myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

మీరు ఆహారప్రియులైతే, వంటగదులలో కేవలం పండ్లు, కూరగాయలు మరియు మసాలా దినుసులు మాత్రమే ఉండవని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, వాస్తవానికి వంట గదులలో ప్రపంచం నలుమూలల నుండి లభించే వివిధ ఆహార పదార్దాలు ఉంటాయి.

సగ్గుబియ్యం అనేది చాలా భారతీయ ఇళ్లలో వినిపించే ఒక సాధారణ పేరు, అయితే ఇది చెట్లకు పెరగదని మీకు తెలుసా? అలాగే ఇది మొక్క యొక్క విత్తనం లేదా పండు కాదు. ఇది కర్రపెండలం దుంపల నుండి వచ్చే ఒక రకమైన పిండి పదార్ధం మరియు దీనిలో కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉండవు. అవి మాత్రమే కాదు, దీనిలో గ్లూటెన్ కూడా ఉండదు మరియు గ్లూటెన్ అసహనం ఉన్నవారికి సురక్షితమైనది. ఈ రోజుల్లో సగ్గుబియ్యం ఇంత ప్రముఖంగా మారడానికి ఇది కూడా ఒక కారణం.

ఇది ఫైబర్ మరియు కేలరీలతో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మీరు దానిని ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారో అనే దాన్ని బట్టి, బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మరియు మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది మరియు ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా  ఉంటాయి, అవి వివిధ శరీరం జీవ ప్రక్రియలకు సహాయపడతాయి.

కర్రపెండలం మొక్క ఉష్ణమండల వాతావరణంలో పెరిగే ఒక శాశ్వత మొక్క. ఇది పాక్షికంగా కలప కాండం కలిగి ఉంటుంది మరియు ముదురు ఆకుపచ్చ ఆకులు ఉంటాయి అవి ఒకదానికొకటి ఎదురెదురుగా పెరుగుతాయి. ఆకు కాడ మరియు కొమ్మ రెండూ ప్రత్యేకమైన ఎరుపు నీడను (రంగును) కలిగి ఉంటాయి, ఇది కర్రపెండలం మొక్కను గుర్తించే లక్షణాలలో ఒకటిగా ఉంటుంది. కర్రపెండలం మొక్క 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు దాని దుంపలు కాండం యొక్క అడుగున నుండి పెరుగుతాయి. ఈ దుంపలు కర్రపెండలం మొక్క యొక్క తినదగిన భాగాలు, వీటి నుండి స్టార్చ్ (పిండి) తీయబడుతుంది.

మీకు తెలుసా?

కర్రపెండలం కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ప్రధానమైన ఆహారాలలో ఒకటి.

ఈ వ్యాసం, కర్రపెండలం ఎలా ఉపయోగించబడుతుందో మరియు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయబడుతుంది.

అయితే మొదట, కర్రపెండలం మొక్క యొక్క కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకుందాము

 • శాస్త్రీయ నామం: మనిహోట్ ఎస్కులెంటా (Manihot esculenta)
 • కుటుంబం: యుఫోర్బియాసి (Euphorbiaceae)
 • సాధారణ నామం: కాసావా, యుకా, కర్రపెండలం, బ్రెజిల్ ఆరోరూట్
 • సంస్కృత నామం: తరుకాండ
 • ఉపయోగించే భాగాలు: వేర్లు (దుంపలు)
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: వాస్తవానికి, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది, బ్రెజిల్, వెస్టిండీస్ మరియు ఆఫ్రికాలో విస్తృతంగా పెరుగుతుంది. భారతదేశంలో, కర్రపెండలం మొక్క ప్రధానంగా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో పండిస్తారు.
 1. సగ్గుబియ్యం పోషక వాస్తవాలు - Tapioca nutrition facts in Telugu
 2. సగ్గుబియ్యం ఆరోగ్య ప్రయోజనాలు - Tapioca health benefits in Telugu
 3. సగ్గుబియ్యం వంటకం మరియు ఉపయోగాలు - Tapioca pearls recipe and uses in Telugu
 4. సగ్గుబియ్యం దుష్ప్రభావాలు - Tapioca pearls side effects in Telugu
 5. ఉపసంహారం - Takeaway in Telugu

పిండి పదార్ధం (స్టార్చ్) కావడంతో, కర్రపెండలంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి, అయితే ఇందులో కొంత మొత్తంలో ఇనుము మరియు కాల్షియం కూడా ఉంటుంది.

