సుగంధ ద్రవ్యాలలో ప్రసిద్ధమైన “చెక్కా-లవంగాలు” లోని చెక్కనే “దాల్చిన చెక్క.” దాల్చిన చెక్క నేడు ప్రతి ఒక్కరి వంటింటిలోను కన్పించే ఓ మసాలా దినుసు (లేక సుగంధద్రవ్యం). రకరకాలైన తీపి వంటకాలు మరియు ఇతర అన్ని ఇంపైన వంటకాలకు ఓ పరిపూర్ణ మసాలా దినుసు దాల్చిన చెక్క. దాల్చిన చెక్క యొక్క గాఢతతో కూడిన సువాసన మరియు దాని తీపి కలకలిసిన రుచి వంటలకు మరింత మాధుర్యతను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు. దాల్చిన చెక్క యొక్క వైద్య ప్రయోజనాల కారణంగా దాన్ని ఇటు భారతీయ వైద్యంలోను, అటు సంప్రదాయిక చైనీస్ మెడిసిన్ (TCM)లోనూ చాలా కాలం నుండి వాడుతున్నారు. సంప్రదాయ పాశ్చాత్య వైద్య వ్యవస్థ కూడా దాల్చిన చెక్కకు  అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, లవంగం తర్వాత దాల్చినచెక్క ఉత్తమ అనామ్లజని. దాల్చినచెక్క మసాలాదినుసుకు సుదీర్ఘమైన మరియు సుసంపన్నమైన చరిత్ర ఉంది, అది తెలుసుకోవాలని మీకూ ఉంటుందని ఆశిస్తున్నాం. దాల్చినచెక్కను మొట్టమొదటిగా ఉపయోగించిన దాఖలా 2000-2500 BC కాలానికి చెందినది. దాల్చినచెక్కను ఉపయోగించినట్లు యూదు బైబిల్లో ప్రస్తావించబడింది. తలంటుకు ఉపయోగించే దినుసుల్లో దాల్చిన చెక్కను ఉపయోగించినట్లు బైబిల్లో ఉదహరించబడింది. ఇంకా, ఈజిప్ట్ దేశస్తులు తమ “మమ్మిఫికేషన్” విధానాల్లో దీనిని ఉపయోగించారు. రోమ్ లో దాల్చినచెక్కను మనిషి చనిపోయాక అంత్యక్రియల సమయంలో శవ సంస్కారానికి వాడే వాళ్ళు, దీనివల్ల శవం నుండి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.  వాస్తవానికి, ఈ దాల్చిన చెక్క రోమ్ లో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగానే చాలా కొనాలం పాటు కొనసాగింది గనుక, అప్పట్లో ఇది కేవలం ధనవంతుల మసాలా దినుసుగానే ఉండేది.

మీకు తెలుసా? 

కొంతమంది చరిత్రకారుల ప్రకారం, వాస్కో డ గామా మరియు క్రిస్టోఫర్ కొలంబస్ మొదట తమ సుదూర సముద్ర ప్రయాణాల్ని సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల అన్వేషణకోసమే ప్రారంభించారు. ముఖ్యంగా దాల్చినచెక్క కోసమే  వాళ్ళు ఎక్కువగా అన్వేషించారట. ఈ సంగతి వాస్తవమే, ఎందుకంటే, దాల్చినచెక్కకు పుట్టినిల్లు శ్రీలంక అన్న సంగతిని మొట్టమొదట శ్రీలంకలో దీన్ని కనుగొన్న పోర్చుగీసువారు చాటి చెప్పారు. ఇప్పటికీ కూడా దాల్చిన చెక్క చాలా ఖరీదైన దినుసుగానే రాజ్యమేలుతోంది. ఏది ఏమైనప్పటికీ, దాల్చినచెక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటగాళ్లకు మరియు బ్రెడ్-వంటకాల తయారీదారులకు చాలా ఇష్టమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. దాల్చినచెక్కను, దాల్చినచెట్టు యొక్క అంతర్గత బెరడు నుండి సేకరించబడుతుంది. ఇది ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రధానంగా కనిపించే సతతహరిత వృక్షం (అంటే చాలా కాలంపాటుగా ఈ చెట్టు అంతరించకుండా ఉంటుంది). సహజసిద్ధంగా అడవుల్లో మొలిచి, పెరిగిన దాల్చిన వృక్షం 18 మీటర్ల ఎత్తు వరకు పెరగవచ్చు, కానీ సాగుచేసిన దాల్చినచెక్క చెట్టు రకాలు 2-3 మీతారల ఎత్తు పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆకు ఈనెలు సమాంతరంగా ఉండి, (వాటి రెండు చివరలు, అంటే ఆకు మొదలు మరియు చివర) ఆకు కొనల్లో కలుస్తాయి. బే ఆకుల రూపం లేదా తేజ్ పట్టా వంటిదే దాల్చిన చెక్క ఆకు. దాల్చిన పువ్వులు అందమైన పసుపురంగు కల్గి  గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి మరియు దాల్చిన కాయలు పండిన తర్వాత నల్లని పండ్లుగా మారుతాయి.

