myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

జీలకర్ర అనేది ఒక సాధారణ భారతీయ మసాలాదినుసు , ఇది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించబడుతుంది. తాజా జీరా రైస్ ను ఒక మంచి కూరతో పాటుగా తినడానికి ఎవరు ఇష్టపడరు?

కానీ, జీలకర్ర మీ ఆహారంలో రుచిని జోడించడం మాత్రమే కాక ఇంకా అనేక ప్రయోజనాలు అందిస్తుందని మీకు తెలుసా? ఒక ఔషధ మూలికగా దీని ఉపయోగం ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో చాలా సాధారణం. అయితే, జీలకర్ర యొక్క ఔషధ ప్రయోజనాలను పొందటానికి మీరు దానిని ఒక నిర్దిష్ట రూపంలో మరియు మోతాదులో తీసుకోవాలి. జీలకర్రను తీసుకోవడానికి మీ రోజువారీ దినచర్యలో ఒక గ్లాసు జీలకర్ర నీరును చేర్చడం అనేది ఒక ఉత్తమ మార్గం. ఆ ప్రయోజనాలు అసలు ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ వ్యాసం వాటికి సమాధానం ఇస్తుంది. జీలకర్ర నీటి యొక్క అనేక ప్రయోజనాలు శాస్త్రీయ (సైంటిఫిక్)  సాక్ష్యాలు ఆధారంగా వివరించబడ్డాయి. జీలకర్ర నీటి యొక్క రెసిపీ మరియు దాని అధిక వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా చర్చించబడ్డాయి. ముందుగా, జీలకర్ర యొక్క కొన్ని ప్రాథమిక వాస్తవాల గురించి తెలుసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం.

జీలకర్ర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

జీలకర్ర చరిత్రలోనే తొలిసారిగా పండించిన మూలిక. జీలకర్ర యొక్క సుగంధభరితమైన రుచి వలన దాని ఔషధ లక్షణాలను అధ్యయనాలు చేసేందుకు పరిశోధకులను మరియు శాస్త్రవేత్తలను ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది. జీలకర్ర అనేది పండ్లతో కూడిన పుష్పించే మొక్క మరియు ఆ పండ్లు ఎండిన తర్వాత జీలకర్ర విత్తనాలు వస్తాయి.

 • శాస్త్రీయ నామం: క్యుమినం సిమినం (Cuminum cyminum)
 • కుటుంబం: ఎపియేసి (Apiaceae)
 • సాధారణ పేర్లు: జీలకర్ర, జీరా
 • సంస్కృత నామం: జిరాకా
 • ఉపయోగించే భాగాలు: విత్తనాలు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: జీలకర్ర తూర్పు మధ్య ప్రాంతం మరియు భారతదేశానికి చెందినది, అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
 1. జీలకర్ర యొక్క పోషక వాస్తవాలు - Nutritional facts of cumin in Telugu
 2. జీలకర్ర నీటి ప్రయోజనాలు - Cumin water benefits in Telugu
 3. జీలకర్ర నీరు ఎలా తయారు చేయాలి - How to make jeera water in Telugu
 4. జీలకర్ర నీటి దుష్ప్రభావాలు - Jeera water side effects in Telugu

జీలకర్ర అనేక ఖనిజాలు మరియు పోషకాల యొక్క ఉత్తమ వనరు, అవన్నీ జీలకర్రను ఒక అద్భుతమైన మూలికగా చేస్తాయి. ఇది విటమిన్ సి యొక్క మూలం కూడా. దాని పోషక విలువలను పరిశీలిద్దాం. ఈ పోషక విలువలు అన్ని ఒక టీస్పూన్ జీలకర్రవి, ఈ టీస్పూన్ జీలకర్రను ఉపయోగించి జీలకర్ర నీటిని తయారు చేస్తారు అని గమనించండి.

యుఎస్‌డిఎ (USDA) ప్రకారం, 1 స్పూన్ జీలకర్ర ఈ కింది పోషకాలు ఉంటాయి:

జీలకర్ర ఖచ్చితంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అది సజల (అక్వస్) స్థితిలో, అంటే నీటితో కలిపినప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీలకర్ర విత్తనాలను ఒక రాత్రంతా నీటిలో నానబెడితే, జీలకర్ర దాని పోషకాలను విడుదల చేస్తుంది, అవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. నీటితో కలిసి ఉన్నపుడు, జీలకర్రలో విభిన్న ఫ్లేవనాయిడ్లు, ఐసోఫ్లేవనాయిడ్లు, లిగ్నిన్లు, ఆల్కలాయిడ్లు, గ్లూకోసైడ్లు మరియు ఇతర సమ్మేళనాలు ఉంటాయి. దాని ప్రయోజనాలను చూద్దాం.

