‘’ఎరుపు బంగారం’అని ప్రముఖంగా తెలుపబడింది, కుంకుమ పువ్వు ప్రపంచం‌లో అత్యంత విలువైన సుగంధ ద్రవ్యం.  ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుండి వస్తుంది.  మనకు తెలిసిన కుంకుమ పువ్వు, వాస్తవానికి క్రాకస్ పువ్వు యొక్క ఎండిన నారింజ-ఎరుపు రంగు కీలాగ్రం.  కుంకుమ మొక్క, దాని మూలాలను మధ్యధరా ప్రాంతం‌లో కలిగిఉందని భావిస్తారు.  కుంకుమ పువ్వు ఉత్పత్తి దారులలో ఇరాన అతి పెద్ద ఉత్పత్తిదారు, ప్రంపంచం యొక్క మొత్తం కుంకుమ పువ్వు ఉత్పత్తిలో 94% కంటే ఎక్కువ వాటాను ఇది కలిగిఉంది.  భారతదేశం‌లో, జమ్ము & కాశ్మీర్ మరిరు హిమాచల్ ప్రదేశ్‌లో కుంకుమ పువ్వును సాగుచేస్తారు, దేశం‌లో ఈ మొక్కలను పెంచే అతి పెద్ద ఉత్పత్తిదారుగా జమ్ము & కాశ్మీర్ ఉంది.

పువ్వు నుండి కుంకుమ పువ్వును కోత కోయడం ఒక కష్టమైన పని.  కొన్ని సంవత్సరాల వ్యవధిలో కుంకుమ పువ్వు ఒకసారి మాత్రమే పండించడం జరుగుతుంది.  1 కిలోగ్రా‌మ్ కుంకుమ పువ్వు  దాదాపుగా 1,60,000 నుండి 1,70,000 వరకూ చిన్న పువ్వులను కలిగిఉంటుంది.  కుంకుమ ఉత్పత్తికి అవసరమైన తీవ్రమైన శ్రమ దీనిని ప్రపంచం‌లోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా చేసింది.  అత్యుత్తమమైన కుంకుమ పువ్వు దాని యొక్క అన్ని ఎరుపు రంగు కలిగిన మరియు ఏకరీతిగా పొడవైన దారాలు ద్వారా గుర్తించబడుతుంది.  నీరు లేదా ఏదైనా ద్రవం‌తో కుంకుమ పువ్వును కలపడం వల్ల, ఆ ద్రవానికి ఒక బంగారు పసుపు రంగు వస్తుంది, ఈ రంగు చూడడానికి గొప్పగా మరియు ఆకర్షణీయంగా ఆ ద్రవాన్ని చేస్తుంది. 

కుంకుమ పువ్వు యొక్క ప్రకాశవంతమైన మరియు తియ్యటి వాసనను వివిధ మొఘలాయి వంటకాల నుండి సులభంగా బయటకు గుర్తించవచ్చు.  కుంకుమ పువ్వును సాధారణంగా అనేక భారతీయ తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు, ప్రత్యేకంగా ఖీర్ మరియు పాయసం‌లో అదనపు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు.  దీనిని బిర్యానీ వంటి మసాలా వంటకాలు, కేకులు మరియు బ్రెడ్‌లలో కూడా ఉపయోగిస్తారు.  ఒక సుగంధమైన మొక్కగా దీనిని సాధారణంగా సువాసన ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు.  చైనా మరియు భారతదేశం‌లో కుంకుమ పువ్వును ఒక ఫ్యాబ్రిక్ రంగుగా మరియు తరచుగా మతపరమైన ప్రయోజనాల కొరకు, దీనిని ఒక పవిత్రమైన వస్తువుగా కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

