మీ ఆహారంలో మీరు జోడించుకునే ఆరోగ్యకరమైన కూరగాయల్లో సొరకాయ ఒకటి.  లాకీ, గియ లేదా దుధీ అని కూడా దీనిని పిలుస్తారు, ఈ లేత ఆకుపచ్చ కూరగాయను భారతీయ వంటకాలలో ప్రధానమైనదిగా అనేక సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు.

ఇది ఒక అద్భుతమైన హైపోగ్లైసెమిక్ (రక్తం‌లో చక్కెరను తగ్గిస్తుంది) మరియు అనేక యాంటిఆక్సిడంట్ల శ్రేణిని నిర్వహిస్తుంది, అది మీ శరీర పనితీరును నిర్వహించడం‌లో మరియు వ్యాధులను తొలగించడం‌లో సహాయం చేస్తుంది.  అయితే ఒకవేళ మీరు లాకీ కీ సబ్జీ‌ యొక్క అభిమాని కాకపోతే, ఇప్పుడైనా మీరు మీ జీవితానికి ఒక జ్యూస్ రూపం‌లో దానిని జోడించవచ్చు.  సొరకాయ రసం, అన్ని కూరగాయల యొక్క అన్ని ప్రయోజనాలను ఒకే ఒక గ్లాసులో అందిస్తుంది.

సొరకాయ రసం తీసుకోవాల్సిన ఉత్తమమైన సమయం ఉదయం.  ఈ రసం చాలా వేగంగా ఆక్సీకరణం చెందుతుంది కాబట్టి, ఈ రసాన్ని తయారుచేసిన వెంటనే దాదాపుగా త్రాగడం చాలా ముఖ్యం.  

సొరకాయ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • వృక్ష శాస్త్రీయ నామం: లాగేనారియా శిశేరారియా
  • కుటుంబం: గౌర్డ్ కుటుంబం
  • సంస్కృత నామం:  (క్షిరతుంబీ) లేదా (అలాబు)
  • వ్యవహారిక నామం: లాకీ లేదా కద్దు. తెల్లటి-పువ్వులు గల కాయ లేదా కలాబాష్ కాయ, సొరకాయ, పొడవాటి పుచ్చకాయ, న్యూ గినియా బీన్, మరియు టాస్మానియా బీన్.
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: సొరకాయ దక్షిణ ఆఫ్రికాలో పుట్టిందని తెలియజేయబడింది.  ఇది ప్రపంచం‌లోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది.
  1. సొరకాయ రసం పోషక విలువలు - Bottle gourd juice nutrition facts in Telugu
  2. సొరకాయ రసం ఆరోగ్య ప్రయోజనాలు - Bottle gourd juice health benefits in Telugu
  3. సొరకాయ రసం దుష్ప్రభావాలు - Bottle gourd juice side effects in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

సొరకాయ 96% నీటిని కలిగిఉంటుంది మరియు విటమిన్ సి, కె, మరియు కాల్షియంలకుఒక గొప్ప వనరుగా ఉంది.  ఇది నీటి భాగాన్ని చాలా అధికంగా కలిగిఉంది కాబట్టి, రసం వెలికి తీసేందుకు ఇది ఖచ్చితమైనది.  ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మరియు చాలా చవకైన ధరలో లభిస్తుంది.  ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.  ఈ కారణాల వలన, ఈ యాంటీఆక్సిడంట్ పానీయం ఆరోగ్య-స్పృహ ఉన్నవారిలో చాలా ప్రజాదరణ పొందింది.

