పుచ్చకాయ అనేది ఒక పువ్వులు పూసే మొక్క, ఇది ఆఫ్రికాలో  పుట్టిందని నమ్ముతారు. ప్రపంచంలోని పొడి ప్రాంతాలలో పెరిగే చాలా పండ్లలాగే, పుచ్చకాయ కూడా చాలా హైడ్రేటింగ్ పండు మరియు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి, అదనపు బరువు పెరగకుండా పుచ్చకాయలును అధికంగా తినవచ్చు.

పుచ్చకాయల ప్రాధమిక ప్రయోజనం వాటి అధిక నీటి శాతంలో ఉంటుంది. అయితే, ఈ పండులో  ఇతర అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి అవి వ్యాధులను నిరోధిస్తాయి మరియు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

వివిధ రకాలైన పుచ్చకాయలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. అవి పెరిగిన వాతావరణం మరియు నిర్దిష్ట రకాలు మరియు జన్యువులపై ఆధారపడి లోపలి గుజ్జు యొక్క రంగు కూడా మారుతుంది. ఎర్ర రంగు గుజ్జు ఉన్న పుచ్చకాయల రుచి ఉత్తమముగా ఉంటుందని అని నమ్ముతారు.

పుచ్చకాయలకు మంచి వైద్యం చేసే ఏజెంట్గా గొప్ప చరిత్ర ఉందని తెలిస్తే మనకి ఆశ్చర్యం కలుగవచ్చు. పుచ్చకాయల సాగు యొక్క మొదటి రికార్డులు ఈజిప్టు సమాధులలో గుర్తించబడ్డాయి  అవి దాదాపు 4000 సంవత్సరాలకు ముందరి సమాధులు. అక్కడక్కడా ఉన్న ఆధారాల ప్రకారం గ్రీస్ మరియు రోమ్లలో పుచ్చకాయను 1వ శతాబ్దం BCE లో ఉపయోగించినట్లు తెలుస్తుంది. బైబిల్లో కూడా పుచ్చకాయ గురించి ప్రస్తావించబడింది. డియోస్కోరైడ్స్, ఒక ప్రసిద్ధ గ్రీకు వైద్యుని ప్రకారం, పుచ్చకాయలను మూత్రవిసర్జనకారిగా వాడవచ్చు మరియు వడ దెబ్బ (హీట్ స్ట్రోక్) లక్షణాలను తగ్గించడం కోసం పుచ్చకాయ యొక్క మందముగా ఉండే పై తొక్కను తలపై మీద పెట్టుకోవచ్చు.

ఈరోజుల్లో, ఈ పండు యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు చైనా. భారతదేశంలో, అనేక రాష్ట్రాల్లో పుచ్చకాయలు సాగు చేయబడుతున్నాయి, అయితే ఉత్తరప్రదేశ్, కర్నాటక మరియు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో పుచ్చకాయల మొత్తం ఉత్పత్తిలో 50% వాటాను కలిగి ఉన్నాయి.

పుచ్చకాయల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • శాస్త్రీయ నామం: సిట్రూలస్ లానాటస్ (Citrullus lanatus)
 • కుటుంబం: కుకుర్బిటేసే (Cucurbitaceae)
 • సాధారణ నామం: వాటర్ మీలోన్, తర్బుజ్
 • ఉపయోగించే భాగాలు: గుజ్జు, తొక్క, విత్తనాలు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: పుచ్చకాయలు ఆఫ్రికాకు చెందినవి, కానీ అవి ప్రపంచవ్యాప్తంగా వేడిగా ఉండే వాతావరణాల్లో పెరుగుతాయి.
 • శక్తి శాస్త్రం: శీతలీకరణ
 1. పుచ్చకాయ యొక్క పోషక వాస్తవాలు - Watermelon nutrition facts in Telugu
 2. పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు - Watermelon health benefits in Telugu
 3. పుచ్చకాయ వినియోగం - Watermelon use in Telugu
 4. పుచ్చకాయ దుష్ప్రభావాలు - Watermelon side effects in Telugu
 5. ఉపసంహారం - Takeaway in Telugu

పుచ్చకాయ 100 గ్రాలకు 30 కేలరీలను కలిగి ఉంటుంది. పుచ్చకాయ దాదాపు 92% నీటినే కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఇది అనేక ఇతర పోషకాలకు కూడా అద్భుతమైన మూలం. ఇది పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను మరియు విటమిన్ ఎ, బి1, బి2, బి3 వంటి వివిధ విటమిన్లను కలిగి ఉంటుంది.