అనేక సంవత్సరాలు ఔషధం యొక్క సాంప్రదాయ, ప్రత్యామ్నాయ వ్యవస్థలలో కుంకుమ పువ్వు ఉపయోగించబడింది.  ఇది యాంటిఆక్సిడంట్లను అధికంగా కలిగిఉంటుంది మరియు ఇతర మొక్క-ఉత్పన్న సమ్మేళనాలు రోగ నిరోధక వ్యవస్థకు ఉపయోగపడతాయి మరియు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.  కుంకుమ పువ్వు యొక్క చికిత్సా లక్షణాల కారణంగా, వీటిని యాంటిసెప్టిక్స్, డైజెస్టి‌వ్స్, యాంటిడిప్రెజంట్స్ మరియు మూర్ఛ వ్యాధిని తగ్గించే పదార్థాలుగా కూడా ఉపయోగిస్తారు.  ఈ సుగంధ ద్రవ్యం, పొటాషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలను మరియు విటమిన్ ఎ, విటమిన్ సి మొదలగు వంటి అవసరమైన విటమిన్లను కూడా అధికంగా కలిగిఉంది.

కుంకుమ పువ్వు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • వృక్ష శాస్త్రీయ నామం: క్రోకస్ సాటివస్
 • కుటుంబం: ఇరిడేసియే
 • వ్యవహారిక పేర్లు: సాఫ్రా‌న్, కేసర్, జఫ్రాన్
 • సంస్కృత నామం: కేసర: (కేసర), కుంకుమతి(కుంకుమతి)
 • ఉపయోగించే భాగాలు: మనము ఉపయోగించే కుంకుమ పువ్వు సుగంధపు కర్రలు, పువ్వు యొక్క కీలాగ్రం నుండి వస్తాయి, ఇవి చేతితో పండించబడతాయి మరియు తర్వాత ఎండబెట్టబడి, భవిష్యత్తు వినియోగం కోసం నిల్వ చేయబడతాయి.
 • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కుంకుమ పువ్వు తన మూలాలను ఆగ్నేయ ఆసియాలో కలిగిఉందని భావించబడుతుంది.  గ్రీస్ దీనిని మొట్టమొదట పండించింది.  తర్వాత ఇది యురేషియా, లాటిన్ అమెరికా మరియు ఉత్తర ఆఫ్రికాలకు వ్యాపించింది.
 • ఆసక్తికర అంశం: త్రివర్ణ భారతీయ జెండా యొక్క మొదటి రంగు, కుంకుమ పువ్వు యొక్క రంగు ద్వారా స్ఫూర్తి పొందింది. 
 1. కుంకుమ పువ్వు పోషక విలువలు - Saffron nutrition facts in Telugu
 2. కుంకుమ పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు - Saffron health benefits in Telugu
 3. కుంకుమ పువ్వు దుష్ప్రభావాలు - Saffron side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

అవసరమైన వివిధ రకాల ఖనిజాలు మరియు విటమిన్లను కుంకుమ పువ్వు కలిగిఉంది.  కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ మరియు ఇనుము వంటి వాటిని ఇది పుష్కలంగా కలిగిఉంది.  విటమిన్ ఎ, బి1, బి2, బి9 మరియు సి వంటి విటమిన్లను కూడా కుంకుమ పువ్వు అధికంగా కలిగిఉంది. కుంకుమ పువ్వు అనేక మొక్క-ఉత్పన్న రసాయన భాగాలను కలిగిఉంది.  క్రోసిన్, క్రోసిటిన్ మరియు సఫ్రానల్ అన్నవి ఈ సుగంధద్రవ్యం యొక్క మూడు ప్రధాన భాగాలు, ఇవి దాని యొక్క రంగు, రుచి మరియు వాసనకు దోహదం చేస్తాయి.

