ఇటివలి సంవత్సరాలలో ఆపిల్ సైడర్ వినెగార్ అత్యంత ప్రజాదరణ పొందింది మరియు పోషక విలువల సూపర్ ‌స్టార్‌గా ఇది పరిగణించబడింది.  వివిధ గృహసంబంధ సమస్యలు మరియు వంటకు శతాబ్దాలుగా ఇది ఉపయోగించబడుతుంది.  ప్రపంచమంతటా సూపర్‌మార్కెట్లు మరియు కిరాణా దుకాణాలలో వివిధ రకాల వినెగార్‌లు అందుబాటులో ఉన్నాయి, అయితే వాటన్నింటిలో ఆపిల్ సైడర్ వినెగార్  బాగా ప్రాచుర్యం పొందింది.   ఇది పోషకాలకు ఒక పవర్‌ హౌస్‌ వంటిది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంది.

ఆపిల్ సైడర్ వినెగార్ (ఎ‌సి‌వి అని కూడా పిలుస్తారు) అన్నది ఒక రకమైన వినెగార్, ఆపిల్ పళ్ల రసాన్ని పులియబెట్టడం ద్వారా ఇది తయారుచేయబడుతుంది.  ఆపిల్ పండ్లను వాటి నుండి రసం తీయడం కోసం నలుగ గొడతారు.  ఈ ఆపిల్ రసానికి యీ‌స్ట్‌ను జోడిస్తారు, ఇది పండ్ల చక్కెరలను ఆల్కహాల్‌గా మారుస్తుంది.  ఈ ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు.  అప్పుడు బ్యాక్టీరియా ఆల్కహాల్‌కు చేర్చబడుతుంది, ఇది క్రమంగా దానిని ఎసిటిక్ ఆమ్లంగా మారుస్తుంది.  ఎసిటిక్ ఆమ్లం మరియు మ్యాలిక్ ఆమ్లం కలిసి వినెగార్‌కు పుల్లటి రుచిని మరియు ప్రత్యేకమైన వాసనను ఇస్తుంది.  ఇది లేత పసుపు-నారింజ రంగు నుండి మధ్యస్థ పసుపు-నారింజ రంగును కలిగి ఉంటుంది.  చట్నీలు, మారినే‌డ్స్, సలాడ్ అలంకరణ, ఆహార పదార్థాల సంరక్షణకారులు మొదలైన వాటిలో ఇది ఉపయోగించబడుతుంది.

మార్కెట్లో లభించే ఆపిల్ సైడర్ వినెగా‌ర్‌లో అత్యధిక భాగం, ఒక స్పష్టమైన రూపం కలిగిఉండి మరియు అన్ని రకాల బ్యాక్టీరియాలు చంపబడి, అది సుదీర్ఘ జీవితకాలం ఉండడానికి, ఈ రసం ఫిల్టర్ చేయబడి మరియు సూక్ష్మ క్రిమిరహితంగా చేయబడుతుంది.  కానీ అది నిజమైన ఆపిల్ సైడర్ వినెగార్ కాదు.  ప్రామాణికమైన వినెగార్ అన్నది, తన మాతృకతో పాటుగా ఉంటుంది.  ముడి వినెగార్ లేదా మాతృకను కలిగిఉండే వినెగార్ యొక్క రకాలు (వినెగార్‌ను తయారుచేయడానికి ఉపయోగించే అసలు బ్యాక్టీరియా సంస్కృతి), పోషకాలు మరియు బ్యాక్టీరియాతో తయారు చేయబడిన మాతృక సంస్కృతిని మీరు చూడవచ్చు.   దానిని నిల్వ చేసిన బాటిల్ దిగువ భాగమున ఇది కనిపిస్తుంది మరియు వినెగార్ ఒక మసక రూపాన్ని కలిగిఉంటుంది.  ఇది సేంద్రియమైనది, సూక్ష్మక్రిమిలతో కూడిన ఆపిల్ సైడర్ వినెగార్ మరియు అనేక ఔషధ ఉపయోగాలను కలిగిఉంటుంది.

ప్రపంచం‌లో ఆరోగ్య స్పృహ కలిగిన ప్రజలందరిలో ఆపిల్ సైడర్ వినెగార్ ఎంతో ప్రాచుర్యం పొందింది.  ఇది, రక్తపోటు తగ్గించడం, క్యా‌న్సర్ యొక్క ప్రమాదాన్ని తగ్గించడం మరియు బరువు తగ్గడం వంటి వాటిని కలిగిన వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉందని నమ్ముతారు.