దాల్చిన చెక్కను గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • ఓషధిశాస్త్ర నామం: సిన్నమోమం వెర్ము / సిన్నామోమ్ జిలానికం
 • కుటుంబం: లారాసియా
 • సాధారణ పేర్లు: సిన్నమోన్, దాల్చిని
 • సంస్కృత నామం: దారుసిత
 • ఉపయోగించే భాగాలు: బెరడు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: దాల్చినచెక్క దక్షిణ ఆసియాకు చెందినది, కానీ ఇది ప్రపంచంలోని అత్యధిక ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా ప్రవేశపెట్టబడింది. దాల్చినచెక్క ఎక్కువగా శ్రీలంక, మలగరీసీ రిపబ్లిక్ మరియు సీషెల్స్ ద్వీపం నుండి పొందబడుతుంది. భారతదేశంలో, దాల్చినచెక్క చెట్లను కేరళలో సాగు చేస్తారు.
 • శక్తిశాస్త్రం: తాపం/వేడిని (వార్మింగ్) కల్గించే సుగంధద్రవ్యమిది. రెండు దోషాలైన వాతాన్ని, కఫాన్ని శమింపజేస్తుంది. అయితే పిత్త దోషాన్ని  తీవ్రతరం చేస్తుంది.
 1. దాల్చిన చెక్క రకాలు - Types of Cinnamon in Telugu
 2. దాల్చిన చెక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of Cinnamon in Telugu
 3. దాల్చినచెక్కను ఎలా ఉపయోగించాలి - How to use cinnamon in Telugu
 4. దాల్చినచెక్క సురక్షిత మోతాదు - Cinnamon dosage in Telugu
 5. దాల్చినచెక్క దుష్ప్రభావాలు - Cinnamon side effects in Telugu

దాల్చినచెక్క రకాలు: దాల్చినచెక్కలో చాలా రకాలు ఉన్నాయి, అయితే దాల్చినచెక్కలో సాధారణమైనవి రెండు రకాలు: సిలోన్ (శ్రీలంక) దాల్చినచెక్క మరియు చైనా దాల్చినచెక్క. సిలోన్ (శ్రీలంక) దాల్చినచెక్క: “నిజమైన దాల్చినచెక్క” గా దీన్ని పిలుస్తారు. ఇది శ్రీలంకలో విస్తృతంగా సాగు చేయబడుతుంది మరియు ఇది చాలా ఖరీదైనది. ఇది తీపి రుచిని మరియు తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది. సిలోన్ దాల్చినచెక్క (బెరడు) సన్నని కాగితపు పొరల లాగా ఉంటాయి, వీటిని ఒకదానిపై ఒకటిగా చుట్టి, ఒక గొట్టపు అక్కారం వాచీలా చేసి భద్రం చేస్తారు. ఇది తేలికపాటి రంగులో ఉంటుంది. చైనా దాల్చినచెక్క లేక కాస్సియా దాల్చినచెక్క: ఇది చైనా దేశంలో పుట్టిన రకం కాబట్టి దీన్ని “చైనీస్ దాల్చినచెక్క”గా పిలుస్తున్నారు. ఇది ఎక్కువగా ఉపయోగించే సాధారణమైన దాల్చిన చెక్క రకం. కాస్సియా దాల్చినచెక్క చూడటానికి ముదురు గోధుమ రంగును కల్గి గాఢమైన వాసన మరియు మసాలా రుచిని కలిగి ఉంటుంది. ఈ రకం దాల్చిన చెక్క ముక్కలు ఒక మందపాటి షీట్ ఒకటి లేదా రెండు వైపుల నుండి మధ్య వైపుకు మడచబడి ఉంటాయి. సిలోన్ సిన్నమోన్ కంటే ఇది చాలా ఎక్కువ “కమరిన్” పదార్థాన్ని అధిక సాంద్రతలలో కలిగి ఉంటుంది కాబట్టి  కాలేయానికిది విషపూరితం అవుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.

సంప్రదాయ చైనీస్ వైద్యం, పాశ్చాత్య సంప్రదాయ మూలికావైద్యం (హెర్బలిజం) మరియు ఆయుర్వేద వైద్య పద్ధతుల్లో దాల్చినచెక్క (సిన్నమోన్) అతి ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. కానీ ఆధునిక ఔషధవైద్య పధ్ధతి ఇప్పటికీ దాల్చినచెక్క యొక్క అనేక ఆరోగ్య గుణాలు మరియు దాని వైద్య-సంబంధ ప్రయోజనాలను తెలుసుకోవడంలో వెనుకబడి ఉంది. దాల్చినచెక్క గురించి మనకు తెలిసిన విషయాల గురించి ఇపుడు చూద్దాం.

కడుపు సమస్యలను తగ్గిస్తుంది: కడుపు సమస్యలను చాలా వరకు తగ్గించుటకు దాల్చినచెక్క సహాయపడుతుంది. దీనిని ఉబ్బరం, మలబద్ధకం మరియు వికారం నివారణ కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతల నివారణకు మరియు ఆకలిని మెరుగుపరచడంలో కూడా దాల్చినచెక్క కూడా సహాయపడుతుంది.
మధుమేహ వ్యతిరేక ప్రభావం: దాల్చినచెక్క  క్రియాశీలక సమ్మేళనాల్లో (active compounds) సమృద్ధిగా ఉంటుంది, వివిధ క్లినికల్ అధ్యయనాలు ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని సూచించాయి, అందుచేత రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
బరువు క్షీణతను ప్రోత్సహిస్తుంది: దాల్చినచెక్కలో ఉన్న సిన్నమాల్డిహైడ్ (cinnamaldehyde) శరీరంలో కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది అని నిరూపించబడింది. దాల్చినచెక్క ఆకలి కోరికలను కూడా తగ్గిస్తుంది.
గుండెకు మంచిది: దాల్చినచెక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు ధమనులలో గడ్డలు  ఏర్పాడడాన్ని నిరోధిస్తుంది, అందుచే గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఋతు సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది: దాల్చినచెక్క వినియోగం ఋతుక్రమ సమయ నొప్పిని తగ్గించడమే కాక ఋతుస్రావ సమయంలో వికారాన్ని నిరోధించడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని క్లినికల్ అధ్యయనాలు సూచించాయి.
మోటిమలను తగ్గిస్తుంది: దాల్చినచెక్క అనేది సహజమైన వాపు  నిరోధకం మరియు యాంటీఆక్సిడెంట్. ముఖ ముసుగుతో (face mask) దీనిని కలిపినప్పుడు, మోటిమల యొక్క నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: లవంగంతో  పాటు దాల్చిన నూనెను  సంప్రదాయబద్ధంగా పంటినొప్పుల నుంచి ఉపశమనం పొందటానికి ఉపయోగిస్తారు. కొన్ని వాణిజ్యపరమైన  ఔషధాల వలె దాల్చినచెక్క ప్రభావవంతంగా జిన్టివిటిస్ లక్షణాలను నివారించడం మరియు ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

