యోని ఈస్ట్ సంశ్రమణ, ఇది త్రష్ అని కూడా పిలువబడుతుంది, ప్రతి స్త్రీ తన జీవితకాలంలో కనీసం ఒకసారి అనుభవించిన అత్యంత సాధారణ అంటురోగాలలో ఇది ఒకటి. ఇది సులభంగా చికిత్స చేయగల నప్పటికీ, దాని లక్షణాలు మీపై దాడి చేస్తాయి మరియు మీ రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి.

దీని వెనుక చాలా సాధారణంగా కనిపించే కారకం ఈస్ట్, కాండిడా. కాండిడా నోట్లో, గొంతులో, మరియు యోనిలో ప్రాధమికంగా సహభోజి (commensal)గా (సాధారణం గా కొన్ని ప్రాంతాలలో నివసించేవి గా) జీవిస్తాయి. అయితే, పరిస్థితులు అనుకూలమైనప్పుడు, అది యోనిలో పెరుగుతూ, బాగా విస్తరిస్తాయి. త్రష్ యోనిలో ఎరుపు, దురద, మరియు స్రావాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉల్వ (మీ యోని ప్రారంభంలో చర్మం) పై కూడా చిన్న తెల్ల ప్రాంతాలు కనిపిస్తాయి మరియు ఎక్కువగా చెడ్డ వాసనతో వస్తుంది. తేలికపాటి పరిస్థిలో సాధారణ గృహ చికిత్సలు ఉపయోగించి చికిత్స చేయవచ్చు, అయితే పునరావృతమైన లేదా తీవ్రమైన పరిస్థితులలో మీ వైద్యున్ని లేదా గైనకాలజిస్ట్ చే వెంటనే చికిత్స చేయించుకోవాలి.

ఇంట్లో నయం చేసుకునేముందు, మీరు నిజానికి అనుమానిస్తున్నది శిలీంధ్ర సంక్రమణేనా (fugal infection) అని నిర్ధారించుకోండి.

ఒకవేళ మీ లక్షణాలు దిగువ పేర్కొన్న వాటి కంటే ఇతర లక్షణాలు కలిగి ఉండకపోతే, మీరు క్రింది సాధారణ ఇంకా సమర్థవంతమైన గృహ చిట్కాల కోసం వెళ్ళవచ్చు:

  1. యోని ఈస్ట్ సంక్రమణ కోసం ఆపిల్ సైడర్ వినెగర్ - Apple Cider Vinegar for vaginal yeast infection in Telugu
  2. యోని ఈస్ట్ సంక్రమణ కోసం ప్రోబయోటిక్స్ - Probiotics for vaginal yeast infection in Telugu
  3. యోని ఈస్ట్ సంక్రమణ కోసం పెరుగు (యోగర్ట్) - Yogurt for vaginal yeast infection in Telugu
  4. యోని ఈస్ట్ సంక్రమణ కోసం కొబ్బరి నూనె - Coconut oil for vaginal yeast infection in Telugu
  5. యోని ఈస్ట్ సంక్రమణ కోసం తేయాకు చెట్టు నూనె - Tea tree oil for vaginal yeast infection in Telugu
  6. యోని ఈస్ట్ సంక్రమణ కోసం బోరిక్ యాసిడ్ - Boric acid for vaginal yeast infection in Telugu
  7. యోని ఈస్ట్ సంక్రమణ కోసం బంతి పువ్వు నూనె - Calendula oil for vaginal yeast infection in Telugu
  8. యోని ఈస్ట్ సంక్రమణ కోసం ఎండువామ్మకు నూనె - Oregano oil for vaginal yeast infection in Telugu
  9. యోని ఈస్ట్ సంక్రమణ కోసం కలబంద - Aloe vera for vaginal yeast infection in Telugu
  10. యోని ఈస్ట్ సంక్రమణ కోసం సీమ వాక్కయ రసం - Cranberry juice for vaginal yeast infection in Telugu
  11. యోని ఈస్ట్ సంక్రమణ కోసం వెల్లుల్లి - Garlic for vaginal yeast infection in Telugu
  12. యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లో పత్తి లోదుస్తులను ధరించాలి - Wear cotton underwear in vaginal yeast infection in Telugu
  13. యోని ఈస్ట్ సంక్రమణకు సంభందించిన కొన్ని ప్రాధిమిక నిజాలు - Some basic facts about vaginal yeast infections in Telugu