ఆర్యన్లు అని పిలువబడే ఒక పురాతన సంచార తెగ, ఆపిల్ పండ్ల నుండి ఒక పుల్లని వైన్‌ను తయారుచేసింది మరియు ఇది పళ్ల రసం యొక్క ఒక పూర్వగామిగా పరిగణించబడుతుంది.  ఆర్యన్ల నుండి, పళ్ల రసం గ్రీకులు మరియు రోమన్లకు వెళ్లింది.  జపనీయుల సమురాయ్ ‌యోధులు, అధికమైన శక్తి మరియు ఓర్పు కోసం ఆపిల్ సైడర్ వినెగార్‌ను త్రాగేవారు అని నమ్ముతారు.

 1. ఆపిల్ సైడర్ వినెగార్ పోషక విలువలు - Apple cider vinegar nutrition facts in Telugu
 2. ఆపిల్ సైడర్ వినెగార్ ఆరోగ్య ప్రయోజనాలు - Apple cider vinegar health benefits in Telugu
 3. ఆపిల్ సైడర్ వినెగార్ దుష్ప్రభావాలు - Apple cider vinegar side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

ఆపిల్ సైడర్ వినెగార్ 21 కేలరీలను కలిగిఉంటుంది.  ఇది ఎటువంటి కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ లేదా ఫైబర్‌లను కలిగి ఉండదు.  ఇది ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, మరియు పొటాషియం లను కూడా సమృద్ధిగా కలిగిఉంటుంది. మీ ఆహారానికి ఒక అద్భుతమైన రుచిని జోడించడానికి ఇది ఒక గొప్ప మార్గం, అది మీరు తీసుకునే కేలరీలను ఏ మాత్రం ఎక్కువగా పెంచదు.

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. ఆపిల్ సైడర్ వినెగార్ క్రింద ఇవ్వబడిన విలువలను కలిగిఉంటుంది:

పోషకాలు విలువ, 100 గ్రా.లకు
నీరు 93.81 గ్రా.
శక్తి 21 కి.కేలరీలు
బూడిద 0.17 గ్రా.
కార్బోహైడ్రేట్ 0.93 గ్రా.
చక్కెరలు 0.4 గ్రా.
గ్లూకోజ్ 0.1 గ్రా.
ఫ్రక్టోజ్ 0.3 గ్రా.
ఖనిజాలు  
కాల్షియం 7 మి.గ్రా.
ఇనుము 0.2 మి.గ్రా.
మెగ్నీషియం 5 గ్రా.
ఫాస్ఫరస్ 8 మి.గ్రా.
పొటాషియం 73 మి.గ్రా.
సోడియం 5 గ్రా.
జింక్ 0.04 మి.గ్రా.
కాపర్ 0.008 మి.గ్రా.
మాంగనీస్ 0.249 మి.గ్రా.
 • బరువు తగ్గడం కోసం: ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క బాగా తెలిసిన ఉపయోగాల్లో, బరువు తగ్గించే ప్రక్రియలో దాని యొక్క సహాయం ఒకటి.  ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని అణచివేస్తుంది మరియు అంతర్గత కొవ్వు కంటెంట్‌ను తగ్గిస్తుంది, ఇది ఊబకాయం యొక్క నిర్వహణలో సహాయపడుతుంది.
 • డయాబెటిస్ కోసం: ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క మరొక ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే, భోజనం తర్వాత దానిని తీసుకున్నప్పుడు, రక్తం‌లో చక్కెర స్థాయిలను నియంత్రించడం‌లో సహాయపడుతుంది. 
 • చెడు శ్వాస కోసం: ఆపిల్ సైడర్ వినెగార్, నోటి కుహరం యొక్క pH విలువను మారుస్తుంది కాబట్టి చెడు శ్వాసను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది బ్యాక్టీరియా యొక్క వృద్ధికి సహాయకారిగా ఉండదు.
 • చర్మం మరియు జుట్టు కోసం: పి. చర్మ రోగాలపై పెరుగుదలను నియంత్రించడం ద్వారా ఆపిల్ సైడర్ వినెగార్ మచ్చలు లేదా కురుపులను తగ్గిస్తుంది, ఇది కారణమైన జీవిగా ఉంటుంది.  జుట్టు పైన దీని యొక్క ఉపయోగం, జుట్టుకు మెరుపును మరియు  జుట్టు యొక్క ప్రకాశమును ప్రోత్సహిస్తుంది, అలాగే తలలో దురద, చుండ్రు, తల పొడిగా మారడాన్ని నివారిస్తుంది మరియు తలలో పేలను నిర్వహిస్తుంది.
 • ఇతర ప్రయోజనాలు: ఆపిల్ సైడర్ యొక్క ఉపయోగం, జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది మరియు అనేక సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా కూడా ఇది ఒక చర్యను కలిగిఉంది, ఇది చెవి ఇన్‌ఫెక్షన్లు మరియు గోళ్ల ఇన్‌ఫెక్షన్లు సోకడాన్ని తగ్గించడం‌లో సహాయపడుతుంది.  ఇంకా, మీ శరీరం ద్వారా ఖనిజాల శోషణను మెరుగుపరచడం‌లో ఇది సహాయపడుతుంది.
 • క్యా‌న్సర్ కోసం: ఆపిల్ సైడర్ వినెగార్ కణతుల పరిమాణాన్ని తగ్గించడం‌లో సహాయం చేస్తుంది మరియు గ్యాస్ట్రిక్‌ క్యా‌న్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యం కలిగిఉంది.
 • గుండె కోసం: ఆపిల్ సైడర్ వినెగార్ రక్తం‌లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు హృదయ సంబంధ రుగ్మతల నివారణను సులభతరం చేస్తుంది.

