భూమిపై అత్యంత ప్రాచుర్యం పొందిన, రుచికరమైన మరియు పోషక విలువలు కలిగిన పండ్లలో ఆపిల్ ఒకటి. ఈ ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఆహారంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు మరియు రహస్యం ఉంది. ఇది తియ్యని మరియు జ్యూసీ రుచితో ఒక సహజ దివ్యత్వాన్ని కలిగిఉంది. బహుశా ఈ సహజ దివ్యత్వం ఆదాము మరియు హవ్వలు ఈ కల్పిత పండులో జ్ఞానం ఉందని వారు ఆకర్షించబడుటకు కారణం కావచ్చు. ఆసక్తికరంగా, మాలస్ అనే పదం అనగా “ఆపిల్” లేదా “చెడు” అని అంటారు.   

మీకు తెలుసా?  

మాలస్ సీవెర్సీ, అనే ఆపిల్ యొక్క పూర్వీక అడవి జాతి రకం ఇప్పటికీ మధ్య ఆసియాలో కనబడుతుంది, ఇక్కడే ఆపిల్ పండ్లు పుట్టుకొచ్చాయని భావిస్తారు.   

ఆపిల్ పండ్లు వాటి చర్మంతో సహా తినదగినవి. 7500 రకాల కంటే ఎక్కువగా ఆపిల్ పండ్లు సేద్యం జరుగుతుందని తెలియజేయబడింది  మరియు ప్రతీ ఒక రకం విభిన్న ఉపయోగాలు కలిగిఉంది. ఎరుపు రంగు ఆపిల్ పండ్లు అధిక యాంటిఆక్సిడంట్లను కలిగిఉంటాయి, ఇవి వాటిని ఒక మంచి యాంటి-ఏజింగ్ పండుగా తయారుచేసాయి మరియు ఆకుపచ్చ, పసుపు ఆపిల్ పండ్లు క్వెర్సెటిన్‌ను సమృద్ధిగా కలిగిఉంటాయి, ఇవి ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మచ్చలు లేకుండ మరియు మృదువుగా కూడా ఆపిల్ తయారుచేస్తుందని తెలియజేయబడింది. అయితే, ఒకవేళ ఆపిల్ విత్తనాలను తింటే, అవి ప్రమాదకరమైనవిగా భావిస్తున్నారు.        

వాణిజ్యపరంగా ప్రాచుర్యం పొందిన ఆపిల్ రకాలు సాధారణంగా మృదువైనవి అయితే కరకరలాడే స్వభావం గలవి. వాటిలో కొన్నింటిని పచ్చిగా మరియు తాజాగా (భోజనంలో తినే ఆపిల్ పండ్లు) తినేందుకు సాగుచేస్తారు. అయితే వాటిలో కొన్నింటిని వంటకోసం సాగుచేస్తారు (వంటకు ఉపయోగించే ఆపిల్) మరియు పళ్ల రసం కోసం సాగుచేస్తారు.

చర్మం మరియు గుజ్జు, ఆంథోసియాని‌న్లు సమృద్ధిగా ఉండే ఒక గొప్ప వనరు మరియు టాని‌న్లు ఆపిల్‌లో  పోషకాలను ప్రధాన వనరుగా అందిస్తాయి. ఈ పండు విటమిన్లు, ఫైబర్, మరియు ఇతర పోషకాలతో నిండి ఉంటుంది, ఇవి అనేక వైద్య లక్షణాలతో ఈ పండును గొప్పదానిగా చేస్తాయి.   

కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఆపిల్ పండ్లను ఉపయోగిస్తారు మరియు ఇవి పళ్లకు మంచివి. వీటిని క్యా‌న్సర్ నివారణకు మరియు మధుమేహం నియంత్రణకు కూడా ఉపయోగిస్తారు.  

“రోజుకు ఒక ఆపిల్ పండు తీసుకుంటే, డాక్టరును దూరంగా ఉంచవచ్చు”, అని వారు చెప్పడంలో ఆశ్చర్యము లేదు.   