ఆపిల్ సైడర్ వినెగార్ ఈస్ట్ ఇన్ఫెక్షన్తో పోరాటంలో చాలా ప్రభావవంతమైనది. ఏదేమైనా, ఆపిల్ సైడర్ వినెగర్ కంటే ఇతర ఎటువంటి వినెగార్ ను వాడకుండా మీరు జాగ్రత్త వహించాలి. నీటితో ఆపిల్ సైడర్ వినెగార్ను కలిపి, మీ కోసం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించండి. మీ జననాంగ ప్రాంతంలో నీటిలోలో కలిపినా వినెగర్ను రాసుకొని, దానిని 20 నిముషాల పాటు ఉంచి మంచి నీటితో కడగాలి. ఆపిల్ సైడర్ వినెగర్ ఉపయోగించే మరొక మార్గం ఏంటి అంటే, మీ స్నానపు తొట్టెలో వెచ్చని నీటిని వేసి దానిలో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వినెగార్ను కలిపి,15-20 నిమిషాలు ఆ నీటిలో కూర్చోవాలి. ఒక మెత్తని టవల్ను ఉపయోగించి మిమ్మల్ని మీరు పొడిగా అయ్యేవరకు తుడుచుకోవాలి.గట్టిగా తుడుచుకోరాదు అది చిరాకుని పెంచుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన బాక్టీరియా (ఎక్కువగా లాక్టోబాసిల్లస్) కలిగి ఉన్న గుళికలు మరియు ద్రావణాలు (solutions) రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇవి అంటువ్యాధులను నివారించడంలో మాత్రమే సహాయం చెయ్యడమే కాక, యోని యొక్క pHను సంతులనం (balance) చేయడంలో కూడా సహాయపడుతాయి. సమతుల్య (balanced) pH ఈస్ట్ పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రోబయోటిక్ సప్లిమెంట్లను గుళికల రూపంలో యోని లోపల పెట్టుకోవచ్చు లేదా ప్రతిరోజూ పానీయాలుగా తీసుకోవచ్చు.

తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళల్లో కూడా అవి గొప్పగా ఉపయోగపడతాయి.

యోగార్ట్, లాక్టోబాసిల్లస్ వంటి లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా యొక్క గొప్ప మూలకం. ఈ బాక్టీరియా జననేంద్రియ ప్రాంతంలో ముఖ్యంగా యోని ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది యోని ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని, ఇన్ఫెక్షన్ను కలిగిస్తున్న ఫంగస్ ను చంపుతుంది. మీరు పెరుగును తినవచ్చు లేదా యోని ప్రాంతంలో రాసుకొని ఒక గంట పాటు ఉంచి శుభ్రంగా నీటితో బాగా కడగాలి. దీన్నిరోజుకు 2-3 సార్లు చేయ్యాలి.

2004 అధ్యయనంలో కొబ్బరి నూనె యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది అని మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది అని, ముఖ్యంగా మందులకు నిరోధశక్తి కలిగి ఉన్నవాటిపై వ్యతిరేకంగా పోరాడడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది అని తెలియజేసింది. అందువల్ల, ఇన్ఫెక్షన్ ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను రాయడం ద్వారా, మీరు వెంటనే సంక్రమణను (ఇన్ఫెక్షన్) వదిలించుకోవచ్చు. కొబ్బరి నూనెను రోజుకు 3-4 సార్లు ఉపయోగించండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

తేయాకు చెట్టు నూనె దాని యొక్క సహజ యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల, ఇది యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ల కొసం ఇంటి నివారణలలో ఒకటిగా కూడా ఉపయోగించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ, దాని గాఢత నొప్పిని మరియు మండే అనుభూతిని కలిగించవచ్చు. అందువల్ల మీరు తీయాకు చెట్టు నూనెను నీటితో కానీ, బాదం నూనెతో కానీ లేదా ఆలివ్ నూనెతో కలిపి ఉపయోగించాలి. దానిని ప్రభావిత ప్రాంతంలో రోజులో పలుమార్లు రాయాలి.

