బాసిల్ లేదా తులసి “మూలికల యొక్క రాణి” లేదా “జీవితపు దివ్యౌషధం” గా పిలువబడుతుంది.  తులసి యొక్క ఔషధ, పాక మరియు ఆత్మీయ లక్షణాల కారణంగా, ఇతర మూలికల మధ్య ఒక పోలికలేని స్థితి కలిగి ఉంటుంది.  తులసిలో మూడు రకాలు ఉన్నాయి.  రామ తులసి, ఇది ఆకుపచ్చ ఆకులు కలిగిఉంటుంది, కృష్ణ తులసి, ఇది ఊదా రంగు ఆకులు కలిగిఉంటుంది మరియు వర్ణ తులసి, ఇది ఒక అడవి రకం మరియు లేత ఆకుపచ్చ ఆకులు కలిగిఉంటుంది.   

వేద కాలం నుండి తులసి మొక్కలు భారతదేశం‌లో పెరుగుతున్నాయి మరియు హిందువులకు పవిత్రమైనవిగా ఉంటున్నాయి.  ఇవి సాధారణంగా దేవాలయాల చుట్టూ నాటబడతాయి మరియు అత్యధిక భారతీయ ఇండ్లలో కూడా వాటిని కనుగొనవచ్చు.  తులసి మొక్కల యొక్క పరిమాణం మరియు రంగు అన్నది, భౌగోళిక స్థితి, వర్షపాతం మరియు మొక్క రకం పైన ఆధారపడి మారుతూ ఉంటుంది.

ఇది వంట నుండి ఔషధం వరకు విస్తృత పరిధిలో ఉపయోగాలను కలిగిఉంది.  తులసి యొక్క సుగంధ సువాసన మరియు చేదు రుచి, సలాడ్లు మరియు సాస్‌లతో దీనిని తీసుకున్నప్పుడు రుచి మొగ్గలకు ఒక ట్రీట్ ‌లాగా అది ఉంటుంది.  పూర్వ కాలం‌లో, తులసిని పవిత్రతకు ఒక గుర్తుగా భావించారు.  తులసి మొక్కకు దగ్గరగా వెళ్లడం మరియు వాసన చూడడం కూడా అనేక అంటువ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుందని నమ్మడం జరిగింది.

దాని ఆధ్యాత్మిక స్థితి కారణంగా, అది పవిత్రమైన తులసిగా కూడా తెలుపబడింది.  ఆయుర్వేదం‌లో, ఆరోగ్య ప్రయోజనాల విస్తృత శ్రేణిని తులసి అందిస్తుందని తెలుపబడింది.  యాంటి-మైక్రోబయల్, యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆర్థరిటిక్, కీమో-నివారణ, హెపటో‌ప్రొటెక్టివ్ (కాలేయాన్ని రక్షిస్తుంది), యాంటి-డయాబెటిక్, మరియు యాంటి-ఆస్థమాటిక్ లక్షణాలను తులసి కలిగిఉంది.

తులసి గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • వృక్ష శాస్త్రీయ నామం: ఓసిమ‌మ్ సాం‌క్ట‌మ్
 • కుటుంబం: లామియేస్
 • వ్యవహారిక నామం: తులసీ తుల్సి
 • సంస్కృత నామం: తుల్సి
 • ఇతర పేర్లు: పవిత్ర తులసి, రామ తులసి, శ్యా‌మ్ తులసి
 • నివాస స్థానం మరియు భౌగోళిక స్థానం: తులసి భారతదేశ స్థానికతకు చెందినది, అయితే మధ్య ఆఫ్రికా నుండి ఆగ్నేయ ఆసియా వరకు గల ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా ఇది కనుగొనబడింది.
 • ఆసక్తికర అంశం:  కాలుష్యం కారణంగా సంభవించే నష్టం నుండి తాజ్ మహల్‌ను రక్షించడానికి పర్యావరణ వేత్తలు మరియు శాస్త్రవేత్తలు తాజ్ మహల్ చుట్టూ పది లక్షల తులసి మొక్కలు నాటారు.
 1. తులసి పోషక విలువలు - Basil nutrition facts in Telugu
 2. తులసి ఆరోగ్య ప్రయోజనాలు - Basil health benefits in Telugu
 3. తులసి దుష్ప్రభావాలు - Basil side effects in Telugu
 4. టేక్ అవే - Takeaway in Telugu

ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఆహార ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ మరియు అనేక సేంద్రియ సమ్మేళనాలకు తులసి ఒక మంచి వనరుగా ఉంది.  తులసి‌లో ఉండే ఫ్లేవనాయుడ్లు మొటిమలుఆస్థమా, మంట మరియు శ్వాస సంబంధిత సమస్యల చికిత్సలో సహాయపడతాయి. 

