జల్దారుపండును (అప్రికోట్) ఆసియాలో ఓ కమ్మని వేసవి పండుగా చెప్పవచ్చు, ఇది చైనాలో ఉద్భవించిందని నమ్ముతారు. చిన్నగా ఉండి, తియ్యని రుచి కల్గిన ఈ పండు పీచుపదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలకు ఒక అద్భుతమైన సమృద్ధ మూలం. అదనంగా, ఈ పండుకు బంగారు నారింజ రంగునివ్వడానికి కారణమైన బీటా-కెరోటిన్ యొక్క మంచి మూలం. వాస్తవానికి, మొదటిసారి జల్దారు పండు ఐరోపాకు చేరుకున్నప్పుడు గ్రీకు దేశస్థులు ఆ పండ్లను "సూర్యుని యొక్క బంగారు గుడ్లు" అని వర్ణించారు.  

జల్దారుపండు సుమారుగా 4 నుండి 5 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది మరియు 35 గ్రాముల బరువు ఉంటుంది. జల్దారు పండ్లను కాచే చెట్లు పర్వత ప్రాంతపు వాలునేలల్లో బాగా పెరుగుతాయి. సమశీతోష్ణ ప్రాంతాలు, ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతాలు దాని సాగుకు అనువుగా ఉంటాయి. అప్రికాట్ యొక్క అతిపెద్ద ఉత్పాదక దేశం టర్కీ. ప్రపంచంలోని మొత్తం ఆప్రికాట్ల ఉత్పత్తిలో 27% వాటాను ఒక్క టర్కీనే పండిస్తుంది. భారతదేశంలో, జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలలో ప్రధానంగా ఈ  జల్దారు పండ్లను సాగు చేస్తారు.

జల్దారు పండు  ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎండిన ఆప్రికాట్లు ఇనుము యొక్క గొప్ప మూలం. కాబట్టి, మీరు గనుక రక్తహీనతని కలిగి ఉంటే, ఎండిన ఆప్రికాట్లను తినడంవల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈజిప్షియన్లు ‘అమర్-అల్-దిన్’ అని పిలవబడే ఒక ప్రత్యేక పానీయం తయారు చేసేందుకు ఎండిన ఆప్రికాట్లను ఉపయోగీస్తారు. జల్దారు పండు  నూనె చర్మం మరియు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

జల్దారు పండు గురించిన కొన్ని వాస్తవాలు:

  • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: పృనస్ అర్మేనియాక (Prunus armeniaca)
  • కుటుంబం: రోసేసియా
  • సాధారణ పేరు: ఇంగ్లీష్లో ‘అప్రికోట్’ , హిందీలో ‘ఖుబని’
  • సంస్కృత నామం: అంధిగ్రహ
  • ఉపయోగించే భాగాలు: పండు, గింజలు
  • స్థానిక మరియు భౌగోళిక విస్తీర్ణం: ఆప్రికాట్ యొక్క మూలం స్పష్టంగా తెలియరాలేదు. ఈ పండు యొక్క అసలు సాగుదార్లు చైనీయులేనని ఓ నమ్మకం. అయినప్పటికీ ఆర్మేనియా దేశం ఆప్రికాట్లను మొదటగా పండించిందని మరికొందరు నమ్ముతున్నారు. సమశీతోష్ణ (టెంపరేట్), ప్రాంతాలు, ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతాలు, జల్దారు పండు  సాగుకు బాగా సరిపోతాయి. టర్కీ, ఇటలీ, రష్యా, స్పెయిన్, గ్రీస్, USA మరియు ఫ్రాన్సులలో కూడా జల్దారు పండు పండ్లను సాగు చేస్తారు. 
  1. జల్దారు పండు పోషక వాస్తవాలు - Apricot nutrition facts in Telugu
  2. జల్దారు పండు ఆరోగ్య ప్రయోజనాలు - Apricot health benefits in Telugu
  3. జల్దారు పండు ఉపయోగాలు - Apricot uses in Telugu
  4. జల్దారు పండు దుష్ప్రభావాలు - Apricots side effects in Telugu
  5. ఉపసంహారం - Takeaway in Telugu