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. కుంకుమ పువ్వు క్రింద ఇవ్వబడిన పోషకాలను అందిస్తుంది:

పోషకాలు విలువ, 100 గ్రా.లకు
నీరు 11.9 గ్రా.
శక్తి 310 కి.కేలరీలు
ప్రొటీన్ 11.43 గ్రా.
కొవ్వు 5.85 గ్రా.
బూడిద 5.45 గ్రా.
కార్బోహైడ్రేట్ 65.37 గ్రా.
ఫైబర్ 3.9 గ్రా.
ఖనిజాలు  
కాల్షియం 111 మి.గ్రా.
ఇనుము 11.1 మి.గ్రా.
మెగ్నీషియం 264 మి.గ్రా.
ఫాస్ఫరస్ 252 మి.గ్రా.
పొటాషియం 1724 మి.గ్రా.
సోడియం 148 మి.గ్రా.
జింక్ 1.09 మి.గ్రా.
కాపర్ 0.328 మి.గ్రా.
మాంగనీస్ 28.408 మి.గ్రా.
సెలీనియం 5.6 µగ్రా.
విటమిన్లు  
విటమిన్ ఎ 27 µగ్రా.
విటమిన్ బి1 0.115 మి.గ్రా.
విటమిన్ బి2 0.267 మి.గ్రా.
విటమిన్ బి3 1.46 మి.గ్రా.
విటమిన్ బి6 1.01 మి.గ్రా.
విటమిన్ బి9 93 µగ్రా.
విటమిన్ సి 80.8 మి.గ్రా.
కొవ్వులు/కొవ్వు ఆమ్లాలు  
సంతృప్త కొవ్వు ఆమ్లాలు 1.586 గ్రా.
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.429 గ్రా.
ఇతర అంశాలు  
కెంప్‌ఫెరాల్ 205.5 మి.గ్రా.
 • రోగనిరోధక శక్తి కోసం: కెరోటినాయిడ్ల ఉనికి కారణంగా వ్యక్తిగత రోగనిరోధక శక్తి పైన ఒక సానుకూల ప్రభావాన్ని కుంకుమ పువ్వు కలిగిఉందని రుజువు చేయబడింది.
 • అథ్లెట్ల కోసం: కుంకుమ పువ్వు అథ్లెటిక్ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు కండరాల బరువు మరియు బలాన్ని పెంచుతుంది.
 • కొలెస్ట్రాల్ కోసం: కుంకుమ పువ్వు యొక్క వినియోగం, మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డి‌ఎల్ (తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్) మరియు ట్రైగ్లిజరైడ్ల యొక్క స్థాయిలను తగ్గిస్తుందని రుజువుచేయబడింది.
 • మెదడు కోసం: ఒక సమర్థవంతమైన యాంటి-డిప్రసంట్‌గా మెదడు తయారు చేయబడేలా కుంకుమ పువ్వు అనేక సమ్మేళనాలు కలిగిఉంది.  ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది మరియు పార్కి‌న్స‌న్స్ మరియు అల్జీమ‌ర్స్ వ్యాధి యొక్క నివారణలో న్యూరోనల్ పనితీరులో సహాయపడుతుంది.
 • కడుపులో పుండ్ల కోసం: కుంకుమ పువ్వు యొక్క యాంటి ఆక్సిడంట్ లక్షణాల కారణంగా కడుపు పుండ్ల నుండి ఉపశమనం కల్పించడం‌లో ఇది సహాయపడుతుంది.
 • కళ్ల కోసం: కుంకుమ పువ్వు యాంటిఆక్సిడంట్ మరియు యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిఉంటుంది, ఇది కళ్లకు చాలా మంచిదిగా దీనిని తయారుచేసింది.  ఇది దృష్టిని మెరుగుపరచడం‌లో సహాయపడుతుంది మరియు కళ్ల రక్షణలో సహాయపడుతుంది మరియు వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత యొక్క నివారణలో సహాయపడుతుంది.
 • యాంటి-టాక్సి‌న్స్‌గా: కుంకుమ పువ్వు అనేక సమ్మేళనాలను కలిగిఉంది, శరీరం నుండి విషాన్ని తొలగించడం‌లో సహాయం చేస్తాయి కాబట్టి ఇవి యాంటి-టాక్సిన్ల వలె పనిచేస్తాయి.  పాము విషం, పురుగు మందులు మరియు పారిశ్రామిక విషాలకు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యం కలిగిఉంది, అందువల్ల ఇది విరుగుడుగా పనిచేస్తుంది.