ఖనిజాల శోషణ కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for mineral absorption in Telugu

వినెగార్ అన్నది ప్రెంచ్ పదం, విన్ ఐగర్ నుండి ఉద్భవించింది,  “పుల్లని వైన్” అని దాని అర్థం. ఆపిల్ సైడర్ వినెగార్ తయారుచేయడానికి ఒక రెండు-దశల ప్రక్రియను ఉపయోగిస్తారు.  మొదటగా, నలుగ గొట్టబడిన ఆపిల్ పండ్లను ఈస్ట్ సమక్షం‌లో ఉంచుతారు, ఇది చక్కెరలను ఆల్కహాలుగా పులియబెడుతుంది.  తర్వాత, ఎసిటిక్ ఆమ్లంగా ఏర్పడడానికి, ఆల్కహాల్ ద్రావణాన్ని మరింత పులియబెట్టడం కోసం, ఆ ద్రావణానికి బ్యాక్టీరియాను జోడిస్తారు.  వినెగార్ యొక్క గాఢమైన వాసన మరియు పుల్లని రుచికి ఎసిటిక్ ఆమ్లం బాధ్యత వహిస్తుంది.  ఆహార పదార్థాల నుండి ఖనిజాలు గ్రహించడానికి మీ శరీర సామర్థ్యాన్ని పెంచడానికి ఎసిటిక్ ఆమ్లం సామర్థ్యం కలిగిఉంటుంది.  ఎసిటిక్ ఆమ్లం రక్తపోటును తగ్గించే సామర్థ్యం కలిగి ఉందని అదనపు అధ్యయనాలు చూపిస్తున్నాయి.

సేంద్రియ, వడకట్టని ఆపిల్ సైడర్ వినెగార్ “మాతృక”కలిగిఉంటుంది, ఇది ప్రొటీన్లు, ఎంజైములు, మరియు స్నేహపూర్వక బ్యాక్టీరియా యొక్క పోగులతో నిండి ఉంటుంది.  ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క అస్పష్టతకు “మాతృక” కారణముగా ఉంది.  శుద్ధిచేసిన ఆపిల్ సైడర్‌లో లేనటువంటి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను మాతృక ఇస్తుంది కాబట్టి, మాతృకను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. 

ఆపిల్ సైడర్ వినెగార్ యాంటిమైక్రోబయల్ లక్షణాలు - Apple cider vinegar antimicrobial properties in Telugu