యుఎస్‌డిఎ (USDA) ప్రకారం, 100 గ్రాముల ఎండు కర్రపెండలం ఈ కింది పోషక విలువలను కలిగి ఉంటుంది:

పోషకాలు 

100 గ్రాములకు 

శక్తి 

358 కిలో కేలరీలు

కార్భోహైడ్రేట్లు 

88.7 గ్రా

నీరు 

11 గ్రా

ఫ్యాట్స్ 

0.02 గ్రా

ప్రోటీన్ 

0.19 గ్రా

మినరల్స్ 

 

ఐరన్

1.58 గ్రా

కాల్షియం

20 గ్రా

పొటాషియం

11 గ్రా

ఫాస్ఫరస్

7 గ్రా

సోడియం

1 గ్రా

కర్రపెండలం దుంపకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ వాటిలో ముఖ్యమైనది దాని అధిక శక్తి మరియు తక్కువ కొవ్వు శాతం, ఇది ఉపవాసం మరియు డైటింగ్  చేసేవారికి ఒక అద్భుతమైన ఆహారంగా మారుతుంది. అలాగే, దీనిలో మంచి మొత్తంలో కాల్షియం మరియు పొటాషియం ఉంటుంది, ఇది ఎముకలను నిర్మించడానికి మరియు రక్తపోటును నిర్వహించడానికి అద్భుతమైన ఆహార వనరుగా పనిచేస్తుంది. సగ్గుబియ్యం యొక్క కొన్ని పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం.

 • బరువుకు: సగ్గుబియ్యంలో కొవ్వు ఉండదు మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది, ఈ లక్షణాలు బరువు తగ్గేందుకు  సహాయం చేస్తాయి. అలాగే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతి వినియోగం బరువు పెరిగేందుకు కూడా కారణమవుతుంది.
 • మధుమేహం కోసం: ఫోర్టిఫె చేసిన సగ్గుబియ్యం ఇన్సులిన్ సెన్సటివిటీని పెంచుతాయని తద్వారా రక్తంలో అదనపు చక్కెరను తొలగిస్తామని కనుగొనబడింది. అలాగే ఇవి జీర్ణ క్రియ నెమ్మదిగా జరిగే చేస్తాయి అందువల్ల రక్తంలోకి ఒకేసారి అధికమొత్తంలో చక్కెర చేరదు.
 • శిశువులకు: కర్రపెండలం జీర్ణ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా శిశువులకు అవసరమైన శక్తిలో దాదాపు 50% అందిస్తుందని అధ్యయనాలు తెలిపాయి. అయితే వీటిలో ప్రోటీన్లు మరియు ఇతర పోషకలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల  ఇతర ప్రోటీన్ వనరులతో కలిపి దీనిని తీసుకోవడం మంచిది.
 • జీర్ణక్రియకు: కర్రపెండలంలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణాశయ ఆరోగ్యానికి దీనిని మంచి వనరుగా చేస్తుంది. ప్రేగులలో  కర్రపెండలం జెల్ లా మారి మలాన్ని మెత్తగా చేసి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.
 • కాల్షియం వనరు: 100గ్రాముల కర్రపెండలంలో దాదాపు 20 mg ల కాల్షియం ఉంటుంది ఇది మన రోజువారీ కాల్షియం అవసరాలు వేగంగా అందేలా చేస్తుంది. క్రమంగా కర్రపెండలం తీసుకోవడం అనేది ఆస్టియోపోరోసిస్ మరియు ఎముక ఫ్రాక్చర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 • ఐరన్ వనరు: సగ్గుబియ్యంతో కాల్షియం మాత్రమే కాక ఐరన్ కూడా ఉంటుంది.ఐరన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరా చెయ్యడం, ఎర్రరక్త కణాలు మరియు హీమోగ్లోబిన్ నిర్మాణం వంటి అనేక ముఖ్య చర్యలలో పాత్రపోషిస్తుంది.
 • సగ్గుబియ్యం మరియు కర్రపెండలం రక్తపోటును నిర్వహించడం, ఫోలేట్ అనే ఖనిజాన్ని అందించడం వంటి చర్యలలో సహాయం చేస్తాయి.