చాలా తక్కువ దుష్ప్రభావాలు, విటమిన్లు మరియు ఖనిజాల్ని దండిగా కల్గిన పండు జల్దారు పండు లేక అప్రికాట్ పండు. పాలీఫెనోల్స్, కరోటినాయిడ్స్, మరియు ఆస్కార్బిక్ యాసిడ్లు అప్రికాట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి విటమిన్ ఎ , విటమిన్ సి , ఫోలేట్ యొక్క మంచి మూలం మరియు పొటాషియం- కాల్షియంలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆప్రికాట్లు పీచుపదార్థాలను కూడా పుష్కలంగా కల్గి ఉంటాయి.

యు.యస్.డి.ఏ (USDA) నేషనల్ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రా అఫ్ప్రికోట్ పండులో క్రింది విలువలను కలిగి ఉంటుంది:

 

పోషకపదార్థాలు

100 గ్రాములకు

నీరు

86.35 గ్రా

శక్తి

48 కిలో కేలరీలు

ప్రోటీన్

1.40 గ్రా

మొత్తం లిపిడ్

0.39 గ్రా

యాష్

0.75 గ్రా

కార్బోహైడ్రేట్

11.12 గ్రా

 ఫైబర్

2.0 గ్రా

చక్కెరలు

9.24 గ్రా

ఫ్రక్టోజ్

0.94 గ్రా

 

మినరల్స్

100గ్రాములకు

కాల్షియం

13 mg

ఐరన్

0.39 mg

మెగ్నీషియం

10 mg

ఫాస్ఫరస్ 

23 mg

పొటాషియం

259 mg

సోడియం

1 mg

జింక్

0.20 mg

రాగి

0.078 mg

మాంగనీస్

0.077 mg

సెలీనియం

0.1 μg

 

విటమిన్లు

100 గ్రాములకు 

విటమిన్ ఎ

96 μg

విటమిన్ బి1

0.030 mg

విటమిన్ బి2

0.040 mg

విటమిన్ బి6

0.054 mg

విటమిన్ సి

10 mg

విటమిన్ ఇ

0.89 mg

విటమిన్ K

3.3 μg

 

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

100 గ్రాములకు

సాచ్యురేటెడ్

0.027 గ్రా

మోనోఅన్శాచ్యురేటెడ్

0.170 గ్రా

పాలీఅన్శాచ్యురేటెడ్   

0.077 గ్రా

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW
  • జల్దారు పండుకి  గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే అది రక్త గ్లూకోస్ స్థాయిలను ఎక్కువగా పెంచదు. కాబట్టి  మధుమేహం ఉన్నవారికి  ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాక ఆప్రికాట్లు మధుమేహం ఉన్నవారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించవని కూడా ఒక అధ్యనం పేర్కొంది.
  • ఆప్రికాట్లలో (జల్దారు పండు) కేటకిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి వాటికీ యాంటీ ఇన్ఫలమేటరి  లక్షణాలు ఉంటాయి. జంతు ఆధారిత అధ్యయనాలు జల్దారు ఇన్ఫలమేటరి బౌల్ వ్యాధి లక్షణాలను తగ్గించాయని సూచించాయి. 
  • బీటా-కెరోటిన్ ఆప్రికాట్లలో అధికంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ పళ్ళు వయసు సంబంధిత కంటి సమస్యలు తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.
  • జల్దారుపళ్ళు క్రమముగా తీసుకుంటే అవి ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారిస్తాయని ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాక్షిక హెపాటెక్టమీ తర్వాత ఎండు జల్దారుపళ్ళు కాలేయ పునరుత్పత్తికి సహాయ పడతాయని ఒక జంతు ఆధారిత ఆధ్యయనం సూచించింది. 
  • జల్దారుపళ్ళలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తపోటును నిర్వహిస్తుంది, తద్వారా అధిక రక్తపోటును లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక వీటిలో పొటాషియం కూడా ఉంటుంది అది కూడా రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది. 
  • మలబద్దకం ప్రతి తరం వారిలో సాధారణంగా మారుతుంది, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు  మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి జల్దారుపళ్ళు కూడా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. 
  • కడుపులో పుండ్లను కలిగించే హెలికోబాక్టర్.పైలోరి అనే బాక్టీరియా గ్యాస్ట్రైటిస్ కు ఒక ప్రధాన కారణం. జల్దారుపళ్ళు ఈ బాక్టీరియాను నివారిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తద్వారా అవి దీర్ఘకాలిక గ్యాస్ట్రైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి.  

