గర్భస్రావం అనేది స్త్రీ జీవితంలో అత్యంత బాధాకరమైన పరిస్థితులలో ఒకటి, అది అనేక భావోద్వేగాలను కలిగిస్తుంది. ఇది షాక్ మరియు అపరాధభావాన్ని కలిగించడమే కాక, నిరాశ మరియు ఆందోళనకు ప్రధాన కారణాలలో ఒకటి. మొదటిసారి తల్లి కాబోతున్నవారికి మరియు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.

గర్భస్రావం (మిస్ కేరేజ్) అర్థం

గర్భస్రావం (మిస్ కేరేజ్) అంటే గర్భధారణ యొక్క 20 వారాల కంటే ముందు పిండానికి సహజంగా  హాని కలుగడం. మొదటి త్రైమాసికంలో 10 నుండి 15% కంటే ఎక్కువ గర్భాలు ముగుస్తాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు.

కొంతమంది మహిళలకు అసలు గర్భస్రావం కావడానికి ముందు వారు గర్భవతి అనే విషయం కూడా తెలియకపోవచ్చు.

అయితే దీని వల్ల మీరు మళ్ళీ బిడ్డను కనలేరని కాదు. బహుళ గర్భస్రావాలు సంభవించడం చాలా అసాధారణం ఇవి 100 మంది మహిళల్లో ఒకరిలో సంభవించవచ్చ. కుటుంబం సభ్యులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో స్త్రీకి అన్ని విధాలా వారి సహకారం అవసరం. ఆమె ఇంకా బాధను ఎదుర్కొంటున్నప్పుడు ఆమెను మరొక గర్భం కోసం కంగారు పెట్టడం కూడా అన్యాయం. బదులుగా, ఆమె మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సరైన కౌన్సిలింగ్ మరియు మార్గదర్శకత్వం అందించాలి, అందువల్ల ఆమె గర్భాన్ని కోల్పోతుందనే లేదా గర్భధారణ పట్ల భయం ఏర్పడదు.

 1. గర్భస్రావం యొక్క కారణాలు మరియు ప్రమాద కారకాలు - Causes and risk factors of miscarriage in Telugu
 2. గర్భస్రావం రకాలు - Types of miscarriage in Telugu
 3. గర్భస్రావం యొక్క సంకేతాలు - Signs of miscarriage in Telugu
 4. గర్భస్రావ అవకాశాలు - Chances of miscarriage in Telugu
 5. గర్భస్రావ చికిత్స - Miscarriage treatment in Telugu
 6. గర్భస్రావాన్ని ఎలా నివారించాలి - How to prevent miscarriage in Telugu
 7. గర్భస్రావం తరువాత సంరక్షణ - After miscarriage care in Telugu
 8. గర్భస్రావం తరువాత మళ్ళి గర్భం దాల్చడం - Pregnancy or conceiving after miscarriage in Telugu

పిండం యొక్క గర్భస్రావానికి అనేక ప్రమాద కారకాలు ముడిపడి ఉంటాయి. వీటిలో వృద్ధాప్యం, ఊబకాయం మరియు మద్యం, ధూమపానం వంటి జీవనశైలి అలవాట్లు ఉన్నాయి. అయితే, సాధారణంగా  స్త్రీ దీనికి బాధ్యత కలిగి ఉండదు.

మొదటి మరియు రెండవ త్రైమాసికంలో గర్భస్రావం కావడానికి కారణమైన కొన్ని రుజువు-ఆధారిత కారకాలను పరిశీలిద్దాం.