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. సొరకాయ రసం క్రింద ఇవ్వబడిన పోషకాలను కలిగిఉంటుంది:

పోషకము విలువ, 100 గ్రా.లకు
నీరు     95.4 గ్రా.
శక్తి     14 కి.కేలరీలు
ప్రొటీన్     0.62 గ్రా.
కార్బోహైడ్రేట్     3.39 గ్రా.
ఫైబర్     0.5 గ్రా.
కొవ్వు      0.02 గ్రా.
ఖనిజాలు  
కాల్షియం     26 మి.గ్రా.
ఇనుము    0.2 మి.గ్రా.
మెగ్నీషియం     11 మి.గ్రా.
ఫాస్ఫరస్     13 మి.గ్రా.
పొటాషియం    150 మి.గ్రా.
సోడియం     2 మి.గ్రా.
జింక్    0.7 మి.గ్రా.
విటమిన్లు  
విటమిన్ బి1 0.029 మి.గ్రా.
విటమిన్ బి2 0.022 మి.గ్రా.
విటమిన్ బి3 0.32 మి.గ్రా.
విటమిన్ బి6 0.04 మి.గ్రా.
విటమిన్ బి9 6 µగ్రా.
విటమిన్ సి 10.1 మి.గ్రా.
కొవ్వులు/కొవ్వు ఆమ్లాలు  
సంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.002 గ్రా.
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.001 గ్రా.
బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.009 గ్రా.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

సొరకాయ రసం ఆరోగ్య నిర్మాణం మరియు వైద్య లక్షణాలతో నింపబడి ఉంటుంది, ఈ లక్షణాలు మీ ఆహారం‌లో ఒక పరిపూర్ణమైన పదార్థంగా సొరకాయను చేర్చుకునేలా చేసింది.  సొరకాయ రసం యొక్క శాస్త్రీయంగా రుజువు చేయబడిన కొన్ని ప్రయోజనాలను మనం పరిశీలించి చూద్దాము.

  • శరీరాన్ని చల్లబరుస్తుంది: సొరకాయ రసం శరీరంపైన శీతలీకరణ ప్రభావాన్ని కలిగిఉంటుందని తెలియజేయబడింది.  వెచ్చని వేసవి నెలలలో డీహైడ్రేషన్ నిరోధించడానికి ఇది పానీయం ఒక అద్భుతమైన ఎంపికగా ఉంది.
  • బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది: మీ బరువు తగ్గించే ఆహారానికి, సొరకాయ రసం ఒక తక్కువ-కేలరీ, తక్కువ-కొవ్వు కలిగిన ఆహారంగా చేర్చబడింది.  ఇది మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది మరియు మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, మొత్తం కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఊబకాయాన్ని నివారిస్తుంది.
  • కడుపుకు ప్రయోజనాలు అందిస్తుంది: సొరకాయ రసం మీ కడుపుకు ఉపశమనం కలుగజేస్తుంది మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.  ఇది జీర్ణక్రియను అభివృద్ది చేయడానికి బాగా ప్రసిద్ధి చెందింది.
  • యాంటీ-డయాబెటిక్: సొరకాయ గుజ్జు, డయాబెటిక్ ప్రజలలో క్లోమం పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధన ఆధారాలు సూచిస్తున్నాయి, ఇది క్రమంగా, రక్తంలో చక్కెర స్థాయిల ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది.  డయాబెటిస్ గలవారి విషయంలో హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
  • వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది: సొరకాయ రసం, విటమిన్ సి వంటి యాంటిఆక్సిడంట్లను కలిగిన ఒక నిధిగా ఉంది. యాంటిఆక్సిడంట్లు సహజ సమ్మేళనాలు, అవి చర్మ వృద్ధాప్య లక్షణాలను నెమ్మదిగా తగ్గిస్తాయి మరియు విటమిన్ సి చర్మ కొల్లాజెన్‌ను పెంచుతుంది మరియు మీ చర్మాన్ని వ్రేలాడకుండా లేతగా మరియు యవ్వనంగా ఉంచుతుంది.
  • మూత్ర మార్గ అంటువ్యాధులను నిరోధిస్తుంది: సొరకార రసం శరీరంలో ఒక మూత్ర విసర్జక చర్యను కలిగిఉంటుంది.  ఇది శరీరం నుండి విష పదార్థాలు మరియు రోగకారకాలను బయటకు పంపించడం‌లో సహాయం చేస్తుంది, తద్వారా మూత్రనాళ అంటువ్యాధుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  సొరకార రసం త్రాగడం, యుటిఐ లక్షణాల మెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

