడంలో సహాయపడుతుంది. అలా ఇది మృదువుగా పిగ్మెంటెడ్ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి?
మీరు సగం అరటిపండు (పండని), ఒక టీస్పూన్ తేనె, మరియు మీ చర్మం కోసం ఒక క్రీం లాంటి పేస్ట్ చేయడానికి ఒక టీస్పూన్ పాలు ఉపయోగించవచ్చు. అన్నిటిని కలపండి లేదా గుజ్జులా చేయండి అప్పుడది గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఉంటుంది. ప్రభావిత చర్మంపై రాసుకోవడానికి ముందు మీ చేతులను కడుక్కోండి. ఈ పేస్ట్ ను ఒక సమాంతరమైన పొరలా రాసుకోండి మరియు దానిని 30 నిమిషాలు పాటు ఉంచండి. ఫలితాలను చూడడానికి ఒక నెలపాటు ఈ మాస్కును ఉపయోగించండి. నెమ్మదిగా గోరువెచ్చని నీటితో కాఫేగండి మరియు మీ చర్మాన్ని పొడిగా ఉంచండి
హైపర్పిగ్మెంటేషన్ మీద సహజ పదార్ధాల ప్రభావం గురించి క్లినికల్ మరియు ఈస్తటిక్ డెర్మటాలజీ యొక్క పత్రిక పేర్కొంది, మల్బెర్రీలో, టైరోసిన్ యొక్క చర్యను నిరోధించడమే కాకుండా చర్మం దెబ్బతినడానికి కారణమైన ఫ్రీ ఆక్సిజన్ రాడికల్లను తొలగించడంలో సహాయపడే క్రియాశీలక భాగం ఉంది
ఎలా ఉపయోగించాలి?
మల్బరీ సారం ఇతర సుగంధ నూనెలతో ఒక చర్మపు సిరంగా లభిస్తుంది. మీరు ఉత్పత్తిని ఉపయోగించే సరైన మార్గాన్ని తెలుసుకోవటానికి ప్యాకేజీని చూడవచ్చు
డెర్మటాలజీ ఇండియన్ జర్నల్ చే ఒక పత్రిక, స్ట్రాబెర్రీలో మెలనిన్ సంశ్లేషణను సమర్ధవంతంగా నిరోధించే ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అందువల్ల, అవి చర్మం పై పిగ్మెంటేషన్ కు చికిత్స చేయడానికి స్ట్రాబెర్రీని ప్రత్యామ్నాయ పద్ధతిగా చేస్తాయి
ఎలా ఉపయోగించాలి?
మీరు 2-3 తాజా స్ట్రాబెర్రీలు తీసుకుని మెదిపి ముద్దలా చేయండి . దీనికి సగం టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. శుభ్రమైన చేతుల్లో ఈ పేస్ట్ తీసుకోండి మరియు ప్రభావిత చర్మంపై రాయండి. మీరు సుమారు 2-3 నిమిషాలు వృత్తాకార కదలికలతో మృదువుగా చర్మంపై మర్దన చేయాల్సి ఉంటుంది. దీని తరువాత, మీ చర్మంపై 15 నిమిషాలు ఉంచండి మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత, చర్మపు రంధ్రాలను మూసివేయడానికి చల్లని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఫలితాలను చూడడానికి కనీసం ఒక నెల పాటు ఈ పద్ధతిని ఉపయోగించండి.