చక్కెరవ్యాధికి జల్దారు పండ్లు - Apricots for diabetes in Telugu

గ్లైసెమిక్ సూచిక (గ్లైసెమిక్ ఇండెక్స్-జిఐ) లో జల్దారు పండ్ల స్థాయి తక్కువగా ఉంటుంది, అనగా ఈ పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. తక్కువ GI ఆహారాలు ముఖ్యంగా చక్కెరవ్యాధితో (డయాబెటిక్) ఉన్నవాళ్లకు సిఫార్సు చేస్తారు ఎందుకంటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండాలి కాబట్టి. జల్దారుపండు యొక్క ఓ మోస్తరు సేవనంవల్ల గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరగదు. అంటియోసియాన్ మరియు కెరోటినాయిడ్స్ వంటి హైపోగ్లైసెమిక్ కాంపౌండ్లతో పాటు, జల్దారుపండ్ల యొక్క అనామ్లజనక (యాంటీ-ఆక్సిడెంట్) లక్షణాలు చక్కెరవ్యాధి  (మధుమేహం) ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. చక్కెరవ్యాధి (మధుమేహం) కలిగినవారు జల్దారు పండు సేవనంవల్ల ఎటువంటి స్పష్టమైన దుష్ప్రభావాలు లేవని స్పష్టీకరించబడింది.

(మరింత చదువు: చక్కెరవ్యాధి లక్షణాలు)

వాపుకు జల్దారు పండ్లు - Apricots for inflammation in Telugu

జల్దారు పండ్లలో ‘కేటకిన్స్’ అని పిలువబడే ఓ ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది, ఇవి వాపు - మంటల్ని తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలను కలిగి ఉంటాయి. ఒకే ఒక్క జల్దారు పండు ఓ మంచి మొత్తంలో కెటేచిన్లను అందిస్తుంది. జంతువులపై జరిపిన అధ్యయన ప్రయోగాల ప్రకారం, నికి కారణమయ్యే పేగుమంట వ్యాధి (ఇన్ప్లామేటరీ ప్రేగు వ్యాధి-IBS) యొక్క లక్షణాలను తగ్గించడంలో జల్దారు పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి . అయినప్పటికీ, కేట్చిన్ యొక్క ఆరోగ్య లాభాల గురించిన పరిశోధన చాలామటుకు  జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనే జరుగుతోంది మరియు మానవులపై జల్దారుపండ్ల (ఆప్రికాట్) యొక్క మంట - వాపు నివారణా (యాంటీ ఇన్ఫ్లమేటరీ) సంభావ్యతను నిర్ధారించడానికి వైద్య అధ్యయనాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది.

(మరింత చదువు: ఇన్ఫలమేటరీ వ్యాధి కారణాలు)

కళ్ళకు జల్దారు పండ్లు - Apricots for eyes in Telugu

కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే β-కెరోటిన్లు జల్దారుపండ్లలో పుష్కలంగా ఉంటాయి. వయసు-సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో బీటా-కెరోటిన్ పాత్రను అర్థం చేసుకోవడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఒక వైద్య అధ్యయనం ప్రకారం, β- కరోటిన్లను పుష్కలంగా కల్గిన జల్దారుపండ్లు మరియు ఇతర పండ్లు మరియు కూరగాయలు వయసు-సంబంధిత కళ్ళ (మాకులర్) వ్యాధుల (AMD) ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. జంతువుల నమూనాలపై చేసిన మరొక అధ్యయనం జల్దారుపండు గుజ్జును (ఆప్రికాట్ కెర్నెల్) కళ్లపై మసాజ్ చేయడంవల్ల పొడి కంటి వ్యాధుల (dry eye diseases) ను నివారించగలదని పేర్కొంది.