 • నోటి ఆరోగ్యం కోసం: సాధారణ నోటి సమస్య దంత క్షయం దీనిని జీలకర్ర నీటి సహాయంతో నిర్వహించవచ్చు. స్ట్రెప్టోకోకస్ ముటాన్స్ మరియు స్ట్రెప్టోకోకస్ పైజెన్స్ వంటి బాక్టీరియా పంటి మీద బయోఫిలిం ఏర్పడడానికి కారణమవుతుంది అది దంత క్షయానికి దారితీస్తుంది. జీలకర్ర సీమసోంపు నీళ్లు ఈ బయోఫిలిం ఏర్పడడాన్ని నివారిస్తాయని అధ్యయనాలు సూచించాయి. 
 • రోగనిరోధకశక్తికి: జీలకర్ర నీటిలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి.అలాగే జీలకర్ర నీరు నిమోనియా మరియు కొన్ని రకాల రక్తంలో సంభవించే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. పరిశోధనల ద్వారా జీలకర్ర నీరు దాని యొక్క ఇన్ఫెక్షన్లు మరియు అలెర్జీలను నివారించే చర్యల ద్వారా రోగనిరోధకశక్తిని మెరుగుపరిచే చర్యను కలిగి ఉంటుందని తెలిసింది.
 • గుండె కోసం:  ఒక పరిశోధన ఆధారం జీలకర్ర నీటికి రక్త కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు ఉన్నట్లు తెలిసింది.అలాగే ఇది చేడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే జీరా నీటికి కల యాంటీఆక్సిడెంట్ చర్యల గుండె రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
 • జీర్ణక్రియకు: జీలకర్ర నీళ్లు మలబద్దకం మరియు ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను తగ్గిస్తాయి. కొంతమంది ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వ్యాధి రోగులపై నిర్వహించిన అధ్యయనంలో జీలకర్ర నీళ్లు ఈ సమస్యతో ముడిపడి ఉండే అతిసారం, ఉబ్బరం, వికారం వంటి లక్షణాలను ప్రభావవంతంగా తగ్గించినట్లు తెలిసింది.
 • చర్మం కోసం: జీలకర్రను నీటితో కలిపినప్పుడు అది కొన్ని రకాల ఫ్లేవినోయిడ్లు మరియు ఆల్కలాయిడ్లను నీటిలోకి విడుదల చేస్తుంది వీటికి సమర్ధవంతమైన యాంటీయాక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్స్ చర్మానికి కలిగించే నష్టాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి అలాగే అకాల వృద్దాప్య లక్షణాలను కూడా నివారిస్తాయి.
 • బరువు తగ్గుదలకు: అనేక పరిశోధనలలో జీలకర్ర నీళ్లు బరువును తగ్గించడంలో చాలా సహాయకరంగా ఉన్నట్లు తేలింది. ఇవి ఏ వయసులో వారి మీదైనా ప్రభావం చూపుతాయని అధ్యయనాలు తెలిపాయి. బరువు తగ్గించడమే కాక శరీర చుట్టుకొలత మరియు బిఎంఐ ను కూడా జీలకర్ర నీళ్లు తగ్గించినట్లు తెలిసింది.
 • మధుమేహం కోసం: జీలకర్ర నీళ్లు హైపోగ్లేసిమిక్ చర్యలను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం ఉన్నవారిలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఇంట్లోనే జీలకర్ర నీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు:

 • రెండు టీస్పూన్ల జీలకర్రను తీసుకొని ఒక కప్పు నీటిలో కలపండి
 • ఒక రాత్రంతా వాటిని నానబెట్టండి
 • ఉదయం ఒక 10 నిమిషాలు ఆ నీటిని మరిగించి, చల్లారిన తర్వాత త్రాగాలి
 • వెచ్చని జీలకర్ర నీటిని కూడా త్రాగవచ్చు.

ఉత్తమ బరువు తగ్గించే ప్రయోజనాల కోసం, మీరు ఈ క్రింది పద్ధతిలో జీలకర్ర-నిమ్మ పానీయం తయారు చేయవచ్చు:

 • రెండు టీస్పూన్ల జీలకర్రను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి
 • మరుసటి రోజు ఉదయం, ఒక చెక్క నిమ్మకాయ రసం దానికి కలపండి
 • బాగా కలిపి, ఒకసారి వడకట్టి జీలకర్ర-నిమ్మ నీటిని ఆస్వాదించండి.

బరువు తగ్గడానికి జీలకర్ర మరియు పెరుగు యొక్క రెసిపీ ఇక్కడ ఇవ్వబడింది:

 • అర కప్పు పెరుగు తీసుకోండి
 • దీనికి రెండు టీస్పూన్ల జీలకర్ర పొడిని కలపండి
 • మంచి రుచి కోసం కొద్దిగా నిమ్మ రసం మరియు ఉప్పు దానికి జోడించండి.