యాంటిబయాటిక్-నిరోధక బ్యాక్టీరియా ప్రపంచ వ్యాప్తంగా వేగవంతంగా మారిన ప్రధాన సమస్యగా మారింది. వ్యాధికారకాల సంఖ్యలో ఒక స్థిరమైన పెరుగుదల ఉంది, అది బహుళ ఔషదాల నిరోధకతను చూపిస్తుంది.  వ్యాధికారకాలను మరియు హానికరమైన బ్యాక్టీరియాను చంపడం‌లో వినెగార్ సహాయం చేస్తుంది.  తెరువబడిన గాయాలను శుభ్రం చేయడానికి మరియు మరలా ఇన్‌ఫెక్షన్ సోకకుండా నివారించేం‌దుకు వాటికి కట్టు కట్టడానికి, ఆధునిక ఔషధానికి తండ్రిగా పిలువబడే, హిప్పోక్రేట్స్, వినెగా‌ర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తుంది.  చారిత్రాత్మకంగా, 5000 సంవత్సరాలకు పైగా వినెగార్ ఉత్పత్తి చేయబడడం మరియు వాణిజ్య వస్తువుగా విక్రయించబడడం జరుగుతోంది.  ఆపిల్ సైడర్ వినెగార్ శుభ్రపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది మరియు చెవి న్‌ఫెక్షన్లుపులిపిర్లుlపేనులు వంటి వాటికి క్రిమి సంహారిణిగా మరియు గోళ్ల ఫంగస్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది. వినెగార్ ఒక ఆహార సం‌రక్షిణిగా కూడా ఉపయోగించబడుతుంది.  ఆహారం‌ పైన పెరుగుతూ మరియు ఆహారాన్ని పాడు చేస్తున్న బ్యాక్టీరియాను ఇది అడ్డుకుంటుంది.  ఆపిల్ సైడర్ వినెగార్ .కోలిఎస్. ఆరియస్ మరియు సిఆల్బికా‌న్స్ పైన ప్రత్యక్షంగా బహుళ యాంటిమైక్రోబయల్ ప్రభావాలను కలిగిఉందని ఒక అధ్యయనం నిర్ధారించింది, ఇది మానవులలో అంటువ్యాధులకు కారణమవుతుంది.

డయాబెటిస్ కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for diabetes in Telugu

వినెగార్ యొక్క అత్యంత విజయవంతమైన ఉపయోగం ఇప్పటి వరకూ టైప్‌ 2 డయాబెటిస్ రోగులలో కనిపించింది.  టైప్‌ 2 డయాబెటిస్ అన్నది ఒక సమస్య, మీ రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయి కంటే పెరుగుటకు అది కారణమవుతుంది.   వినెగార్‌‌ను భోజనానికి లేదా డిన్నర్‌కు ముందు తీసుకోవడం అన్నది రక్తం‌లోని చక్కెర స్థాయిల్ని తగ్గించడం‌లో గణనీయమైన ప్రభావం కలిగిఉందని ఒక పరిశోధన చూపించింది.  డయాబెటిక్ వ్యక్తులు నిద్రపోయే సమయం‌లో వినెగార్‌ను తీసుకోవడం, నిరాహార గ్లూకోజ్ స్థాయిల్ని 4% శాతం వరకూ తగ్గించిందని తదుపరి అధ్యయనాలు కూడా నిరూపించాయి.

రక్తం‌లో చక్కెరను క్రమబద్ధీకరించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం, శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్లు మరియు చక్కెరను తీసుకోకుండా ఆపడం, అయితే ఆపిల్ సైడర్ వినెగార్ కూడా రక్తం‌లో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు చాలా శక్తివంతమైన ప్రభావం కలిగిఉంది.

(మరింత చదవండి: డయాబెటిస్ లక్షణాలు)

బరువు తగ్గడం కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for weight loss in Telugu

ఎసిటిక్ ఆమ్లం (AcOH), ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క ప్రధాన భాగం, ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును అణచివేస్తుందని ఇటీవలే కనుగొనబడింది.  ఊబకాయం గల జపాన్ ప్రజల శరీరం‌లోని కొవ్వును తగ్గించడం పైన  వినెగార్‌ను తీసుకోవడం వలన కలిగే ప్రభావాలను విశ్లేషించడానికి ఒక పరిశోధన నిర్వహించబడింది.   శరీర బరువు, బిఎ‌మ్‌ఐ, నడుము చుట్టుకొలత, విసెరల్ కొవ్వు ప్రాంతం, మరియు సీరం ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, ఆపిల్ సైడర్ వినియోగించే ప్రజలలో గణనీయంగా తగ్గాయని ఊహించబడింది.  వినెగార్‌ను రోజువారీ తీసుకోవడం  ఊబకాయం నివారణలో మరియు శరీరం‌ యొక్క కొవ్వు తగ్గించడం‌లో ఉపయోగకరంగా ఉండవచ్చు. ఆపిల్ సైడర్ వినెగార్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది మరియు ప్రజలు తక్కువగా తినటానికి సహాయపడుతుంది, అది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ఆపిల్ సైడర్ వినెగార్ యాంటిక్యా‌న్సర్ లక్షణాలు - Apple cider vinegar anticancer properties in Telugu

క్యా‌న్సర్ అన్నది ఒక వ్యాధి, ఇది కణాల యొక్క నియంత్రణ లేని పెరుగుదల కారణంగా వర్గీకరించబడుతుంది. .