యు.యస్.డి.ఎ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రా పుచ్చకాయ ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటుంది.

పోషక విలువ

100 గ్రాములకు

నీరు

91.45 గ్రా

శక్తి

30 కిలో కేలరీలు

కార్బోహైడ్రేట్

7.55 గ్రా

చక్కెరలు

6.2 గ్రా

ఫైబర్

0.4 గ్రా

కొవ్వులు

0.15 గ్రా

ప్రోటీన్

0.61 గ్రా

ఖనిజాల విలువ

100 గ్రాములకు

కాల్షియం

7 mg

ఐరన్

0.24 mg

మెగ్నీషియం

10 mg

ఫాస్ఫరస్

11 mg

పొటాషియం

112 mg

సోడియం

1 mg

జింక్

0.1 mg

మాంగనీస్

0.038 mg

విటమిన్లు

100 గ్రాములకు

విటమిన్ ఎ

28 μg

విటమిన్ బి1

0.033 mg

విటమిన్ బి2

0.021 mg

విటమిన్ బి3

0.178 mg

విటమిన్ బి5

0.221 mg

విటమిన్ బి6

0.045 mg

విటమిన్ సి

8.1 mg

విటమిన్ ఇ

0.05 mg

విటమిన్ కె

0.1 μg

కొవ్వు ఆమ్లాలలు

100 గ్రాములకు

సంతృప్త

0.016 గ్రా

మోనో అన్సాతురేటెడ్

0.037 గ్రా

పాలీఅన్సాతురేటెడ్

0.050 గ్రా

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

పుచ్చకాయ యొక్క చల్లని రసం మన దాహాన్ని అణచివేస్తుంది మరియు వేడిలో అలసిపోయిన మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. కానీ ఈ పండుకి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన శరీరానికి ప్రయోజనకరంగా ఉండే అత్యవసర ఖనిజాలు మరియు విటమిన్లను ఇది కలిగి ఉంటుంది. ఇవన్నీ కాకుండా, పుచ్చకాయ అనేది లైకోపీన్ అని పిలవబడే ఒక ఫైటోకెమికల్ యొక్క గొప్ప వనరు, ఇది పండు యొక్క ముదురు ఎరుపు రంగుకి బాధ్యత వహిస్తుంది. ఈ ఫైటోకెమికల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.ఈ క్రింద పుచ్చకాయల యొక్క అత్యంత సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని ఇవ్వబడ్డాయి.

 • రక్త పోటుకు: పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. అది సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది.
 • కండరాలకు: పుచ్చకాయ అథ్లెట్లు మరియు అధిక వ్యాయామాలు చేసేవారిలో కలిగే కండరాల నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది, ఓక అధ్యయనం పుచ్చకాయ రసం తగిన 24 గంటల లోపు కండరాల నొప్పులను తగ్గించిందని సూచించింది.
 • యాంటీఆక్సిడెంట్గా: అధ్యయనాలు పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. అది ఫ్రీ రాడికల్స్ వలన కలిగే డీఎన్ఏ నష్టాన్ని తగ్గిస్తుంది తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది .
 • మధుమేహం కోసం: లైకోపీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గిపోతాయి. అలాగే పుచ్చకాయ గింజలలో కొన్ని ప్రోటీన్లు ఉంటాయి అవి కూడా సమర్ధవంతగా గ్లూకోస్ స్థాయిలను తగ్గిస్తాయని ఒక అధ్యయనం తెలిపింది.
 • కంటి కోసం: పుచ్చకాయలో ఉండే లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి, అలాగే పుచ్చకాయ వయసు ఆధారిత మక్యూలర్ డిజెనెరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 • మూత్రపిండాలకు: పుచ్చకాయ ఒక మూత్రవిసర్జకారి (డైయూరేటిక్), ఇది శరీరం నుండి అదనపు సాల్ట్ లను మరియు టాక్సిన్లను తొలగించడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
 • గర్భిణీ స్త్రీలకు: పుచ్చకాయ గర్భిణీ స్త్రీలలో సంభవించే రుగ్మతలైన ప్రీఎక్లంప్సియా మరియు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం తగ్గిపోవడం వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
 • క్యాన్సర్ కోసం: పుచ్చకాయలో ఉండే లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్ కణాలకు వ్యతిరేకంగా చర్యలను చూపిందని నివేదించబడింది.