ప్రత్యామ్నాయంగా, మీరు ఈ క్రింది విధంగా జీరా లస్సీని తయారు చేయవచ్చు:

 • 1 కప్పు పెరుగు, 1 కప్పు నీరు, కొన్ని ఐస్ క్యూబ్లు మరియు ఒక టీస్పూన్ జీలకర్ర పొడి తీసుకోండి
 • వీటిని బ్లెండర్‌లో సుమారు రెండు నిమిషాలు ప్రాసెస్ చేయండి  (బాగా గిలకొట్టండి) 
 • అదనపు ప్రయోజనాలు మరియు రుచి కోసం జీలకర్ర పొడి పైన చల్లుకుని ఒక పెద్ద గ్లాసుల్లో ఆ మిశ్రమాన్ని వేసుకుని త్రాగండి.

సాధారణంగా సురక్షితమైనప్పటికీ, జీలకర్ర నీరుని అధికంగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. అవి:

 • అధిక మూత్రవిసర్జన
 • హైపోగ్లైసిమియా- జీలకర్ర నీరు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది కానీ, అతి వినియోగం వల్ల హైపోగ్లైసిమియాకు దారితీస్తుంది, ఇది వైద్య అత్యవసర పరిస్థితి.
 • అధిక రక్తస్రావం- జీలకర్ర నీరు యాంటీ కోయాగ్యులెంట్ మరియు యాంటీ ప్లేట్‌లెట్ కాబట్టి, ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధించవచ్చు, అది దీర్ఘకాలిక రక్తస్రావానికి దారితీస్తుంది. ఈ కారణాల వల్ల, రక్తస్రావ లోపాలతో (bleeding disorders) బాధపడుతున్న వ్యక్తులకు ఇది సిఫార్సు చేయబడదు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా జీలకర్ర నీటిని నివారించాలి.
 • గర్భస్రావం- జీలకర్రను భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలకు సహజంగా గర్భస్రావం చేసే ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. పరిశోధనా ఆధారాలు దీనికి మద్దతు ఇవ్వనప్పటికీ, గర్భిణీ స్త్రీలు దాని వినియోగాన్ని నివారించడం ఉత్తమం.
 • అలెర్జీ ప్రతిచర్యలు
और पढ़ें ...

References

 1. R. K. Johri et al. Cuminum cyminum and Carum carvi: An update . Pharmacogn Rev. 2011 Jan-Jun; 5(9): 63–72. PMID: 22096320
 2. United States Department of Agriculture Agricultural Research Service. Full Report (All Nutrients): 02014, Spices, cumin seed. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 3. Mohsen Taghizadeh et al. The Effect of Cumin cyminum L. Plus Lime Administration on Weight Loss and Metabolic Status in Overweight Subjects: A Randomized Double-Blind Placebo-Controlled Clinical Trial . Iran Red Crescent Med J. 2016 Aug; 18(8): e34212. PMID: 27781121
 4. Sowbhagya HB. Chemistry, technology, and nutraceutical functions of cumin (Cuminum cyminum L): an overview. Crit Rev Food Sci Nutr. 2013;53(1):1-10. PMID: 23035918
 5. Shahram Agah, Amir Mehdi Taleb, Reyhane Moeini, Narjes Gorji, Hajar Nikbakht. Cumin Extract for Symptom Control in Patients with Irritable Bowel Syndrome: A Case Series . Middle East J Dig Dis. 2013 Oct; 5(4): 217–222. PMID: 24829694
 6. Shahram Agah, Amir Mehdi Taleb, Reyhane Moeini, Narjes Gorji, Hajar Nikbakht. Cumin Extract for Symptom Control in Patients with Irritable Bowel Syndrome: A Case Series . Middle East J Dig Dis. 2013 Oct; 5(4): 217–222. PMID: 24829694
 7. Ghatreh Samani Keihan, Mohammad Hossein Gharib, Ali Momeni, Zohreh Hemati, Roya Sedighin. A Comparison Between the Effect of Cuminum Cyminum and Vitamin E on the Level of Leptin, Paraoxonase 1, HbA1c and Oxidized LDL in Diabetic Patients . Int J Mol Cell Med. 2016 Autumn; 5(4): 229–235. PMID: 28357199
 8. Zare R, Heshmati F, Fallahzadeh H, Nadjarzadeh A. Effect of cumin powder on body composition and lipid profile in overweight and obese women. . Complement Ther Clin Pract. 2014 Nov;20(4):297-301. PMID: 25456022
 9. Jørn A. Aas et al. Defining the Normal Bacterial Flora of the Oral Cavity . J Clin Microbiol. 2005 Nov; 43(11): 5721–5732. PMID: 16272510
 10. Yumi Inagaki et al. A Case of Systemic Infection Caused by Streptococcus pyogenes Oral Infection in an Edentulous Patient . Diseases. 2017 Sep; 5(3): 17. PMID: 28933370