• తె

ఖర్జూరాలు అనేవి వలయాకారపు అద్భుతమైన పండ్లు అవి ఖర్జూరపు చెట్టుపై పెరుగుతాయి.  ఇవి ప్రపంచవ్యాప్తంగా వినియోగించబడినప్పటికీ, వీటి యొక్క ఒక విలక్షణ సువాసన ప్రతీ వంటకాన్ని మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. ప్రతీ వంటగదిలో కనిపించే పండ్లు యొక్క రహస్యo మరియు ప్రత్యేకత ఏమిటో, మీరు తెలుసుకోవచ్చు. మంచిది, చాలా వరకు మంచి విషయాలు మీ ముక్కు నియంత్రణలో సాధారణంగా ఉంటాయి.

ఇది సాగుచేయబడిన చెట్ల ఫలాలలో పురాతనమైనది మరియు అది బైబిలులో తెలియజేయబడిన ప్రకారం ‘జీవన వృక్షం’ అని చెప్పబడే ఊహాగానాలు మీకు ఆసక్తిని కలిగించవచ్చు. దేవతలే వాటిని అలా పిలిచినప్పుడు వాటి యొక్క ప్రత్యేకత గురించి మీరు అర్థం చేసుకోవచ్చు.

ఖర్జూరపు చెట్టు మీద గుత్తులుగా పెరుగుతూ, ఖర్జూరాలు అనేవి సహజ మార్గంలో జీర్ణ ప్రక్రియలో సహాయపడే అత్యంత బహుముఖ ఫలాలలో ఒక రకం. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు మరియు ఖనిజ లవణాలను అందిస్తుంది. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాల్లో ఈ ఖర్జూరం చాలా ప్రజాదరణ పొందింది.

ఖర్జూరపు చెట్లు సాధారణంగా 21-23 మీటర్లు (69-75 అడుగులు) ఎత్తు వరకు పెరుగుతాయి. ఖర్జూరపు పండు తీపియైన రుచిని కలిగి ఉంటుంది, ఎండబెట్టినపుడు సుమారు 75 శాతం చక్కెరను కలిగి ఉంటుంది. ఖర్జూరాలలో 3 ప్రధాన రకాలు ఉన్నాయి, అవి బాగా మృదువైన ఖర్జూరాలు, కొంత-మృదువైన ఖర్జూరాలు మరియు పొడి ఖర్జూరాలు. బర్హీ ఖర్జూరాలు, డిగ్లెట్ ఖర్జూరాలు, హలావి ఖర్జూరాలు, ఖాద్రవి ఖర్జూరాలు, థూరీ ఖర్జూరాలు, జహీదీ ఖర్జూరాలు మొదలైనవి. రకాలను బట్టి, ఇవి బాగా ఎరుపు రంగు నుండి బాగా పసుపు, తెలుపు మరియు నలుపు రంగులో ఉంటాయి.

ఖర్జూరాలు ఇరాక్, అరేబియా, ఉత్తర ఆఫ్రికా, మొరాకోలో ముఖ్యమైన సాంప్రదాయ పంటగా సాగు చేయబడుచున్నాయి. ఈజిప్టు ప్రపంచంలో ఖర్జూరపు అతి పెద్ద ఉత్పత్తిదారు దేశం తరువాత వరుసగా ఇరాన్, సౌదీ అరేబియాలు ఉన్నాయి. భారతదేశంలో ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు పశ్చిమంలో రాజస్థాన్ మరియు గుజరాత్, దక్షిణాన తమిళనాడు మరియు కేరళ ఉన్నాయి. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని దిగుమతి చేసుకునే దేశo.