రోగనిరోధకత కోసం కుంకుమ పువ్వు ప్రయోజనాలు - Saffron benefits for immunity in Telugu

రోగనిరోధకత వ్యవస్థ అనేక కణాలను కలిగిఉంటుంది మరియు హానికరమైన సూక్ష్మజీవులు మరియు ఇన్‌ఫెక్షన్ల  దాడి నుండి మన శరీరాన్ని సహజ సమ్మేళనాలు రక్షిస్తాయి.  కాబట్టి, సరైన శరీర విధులు నిర్వహించడానికి ఒక ఆరోగ్యకరమైన నిరోధక వ్యవస్థ అవసరమవుతుంది.  కుంకుమ పువ్వు నిరోధక శక్తి మీద సానుకూల ప్రభావం కలిగిఉందని పరిశోధనలు చూపుతున్నాయి.  ఈ ప్రభావం కెరోటినాయిడ్ల యొక్క ఉనికి వల్ల ఆపాదించబడింది. 6 వారాల వ్యవధి పాటు, ప్రతీ రోజూ 100 మి.గ్రా. ల కుంకుమ పువ్వును వినియోగించే పురుషుల పైన ఒక అధ్యయనం జరిగింది, ఈ అధ్యయనం‌లో తెల్ల రక్త కణాల(డబ్ల్యు‌సి‌లు) సంఖ్య పెరిగిందని చూపబడింది, శరీరం నుండి వ్యాధికారకాలను తొలగించడం‌లో ఇవి బాధ్యత వహిస్తాయి.

(మరింత చదవండి: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు)

అథ్లెటిక్ ప్రదర్శన కోసం కుంకుమ పువ్వు - Saffron for athletic performance in Telugu

కుంకుమ పువ్వు అథ్లెట్ల పనితీరును మెరుగుపరచడం‌లో సహాయం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.  ఒక క్లినికల్ అధ్యయనం‌లో, ప్రతీరోజూ కుంకుమ పువ్వును వినియోగించే 28 మంది అథ్లెట్లు, వారి భౌతిక శక్తి మరియు ప్రతిస్పందన సమయాలలో గణనీయమైన పెరుగుదలను రిపోర్ట్ చేసారు.

ఈ అథ్లెట్లలో కండర శక్తి మెరుగుపరచబడేందుకు కూడా కుంకుమ పువ్వు సహాయపడింది.  అదనంగా, కుంకుమ పువ్వు శరీరం ద్వారా ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుందని కనుగొనబడింది, ఇది క్రమంగా పనితీరును మెరుగుపరిచింది.

కొలెస్ట్రాల్ కోసం కుంకుమ పువ్వు - Saffron for cholesterol in Telugu

క్రొత్త జీవ కణాల ఉత్పత్తి కోసం కొలెస్ట్రాల్ అవసరమవుతుంది అయితే శరీరం‌లోని అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు మరియు గుండె పోటు వంటి ప్రమాదాన్ని పెంచుతుంది.  పరిశోధన ప్రకారం, కుంకుమ పువ్వులోని యాంటిఆక్సిడంట్లు మరియు పాలీఫినాల్స్ అన్నవి శరీరం‌లోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డి‌ఎల్) యొక్క స్థాయిని తగ్గించడం‌లో సహాయపడుతుంది. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిటిన్ మరియు క్రొసిన్ అన్నవి ట్రైగ్లిజరైడ్స్ యొక్క స్థాయిని మరియు మొత్తం కొలెస్ట్రాల్ (టిసి) స్థాయిని తగ్గిస్తాయని ఆరు వారాల పాటు జరిగిన ఒక ప్రి‌క్లినికల్ అధ్యయనం‌ చూపించింది.  కొవ్వు మరియు కొలెస్ట్రాల్ యొక్క శోషణను నిరోధించడం ద్వారా, శరీరం‌లో ఎల్‌డి‌ఎల్ కొలెస్ట్రాల్ యొక్క స్థాయిని తగ్గించడం‌లో క్రోసిన్ కూడా సహాయపడింది. 