రక్తపోటు కోసం పుచ్చకాయ - Watermelon for blood pressure in Telugu

పరిశోధన ప్రకారం, పుచ్చకాయ యొక్క మందమైన తొక్కలో సిట్రుల్లిన్ అని పిలువబడే ఒక అమైనో యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి సిట్రిక్లైన్ ఎందుకు ముఖ్యమైనదంటే, సిట్రుల్లిన్ అధికంగా ఉండే ఆహారాలు సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటును మెరుగుపర్చడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 40 ప్రీహైపర్టెన్సివ్ (రక్తపోటు 120/80 మరియు 139/89 మధ్య ఉంటుంది) మరియు హైపర్టెన్సివ్ (రక్తపోటు 140/90 mm Hg లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది) వ్యక్తుల బృందానికి 6 వారాల పాటు 6 గ్రాముల పుచ్చకాయ సారం ఇవ్వబడింది. పరిశోధన ముగింపులో, పుచ్చకాయ సారం రక్తపోటు తగ్గించేందుకు సహాయం చేస్తుందని నిర్ధారించడం జరిగింది.

(మరింత సమాచారం: అధిక రక్తపోటు)

కండరాల సలుపుకు పుచ్చకాయ - Watermelon for sore muscles in Telugu

ముఖ్యంగా అథ్లెట్లు మరియు వ్యాయామాలు అధికంగా చేసే వ్యక్తులకు పుచ్చకాయ రసం శీతల పానీయాలకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రుల్లిన్ శాతం కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక క్లినికల్ అధ్యయనంలో, ఒక అథ్లెట్ల బృందానికి నిర్దిష్ట సమయంపాటు ప్రతి రోజూ 500 మీ.లిల పుచ్చకాయ రసంను ఇవ్వబడింది. ఈ అధ్యయనం పుచ్చకాయ రసం 24 గంటల లోపులో కండరాల నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉందని నివేదించింది.

(మరింత సమాచారం: కండరాల నొప్పి చికిత్స)

యాంటీఆక్సిడెంట్ గా పుచ్చకాయ - Watermelon as an antioxidant in Telugu

యాంటీఆక్సిడెంట్లు ఒక రకమైన బయోఆక్టివ్ సమ్మేళనాలు, ఇవి వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా మన శరీరాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వివిధ జీవక్రియా ప్రక్రియలు మరియు ఒత్తిడి వంటి పర్యావరణ కారకాలు కారణంగా శరీరంలో ఉత్పత్తి అయిన ఫ్రీ రాడికల్స్ ను అవి తొలగిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండడం అనేది ఆకాల వృద్ధాప్య లక్షణాల నుండి గుండె జబ్బులు, మధుమేహం, మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల వరకు చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

పుచ్చకాయలు, జామకాయలు, టమోటాలు వంటి పండ్లలో సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్గా ఉండే లైకోపీన్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను అంచనా వేయడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి,. అధిక ఫ్రీ రాడికల్స్ ఉండటం వలన కలిగే డీఎన్ఏ (DNA) నష్టాన్ని లైకోపీన్ తగ్గిస్తుందని క్లినికల్ అధ్యయనాలు సూచించాయి. ఈ డీఎన్ఏ నష్టం ఫ్రీ రాడికల్ సంబంధిత నష్టం యొక్క అంతర్లీన కారణం. ఒక ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్ (RCT) లో, లైకోపీన్ సప్లిమెంట్ యొక్క వివిధ పరిమాణాలు 8 వారాలపాటు 77 మందికి ఇవ్వబడ్డాయి. అధ్యయనం చివరిలో, లైకోపీన్ డీఎన్ఏ ఆక్సీకరణ నష్టాన్ని (DNA oxidative damage) తగ్గించిందని నిర్ధారించబడింది.

