myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కపాలభాతి అనేది ప్రాణాయామంలో ఒక సాంకేతిక ప్రక్రియ, దీనిలో శ్వాస యొక్క ఆరోహణావరోహణల సాధన (మాడ్యులేషన్) ఉంటుంది, దీనిని సంస్కృతంలో ‘ప్రాణ’ అని కూడా పిలుస్తారు. ఇదొక యోగ సాధన, ఇది అంతర్గత శుద్దీకరణ సాంకేతికత (technique) గా పరిగణించబడుతుంది. “కపాల్ భాతి” ని ‘కపాల్’ (అంటే పుర్రె అని) మరియు ‘భాతి’ (అంటే మెరవడం లేక ప్రకాశించడం అని అర్థం) అనే పదాల నుండి స్వీకరించారు.      

కాపాలభాతి అనేది ‘శుద్ధి చేసుకోవడం మరియు శక్తిని విడుదల చేసే సాంకేతికత’ అని సూచిస్తుంది.

కపాలభాతి యొక్క ప్రధాన విధి అంతర్గత అవయవాలను శుభ్రపరచడం మరియు జీవక్రియను మెరుగుపరచడం. కానీ, దీనివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఈ టెక్నిక్ యొక్క సరైన దశలతో పాటు ఈ వ్యాసంలో దాని ప్రయోజనాలు కూడా చర్చించబడ్డాయి.

 1. దశలవారీగా కపాలభాతి సాధన క్రమం - Kapalbhati steps in Telugu
 2. కపాలభాతి ప్రయోజనాలు - Kapal bhati benefits in Telugu
 3. కపాలభాతి జాగ్రత్తలు - Kapalbhati precautions in Telugu

మీ ఇంట్లో కపాలభాతి ప్రాణాయామం సరిగ్గా చేయడానికి ఈ కింది దశలను క్రమంగా అనుసరించండి:

 • సౌకర్యవంతమైన ధ్యాన స్థితిలో కూర్చోండి.
 • కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి.
 • ఇప్పుడు, మీ ఛాతీ విస్తరించే వరకు మీ ముక్కు ద్వారా లోతుగా గాలిని పీల్చుకోండి.
 • పీల్చిన ఆ గాలిని, పొత్తికడుపు కండరాల యొక్క శక్తివంతమైన సంకోచాలను చేస్తూ, బయటకు వదలండి.
 • 40 చక్రాల వరకు (40 సార్లు) బలవంతంగా ఉచ్ఛ్వాసము మరియు నిష్క్రియాత్మక ఉచ్ఛ్వాసాన్ని కొనసాగించండి.
 • ఇప్పుడు, కపాలభాతి యొక్క ఒక చక్రం పూర్తి చేసి లోతైన శ్వాస తీసుకోండి.
 • మరో 2 రౌండ్లు చేయండి.

కాపాలభాతి సాధనను కొత్తగా ప్రారంభించేవారికి, ఒకే రౌండ్లో 40 శ్వాసల చక్రం సాధించడం సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి, మొదట మీరు 10 శ్వాసల్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రదర్శించేటప్పుడు మీరే ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం అని మీరు గమనించుకోవాలి,  శిక్షణ పొందిన నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే దీన్ని సాధన చేయడం ప్రారంభించాలి.

ముందున్న లలాట శ్వాస కోటరాలు (frontal air sinuses) యొక్క శుద్దీకరణకు సహాయపడటం ద్వారా  శరీర శక్తి మరియు వేడి స్థాయిలను పెంచడం ద్వారా, కపాలభాతి వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి; ఆ ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి.