నోటి దుర్వాసనకు దాల్చిన చెక్క - Cinnamon for mouth odour

చెడు శ్వాస అనేది ఎవరికున్న సరే అది గర్హించదగ్గ పరిస్థితి. ఒక్కోసారి దీన్ని అధిగమించడం కష్టం. ఒక్కోసారి, దీన్ని పరిష్కరించడం అంత  సులువేం కాదు. వైద్యుల ప్రకారం, చెడు శ్వాసకు అత్యంత సాధారణ కారణం నోటి కుహరంలో అధిక సూక్ష్మజీవులు చోటు చేసుకుని ఉండడమే. అదృష్టవశాత్తూ, అధ్యయనాలు ఏమి చెప్పాయంటే  దాల్చినచెక్కలో ఉన్న సిన్నమిక్ ఆమ్లం మన నోటిలో ఉన్న బాక్టీరియాను చంపటానికి ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తున్నాయి. అందువల్ల నోటిలో వచ్చే చెడ్డ శ్వాసకు దాల్చినచెక్క వాడి స్వస్తి పలకండి. కెనడాలో జరిపిన ఒక అధ్యయనంలో, దాల్చినచెక్క బంక (chewing gum) ను నమిలినవారిని సాధారణ గమ్ ను నమిలినవారితో పోలిస్తే వారి నోటిలో తక్కువ బ్యాక్టీరియ క్రిములు ఉన్నట్లు కనుగొనబడింది. అయితే, దాల్చినచెక్క యొక్క ఈ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాలి.

నోటి ఆరోగ్యానికి దాల్చినచెక్క - Cinnamon for oral health

ఆయుర్వేదంలో చెప్పినప్రకారం, లవంగం (క్లోవ్) మరియు దాల్చినచెక్క మిశ్రమం పంటి నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. “జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ అండ్ డెంటల్ సైన్స్” లో  ప్రచురించిన ఒక వైద్య అధ్యయన వ్యాసం ప్రకారం, వచ్చిన పంటి చిగుర్లు తదితర దంత చిగుళ్ల వ్యాధులతో (జిన్జివిటిస్తో) బాధపడుతున్నవారికి దాల్చినచెక్క చాలా బాగా పని చేస్తుందని పేర్కొంది. చిగుళ్లసమస్యలకు సాధారణంగా ఉపయోగించే “క్లోర్హెక్సిడిన్” మందులాగానే దాల్చినచెక్క కూడా చిగుళ్ల వ్యాధులకు చేసే చికిత్సలో మిగుల ప్రభావవంతంగా ఉంటుంది అని ఈ వైద్య అధ్యయన వ్యాసం  సూచించింది.

ఋతుస్రావ సమస్యలకు దాల్చిన చెక్క - Cinnamon for menstrual problems

ముట్టుకుట్టు అనగా బహిష్టు సమయాన స్త్రీలకు వచ్చే కడుపునొప్పివంటి ఋతు సమస్యలు, వికారం మరియు వాంతుల చికిత్సలో దాల్చినచెక్కను దీర్ఘకాలంగా ఆయుర్వేదం మరియు మూలికావైద్యంలో ఉపయోగించబడుతోంది. ఇలాంటి ఋతు సంబంధమైన సమస్యలతో బాధపడే 76 మంది మహిళలపై జరిపిన ఇటీవల ఓ అధ్యయనంలో, దాల్చినచెక్క యొక్క కాప్సూళ్లను (420 mg) రోజుకు మూడుసార్లు వారిచేత సేవింపజేసి మహిళల్లో వచ్చే తిమ్మిరి, రక్తస్రావం, వికారం మరియు వాంతుల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని కనుగొనబడింది.

దగ్గు, జలుబులకు దాల్చినచెక్క - Cinnamon for cough and cold

ఆయుర్వేదలో, దాల్చినచెక్కను కఫదోషాన్ని మరియు వాత దోషాన్ని  అణిచివేసేందుకు మందుగా ఉపయోగిస్తారు. అలాగే, ఇది శరీరంలో పిత్తాన్ని పెంచుతుంది. అందువలన, ఇది శరీరంలో కఫాన్ని   ద్రవీకరింపజేసి దాన్ని పీల్చేస్తుంది. మనుషులకొచ్చే క్షయవ్యాధి (tuberculosis) కి కారణమైన మైకోబాక్టీరియం (Mycobacrerium tuberculosis) ఏజంటుని చంపడంలో దాల్చినచెక్కలోని సిన్నామిక్ ఆమ్లం ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఈ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సినామిక్ యాసిడ్ యొక్క ఖచ్చితమైన చర్య మరియు యాంత్రిక విధానాన్ని గుర్తించేందుకు ఇంకా ఎక్కువ పరిశోధనలు జరగాల్సి ఉంది.  దానికితోడు, దాల్చినచెక్క సహజమైన వేడిని పుట్టించే గుణం కలిగి ఉంది. అందు వలన దాల్చినచెక్కను భారతీయ సంప్రదాయిక మూలికావైద్యవిధానం మరియు సంప్రదాయిక చైనా ఔషధపద్ధతుల్లో జలుబుకు ఔషధంగా ఉపయోగించబడుతోంది.