ఖర్జూరాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • బొటానికల్ పేరు: ఫినిక్స్ డక్టిలిఫేరా
 • కుటుంబ: తాటి చెట్టు కుటుంబం, అరెకేసియే
 • సాధారణ పేరు: ఖర్జూరం, ఖజూర్
 • సంస్కృత పేరు: ఖర్జురా
 • ఉపయోగించబడే భాగాలు: పండ్లు, గుత్తిలు, ఆకులు, విత్తనాలు మరియు రసం.
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఈజిప్ట్ మరియు మెసపొటేమియా యొక్క సారవంతమైన ప్రాంతాలలో ఖర్జూరాలు ఉద్భవించాయి. అవి ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా మరియు మధ్య ప్రాచ్యం అంతటా సాగు చేయబడినవి
 • ఆసక్తికరమైన వాస్తవాలు: ఖర్జూరాలను ఒంటె పాలతో చేర్చడం అనేది ఒక ఎదురులేని మిశ్రమం. ఒంటె పాలు అధిక కొవ్వు మరియు విటమిన్ సి కలిగి ఉంటుంది. ఖర్జూరాల్లో పూర్తిగా విటమిన్ ఎ, బి మరియు D లను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మిశ్రమం ఒక గొప్ప పోషక ప్రయోజనాలను అందిస్తుంది.
 1. ఖర్జూరాల పోషకాహార వాస్తవాలు - Dates nutrition facts in Telugu
 2. ఖర్జూరాల ఆరోగ్య ప్రయోజనాలు - Dates health benefits in Telugu
 3. ఖర్జూరాల యొక్క దుష్ప్రభావాలు - Dates side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

యు.ఎస్.డి.ఎ ప్రకారం, ఖర్జూరాలు ఫైబర్, విటమిన్లు, శక్తి, చక్కెర మరియు ఐరన్, సోడియం, పొటాషియం, జింక్, కాల్షియం మొదలైన వివిధ ఖనిజ లవణాలకు మంచి మూలాధారం.

యు.ఎస్.డి.ఎ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 g ఖర్జూరాలు క్రింది పోషకాలను కలిగి ఉంటాయి:

పోషకాలు 100 గ్రాములలో వాటి విలువ
నీరు 21.32 గ్రా.
శక్తి 277 కిలో కేలరీలు
ప్రోటీన్ 1.81 గ్రా.
కొవ్వు 0.15 గ్రా.
కార్బోహైడ్రేట్లు 74.97 గ్రా.
ఫైబర్ 6.7 గ్రా.
చక్కెరలు 66.47 గ్రా.
ఖనిజ లవణాలు  
కాల్షియం 64 మి.గ్రా.
ఐరన్ 0.9 మి.గ్రా.
మాంగనీస్ 54 మి.గ్రా.
పాస్పరస్ 62 మి.గ్రా.
పొటాషియం 696 మి.గ్రా.
సోడియం 1 మి.గ్రా.
జింక్ 0.44 మి.గ్రా.
విటమిన్లు  
విటమిన్ ఎ 7 µg
విటమిన్ బి1 0.05 mg
విటమిన్ బి2 0.06 mg
విటమిన్ బి3 1.61 mg
విటమిన్ బి6 0.249 mg
ఫోలేట్ 15 µg
విటమిన్ కె 2.7 µg

మీ ఆరోగ్యo మరియు సంక్షేమం కోసం ఖర్జూరాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఖర్జూరాల గురించి మనకు బాగా తెలిసిన మరియు కొన్ని తెలియని ప్రయోజనాల గురించి శాస్త్రీయ అధ్యయనాలను చూద్దాం:

 • శక్తి కోసం: ఖర్జూరాలు ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలను కలిగి ఉంటాయి, ఇవి మధ్యాహ్న సమయం లేదా ఉపవాసం చేసిన తర్వాత రోజున వీటిని తీసుకొంటే శక్తి యొక్క తక్షణ ప్రయోజనం చేకూరుస్తుంది.
 • బరువు పెరుగుట కోసం: ఈ పండు యొక్క అధిక కేలరీలు గొప్ప, ఆరోగ్యకరమైన మరియు సహజ ఆహార సప్లిమెంట్­ని అందిస్తుంది.
 • ఎముకలకు: బోలు ఎముకల వ్యాధి మరియు బలహీనమైన ఎముకలను నివారించడంలో ఖర్జూరాలు నిరంతరం వినియోగించుకోవచ్చు.
 • రేచీకటి నివారిణిగా: ఖర్జూరాల సమయోచిత వాడుక రేచీకటి నివారణ కోసం ఒక సంప్రదాయ చికిత్స.
 • రక్తహీనత కోసం: ఖర్జూరాలు ఐరన్ యొక్క గొప్ప మూలాధారాలు, అందువలన అవి రక్తహీనత నివారణకు సహాయపడతాయి. అవి రక్తహీనత కలిగి ఉన్నవారికి ఒక అద్భుతమైన పథ్యo వంటి సప్లిమెంట్ కూడా అందిస్తాయి.
 • నోటి మరియు కడుపు కోసం: దంత క్షయాలు మరియు పంటి చిగురు సంబంధిత వ్యాధుల నివారణలో ఖర్జూరాలు సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియ మరియు పోషకాల శోషణను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
 • మెదడు కోసం: ఖర్జూరాలు అల్జీమర్స్ మరియు మానసిక వైకల్యం వంటి లోపాల నివారణకు సహాయపడతాయి మరియు ఇది జ్ఞాపకశక్తి మరియు జ్ఞానం కోల్పోవడం వంటి వాటిని నిరోధిస్తుంది.
 • చర్మం కోసం: ఆహారంలో ఖర్జూరాలు చేర్చడం వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచమే కాకుండా ముందస్తు వృద్ధాప్య సంకేతాలను తగ్గిoచును.
 • గర్భధారణ సమయంలో: గర్భధారణ సమయంలో ఖర్జూరాలు తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి మరియు ప్రసవ వేదనలో సహాయపడవచ్చు.

ఎముకలు కోసం ఖర్జూరాల ప్రయోజనాలు - Dates benefits for bones in Telugu

మీకు తెలుసా, ఖర్జూరాల నిరంతర వినియోగం మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చవచ్చు మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు? ఎముకలలో ఖనిజ సాంద్రత కోసం ముఖ్యమైన పాత్ర వహించే భాస్వరం, పొటాషియం, మరియు కాల్షియం వంటి వివిధ ఖనిజ లవణాలు ఖర్జూరాలలో పుష్కలంగా లభిస్తాయి.

మన వయస్సు పెరిగే కొలదీ, మన ఎముకలు దాని ఖనిజ లవణాలను కోల్పోవటం ప్రారంభమవుతుంది మరియు ఫ్రాక్చర్లు మరియు నొప్పి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. మందులు సాధారణంగా సిఫార్సు చేయబడకపోయినప్పటికీ వాటిని నివారించడంలో మీకు సహాయపడతాయి. సప్లిమెంట్ పిల్స్ తీసుకొనే బదులు తీపియైన ఖర్జూరాలు తీసుకోవడం చాలా మంచిది.

వృద్ధులు బలహీనమైన ఎముకలకు మాత్రమే ప్రభావితం అవటం కాకుండా, అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తుల్లో కూడా ఇది సాధారణం. అదనంగా, మహిళలు వయస్సుతో పాటు కాల్షియం వేగంగా కోల్పోవటం జరుగుతుంది. ఇలా ఎందుకంటే, కాల్షియం యొక్క లోపం, మన శరీరం ఎముకలు నుండి పాలిపోవడo  మొదలవుతుంది. ఖర్జూరాలలో ఖనిజ లవణాలు అధికంగా ఉన్నందున, అవి యువకులలో తమకు సిఫార్సు చేయబడిన రోజువారీ ఎనర్జీని పొందటంలో సహాయపడవచ్చు.

అయితే ఖర్జూరాలు కొలుగోలు చేయబోతున్నారా?