(మరింత చదవండి: అధిక కొలెస్ట్రాల్ చికిత్స)

కుంగుబాటు కోసం కుంకుమ పువ్వు - Saffron for depression in Telugu

కుంగుబాటు అన్నది, బాధపడటం, ఒంటరితనం మరియు సాధారణంగా చేసే రోజువారీ కార్యకలాపాల్లో ఆసక్తి లేకపోవడం వంటి వాటి ద్వారా వర్గీకరించబడిన ఒక మానసిక రుగ్మత.  కొన్నిసార్లు, ఈ ఆలోచనలు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా దారితీస్తాయి.  కుంకుమ పువ్వు యాంటి డిప్రసంట్‌గా పనిచేసే సామర్థ్యం కలిగిఉందని క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి.  ఫ్లుక్సెటిన్ మరియు ఇమిప్రమైన్ వంటి ప్రసిద్ధ యాంటి డిప్రసంట్‌లతో కుంకుమ పువ్వు యొక్క మూడ్‌-మెరుగుపరిచే లక్షణాలు పోల్చి చూడబడ్డాయి.  కుంకుమ పువ్వు సారం క్రోసిన్ మరియు సాఫ్రనాల్ వంటి సమ్మేళనాలను కలిగిఉంటుందని అనేక ప్రిక్లినికల్ అధ్యయనాలు వెల్లడించాయి, ఇవి ప్రభావవంతమైన యాంటి డిప్రసెంట్లుగా పనిచేస్తాయి.  కుంకుమ పువ్వు రేకుల నుండి తీయబడిన సారం తేలిక కుంగుబాటు నుండి మోస్తరు  కుంగుబాటు చికిత్సలో కూడా సహాయం చేస్తుంది.

కుంకుమ పువ్వు క్యా‌న్సర్‌ను నివారిస్తుంది - Saffron prevents cancer in Telugu

శరీర కణాల యొక్క అసాధారణ పెరుగుదల ద్వారా క్యా‌న్సర్ వర్గీకరించబడింది.  కీమో నివారణ పైన చేసిన ఒక విస్తృతమైన పరిశోధనలో, క్యా‌న్సర్-వ్యతిరేక లక్షణాలు కలిగిన పండ్లు, కూరగాయలు మరియు మొక్కల వంటి సహజ వనరుల కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు అ‌న్వేషిస్తున్నారు.  కుంకుమ పువ్వు కడుపు క్యా‌న్సర్కాలేయ క్యా‌న్సర్పెద్ద ప్రేగు క్యా‌న్సర్గర్భాశయ క్యా‌న్సర్ మరియు రొమ్ము క్యా‌న్సర్వంటి వివిధ రకాల క్యా‌న్సర్‌కు వ్యతిరేకంగా ఒక నివారణ చర్యను కలిగిఉందని పరిశోధన సూచిస్తుంది. క్రోసిన్ మరియు క్రోసెటిన్ వంటి కెరోటినాయిడ్ల యొక్క ఉనికి కారణంగా కుంకుమ పువ్వుకు యాంటి‌క్యా‌న్సర్ లక్షణాలు ఆపాదించబడ్డాయి.  కణాల యొక్క అసాధారణ పెరుగుదలను ఈ కెరోటినాయిడ్లు నిరోధిస్తాయి మరియు సాధారణ కణ పెరుగుదలను నియంత్రిస్తాయి.