కడుపుబ్బరానికి దాల్చిన చెక్క - Cinnamon for stomach upset in Telugu

దాల్చిన చెక్క ఏ రకమైన గ్యాస్ట్రిక్ సమస్యకూ నివారణ కాదు, కానీ ఇది ఆరోగ్యానికి దోహదపడి పొట్టను ఆరోగ్యాంగా ఉంచేందుకు ఉపయోగపడేదిగా చరిత్రను కల్గి ఉంది. సంప్రదాయ పాశ్చాత్య ఔషధ విజ్ఞానం దాల్చినచెక్కను కడుపుబ్బరాన్ని తగ్గించేదిగాను, మరియు జీర్ణకారి అయిన దినుసుగాను పేర్కొంది. కాబట్టి, దాల్చినచెక్క కడుపు ఉబ్బరం కలిగినపుడు, ఆ ఉబ్బరాన్ని తగ్గించేందుకు, మరియు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడం కోసం ఉపయోగించబడుతుంది. ఇంకా, ఇది ఆకలిని పెంచుతుంది. దానికితోడు, దాల్చినచెక్కలో ఉన్న కెటచిన్లు వికారం తగ్గించడంలో సహాయపడతాయి. వికారం లక్షణాల ఉపశమనం కోసం, దాల్చినచెక్కతో సాధారణంగా టీ చేసుకుని సేవిస్తారు. ప్రకృతివైద్యం (Naturopathy) లో దాల్చినచెక్కను ఒక భేదిమందు (మలబద్ధకాన్నితగ్గించేది) గా ఉపయోగిస్తారు. ఆయుర్వేదవైద్యంలో, దాల్చినచెక్కను కడుపు తిమ్మిరి, అతిసారం మరియు పెద్దప్రేగులో వచ్చే నొప్పికి చికిత్సగా ఉపయోగిస్తారు. ప్రయోగశాల-ఆధారిత అధ్యయనాల ప్రకారం, అజీర్ణవ్యాధి (dyspepsia) చికిత్సలో ఉపయోగించేందుకు కావలసిన ఔషధగుణాలు దాల్చినచెక్కలో ఉన్నాయని సూచించాయి. ఈ విషయమై మరింతగా జరిగిన అధ్యయనంలో  తేలిందేమంటే దాల్చినచెక్కతో చేసిన పెరుగును కడుపులో పుండుకు కారణమయ్యే బాక్టీరియా “హెలికోబాక్టర్ పైలోరీ” నివారణకు ఉపయోగపడుతుంది. అయితే, ఈ మసాలా యొక్క అన్ని సంప్రదాయిక ఉపయోగాలను ధృవీకరించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు జరగాల్సి ఉంది. కనుక దాల్చినచెక్కను ముందుగా వాడే ముందు మీ వైద్యుడితో మాట్లాడటం ఉత్తమం.

చక్కెరవ్యాధికి దాల్చిన చెక్క - Cinnamon for diabetes

చక్కెరవ్యాధి రావడానికి ఆక్సీకరణ ఒత్తిడే ప్రధాన కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చక్కెరవ్యాధికి దారి తీసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా మన శరీరంలో పనిచేసే ఉత్తమ రక్షణ యంత్రాంగంలో ముఖ్యమైనవి యాంటీఆక్సిడెంట్లుగా చెప్పబడే స్వేచ్ఛా రాశులు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను తొలగించి, స్వేచ్ఛరాశుల ప్రమాదాన్ని తటస్థీకరిస్తుంది. ఓ అనామ్లజని (antioxidant) అయిన దాల్చినచెక్క చక్కెరవ్యాధితో (మధుమేహం) సతమతమయ్యేవారికి ఒక దివ్యమైన దీవెన కన్నా తక్కువేం కాదు. వాస్తవానికి, ఒక పరిశోధన ప్రకారం, లవంగాల తర్వాత మసాలాల ప్రపంచంలో అనామ్లజనికమైన ఉత్తమ వనరుల్లో దాల్చినచెక్కనే చెప్పాలి.  మధుమేహం జబ్బుతో నివసించే 500 మంది వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారికి రోజుకు 6 గ్రాముల దాల్చినచెక్క బెరడును 4-18 వారాలకు ఇవ్వబడింది. దాల్చినచెక్క యొక్క నిరంతర దిననిత్య సేవనం రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా ఉపశమనం చేస్తుందని ఈ అధ్యయనంలో కనుగొనబడింది. మరో అధ్యయనంలో, 5 గ్రాముల దాల్చినచెక్కను దిననిత్యం సేవించడం మూలంగా చక్కెరవ్యాధిగ్రస్తుల్లో “ఇన్సులిన్ సెన్సిటివిటీని” పెంచుతుందని మరియు ఈ హార్మోన్ రక్తం నుండి మరింత చక్కెరను గ్రహించడానికి కారణమవుతుందని పేర్కొంది. దాల్చినచెక్క సేవనం అయిన 12 గంటల తర్వాత దానియొక్క (దాల్చినచెక్క యొక్క) గుణమైనటువంటి రక్తంలో చక్కెరస్థాయిని తగ్గించే ప్రభావాలు  (హైపోగ్లైసెమిక్) గోచరించడం జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అదనంగా, ‘మిథైల్ హైడ్రాక్సీచాల్కోన్’ అనే రసాయనిక సమ్మేళనం ఇన్సులిన్ హార్మోన్ ను సమర్థవంతంగా అనుకరిస్తుంది మరియు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి దాల్చినచెక్క - Cinnamon powder for weight loss

