• తె
  • తె

గర్భధారణ ఒక మహిళ జీవితంలో అత్యంత కీలకమైన మరియు ఉద్రేకపూరిత సమయం ఆమె శరీరంలో భారీ మార్పులు జరుగుతాయి అలాగే ఆమె మనసులో కూడా. ఈ సమయంలో, మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా పిండం యొక్క ఆరోగ్య బాధ్యతను కూడా ఆమె మీద ఉంటుంది. అంటే ఆమె తన ఆహారం మరియు పోషకాల పట్ల అదనపు జాగ్రత్తను కలిగి  ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన గర్భధారణ పెరుగుతున్న పిండం యొక్క అవసరాలకు సహాయకరంగా ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.

  1. గర్భధారణ సమయంలో బరువు పెరుగుట - Weight gain during pregnancy in Telugu
  2. గర్భధారణ ఆహార విధాన పట్టిక యొక్క ప్రయోజనాలు - Benefits of pregnancy diet chart in Telugu
  3. గర్భధారణ సమయంలో సిఫార్సు చేసిన రోజువారీ తెసుకోవాల్సిన కేలరీలు - Recommended daily calorie intake during pregnancy in Telugu
  4. గర్భధారణ సమయ ఆహార విధానం - Pregnancy diet in Telugu
  5. గర్భధారణ సమయ ఆహార విధాన పట్టిక - Pregnancy diet chart in Telugu
  6. మొదటి త్రైమాసికంలో తీసుకోవలసిన ఆహారం - First trimester diet in Telugu
  7. రెండవ త్రైమాసికంలో ఆహార విధాన పట్టిక - Pregnancy diet chart for second trimester in Telugu
  8. మూడవ త్రైమాసికంలో ఆహార విధానం - Pregnancy diet during third trimester in Telugu
గర్భధారణ సమయంలో ఆహార విధాన పట్టిక వైద్యులు

గర్భధారణ సమయంలో మహిళలు 11.5 నుంచి 16 కిలోల బరువును పొందవచ్చని సూచించబడింది.అయితే, ఈ బరువు, ఒకేసారి పెరగరు.

మొదటి త్రైమాసికంలో మహిళలు 1 నుండి 2 కిలో గ్రాముల వరకు పెరుగుతారు, దీని తరువాత, గర్భధారణ యొక్క మిగిలిన వ్యవధిలో వారానికి 0.5 కిలోల చప్పున పెరుగుతారు.

బరువు పెరిగిన శాతం మహిళ యొక్క ప్రస్తుత బరువు మీద ఆధారపడి ఉంటుంది.

బరువు తక్కువగా ఉన్నవారు బరువు ఎక్కువగా ఉన్నవారి కంటే అధికంగా పెరుగుతారు. అధిక బరువు ఉన్న స్త్రీలు 7 నుండి 9 కిలోగ్రాముల బరువు మాత్రమే పెరుగుతారు, బరువు తక్కువగా ఉన్న వారు 13 నుండి 18 కిలోగ్రాముల వరకు పెరుగుతారు.

కడుపులో ఒకటికన్నా ఎక్కువ పిండాలను మోస్తున్నట్లయితే మహిళలు మరింత బరువును పొందుతారు. కవలలు ఐతే, 16.5 నుండి 24.5 కిలోగ్రాముల బరువు పెరుగుతారు.

కాబట్టి, మహిళల్లో ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలను నిర్వహించడానికి ఆహారం అవసరం, ఇది వారి ఆరోగ్యం మరియు పిండం యొక్క ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.

గర్భధారణ సమయంలో ఆహార విధాన పట్టిక తగినన్ని క్యాలరీలను తీసుకోవటానికి సహాయం చేస్తుంది, ఇది పిండం యొక్క పెరుగుదలలో సహాయపడుతుంది. ఇది కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సహా అన్ని ముఖ్యమైన పోషకాలు ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. ప్రెగ్నన్సీ డైట్ చార్ట్ యొక్క ఇతర ప్రయోజనాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి.