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. తులసి  క్రింద ఇవ్వబడిన పోషకాలను కలిగిఉంటుంది:

పోషకము విలువ, 100 గ్రా.లకు
నీరు 92.06 గ్రా.
శక్తి 23 కి.కేలరీలు
ప్రొటీన్ 3.15 గ్రా.
కొవ్వు 0.64 గ్రా.
కార్బోహైడ్రేట్ 2.65 గ్రా.
ఫైబర్ 1.6 గ్రా.
చక్కెరలు 0.30 గ్రా.
ఖనిజాలు  
కాల్షియం 177 మి.గ్రా.
ఇనుము 3.17 మి.గ్రా.
మెగ్నీషియం 64 మి.గ్రా.
ఫాస్ఫరస్ 56 మి.గ్రా.
పొటాషియం 295 మి.గ్రా.
సోడియం 4 మి.గ్రా.
జింక్ 0.81 మి.గ్రా.
విటమిన్లు  
విటమిన్ ఎ 264 µగ్రా.
విటమిన్ బి1 0.034 మి.గ్రా.
విటమిన్ బి2 0.076 మి.గ్రా.
విటమిన్ బి3 0.902 మి.గ్రా.
విటమిన్ బి6 0.155 మి.గ్రా.
విటమిన్ బి9 68 µగ్రా.
విటమిన్ సి 18.0 మి.గ్రా.
విటమిన్ ఇ 0.80 మి.గ్రా.
విటమిన్ కె 414.8 µగ్రా.
కొవ్వులు/కొవ్వు ఆమ్లాలు  
సంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.041 గ్రా.
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.088 గ్రా.
బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.389 గ్రా.
 • ఒక యాంటిఆక్సిడంట్‌గా: తులసిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాల కారణంగా,ఇది ఒక శక్తివంతమైన యాంటిఆక్సిడంట్‌గా పనిచేస్తుంది, మీ చర్మం మరియు వెంట్రుకల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేసేలా ఈ లక్షణాలు దీనిని తయారుచేసాయి.  చర్మం మరియు జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరుస్తూ,  అధిక ఆక్సీకరణ ఒత్తిడి మరియు నష్టం నుండి శరీరాన్ని ఇది మాత్రమే రక్షిస్తుంది.  అదనంగా, సోరియాసిస్, కుష్టు మరియు తామర వంటి పరిస్థితులు మరియు అనేక చర్మ ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది.  ఒక యాంటిమైక్రోబయల్ ఏజెంట్‌గా,  చర్మ గాయాలు మరియు పురుగు కాట్ల నిర్వహణలో ఇది సహాయపడుతుంది.  జుట్టుకు సంబంధించి, తులసి యొక్క ఉపయోగం జుట్టు నెరయడం మరియు రాలిపోవడం ఆలస్యం చేయడం మాత్రమే కాకుండా బట్టతల మరియు పేనుకొరుకుడు కూడా ఆలస్యం చేస్తుంది. 
 • నోటి ఆరోగ్యం కోసం: దంత క్షయం, పంటి నొప్పి మరియు చిగురు వాపు యొక్క నిర్వహణలో తులసి ఉపయోగపడుతుంది.
 • కడుపు కోసం: జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మలబద్దకం నుండి ఉపశమనం అందించడం‌లో తులసి సహాయం చేస్తుంది.  తులసి కషాయం ఆకలి పెంచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 • ఒత్తిడి కోసం: భౌతిక, మానసిక, రసాయన మరియు జీవక్రియ ఒత్తిడి యొక్క నిర్వహణలో తులసి సమర్థవంతంగా పనిచేస్తుంది.
 • కళ్లు మరియు చెవుల కోసం: కంటి చుక్కల రూపం‌లో తులసి ఆకుల ఉపయోగం, గ్లాకోమా, కంటిశుక్లం మరియు కండ్లకలక వంటి బాధాకరమైన కంటి పరిస్థితుల నుండి ఉపశమనం పొందుటలో సహాయం చేస్తుంది.  తులసి నూనె కూడా మధ్య చెవిలో ఏర్పడే నొప్పి మరియు ఇన్‌ఫెక్షన్ల ఉపశమనానికి సహాయం చేస్తుంది.
 • క్యా‌న్సర్‌కు వ్యతిరేకంగా: తులసి యొక్క యాంటి-క్యా‌న్సర్ సామర్థ్యాన్ని అనేక అధ్యయనాలు అ‌న్వేషించాయి మరియు కడుపు క్యా‌న్సర్  నిర్వహణలో సమర్థవంతమైనదిగా ఇది కనుగొనబడింది. 