వయసు-సంబంధిత కంటి సమస్యలు పెరుగుతున్నాయి మరియు కంటికి  ప్రయోజనకరంగా ఉండే పోషకాలలో అధికంగా ఉన్న ఆహారాలను తినడం వలన వయసుకు సంబంధించిన కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నమ్ముతారు.

(మరింత చదువు: మాక్యులర్ డిజెనెరేషన్ లక్షణాలు)

జల్దారు పండ్లు కాలేయ హానిని నిరోధిస్తాయి - Apricots prevent liver damage

మానవ శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం మరియు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి కాలేయం. శరీరంలోని ఇతర భాగాలకు రక్తం సరఫరా అయ్యే ముందు జీర్ణవ్యవస్థ నుండి వచ్చే రక్తాన్ని శుద్ధి చేయడం దీని ప్రధాన పాత్ర. ఇది కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియకు కూడా బాధ్యత వహిస్తుంది. పరిశోధనల ప్రకారం     జల్దారుపండు ఒక అద్భుతమైన కాలేయాన్ని కాపాడే ఆహారపదార్థం (హెపాటోప్రొటెక్టివ్).

వివో అధ్యయనాల్లో తేలిన విషయమేమంటే జల్దారు పండు యొక్క సాధారణ సేవనం ఫ్యాటీ లివర్ వ్యాధిని నిరోధిస్తుంది, ఈ వ్యాధిలో కాలేయంలో అవాంఛిత కొవ్వులు పేరుకుపోయి రోగి బాధపడతారు.

కాలేయం అనేది పునరుత్పత్తి చేయడానికి ప్రత్యేకమైన సామర్ధ్యం కలిగిన శరీర అవయవాలలో ఒకటి. పాక్షిక కాలేయ తొలగింపు (పార్షియల్ హెపాటెక్టోమీ) తర్వాత కాలేయ పునరుత్పత్తిలో జల్దారుపండ్లు ఎలా సహాయపడతాయో అంచనా వేయడానికి జంతు నమూనాలపై ఒక అధ్యయనం నిర్వహించబడింది. పాక్షిక హెపాటెక్టోమి చికిత్సలో వ్యాధి యొక్క వ్యాప్తిని శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా తగ్గించటానికి కాలేయము నుండి క్యాన్సర్ కణాల తొలగింపు ఉంటుంది. పైన పేర్కొన్న అధ్యయనంలో కేవలం 21 రోజులు మాత్రమే జల్దారుపండ్లను ఉపయోగించిన తర్వాత కాలేయం పునరుత్పత్తిలో సానుకూల ఫలితాలను చూపించాయి.

అధిక రక్తపోటుకు జల్దారు పండ్లు - Apricots for high blood pressure in Telugu

అధిక రక్తపోటు అనేది వయోజనుల్లో రక్తపీడనం సాధారణ స్థాయి-20 / 80 mmHg కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది ప్రధానంగా ఒత్తిడివల్ల, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు మరియు ఇతర జీవనశైలి కారకాల కారణంగా సంభవిస్తుంది. అధిక రక్తపోటు స్ట్రోక్, గుండె వైఫల్యం, చిత్తవైకల్యం మొదలైన కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, అధిక రక్తపోటు కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. పరిశోధన ప్రకారం, జల్దారుపండ్లలోని పీచుపదార్థాలు (ఫైబర్ కంటెంట్) రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా రక్తపోటును నివారించవచ్చు. అదనంగా, జల్దారు పండ్ల (apricots) లో పొటాషియం మరియు సోడియం తక్కువగా ఉంటాయి, ఇది రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుందని నివేదించబడింది.