  • ఎక్కువసార్లు కొద్దీ కొద్దిగా భోజనం తినడం వలన రోజువారీ అవసరమైన కెలోరీలను పొందడంలో సహాయపడుతుంది. రోజువారీ పనులకోసం కోసం సరైన స్థాయిలో శక్తిని అందించడానికి ఇది చాలా అవసరం. అంతర్గత అవయవాల పనితీరును నిర్వహించడానికి మరియు పిండం యొక్క పెరుగుదల కోసం కూడా శక్తి అవసరమవుతుంది.
  • సరైన ఆహారాలు తీసుకోవడం వలన అవి ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ యొక్క లోపాలని నివారించడానికి సహాయపడతాయి. ఇది తల్లి మరియు బిడ్డలలో ఐరన్ లోపం వలన కలిగే రక్తహీనత మరియు శిశువు పెరుగుదలకు సంబంధించిన లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే తల్లి మరియు శిశివు ఇద్దరిలో గర్భధారణ సమయంలో సంభవించే అంటువ్యాధులను కూడా నిరోధించవచ్చు.
  • సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది తల్లి మరియు పిండంలో బలమైన రోగనిరోధక శక్తి ఏర్పడడానికి మరియు శిశివు అవయవాల యొక్క సరైన అభివృద్ధికి  కూడా అవసరం. (మరింత సమాచారం: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు)
  • అంతేకాక, సరైన ఆహారం తల్లికి ప్రసవానంతర రికవరీ కోసం సమర్థవంతంగా పనిచేస్తుంది. సరైన పోషకాహారం కణజాల పెరుగుదల మరియు మరమత్తులో (repair) సహాయపడుతుంది.
  • సమతుల్య ఆహారం మంచి జీర్ణక్రియకు కూడా అవసరం, ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, గుండెమంట వంటి జీర్ణ సంబంధిత లోపాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

ఇప్పుడు మీరు గర్భధారణ సమయంలో డైట్ చార్ట్ అనుసరించడం వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నారు, అలాగే ఇది వివిధ త్రైమాసికాలలో వేరుగా ఉండే కెలోరీల పరిమాణం/సంఖ్య గురించి కూడా తీసుకోవడం అవసరం.

వివిధ త్రైమాసికాలలో సిఫార్సు చేయబడిన రోజువారీ క్యాలరీల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంటుంది:

  • మొదటి త్రైమాసికంలో - 1800 కేలరీలు.
  • రెండవ త్రైమాసికంలో - 2200 కేలరీలు.
  • మూడవ త్రైమాసికంలో - 2400 కేలరీలు.

తక్కువ బరువు ఉన్నవారికి మంచి బరువు పెరుగుదలను సాధించడం మరికొన్ని అదనపు కేలరీలు అవసరమవుతాయి.

ఇప్పుడు గర్భధారణ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకున్నారు, అయితే మీ ఆహారంలో తప్పనిసరిగా ఏమి ఉండాలి? వాటిని తెలుసుకుందాము.

గర్భధారణ సమయంలో ఐరన్ - Iron during pregnancy in Telugu

పైన పేర్కొన్నట్లుగా  ఐరన్, గర్భధారణ సమయంలో అవసరమైన పోషకం. పిండం అభివృద్ధితో పాటు ఐరన్ యొక్క అవసరం కూడా పెరుగుతుంది. గర్భస్థ పిండం ఆరునెలల వరకు అవసరమైన ఐరన్ను తల్లి నుండి తీసుకుంటుంది.

అటువంటి అధిక అవసరాలను తీర్చేందుకు, జంతు మూలాల/వనరుల నుండి ఐరన్ వినియోగాన్ని పెంచడం చాలా అవసరం. మీరు శాఖాహారులైతే, విటమిన్ సి యొక్క వినియోగాన్ని పెంచాలి అది కూరగాయల నుండి ఐరన్ యొక్క శోషణకు సహాయపడుతుంది. ఐరన్ అధికంగా ఉండే కొన్ని ఆహార వనరులు కోడి, మాంసం, గుడ్లు, సీఫుడ్, సిరిధాన్యాలు మరియు ఆకు కూరలు వంటివి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.

గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ - Folic acid during pregnancy in Telugu

ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి9 (ఫోలేట్)  బి కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటి ఇది బ్రోకలీ, శనగలు, మొలకలు, బీన్స్, చిక్కుళ్ళు మరియు బచ్చలికూర వంటి అనేక సహజ ఆహార పదార్ధాలలో లభిస్తుంది. ఫోలిక్ ఆమ్లం గర్భధారణ సమయంలో చాలా అవసరం ఎందుకంటే ఇది న్యూరల్ ట్యూబ్ (neural tube) యొక్క అభివృద్ధిలో సహాయపడుతుంది మరియు ఏవైనా శిశువుకు సంబంధించిన అభివృద్ధి లోపాలను నిరోధిస్తుంది.

గర్భధారణ సమయంలో అయోడిన్ - Iodine during pregnancy in Telugu

అయోడిన్ మరొక ముఖ్య ఖనిజం, థైరాయిడ్ హార్మోన్ నియంత్రణలో దాని పాత్ర కారణంగా శిశువు యొక్క సరైన అభివృద్ధికి ఇది అవసరం. అయోడైజ్డ్ ఉప్పుతో పాటుగా, సీఫుడ్, గుడ్లు మరియు పాల ఉత్పత్తులలో అయోడిన్ ఉంటుంది. కానీ అన్ని సీఫుడ్లు గర్భధారణ సమయంలో సురక్షితమైనవి కావి, అందువల్ల, సిఫుడ్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.

గర్భధారణ సమయంలో కాల్షియం - Calcium during pregnancy in Telugu

పిండం యొక్క స్కెలిటల్ (అస్థిపంజర ఆకార) అభివృద్ధికి అధిక మొత్తాలలో కాల్షియం అవసరం అయినప్పటికీ, దానిని ఆహారంలో తీసుకోవడాన్ని పెంచడం అనేది సిఫారసు చేయబడదు. గర్భధారణ సమయంలో తల్లి కాల్షియంను శోషించే/గ్రహించే విధానం అధికమవుతుంది అందువలన గర్భిణీ స్త్రీలు సాధారణంగా మాములు స్త్రీలకు సిఫారసు చేయబడిన మోతాదుకు మించి కాల్షియంను తీసుకోవలసిన అవసరం ఉండదు, అనగా రోజుకు 1000 మి.గ్రా.

గర్భధారణ సమయంలో ప్రోటీన్ - Protein during pregnancy in Telugu

గర్భస్థ మరియు పిండం యొక్క కణజాలపు సరైన అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం వలన శిశువులు తక్కువ బరువుతో పుట్టవచ్చు, దీనిని సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.

(మరింత సమాచారం: గర్భధారణ తరువాత ఆహార విధాన ప్రణాళిక)

ఈ  పైన ఉన్న పోషకాలు మాత్రమే కాక, డైట్ లో ఉండే అన్ని అంశాలు గర్భధారణ సమయంలో ప్రత్యేక పాత్ర కలిగివుంటాయి, ఉదా., పెరుగుదల ప్రక్రియకు కొవ్వులు కూడా చాలా ముఖ్యమైనవి.

కాబట్టి, ఈ అంశాలు ఏవి ఆహారంలో లేకుండా ఉండకూడదు.

గర్భిణీ స్త్రీల కోసం తయారు చేసే ఆహారం ప్రణాళికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

గర్భధారణ సమయంలోని వివిధ త్రైమాసికాలలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన  కేలరీల సంఖ్య పెరగడంతో పాటుగా పోషక అవసరాలు మారుతూ ఉంటాయి. పిండం పురోగతి చెందేకొద్దీ రోజువారీ తీసుకునే కేలరీలు క్రమంగా పెంచాలని సిఫార్సు చేయబడింది. ప్రతి త్రైమాసికంలో తీసుకోవలసిన ఆహారం గురించి ప్రత్యేకమైన విభాగాలలో ఈ కింద చర్చించబడింది.

