myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

ద్రాక్షపళ్ళు అత్యంత సాధారణ పండ్లలో ఒక రకమైనవి మరియు పురాతన కాలం నుండి వాటిని "పండ్లలో రాణి" గా భావిస్తారు. ఈ చిన్న పండ్ల యొక్క మూలాలు ఐరోపా మరియు మధ్యధరా ప్రాంతాలలో ఉన్నాయి. ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) మరియు యాంటీఆక్సిడెంట్స్ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ రకాల ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. వాటి ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి యొక్క రుచి కారణంగా ద్రాక్షపళ్ళను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు.

ఇవి చిన్నగా గుండ్రంగా ఉండే పళ్ళు, ఇవి ద్రాక్ష మొక్క మీద గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి, శాస్త్రీయంగా ఈ మొక్కను విటిస్ (Vitis) అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ద్రాక్ష తోటలను విస్తృతంగా సాగు చేస్తారు. ఆకృతి పరంగా, ఒకొక ద్రాక్ష పండు ఒక మృదువైన పలుచని తోలులో గుజ్జును కలిగి ఉంటుంది. ద్రాక్షలో ఉండే వివిధ పాలిఫినోలిక్స్ (polyphenolics) పండు యొక్క రంగుకు బాధ్యత వహిస్తాయి. ఎరుపు ద్రాక్ష రంగుకు కారణమయ్యే పిగ్మెంట్ ఆంథోసియానిన్ (anthocyanin), అయితే తెలుపు మరియు ఆకుపచ్చ ద్రాక్షలు ఎక్కువగా టానిన్లను ప్రత్యేకంగా కేటికిన్ను (catechin) కలిగి ఉంటాయి. వీటిలో ఉండే అన్ని యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్లు ద్రాక్ష గింజలు మరియు ద్రాక్షపళ్ళ తోలు మీద అధిక సాంద్రతలో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగే ద్రాక్షలలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి, అవి; ఉత్తర అమెరికావి (విటిస్ రోయుండిఫోలియా [Vitis rotundifolia] మరియు విటిస్ లాబ్రాస్కా [Vitis labrusca]), యూరోపియన్ (విటీస్ వినిఫెరా [Vitis vinifera]) మరియు ఫ్రెంచ్ హైబ్రిడ్లు (French hybrids).

ద్రాక్షపళ్ళ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • శాస్త్రీయ నామం: విటిస్ వినిఫెరా (Vitis vinifera)
 • కుటుంబము: విటేసియే (Vitaceae)
 • సాధారణ నామం: అంగూర్, ద్రాక్ష
 • స్థానిక ప్రాంతం: యూరోపియన్ ద్రాక్ష రకం మధ్యధరా మరియు మధ్య ఆసియా ప్రాంతాలకు చెందినది. భారతదేశంలో, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలైన ద్రాక్షలు పెరుగుతాయి.
 • ద్రాక్షపళ్ళ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు:
  • ద్రాక్షపళ్ళ యొక్క ఆకుపచ్చ రకాల్లో కొన్ని ప్రసిద్ధమైనవి థాంప్సన్ సీడ్లెస్ (Thompson seedless), కాల్మెరియా (Calmeria) మరియు చక్కెర రకం.
  • ఎరుపు ద్రాక్ష రకాలు కార్డినల్ (cardinal), ఫ్లేమ్ సీడ్లెస్ (flame seedless), రెడ్ గ్లోబ్ (red globe) మరియు ఎంప్రేర్ (emperor).
  • ప్రసిద్ధ బ్లూ-బ్లాక్ (నలుపు-నీలం) రంగు రకాలు కాంకర్డ్ (Concord) మరియు జెన్ఫెండెల్ (Zinfandel) వంటివి.
  • వాణిజ్యపరంగా, ద్రాక్షపళ్ళు వివిధ ప్రయోజనాల కోసం వివిధ రకాలుగా సాగు చేయబడుతున్నాయి వాటిని వైన్ (మద్య) ఉత్పత్తికి లేదా సాధారణంగా తినడానికి  తాజాగా లేదా ఎండుద్రాక్ష రూపంలో (కిస్మిస్ పళ్ళు, సుల్తానా)
 1. ద్రాక్ష పోషక విలువలు - Grapes nutrition facts in Telugu
 2. ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు - Grapes health benefits in Telugu
 3. ద్రాక్ష దుష్ప్రభావాలు - Grapes side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

ద్రాక్ష పళ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ద్రాక్షలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు, అయితే 100 గ్రాముల ద్రాక్షలో 69 కేలరీలు ఉంటాయి. ద్రాక్షపళ్లలో ఐరన్, కాపర్ మరియు మాంగనీస్ వంటి సూక్ష్మపోషక (మైక్రో న్యూట్రియెంట్స్) ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి మరియు థయామిన్ (విటమిన్ బి1), రిబోఫ్లావిన్ (విటమిన్ బి2) మరియు పైరిడోక్సిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లకు  ద్రాక్ష ఒక మంచి వనరు.