వినెగార్ యాంటిక్యా‌న్సర్ లక్షణాలను కలిగిఉందని వివిధ అధ్యయనాలు చూపిస్తున్నాయి మరియు క్యా‌న్సర్ కణాలను నాశనం చేస్తుంది మరియు కణితులను తగ్గిస్తుంది.  ఎసిటిక్ ఆమ్లం కణాల మరణాన్ని వెంటనే ప్రేరేపిస్తుందని నిర్వహించబడిన కొన్ని ప్రయోగాలు ఊహించాయి.  ఇది చాలా శక్తివంతమైన యాంటి కార్సినోజెనిక్ (క్యా‌న్సర్‌ను నిరోధిస్తుంది) లక్షణాలను కలిగిఉంది.  ఎసిటిక్ ఆమ్లం యొక్క సమయోచితమైన అప్లికేషన్  గ్యాస్ట్రిక్ క్యా‌న్సర్మరియు బహుశా ఇతర క్యా‌న్సర్ల యొక్క చికిత్సలకు ఒక సాధ్యమైన విధానం కావచ్చు. అయితే, ఇంతవరకు నిర్వహించిన అన్ని అధ్యయనాలు మరియు పరిశోధనలు ప్రయోగశాల-ఆధారిత లేదా జంతు ఆధారిత నమూనాలుగా ఉన్నాయి.  క్లినికల్ అధ్యయనాలు లేనందు వలన, మానవులలో ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క యాంటి‌క్యా‌న్సర్ సామర్థ్యాన్ని నిర్ధారించడం కష్టం.

చెడు శ్వాస కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for bad breath in Telugu

ఆమ్ల పరిస్థితులలో బ్యాక్టీరియా పెరుగదు, కాబట్టి ఒక వెనిగార్ మౌత్‌వాష్ బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడం‌లో సహాయపడవచ్చు.  ఆమ్లత్వాన్ని pH లో కొలుస్తారు.  7.0 కంటే క్రింద pH విలువ ఉండే పర్యావరణాల్ని ఆమ్లాలుగా పరిగణిస్తారు, అయితే, 7.0 కంటే పైన pH విలువ ఉండే పర్యావరణాల్ని క్షారాలుగా పిలుస్తారు.  బ్యాక్టీరియా సాధారణంగా న్యూట్రోఫైల్స్‌గా ఉంటాయి, అనగా అవి 7.0 కు దగ్గరగా తటస్థ  pH స్థాయిలో ఉత్తమంగా పెరుగుతాయి.  వినెగార్ ప్రకృతిలో ఆమ్ల స్వభావాన్ని కలిగిఉంటుంది కాబట్టి, ఇది బ్యాక్టీరియా పెరగడానికి ఒక అనుచిత పర్యావరణంగా మారుతుంది.  ఇది చెడు శ్వాసతగ్గించడానికి లేదా వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

ఇంటిలోనే వినెగార్ మౌత్‌వాష్‌ను తయారుచేయడానికి, 1 కప్పు నీటికి 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వినెగార్‌ను జోడించాలి .

గుండె ఆరోగ్యానికి ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for heart health in Telugu

ప్రపంచం‌లో చాలా అకాల మరణాలు, గుండె వ్యాధుల కారణంగా సంభవిస్తుంటాయి.  ఊబకాయం, జీవనశైలి, మరియు ఆహారం వంటి అనేక జీవ కారకాలు సాధారణంగా ఈ గుండె వ్యాధులకు సంబంధం కలిగిఉంటాయి.  వినెగార్ వినియోగం, హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధన చూపిస్తుంది.

ఆహార ఎసిటిక్ ఆమ్లం మొత్తం కొలెస్ట్రాల్ మరియు కొలిస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారం‌లోని ట్రైఅసైల్‌గ్లిసరాల్ యొక్క సీరం సాంద్రతలను తగ్గిస్తుందని ఒక జంతు-ఆధారిత అధ్యయనం ప్రదర్శిస్తుంది.  అయితే ఈ అధ్యయనాలు సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయి మరియు వాటికి తగినంత రుజువు లేదు.  ఆపిల్ సైడర్ వినెగార్ రక్తం‌లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని, ఇ‌న్సులిన్ సె‌న్సిటివిటీని పెంచుతుంది మరియు డయాబెటిస్‌తో పోరాడటం‌లో సహాయపడుతుందని కూడా అధ్యయనాలు చూపిస్తున్నాయి.   గుండె వ్యాధుల ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఈ కారకాలు దారితీస్తాయి.