బోరిక్ ఆమ్లం ఒక క్రిమినాశకరం (antiseptic). ఇది యాంటీ ఫంగల్ మరియు యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. బోరిక్ ఆమ్లాన్ని నీటితో కలిపి, దాన్ని ప్రభావిత ప్రాంతం మీద రాసుకొని, కొన్ని నిమిషాలు వదిలివేయండి తరువాత పూర్తిగా కడిగివేయండి. కనీసం రెండు వారాలు రోజువారీ దీనిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ నూనె బంతి పువ్వుల నుండి సేకరించిన ఒక ముఖ్యమైన నూనె. దక్షిణ బ్రెజిల్లో 2008లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ నూనె శక్తివంతమైన యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉందని సూచించింది. అందువల్ల, దినిని యోని ఈస్ట్ సంక్రమణ చికిత్సలో గృహ చిట్కాగా ఉపయోగించవచ్చు. ప్రభావిత ప్రాంతంలో ఈ నూనెను రోజుకు 2-3 సార్లు రాయండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

ఒక 2010 అధ్యయనంలో, ఒరెగానో నూనె యాంటియోక్సిడెంట్ మరియు యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఈ నూనె వామ్ము మొక్క యొక్క ఎండిన ఆకుల నుండి తీయబడినది. ఈ నూనెను పాలుచబర్చి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతానికి రోజుకు 2-3 సార్లు రాయవచ్చు.

కలబంద ఉండే ఎంజైమ్లు, విటమిన్లు, మరియు అమైనో ఆమ్లాలు యాంటి ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సకు, రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును ఒక కప్పు నారింజ పండు రసంలో కలిపి ప్రతి రోజూ త్రాగాలి.

క్రాన్బెర్రీ (వాక్కయ) జ్యూస్ ఈస్ట్ మరియు ఇతర శిలీంధ్ర (ఫంగల్) వ్యాధుల వ్యతిరేకతపై సమర్థవంతంగా పనిచేస్తుంది.1968లో నిర్వహించిన ఒక పాత అధ్యయనంలో సీమ వాక్కయ రసం యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్న బెంజోయిక్ యాసిడ్ను కలిగి ఉంది అని తెలిసింది. క్రాన్బెర్రీ రసాన్నిపలుచగా చెయ్యకుండా మరియు తీపి కలపకుండా త్రాగాలి. ఇలా రోజులో కొన్ని సార్లు తాగితే ఈస్ట్ సంక్రమణను తగ్గిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పై తాజా వెల్లుల్లి సారం వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు అనేక పరీక్షలు నిర్వహించి దానిని రుజువు చేసారు.వెల్లుల్లి మొగ్గలను మీ సొంతముగా ఉపయోగించరాదు అని మేము సలహా ఇస్తున్నాము ఎందుకంటే అవి ప్రవేశపెట్టడానికీ తీసివేయడానికీ కష్టంగా ఉంటాయి. వెల్లుల్లి క్యాప్సూల్స్ ను నోటి ద్వారా తీసుకోవచ్చు మరియు యోని చర్మం చుట్టూ వెల్లుల్లి సారం క్రీములు రాసుకోవచ్చు. ఇవి మందుల దుకాణాలలో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించవచ్చు. మోతాదును సూచించే సూచనలను జాగ్రత్తగా చదవండి. ఒకవేళ చికాకు కలిగిస్తే ఉపయోగించడం ఆపివేయండి. సందేహంగా ఉంటె సరైన చికిత్స కోసం వైద్యున్ని సంప్రదించండి.

యోని ప్రాంతంలోని ఈస్ట్ యొక్క పెరుగుదలకు వెడి మరియు తడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల, బిగుతు బట్టలు, సింథటిక్ లోదుస్తులు, మొదలైనవి ధరించరాదు. కాబట్టి ఆ సమయంలో మీరు పొడి మరియు వదులుగా ఉండే పత్తి లోదుస్తుల ధరించాలి లేదా లోదుస్తులు ధరించకపోయిన మంచిదే. ఇలా చేయడం వలన ఈస్ట్ పెరుగుదలను నివారించవచ్చు మరియు ఇది సంక్రమణకు చికిత్సలో సహాయపడుతుంది.

యోని ఈస్ట్ సంక్రమణ గురించి మీరు తెలుసుకోవలసిన కొంత ముఖ్యమైన సమాచారం ఇక్కడ ఉంది.