సొరకాయ రసం శరీరాన్ని చల్లబరుస్తుంది - Bottle gourd juice cools the body in Telugu

సొరకాయ చాలా ఎక్కువ నీటిని కలిగిఉంటుంది అందువల్ల ఇది వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.  అలాగే, సొరకాయ రసం మీ శరీరం‌ పైన శీతలీకరణ ప్రభావం కలిగి ఉంటుంది.  అది మీ కడుపును చల్లబరుస్తుంది మరియు శరీరం నుండి వచ్చే వేడిని తగ్గిస్తుంది.

ఇది నీటిని భర్తీ చేయలేనప్పుడు, వేడిగా ఉండే వేసవికాలం మధ్యాహ్న సమయం‌లో ఇది ఖచ్చితంగా ఉపశమనం అందిస్తుంది.  మీ కోసం ఒక గ్లాసు సొరకాయ రసం కలుపుకొనండి మరియు ఒక వీరుడు వలె వేడిమితో పోరాడండి.

చర్మం కోసం సొరకాయ రసం - Bottle gourd juice for skin in Telugu

సొరకాయ రసం‌లో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది, ఇది చర్మం యొక్క పొడితనం మరియు ముడుతలు తగ్గించడానికి సహాయపడుతుంది.  విటమిన్ సి యాంటిఆక్సిడంట్ లక్షణాలను కలిగిఉంటుంది, ఒత్తిడి, కాలుష్యం మరియు ఆహార లేమికి సంబంధించిన ఆక్సీకరణ నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. స్వేచ్ఛా రాడికల్స్ వృద్దాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయిచేస్తాయి మరియు విటమిన్ సి అధికంగా కలిగిన ఆహారం తీసుకోవడం ఈ ప్రక్రియ వేగాన్ని తగ్గించడం‌లో సహాయం చేస్తుంది.

ఇంకా, కొల్లాజెన్ యొక్క సంశ్లేషణలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది, ఈ కొల్లాజెన్ మీ చర్మం యొక్క నిర్మాణాత్మక సమగ్రతను కాపాడటం‌లో బాధ్యత కలిగిన ప్రొటీన్.  సొరకాయ రసం తీసుకోవడం, మీ రోజువారీ సిఫార్సు చేసిన విటమిన్ ‌సి మోతాదును వేగంగా చేరుకోవడం‌లో మీకు సహాయంచేస్తుంది, చర్మం వదులుకావడం మరియు ముడుతలు పడడం వంటి ప్రమాదాల నుండి ఇది మీకు ఉపశమనం కలుగచేస్తుంది.  

మీరు కూడా కొంత సృజనాత్మకతను ప్రదర్శించాలి మరియు ముఖమంతా విటమిన్‌ సి యొక్క సమయోచిత సరఫరా ఇవ్వడానికి  కొంత సొరకార రసాన్ని మీ ముఖం మీద ఉంచాలి.

బరువు తగ్గడం కోసం సొరకాయ రసం - Bottle gourd juice for weight loss in Telugu

సొరకాయ రసం దాని యొక్క బరువు తగ్గించే ప్రయోజనాల వల్ల అధికంగా ప్రోత్సహించబడుతుంది మరియు నిజంగా వేగంగా ఆ అదనపు బరువు ఇంచులను తగ్గించడం‌లో సహాయపడుతుంది.  దురదృష్టవశాత్తూ, ఈ వాదనకు ఆధారమైన ఎటువంటి శాస్త్రీయ పరిశోధన లేదు.  ఇంకా, ఊబకాయం నివారణ లో సహాయపడడం లేదా మీ బరువు తగ్గించే వ్యవస్థలో అదనంగా జతచేయడం వంటి కొన్ని లక్షణాలను సొరకాయ కలిగిఉంది.