దాల్చినచెక్క చూర్ణం బరువు తగ్గడానికి అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయక మందులలో ఒకటి. ఇటీవల వరకు, బరువు కోల్పోవడం మరియు దాల్చినచెక్క ల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు తగినంతగా శాస్త్రీయ రుజువులు లేవు. కానీ, మిచిగాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఇటీవలి ఒక పరిశోధన ప్రకారం దాల్చినచెక్కలోని “చిన్నమాల్డిహైడ్” అనే పదార్ధం కొవ్వును సమర్థవంతంగా దహించగలదు. ఈ పరిశోధన ప్రకారం, సిన్నమాల్డిహైడ్ శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు “అడిపోసైట్స్’ అనే కణాలసాయంతో కొవ్వు కణాల్ని దహింపజేసి శక్తిని కలుగజేస్తుంది. జంతు-ఆధారిత అధ్యయనాలు మరియు ప్రయోగశాల అధ్యయనాల ప్రకారం, దాల్చినచెక్కను సేవిస్తే  జీర్ణ ప్రక్రియ వేగాన్ని తాటించి (అంటే జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేట్టు చేస్తుంది) చాలా సమయంపాటు పొట్ట సుష్టుగా ఉండనే అనుభూతిని కలిగిస్తుందని సూచించారు. అందువల్ల, బరువు కోల్పేయేందుకు చేపట్టే కార్యక్రమాలతో పాటు దాల్చినచెక్క జీవనాన్ని కూడా కలుపుకుంటే గనుక చాలా ప్రయోజనాలే ఉంటాయి. ఏమైనప్పటికీ, దాల్చినచెక్క సేవించే ముందు మీ వైద్యుడితో మాట్లాడటం ఉత్తమం, అలాగే దాల్చినచెక్క యొక్క సరైన మోతాదును తీసుకోవాలి. మోతాదుకు మించి ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయానికి విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది గనుక జాగ్రత్త.

(మరింత సమాచారం: బరువు తగ్గుదల ఆహార విధాన పత్రిక)

సూక్ష్మజీవనాశక ఏజెంట్ గా దాల్చినచెక్క - Cinnamon as antibacterial agent

దాల్చినచెక్క యొక్క సూక్ష్మజీవనాశక (యాంటీమైక్రోబియాల్) ప్రభావాల్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి మరియు ఆయా అధ్యయనకారులు దాల్చినచెక్కను ప్రభావవంతమైన “యాంటీమైక్రోబయాల్” ఏజెంట్ అని పేర్కొన్నారు. దాల్చినచెక్కలో ఉన్న సిన్నమాల్డిహైడ్ అన్ని రకాల బాక్టీరియా, బూజు, నెమటోడ్స్లను చంపడంలో చాలా శక్తివంతమైనది అని పరిశోధన సూచించింది. ఇది తల పేనుల్ని మరియు ఈపుల్ని అంటే పేనుగుడ్లను (పెడిక్యులస్ హుటాస్ కాపిటిస్) కూడా సమర్థవంతంగా చంపేస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు. సాధారణ సూక్ష్మజీవుల సంక్రమణలకు చికిత్సగా దాల్చినచెక్క యొక్క ఖచ్చితమైన కార్యవైఖరి మరియు ఉపయోగం గురించి మరిన్ని విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి.

శరీరంలో కాండిడా వంటి అంటురోగాలకు దాల్చినచెక్క - Cinnamon for Candida infections

మానవ శరీరంలో ఫంగస్ లేక బూజు అనేది సహజంగా గోచరించేది, దీన్నే “ఆల్బికన్స్ బూజు” లేదా ఆంగ్లంలో “కాండిడా” అంటారు.  కానీ “చర్మం pH” లో అసమతుల్యత కల్గితే ఈ “కాండిడా” లేదా బూజు వ్యాప్తి చెందుతుంది. తద్వారా, వైద్యుడు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడడానికి కారణమవుతుంది. సంప్రదాయ పశ్చిమదేశాల  మూలికా వైద్యంలో (హెర్బలిజంలో), దాల్చినచెక్క, బూజు (కాండిడా) జాతులను అంతరింపజేయడంలో ప్రసిద్ధి చెందింది. అంటే శిలీంధ్ర-వ్యతిరేక ప్రభావాల్ని కల్గిందిగా దాల్చినచెక్కను పేర్కొంటున్నారు. దాల్చినచెక్క చమురు అన్ని రకాల బూజు (candida) కారక అంటువ్యాధుల్ని నివారిస్తుందని ప్రయోగశాల అధ్యయనాలు చెబుతున్నాయి. కాండిడా-అల్బెకన్లు అనే బూజు-సంక్రమణరోగం (ఈస్ట్-సంక్రమణ రోగం) యోనిలో వచ్చేటువంటిది. దాల్చినచెక్క చమురు యోనిలో వచ్చే ఈ బూజు-సంక్రమణ రోగానికి  మరియు అల్బెకన్లు కాని బూజు-సంక్రమణ రోగాలకు కూడా పని చేస్తుందని ప్రయోగశాల అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దాల్చినచెక్క నూనె లేదా దాల్చినచెక్కను బూజు-సంబంధమైన అంటువ్యాధులకు ముందుగా తీసుకోవాలని మీరనుకుంటే మొదట మీ డాక్టర్తో మాట్లాడడం మంచిది.

గుండెకు దాల్చిన చెక్క - Cinnamon for heart

సంప్రదాయ మూలికావైద్యం (హెర్బలిజం) దాల్చినచెక్కను ఒక అద్భుతమైన కొవ్వు-నాశక (కొలెస్ట్రాల్ను-తగ్గించే) ఏజెంట్ గా గుర్తించింది. అనేక అధ్యయనాలు దాల్చినచెక్క శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను (లో-డెన్సిటీ లిపోప్రొటీన్) తగ్గించడంలో ఉపయోగపడుతుంది, అయితే దాల్చినచెక్క శరీరంలోని మంచి-కొవ్వుల్ని (హై-డెన్సిటీ లిపోప్రొటీన్) పెంచుతుంది. అయితే, కొలెస్ట్రాల్ ను దాల్చినచెక్క తగ్గిస్తుందనే ఖచ్చితమైన సంగతి ఇంకా రుజువులతో నిరూపించబడలేదు. ఇది నేరుగా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయం చేయకపోయినా, దాల్చినచెక్క శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ వ్యాధితో సంబంధం ఉన్న సాధారణ గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రక్త ప్రసరణకు దాల్చినచెక్క - Cinnamon for blood circulation