లక్షణాలు - Symptoms in Telugu

ఈస్ట్ ఇన్ఫెక్షన్ యొక్క సాధారణ లక్షణాలు కింది వాటిని కలిగి ఉంటాయి:

  • యోని మరియు ప్రభావిత ప్రాంతాల్లో దురద.
  • యోనిలో మరియు యోని చుట్టూరా ఎర్రదనం
  • అసౌకర్యం మరియు తేలికపాటి నొప్పి.
  • యోని ప్రాంతంలో అధిక తేమ.
  • మీగడ లేదా పెరుగు లాంటి స్రావాలు సాధారణంగా యోని నుండి వస్తాయి, అవి తెలుపు రంగులో ఉంటాయి.
  • జననేంద్రియ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  • స్రావాల నుండి ఒక మురికి మరియు అసహ్యకరమైన వాసన.
  • మూత్రంలో నొప్పి ఉన్నప్పుడు.(మరింత సమాచారం: బాధాకరమైన మూత్రవిసర్జన కారణాలు)

గైనకాలోజిస్ట్ ను ఎప్పుడు సంప్రదించాలి అంటే:

పైన పేర్కొన్న నివారణలు ఉపయోగించిన తర్వాత మీ సంక్రమణం (ఇన్ఫెక్షన్) తగ్గకపోతే, మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ను కలిసి సంక్రమణకు కారణం తెలుసుకోవాలి. పునరావృత లేదా చికిత్స చెయ్యని ఈస్ట్ ఇన్ఫెక్షన్ లైంగిక వ్యాధులు లేదా ఇతర వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీయవచ్చు. మీరు క్రింది లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు వెంటనే వైద్యున్ని కలవాలి

  • మీరు గర్భవతిగా ఉండి యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.
  • సంక్రమణం పునరావృతమైతే (రెండు సార్లు కన్నా ఎక్కువ).
  • జననేంద్రియ ప్రాంతంలో పూతల లేదా పొక్కులు రావడం.
  • పొత్తి కడుపులో నొప్పి.
  • తెలియని వ్యక్తి లేదా బహుళ వ్యక్తులతో అసురక్షితమైన శృంగారం.
  • యోని ఇన్ఫెక్షన్ తో పాటు జ్వరం కూడా ఉంటే.

కారణాలు - Causes in Telugu

యోని ఒక మృదువైన సున్నితమైన ప్రాంతం. ఇది సహజంగా స్వీయంగా శుభ్రపరచుకునే అవయవం, అంటే యోనిని శుభ్రపరచడానికి సహాయపడే కొన్ని ఎంజైములను శరీరం విడుదల చేస్తుంది. కానీ అప్పటికీ సాధారణంగా తేలికపాటి మరియు సులభంగా చికిత్స చేయగల ఇన్ఫెక్షన్ కు మీరు గురి కావచు. ఇన్ఫెక్షన్ కు గురి కావడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి.అవి:

  • గర్భం
    గర్భస్థ హార్మోన్లు వివిధ శారీరక మార్పులకు బాధ్యత వహిస్తాయి. అందువల్ల, అవి యోని ఈస్ట్ సంక్రమణలను ఆకర్షించవచ్చు. మీకు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే, పైన చెప్పిన నివారణలలో కొన్ని మీ శిశువుపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండటం వలన ఇంటి నివారణలు ప్రయత్నించకూడదు మరియు సరైన చికిత్స కోసం మీ గైనకాలజిస్ట్ ను కలవాలి
  • మద్యం తీసుకోవడం
    మేము పైన చెప్పినట్లుగా, అధికంగా మద్యం తీసుకోవడం వల్ల యోని ఈస్ట్ సంక్రమణకు గురికావడానికి అవకాశాలు పెరుగుతాయి.
  • గర్భనిరోధక మాత్రలు
    కొన్ని గర్భనిరోధక మాత్రలు కూడా మీ యోని ప్రాంతం యొక్క వాతావరణాన్ని మార్చివేస్తాయి మరియు అంటురోగాలకు గురైయ్యేలా చేస్తాయి
  • మధుమేహం
    మధుమేహంలో అంటువ్యాధులకు గురి కావడానికి అవకాశాలు పెరుగుతాయి, ఎందుకంటే ఈస్ట్ కి తింటడానికి ఎక్కువ చక్కెర అందుబాటులో ఉంటుంది.
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
    బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, జన్మించినప్పటి నుండి లేదా హెచ్ఐవి-ఎయిడ్స్  (HIV-AIDS) వంటి కొన్ని వ్యాధులు ద్వారా సంభవించవచ్చు, ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి మరియు అంటువ్యాధులు సులభంగా ప్రభలడానికి శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
  • యాంటిబయాటిక్స్
    దీర్ఘకాలిక యాంటిబయోటిక్ చికిత్స కూడా ఆరోగ్యకరమైన బాక్టీరియాను చంపుతుంది, ఆరోగ్యకరమైన బాక్టీరియా యోనిలోని ఈస్ట్ కణాల సమతుల్యతకు ముఖ్యమైనది. ఈ బ్యాక్టీరియా తగ్గిపోతున్నప్పుడు, ఈస్ట్ వ్యాధిని పెంచుతుంది మరియు వ్యాధికి కారణమవుతుంది.
  • STD (లైంగికంగా వ్యాపించే వ్యాధులు)
    లైంగికంగా వ్యాపించే వ్యాధులు కూడా ఆరోగ్యకరమైన బాక్టీరియా యొక్క సంఖ్యను తగ్గిస్తాయి మరియు ఈస్ట్ పెరగడానికి అనుకూలమైన పరిస్థితులను చేస్తాయి.