మొదటగా, ఇది తక్కువ కొవ్వు మరియు చాలా ఎక్కువ నీటిని కలిగిఉంటుంది.  కాబట్టి, తక్కువ-కొవ్వు ఉండే మీ ఆహారాన్ని ఇది దెబ్బతీయదు లేదా మీరు కొవ్వు పదార్థాలను తగ్గించాలని చూస్తున్నప్పుడు ఇది ఎక్కువ కొవ్వును జోడించదు.

రెండవదిగా, ఇది విటమిన్ సి యొక్క ఒక గొప్ప వనరుగా ఉంది, ఇది శరీరం‌లో మొత్తం కొవ్వు పదార్థాన్ని తగ్గించడం‌లో సహాయ పడుతుంది మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.  

స్వేచ్ఛా రాడికల్ చేరిక మరియు ఆక్సీకరణ ఒత్తిడి, అధిక బరువు యొక్క దుష్ప్రభావాలలో ఒకటిగా ఉండటం‌తో పాటుగా ఊబకాయం ఏర్పడటానికి కారణమైన అంశంగా ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.  ఈ రసం‌లో ఉండే యాంటిఆక్సిడంట్లు, ఈ  స్వేచ్ఛా రాడికల్స్‌ను శుభ్రపరుస్తాయి, తద్వారా ఊబకాయం మరియు దాని ప్రతికూల ప్రభావాలను నివారిస్తాయి.  

చివరగా, ఇది రక్తం నుండి విష పదార్థాలను తొలగించడం‌లో కూడా సహాయపడుతుంది, అది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

(మరింత చదవండి: బరువు తగ్గే ఆహార పట్టిక)

వ్యాధి నిరోధక వ్యవస్థ కోసం సొరకాయ రసం - Bottle gourd juice for immune system in Telugu

సొరకాయ శరీరం పైన వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రభావాన్ని కలిగి ఉంటుందని కనుగొనబడింది.  ఇది డబ్ల్యు‌బిసి యొక్క సంఖ్యను మరియు ఇతర రోగనిరోధక వ్యవస్థ కణాల సంఖ్యను పెంచుతుంది, మన శరీరం కోసం ఒక బలమైన కాపలాదారుడిని తయారుచేస్తుంది.  మొత్తం సొరకాయల నుండి తయారుచేయబడిన  సొరకాయ రసం ఖచ్చితంగా ఈ లక్షణాలను వారసత్వంగా పొందిఉంటుంది.  ఇది విటమిన్ సి ఉనికి కారణంగా కావచ్చు, ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది మరియు రోగ నిరోధక సూక్ష్మజీవులు మన శరీరం‌లోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

ఇది ఒక యాంటిఆక్సిడం‌ట్‌గా కూడా పనిచేస్తుంది మరియు తెల్ల రక్త కణాల నష్టాన్ని నిరోధిస్తుంది.  సొరకాయ రసం‌లో ఉన్న ఇతర యాంటిఆక్సిడంట్ల‌తో పాటు, ఒత్తిడి మరియు స్వేచ్చా రాడికల్స యొక్క హానికరమైన ప్రభావాలను నిరోధించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

(మరింత చదవండి: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు)

జీర్ణశయాంతర వ్యవస్థ కోసం సొరకాయ రసం - Bottle gourd juice for gastrointestinal system in Telugu

సంప్రదాయకంగా, జీర్ణక్రియను ప్రోత్సహించడం మరియు మలబద్ధకం ఉపశమనం కోసం సొరకాయ రసం చాలా మంచిదిగా భావించబడుతుంది.  ఈ రసం కొంత మొత్తం‌లో ఫైబర్ మరియు ఎక్కువ నీటిని కలిగిఉండడం దీనికి వాస్తవ కారణం కావచ్చు.  ఫైబర్ మీ ఆహారం‌లో ఎక్కువగా సమకూర్చబడినప్పటికీ, నీటి శాతం మన జీర్ణాశయాన్ని శుభ్రం చేయడం‌లో సహాయపడుతుంది.  కలిసి, ఇవి సులభంగా  ప్రేగు కదలికల్ని సులభతరం చేస్తాయి.   