కర్రపెండలం పిండి: సగ్గుబియ్యం గురించి మాట్లాడుతున్నపుడు, మనలో చాలామంది మృదువైన తెల్లటి ముత్యాల గురించే ఆలోచిస్తాము కాని ఇది పిండి రూపంలో కూడా లభిస్తుంది. కర్రపెండలం దుంపలను మెత్తగా పొడి చేయడం ద్వారా పిండిని సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణ బ్రెడ్ మరియు పాన్ కేక్ తయారీలో మైదా పిండికి బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే, ఇది వివిధ వంటకాల్లో బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది. దానికి స్వంత రుచి లేనందువల్ల, అసలు వంటకం యొక్క రుచిని ప్రభావితం చేయ్యదు. నీరు కలిపిన కర్రపెండలం పిండి జెల్ లాగ ఉంటుంది, కాబట్టి, దీనిని సూప్ లేదా గ్రేవీలలో గట్టిపరచే ఏజెంట్‌గా ఉపయోగించవచ్చు.

సగ్గుబియ్యం: సగ్గుబియ్యం చూడడానికి చిన్న తెల్లని బంతులలా ఉంటుంది, వీటిని సగ్గుబియ్యం కిచిడి మరియు పాయసం సహా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. మీరు ఇప్పటికీ సగ్గుబియ్యం పుడ్డింగ్ లేదా బబుల్ టీని రుచి చూడనట్లయితే, మీరు ఖచ్చితంగా చాలా విలక్షణ రుచులను ఇంకా ఆస్వాదించలేనట్లు అర్ధం.

ఒక కప్పు బబుల్ టీ యొక్క శుభమైన తయారీ విధానం ఇక్కడ ఉంది

 • కొన్ని సగ్గుబియ్యం గింజలను నీటిలో కొన్ని గంటలు నానబెట్టండి. అవి వాటి తెలుపు రంగును వదిలి మరింత పారదర్శకమైన తెల్లదనంలోకి మారడాన్ని మీరు గమనించవచ్చు.
 • బ్లాక్ టీ సిద్ధం చేయండి (మీకు నచ్చితే పాలు జోడించవచ్చు).
 • గది ఉష్ణోగ్రతకు దానిని చల్లబరచండి.
 • మీ ఇష్టానుసారం చక్కెరను జోడించండి.
 • ఒక గ్లాసు టీలో నానబెట్టిన సగ్గుబియ్యం గింజలను వెయ్యండి.
 • ఐస్ క్యూబ్స్ వేసి దానిని చల్లబరచండి.
 • ఇప్పుడు ఆస్వాదించండి.

మీకు నచ్చితే చక్కెర స్థానంలో తేనెను కూడా జోడించవచ్చు.