నివారణ - Prevention in Telugu

పైన చెప్పిన చిట్కాలు ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ, యోని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు వ్యాధుల నుండి దూరంగా ఉండటం మంచిది. మీ శరీరంలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి చేయవలసిన మరియు చెయ్యకూడని కొన్ని పనుల జాబితా క్రింద ఉంది:

  • పత్తి దుస్తులు (cotton clothes)
    పత్తి బట్టలు మరియు లోదుస్తుల ధరించడం వలన యోని ప్రాంతంలోని వెచ్చదనం మరియు తేమ అభివృద్ధిని నిరోధిస్తుంది మరియు ఈస్ట్ యొక్క పెరుగుదలను నిరోధిస్తుంది.
  • వదులైన బట్టలు
    బిగుతు బట్టలు మీ యోనికి తాజా గాలి తగలనివ్వవు. ఇది ఈస్ట్ కు వ్యాధిని పెరగడానికి మరియు సంక్రమణకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. అందువల్ల, మీ యోని ఆరోగ్యంగా మరియు సంక్రమణ-రహితంగా ఉంచడానికి వదులుగా ఉన్న గాలి తగిలే దుస్తులను ధరించడం మంచిది.
  • మద్యపానం తగ్గించండి
    ఆల్కహాల్ యోని ప్రాంతం యొక్క తేమని తొలగిస్తుంది మరియు వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల (ఫంగస్) పెరుగుదలకు దారితీస్తుంది. అందువల్ల,మద్యం ఎప్పుడు తక్కువ మోతాదులో సేవింవచాలని చెప్తారు.
  • పరిశుభ్రతను పాటించండి
    మురికి దుస్తులను ధరించవద్దు. మీ చెమటతో కూడిన జిమ్ బట్టలను లేదా పనిచేసిన బట్టలు వెంటనే మార్చండి ఇంటిలో తాజా వస్త్రాలను ధరించండి. మురికి లేదా కలుషితమైన చేతులతో మీ జననేంద్రియ ప్రాంతాన్ని తాకవద్దు.
  • సరైన పద్దతిలో తుడుచుకోండి
    మలవిసర్జన తరువాత ముందు నుంచి వెనుకకు తుడవండి. ఇది మీ పాయువు నుండి యోని ప్రాంతంలోకి బాక్టీరియా చేరడాన్ని నిరోధిస్తుంది.
  • మీ చర్మంన్ని సున్నితంగా ఉండండి
    యోని చర్మం సున్నితమైనది మరియు దాని pHను సమతుల్యపరచడం చాలా ముఖ్యం. ఘాడమైన సబ్బులు, సుగంధ ద్రవ్యాలు లేదా వాసనతో కూడిన బాడీ వాష్ లు లేదా స్నాన లవణాలు (bath salts) ఉపయోగించవద్దు ఎందుకంటే ఈ ఉత్పత్తులు యోని యొక్క pHను పెంచి, ఈస్ట్ మరియు ఇతర అంటువ్యాదుల ఫంగస్, బ్యాక్టీరియాల అభివృద్ధికి అనుకూలంగా చేస్తాయి.
  • యోని ప్రాంతాన్ని తుడిచేటప్పుడు
    స్నానం తర్వాత మిమ్మల్ని మీరు తుడుచుకునేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి. బరకగా తుడవడం వల్ల మీ జననాంగ చర్మం గాయపడవచ్చు మరియు అది ఇన్ఫెక్షన్లను పెంచుతుంది. ఒక మృదువైన టవల్ను ఉపయోగించి మిమ్మల్ని పొడిగా చేసుకోండి.
  • మీ యోనిని అతిగా శుభ్రం చేయవద్దు
    మీరు యోనిని బయట మరియు లోపల అతిగా శుభ్రం చెయ్యడం వల్ల వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు అనుకుకోవచ్చు. కానీ అది నిజం కాదు. యోనిని నీరు లేదా ఇతర రసాయనాలతో శుభ్రం చెయ్యవలసిన పని లేకుండా,అదే స్వీయం గా దానిని శుభ్రపరచుకోగలదు. అది అంతర్గత ప్రాంతం నుండి సహజ క్లీనర్ గా ఉంటుంది కాబట్టి ఆందోళన చెందకండి, ఎందుకంటే అది సహజంగా ఆ పని చెయ్యడానికి చక్కగా శిక్షణ పొందుతుంది.
  • ప్యాంటీ లీనియర్ల (panty liners)ను ఉపయోగించవద్దు
    మీరు రుతుస్రావంలో ఉన్నప్పుడు మాత్రమే సానిటరీ ప్యాడ్లు మరియు ప్యాంటీ లీనియర్లు ఉపయోగించండి. వాటిని మాములు సమయంలో ఉపయోగిస్తే మీ యోని చర్మం పొడిగా మారి చికాకు కలిగించవచ్చు. ఇది దురద, పగుళ్ళు, పూతల తదితరాలతో ఆ ప్రాంతంలోని సంక్రమణ (ఇన్ఫెక్షన్) అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
  • మీకు సంక్రమణ ఉన్నప్పుడు శృంగారాన్ని నివారించండి
    మీరు ఈస్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు శృంగారంలో పాల్గొనడం వలన మీ జననాంగ ప్రాంతంలో చికాకు పెరుగుతుంది మరియు మీ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అందువల్ల, మీకు చికిత్స జరగబోయే సమయంలో శృంగారాన్ని నివారించండి.