 • జీర్ణక్రియకు: కపాలభాతి శరీరం నుండి టాక్సిన్లను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. 2013 లో నిర్వహించిన ఒక అధ్యయనం కపాలభాతి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్ వ్యాధిని నిర్వహించడంలో దాని పాత్ర కనబర్చినట్టు తెలిసింది. 
 •  గుండె ఆరోగ్యానికి: ఒత్తిడిని తొలగించడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో కపాలభాతి సహాయపడుతుంది. అధిక రక్తపోటు గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె వ్యాధుల కోసం చికిత్స తీసుకునే వారు మందులతో పాటుగా కపాలభాతి కూడా చేయడం వలన అధిక ప్రయాజనం ఉంటుంది. 
 • బరువు నిర్వహణకు: కపాలభాతి బరువును తగ్గించడంలో ప్రభావంతంగా ఉంటుంది. ఈ విషయం 60 మంది అధిక బరువుతో ఉన్న వారి పై నిర్వహించిన అధ్యయనంలో రుజువైంది.  కపాలభాతి వలన వారి బిఎంఐ మరియు నడుము చుట్టూ కొలతలలో ప్రభావంతమైన తగ్గుదల కనిపించిందని ఈ  అధ్యయనం తెలిపింది.     
 •  చర్మం కోసం: కపాలభాతి టాక్సిన్లను తొలగించడం ద్వారా చర్మానికి సహజ మెరుపు మరియు కాంతిని అందిస్తుంది. మరియు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. 
 •  శ్వాసకు: ఫ్రంటల్ సైనసిస్ ను శుభ్రపరచడం ద్వారా కపాలభాతి శ్వాస క్రియకు సహాయం చేస్తుంది. తరుచుగా ఇది జలుబు, ఉబ్బసం, దగ్గు వంటి శ్వాసకోశ రుగ్మత చికిత్సలతో కూడా ఉపయోగపడుతుంది. ఇది క్షయ వ్యాధి చికిత్సలో కూడా సహాయపడుతుంది.
 • ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్యం కోసం: ఇతర ప్రాణాయామ ప్రక్రియల మాదిరిగానే కపాలభాతి కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారికి  కపాలభాతి ఒక అద్భుతమైన వ్యాయామం. ఇవికాక కపాలభాతి మెదడు యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది.     

కపాలభాతి సాంకేతిక ప్రక్రియ సాధారణంగా సురక్షితంగా ఉంటుంది, శిక్షణ పొందిన నిపుణుడి పర్యవేక్షణ లేకుండా దీనిని ప్రారంభించకూడదు. కపాల్ భాతి సాంకేతికతను మొదటసారి సాధన చేయడం ప్రారంభించేవారు (beginners) ప్రయాసకు గురి కాకుండా ఉండాలి మరియు ఈ క్రింది పరిస్థితులు లేదా రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని అభ్యాసం చేయకూడదు:

మీరు అలసట, అస్పష్టమైన దృష్టి లేదా వికారం అనుభవిస్తే మీరు ఈ వ్యాయామం చేయకూడదని గమనించడం చాలా అవసరం. కపాల్భాతి సాధన వల్ల ఫుఫుసకుహరంలో గాలి ఉండటం (న్యుమోథొరాక్స్) అనే రుగ్మత వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం నివేదించింది, కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

और पढ़ें ...

References

 1. Ministry of AYUSH, Govt. of India. NTERNATIONAL DAY OF YOGA Common Yoga Protocol. [Internet]
 2. A. Mooventhan, Vitthal Khode, L. Nivethitha. Effect of Yogic Breathing Techniques in New Sputum Positive Pulmonary Tuberculosis . Int J Prev Med. 2014 Jun; 5(6): 787–790. PMID: 25013700
 3. P. Shyam karthik et al. Effect of Pranayama and Suryanamaskar on Pulmonary Functions in Medical Students . J Clin Diagn Res. 2014 Dec; 8(12): BC04–BC06. PMID: 25653936
 4. Brown RP, Gerbarg PL. Yoga breathing, meditation, and longevity. Ann N Y Acad Sci. 2009 Aug;1172:54-62. PMID: 19735239
 5. Vivek Kumar Sharma et al. Effect of fast and slow pranayama on perceived stress and cardiovascular parameters in young health-care students . Int J Yoga. 2013 Jul-Dec; 6(2): 104–110. PMID: 23930028
 6. Nitin B. Gosewade et al. Effect of Various Eye Exercise Techniques along with Pranayama on Visual Reaction Time: A Case Control Study. J Clin Diagn Res. 2013 Sep; 7(9): 1870–1873. PMID: 24179885
 7. Dharmesh Kaswala et al. Can yoga be used to treat gastroesophageal reflux disease? Int J Yoga. 2013 Jul-Dec; 6(2): 131–133. PMID: 23930033
 8. Kulkarni S et al. Stress and hypertension. WMJ. 1998 Dec;97(11):34-8. PMID: 9894438
 9. Stancák A Jr et al. Kapalabhati--yogic cleansing exercise. I. Cardiovascular and respiratory changes. Homeost Health Dis. 1991;33(3):126-34. PMID: 1818666