(మరింత సమాచారం: యాంటీఆక్సిడెంట్ ఆహార వనరులు)

మధుమేహం కోసం పుచ్చకాయ - Watermelon for diabetes in Telugu

మధుమేహం అనేది అధిక రక్త చక్కెర స్థాయిలు మరియు తరచుగా మూత్రవిసర్జన, అధిక ఆకలి మరియు బరువు సమస్యలు వంటి లక్షణాలను కలిగించే ఒక వ్యాధి. దీర్ఘకాలంలో, మధుమేహం హృదయ సంబంధ రుగ్మతలు, మూత్రపిండ వ్యాధులు వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు. అందువల్ల రక్త చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.

లైకోపీన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. జంతు నమూనాలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, లైకోపీన్ అధికంగా ఉండే పుచ్చకాయ తొక్క సారాలను ఇవ్వడం వలన అది రక్తంలో చక్కెర స్థాయిలలో తగ్గుదలను చూపించిందని తేలింది. మరోక అధ్యయనంలో పుచ్చకాయ విత్తనాలు కొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతముగా ఉంటాయని తెలిసింది.

కళ్ళకు పుచ్చకాయ ప్రయోజనాలు - Watermelon benefits for eyes in Telugu

పెద్ద వయసు వారిలో కంటిచూపు తగ్గిపోవడం చాలా సాధారణ సమస్య. 60 సంవత్సరాల వయసు పైబడిన వారు వయస్సు-సంబంధ మాక్యులార్ డిజెనరేషన్ (AMD, age-related macular degeneration) అని పిలవబడే సమస్య ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటారు. మక్యులా దెబ్బతినడం వలన మెక్యులర్ డిజెనరేషన్ సంభవిస్తుంది. మక్యులా అనేది రెటీనా వద్ద ఒక భాగం మరియు ఇది దెబ్బతింటే దృష్టికి పూర్తిగా నష్టం కలిగించవచ్చు. విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ వంటి విటమిన్లతో పాటు కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా వయసు-సంబంధిత కంటి సమస్యలను నిరోధించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. లైకోపీన్ యొక్క అత్యంత ముఖ్య వనరులలో పుచ్చకాయలు ఒకటి. వాటిలో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది మరియు విటమిన్ ఇ కూడా కొద్దిగా ఉంటుంది. అందువల్ల, పుచ్చకాయను క్రమముగా తీసుకోవడం వలన వయస్సు సంబంధిత కంటి సమస్యలను నివారించడానికి మరియు కళ్లును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

(మరింత సమాచారం: మాక్యులర్ డిజెనరేషన్ నివారణ)

పెప్టిక్ అల్సర్ కోసం పుచ్చకాయ - Watermelon for peptic ulcer in Telugu

పెప్టిక్ అల్సర్ అంటే కడుపులోని లోపలి పొరకు వాపు ఏర్పడడం. పెప్టిక్ అల్సర్ ప్రధానంగా కడుపుని ప్రభావితం చేస్తుంది మరియు అరుదుగా ఇది కొన్నిసార్లు ఎసోఫేగస్ ను కూడా ప్రభావితం చేస్తుంది, పెప్టిక్ అల్సర్ కు వివిధ కారణాలు ఉన్నప్పటికీ, ఆక్సీకరణ నష్టం కూడా ఈ సమస్యకు ఒక కారణం కావచ్చు. ఇన్ వివో అధ్యయనాలు ఒక యాంటీఆక్సిడెంట్గా , లైకోపీన్ గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని సూచిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, లైకోపీన్ సప్లీమెంట్లను నోటి ద్వారా తీసుకోవడం వలన అవి గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలిసింది.

అయితే, ఈ అధ్యయనం లైకోపీన్ మీద మాత్రమే నిర్వహించబడింది పుచ్చకాయ మీద కాదు. పెప్టిక్ అల్సర్ యొక్క చికిత్స కోసం పుచ్చకాయలోని లైకోపీన్ యొక్క సమర్థతను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమవుతాయి.