తర్వాత, ఫైల్స్‌ ఏర్పడటానికి కారణమైన ఒక కారకంగా మలబద్ధకం భావించబడుతోంది.  సాధారణ ప్రేగు కదలికలకు భరోసా ఇవ్వడం ద్వారా, సొరకాయ రసం మీ ప్రేగు పైన అదనపు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది, తద్వారా మొలల వ్యాధిప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

డయాబెటిస్ కోసం సొరకాయ రసం - Bottle gourd juice for diabetes in Telugu

సొరకాయ రసం క్రమంగా తీసుకోవడం డయాబెటిక్ రోగులకు మరియు ఈ వ్యాధి యొక్క ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  సొరకాయ గుజ్జు రక్తంలో చక్కెర స్థాయిల ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది మరియు సాధారణంగా డయాబెటిక్ వ్యాధి గల వారిలో బలహీనపరచబడిన  క్లోమ గ్రంధి విధిని మెరుగుపరచడం‌లో సహాయపడుతుందని ప్రీక్లినికల్ అధ్యయనాలు నివేదికను ఇస్తున్నాయి.

ఇది మాత్రమే కాకుండా, సొరకాయ రసం హృదయ సంబంధ నష్టాన్ని తగ్గించడం‌లో మరియు డయాబెటిక్ వ్యక్తుల్లో గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు.  సొరకాయ రసం జింక్‌ను కలిగిఉండడమే దీనికి కారణం, ఇది రక్తపోటును నిర్వహించడం‌లో మరియు రక్తం‌లో కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహించడం‌లో చురుకుగా పనిచేస్తుంది.

(మరింత చదవండి: డయాబెటిస్ మేనేజ్‌మెంట్)

సొరకాయ రసం మంటను తగ్గిస్తుంది - Bottle gourd juice reduces inflammation in Telugu

ఇన్‌ఫెక్షన్ మరియు గాయానికి వ్యతిరేకంగా మంట అన్నది మన శరీరం యొక్క సాధారణ ప్రతిస్పందన.  అయితే, క్రమమైన లేదా దీర్ఘ-కాల మంట ఒక అంతర్గత వ్యాధిని సూచిస్తుంది.  సాధారణంగా మంట కలిగించే కొన్ని వ్యాధులుగా  ఆర్థరైటిస్, కీళ్లవాతం, మరియు తాపజనక ప్రేగు వ్యాధి వంటివి ఉన్నాయి. ఇవి వాపు, ఎరుపుదనం మరియు నొప్పి వంటి లక్షణాల చేట వర్గీకరించబడ్డాయి మరియు ప్రధాన అసౌకర్యానికి ఒక కారణం కావచ్చు,  శుభవార్త ఏమిటం‌టే, ఒక గ్లాసు సొరకాయ రసం తీసుకోవడం, నొప్పి మరియు మంట రెండింటి నుండి ఉపశమనం పొందడం‌లో సహాయపడుతుంది.  సొరకాయ రసం తీసుకోవడం, ఎటువంటి దుష్ప్రభావాలను చూపించకుండా, మంట మరియు నొప్పిని గణనీయంగా తగ్గిస్తాయని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి.  అయితే ఖచ్చితమైన చర్యా విధానం ఈ అధ్యయనం‌లో నిర్వచించబడలేదు.

ఈ రసం‌లో ఉండే విటమిన్ సి వంటి యాంటిఆక్సిడంట్ల ఉనికి యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణానికి బాధ్యత వహించే ఒక కారకం కావచ్చు.  ఇది ఒక యాంటిఆక్సిడంట్ సమ్మేళనం కలిగిఉంటుంది, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మంట తగ్గింపుకు కారణమవుతుంది. 