ఖర్జూరాలు రేచీకటిని నివారిస్తాయి - Dates prevent night blindness in Telugu

రేచీకటి  అనేది విటమిన్ ఎ యొక్క ముఖ్య లోపం కారణంగా కలుగుతుంది.  ఖర్జూరాలలో గల విటమిన్ ఎ రేచీకటిని నివారించడమే కాకుండా మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

సాంప్రదాయ నమ్మకం ప్రకారం, ఖర్జూరం మరియు ఖర్జూర చెట్టు ఆకులు వలన రేచీకటి నివారించడంలో సహాయం చేయబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులు ఖర్జూరాన్ని మెత్తని ముద్దలా చేసి, రేచీకటి తీవ్రతను తగ్గించుటకు వారి కళ్ళ చుట్టూ పూయడం జరుగుతుంది.

బరువు పెరుగుట కోసం ఖర్జూరాలు - Dates for weight gain in Telugu

మీరు అదనపు కిలోల బరువు పెరగడానికి ఖర్జూరాలు ఒక గొప్ప ఆహారం. చక్కెర, మాంసకృత్తులు మరియు ఇతర ముఖ్యమైన విటమిన్లు వంటి పోషక పదార్ధాలు ఈ అధిక  క్యాలరీలు కలిగిన పండు, బరువు సులభంగా పెరగేలా చేస్తుంది. అలాగే, ఖర్జూరాలు తక్కువ కొవ్వు మరియు అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. దీనర్థం మీరు పొందిన అదనపు పౌండ్లు ఆరోగ్యకరమైనది మరియు కేవలం అదనపు కొవ్వు పేరుకుపోవడం కాదు.

ఈ పండు నుండి గరిష్ట లాభం పొందడానికి, మీరు పాలు మరియు అరటితో కలిపి తీసుకోవచ్చు. దోసకాయ పేస్ట్­తో కలిపి తీసుకున్నప్పుడు, అది మీ శరీరం ఫిట్­గా ఉండేలా సహాయపడుతుంది

(ఇంకా చదవండి: బరువు పెరుగుట కోసం డైట్ చార్ట్)

గర్భిణీ స్త్రీలకు ఖర్జూరాల ప్రయోజనాలు - Dates benefits for pregnant women in Telugu

దీర్ఘకాలిక ప్రసవ వేదన అనేది ప్రధాన సమస్య, ఇది ఇంకా చనిపోయిన శిశువుల పుట్టడం మరియు పిండoలో లోపాలకు కారణమవుతుంది. ఇది కూడా తల్లి మరణానికి ఒక ముప్పుగా మారుతుంది. కనీసం ముందస్తు 4 వారాలుగా ఖర్జూరాలు నిరంతరం తీసుకొంటే అవి ప్రసవ వేదన కోసo ప్రేరణ మరియు బలోపేత అవసరాన్ని తగ్గిస్తుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఖర్జూరాలు ఆక్సిటోసిన్ వలే పనిచేస్తాయి మరియు గర్భాశయ విస్ఫారణాన్ని పెంచుతాయి, తద్వారా శిశు జననాన్ని సులభతరం చేస్తాయి.

ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండటం వలన, గర్భం మరియు పోషక పదార్ధాల తరువాత దశలో మలబద్దకాన్ని ఆపు చేయుటలో కూడా మీకు సహాయపడవచ్చు.

అయినప్పటికీ, ఖర్జూరాలను తీసుకొనే ముందు, ప్రత్యేకంగా మీరు గర్భం యొక్క ప్రారంభ దశలో ఉన్నప్పుడు, మీ గైనకాలజిస్ట్­ను సంప్రదించడం మంచిది.

మెదడుకు ఖర్జూరాల ప్రయోజనాలు - Dates benefits for brain in Telugu

మన వయస్సు పెరిగే కొలదీ, మన మెదడు మందకొడిగా మారుతుంది. పర్యవసానంగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు ఫిట్­గా ఉండటo మరింత అవసరం అవుతుంది. పొటాషియం ఒక ఆరోగ్యకరమైన మరియు ప్రతిస్పందించే నాడీ వ్యవస్థను ప్రోత్సహించే ప్రధాన పదార్థాలలో ఒకటి. ఇది మెదడుకు సంకేతాలు మరియు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది, ఇది మెదడు చర్య యొక్క వేగం మరియు చురుకుదనాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. పొటాషియం యొక్క అద్భుతమైన సోర్స్, ఖర్జూరాలు మీ మెదడుకు, మనసు చురుకుగా ఉండాలని కోరుకొనే వృద్ధులకు ఇది అద్భుతమైన ఆహారం.