మూత్రపిండాలు కోసం పుచ్చకాయ - Watermelon for kidneys in Telugu

మూత్రపిండాలు మన శరీరంలో కీలక అవయవాలు ఎందుకంటే అవి రక్తములో నుండి వ్యర్ధాలను వేరు చేస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం, మరియు మూత్ర నాళాల సమస్యలు వంటి వివిధ సమస్యలు మూత్రపిండాల మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చు. చికిత్స చేయని మూత్రపిండ సమస్యలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీయవచ్చు మరియు తీవ్రమైన సందర్భాల్లో, మూత్రపిండాలు వైఫల్యమవుతాయి. సాంప్రదాయకంగా, పుచ్చకాయను మూత్రవిసర్జనకారిగా (diuretic) పిలుస్తారు. అంటే ఇది శరీరం నుండి అదనపు సాల్ట్స్ ను మరియు టాక్సిన్లను తొలగిస్తుంది మరియు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఓక కేస్ స్టడీలో, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి యొక్క తరువాతి దశలో ఉన్న ఒక 60 ఏళ్ల వ్యక్తి పుచ్చకాయను క్రమముగా ఇవ్వడం వలన పరిస్థితిలో కొద్దిగా మెరుగుదల చూపించాడు. ఏదేమైనప్పటికీ, ఇది ఒక కేసు మాత్రమే మరియు మూత్రపిండ వ్యాధులను నివారించడంలో మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుచడంలో పుచ్చకాయ యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి.

గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ - Watermelon for pregnant women in Telugu

పుచ్చకాయలలో ఉండే లైకోపీన్ కు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో లైకోపీన్ వినియోగం యొక్క ప్రభావాలను అర్థం చేసుకోవటానికి మొదటిసారి గర్భం దాల్చిన 251 మంది మహిళల మీద ఒక అధ్యయనం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలలో సంభవించే రెండు ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం దృష్టి పెట్టింది అవి, ప్రీఎక్లంప్సియా మరియు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం (intrauterine growth retardation). ప్రీఎక్లంప్సియా అనేది గర్భిణీ స్త్రీలలో రక్తపోటు పెరగడం, ఇది ఎక్కువగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గమనింపబడుతుంది, ఇది బిడ్డ పుట్టక ముందు లేదా తర్వాత కొన్ని సమస్యలకు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో బిడ్డ సాధారణ బరువు కంటే తక్కువగా ఉన్నపుడు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం అనేది పరిస్థితి ఏర్పడుతుంది. అధ్యయనం ప్రకారం, లైకోపీన్ సప్లీమెంట్లను నోటి ద్వారా (ఓరల్ గా) ఇవ్వడం వలన అది మొదటిసారి గర్భందాల్చిన స్త్రీలలో ప్రీఎక్లంప్సియా మరియు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం అనే రెండింటి అవకాశాలను తగ్గిస్తుందని కనుగొనబడింది.

అల్జీమర్స్ కోసం పుచ్చకాయ - Watermelon for Alzheimer's in Telugu

అల్జీమర్స్ డిసీజ్ (AD) అనేది ఒక మెదడు సంబంధిత రుగ్మత దీనిలో రోగి తన జ్ఞాపక శక్తిని కోల్పోవడం ప్రారంభమవుతుంది మరియు క్రమంగా తన సాధారణ పనులు చేసుకోగల సామర్ధ్యాన్ని కూడా కోల్పోతాడు. ఈ వ్యాధి యొక్క కారణాలను శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, అల్జీమర్స్ అనేది సాధారణంగా జన్యులు మరియు జీవనశైలితో సంబంధం కలిగి ఉంటుంది. కెరోటినాయిడ్ లైకోపీన్ అల్జీమర్స్ వ్యాధి యొక్క ప్రారంభం మరియు పురోగతిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించగల లైకోపీన్ యొక్క సామర్ధ్యం దీనికి కారణం. లైకోపీన్ పుష్కలంగా ఉండే పుచ్చకాయల వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని తగ్గించవచ్చని మరో అధ్యయనం సూచిస్తోంది.