క్రోమోజోమ్ల అసాధారణతలు

ప్రతి బిడ్డ తన తల్లి మరియు తండ్రి నుండి చెరో సగం డీఎన్ఏ (DNA) ను పొందుతుంది, కాబట్టి, తల్లిదండ్రుల క్రోమోజోమ్ నిర్మాణంలో ఏదైనా అసాధారణత పిండానికి బదిలీ చేయబడుతుంది. పిండంలో అసాధారణమైన కార్యోటైప్ (క్రోమోజోమల్ నిర్మాణం) అకాలపు మరియు పునరావృత గర్భస్రావాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. ఏదేమైనా, అటువంటి అసాధారణతలను కలిగి ఉన్న జంటలలో గర్భస్రావం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అసాధారణతలు లేని జంటలలో  కూడా గర్భస్రావం అయ్యే అవకాశం సమానంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అలాగే, తల్లిదండ్రులు వారి డీఎన్ఏ లో ఏవైనా  అసాధారణతలు కలిగి ఉన్నారా అని తనిఖీ చేసే క్రోమోజోమ్ పరీక్షలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో గర్భం ధరించడానికి ఉత్తమమైన మార్గాల గురించి మీరు వైద్య సలహా పొందవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవైనప్పటికీ, పునరావృత గర్భస్రావాలు జరిగితే సాధారణంగా డీఎన్ఏ విశ్లేషణ పరీక్ష సూచించబడుతుంది. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు.

సాధారణంగా, ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పిజిడి [preimplantation genetic diagnosis]) ప్రాణముతో ఉండే శిశువు ప్రసవ అవకాశాలను పెంచుతుందని నమ్ముతారు, కాని ఉన్న ఆధారాలు దానికి సరిపోవు. అటువంటి సందర్భాల్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా గర్భం ధరించడం కూడా ఒక మార్గంగా ఉంటుంది.

థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం (Thyroid dysfunction)

హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (Human chorionic gonadotropin [HCG]) యొక్క పెరిగిన స్థాయి వివిధ థైరాయిడ్ హార్మోన్‌లపై ప్రభావం చూపుతుంది. చాలా మంది మహిళల్లో ఈ పరిస్థితి నయమైపోతుంది మరియు హానికరం కానప్పటికీ, ఇప్పటికే హార్మోన్ల అసాధారణతలను కలిగి ఉన్న మహిళల్లో గర్భస్రావం మరియు మృతపిండ జననం వంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, టి ఎస్ హెచ్ (TSH) స్థాయిల యొక్క పెరిగిన స్థాయిలు, > 2.5 mlU / L గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.

థైరాయిడ్ ఆటో ఇమ్యునిటీ (శరీరం థైరాయిడ్ గ్రంధికి వ్యతిరేకంగా ఆంటీబాడీలను తయారుచేసినప్పుడు) ఉన్న మహిళలకు కూడా అదే జరుగుతుంది. ఒక నమ్మకం ఏమిటంటే, అధిక సంఖ్యలో ఆటోఆంటిబాడీలు గర్భధారణను ఆలస్యం చేస్తాయి మరియు రోగనిరోధక శక్తిని అధికంగా ప్రేరేపిస్తాయి, అప్పుడు సాధారణంగా, అది పిండం యొక్క నష్టానికి దారితీస్తుంది. అయితే, దీనికి  థైరాయిడ్ ఆటోఆంటిబాడీ టైటర్ తో సంబంధంలేనట్లు కనుగొనబడింది.

పిసిఓఎస్ (PCOS) లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

పిసిఒఎస్ హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మరొక రుగ్మత, ఇది గర్భధారణ ప్రారంభంలోనే గర్భస్రావాలకు బాధ్యత వహిస్తుందని తేలింది. ఈ పరిస్థితి వెనుక ఉన్న మెకానిజంను అర్థం చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. అయితే, తెలిసిన అధరాలు అసంపూర్తిగా ఉన్నాయి. పిసిఒఎస్ సంబంధిత గర్భస్రావంతో అనేక అంశాలు ముడిపడి  ఉంటాయి. వాటిలో ఇవి ఉంటాయి:

 • ఊబకాయం
 • అసాధారణ లూటినైజింగ్ హార్మోన్
 • ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది
 • ఎండోమెట్రియం పనిచేయకపోవడం
 • మాయ (ప్లెసెంటా)లో రక్తం గడ్డకట్టడం పెరుగుతుంది 

రోగనిరోధక శక్తి పనిచేయకపోవడం

తల్లి రోగనిరోధక వ్యవస్థ పిండం యొక్క ఇంప్లాంటేషన్‌కు మద్దతు ఇస్తుందని తెలిసినప్పటికీ, తల్లి యొక్క రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వలన గర్భస్రావం కలుగుతుందనే ఆధారాలు కూడా ఉన్నాయి (ఈ ఆధారాలు వివాదాస్పదంగా కూడా ఉన్నాయి). సాధారణంగా, ఆటోయాంటిబాడీలు పునరావృత (recurrent) గర్భస్రావాల ప్రమాదంతో ముడిపడి ఉంటాయి. జంతు అధ్యయనాలు కొన్ని రోగనిరోధక అణువుల లేకపోవడం అనేది పిండ నష్టంతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుపుతున్నాయి.