 • పిండి పదార్థాలు అధికంగా ఉన్నప్పటికీ, కర్రపెండలంలో ప్రోటీన్లు మరియు కొవ్వులు ఉండవు. కనుక ఇది పోషకాహారానికి మంచి మూలం కాదు.
 • కర్రపెండలం మొక్కలో కొన్ని టాక్సిక్ సమ్మేళనాలు ఉంటాయి, అవి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక టాక్సిసిటీని కలిగిస్తుంది. కాబట్టి, గుర్తించబడిన లేదా నమ్మదగిన వనరుల నుండి మాత్రమే సగ్గుబియ్యాన్ని కొనడం మంచిది.
 • కర్రపెండలం ప్రాథమికంగా పిండి పదార్ధం, అంటే ఒక రకమైన చక్కెర. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉన్నప్పటికీ, అధ్యయనాలు చాలా విరుద్ధముగా ఉన్నాయి. కాబట్టి, మధుమేహం ఉన్నవారు కర్రపెండలన్ని తీసుకునే ముందు డాక్టర్‌తో మాట్లాడమని సిఫార్సు చేయబడుతుంది.
 • కర్రపెండలం అలెర్జీ కలిగించని ఆహారం అయినప్పటికీ, లేటెక్స్ కు అలెర్జీ ఉన్నవారు కర్రపెండాలనికి కూడా క్రాస్ రియాక్టివిటీని చూపించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

సగ్గుబియ్యం అనేది అనేది కర్రపెండలం మొక్క నుండి పొందే ఒక పిండిపదార్థం. ఇది గోధుమ పిండికి గ్లూటెన్ లేని ఒక ప్రత్యామ్నాయంగా వాడవచ్చు మరియు ఉపయోగించవచ్చు, దీనిలో కొవ్వులు మరియు ప్రోటీన్లు చాలా తక్కువ మొత్తాలలో ఉంటాయి. ఒక విలక్షణమైన రుచి మాత్రమే కాకుండా, బరువు నిర్వహణ మరియు శరీర కొలెస్ట్రాల్ నిర్వహణతో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. సగ్గుబియ్యం మీద ఎక్కువ పరిశోధనలు చేయబడలేదు కాని మీరు దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహారంలో ఉపయోగించే ముందు ఒకసారి పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.

और पढ़ें ...

References

 1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 20068, Tapioca, pearl, dry. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. Yessoufou A et al. Cassava-enriched diet is not diabetogenic rather it aggravates diabetes in rats. Fundam Clin Pharmacol. 2006 Dec;20(6):579-86. PMID: 17109651
 3. Kato R et al. High-hydroxypropylated tapioca starch improves insulin resistance in genetically diabetic KKAy mice. J Food Sci. 2009 Apr;74(3):H89-96. PMID: 19397723
 4. Flibert Guira et al. Origins, production, and utilization of cassava in Burkina Faso, a contribution of a neglected crop to household food security. Food Sci Nutr. 2017 May; 5(3): 415–423. PMID: 28572925
 5. Morales E, Graham GG. Digestibility of boiled and oven-dried cassava in infants and small children. J Nutr. 1987 Jan;117(1):129-32. PMID: 3029354
 6. Kevin Stephenson et al. Consuming cassava as a staple food places children 2-5 years old at risk for inadequate protein intake, an observational study in Kenya and Nigeria . Nutr J. 2010; 9: 9. PMID: 20187960
 7. Joanne Slavin. Fiber and Prebiotics: Mechanisms and Health Benefits . Nutrients. 2013 Apr; 5(4): 1417–1435. PMID: 23609775
 8. Kurup PG, Krishnamurthy S. Glycemic response and lipemic index of rice, raggi and tapioca as compared to wheat diet in human. Indian J Exp Biol. 1993 Mar;31(3):291-3. PMID: 8388856
 9. University of California San Francisco. Hemoglobin and Functions of Iron. [Internet]
 10. Michael J Hall . The Dangers of Cassava (Tapioca) Consumption . Bristol Medico-Chirurgical Journal Volume 102 (ii) May 1987
 11. Ibero M, Castillo MJ, Pineda F. Allergy to cassava: a new allergenic food with cross-reactivity to latex. J Investig Allergol Clin Immunol. 2007;17(6):409-12. PMID: 18088025