క్యా‌న్సర్ మరియు కణితుల కోసం తులసి - Basil for cancer and tumours in Telugu

శరీరం‌లో కణాల యొక్క అసాధారణ పెరుగుదల క్యా‌న్సర్‌గా సూచించబడుతుంది.  ప్రస్తుతం అందిస్తున్న చికిత్స అనేక దుష్ప్రభావాలతో సంబంధం కలిగిఉంది కాబట్టి, యాంటిక్యా‌న్సర్ చికిత్సల కోసం సహజ ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు  విస్తృతమైన పరిశోధన ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.  ఈ ధోరణిలో, అనేక అధ్యయనాలు తులసి యొక్క పొటె‌న్షియల్ యాంటిక్యా‌న్సర్ లక్షణాలతో సంబంధం కలిగిఉన్నాయని తులసి మరియు  వేప ఆకుల నుండి తీసిన సారం ఉపయోగించి ఒక ప్రీక్లినికల్ అధ్యయనం జరిగింది. తులసి సారం  కడుపు క్యా‌న్సర్యొక్క నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయన వెల్లడించింది. కణాల యొక్క అసాధారణ పెరుగుదలలో కూడా ఒక గణనీయమైన తగ్గుదల ఏర్పడింది అర్సోలిక్ మరియు ఓలియానోలిక్ ఆమ్లాలను తులసి కలిగిఉందని మరొక పరిశోధన చూపించింది, ఇవి యాంటి-ట్యూమర్ చర్యలను కలిగిఉన్నాయి.

తులసి రేడియోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని కూడా కలిగిఉంది, రేడియేషన్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి ఆరోగ్యకరమైన కణాలను ఇది కాపాడుతుంది.  అదనంగా, తులసి యొక్క యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణం మంటను నివారిస్తుంది, ఇది పెరుగుతున్న  క్యా‌న్సర్‌తో సంబంధం కలిగిఉంది.

తులసి యాంటిఆక్సిడంట్ సామర్థ్యం - Basil antioxidant capacity in Telugu

స్వేచ్చా రాడికల్స్ అన్నవి అస్థిరమైన అణువులు, అవి కణ నష్టాన్ని ఏర్పరుస్తాయి మరియు క్యా‌న్సర్, హృదయ సంబంధ సమస్యలు వంటి వివిధ వ్యాధుల్ని ఏర్పరుస్తాయి.  యాంటిఆక్సిడంట్లు అన్నవి సహజ పదార్థాలు, స్వేచ్చా రాడికల్స్ కారణంగా సంభవించిన నష్టం నుండి మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి, స్వేచ్చా రాడికల్స్ మరియు యాంటిఆక్సిడంట్ల మధ్య ఒక సమతుల్యత నిర్వహించడం చాలా అవసరం.  ఈ రెండింటి మధ్య ఏర్పడే అసమతుల్యతను ఆక్సీకరణ ఒత్తిడిగా పిలుస్తారు.  తులసిలో ఉండే అధిక స్థాయి యాంటిఆక్సిడంట్ల కారణంగా ఆక్సీకరణ నష్టం నుండి శరీరాన్ని కాపాడే సామర్థ్యాన్ని తులసి కలిగిఉందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.

తులసిని ప్రాథమిక పదార్థంగా కలిగిఉన్న ఒక మూలికా పొడి, ముఖ్యమైన యాంటిఆక్సిడంట్ లక్షణాలను ప్రదర్శిస్తుందని ఒక జంతు అధ్యయనం సూచిస్తుంది.  తులసి యొక్క సారం అధిక స్థాయిలో  క్యాటలేజ్ మరియు గ్లూటాతియోన్ ట్రా‌‌న్స్‌ఫెరేస్ వంటి యాంటిఆక్సిడంట్లను కలిగిఉందని మరొక ప్రిక్లినికల్ అధ్యయనం చూపించింది.