(మరింత చదవండి: ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల రకాలు)

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల కోసం సొరకాయ రసం - Bottle gourd juice for urinary tract infections in Telugu

క్రమం తప్పకుండా సొరకాయ రసం త్రాగడం,  మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లువచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇది వాటి చికిత్సలో కూడా సహాయపడుతుంది.  సొరకాయ ఒక మూత్రవిసర్జకం, అనగా మన వ్యవస్థలో మూత్రవిసర్జన తరచుగా రావడాన్ని పెంచుతుందని అర్థం.  తత్ఫలితంగా, అదనపు నీరు మరియు విషాలు శరీరం‌ నుండి బయటకు కొట్టుకుపోతాయి.  ఇది కాకుండా, శరీరం‌లో ఉండే విటమిన్ సి వంటి యాంటిఆక్సిడంట్లు మన మూత్రపిండాలకు సంభవించే ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడం‌లో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి సొరకాయ - Bottle gourd for heart health in Telugu

మన గుండెను ఆరోగ్యంగా ఉంచడం‌లో సొరకాయ రసం సహాయపడుతుంది.  ఈ రసం‌లో ఉండే జింక్ పరిమాణం, ఎల్‌డి‌ఎల్‌ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుందని, అలాగే హె‌చ్‌డి‌ఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతుందని కనుగొనబడింది.  దాని యాంటిఆక్సిడంట్ లక్షణాలతో పాటు, ఫలకం ద్వారా ధమనులు మూసుకుపోకుండా నిరోధించడం‌లో సహాయపడుతుంది.  అందువల్ల, హృదయ వ్యాధి ప్రమాదం తగ్గించబడుతుంది.  ఇంకా, రక్త పీడన స్థాయిలను ఉత్తమంగా నిర్వహించడం‌లో జింక్ కూడా సహాయపడుతుంది, గుండె మీద తక్కువ ఒత్తిడికి దారితీస్తుంది.  

ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం మరియు స్వేచ్చా రాడికల్ నష్టాన్ని తగ్గించడం ద్వారా యాంటిఆక్సిడంట్లు కూడా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

(మరింత చదవండి: గుండె వ్యాధి నివారణ)

సొరకాయ రసం యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of bottle gourd juice in Telugu

పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, సొరకార రసం కొన్ని ఇతర వైద్య ప్రయోజనాలను కూడా కలిగిఉంది.  మీ శరీరం మరియు ఆరోగ్యానికి సహాయ పడడం‌లో సొరకాయ యొక్క అదనపు మార్గాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.

  • సొరకాయ రసం విషానికి విరుగుడుగా పనిచేస్తుంది, తేలు కాటు నుండి ఇది ఉపశమన ఫలితాన్ని ఇస్తుంది.
  • ఇది ఆస్థమాదగ్గు, మరియు  బ్రాంకైటిస్వంటి వ్యాధులతో బాధపడే ప్రజలకు ఒక టానిక్ వంటిది.
  • సొరకాయ యొక్క ఆకుల నుండి సేకరించిన రసం కామెర్లచికిత్సలో సహాయపడుతుంది.
  • ఇది మనం తేమను కలిగి ఉండేలా చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్ మొదలైనటువంటి ఖనిజాలు సొరకాయ రసంలో ఉండడం వల్ల, ఎముకలను బలంగా ఉంచడం‌లో ఇది సహాయపడుతుంది.
  • మనం పార్శ్వపు తలనొప్పిపొందకుండా ఇది రక్షిస్తుంది.
  • ఇది పంటినొప్పికి ఒక సమర్థవంతమైన పరిష్కారంగా ఉంది.
  • పురుగుల నుండి వచ్చే అంటురోగాలను నిరోధించడానికి ఇది సహాయపడుతుంది.
  • జుట్టు అకాలంగా నెరయడాన్ని ఇది నిరోధిస్తుంది.
  1. సొరకాయ రసం చేదుగా ఉన్నప్పుడు విషపూరితమైనదిగా ఉంటుంది
    ఒక ఆరోగ్యకరమైన శరీరానికి సొరకాయ రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే సొరకాయ రసం చేదుగా ఉంటే, దానిని తీసుకోవడం మీ శరీరానికి అత్యంత విషపూరితం కావచ్చు మరియు మరణం కూడా సంభవించవచ్చు అని పరిశోధన నిరూపించింది.  ఇది అతిసారంవికారం, వాంతులు, అసౌకర్యం, లేదా అశాంతి యొక్క భావన వంటి వివిధ దుష్ప్రభావాలకు కూడా కారణం కావచ్చు. కాబట్టి, రసం త్రాగడానికి ముందుగా రుచిని తనిఖీ చేయడం అత్యంత అవసరం.  మీరు ఒకవేళ పైన చెప్పిన దుష్ప్రభావాలు ఏవైనా గమనించినట్లయితే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
     