యూ.యస్.డి. ఎ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం 100 g ద్రాక్ష పళ్లలో ఉండే పోషక విలువలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

పోషక విలువలు

100 గ్రామూలకు

నీరు 80.54 గ్రా

 

శక్తి

69 కిలో కేలరీలు

ప్రోటీన్

0.72 గ్రా

కొవ్వులు

0.16 గ్రా

కార్బోహైడ్రేట్

18.10 గ్రా

ఫైబర్

0.9 గ్రా

చక్కెర

15.48

మినరల్స్

 

కాల్షియం

10 mg

ఐరన్

0.36 mg

మెగ్నీషియం

7 mg

ఫాస్ఫరస్

20 mg

పొటాషియం

191 mg

సోడియం

2 mg

జింక్

0.07 mg

విటమిన్లు

 

విటమిన్ సి

3.2 mg

విటమిన్ బి1

0.069 mg

విటమిన్ బి2

0.070 mg

విటమిన్ బి3

0.188 mg

విటమిన్ బి6

0.086 mg

విటమిన్ బి9

2 μg

విటమిన్ ఎ

3 μg

విటమిన్ ఇ

0.19 mg

కొవ్వులు/కొవ్వు ఆమ్లాలు

 

మొత్తం సంతృప్త (సాచురేటెడ్)

0.054 గ్రా

మొత్తము మోనోఆన్సాచురేటెడ్

0.007 గ్రా

మొత్తం పోలీఆన్సాచురేటెడ్

0.048 గ్రా

ద్రాక్ష కేవలం సలాడ్ వంటి అల్పాహారాలలో ఉపయోగించేటువంటి ఒక పండు మాత్రమే కాదు. ఈ పండ్లు వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసే శక్తివంతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయని శాస్త్రీయంగా నిర్దారించబడింది. ద్రాక్ష యొక్క అధ్యయనాల ఆధారిత ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని తెలియజేయడమైనది.