అదనంగా, ఈ ఖర్జూరాలు విటమిన్ బి6 యొక్క మంచి మూలాధారం, ఇది మెరుగైన మెదడు పనితీరుతో సంబంధం కలిగి ఉంటుంది. ఆనందం హార్మోన్లు అయిన డోపామైన్ మరియు సెరోటోనిన్­లతో సహా కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లను ఏర్పాటు చేయడంలో ముఖ్యమైనది మరియు విటమిన్ బి6 యొక్క లోపం అనేది మెమరీ కోల్పోవడం మరియు మానసిక వైకల్యతతో సంబంధం కలిగి ఉంటుంది.

ఇది మాత్రమే కాదు, కానీ మెదడులోని అమైలోయిడ్ ప్లేక్ ఏర్పడకుండా నివారించడం ద్వారా అల్జీమర్స్ నివారించడంలో ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయనేది కూడా కనుగొనబడింది.

ఖర్జూరాలు శక్తి మెరుగుపరుస్తాయి - Dates boost energy in Telugu

సాంప్రదాయకంగా, సుదీర్ఘమైన నిరాహారదీక్షలను విచ్ఛిన్నం చేయడానికి ఖర్జూరాలు మరియు నీరు వినియోగించబడతాయి. ఎందుకంటే ఇవి సహజంగా ఎనర్జీ బూస్టర్ల. ఇవి అధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉంటాయి, అందులో గ్లూకోజ్ మరియు ఫ్రూక్టోజ్ వంటి తగినంత చక్కెరలను కలిగి ఉంటాయి, ఇవి కావలసిన శక్తిని వెంటనే ప్రేరేపిస్తాయి. శీఘ్ర మధ్యాహ్న అల్పాహారంగా సహజ కొవ్వు రహిత ఖర్జూరాలు తీసుకోవడం భారీ భోజనం తర్వాత మైకంగా మరియు మందకొడిగా ఉండే భావనను తగ్గిస్తుంది. అదనంగా, ఖర్జూరాలు తీసుకోవడం వలన అవి ఆకలిని కూడా తగ్గించగలవు, తద్వారా అతిగా తినడం నివారించవచ్చు. ఇది ఉపవాసం చేయు వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణకోశం కోసం ఖర్జూరాల యొక్క ప్రయోజనాలు - Dates benefits for stomach in Telugu

గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్­ కోసం ఖర్జూరాలు అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి:

 • ఖర్జూరాల్లో ఉన్న నికోటిన్ కంటెంట్ అనేక రకపు ప్రేగు సంబంధిత వ్యాధులను నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 • ప్రేగులలో స్నేహపూర్వక బాక్టీరియా యొక్క పెరుగుదలను ఉద్దీపన చేయుటలో ఖర్జూరాలు సహాయం చేస్తాయి.
 • ఖర్జూరాల్లో కనిపించే కరగని మరియు కరిగే ఫైబర్ జీర్ణశయాంతర వ్యవస్థను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
 • ఖర్జూరాలు పెద్దప్రేగు క్యాన్సర్­ని నివారిస్తాయి మరియు ప్రేగు యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి.
 • ఖర్జూరాలలో ఉన్న అమైనో ఆమ్లాలు ఆహారం యొక్క జీర్ణక్రియను ప్రోత్సహించటానికి మరియు శరీర మరింత సమర్థవంతంగా చేయటానికి సహాయపడతాయి.
 • క్రమం తప్పకుండా ఖర్జూరాలు తీసుకోవడం వలన పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి.