హ్యూమన్ రీప్రొడక్షన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గర్భస్రావం కల్గిన మహిళలలో టిఎన్ఎఫ్ (TNF) స్థాయి మరియు వాపు పెరుగుతుందని తెలుస్తుంది. మునుపటి అధ్యయనంలో, NK (నేచురల్ కిల్లర్) కణాల చర్యలు మరియు పనితీరులో అసమతుల్యత ప్రెగ్నన్సీ యొక్క ముందస్తు గర్భస్రావానికి కారణమని మరొక అధ్యయనం పేర్కొంది.

థ్రోమ్బోఫిలియా (Thrombophilia)

థ్రోమ్బోఫిలియా అంటే శరీరంలో రక్తం అధికంగా గడ్డకట్టే పరిస్థితిని సూచిస్తుంది. ఇది జన్యుసంబంధమైనది లేదా మాములుగా ఇతర కారణాల వలన కూడా సంభవించవచ్చు. థ్రోంబోఫిలియాతో బాధపడుతున్న మహిళలలో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే రక్తం అధికంగా గడ్డకట్టడం వలన మాయ (ప్లెసెంటా) కి రక్త ప్రవాహం పరిమితమైపోతుంది తద్వారా అది గర్భస్రావానికి దారితీస్తుంది. ఈ మహిళలకు తక్కువ మోతాదులో యాంటీ-క్లాటింగ్ ఔషధాలను అందించడం వల్ల పిండం మనుగడకు అవకాశాలు పెరుగుతాయని క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, అధరాలు అంత బలంగా లేవు. కాబట్టి, థ్రోంబోఫిలియాతో బాధపడుతుంటే, స్వీయ-మందులను ఉపయోగించడానికి బదులుగా వైద్యులని సంప్రదించాలని బలంగా సిఫార్సు చేయబడుతుంది.

ఎక్టోపిక్ గర్భం

గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లో పిండం నాటుకున్నపుడు (ఇంప్లాంట్) ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఫెలోపియన్ ట్యూబ్ ఒక నిర్దిష్ట పరిమాణానికి మించి విస్తరించలేదు, అందువలన ఈ రకమైన త్వరగా గర్భం ముగిసిపోతుంది (గర్భస్రావం కలుగుతుంది) లేదా తొలగించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇది తల్లికి కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. గణాంకాల ప్రకారం నాలుగు ఎక్టోపిక్ గర్భాలలో ఒకదానిలో గర్భస్రావం అవుతుంది.

ఎక్టోపిక్ గర్భం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:

ఈ సంకేతాలలో వేటినైనా గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యులని సంప్రదించడం మంచిది.

స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ (Sperm DNA fragmentation)

విచ్ఛిన్నమైన/చిన్న చిన్న ముక్కలుగా మారిన వీర్యకణ డిఎన్ఏ యొక్క గర్భం ఏర్పడే సౌలభ్య ప్రభావాలను అంచనా వేయడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. ఫలితాలు వైరుధ్యం లేకుండా లేవు. ఏదేమైనా, ఏఆర్ సి జర్నల్ ఆఫ్ గైనకాలజీ మరియు ఒబెస్ట్ట్రిక్స్ (ARC Journal of Gynaecology and obstetrics)లో  ప్రచురించబడిన ఒక అధ్యయనం, అధిక స్థాయిలో వీర్యకణ డిఎన్ఏ నష్టం అనేది గర్భస్రావం అయ్యే ప్రమాదంతో ముడిపడి ఉందని సూచిస్తుంది, ఇది మరీ ముఖ్యంగా పునరావృత గర్భధారణ నష్టాల విషయంలో ఉంటుందని కూడా సూచించింది.