 • సహజ యాంటీఆక్సిడెంట్: ద్రాక్ష ఆహారంలో చేర్చదగిన ఉత్తమమైన యాంటీఆక్సిడెంట్ వనరులలో ఒకటి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్ నష్టాన్ని న్యూట్రలైజ్ (తగ్గించడం) చెయ్యడంలో ప్రభావంతంగా ఉంటాయి మరియు వృద్ధాప్యంతో ముడిపడి ఉండే వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయం చేస్తాయి.
 • రక్తపోటును తగ్గిస్తుంది: ద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఈ ఖనిజము (మినరల్) శరీరంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించేందుకు బాధ్యత వహిస్తుంది. అందువల్ల, రక్తపోటులో హెచ్చుతగ్గులను నివారించడానికి ద్రాక్షపళ్ళను రోజు తీసుకోవడం  ప్రయోజనకరంగా ఉంటుంది.
 • మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: రోజువారీగా ద్రాక్షపళ్ళను తీసుకునే వ్యక్తులలో జ్ఞాపకశక్తి మరియు మేధాశక్తి నైపుణ్యాలు ద్రాక్షపళ్ళను తీసుకొని వ్యక్తుల కంటే అధికంగా ఉంటాయని వైద్యపరమైన అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మానసిక స్థితిని (మూడ్) మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని కనుగొనబడింది.
 • వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది: ఆరోగ్య సమస్యలను నివారించడమేకాక, ముడతలు మరియు నలుపు మచ్చల వంటి వృద్ధాప్యం యొక్క మొట్టమొదటి సంకేతాలను ఆలస్యం చెయ్యడంలో కూడా ద్రాక్ష యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉపయోగపడతాయి. ద్రాక్షలో ఉండే ఆక్టివ్ సమ్మేళనాలు (active compounds) చర్మం కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఇది (ఆక్సీకరణ ఒత్తిడి) వృద్ధాప్యం కారణంగా చర్మం ముడతలు పడడం యొక్క ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది.
 • హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: ద్రాక్ష యొక్క అంథోసియానిన్ (anthocyanin) పరిమాణం వివిధ హృదయనాళ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. అంతేకాకుండా, ఇది శరీరంలో కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది, ఈ రెండు గుండె వ్యాధుల యొక్క అత్యంత సాధారణ కారణాలు. కాబట్టి, ద్రాక్ష క్రమమైన వినియోగం గుండెను ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచుతుంది.
 • అలెర్జీ
  ద్రాక్ష కారణంగా అలెర్జీ అనేది చాలా అరుదైన విషయం. అలెర్జీలో  ఎర్రని మచ్చలు, శ్వాసలో గురక శబ్దం, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో కఠినత మరియు దద్దుర్లు వంటి  లక్షణాలు ఏర్పడవచ్చు. ద్రాక్ష కారణంగా అలెర్జీ ప్రతిచర్య జరగకపోవచ్చు, కానీ వాటి మీద చల్లిన పురుగుమందులు లేదా ద్రాక్షపై పెరిగిన ఒక రకమైన ఫంగస్ కారణంగా జరుగవచ్చు. అందువల్లనే పళ్ళు మరియు కూరగాయలను తినే ముందు ఎల్లప్పుడూ వాటిని కడగడం మంచిది.
 • బరువు పెరుగుట
  ద్రాక్షలో కేలరీల శాతం తక్కువగా ఉంటుంది; ఒక కప్పు ద్రాక్షలో 100 కేలరీలు మాత్రమే ఉంటాయి. వాటి చిన్న పరిమాణం మరియు మంచి రుచి కారణంగా, ద్రాక్షపళ్ళను తెలియకుండానే అధికంగా తినవచ్చు. అందువల్ల, తెలియకుండా కేలరీల శాతం పెరిగిపోతుంది. ద్రాక్షను  అధికంగా తీసుకోవడం అది అదనపు కేలరీలలోకి సులభంగా మారిపోతుంది. కాబట్టి, ఒకేసారి మొత్తం ద్రాక్షగుత్తిని తినే బదులు, పరిమితంగా ద్రాక్షను ఆస్వాదించడం ఉత్తమం.
 • అజీర్ణం
  ఎండుద్రాక్షలు వంటి ద్రాక్ష సంబంధిత పండ్లను అధిక పరిమాణంలో తీసుకోవడం అజీర్ణానికి దారి తీస్తుంది. ఇది అతిసారానికి కూడా కారణం కావచ్చు. ఫ్రక్టోజ్ అసహనత (fructose intolerance) ఉన్న వ్యక్తులు ద్రాక్ష తీసుకున్న తర్వాత అజీర్ణంతో పాటు కడుపు నొప్పిని కూడా అనుభవించవచ్చు. ప్రతిచర్య (రియాక్షన్) యొక్క తీవ్రత ఒక వ్యక్తి నుండి మరొకవ్యక్తికి మారవచ్చు, కానీ ఫ్రక్టోజ్ అసహనం ఉన్నవారు ద్రాక్ష తీసుకోవడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది వారి కిడ్నీ లేదా కాలేయ పనితీరుకు హాని కలిగించవచ్చు.
 • గ్యాస్
  ద్రాక్షలు చాలా రకాల చక్కెరలను కలిగి ఉంటాయి, ఇవి కొన్ని పరిస్థితులలో కడుపు ఉబ్బరానికి మరియు కడుపులో గ్యాస్ చేరడానికి దారితీయవచ్చు.

ద్రాక్ష మంచి ఆరోగ్యం మరియు సాధారణ శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. తాజా ద్రాక్షపళ్ళు రుచికరమైనవి  మరియు ఆరోగ్యవంతమైనవి. ద్రాక్ష ఒక ఉత్తమ చిరుతిండి ఎంపిక, ఇది కొలెస్ట్రాల్ లేకుండా మరియు తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. వీటిని బోరింగ్ ఆహార విధానాలలో  ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారంగా చేర్చవచ్చు. కానీ ద్రాక్ష యొక్క అతి వినియోగం కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉండవచ్చు. ద్రాక్ష లేదా ఏ ఇతర ఆహార పదార్థలనైనా తీసుకునేటప్పుడు 'మంచి ఏదైనా అతి కావడవం వలన అది చెడుగా మార్చవచ్చు' అనే నానుడిని గుర్తుంచుకోవాలి.

और पढ़ें ...