శరీర పనితీరుకు సరైన రక్త ప్రసరణ చాలా అవసరం. కొన్ని శారీరక పరిస్థితులు లేదా భౌతికధర్మాల పరిస్థితుల కారణంగా రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టి,  రక్త ప్రసరణకు అంతరాయమేర్పడి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీయవచ్చు. వైద్యుల ప్రకారం, దాల్చినచెక్కలో ఉన్న కౌమారిన్ (ఒక జీవరసాయనిక ఏజెంట్) సహజాంగా రక్తాన్ని పలుచబరిచే గుణాన్ని కల్గి ఉంది. అంతే గాక దాల్చినచెక్క రక్తం గడ్డ కట్టడాన్ని నిలిపివేస్తుంది. దాల్చినచెక్క సేవనం మన శరీరంలో రక్త ప్రసరణను పెంచేందుకు దారితీస్తుంది, దాల్చినచెక్క సేవనం రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం అనే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయినప్పటికీ, దాల్చినచెక్కలో కౌమారిన్ పదార్ధం అధిక మోతాదులో ఉండటం మూలంగా కాలేయానికి హానికరంగా ఉంటుంది గనుక, దాల్చినచెక్క సేవించేందుకు ముందు మీ డాక్టర్తో మాట్లాడడం మంచిది.

చర్మం ప్రయోజనాలకు దాల్చినచెక్క - Cinnmon benefits for skin

దాల్చినచెక్క యొక్క అనామ్లజనక (యాంటీఆక్సిడెంట్) గుణాలు  మరియు నొప్పినివారక (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు చర్మానికి ఒక అద్భుత ఆహారంగా పని చేస్తాయి. దాల్చినచెక్కకున్న ఈ లక్షణాలు మొటిమలు వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తాయి. ఇంకా, చర్మం పై ఏర్పడే గీతలు, ముడతలు, నల్లటి మచ్చలు మరియు ఇతర అకాల వృద్ధాప్య సంబంధితమైన లక్షణాల వృద్ధి వేగాన్ని శరీరంలో తగ్గిస్తుంది. దాల్చినచెక్క ఓ సమర్థవంతమైన నిప్పి నిరోధకతను కలిగిఉంది.  అయినప్పటికీ, దాల్చినచెక్కకు తన సొంత పోషక లక్షణాలు లేవు. కాబట్టి సాంప్రదాయిక ఔషధ విధానములో చెప్పిన ప్రకారం, తేనెలో రంగరించిన దాల్చినచెక్క చూర్ణ మిశ్రమాన్ని మొటిమలపై లేపనంగా రాసి ఉపశమనం పొందొచ్చు. అంతే గాక ఈ లేపనం చర్మానికి మెరపునిస్తుంది.

క్యాన్సర్-వ్యతిరేకిగా దాల్చినచెక్క - Cinnamon as a potential anti-cancer agent

గ్యాస్ట్రిక్ మరియు చర్మ క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి దాల్చినచెక్క యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లోని ఒక దానిలో, దాల్చినచెక్కలోని  మందుపదార్దాలు శరీరంలో గడ్డలు కట్టడానికి కారణమయ్యే కణాల వ్యాప్తిని సమర్థవంతంగా తగ్గించగలవని కనుగొనబడింది. చర్మ క్యాన్సర్ కణాలపై చేసిన మరొక అధ్యయనం, దాల్చినచెక్క మనుషుల్లో చర్మ క్యాన్సర్ వ్యాప్తికి బాధ్యత వహిస్తున్న ప్రొ-యాంగోజెనిక్ కారకాన్ని (శరీరంలోని ఓ జీవరసాయనిక పదార్ధం) తగ్గిస్తుందని సూచించింది. దాల్చినచెక్కలోని పదార్దాలు, CD8 T కణాలను ప్రేరేపిస్తాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ CD8 T కణాల విధి శరీరంలోని విదేశీ కణాలను గుర్తించి, చంపివేయడం. అందువల్ల, దాల్చినచెక్కలో క్యాన్సర్ వ్యతిరేక చికిత్సలకు కావలసిన సామర్థ్యాన్ని కలిగిన పదార్థాల్ని భవిష్యత్తులో అందించగలదని ఊహించబడుతోంది.