మొదటి త్రైమాసికంలో గర్భిణీ స్త్రీ యొక్క కేలరీ అవసరాలు సాధారణ స్త్రీకి అవసరమైన కేలరీల మాదిరిగానే ఉంటాయి, కానీ కొన్ని ఆహార పదార్ధాల అవసరం మారవచ్చు. పలు పోషకాల అవసరాలను తీర్చడం కోసం వారంలో వివిధ రోజులు వివిధ ఆహారాలతో కూడిన ఆహారవిధాన పట్టిక ఈ కింద ఇవ్వడం జరిగింది. దానిలో భారతీయ వంటకాలలో సాధారణంగా ఉండే ఆహార పదార్ధాలు ఉంటాయి మరియు వాటిని గర్భధారణ సమయంలో సులభంగా అనుసరించవచ్చు.

వారం

ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆహారాలు

మధ్యాహ్నపు చిరుతిండి

భోజనం

సాయంత్రపు చిరుతిండి

రాత్రి భోజనం

సోమవారం

ఇడ్లీ

కొబ్బరి చుట్ని

ఒక మధ్యస్థ పరిమాణ జామకయ

మీ ఇష్టప్రకారం తయారు చేసిన/వండిన ఎర్రకందిపప్పు మరియు ఆనపకాయ కూర

అన్నం

మిల్క్ షేక్

ఒక మొక్కజొన్నపొత్తు

చపాతీ

బీట్రూట్ కూర

పెరుగు

మంగళవారం

ఏదైనా రవ్వతో చేసిన ఉప్మా

ఒక గ్లాస్ పాలు

కమలపండు

సాంబార్

అన్నం

క్యారట్ వేపుడు

కొబ్బరి నీళ్లు

ఒక గుప్పెడు ఎండుద్రాక్ష

మెంతిఆకుకూర

చపాతీ

బుధవారం

దోస

వేరుశనగ పిక్కల చుట్ని

ఆరంజ్ జ్యూస్

అరటి పళ్ళు

పనీర్ కూర

ఏదైనా ఆకుకూర వేపుడు

అన్నం/చపాతీ

బాదం పాలు

వంకాయ కూర

కొంచెం అన్నం

ఒక చపాతీ

గురువారం

బంగాళాదుంప కుర్మా పూరి అరటి మిల్క్ షేక్

బొప్పాయి

కూరగాయలతో చేసిన పలావు

కాప్సికం కూర

పెరుగు

కాఫీ

వేరుశనగ పిక్కల ఉండ/లడ్డు

శనగపప్పు కూర

పరోటా

శుక్రవారం

బంగాళాదుంపలు,బఠాణీలు వేసి చేసిన అతుకుల ఉప్మా

దానిమ్మ రసం

మామిడిపండు

క్యాబేజి కూర

టమాటా చారు

అన్నం

పెరుగు

మజ్జిగ

మొలకలు

ఏదైనా కూరగాయలతో చేసిన సూపు

గోధుమ (వీట్) బ్రెడ్

శనివారం

ఊతప్పం

పుదీనా చట్నీ

ఒక గ్లాస్ పాలు

బాదాం పప్పులు కొన్ని

పాలకూర పప్పు

టమాటా పచ్చడి

అన్న/చపాతీ

మామిడిపండు మిల్క్ షేక్

కిచిడి

బీన్స్ కూర

పెరుగు

ఆదివారం

పెసరట్టు

ఒక కప్పు టీ

సపోటా

కూరగాయలసాంబార్

అన్నం

అప్పడం

పెరుగు

ఒక గుప్పెడు డ్రైఫ్రూట్స్

ఒక గ్లాస్ పాలు

ఏదైనా కాయగూర వేపుడు

చపాతీ

రెండవ త్రైమాసికం ప్రారంభం నుండి, పెరుగుతున్న పిండం అవసరాలను తీర్చడానికి మీ ఆహారం పట్ల అధిక శ్రద్ధ వహించడానికి చాలా ముఖ్యం. తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడంతో పాటు క్యాలరీల పరిమాణాన్ని పెంచాలి మరియు సమతుల్య మరియు సహజమైన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. మీరు అనుసరించదగిన ఆహార ప్రణాళిక ఇక్కడ  ఇవ్వబడింది.