(మరింత చదవండి: గుండె జబ్బుల లక్షణాలు)

మొటిమల కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for acne in Telugu

మొటిమలు అన్నవి యువతలో ఉండే చాలా సాధారణ సమస్య. వినెగార్ దాని యొక్క యాంటిమైక్రోబయల్ మరియు యాంటిబ్యాక్టీరియల్ లక్షణాల ద్వారా పేరుగాంచింది.  ఆపిల్ సైడర్ వినెగార్ ఎసిటిక్, ల్యాక్టిక్, సక్కినిక్ మరియు సిట్రిక్ యాసిడ్ లను కలిగియుంది.  సక్కినిక్ ఆమ్లం సమర్థవంతంగా ప్రొపియోనిబ్యాక్టీరియ‌మ్ ఏక్నెస్ (పి. ఏక్నెస్) యొక్క పెరుగుదలను నిరోధిస్తుందని పరిశోధన చూపిస్తుంది, ఇది ఒక చర్మ బ్యాక్టీరియా, ఇది మొటిమలతో సంబంధం కలిగిఉంటుంది. ఈ అధ్యయనాల ఫలితాల ఆధారంగా, ఆపిల్ సైడర్ వినెగార్‌ను మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు-కలిగించే బ్యాక్టీరియాను నియంత్రించడం సాధ్యమని తెలిపింది.

జుట్టు కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for hair in Telugu

ఆపిల్ సైడర్ వినెగార్ జుట్టుకు మంచిదని నిరూపించడానికి తగినంత పరిశోధన లేదు.  అధిక ఆల్కలైన్ షాంపూలు జుట్టు రాపిడి, పొడిబారడం, మరియు విఘటనం చెందడం, జుట్టు గ్రీవములకు నష్టాన్ని ఏర్పరుస్తాయని వివిధ షాంపూల యొక్క pH  స్థాయిల పైన జరిగిన ఒక అధ్యయనం నిరూపించింది.   అధిక షాంపూలు ఆల్కలైన్‌గా ఉంటాయని అధ్యయనం వాదించింది.  ఆపిల్ సైడర్ వినెగార్, మరొక విధంగా,  pH స్థాయిల్ని సమతుల్యం చేయడం‌లో సహాయపడుతుంది, తద్వారా జుట్టును రక్షిస్తుంది.  ఆమ్లతను పెంచడం మరియు pH స్థాయిని తగ్గించడం ద్వారా ఇది జుట్టుకు ప్రకాశం, సున్నితత్వం, మరియు బలం అందిస్తుంది.  ఆపిల్ సైడర్ వినెగార్, యాంటిమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగిఉంది.  ఇది బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ నుండి తలను స్వేచ్చగా ఉంచడం‌లో సహాయపడుతుంది, తద్వారా దురదను నివారిస్తుంది.  ఆపిల్ సైడర్ వినెగార్ చుండ్రు లేదా తల పొడిగా ఉండకుండా నిరోధిస్తుందని నిరూపించడానికి తగినంత పరిశోధన లేదు.

జీర్ణక్రియ కోసం ఆపిల్ సైడర్ వినెగార్ - Apple cider vinegar for digestion in Telugu

ఆపిల్ సైడర్ వినెగార్, తన యొక్క ముడి రూపం‌లో, ఒక అద్భుతమైన జీర్ణక్రియ టానిక్‌గా ఉంది.  సజీవంగా ఉండే ఎంజైములను ఇది పుష్కలంగా కలిగిఉంది, ఇది ఆహారాన్ని తన యొక్క చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం‌లో సహాయపడుతుంది, మరింత సులభంగా ఆహారం విలీనమయ్యేలా చేస్తుంది.  ఆపిల్ సైడర్ వినెగార్ ‌లోని ప్రధాన పదార్థం ఎసిటిక్ ఆమ్లం, ఇది జీర్ణక్రియ యొక్క మొదటి దశ సమర్థవంతంగా పనిచేసేలా సహాయం చేస్తుంది.  ఆ జీర్ణ రసాలను కదిలించడం అన్నది మిగిలిన జీర్ణ ప్రక్రియలకు సహాయపడుతుంది.  ఎసిటిక్ ఆమ్లం, ఖనిజాల శోషణలో సహాయం చేస్తుందని కూడా గమనించబడింది, మనం తినే ఆహారం‌లో ఎక్కువ భాగాన్ని మనం పొందడానికి ఇది మనకు అనుకూలం చేస్తుంది.