ఆపిల్ పండ్లను గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • వృక్ష శాస్త్రీయ నామం: మాలస్ డొమెస్టిక/ మాలస్ పుమిల
  • జాతి: రోసేసి
  • వ్యవహారిక నామం: ఆపిల్, సెబ్
  • సంస్కృత నామం: ఫలప్రభేదా
  • ఉపయోగించే భాగాలు: చర్మం, గుజ్జు
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా సాగుచేయబడుతుంది, చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. చైనా ప్రతీ సంవత్సరం సుమారు 44 మిలియన్ టన్నుల ఆపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో, కాశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్ యొక్క కొండ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మరియు మేఘాలయలో ఆపిల్ ఎక్కువగా పెరుగుతుంది.   
  • ఆసక్తికర అంశాలు: 3.7 లీటర్ల ఆపిల్ పండ్ల రసం ఉత్పత్తి చేసేందుకు 36 ఆపిల్ పండ్లను తీసుకోవలసి ఉంటుంది, ఇది ఒక ప్రాచుర్యమైన మరియు ఆరోగ్యకరమైన వెనిగర్ రకం. 
  1. ఆపిల్ పోషక విలువలు - Apple nutrition facts in Telugu
  2. ఆపిల్ ఆరోగ్య ప్రయోజనాలు - Apple health benefits in Telugu
  3. ఆపిల్ దుష్ప్రభావాలు - Apple side effects in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

ఆరోగ్యకరమైన పండ్లలో ఆపిల్ ఒకటిగా పరిగణించబడుతుంది. ఆపిల్‌లో 86% నీటి చేత తయారు చేయబడి ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటి వివిధ రకాల ఖనిజాలను కూడా ఇవి కలిగిఉంటాయి. ఆపిల్ పండ్లు విటమిన్ ఎ, సి మరియు కె లను సమృద్ధిగా  కలిగిఉంటాయి మరియు అవి అతి తక్కువ మొత్తంలో కొవ్వును కలిగిఉంటాయి.

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ఆధారంగా, 100 గ్రా. ఆపిల్ పండ్లు క్రింది విలువలను కలిగిఉంటాయి:

పోషక పదార్థం 100 గ్రా.ల్లో వాటి విలువ
నీరు 85.56 గ్రా.
శక్తి 52 కి.కేలరీలు
ప్రొటీన్ 0.26 గ్రా.
కొవ్వు 0.17 గ్రా.
కార్బోహైడ్రేట్ 13.81 గ్రా.
ఫైబర్ 2.4 గ్రా.
చక్కెరలు 10.39 గ్రా.
ఖనిజాలు  
క్యాల్షియం 6 మి.గ్రా.
ఇనుము 0.12 మి.గ్రా.
మెగ్నీషియం 5 మి.గ్రా.
ఫాస్ఫరస్ 11 మి.గ్రా.
పొటాషియం 107 మి.గ్రా.
సోడియం 1 మి.గ్రా.
జింక్ 0.04 మి.గ్రా.
విటమిన్లు  
విటమిన్ ఎ 3 µగ్రా.
విటమిన్ బి1 0.017 మి.గ్రా.
విటమిన్ బి2 0.026 మి.గ్రా.
విటమిన్ బి3 0.091 మి.గ్రా.
విటమిన్ బి6 0.041 మి.గ్రా.
విటమిన్ బి9 3 µగ్రా.
విటమిన్ సి 4.6 మి.గ్రా.
విటమిన్ 0.18 మి.గ్రా.
విటమిన్ కె 2.2 µగ్రా.
కొవ్వులు/ కొవ్వు ఆమ్లాలు  
సంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.028 గ్రా.
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.007 గ్రా.
బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 0.051 గ్రా.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

ఆపిల్స్ అధిక-పోషకాలు కలిగిన పండ్లు, మీ ఆరోగ్యానికి సంబంధించి అనేక ప్రయోజనాలు ఇవి కలిగిఉన్నాయి. నోటి ఆరోగ్యం మెరుగుపర్చడం మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఆపిల్ తొక్కలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ అన్నది కడుపు సమస్యలు మరియు బరువు తగ్గడానికి సంబంధించి దీనిని ఒక అద్భుతమైన ఔషధంగా చేస్తుంది. ఆపిల్ పండ్ల యొక్క శాస్త్రీయంగా నిరూపించబడిన ఆరోగ్య ప్రయోజనాలు కొన్నింటిని మనం అన్వేషిద్దాం.      