ఒక యాంటి-టాక్సిన్‌గా కుంకుమ పువ్వు - Saffron as an anti-toxin in Telugu

విషాలు అన్నవి పదార్థాలు, ఇవి శరీరం‌లో సహజంగా ఉత్పత్తి చేయబడతాయి మరియు సేకరించబడతాయి లేదా బయటి నుండి సేకరించబడతాయి.  బయటి విషాలు, వివిధ పురుగుమందులు మరియు పురుగులు వంటి వాటి ఫలితంగా రావచ్చు.  ప్రాసెస్ ‌చేసిన ఆహార పదార్థాలు, కాలుష్యం,  సబ్బులు మరియు షాంపూలలో ఉండే రసాయన పదార్థాలు కూడా శరీరం‌లో అధిక విషాల స్థాయికి దోహదపడవచ్చు.  కుంకుమ పువ్వు‌లో ఉండే పదార్థాలు, శరీరం‌ నుండి విషాలను బయటకు తొలగించడానికి సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

క్రోసిన్, క్రొసెటిన్ మరియు సాఫ్రనాల్, పాము విషాలతో పాటు శరీరం‌లోని విషాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని అనేక ప్రిక్లినికల్ అధ్యయనాలు నివేదించాయి.  కుంకుమ మొక్క యొక్క యాంటిఆక్సిడంట్, యాంటి-ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీఅపొప్టొటిక్ లక్షణాలు (ఇది కణాలు మరణించడాన్ని నివారిస్తుంది) వీటికి ప్రాథమికంగా ఆపాదించబడ్డాయి.  కుంకుమ పువ్వులోని సాఫ్రాన్ అత్యంత విషపూరితంగా ఉంటుంది, అందువలన అనేక పురుగుల మందులు, రసాయనాలు మరియు పారిశ్రామిక విషాలకు వ్యతిరేకంగా ఒక సమర్థవంతమైన విరుగుడుగా ఇది పనిచేస్తుంది.

మచ్చల క్షీణత కోసం కుంకుమ పువ్వు - Saffron for macular degeneration in Telugu

వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (ఎ‌ఎ‌మ్‌డి) అన్నది ఒక తీవ్రమైన కంటి వ్యాధి, సాధారణంగా 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రజలలో ఇది సంభవిస్తుంది.  మచ్చలను ప్రభావితం చేయడం ద్వారా ఈ వ్యాధి పురోగమన కంటి నష్టానికి కారణమవుతుంది, ఈ మచ్చ అన్నది రెటీనా మధ్యలో ఒక చిన్న భాగంగా ఉంటుంది.  కుంకుమ పువ్వు క్రోసిన్ మరియు క్రొసేటిన్‌లను సమృద్ధిగా కలిగి ఉంటుంది, ఇవి యాంటి ఆక్సిడంట్ మరియు యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిఉంటాయి.  ఈ సమ్మేళనాలు కళ్లను రక్షించడం‌లో సహాయపడతాయి.  కుంకుమ పువ్వు ఒక ప్రధాన పదార్థంగా గల టాబ్లెట్లను వినియోగించడం, దృష్టిలో ఒక గణనీయమైన మెరుగుదలను చూపించిందని, ఎ‌ఎ‌మ్‌డి కలిగిన రోగులపైన జరిగిన మరొక క్లినికల్ అధ్యయనం‌ చూపించింది.  కుంకుమ పువ్వు వినియోగం కళ్లను రక్షించడం‌లో సహాయపడుతుందని మరియు ఎ‌ఎ‌మ్‌డి వంటి వ్యాధులను కూడా నిరోధిస్తుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

(మరింత చదవండి: మాక్యులర్ డిజనరేషన్ చికిత్స)

మెదడు ఆరోగ్యానికి కుంకుమ పువ్వు - Saffron for brain health in Telugu

న్యూరాన్లు (మెదడు కణాలు)  నెమ్మదిగా తమ విధులను కోల్పోవడం ప్రారంభించడాన్ని సూచించే పరిస్థితిని న్యూరోడిజనరేషన్ అంటారు.  ఈ పరిస్థితి అల్జీమ‌ర్స్ వ్యాధి (ఎడి), పార్కి‌న్స‌న్స్ వ్యాధి మరియు మెమరీ నష్టం వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది. కుంకుమ పువ్వును న్యూరోడిజనరేటివ్ వ్యాధులను నివారించడానికి ఉపయోగించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.  తేలికపాటి నుండి మోస్తరు ఎ‌డి వ్యాధితో భాధపడుతున్న 54 మంది రోగులు, 22 వారాల పాటు ప్రతీ రోజూ కుంకుమ పువ్వును ఒక చిన్న పరిమాణంలో వినియోగించిన తర్వాత ఆ 54 మంది రోగులలో మెరుగుదల కనిపించిందని వారిపై జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం చూపించింది. 