గుండె ఆరోగ్యానికి జల్దారు పండ్లు - Apricots for heart in Telugu

పని-జీవితం అసమతుల్యత, ఒత్తిడి, ఉద్రిక్తత, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం మొదలైనవి గుండె సమస్యలకు ప్రధాన కారణాలు. మయోకార్డియల్ ఇస్కీమియా-రెఫెర్ఫ్యూషన్ (MI) మీద జల్దారుపండు సేవనం యొక్క సానుకూల ప్రభావాన్ని పరిశోధించడానికి జంతు నమూనాలపై ఒక అధ్యయనం జరిగింది. ఆక్సిజన్ కోల్పోయిన రక్తం కణజాలంలోకి తిరిగి (return) వచ్చినపుడు MI ఏర్పడుతుంది. MI చేత హృదయ నష్టం తగ్గించడంలో జల్దారు పండులో ఉన్న అనామ్లజనకాలు పాత్రను పోషిస్తాయని ఈ అధ్యయనం సూచిస్తుంది. మరొక అధ్యయనంలో పాలీఫెనోల్స్, కరోటినాయిడ్స్ మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు వంటి వివిధ గుండెను రక్షించే పదార్థాలు లేక కార్డియో-ప్రొటెక్టివ్ కాంపౌండ్లు జల్దారుపండులో  పుష్కలంగా ఉంటాయి. జల్దారుపండు యొక్క ఈ గుణాలన్నీ కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి గుండె వ్యాధులపై ప్రభావవంతంగా పని చేస్తాయి.

(మరింత చదువు: గుండె వ్యాధి కారణాలు)

మలబద్ధకం కోసం జల్దారు పండు - Apricot for constipation in Telugu

ప్రతి తరానికి మలబద్ధకం అనేది చాలా సాధారణ సమస్య. చికిత్స చేయకపోతే, ఇది పొట్టలో క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్)కు దారితీయవచ్చు. పరిశోధన ప్రకారం పీచుపదార్థాలు (ఫైబర్) అధికంగా ఉండే ఆహారాలు మలబద్ధకం నిరోధించడంలో సహాయపడతాయి. అలాంటి పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారసేవనంవల్ల పేగుల్లోని ఆహారానికి గాత్రాన్ని అందించి, తద్వారా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. అదనంగా, కరిగే పీచుపదార్థాలు ప్రేగులలో మంచి బ్యాక్టీరియాని నిర్వహించడంలో సహాయపడతాయి, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(మరింత చదువు: జీర్ణక్రియను మెరుగుపరచడం ఎలా?)

కడుపులో పుండ్లకు జల్దారు పండ్లు - Apricots for gastritis in Telugu

గ్యాస్ట్రైటిస్’ అనబడే రుగ్మత కడుపు లోపలి పొట్ట గోడల్లో కలిగే మంటను లేదా పుండ్లను  సూచిస్తుంది. పొట్టలో పుండ్లకు అనేక కారణాలున్నాయి. కొన్ని సాధారణ కారణాలేవంటే మద్యం దుర్వినియోగం, ఒత్తిడి మరియు కడుపుగోడల్ని దెబ్బతీసే మందుల యొక్క సాధారణ వాడకం. ‘హెలికోబాక్టర్ పైలోరీ’ (Helicobacter pylori) అనబడే పొట్టలో పుండును కలిగించే బ్యాక్టీరియా కూడా పొట్టలో సంభవించే పుండ్ల యొక్క కారణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం, జల్దారుపండ్లు దీర్ఘకాలికంగా బాధిస్తున్న పొట్టలోని పుండ్లను నివారించగలవు. ప్రతి రోజు కేవలం మూడు జల్దారు పండ్లు తింటే హెలికోబ్యాక్టర్ పైరోలి కల్గించే కడుపు మంట లేక కడుపులో పుండ్లను తగ్గించవచ్చు లేక నిరోధించవచ్చు. గతంలో చేపట్టిన అధ్యయనం ప్రకారం, హెలికోబాక్టర్ పైలోరీ యొక్క చలనశీలతను జల్దారుపండ్లు తగ్గించవచ్చని చెప్పబడింది, తద్వారా, ఆ సూక్ష్మజీవి  కడుపులో అంటురోగాన్ని కల్గించకుండా నిరోధిస్తుంది.