గర్భస్రావానికి ఇతర కారణాలు

పై కారకాలు కాకుండా, గర్భస్రావం ఈ కింది వాటి వల్ల కూడా సంభవించవచ్చు:

 • తక్కువ బరువు ఉండటం
 • లైంగిక సంక్రమణ వ్యాధులు
 • ఫైబ్రాయిడ్లు
 • లిస్టిరియోసిస్ మరియు సాల్మొనెలోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు
 • అధిక రక్తపోటు, మధుమేహం మరియు ల్యూపస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు
 • అసాధారణ గర్భాశయ ఆకారం
 • ఎన్ఎస్ఏఐడి (NSAID) లు వంటి కొన్ని రకాల మందులు
 • గర్భాశయ గోడలలో బలహీనత ఇది శస్త్రచికిత్సా విధానం వల్ల కావచ్చు లేదా కాకపోవచ్చు
 • తక్కువ స్థాయి హెచ్‌సిజి ([HCG] హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)

ఆరోగ్యకరమైన మహిళల్లో ఈ కింది కారణాల వలన గర్భస్రావం జరగదు

 • వ్యాయామం
 • సెక్స్
 • అంతకుముందు గర్భస్రావం
 • వంశపారంపర్య
 • ఆకస్మిక షాక్
 • వికారము
 • గర్భధారణకు ముందు గర్భనిరోధక మందులు వాడటం 

ఈ కారణాల వలన గర్భస్రావం కలుగుతుందేమో అని చాలామందిలో అనుమానం ఉంటుంది కానీ అది నిజం కాదు.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

పిండం మరియు అమ్నియోటిక్ శాక్ (ఉమ్మ నీటి సంచి) యొక్క అభివృద్ధి స్థితిని బట్టి, గర్భస్రావం క్రింది రకాలుగా ఉంటుంది:

బెదిరింపు గర్భస్రావం (Threatened miscarriage): పేరు సూచించినట్లుగా, ఇది నిజమైన గర్భస్రావం కాదు, కానీ పట్టించుకోకపోతే గర్భస్రావం జరగవచ్చు. ఇది సాధారణంగా యోని రక్తస్రావం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను కలిగి ఉంటుంది కాని అంతర్గతంగా సవ్యంగానే ఉంటుంది. అదృష్టవశాత్తూ కేవలం, థ్రెటెండ్ మిస్ కరైజ్స్ లో 5% కన్నా తక్కువ మాత్రమే గర్భస్రావానికి దారితీస్తాయి.

అనివార్య గర్భస్రావం (Inevitable miscarriage): గర్భం దాల్చిన 20 వారాల లోపు అమ్నియోటిక్ శాక్ విచ్ఛిన్నం కావడం వల్ల ఈ రకమైన గర్భస్రావం సంభవిస్తుంది. పిండ భాగాలు ఇంకా రానప్పటికీ, యోనిలో రక్తస్రావం మరియు తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ రకమైన గర్భస్రావంలో పిండం మనుగడకు అవకాశం ఉండదు.

అసంపూర్ణ గర్భస్రావం (Incomplete miscarriage): యోని రక్తస్రావం మరియు నడుము నొప్పి మాత్రమే కాకుండా, పిండం యొక్క అవశేషాలు కూడా గర్భాశయం నుండి బయటకు వచ్చేస్తాయి. అయినప్పటికీ, అమ్నియోటిక్ శాక్ యొక్క కొన్ని భాగాలు ఇంకా గర్భాశయం లోపల ఉండవచ్చు. దీనిలో సంక్రమణ ప్రమాదం కూడా ఉంటుంది.

పూర్తి గర్భస్రావం (Complete miscarriage): పిండం మరియు అమ్నియోటిక్ శాక్ సహా గర్భాశయంలోని అన్ని భాగాలు  బయటకు వచ్చేస్తాయి మరియు సెర్వికల్ ఓఎస్ (cervical os) మూసివేయబడుతుంది. ఎండోమెట్రియం 15 మిమీ కంటే తక్కువ మందంతో ఉంటుంది.