ఎడి చికిత్సకు సంబంధించి  క్రోసిన్ సామర్థ్యం కలిగిఉందని మరియు జ్ఞాన లోపాలు నివారించడం‌లో సహాయపడుతుందని, కుంకుమ పువ్వులోని క్రోసిన్ యొక్క ప్రభావాన్ని యాక్సెస్‌ చేయడానికి జరిగిన ఒక ప్రిక్లినికల్ అధ్యయనం చూపించింది.

కడుపు పూతల కోసం కుంకుమ పువ్వు - Saffron for stomach ulcers in Telugu

జీర్ణాశయ పుండు అన్నది ఒక కురుపు వంటిది, ఇది కడుపు యొక్క లైనింగ్‌లో ఏర్పడుతుంది.  ఇది కడుపులో, గుండెలో తరచుగా మండే అనుభూతిని మరియు వికారం కలిగి ఉంటుంది,  కుంకుమ పువ్వు యొక్క సాఫ్రనాల్ మరియు క్రోసిన్ భాగాలు యాంటి ఆక్సిడంట్ లక్షణాలను కలిగిఉంటాయి మరియు గ్యాస్ట్రిక్ పుండ్లు ఏర్పాటుకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తాయి అని జంతు-ఆధారిత అధ్యయనాలు సూచిస్తున్నాయి.  క్రోసిన్ యొక్క అధిక మోతాదు, గ్యాస్ట్రిక్ పుండ్ల యొక్క ఉనికిని పూర్తిగా కూడా నిరోధించింది.  కుంకుమ పువ్వు యొక్క క్రమమైన వినియోగం గ్యాస్ట్రిక్ పుండ్లయొక్క లక్షణాల తీవ్రతను తగ్గించుటలో మరియు నిరోధించడం‌లో ఉపయోగకరంగా ఉంటాయని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

 • కుంకుమ పువ్వు యొక్క రోజువారీ వినియోగం మీ ఆరోగ్యానికి మంచిదని విస్తృతంగా నమ్మబడింది.  అయితే, కుంకుమ పువ్వు అలెర్జీ కలిగిన వ్యక్తులు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడం‌లో ఇబ్బందివికారం, మరియు ఆందోళనవంటి దుష్ప్రభావాలు కలిగిఉండవచ్చు. ఈ దుష్ప్రభావాలు అరుదుగా కనిపించినప్పటికీ, జాగ్రత్తగా ఉండటం మంచిది.
 • గర్భదారణ యొక్క చివరి దశలో కుంకుమ పువ్వు యొక్క వినియోగం ప్రయోజనకరమైనదని కనుగొనబడినప్పటికీ, ఒకవేళ మహిళలు వారి మొదటి 20 వారాల గర్భధారణ సమయం‌లో  కుంకుమ పువ్వును ఎక్కువ పరిమాణం‌లో వినియోగిస్తే, వారికి గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మరొక అధ్యయనం చూపించింది.  కుంకుమ పువ్వు వలన సంభవించే గర్భాశయ సంకోచం మరియు రక్తస్రావం, ఈ ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిగణించబడుచున్నాయి.

కుంకుమ పువ్వు, దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఔషధ లక్షణాల కారణంగా అనేక సంవత్సరాలుగా ఉపయోగం‌లో ఉంది.  ఈ సుగంధ ద్రవ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి విస్తృతమైన పరిశోధన జరిగింది మరియు క్యా‌న్సర్, గ్యాస్ట్రిక్ పుండ్లు, న్యూరోడిజనరేషన్ మరియు కుంగుబాటు వంటి అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని చూపబడింది.  క్రోసిన్, క్రోసెటిన్ మరియు సాఫ్రనాల్ వంటి ఉపయోగకరమైన సమ్మేళనాల ఉనికి కారణంగా కుంకుమ పువ్వు యొక్క అధిక ఆరోగ్యప్రయోజనాలు దీనికి ఆపాదించబడ్డాయి.  కుంకుమ పువ్వు అనేకమైన దుష్ప్రభావాలను కలిగిలేదు అయితే కొంతమంది ప్రజలు దీని అలెర్జీకి గురికావచ్చు.