  • గుండెకు మంచిది:  హైపోకొలెస్టెరోలెమిక్ (కొలెస్ట్రాల్‌ను తగ్గించుట) మరియు యాంటిఆక్సిడంట్ లక్షణాలను ఆపిల్ ప్రదర్శిస్తుంది, ఇవి గుండె ఆరోగ్యానికి అనుకూలమైనవి. ఇది హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా ఇవి ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి మరియు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
  • నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:  హానికరమైన నోటి బ్యాక్టీరియాను చంపే యాంటిబ్యాక్టీరియల్ సమ్మేళనాలతో ఆపిల్ పండ్లు నింపబడి ఉంటాయి. రోజూ ఆపిల్ పండ్లను తినడం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఇది దంత ఫలక మరియు దంతక్షయం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.  
  • మధుమేహం కోసం ప్రయోజనకరమైనది: ఆపిల్ పండ్ల యొక్క సాధారణ వినియోగం డయాబెటిస్ ప్రమాదం 18% వరకూ తగ్గేందుకు దారితీస్తుందని  2 లక్షల కంటే ఎక్కువమంది పాల్గొన్న అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆపిల్ పండ్లు బలమైన యాంటిఆక్సిడంట్ లక్షణాలను ప్రదర్శిస్తాయి, ఇవి క్లోమం‌లో బీటా కణాల పనితీరును మెరుగుపరుస్తాయి, ఇది మెరుగైన ఇ‌న్సులిన్ ఉత్పత్తికి దారితీసింది.
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఆపిల్ పండ్లు ఒక మంచి పరిమాణంలో పీచు పదార్థాన్ని కలిగిఉంటాయి, ఇది ప్రేగు కదలికలను నియంత్రించేందుకు మరియు మలబద్ధకం నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇవి యాంటి‌ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలను కూడా కలిగిఉంటుంది, ఇవి ప్రేగు యొక్క శోథ పరిస్థితిని మెరుపరిచేందుకు చేసే చికిత్సలైన ఇన్‌ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ వంటి వాటికి సహాయపడుతుంది.   
  • బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది: క్లినికల్ అధ్యయనాల ద్వారా నిరూపించబడిన విధంగా, ఆపిల్ పాలీఫినాల్స్ అన్నవి వ్యతిరేక స్థూలకాయ ప్రభావాల్ని ప్రదర్శిస్తాయి. తక్కువ శక్తి సాంద్రత కారణంగా, బిఎమ్ఐ మరియు మొత్తం శరీర బరువును ఇవి తగ్గిస్తాయని కనుగొనబడింది.    
  • యాంటి-ఏజింగ్: యాంటిఆక్సిడంట్ల యొక్క ఆయుథాగారాన్ని కలిగిఉన్నందువల్ల, ఉత్తమ యాంటి-వృద్ధాప్య ఆహారాలలో ఆపిల్ పండ్లు ఒకటి. ఇవి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు నల్లని మచ్చలు మరియు ముడుతలు వంటి చర్మ వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి

నోటి ఆరోగ్యానికి యాపిల్స్ - Apples for oral health in Telugu

తక్కువ నోటి పరిశుభ్రత చెడు శ్వాసకు దారితీస్తుంది మరియు చిగుళ్ల నొప్పి , దంత క్షయం వంటి నోటి వ్యాధులకు దారితీస్తుంది. నోటి పరిశుభ్రతకు ఆపిల్ పండ్లు సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆపిల్ పండ్ల యొక్క వినియోగం లాలాజలం‌లో ఉండే బ్యాక్టీరియా క్షీణతకు దారితీస్తుందని 20 విషయాలపై చేసిన ఒక అధ్యయనం చూపించింది. ఈ ప్రభావం అన్నది పళ్లు తోముకోవడం తర్వాత కనిపించే ప్రభావంతో పోలి ఉంటుంది.    

మరొక అధ్యయనం ప్రకారం, ఎక్కువ ఆపిల్ పండ్లను తీసుకునే ప్రజల్లో, నోటి క్యా‌న్సర్ పొందే ప్రమాదం తక్కువగా ఉందని తెలుపబడింది.  ఆపిల్ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్ల యొక్క ఉనికి దీనికి కారణం. ఇంకా, ఆపిల్ పండ్ల యొక్క యాంటిఆక్సిడంట్ లక్షణాలు చిగుళ్ల వ్యాధి నివారణకు సహాయపడతాయి.   