ఆలస్య గర్భస్రావం (Delayed miscarriage): దీనిని తప్పిపోయిన గర్భస్రావం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే గర్భస్రావాన్ని గుర్తించాడనికి ముందు దాదాపు నాలుగు వారాల వరకు పిండం గర్భాశయంలోనే ఉండిపోతుంది. కానీ తల్లిలో మూడ్ స్వింగ్స్ మరియు మార్నింగ్ సిక్నెస్ వంటి గర్భధారణ లక్షణాలు తగ్గుతాయి లేదా పూర్తిగా ఉండకపోవచ్చు.

చెడిపోయిన అండం (Blighted ovum): మాయ మరియు అమ్నియోటిక్ శాక్ అభివృద్ధి చెందాయి కాని పిండం పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి గర్భకోశం  ఖాళీగా ఉంటుంది. సాధారణంగా చెడిపోయిన అండం ఉన్నప్పుడు గర్భస్రావం వెంటనే జరుగుతుంది.

పునరావృత గర్భస్రావం (Recurrent miscarriage): స్త్రీ వరుసగా 2-3 సార్లు గర్భస్రావాలని ఎదుర్కొన్నప్పుడు ఇలా అంటారు.

గర్భస్రావం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు దాని రకాన్ని బట్టి మారవచ్చు. అయినప్పటికీ, ఇది ఎల్లప్పుడూ కడుపులో పదునైన నొప్పులతో మరియు యోని రక్తస్రావంతో ముడిపడి ఉంటుంది, రక్తస్రావం తేలికగా లేదా భారీగా ఉండవచ్చు. కొంతమంది మహిళలు స్పాట్టింగ్ (రక్తపు చుక్కలు) ను అనుభవిస్తారు, అయినప్పటికీ, గర్భధారణ ప్రారంభంలో వీటిని గమనించడం అనేది ఎల్లప్పుడూ గర్భస్రావం యొక్క సూచన కాదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే, గైనకాలజిస్ట్ తో మాట్లాడటం మంచిది. గర్భస్రావాన్ని సూచించే కొన్ని లక్షణాలు మరియు సంకేతాలను పరిశీలిద్దాం.

 • ఉదర తిమ్మిరి
 • స్పాటింగ్ లేదా యోని రక్తస్రావం కొన్ని రోజుల పాటు ఉండవచ్చు.
 • గర్భధారణ యొక్క సాధారణ లక్షణాల లేకపోవడం
 • రక్త గడ్డలు (క్లాట్స్) లేదా ముదురు రంగు యోని స్రావాలు 
 • యోని స్రావాలలో కణజాలం.
 • తరచు మరియు క్రమమైన సంకోచాలు

ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ, ప్రారంభ దశలో గర్భధారణ నష్టాన్ని (గర్భస్రావాన్ని) నిర్ధారించడానికి వైద్యులు అల్ట్రాసౌండ్ చేయవలసి ఉంటుంది. ఏదేమైనా, తరువాతి త్రైమాసికంలో లక్షణాలు ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ ప్రకారం, సారవంతమైన (ఫెర్టిల్) యువతులకు గర్భస్రావం అయ్యే అవకాశం 10 నుండి 25% ఉంటుంది మరియు వయస్సుతో ఈ శాతం పెరుగుతుంది. ఏదేమైనా, మునుపటి గర్భస్రావం మహిళలు మళ్లీ గర్భాన్ని కోల్పోతారని నిర్ధారించదు. వయస్సు ప్రకారం గర్భస్రావ అవకాశాల గురించి తెలిపే పట్టిక ఇక్కడ ఉంది.

వయసు (సంవత్సరాలలో)

గర్భస్రావ అవకాశాలు  (%)

<35

15

35-45

20-30

>45

50

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

దురదృష్టవశాత్తు, ఒకసారి గర్భస్రావం జరిగితే, పిండాన్ని కాపాడే మార్గం లేదు. గర్భస్రావం చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం అధిక రక్తస్రావాన్ని మరియు తల్లిలో ఇన్ఫెక్షన్ల అభివృద్ధిని ఆపడం.