(మరింత చదవండి: యాంటిఆక్సిడంట్ అహార వనరులు)

జుట్టు కోసం తులసి ప్రయోజనాలు - Basil benefits for hair in Telugu

వయస్సు పెరిగే కొద్దీ, ప్రజలు వారి చర్మం‌తో మాత్రమే కాకుండా, వారి జుట్టుతో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు.  జుట్టు నెరయడం, జుట్టు రాలడం, జుట్టు పలచబడడం మరియు బట్టతల వంటి కొన్ని సాధారణ సమస్యలను వయస్సు పెరగడం‌తో ప్రజలు ఎదుర్కొంటారు.  ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, వంశానుగత సమస్యలు మరియు కొన్ని రకాల మందుల వాడకం వంటివి ఈ జుట్టు సమస్యలకు సంబంధించిన కొన్ని సాధారణ కారణాలుగా ఉన్నాయి.   తులసి యాంటిఆక్సిడంట్లకు ఒక గిడ్డంగిగా ఉంది, జుట్టు నెరయడాన్ని తగ్గించడం, కాలుష్యం మరియు యువి నష్టం నుండి  జుట్టును తులసి కాపాడుతుందని కనుగొనబడింది.

ఆండ్రోజెనిక్ అలోపేసియా అన్నది ఒక పరిస్థితి, అధికంగా జుట్టు రాలిపోవడం మరియు  బట్టతలద్వారా ఈ పరిస్థితి వర్గీకరించబడింది. ఈ పరిస్థితిని నివారించడానికి తులసి యొక్క సామర్థ్యాన్ని ఒక పరిశోధన వెల్లడించింది.  పరిశోధన ప్రకారం, తులసి యొక్క రూట్ సంస్కృతి, జుట్టు నష్టానికి బాధ్యత వహించే ఎంజైము యొక్క చర్యను నిరోధిస్తుంది.  జుట్టు తిరిగి పెరగడం‌లో కూడా రూట్ సంస్కృతి సహాయం చేస్తుంది.  కేవలం రెండు నెలల పాటు అప్లై చేసిన తర్వాత జుట్టు నష్టం 31% శాతం వరకూ తగ్గించబడిందని అధ్యయనం తర్వాత సూచించింది.

చర్మం కోసం తులసి ప్రయోజనాలు - Basil benefits for skin in Telugu

తులసి ఏ రకం అయిననూ, చర్మానికి ఒక ఆశీర్వాదంగా ఉంది.  తులసి యొక్క అనేక చర్మ వైధ్య ప్రయోజనాల ద్వారా సంప్రదాయ ఔషధాలు ప్రమాణం చేస్తున్నాయి.  తులసి యొక్క పొటె‌న్షియల్‌,  గజ్జి,    సోరియాసిస్కుష్టు మరియు స్టాఫ్ ఇన్‌ఫెక్షన్లు వంటి వ్యాధుల నుండి మీ చర్మాన్ని రక్షిస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

తులసి సారం యాంటిఫంగల్ మరియు యాంటిమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.  కాబట్టి, మానని గాయాలకు ఇది ఒక గొప్ప యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదం‌లో, చర్మం పైన పురుగుకాటు కారణంగా ఏర్పడిన చికాకును నివారించడం‌లో తులసి ఆకుల నుండి తయారు చేయబడిన పేస్ట్‌ను అప్లై చేస్తారు.  తులసిలో ఉండే అర్సోలిక్ ఆమ్లం చర్మం పైన ముడుతలను నిరోధిస్తుంది, చర్మం మరింత సాగేలా చేస్తుంది, గాయాలను త్వరగా మా‌న్పుతుంది మరియు చర్మ క్యా‌న్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది.

తులసి ఆకులు, చర్మ ఇన్‌ఫెక్షన్లకు కారణమైన ఎస్. ఆరియస్కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తాయని మరొక అధ్యయనం సూచించింది. తులసి యొక్క యాంటిమైక్రోబయల్ చర్య, కర్పూరం, యూకలిఫ్టల్, యూజెనాల్, మరియు β-కార్యోఫైల్లిన్ వంటి అంశాలు తులసిలో ఉండడం వలన దానికి ఆపాదించబడింది. 