 1. ఆపిల్ సైడర్ వినెగార్‌ను టాబ్లెట్ రూపం‌లో లేదా ద్రవ రూపం‌లో వినియోగిస్తుంటే, దాని యొక్క అధిక వినియోగం అన్నది దాని అధిక ఆమ్ల కంటెంట్ కారణంగా అన్నవాహిక, పంటి ఎనామిల్ మరియు కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తుంది లేదా నష్టపరుస్తుంది.  ఆపిల్ సైడర్ వినెగార్ పళ్లకు ఒక పసుపు రంగు చేరిక ఇవ్వడం‌తో పాటుగా, పంటి సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది.  అంతేకాక, చర్మం పైన స్వచ్చమైన ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క ప్రత్యక్షంగా పూయడం, దద్దుర్లు,  చికాకు మరియు మంట కలిగించే అనుభూతికి కారణంకావచ్చు.
 2. ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క అధిక ఎసిటిక్ ఆమ్ల కంటెంట్, మీ రక్తం‌లో తక్కువ పొటాషియం స్థాయిలకు కారణమవుతుంది.  ఈ పరిస్థితిని హైపోకలేమియా అని పిలుస్తారు.  ఈ పరిస్థితి బలహీనత, తిమ్మిరి,   వికారం, తిమ్మిరి, తరచుగా మూత్ర విసర్జన, అల్ప రక్తపోటు, గుండె లయలో మార్పులు మరియు  పక్షవాతంవంటి రోగాలకు కారణమవుతుంది.
 3. ఆపిల సైడర్ వినెగార్, దాని యొక్క ఆమ్ల స్వభావం వలన,  విరోచనకారి (మలబద్ధకం నుండి ఉపశమనం) , డైయురేటిక్స్ (శరీరం నుండి అదనపు నీరు మరియు లవణాలను బయటకు పంపించడం), మరియు ఇ‌న్సులిన్ వంటి కొన్ని మందులతో సులభంగా చర్య జరుపుతుంది.  ఆపిల్ సైడర్ వినెగార్, ఇ‌న్సులిన్ స్థాయిలు మరియు చక్కెర వ్యాధి పైన ప్రత్యక్ష ప్రభావం కలిగిఉన్నందువల్ల, రక్తపోటు మరియు డయాబెటిక్ మందులతో పాటుగా దానిని తీసుకున్నప్పుడు, ఇది అత్యంత ప్రమాదకరమని నిరూపించబడింది.  ఇది క్రోమియం కలిగిఉండి మరియు ఇ‌న్సులిన్ స్థాయిల్ని ప్రభావితం చేస్తున్న కారణంగా, డయాబెటిస్ కలిగిన రోగులు జాగ్రత్తగా దీనిని ఉపయోగించాలి.
 4. ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క అధిక వినియోగం, ఎముక ఖనిజ సాంద్రతను తగ్గిస్తుంది, ఎముకలు పెళుసుగా చేయబడతాయి.  అందువల్ల,  బోలుఎముకలవ్యాధి తో బాధపడుతున్న ప్రజలు ఆపిల్ సైడర్ వినెగా‌ర్‌ను ఎన్నడూ వినియోగించకూడదు.
 5. ఆపిల్ సైడర్ వినెగార్‌లో ఉండే ఎసిటిక్ ‌ఆమ్లం యొక్క అధిక స్థాయి కారణంగా, దాని అధిక వినియోగం ముఖం వాపుశ్వాస తీసుకోవడంలో కష్టం, గొంతు నొప్పి మరియు పుండ్లు ఏర్పడడం వంటి వాటికి దారితీస్తుంది.

ఆపిల్ సైడర్ వినెగార్ ‌వినియోగం నుండి ప్రజలు దూరంగా ఉండటానికి దాని యొక్క రుచే ఒకే ఒక్క పెద్ద కారణం.  అయితే దీనిని ఒక సలాడ్‌‌కు జోడించడం లేదా నీరు మరియు తేనెతో దీనిని కలపడం ద్వారా దీని యొక్క రుచి మూసివేయబడింది.  అంతేకాకుండా, ఆపిల్ సైడర్ వినెగార్‌ను నేరుగా త్రాగటం కూడా హానికరం, ఎందుకంటే దీని యొక్క యాసిడ్ కంటెంట్ మీ అన్నవాహికకు హాని కలిగించవచ్చు.  క్రమం తప్పకుండా అపిల్ సైడర్ వినెగార్‌ను తీసుకోవదం, రోగాలను మనకు సముద్ర అఖాతం అంత దూరంగా ఉంచుతుంది.  అయితే ఏ ఆహారం కూడా పరిపూర్ణంగా ఉండదు మరియు ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అది ఖచ్చితంగా దుష్ప్రభావాలు కలిగిఉంటుంది.  కాబట్టి, ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క పూర్తి ఆరోగ్య నిర్మాణ సామర్థ్యం ఫలితాన్ని పొందడానికి, ఆపిల్ సైడర్ వినెగార్‌ను మధ్యస్థంగా తీసుకోవడం చాలా ఉత్తమం.