అయితే, అప్పటివరకు పిండానికి ఎటువంటి హాని జరగనందున బెదిరింపు గర్భస్రావాన్ని (threatened miscarriage) కాపాడవచ్చు. తగినంత విశ్రాంతి మరియు శృంగారానికి దూరంగా ఉండటం ఈ సమస్యను తగ్గించడానికి ఉత్తమ మార్గాలు. మీ వ్యక్తిగత పరిస్థితి గురించి గైనకాలజిస్ట్ కు బాగా తెలుస్తుంది.

పిండం మరియు గర్భధారణ సంచి స్వయంగా బయటకు వచ్చేస్తాయి లేదా రాకపోవచ్చు (సాధారణంగా ఇది గర్భధారణ ప్రారంభంలోనే జరుగుతుంది). ఒక డి మరియు సి [D & C] (డైలేషన్ మరియు క్యూరెట్) విధానాన్ని సూచించవచ్చు, దీనిలో, తల్లి శరీరం నుండి మిగిలిన పిండ అవశేషాలను తొలగించడానికి గర్భాశయ ద్వారం కొద్దిగా విస్తరించబడుతుంది. డి & సి తరువాత, ఒక మహిళకు 10 రోజుల వరకు రక్తస్రావం కావచ్చు. అయితే జ్వరం, అధిక రక్తస్రావం లేదా అధిక నొప్పి ఉంటే, ఆలస్యం చేయకుండా వైద్యులని సంప్రదించాలి.

ఆరోగ్యకరమైన గర్భం కోసం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడి లేని జీవనశైలిని అనుసరించడం మంచిది. గర్భస్రావాన్ని నివారించడానికి మీరు చేయగలిగే అనేక చర్యలు కూడా ఉన్నాయి.

 • మద్యం మానుకోవాలి 
 • పొగ త్రాగరాదు 
 • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి
 • ధ్యానం లేదా ప్రసూతి యోగా సాధన చెయ్యండి
 • మీ వైద్యుల సలహాను పాటించండి మరియు అపాయింట్‌మెంట్‌లను ఎప్పుడు దాటవేయకండి
 • పోషకమైన ఆహారం తీసుకోండి
 • ఏవైనా అసాధారణతలు ఉంటే జాగ్రత్త వహించండి మరియు మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోండి.

స్త్రీ యొక్క మానసిక మరియు శారీరక స్థితిని బట్టి, గర్భస్రావం నయం కావడానికి ఒక మోస్తరు లేదా ఎక్కువ సమయం పడుతుంది. గర్భాన్ని కోల్పోవడం వలన యోని రక్తస్రావం మరియు నొప్పి ఉంటాయి, త్వరగా నయం కావడానికి మరియు స్త్రీ యొక్క గర్భధారణ పూర్వ స్థితికి తిరిగి చేరుకోవడానికి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వాటిని తెలుసుకుందాం.

 • వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ ను నివారించరాదు
 • టాంపోన్లకు బదులుగా శానిటరీ ప్యాడ్లను ఉపయోగించండి
 • రక్తస్రావం తగ్గనంతవరకు సెక్స్ నుండి దూరంగా ఉండండి
 • తరువాతి గర్భధారణలలో శరీరంలోని రోగనిరోధక శక్తి ప్రతిచర్యను నివారించడానికి Rh- నెగటివ్ మహిళకు గర్భస్రావం తరువాత యాంటీ-డి-ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ (anti D-immunoglobulin injection) అవసరం కావచ్చు.
 • యోని స్రావాలలో దుర్వాసన, అధిక రక్తస్రావం లేదా గడ్డకట్టడం పెరగడం (increased clotting) వంటివి గమనిస్తే మీ వైద్యునితో మాట్లాడండి.
 • 20 వ వారంలో గర్భస్రావం కలిగిన మహిళలు వారి రొమ్ముల నుండి కొంత పాల స్రావాలను గమనించవచ్చు. ఈ పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
 • నొప్పిని తగ్గించడానికి నొప్పి నివారణలు తీసుకోవచ్చు
 • హిమోగ్లోబిన్ స్థాయిలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు.
Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

గర్భం కోల్పోవడం స్త్రీ తప్పు కాదని మరియు గర్భస్రావం అంటే మళ్ళి గర్భం ధరించలేకపోవడమని అర్ధం కాదని మీకు ఈపాటికి తెలిసి ఉంటుంది. వాస్తవానికి, గర్భస్రావ లక్షణాల తగ్గిన తర్వాత వీలైనంత త్వరగా ఒక నెలలోనే మహిళ తన సారవంతమైన స్థితికి (ఫెర్టైల్ స్టేట్) తిరిగి వస్తుంది. కానీ మానసిక బాధ తగ్గడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కౌన్సెలింగ్ అవసరం కావచ్చు లేదా కాకపోవచ్చు కానీ కుటుంబ సహకారం తప్పకుండా ఉండాలి.