పుచ్చకాయ క్యాన్సర్ నిరోధిస్తుంది - Watermelon prevents cancer in Telugu

క్యాన్సర్తో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం పుచ్చకాయల్లోని లైకోపీన్ ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. లైకోపీన్ యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీనిని ఒక అద్భుతమైన యాంటీక్యాన్సర్ ఏజెంట్గా చేశాయని సూచించబడింది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే కణాల మరియు డీఎన్ఏ నష్టాన్ని తగ్గించడం ద్వారా క్యాన్సర్ అభివృద్ధిని నిరోధిస్తుంది. అదనంగా, లైకోపీన్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గిస్తుందని మరియు క్యాన్సర్ కణాలలో అపోప్టోసిస్ (కణ మరణం[సెల్ డెత్])ను ప్రేరేపిస్తుందని కూడా కనుగొనబడింది. ఈసోఫేజియల్ కాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, మరియు రొమ్ము క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ కణాల మీద పుచ్చకాయ యొక్క లైకోపీన్ వ్యతిరేక ప్రభావాలను చూపిందని నివేదించబడింది.

దోసకాయలు మరియు గుమ్మడికాయలు ఉండే కుటుంబానికే పుచ్చకాయలు కూడా చెందుతాయి. అందువల్ల, పుచ్చకాయ ఒక పండుగా మరియు ఒక కూరగాయగా  రెండు విధాలుగా పరిగణిస్తారు. మనలో చాలామంది ఈ పండు యొక్క గుజ్జును మాత్రమే తినడానికి ఇష్టపడతారు అయితే, మొత్తం పండు కూడా తినదగినదే. అంటే విత్తనాలు మరియు పండ్ల యొక్క బయటి ఆకుపచ్చ భాగము కూడా దీనిలో ఉంటుంది. వాస్తవానికి, హిందీలో మగజ్ అని కూడా పిలవబడే పుచ్చకాయ విత్తనాలు, కేకులు, మిఠాయిలు, మౌత్ ఫ్రెషనర్లు మరియు స్వీట్లు మరియు చిరుతిండ్లలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఈ గింజలను వేయించి మరియు వాటి పై తొక్కలను తీసివేస్తే  వాటిని నేరుగా తేనవచుతినవచ్చు. పుచ్చకాయ యొక్క తొక్కను కూరలను మరియు జామ్ తయారీలో ఉపయోగించవచ్చు.

రసాలూరుతూ ఉండే మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే పుచ్చకాయ అంటే చాలామందికి ఇష్టమైననప్పటికీ, దీనిలో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

 1. పుచ్చకాయ హైపర్కల్మియాకు దారితీస్తుంది
  హైపర్కలెమియా అంటే శరీరంలో పొటాషియం స్థాయిలు అధికమవ్వడం వలన కలిగే తీవ్రమైన వైద్య పరిస్థితి, ఇది పొటాషియం అధికంగా తీసుకోవడం వలన లేదా దానిని తొలగించడంలో శరీరంలో అసమర్థత ఏర్పడడం వలన కానీ సంభవిస్తుంది. పొటాషియం అధిక స్థాయిలు కండరాలకు లేదా మూత్రపిండాలు హాని కలిగించవచ్చు. అధిక స్థాయిలను మించిపొతే గుండె పనితీరుకు కూడా ఆటంకాలు కలిగించవచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది ప్రాణాంతకమవుతుంది. పుచ్చకాయలో పొటాషియం (100 గ్రామూలకు 112 mg ఉంటుంది) సమృద్ధిగా ఉన్నందున, అతిగా తినడం వలన శరీరంలో పొటాషియం స్థాయి పెరుగుదలకు దారితీయవచ్చు.