వారం

ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆహారాలు

మధ్యాహ్నపు చిరుతిండి

భోజనం

సాయంత్రపు చిరుతిండి

రాత్రి భోజనం

సోమవారం

గోధుమ అట్టు/దోస

టీ

ఆపిల్ మరియు అర్క్రోటుకాయ

మష్రూమ్ క్యాప్సికం కూర

వెల్లులి రసం

అన్నం

సపోటా మిల్క్ షేక్

మొక్కజొన్న పొత్తు

శనగల కూర క్యాబేజీ వేపుడు

చపాతీ

మంగళవారం

మాసాల దోస

బొప్పాయి జ్యూస్

అంజీర/అంజూర పళ్ళు

పుదీనా రైస్

బంగాళాదుంపల వేపుడు

పెరుగు

బాదాం పాలు

తామర గింజలు 

పెసరపప్పు

అన్నం

క్యారెట్ కూర

బుధవారం

కూరగాయలు వేసిన సేమియా ఉప్మా

పుచ్చకాయ జ్యూస్

ద్రాక్షపళ్ళు

పాలకూర పప్పు

నిమ్మకాయ రసం

అన్నం

పెరుగు

టీ

పాయసం

ముల్లంగి సాంబార్

ఇడ్లి

గురువారం

శనగపప్పు కూర

పూరి

ఖజ్జురాలు 

ఒక గ్లాస్ పాలు   

 

గుప్పెడు డ్రై ఫ్రూట్స్

మెంతికూర వేపుడు

టమాటా చట్నీ

మజ్జిగ

అరటికాయ బజ్జి

కాఫీ

రాగి పిండి దోస

కొత్తిమీర పచ్చడి

పెరుగు

శుక్రవారం

ఇడ్లి

కొబ్బరి చట్నీ

తియ్యని నిమ్మరసం

మొలకలు

కూరగాయ బిర్యానీ

ఆనపకాయ వేపుడు

చపాతీ

స్వీట్ కార్న్

దానిమ్మ రసం

బ్రోకలీ,బంగాళాదుంప కూర దోస

పుదీనా చట్నీ

పెరుగు

శనివారం

బీన్స్, బఠాణీలు వేసిన గోధుమ రవ్వ ఉప్మా

కాఫీ

అరటిపండు

బీరకాయ కూర

క్యారట్ వేపుడు

అన్నం

అప్పడం

మజ్జిగ

మసాలా వడ

కాలిఫ్లవర్,టమాటా కూర

చపాతీ

పెరుగు

ఆదివారం

పొంగలి

కొబ్బరి చట్నీ

కాఫీ

కమలాపండు

జీరా రైస్

చుక్కకూర పప్పు

బీట్రూట్ సలాడ్

అవిసె గింజలు 

చపాతీ

మామిడి జ్యూస్

గోధుమ రస్కులు

సేమియా ఉప్మా

పుదీనా చట్నీ

పెరుగు

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.