ఆపిల్ ‌లో ఉండే క్వెర్సెటిన్, దంతాల ఉపరితలంలో ఉండే బ్యాక్టీరియా యొక్క సంశ్లేషణను నిరోధిస్తుందని ప్రయోగశాల ఆధారిత అధ్యయనాలు వెల్లడించాయి, అది దంతక్షయాల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

గుండె కోసం ఆపిల్ ప్రయోజనాలు - Apple benefits for heart in Telugu

గుండె రక్త నాళాల వ్యాధి (సివిడి) అన్నది రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది, ఇది గుండె మరియు రక్త నాళాల్ని ప్రభావితం చేస్తుంది. సాధారణ సివిడిలు హృదయ ధమని వ్యాధి, గుండెపోటు, గుండె స్థంభన మరియు పరిధీయ ధమని వ్యాధులను కలిగిఉంటాయి. ఆపిల్ పండ్ల యొక్క వినియోగం సివిడిల యొక్క ప్రమాదాన్ని తగ్గించడం‌లో సహాయం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆపిల్ పండ్లలో ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి మరియు ఫ్లేవనాయిడ్ల యొక్క సాధారణ వినియోగం ద్వారా 35% శాతం గుండె రక్త నాళాల వ్యాధులలో తగ్గుదల ఉందని 40000 కంటే ఎక్కువమంది స్త్రీల పైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం చూపించింది. ఒక పూర్వ అధ్యయనం‌లో, ఆపిల్ కాటెచి‌‌న్స్ గుండె ఆరోగ్యంతో మంచి సహసంబంధం కలిగిఉన్నట్లు కనుగొనబడ్డాయి.  

ఆపిల్‌ తొక్కలో ఉండే పాలిఫెనా‌ల్స్ యాంటిఆక్సిడంట్ మరియు కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలు కలిగిఉన్నాయని మరొక అధ్యయనం సూచించింది, ఇవి హృదయ వ్యాధుల నివారణలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటాయి.

(మరింత చదవండి: గుండె వ్యాధి నివారణ

కొలెస్ట్రాల్ కోసం ఆపిల్ - Apple for cholesterol in Telugu

కొలెస్ట్రాల్ అన్నది శరీరం ద్వారా సహజంగా ఉత్పత్తి చేయబడే ఒక మైనపు పదార్థం. ఇది ఆహారాల ద్వారా కూడా శరీరం చేత గ్రహించబడుతుంది మరియు వివిధ జీవక్రియ విధులకు ఇది అవసరమవుతుంది. అయితే, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, ఎథెరోస్క్లెరోసిస్, స్థూలకాయం మరియు గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధ్యయనం ప్రకారం, ఆపిల్ వినియోగం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలపై సానుకూల ప్రభావం కలిగిఉంటుంది.  

ఆపిల్ సప్లిమెంటేషన్ అన్నది ప్లాస్మా కొలెస్ట్రాల్ స్థాయి మరియు మొత్తం కాలేయ కొలెస్ట్రాల్ తగ్గింపుకు దారితీస్తుందని ఒక ప్రిక్లినికల్ అధ్యయనం నివేదిక ఇచ్చింది. హెచ్‌డి‌ఎల్ స్థాయిలో పెరుగుదల మరియు ఆహారం నుండి కొలెస్ట్రాల్‌‌ను తక్కువగా గ్రహించుటకు కూడా దారితీస్తుంది. ఆపిల్‌లోని పెక్టిన్ మరియు ఇతర ఫినోలిక్ సమ్మేళనాల ఉనికి కారణంగా ఈ కొలెస్ట్రాల్‌-తగ్గుదల ప్రభావం వీటికి ఆపాదించబడింది.   

అదనంగా, యాపిల్‌లో ఉండే ఫైబర్లు ఒక శక్తివంతమైన హైపోలిపిడెమిక్ (లిపిడ్ల తగ్గుదల)  ప్రభావాలు ప్రదర్శిస్తాయని కూడా కనుగొనబడింది.  