 2. పుచ్చకాయకు అలెర్జీ ఉండడం
  క్యారెట్లు వంటి కూరగాయలకు అలెర్జీ ఉన్న వారికి పుచ్చకాయ అలెర్జీ కూడా ఉండవచ్చు . పుచ్చకాయలలో ప్రొఫిలిన్ (profilin) మరియు మాలెట్ డిహైడ్రోజినేస్ (malate dehydrogenase) వంటి కొన్ని అలెర్జిన్లు ఉంటాయి అవి కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలు కలిగిస్తాయి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

వయస్సు మరియు లింగం తో సంబంధం లేకుండా ఎవరైనా పుచ్చకాయను క్రమంగా తీసుకోవచ్చు. ఈ వేసవి పండు దాని రుచికి మాత్రమే ప్రియమైనది కాదు, దీనిలో లాభదాయకమైన పోషకాలు ఉండడం వలన అది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది మూత్రపిండములు, కళ్ళు, జీర్ణ అవయవాలు మరియు గుండె వంటి వివిధ అవయవాల సరైన పనితీరుకు సహాయపడుతుంది. ఏదేమైనా, ఈ పండును అధికంగా తినడం కూడా మంచిది కాదు. అలాగే, క్యారెట్ లేదా ఇతర కూరగాయలకు అలెర్జీగా ఉన్న వ్యక్తులు ఈ పండును తినే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి.

వనరులు

 1. Ambreen Naz et al. Watermelon lycopene and allied health claims . EXCLI J. 2014; 13: 650–660. PMID: 26417290
 2. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09326, Watermelon, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 3. United States Department of Agriculture Agricultural Research Service. Watermelon Packs a Powerful Lycopene Punch. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 4. Rimando AM, Perkins-Veazie PM. Determination of citrulline in watermelon rind. J Chromatogr A. 2005 Jun 17;1078(1-2):196-200. PMID: 16007998
 5. Mahboobi S et al. Effect of L-citrulline supplementation on blood pressure: a systematic review and meta-analysis of randomized controlled trials. J Hum Hypertens. 2019 Jan;33(1):10-21. PMID: 30206378
 6. Massa NM et al. Watermelon extract reduces blood pressure but does not change sympathovagal balance in prehypertensive and hypertensive subjects. Blood Press. 2016 Aug;25(4):244-8. PMID: 26947668
 7. Martha P. Tarazona-Díaz et al. Watermelon Juice: Potential Functional Drink for Sore Muscle Relief in Athletes. J. Agric. Food Chem.201361317522-7528
 8. Ratnam DV, et al. Role of antioxidants in prophylaxis and therapy: A pharmaceutical perspective. J Control Release. 2006.
 9. Devaraj S, et al. A dose-response study on the effects of purified lycopene supplementation on biomarkers of oxidative stress. J Am Coll Nutr. 2008.
 10. National Health Portal [Internet] India; Preeclampsia
 11. Clautilde Mofor Teugwa et al. Anti-hyperglycaemic globulins from selected Cucurbitaceae seeds used as antidiabetic medicinal plants in Africa . BMC Complement Altern Med. 2013; 13: 63. PMID: 23506532
 12. National Eye Institute. Facts About Age-Related Macular Degeneration. National Institutes of Health
 13. Morris MS, et al. Intake of zinc and antioxidant micronutrients and early age-related maculopathy lesions. Ophthalmic Epidemiol. 2007 Sep-Oct.
 14. Erica N. Story et al. An Update on the Health Effects of Tomato Lycopene . Annu Rev Food Sci Technol. 2010; 1: 10.1146/annurev.food.102308.124120. PMID: 22129335
 15. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Peptic Ulcer Disease and H. pylori.
 16. Boyacioglu M, et al. The effects of lycopene on DNA damage and oxidative stress on indomethacin-induced gastric ulcer in rats. Clin Nutr. 2016.
 17. Zahra Taheri et al. Lycopene and kidney; future potential application . J Nephropharmacol. 2015; 4(2): 49–51. PMID: 28197476
 18. National Institute on Aging [internet]: US Department of Health and Human Services; Alzheimer's Disease Fact Sheet
 19. Walter A. Parham et al. Hyperkalemia Revisited . Tex Heart Inst J. 2006; 33(1): 40–47. PMID: 16572868
 20. Lehnhardt A, Kemper MJ. Pathogenesis, diagnosis and management of hyperkalemia. Pediatr Nephrol. 2011 Mar;26(3):377-84. PMID: 21181208
 21. Pastor C, et al. Identification of major allergens in watermelon. Int Arch Allergy Immunol. 2009.
Read on app