రక్తహీనత చికిత్స కోసం ఖర్జూరాలు - Dates for anemia in Telugu

అభివృద్ధి చెందుతున్న దేశాలలో రక్తహీనత మరియు తక్కువ హిమోగ్లోబిన్ వంటివి చాలా సాధారణ పరిస్థితులలో ఒకటి. వయస్సు, లైంగిక మరియు జీవనశైలి దానిపై ప్రభావం చూపుతుండగా, ఈ పరిస్థితికి ఐరన్ లోపం ప్రధాన కారణం. ఇది సాధారణంగా అలసట, బలహీనత మరియు మగతనంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం వంటి ముప్పును కలిగి ఉండవచ్చు. ఐరన్ యొక్క సహజమైన మూలాధారంగా, ఇది రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు ఒక పరిపూర్ణమైన పథ్య సంబంధిత సప్లిమెంట్­గా పని చేస్తుంది..

ఈ రోజుల్లో ఐరన్ యొక్క అధిక స్థాయి రక్తహీనత కలిగిన రోగులలో ఈ ఖనిజలవణం స్వాభావికత లేకపోవడాన్ని సమతుల్యం చేస్తుంది. అదనంగా, దీని నిరంతర వాడకం వలన అలసట మరియు మందకొడితనం తగ్గిస్తూ శక్తి మరియు బలాన్ని పెంచుతుంది.

దంత క్షయం చికిత్స కోసం ఖర్జూరాలు - Dates for tooth decay in Telugu

ఖర్జూరాలు సహజంగా తీపిగా ఉంటాయి, ఇది పంటికి మంచిదేనా అని అనుకొంటారు. బాగుంది, శుభవార్త ఏమిటంటే, ఈ పండ్లు మీ పళ్ళు కోసం అద్భుతాలు చేయవచ్చు. ఇవి కాల్షియం, భాస్వరం మరియు ఫ్లోరైడ్­లను పుష్కలంగా కలిగి ఉంటాయి, వీటిలో కలిగి ఉన్న అన్ని అంశాలు దంత క్షయాన్ని నివారిస్తాయి మరియు అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం, ఫ్లోరైడ్, కాల్షియం మరియు భాస్వరం మీ దంతాలకు గట్టితనాన్ని ఇస్తాయి మరియు ఒక ప్రోటేక్టివ్ పొరను ఏర్పరుస్తాయి, ఇది ప్లేక్ ఏర్పడుటను తగ్గించడంలో మరియు మీ పంటి ఎనామెల్­ని అరిగిపోకుండా సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది.

అదనంగా, కాల్షియం మీ దవడ ఎముకలను బలవంతం చేస్తుంది మరియు మీ దంతాలను సరియైన స్థానంలో ఉండేలా సహాయపడుతుంది.

కాబట్టి, మీరు మీ తీపి వంటలలో కొన్ని ఖర్జూరాలతో సహజ తియ్యదనం కోసం కొంత అదనపు చక్కెరను చేర్చవచ్చు.

(ఇంకా చదవండి: దంతాలపై ఏర్పడే పొరకు కారణాలు)

ఖర్జూరాలు రక్తపోటును తగ్గిస్తాయి - Dates reduce blood pressure in Telugu

క్లినికల్ అధ్యయనాలు సూచించిన ప్రకారం ఖర్జూరాలు అధిక రక్తపోటు కలిగిన వ్యక్తులలో రక్తపోటును తగ్గిస్తాయి. ఇది కాల్షియం మరియు మెగ్నీషియం అనే రెండు ముఖ్యమైన ఖనిజ లవణాలను కలిగిఉన్నందున, ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచే బాధ్యతను కలిగి ఉంటుంది.

శరీరంలోని రక్తనాళాలను తటస్తీకరించడం ద్వారా మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది, శరీరంలోని సోడియం యొక్క హానికరమైన ప్రభావాలను తటస్తీకరించడం ద్వారా రక్తపోటును పొటాషియం తగ్గిస్తుంది.