उत्पाद या दवाइयाँ जिनमें Saffron है

వనరులు

 1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 02037, Spices, saffron. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. Kianbakht S, Ghazavi A. Immunomodulatory effects of saffron: a randomized double-blind placebo-controlled clinical trial. Phytother Res. 2011 Dec;25(12):1801-5. PMID: 21480412
 3. Meamarbashi A1, Rajabi A. Potential Ergogenic Effects of Saffron. J Diet Suppl. 2016;13(5):522-9. PMID: 26811090
 4. Maryam Mashmoul et al. Saffron: A Natural Potent Antioxidant as a Promising Anti-Obesity Drug. Antioxidants (Basel). 2013 Dec; 2(4): 293–308. PMID: 26784466
 5. Izharul Hasanet al. / Journal of Pharmacy Research 2011,4(7),2156-2158. The incredible health benefits of saffron: A Review.
 6. Prasan R. Bhandari. Crocus sativus L. (saffron) for cancer chemoprevention: A mini review. J Tradit Complement Med. 2015 Apr; 5(2): 81–87. PMID: 26151016
 7. Bibi Marjan Razavi, Hossein Hosseinzadeh. Saffron as an antidote or a protective agent against natural or chemical toxicities. Daru. 2015; 23(1): 31. PMID: 25928729
 8. Hasan Badie Bostan, Soghra Mehri, Hossein Hosseinzadeh. Toxicology effects of saffron and its constituents: a review. Iran J Basic Med Sci. 2017 Feb; 20(2): 110–121. PMID: 28293386
 9. Zeinali Majid, et al. Immunoregulatory and anti-inflammatory properties of Crocus sativus (Saffron) and its main active constituents: A review. Iran J Basic Med Sci. 2019 Apr; 22(4): 334–344. PMID: 31223464.
 10. Akbari-Fakhrabadi Maryam, et al. Effect of saffron (Crocus sativus L.) and endurance training on mitochondrial biogenesis, endurance capacity, inflammation, antioxidant, and metabolic biomarkers in Wistar rats. Journal of Food Biochemistry. 2019 Aug; 43(8): e12946.
 11. Hosseinzadeh Mandana, et al. Pre-supplementation of Crocus sativus Linn (saffron) attenuates inflammatory and lipid peroxidation markers induced by intensive exercise in sedentary women. Journal of Applied Pharmaceutical Science. May 2017; 7(5): 147-151.
 12. Kamalipour Maryam, Akhondzadeh Shahin. Cardiovascular Effects of Saffron: An Evidence-Based Review. J Tehran Heart Cent. 2011 Spring; 6(2): 59–61. PMID: 23074606.
 13. Shakeri Masihollah, et al. Toxicity of Saffron Extracts on Cancer and Normal Cells: A Review Article. Asian Pac J Cancer Prev. 2020 Jul; 21(7): 1867–1875. PMID: 32711409.
 14. LASHAY Alireza, et al. Short-term Outcomes of Saffron Supplementation in Patients with Age-related Macular Degeneration: A Double-blind, Placebo-controlled, Randomized Trial. Med Hypothesis Discov Innov Ophthalmol. 2016 Spring; 5(1): 32–38. PMID: 28289690.
 15. Piccardi M., et al. A Longitudinal Follow-Up Study of Saffron Supplementation in Early Age-Related Macular Degeneration: Sustained Benefits to Central Retinal Function. Evi Based Complement Alternat Med. 2012; 2012: 429124. PMID: 22852021.