(మరింత చదువు: పెప్టిక్ అల్సర్ వ్యాధిలక్షణాలు)

క్యాన్సర్ కోసం జల్దారు పండ్లు - Apricots for cancer in Telugu

ప్రపంచవ్యాప్త మరణాల యొక్క ప్రధాన కారణాల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి యొక్క ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, స్వేచ్ఛా రాశులు శరీరంలో జమవడాన్ని క్యాన్సర్ రావడడానికి కారణంగా చెప్పబడుతోంది. జల్దారు పండు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధన చెబుతోంది, ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్లతో నింపబడిన ఈ పండు స్వేచ్ఛా రాశులుల్ని సమర్థవంతంగా తటస్థీకరిస్తుంది. జల్దారుపండు గుజ్జు లేక కొబ్బరిలో ఉండే అమిగ్డాలిన్ అనబడే మొక్క-సంబంధ పదార్థాన్ని క్యాన్సర్ వ్యతిరేక ఏజెంట్గా భావిస్తారు. జల్దారుపండు శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది, ఎలాగంటే క్యాన్సర్ కణాలలోనే ఉండే కణాల సహజమరణానికి దోహదపడే అపోప్టోసిస్ ను ప్రేరేపించి క్యాన్సర్ కణాల్ని నిర్మూలిస్తుంది. అందువల్ల, జల్దారుపడు క్యాన్సర్ చికిత్సలో ప్రభావ  సంభావ్యతను కలిగి ఉండవచ్చు .

వివిధ రకాల కేరోటినాయిడ్లను కూడా జల్దారుపండ్లు కలిగి ఉంటాయి. ఈ పండు  ముఖ్యమైన ప్రతిక్షకారిణి చర్యలను ప్రదర్శిస్తుంది. 37 రకాల జల్దారుపండ్లపై చేసిన అధ్యయనం ఈ పండ్లు విస్తారమైన కెరోటినాయిడ్లను కల్గి ఉన్నాయని తేలింది. కరోటెనాయిడ్లను అధికంగా కల్గిఉన్న ఆహారాలు తీసుకోవడంవల్ల వివిధ రకాలైన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

జల్దారు (అప్రికాట్) పండ్లను ముడిగాను లేదా వాటిని వంట వండుకుని కూడా తినొచ్చు. తాజా జల్దారు పండ్లను తినడం ఉత్తమం, అయితే ఎండలో ఎండబెట్టి కూడా వీటిని తినవచ్చు. ఎండిన పండ్ల (డ్రై -ఫ్రూట్స్)లో ఎండిన జల్దారుపండ్లు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ జల్దారు పండ్లతో జామ్, జెల్లీలు, రసాలను తయారుచేస్తారు మరియు పానీయాలకు రుచి-సువాసనల్ని కల్పించేందుకు, ముఖ్యంగా మద్యసంబంధ పానీయాలకు, జల్దారు పండ్లను వాడతారు. జల్దారు అప్పడాలు కూడా ఈ పండ్లను ఉపయోగించి తయారు చేస్తారు.

  • జల్దారు పండ్లు లో ఉన్న అమైగ్డలిన్ అనబడే ఒక మొక్క పదార్ధం మానవులలో సైనైడ్ పోయిజనింగ్ దారి తీయవచ్చు. ఇలా అమైగ్డలిన్, సైనైడ్ గా మారిన సంఘటనల రెండు  వైద్య కేసులు నివేదించబడ్డాయి. జ్వరం, తలనొప్పి మరియు తీవ్రమైన ఉదర తిమ్మిరి (కడుపునొప్పి) వంటి లక్షణాలు ఆ ఇద్దరిలోని ఒక రోగిలో గుర్తించబడ్డాయి.
  • జల్దారు పండు  వినియోగం కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యకు దారి తీయవచ్చు. ఆప్రికాట్లలో ప్రధాన అలెర్జీ కారకం లిపిడ్ బదిలీ ప్రోటీన్ (lipid transfer protein - LTP) అని ఒక అధ్యయనంలో గమనించబడింది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹425  ₹850  50% OFF
BUY NOW