అదనంగా, ఖర్జూరాల్లో సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవి కొన్ని హైపోటెన్సివ్ చర్య కలిగి ఉంటాయి.

(ఇంకా చదవండి: అధిక రక్తపోటు యొక్క చికిత్స)

చర్మానికి ఖర్జూరాల యొక్క ప్రయోజనాలు - Dates benefits for skin in Telugu

ఖర్జూరాల్లో అనేక పోషకాలు మరియు క్రియాశీలక సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

అవి చర్మానికి కలిగే చికాకు నివారిస్తాయి మరియు వివిధ చర్మ స్థితులను మెరుగుపరచే విటమిన్ బి కలిగి ఉంటాయి.

ఖర్జూరాలలో గల విటమిన్ సి రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడం మరియు చర్మం ఫైబ్రోబ్లాస్ట్­ల పెరుగుదలను మెరుగుపర్చడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. దీని అర్థం, మీ ముఖం మీద ఖర్జూరాల ముద్దను పూయడం ద్వారా మీరు వృద్ధాప్య సంకేతాలు మరియు ముడుతల లేకుడా చేయుటలో సహాయపడవచ్చు.

ఖర్జూర పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో ఖర్జూరాలు ప్రభావవంతంగా పని చేతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్లినికల్ అధ్యయనాల ప్రకారం ఖర్జూరపు చెట్టు గుజ్జు ఫైటోహార్మోన్లు (మొక్క ఆధారిత హార్మోన్లు) కలిగి ఉన్నట్లు సూచిస్తుంది, అది మీ చర్మం చక్కగా కనిపించేలా మరియు ముడుతలు లేకుండా నునుపుగా ఉండేలా చేస్తుంది. వాస్తవానికి, అది వృద్ధాప్య వ్యతిరేక చికిత్స వంటి గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు ఊహించడమైనది.

 • ఖర్జూరాలు ఫ్రూక్టోజ్­ని కలిగి ఉంటాయి, ఇది ఒక సహజమైన తీయదానాన్ని అందిస్తుంది. కొందరు వ్యక్తులలో ఫ్రక్టోజ్ అసహిష్టత కలిగిస్తుంది మరియు వారికి ఖర్జూరాలు జీర్ణించడం చాలా కష్టం అవుతుంది.
 • ఖర్జూరాల వలన హైపోగ్లైసిమియా  ఏర్పడవచ్చు. చక్కెర పూర్తిగా జీర్ణం కాకపోతే, అది పొత్తి కడుపు నొప్పి మరియు గ్యాస్ ప్రభావానికి దారితీస్తుంది.
 • పూర్తిగా పండిన ఖర్జూరం సుమారు 80% చక్కెర కలిగి ఉంటుంది. ఇది తన యంతటగా ఒక చెడు అంశం ఏమాత్రం కాదు మరియు వాస్తవానికి ఇది మంచి శక్తిని అందిస్తుంది. కానీ క్రియారహిత జీవనశైలి కలిగి ఉన్న వ్యక్తులకు, అధిక క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం వలన అవాంఛిత బరువు పెరుగుటకు దారి తీయవచ్చు. ఇది శరీరానికి అదనపు కేలరీలు జతచేస్తుంది. కాబట్టి ఇప్పటికే అధిక బరువు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఖర్జూరాలు తీసుకోరాదు.
 • ఖర్జూరాలలో అధిక సంఖ్యలో ఫైబర్స్ కలిగి ఉంటాయి. మీరు చాలా ఎక్కువగా ఖర్జూరాలను తీసుకొంటే, మీరు వివిధ కడుపు సంబంధిత సమస్యలను పొందవచ్చు.
 • కొందరు వ్యక్తులు సహజంగా ఖర్జూరాలు వలన అలెర్జీ కలిగి ఉంటారు.