వనరులు

 1. Carol S. Johnston, Cindy A. Gaas. Vinegar: Medicinal Uses and Antiglycemic Effect. MedGenMed. 2006; 8(2): 61. PMID: 16926800
 2. Surajit Bhattacharya. Wound healing through the ages. Indian J Plast Surg. 2012 May-Aug; 45(2): 177–179. PMID: 23162212
 3. Darshna Yagnik, Vlad Serafin, and Ajit J. Shah. Antimicrobial activity of apple cider vinegar against Escherichia coli, Staphylococcus aureus and Candida albicans; downregulating cytokine and microbial protein expression. Sci Rep. 2018; 8: 1732. PMID: 29379012
 4. Panayota Mitrou. Vinegar Consumption Increases Insulin-Stimulated Glucose Uptake by the Forearm Muscle in Humans with Type 2 Diabetes. J Diabetes Res. 2015; 2015: 175204. PMID: 26064976
 5. Kondo T, Kishi M, Fushimi T, Ugajin S, Kaga T Vinegar intake reduces body weight, body fat mass, and serum triglyceride levels in obese Japanese subjects.. Biosci Biotechnol Biochem. 2009 Aug;73(8):1837-43. Epub 2009 Aug 7. PMID: 19661687
 6. Wang Y et al. Staphylococcus epidermidis in the human skin microbiome mediates fermentation to inhibit the growth of Propionibacterium acnes: implications of probiotics in acne vulgaris. Appl Microbiol Biotechnol. 2014 Jan;98(1):411-24. PMID: 24265031
 7. Maria Fernanda Reis Gavazzoni Dias et al. The Shampoo pH can Affect the Hair: Myth or Reality?. Int J Trichology. 2014 Jul-Sep; 6(3): 95–99. PMID: 25210332
 8. Kashimura J, Kimura M, Itokawa Y. The effects of isomaltulose, isomalt, and isomaltulose-based oligomers on mineral absorption and retention. Biol Trace Elem Res. 1996 Sep;54(3):239-50. PMID: 8909697
 9. Yagnik Darshna, Ward Malcolm, Shah Ajit J. Antibacterial apple cider vinegar eradicates methicillin resistant Staphylococcus aureus and resistant Escherichia coli. Sci Rep. 2021; 11: 1854. PMID: 33473148.
 10. Gopal J, et al. Authenticating apple cider vinegar's home remedy claims: antibacterial, antifungal, antiviral properties and cytotoxicity aspect. Nat Prod Res. 2019 Mar; 33(6): 906-910. PMID: 29224370.
 11. Gheflati A, et al. The effect of apple vinegar consumption on glycemic indices, blood pressure, oxidative stress, and homocysteine in patients with type 2 diabetes and dyslipidemia: A randomized controlled clinical trial. Clin Nutr ESPEN. 2019 Oct; 33: 132-138. PMID: 31451249.
 12. Kohn JB. Is vinegar an effective treatment for glycemic control or weight loss? J Acad Nutr Diet. 2015 Jul; 115(7): 1188. PMID: 26115563.
 13. Harvard Health Publishing: Harvard Medical School [Internet]. Harvard University, Cambridge. Massachusetts. USA; Apple cider vinegar diet: Does it really work?
 14. Martínez-Zaguilán R, et al. Acidic pH enhances the invasive behavior of human melanoma cells. Clin Exp Metastasis. 1996 Mar; 14(2): 176-86. PMID: 8605731.
 15. Liu Yong, Hannig Matthias. Vinegar inhibits the formation of oral biofilm in situ. BMC oral health. 2020; 20: 167. PMID: 32503624.
 16. Halima BH, et al. Apple Cider Vinegar Attenuates Oxidative Stress and Reduces the Risk of Obesity in High-Fat-Fed Male Wistar Rats. J Med Food. 2018 Jan; 21(1): 70-80. PMID: 29091513.
 17. Hadi Amir, et al. The effect of apple cider vinegar on lipid profiles and glycemic parameters: a systematic review and meta-analysis of randomized clinical trials. BMC Complement Med. Ther. 2021; 21: 179. PMID: 34187442.
 18. Wang Yanhan, et al. Staphylococcus epidermidis in the human skin microbiome mediates fermentation to inhibit the growth of Propionibacterium acnes: Implications of probiotics in acne vulgaris. Appl microbiol biotechnol. 2014 Jan; 98(1): 411-424. PMID: 24265031.
 19. Bunick Christopher G., et al. Chemical burn from topical apple cider vinegar. JAAD. 2012; 67(4): E143-E144.