దంతాలు మరియు చిగుళ్ల కోసం తులసి ప్రయోజనాలు - Basil benefits for teeth and gums in Telugu

కొన్ని తులసి ఆకుల్ని నమలడం, దంత పరిశుభ్రతను నిర్వహించడం‌లో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.  తులసి, స్ట్రెప్టోకాకస్ మ్యూట‌న్స్ అని పిలిచే ఒక రకమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది, ఈ బ్యాక్టీరియా దంత క్షయం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ లక్షణం అన్నది తులసి మొక్కలో ఉండే క్యార్రక్రాల్, టెట్పేన్ మరియు సెస్క్విటెర్పేన్ బి-కార్యోఫైల్లిన్ వంటి యాంటిబ్యాక్టీరియల్ కారకాల వలన దీనికి ఆపాదించబడింది.

తులసిలో ఉండే యూజెనాల్ అన్నది, దానిని ఒక మంచి అనాల్జేసిక్ (నొప్పిమందు)గా చేసింది, ఇది  పంటినొప్పితగ్గించడం‌లో సహాయపడుతుంది. ఎండబెట్టిన తులసి ఆకులు పొడిచేయబడి, పళ్ల పొడిగా వాడబడతాయి.

చిగురువాపు అన్నది ఒక సాధారణమైన చిగుళ్ళ వ్యాధి, అది చిగుళ్లు ఎర్రబడడానికి కారణమవుతుంది. తులసి పొడితో చిగుళ్లను తోమడం, ఈ వ్యాధిని నివారించడం‌లో సహాయపడుతుంది.

జీర్ణశయాంతర రుగ్మతల కోసం తులసి - Basil for gastrointestinal disorders in Telugu

జీర్ణశయాంతర రుగ్మతలు ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్, మలబద్దకం మరియు ఆనల్ ఫిషర్స్వంటి పరిస్థితులను కలిగిఉంటాయి. ఈ పరిస్థితులు కొన్ని దీర్ఘకాలంగా ఉండవచ్చు మరియు  పెద్ద ప్రేగు క్యా‌న్సర్వంటి మరింత క్లిష్టమైన సమస్యలకు దారితీస్తాయి. జీర్ణశయాంతర రుగ్మతల చికిత్సకు తులసి ఆకుల యొక్క పొటె‌న్షియల్  సమర్థవంతమైనదని  పరిశోధన సూచిస్తుంది.  తులసి నుండి చేసిన కషాయం, అనారోగ్యాన్ని వేగంగా నయం చేస్తుందని తెలుపబడింది.  తులసి మీ ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది.  తులసి లాక్సేటివ్ లక్షణాలను కలిగిఉన్నట్లు తెలుస్తోంది, ఇది  మలబద్ధకం నివారణలో సహాయపడుతుంది మరియు ప్రేగు కదలికల్ని క్రమంగా ఉంచుతుంది.

తులసి ఆకుల రసం,   విరేచనాలు మరియు జీర్ణాశయం యొక్క మంటను నివారించడం‌లో సహాయపడుతుంది (అజీర్తి). తులసిని తీసుకోవడం ఎసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ అల్సర్స్ తగ్గించిందని ఒక ప్రిక్లినికల్ అధ్యయనం నివేదించింది.

ఒత్తిడి కోసం తులసి - Basil for stress in Telugu

తులసిని ఒక శక్తివంతమైన యాంటి-స్ట్రెస్ కారకంగా పరిగణిస్తారు.  తులసి అన్నది భౌతిక, మానసిక, రసాయన అలాగే జీవక్రియా ఒత్తిడిలకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు నివేదించాయి.

తులసి యొక్క యాంటిస్ట్రెస్ ప్రభావం విశ్లేషించడానికి ఒక ప్రిక్లినికల్ అద్యయనం జరిగింది, శరీరం యొక్క ఒత్తిడి హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ యొక్క పెరుగుదలను నివారించడం‌లో తులసి సమర్థవంతమైనదని ఈ అధ్యయనం చూపించింది.  తులసిలో ఉండే అర్సోలిక్ ఆమ్లం, దాని యాంటిఒత్తిడి లక్షణానికి బాధ్యత వహిస్తుందని పరిశోధన తర్వాత సూచించింది.