ఖర్జూరాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి అధిక శక్తిని అందిస్తాయి. దాదాపుగా 10 ఖనిజ లవణాలను ఖర్జూరాలు కలిగి ఉంటాయి. అవి సహజమైన స్వీటెనర్ల మరియు వాటిని వైట్ షుగర్­కు బదులుగా వివిధ వంటకాలలో వాడుతారు. అయితే, కొంతమంది ఈ పండుకు అలెర్జీ కలిగి ఉంటారు. ఖర్జూరాలను అధికంగా తీసుకోన్న్నప్ప్పుడు మాత్రమే వాటి దుష్ప్రభావాలు మీకు ప్రభావితమవుతాయి


उत्पाद या दवाइयाँ जिनमें Date palm है

వనరులు

 1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09421, Dates, medjool. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. Ibrahim A. Alhaider et al. Date Palm (Phoenix dactylifera) Fruits as a Potential Cardioprotective Agent: The Role of Circulating Progenitor Cells. Front Pharmacol. 2017; 8: 592. PMID: 28928656
 3. Abdellaziz Souli et al. Effects of Dates Pulp Extract and Palm Sap (Phoenix dactylifera L.) on Gastrointestinal Transit Activity in Healthy Rats. J Med Food. 2014 Jul 1; 17(7): 782–786. PMID: 24611963
 4. H.A. Hajar Al Binali. Night Blindness and Ancient Remedy. Heart Views. 2014 Oct-Dec; 15(4): 136–139. PMID: 25774260
 5. Masoumeh Kordi. Effect of Dates in Late Pregnancy on the Duration of Labor in Nulliparous Women. Iran J Nurs Midwifery Res. 2017 Sep-Oct; 22(5): 383–387. PMID: 29033994
 6. Al-Kuran O et al. The effect of late pregnancy consumption of date fruit on labour and delivery. J Obstet Gynaecol. 2011;31(1):29-31. PMID: 21280989
 7. Selvaraju Subash et al. Diet rich in date palm fruits improves memory, learning and reduces beta amyloid in transgenic mouse model of Alzheimer's disease. J Ayurveda Integr Med. 2015 Apr-Jun; 6(2): 111–120. PMID: 26167001
 8. Noura Eid et al. The impact of date palm fruits and their component polyphenols, on gut microbial ecology, bacterial metabolites and colon cancer cell proliferation. J Nutr Sci. 2014; 3: e46. PMID: 26101614
 9. Eid N et al. Impact of palm date consumption on microbiota growth and large intestinal health: a randomised, controlled, cross-over, human intervention study. Br J Nutr. 2015 Oct 28;114(8):1226-36. PMID: 26428278
 10. Vayalil PK. Date fruits (Phoenix dactylifera Linn): an emerging medicinal food. Crit Rev Food Sci Nutr. 2012;52(3):249-71. PMID: 22214443
 11. Al-Farsi MA, Lee CY. Nutritional and functional properties of dates: a review. Crit Rev Food Sci Nutr. 2008 Nov;48(10):877-87. PMID: 18949591
 12. Taleb H et al. Chemical characterisation and the anti-inflammatory, anti-angiogenic and antibacterial properties of date fruit (Phoenix dactylifera L.). J Ethnopharmacol. 2016 Dec 24;194:457-468. PMID: 27729284
 13. Reem A. Al-Alawi et al. Date Palm Tree (Phoenix dactylifera L.): Natural Products and Therapeutic Options. Front Plant Sci. 2017; 8: 845. PMID: 28588600
 14. Al-Shahib W, Marshall RJ. The fruit of the date palm: its possible use as the best food for the future? Int J Food Sci Nutr. 2003 Jul;54(4):247-59. PMID: 12850886
 15. Mohammed I. Yasawy The unexpected truth about dates and hypoglycemia. J Family Community Med. 2016 May-Aug; 23(2): 115–118. PMID: 27186159
 16. David O. Kennedy. B Vitamins and the Brain: Mechanisms, Dose and Efficacy—A Review. Nutrients. 2016 Feb; 8(2): 68. PMID: 26828517
 17. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Anaemia.