దాల్చినచెక్కను లేదా బెరడును సాధారణంగా కర్రల రూపంలో ఉపయోగిస్తారు. వీటిని  వాణిజ్యపరంగా సిన్నమోన్ "క్విల్స్" (పేళ్లు లేదా చిప్స్) అని పిలుస్తారు. ఈ దాల్చినచెక్క పేళ్లు దాల్చినచెక్క మాను లోపలి బెరడును చెక్కడం/చిత్రికపట్టడం ద్వారా వస్తాయి. ఇలా చిక్కగా వచ్చిన ఒక్కొక్క బెరడు పేడును ఒకదానిపై ఒకటి పేర్చి గొట్టం రూపంలో చుడతారు. లోపల తొర్రభాగం ఉంటుంది. ఈ తొర్రభాగంలో ఉండే ఖాళీ భాగాన్ని ఎండిన దాల్చినచెక్క యొక్క చిన్న బెరడు ముక్కలతో నింపుతారు. ఈ దాల్చినచెక్క యొక్క చిన్న ముక్కలు ప్రత్యేకంగా "క్విల్లింగ్స్" గా అమ్ముడవుతాయి. దాల్చినచెక్క చిప్స్, పౌడర్ మరియు దాల్చినచెక్క యొక్క నూనె మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఆహారానికి రుచిని, సువాసనను కలుగజేసే సంబారపదార్థం దాల్చినచెక్క. అట్టి దీన్ని  విస్తృతంగా అంత్య ఖాద్యాల్లో (డెజర్ట్స్) మరియు మిఠాయిల్లో (confectionaries) ఉపయోగిస్తారు. ఐరోపా మరియు అమెరికాకు చెందిన దేశాల తీపి వంటకం అయిన "సిన్నమోన్ రోల్స్" ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో బాగా ప్రసిద్ధి చెందిన వంటకం. దీన్ని మీరు కూడా ఇదివరకే రుచి చూసుండొచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో దాల్చినచెక్కను ఒక కామోద్దీపన లేదా వీర్యవృద్ధి మందొస్తువుగా మార్చాలని భావించారు. దాల్చినచెక్కకున్న తీపి రుచి, సువాసన కారణంగా దీన్ని ఇప్పటికీ సుగంధాల (cosmetics) ను తయారు చేయడానికి కాస్మెటిక్ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. దాల్చినచెక్క నూనె వాడకం చాలా సాధారణమైనదే.
అయినప్పటికీ, మీరు ఇంట్లోనే మీ స్వంతంగా దాల్చినచెక్కతో మందులు, ఉపశమంకారి వస్తువుల్ని తయారు చేయాలనుకుంటే, దాల్చినచెక్క చమురు, కంప్రెస్ (పైపూత వాడకానికి), టించర్స్ (మద్యం లోని పదార్ధాలు) లేదా టీ (సాధారణంగా దాల్చినచెక్క పొడితో) రూపంలో తయారు చేసుకోవచ్చు. ఇప్పటికీ, వంటగది పెట్టెలో దాల్చినచెక్కేదో తెలియదా మీకు? మీరు దాల్చినచెక్క కర్రను చూడకపోతేనేం, దాన్ని గుర్తుపట్టాలంటే క్రిస్మస్ పండుగ కాలంలో అన్నివైపులా వెదజల్లబడే సువాసనను గుర్తు పడతారు గదా, అదే సువాసనను దాల్చినచెక్క కూడా కల్గి ఉంటుంది గనుక, ఇపుడు మీరూ దాల్చినచెక్కను బాగా  గుర్తించవచ్చు. వాస్తవానికి, ఒక ప్రజసర్వేలో తెల్సిన అభిప్రాయమేమంటే దాల్చినచెక్క చాలా తరచుగా శీతాకాలాలు మరియు క్రిస్మస్ పండుగ సీజన్తో సంబంధం కలిగి ఉంటుందని పేర్కొంది. మరి ఎందుకు కాదు. ఇది క్రిస్మస్ కేకులు, కుకీలు మరియు క్రిస్మస్ చెట్టు అలంకరణలలో ఉపయోగించే ముఖ్యమైన ప్రాథమిక సంబార మసాలాల్లో ఒకటి.

రుచికరమైన దాల్చినచెక్క టీ ని కలుపుకోడానికి సులభమైన తయారీ పధ్ధతి ఇదిగో ఇక్కడ ఉంది:

 • ఒక కెటిల్ లో నీరు మరగబెట్టండి.
 • మసలుతోన్న వేడినీటి లోకి దాల్చిన చెక్క కర్ర (బెరడు)ను వేయండి, అటుపై 15-20 నిమిషాల సేపు వేడినీటిలో దాల్చినచెక్కను మరగనియ్యండి.
 • బర్నర్ స్విచ్ ఆఫ్ చేసి, ఓ 15 నిమిషాలు సేపు దాల్చిన చెక్కను వేడినీటిలో బాగా నాననివ్వండి.  
 • ఆ తర్వాత, కెటిల్ని దించుకొని పానీయాన్ని వంచుకుని దాల్చినచెక్క టీ ని సేవించండి.

ఇంచుమించుగా ఒక సిలోన్ దాల్చినచెక్క ముక్క (స్టిక్) 1-2 కప్పుల టీనిస్తుంది.

సాధారణంగా, అర్ద టీ-స్పూన్  ప్రమాణంలో దాల్చినచెక్క (పొడి/సారం)ను  ఎంత కాలమైనా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తీసుకోవచ్చు. అయితే దాల్చినచెక్క కామేరిన్ ను కలిగి ఉంటుంది. ఎక్కువ మోతాదులో దాల్చినచెక్కను తీసుకోవడం కాలేయానికి విషపూరితము కావొచ్చు. కనుక, మీ శరీర తత్వానికి దాల్చినచెక్క యొక్క ఉత్తమ మోతాదును నిర్ణయించేందుకు మీ ఆయుర్వేద వైద్యునితో సలహా తీసుకోవడం ఉత్తమం.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
 1. దాల్చినచెక్క సహజమైన తాపకారిణి అంటే వేడిని కలుగజేసెడి, అందువల్ల దాల్చినచెక్కను మోతాదును మించి సేవిస్తే కడుపులో మంటను కలిగించవచ్చు.

 2. దాల్చినచెక్కలో “కమారిన్” అనే ఒక పదార్ధం ఉంది, ఇది అధికంగా తీసుకున్నప్పుడు కాలేయానికి నష్టం కలుగవచ్చు.

 3. కొందరు వ్యక్తులకు వంశపారంపర్యంగా దాల్చినచెక్క వారి శరీరానికి పడకపోవడమనేది (allergy) లేక ప్రతికూలత ఉంటుంది. దాల్చినచెక్కలో ఉండే “సిన్నమల్డిహైడ్” అనేది ప్రతికూలతను (అలెర్జీని) కలుగజేసి నోటిలో పుండ్లను పుట్టించడానికి కారణమవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 4. దాల్చినచెక్క ఒక సహజ హైపోగ్లైసిమిక్ ఏజెంట్. అంటే ఇది రక్తంలో చెక్కెరను తగ్గిస్తుంది. కాబట్టి మీరు మధుమేహం కలిగి ఉండి, డయాబెటిస్ ఔషధాలను తీసుకుంటూ ఉన్నట్లయితే, మీ ఆహారంలో దాల్చినచెక్కను ఆహారంగా తీసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

 5. దాల్చినచెక్కకు రక్తాన్ని పలుచబరిచే గుణం ఉంది, కాబట్టి మీరు ఏదైనా  శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటున్నట్లైనా లేదా కొంతకాలం క్రితం ఆపరేషన్ చేయించుకుని ఉన్నట్లయితే మీరు దాల్చినచెక్కను  ఉపయోగించకూడదు.