(మరింత చదవండి: ఒత్తిడి చికిత్స)

కళ్ల కోసం తులసి ప్రయోజనాలు - Basil benefits for eyes in Telugu

చాలా ముఖ్యమైన జ్ఞాన అవయవాలలో కళ్లు ఒకటి.  అయితే, వయస్సు పెరిగే కొద్దే, మన దృష్టి బలహీనంగా మారుతుంది మరియు కంటి వ్యాధులు వచ్చే సంభావ్యత గణనీయంగా పెరుగుతుంది.  అత్యంత సాధారణ కంటి వ్యాధులుగా వయస్సు-సంబందిత మచ్చల క్షీణత, శుక్లం, మరియు గ్లాకోమా (కంటిలో ఒత్తిడి పెరగడం) ఉన్నాయి.

కంటి ఔషధాల తయారీలో, అతి ముఖ్యమైన పదార్థాలలో తులసిని ఒక పదార్థంగా ఆయుర్వేదం ఎల్లప్పుడూ ఉపయోగిస్తుంది.  ఆయుర్వేదం ప్రకారం, కంటి చుక్కల రూపం‌లో తులసి ఆకుల సారం‌ ఉపయోగించినప్పుడు,  గ్లాకోమాకంటిశుక్లం మరియు కండ్లకలక వంటి బాధాకరమైన కంటి వ్యాధుల ఉపశమనం‌లో ఈ కంటి చుక్కలు సహాయపడతాయి.

చెవుల కోసం తులసి ప్రయోజనాలు - Basil benefits for ears in Telugu

మంట, గాయం లేదా చెవిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా చెవి నొప్పి ఏర్పడుతుంది.  చెవి నొప్పి మరియు ఇన్‌ఫెక్షన్ తగ్గించడం‌లో తులసి సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధన సూచిస్తుంది.  తులసి ఆకుల్ని ఉపయోగించి తయారుచేసిన తులసి నూనె మరియు తాజా వెల్లుల్లి రసం చెవిపోటు చికిత్సకు ఉపయోగించబడుతుంది. 

తీవ్రమైన ఓటిటిస్ మీడియా అన్నది ఒక బాధాకరమైన పరిస్థితి, ఇందులో మధ్య చెవి, హెమోఫిలస్ ఇన్‌ఫ్లూయెం‌జాఅనే ఒక బ్యాక్టీరియా వలన సంక్రమణకు గురవుతుంది. తులసి నూనె యొక్క యాంటిమైక్రోబయల్ చర్యను తీవ్రమైన  ఓటిటిస్ మీడియాకు వ్యతిరేకంగా యాక్సెస్ చేయడానికి ఒక ప్రిక్లినికల్ అధ్యయనం జరిగింది. తులసి నూనెను చెవి కెనాల్‌లో ఉంచడం, ఈ వ్యాధికి ప్రభావవంతమైన చికిత్సగా ఉందని పరిశోధన వెల్లడించింది.

 • గర్భిణీ స్త్రీలు అధిక పరిమాణంలో తులసిని తీసుకోవడం వల్ల, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ కూడా దీర్ఘ-కాల సమస్యలు కలిగిఉంటారు.  గర్భిణీ స్త్రీలలో గర్భాశయ సం‌కోచాలు ఏర్పడే అవకాశాన్ని తులసి కలిగిఉంది.  కాబట్టి, గర్భిణీ స్త్రీలు తులసిని తీసుకోవడానికి ముందుగా డాక్టరును సంప్రధించాలని వారికి సలహా ఇవ్వబడింది.
 • శరీరం‌లో సంతానోత్పత్తి స్థాయిల్ని తులసి తగ్గిస్తుందని ప్రీక్లినికల్ అధ్యయనాలు పేర్కొన్నాయి.  గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు లేదా పిల్లలకు పాలు ఇస్తున్న మహిళలు తులసిని ఉపయోగించకుండా దానిని దూరంగా ఉంచాలి.  తులసి ఆకుల క్రమమైన వినియోగం, పురుషులలో వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తుందని కనుగొనబడింది, కాబట్టి దీని వినియోగం పురుషులలో సంతానోత్పత్తి స్థాయిల్ని కూడా ప్రభావితం చేయవచ్చు.
 • యుజెనాల్ అన్నది తులసిలో ఉండే ఒక శక్తివంతమైన సమ్మేళనం. ఇది యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటిబ్యాక్టీరియల్ మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు కలిగిఉందని కనుగొనబడింది.  అయితే, యూజెనాల్ అధిక మోతాదు, నిస్సార శ్వాస, నోరు మరియు గొంతులో మంట,   వికారం, వేగవంతమైన గుండె చప్పుడు, మూర్ఛలు మరియు తలతిరగడం వంటి వాటికి దారి తీస్తుంది.