(మరింత సమాచారం: యోని ఆరోగ్యం)

మందులు - Medicines in Telugu

ఇవి మీ దగ్గరి ఔషధ దుకాణంలో సులభంగా లభిస్తాయి మరియు అవి యాంటీ ఫంగల్ క్రీమ్లు, మందులను, ద్రావణాలు, లోషన్లు, యోని మాత్రలు, మరియు పెసరీస్ లేదా సుపోజిటరీలను కలిగి ఉంటాయి. ఇంట్లో మీ సంక్రమణను నయం చేయడానికి ఉపయోగించే కొన్ని OTC (ఓవర్ ది కౌంటర్) యాంటీ ఫంగల్ మందులు:

  • క్లోట్రిమజోల్ (Clotrimazole)
  • మైకోనజోల్ నైట్రేట్ (Miconazole nitrate)
  • బ్యుటోకోనజోల్ (Butoconazole)
  • టీయోకోనజోల్ (Tioconazole)
  • బుటెన్ఫిన్ హైడ్రోక్లోరైడ్ (Butenafine hydrachloride)
  • పైన ఏవైనా వాటి కలయిక

యోని లోపల మందుని రాయడానికి, ఈ మందులతో ఎక్కువగా చిన్న పుల్ల ముక్కలు (applicator stick) లాంటివి లభిస్తాయి.మందు ప్రారంభించే ముందు, సరైన పద్ధతి గురించి ఫార్మసిస్ట్ ను అడగండి లేదా ఔషధం యొక్క ప్యాకేజీపై ఇచ్చిన సూచనలను చదవాలి.

మీరు ఏవైనా మందులు వాడుతున్నట్లైతే ముందే వాటి గురించిఫార్మసిస్ట్ కు చెప్పడం ముఖ్యం, ఎందుకంటే అవి యాంటీ ఫంగల్ ఔషధాల యొక్క చర్యకు అంతరాయం కలిగించవచ్చు.

వనరులు

  1. Falagas ME, Betsi GI, Athanasiou S. Probiotics for prevention of recurrent vulvovaginal candidiasis: a review. J Antimicrob Chemother. 2006 Aug;58(2):266-72. Epub 2006 Jun 21. PMID: 16790461
  2. Abdelmonem AM, Rasheed SM, Mohamed ASh. Bee-honey and yogurt: a novel mixture for treating patients with vulvovaginal candidiasis during pregnancy. Arch Gynecol Obstet. 2012 Jul;286(1):109-14. PMID: 22314434
  3. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Vaginal yeast infections.
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Vaginal Candidiasis
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Vaginal yeast infection
  6. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Vaginal thrush
Read on app