  2.  జీర్ణశయాంతర సమస్యలు
    సొరకాయ రసం తీసుకోవడం అన్నది ఆంత్రమూలపు సమస్య (ఆంత్రమూలం‌లో మంట), గ్యాస్ట్రిక్ కోతలు (కడుపు శ్లేష్మం దెబ్బతినడం), గ్యాస్ట్రిక్ పుండ్లు, మరియు ఎసోఫాగిటిస్ (అన్న వాహికలో మంట) వంటి వివిధ సమస్యలకు దారితీయవచ్చు. చేదుగా ఉండే సొరకాయ రసం తీసుకున్నప్పుడు, అది ఎగువ జీర్ణశయాంతర ప్రాంతం‌లో రక్తస్రావానికి దారితీస్తుంది.
     
  3. ఇతర దుష్ప్రభావాలు:
  • అధికంగా సొరకాయ రసం త్రాగడం, హైపోగ్లైసీమియాకు దారి తీయవచ్చు (తక్కువ రక్త చక్కెర స్థాయిలు).
  • కొంతమంది వ్యక్తులలో సొరకాయ రసం అలెర్జీ ప్రతిచర్యలకు దారి తీయవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సు కోసం సొరకాయ చాలా మంచిది.  ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉంది.  మీ ఆహారంలో రసాన్ని తీసుకోవడం, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ఒక సానుకూల మార్పును తీసుకురాగలదు.  అయినప్పటికీ, ఈ రసం త్రాగడానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఈ రసం‌ కొన్ని సమ్మేళనాలను కలిగిఉన్నందు వల్ల, మానవ శరీరం తట్టుకోలేనటువంటి హానికరంగా ఈ రసం ఉంటుంది.  ఈ రసాన్ని ఇంట్లో చేయడం ఉత్తమమైనది అయితే, ఒకవేళ మీరు సొరకాయ రసం కొనుగోలు చేస్తుంటే, మీరు సేంద్రియ సొరకాయను చూసి తీసుకోవడం చాలా ముఖ్యం మరియు ఇతర కూరగాయల రసాలతో ఈ రసం మిక్సింగ్ కాకుండా నివారించండి. ఒకవేళ ఈ రసం చేదుగా ఉంటే, దానిని త్రాగడం సురక్షితం కాదు.

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 11218, Gourd, white-flowered (calabash), raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Parle Milind et al. [LINK]. IRJP 2 (6) 2011 13-17
  3. Indian Council of Medical Research Task Force. Assessment of effects on health due to consumption of bitter bottle gourd (Lagenaria siceraria) juice. Indian J Med Res. 2012;135:49-55. PMID: 22382183
  4. Puri R et al. Gastrointestinal toxicity due to bitter bottle gourd (Lagenaria siceraria)--a report of 15 cases. Indian J Gastroenterol. 2011 Sep;30(5):233-6. PMID: 21986853
  5. Garcia-Diaz DF, Lopez-Legarrea P, Quintero P, Martinez JA. Vitamin C in the treatment and/or prevention of obesity. J Nutr Sci Vitaminol (Tokyo). 2014;60(6):367-79. PMID: 25866299
  6. R Jayawardena et al. Effects of zinc supplementation on diabetes mellitus: a systematic review and meta-analysis. Diabetol Metab Syndr. 2012; 4: 13. PMID: 22515411
Read on app