గర్భస్రావం యొక్క ఖచ్చితమైన కారణం తెలుసుకోవడం కోసం తప్పకుండా వైద్యులతో మాట్లాడాలని సిఫార్సు చేయబడుతుంది. తద్వారా, భవిష్యత్తులో దీన్ని సరిదిద్దవచ్చు లేదా నిర్వహించవచ్చు. స్త్రీకి గర్భస్రావం యొక్క మునుపటి చరిత్ర ఉంటే ఇది ఇంకా చాలా ముఖ్యం.

మళ్ళీ గర్భం ధరించే ముందు కొంత సమయం తీసుకొవడం మంచిది కాబట్టి గర్భనిరోధక విధానాలను గురించి తెలుసుకోవడం ఉత్తమం.

వనరులు

 1. Francine deMontigny et al. Women’s persistent depressive and perinatal grief symptoms following a miscarriage: the role of childlessness and satisfaction with healthcare services . Arch Womens Ment Health. 2017; 20(5): 655–662. PMID: 28623418
 2. Oliver A, Overton C. Diagnosis and management of miscarriage. Practitioner. 2014 May;258(1771):25-8, 3. PMID: 25055407
 3. National Health Service [Internet]. UK; Miscarriage.
 4. Franssen MT et al. Reproductive outcome after chromosome analysis in couples with two or more miscarriages: index [corrected]-control study. . BMJ. 2006 Apr 1;332(7544):759-63. Epub 2006 Feb 22. PMID: 16495333
 5. Franssen MT et al. Selective chromosome analysis in couples with two or more miscarriages: case-control study. BMJ. 2005 Jul 16;331(7509):137-41. Epub 2005 Jun 28. PMID: 15985440
 6. Franssen MT et al. Reproductive outcome after PGD in couples with recurrent miscarriage carrying a structural chromosome abnormality: a systematic review. Hum Reprod Update. 2011 Jul-Aug;17(4):467-75. PMID: 21504961
 7. Sima Nazarpour et al. Thyroid dysfunction and pregnancy outcomes. Iran J Reprod Med. 2015 Jul; 13(7): 387–396. PMID: 26494985
 8. Negro R et al. Increased pregnancy loss rate in thyroid antibody negative women with TSH levels between 2.5 and 5.0 in the first trimester of pregnancy. J Clin Endocrinol Metab. 2010 Sep;95(9):E44-8. PMID: 20534758
 9. Kaprara A, Krassas GE. Thyroid autoimmunity and miscarriage. Hormones (Athens). 2008 Oct-Dec;7(4):294-302. PMID: 19121990
 10. Sadishkumar Kamalanathan et al. Pregnancy in polycystic ovary syndrome . Indian J Endocrinol Metab. 2013 Jan-Feb; 17(1): 37–43. PMID: 23776851
 11. Calleja-Agius J et al. Investigation of systemic inflammatory response in first trimester pregnancy failure. Hum Reprod. 2012 Feb;27(2):349-57. PMID: 22131390
 12. King K et al. Detailed analysis of peripheral blood natural killer (NK) cells in women with recurrent miscarriage. Hum Reprod. 2010 Jan;25(1):52-8. PMID: 19819893
 13. Lassere M, Empson M. Treatment of antiphospholipid syndrome in pregnancy--a systematic review of randomized therapeutic trials. Thromb Res. 2004;114(5-6):419-26. PMID: 15507273
 14. National Health Service [Internet]. UK; Miscarriage.
 15. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Miscarriage
 16. healthdirect Australia. Your health after a miscarriage. Australian government: Department of Health
Read on app