జల్దారు (అప్రికోట్) పండులో అనేక పోషకాలు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఎండిన ఆప్రికాట్లులో కూడా  తాజా ఆప్రికాట్లులో ఉండే దాదాపు అన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆప్రికాట్లను తినడంవల్ల చాలా తక్కువ దుష్ప్రభావాలుంటాయి. కాబట్టి ఆప్రికాట్లను మీ రోజువారీ ఆహారంలో ఓ మంచి రకం ఆహార రకంగా చేర్చుకోవచ్చు.


Medicines / Products that contain Apricot

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09021, Apricots, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Carla K. Mille, Melissa Davis Gutshcall, Diane C. Mitchell. Change in Food Choices Following a Glycemic Load Intervention in Adults with Type 2 Diabetes: Research and Professional Brief . J Am Diet Assoc. 2009 Feb; 109(2): 319–324. PMID: 19167961
  3. Minaiyan M et al. Anti-inflammatory effect of Prunus armeniaca L. (Apricot) extracts ameliorates TNBS-induced ulcerative colitis in rats. Res Pharm Sci. 2014 Jul-Aug;9(4):225-31. PMID: 25657793
  4. Chamcheu JC et al. Chitosan-based nanoformulated (-)-epigallocatechin-3-gallate (EGCG) modulates human keratinocyte-induced responses and alleviates imiquimod-induced murine psoriasiform dermatitis. Int J Nanomedicine. 2018 Jul 20;13:4189-4206. PMID: 30057446
  5. Kim CS et al. Topical Application of Apricot Kernel Extract Improves Dry Eye Symptoms in a Unilateral Exorbital Lacrimal Gland Excision Mouse. Nutrients. 2016 Nov 23;8(11). pii: E750. PMID: 27886047
  6. Ozturk F et al. Protective effect of apricot (Prunus armeniaca L.) on hepatic steatosis and damage induced by carbon tetrachloride in Wistar rats. Br J Nutr. 2009 Dec;102(12):1767-75. PMID: 19822030
  7. Yilmaz İ et al. Effects of organic apricot on liver regeneration after partial hepatectomy in rats. Transplant Proc. 2013 Jul-Aug;45(6):2455-60. PMID: 23953562
  8. Lien Ai Pham-Huy, Hua He, Chuong Pham-Huy. Free Radicals, Antioxidants in Disease and Health . Int J Biomed Sci. 2008 Jun; 4(2): 89–96. PMID: 23675073
  9. Ruiz D et al. Carotenoids from new apricot (Prunus armeniaca L.) varieties and their relationship with flesh and skin color. J Agric Food Chem. 2005 Aug 10;53(16):6368-74. PMID: 16076120
  10. Lea Borgi et al. FRUIT AND VEGETABLE CONSUMPTION AND THE INCIDENCE OF HYPERTENSION IN THREE PROSPECTIVE COHORT STUDIES . Hypertension. 2016 Feb; 67(2): 288–293. PMID: 26644239
  11. Tashiro N et al. Constipation and colorectal cancer risk: the Fukuoka Colorectal Cancer Study. Asian Pac J Cancer Prev. 2011;12(8):2025-30. PMID: 22292645
  12. Sun Hwan Bae. Diets for Constipation . Pediatr Gastroenterol Hepatol Nutr. 2014 Dec; 17(4): 203–208. PMID: 25587519
  13. Sartaj Ali et al. APRICOT: NUTRITIONAL POTENTIALS AND HEALTH BENEFITS-A REVIEW . Annals. Food Science and Technology 2015
  14. Pastorello EA et al. Evidence for a lipid transfer protein as the major allergen of apricot. J Allergy Clin Immunol. 2000 Feb;105(2 Pt 1):371-7. PMID: 10669861
Read on app