తులసి, జీవితం యొక్క అమృతం, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉంది.  ఇది కళ్లు, చెవులు మరియు పళ్లను రక్షించడం‌లో సహాయం చేయడం మాత్రమే కాకుండా, ఒక పొటె‌న్షియల్ యాంటిక్యా‌న్సర్ కారకంగా కూడా పనిచేస్తుంది.    ఇది యాంటిబ్యాక్టీరియల్, యాంటిమైక్రోబయల్ మరియు యాంటిఫంగల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది మరియు ఇది యాంటిఆక్సిడం‌ట్స్‌తో నింపబడి ఉంటుంది.  అయితే, గర్భం వచ్చిన మహిళలు మరియు గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు తులసిని ఉపయోగించడం మానివేయాలి.  అలాగే ఇది పురుషులలో వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుందని తెలుపబడింది.  అందువలన, మధ్యస్థ పరిమాణంలో తులసిని తీసుకోవడం ముఖ్యం, అది ఆరోగ్యానికి ప్రయోజనాన్ని అందిస్తుంది.


उत्पाद या दवाइयाँ जिनमें Tulsi है

వనరులు

 1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 02044, Basil, fresh. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. Yuvaraj Ponnusam et al. Antioxidant Activity of The Ancient Herb, Holy Basil in CCl4-Induced Liver Injury in Rats. Ayurvedic. 2015 Nov; 2(2): 34–38. PMID: 26925464
 3. Eshrat Halim M. A. Hussain, Kaiser Jamil, Mala Rao. Hypoglycaemic, hypolipidemic and antioxidant properties of tulsi (Ocimum sanctum linn) on streptozotocin induced diabetes in rats. Indian J Clin Biochem. 2001 Jul; 16(2): 190–194. PMID: 23105316
 4. Marc Maurice Cohen. Tulsi - Ocimum sanctum: A herb for all reasons. J Ayurveda Integr Med. 2014 Oct-Dec; 5(4): 251–259. PMID: 25624701
 5. Manikandan P, Vidjaya Letchoumy P, Prathiba D, Nagini S. Combinatorial chemopreventive effect of Azadirachta indica and Ocimum sanctum on oxidant-antioxidant status, cell proliferation, apoptosis and angiogenesis in a rat forestomach carcinogenesis model.. Singapore Med J. 2008 Oct;49(10):814-22. PMID: 18946617
 6. Seth Rakoff-Nahoum. Why Cancer and Inflammation? Yale J Biol Med. 2006 Dec; 79(3-4): 123–130. PMID: 17940622
 7. Hanaa A. Yamani et al. Antimicrobial Activity of Tulsi (Ocimum tenuiflorum) Essential Oil and Their Major Constituents against Three Species of Bacteria. Front Microbiol. 2016; 7: 681. PMID: 27242708
 8. Fernández E et al. Efficacy of antioxidants in human hair. J Photochem Photobiol B. 2012 Dec 5;117:146-56. PMID: 23123594
 9. Kristinsson KG et al. Effective treatment of experimental acute otitis media by application of volatile fluids into the ear canal. J Infect Dis. 2005 Jun 1;191(11):1876-80. Epub 2005 Apr 29. PMID: 15871121
 10. Marc Maurice Cohen. Tulsi - Ocimum sanctum: A herb for all reasons. J Ayurveda Integr Med. 2014 Oct-Dec; 5(4): 251–259. PMID: 25624701
 11. Hojjat Rouhi-Boroujeni et al. Use of lipid-lowering medicinal herbs during pregnancy: A systematic review on safety and dosage. ARYA Atheroscler. 2017 May; 13(3): 135–155. PMID: 29147122
ऐप पर पढ़ें