 6. కల్తీలేని దాల్చినచెక్క తైలం చర్మం పైన మంటను కలుగజేస్తుందని ప్రసిద్ధి. అందువల్ల మీరు శరీరానికి దాల్చినచెక్క తైలాన్ని లేపనంగా వాడాలనుకుంటే ముందుగా “పాచ్ పరీక్ష” చేయించుకోవాల్సిందిగా మీకు సిఫారస్ చేయడమైనది.


Medicines / Products that contain Cinnamon

వనరులు

 1. Rafie Hamidpour, Mohsen Hamidpour, Soheila Hamidpour, Mina Shahlaria. Cinnamon from the selection of traditional applications to its novel effects on the inhibition of angiogenesis in cancer cells and prevention of Alzheimer's disease, and a series of functions such as antioxidant, anticholesterol, antidiabetes, antibacteri. J Tradit Complement Med. 2015 Apr; 5(2): 66–70. J Tradit Complement Med. 2015 Apr; 5(2): 66–70.
 2. Shan B, Cai YZ, Sun M, Corke H. Antioxidant capacity of 26 spice extracts and characterization of their phenolic constituents.. J Agric Food Chem. 2005 Oct 5;53(20):7749-59. PMID: 16190627
 3. Robert W. Allen et al. Cinnamon Use in Type 2 Diabetes: An Updated Systematic Review and Meta-Analysis. Ann Fam Med. 2013 Sep; 11(5): 452–459. PMID: 24019277
 4. Ferdinando Giacco and Michael Brownlee. Oxidative stress and diabetic complications. Circ Res. 2010 Oct 29; 107(9): 1058–1070. PMID: 21030723
 5. Fatmah A Matough, Siti B Budin, Zariyantey A Hamid, Nasar Alwahaibi, Jamaludin Mohamed. The Role of Oxidative Stress and Antioxidants in Diabetic Complications. Sultan Qaboos Univ Med J. 2012 Feb; 12(1): 5–18. PMID: 22375253
 6. Jarvill-Taylor KJ1, Anderson RA, Graves DJ. A hydroxychalcone derived from cinnamon functions as a mimetic for insulin in 3T3-L1 adipocytes.. J Am Coll Nutr. 2001 Aug;20(4):327-36. PMID: 11506060
 7. Solomon TP1, Blannin AK. Effects of short-term cinnamon ingestion on in vivo glucose tolerance.. Diabetes Obes Metab. 2007 Nov;9(6):895-901. PMID: 17924872
 8. Adisakwattana S, Lerdsuwankij O, Poputtachai U, Minipun A, Suparpprom C. Inhibitory activity of cinnamon bark species and their combination effect with acarbose against intestinal α-glucosidase and pancreatic α-amylase.. Plant Foods Hum Nutr. 2011 Jun;66(2):143-8. PMID: 21538147
 9. Mohamed Sham Shihabudeen H, Hansi Priscilla D, Thirumurugan K. Cinnamon extract inhibits α-glucosidase activity and dampens postprandial glucose excursion in diabetic rats. Nutr Metab (Lond). 2011 Jun 29;8(1):46. PMID: 21711570
 10. Nidhi Goel, Hina Rohilla, Gajender Singh, Parul Punia. Antifungal Activity of Cinnamon Oil and Olive Oil against Candida Spp. Isolated from Blood Stream Infections. J Clin Diagn Res. 2016 Aug; 10(8): DC09–DC11. PMID: 27656437
 11. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Inflammation: A unifying theory of disease. Harvard University, Cambridge, Massachusetts.
 12. Gunawardena D et al. Anti-inflammatory activity of cinnamon (C. zeylanicum and C. cassia) extracts - identification of E-cinnamaldehyde and o-methoxy cinnamaldehyde as the most potent bioactive compounds. Food Funct. 2015 Mar;6(3):910-9. PMID: 25629927
 13. Liao JC et al. Anti-Inflammatory Activities of Cinnamomum cassia Constituents In Vitro and In Vivo. Evid Based Complement Alternat Med. 2012;2012:429320. PMID: 22536283
 14. Seyed Fazel Nabavi et al . Antibacterial Effects of Cinnamon: From Farm to Food, Cosmetic and Pharmaceutical Industries. Nutrients. 2015 Sep; 7(9): 7729–7748. PMID: 26378575
 15. Lowenthal J, Birnbaum H. Vitamin K and coumarin anticoagulants: dependence of anticoagulant effect on inhibition of vitamin K transport.. Science. 1969 Apr 11;164(3876):181-3. PMID: 5774189
 16. O'Reilly RA1, Aggeler PM. Studies on coumarin anticoagulant drugs. Initiation of warfarin therapy without a loading dose. Circulation. 1968 Jul;38(1):169-77. PMID: 11712286
 17. O'Reilly RA1, Aggeler PM. Studies on coumarin anticoagulant drugs. Initiation of warfarin therapy without a loading dose. Circulation. 1968 Jul;38(1):169-77. PMID: 11712286
 18. Molouk Jaafarpour, Masoud Hatefi, Fatemeh Najafi, Javaher Khajavikhan, Ali Khani. The Effect of Cinnamon on Menstrual Bleeding and Systemic Symptoms With Primary Dysmenorrhea. Iran Red Crescent Med J. 2015 Apr; 17(4): e27032. PMID: 26023350
 19. Pallavi Kawatra, Rathai Rajagopalan. Cinnamon: Mystic powers of a minute ingredient. Pharmacognosy Res. 2015 Jun; 7(Suppl 1): S1–S6. PMID: 26109781
Read on app