మూడవ త్రైమాసికంలో గర్భధారణ సమయం యొక్క అత్యంత కీలకమైన భాగం, ఈ సమయంలో, శరీరక కేలరి అవసరాలు రెండవ త్రైమాసికం కంటే ఎక్కువగా, 200-300 కేలరీలు వరకు పెరుగుతాయి, ఇది తల్లి మరియు పిండం అవసరాలను తీర్చడానికి కావాలి. ఈ అధిక డిమాండ్లను తీర్చే ఆహార ప్రణాళిక  ఈ క్రింద విధంగా రూపొందించబడింది:

వారం

ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆహారాలు

మధ్యాహ్నపు చిరుతిండి

భోజనం

సాయంత్రపు చిరుతిండి

రాత్రి భోజనం

సోమవారం

టమాటా మరియు చీజ్ తో చేసిన శాండ్విచ్

జామపండు జ్యూస్

అంజూర పళ్ళు

మెంతికూర రైస్

బంగాళా దుంపలు బాఠాని కూర

పెరుగు

మామిడి మిల్క్ షేక్

ఉడకబెట్టిన మొక్క జొన్నపొత్తు

బంగాళాదుంప కుర్మా

పరోటా

మంగళవారం

రాగి జావా

కొన్ని గింజలు

ఆరంజ్ జ్యూస్

పుచ్చకాయ ముక్కలు 

కూరగాయల  బిర్యానీ

టమాటా రసం

చపాతీ

పెరుగు  

నిమ్మరసం

వేపిన జీడిపప్పు

ఇడ్లి

కావేపాకుల చట్నీ

పాలు

బుధవారం

పెసరట్టు

కొద్దిగా ఉప్మా

వేరుశనగచట్నీ

కొబ్బరి నీళ్లు

ఖర్బుజా

బెండకాయ సాంబార్

ఆనపకాయ కూర

అన్నం

పెరుగు

ఒక గ్లాస్ పాలు

గోధుమ రస్కు

ముల్టీగ్రైన్ చపాతీ

శనగపప్పు కూర

గురువారం

సేమియా ఉప్మా

మొలకలు

మామిడిపండు

జామపండు

పులిహోర

చామదుంప వేపుడు

క్యారెట్, సోయాబీన్ కూర

మజ్జిగ

దానిమ్మ రసం

ఓట్స్ బిస్క్యూట్

గోధుమపిండి అట్టు

అలసందల కూర

శుక్రవారం

మసాలా దోస

పుదీనా చట్నీ బాదంపాలు

ఆపిల్ పండు

మీల్ మేకర్ వేసిన కూరగాయల పులావ్

అప్పడం

బీట్రూట్, కీరదోస సలాడ్

మామిడి పండు జ్యూస్

మొలకల సలాడ్

బియ్యంరవ్వ ఉప్మా

టమాటా చట్నీ

శనివారం

ఇడ్లి

సాంబార్

కొబ్బరిచట్నీ

ఒక గ్లాసు పాలు

గుప్పెడు డ్రైఫ్రూట్స్

గుమ్మడికాయ సాంబార్

పాలకూర వేపుడు

అన్నం

పెరుగు

మజ్జిగ

అనాసపండు ముక్కలు 

మెంతికూర రైస్

బంగాళాదుంపల వేపుడు

మజ్జిగ

ఆదివారం

ఊతప్పం

కత్తిమీర చట్నీ

కాఫీ

మామిడిపండు

పుదీనా రైస్

సొరకాయ వేపుడు

చపాతీ

పెరుగు

కొబ్బరి నీళ్లు

ఉడకబెట్టిన చిలగడ దుంప

పెసరపప్పు కిచిడి

బీట్రూట్ కార్రోట్ క్యాబేజీ సలాడ్

పాలు

Dt. Surbhi Upadhyay

Dt. Surbhi Upadhyay

Nutritionist
3 Years of Experience

Dt. Manjari Purwar

Dt. Manjari Purwar

Nutritionist
11 Years of Experience

Dt. Akanksha Mishra

Dt. Akanksha Mishra

Nutritionist
8 Years of Experience

Surbhi Singh

Surbhi Singh

Nutritionist
22 Years of Experience

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Managing your weight gain during pregnancy
  2. Noran M. Abu-Ouf, Mohammed M. Jan. The impact of maternal iron deficiency and iron deficiency anemia on child’s health. Saudi Med J. 2015; 36(2): 146–149. PMID: 25719576
  3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy and diet
  4. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Health Tips for Pregnant Women.
  5. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; Nutrition During Pregnancy
Read on app