డయాబెటిస్ కోసం ఆపిల్ - Apple for diabetes in Telugu

డయాబెటిస్ అన్నది రక్తం‌లోని గ్లూకోజ్ స్థాయిల ద్వారా గుర్తించబడిన ఒక పరిస్థితి. అత్యంత సాధారణ డయాబెటిస్ రకం అన్నది టైప్ 2 డయాబెటిస్. శరీరం ఇ‌న్సులిన్‌ను సరిగా ఉపయోగించలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆపిల్ వినియోగం మరియు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం మధ్య విలోమ సంబంధం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆపిల్ యొక్క సాధారణ వినియోగం అన్నది టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడంలో 18% ప్రమాదాన్ని తగ్గిస్తుందని 2 లక్షల కంటే ఎక్కువమంది పైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం వెల్లడించింది.    

యాపిల్‌లోని కాటెచి‌న్స్ అన్నవి డయాబెటిస్ కు వ్యతిరేకంగా రక్షణ ప్రభావాలను కలిగిఉంటాయని తర్వాత సూచించబడింది, ఇవి ఒక యాంటిఆక్సిడంట్ ప్రభావం ద్వారా మధ్యస్తంగా ఉండవచ్చు. ఈ యాంటిఆక్సిడంట్లు కణజాల నష్టాన్ని రివర్స్ చేస్తాయి, ఇది, క్రమంగా బీటా కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. బీటా కణాలు క్లోమం‌లో ఉంటాయి మరియు ఇ‌న్సులిన్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తాయి.    

యాపిల్ యాంటిక్యా‌న్సర్ లక్షణాలు - Apple anticancer properties in Telugu

ఆపిల్ పండ్లు కీమోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగిఉన్నాయని అనేక భాగాలుగా జరిగిన పరిశోధనలు తెలియజేసాయి. ఆపిల్ పండ్ల తొక్కలు క్యాన్సర్ కణాల పెరుగుదలను మరియు మనుగడను నిరోధిస్తాయని, మానవ ప్రొస్టేట్ క్యా‌న్సర్ మరియు రొమ్ము క్యా‌న్సర్ పైన జరిగిన అధ్యయనం సూచిస్తుంది. ఆపిల్ తొక్కలు మాస్పిన్ పెరుగుదలకు కూడా దారితీస్తాయి, ఇది ఒక రకమైన ప్రొటీన్, క్యా‌న్సర్ శరీరం‌లోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఇది నిరోధిస్తుంది.   

ఒక రివ్యూ వ్యాసం ప్రకారం, ఆపిల్ పండ్లు ఓలిగోమెరిక్ ప్రొసైప్రొసైనిడిన్‌లతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి క్యా‌న్సర్ కణాల పెరుగుదల మరియు వ్యాప్తిని నివారించగల సామర్థ్యాన్ని కలిగిఉంటాయి. ఇవి క్యా‌న్సర్ కణాల మరణానికి కూడా కారణమవుతాయి (అపోప్టొసిస్).

అంతేగాక, ఆపిల్ తొక్కలు అనేక రకాల ట్రైటెర్పెనాయిడ్లను కలిగిఉంటాయి, ఇవి ఆపిల్ పండ్ల యొక్క క్యా‌న్సర్ నిరోధక లక్షణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా కనుగొనబడింది.  

శ్వాస వ్యవస్థకు సంబంధించి ఆపిల్ ప్రయోజనాలు - Apple benefits for respiratory system in Telugu

పొగత్రాగేవారు లేదా కలుషిత నగరాల్లో నివసించే వారిలో ఊపిరితిత్తుల వ్యాధులు చాలా సాధారణమైనవి. అధ్యయనాల ప్రకారం, ఆపిల్ వినియోగం ఊపిరితిత్తులకు ప్రయోజనకరమైనది. ఆపిల్‌లో ఉండే విటమిన్ సి మరియు ఇ, మరియు రెండూ కూడా ఊపిరితిత్తుల పనితీరులో మెరుగుదలకు దారితీస్తాయని 2500  కంటే ఎక్కువైన అంశాల పైన జరిగిన ఒక అధ్యయనం వెల్లడిపరిచింది.    

ఆపిల్ పండ్ల యొక్క వినియోగం పొగత్రాగడం ఆపివేసిన వ్యక్తుల యొక్క ఊపిరితిత్తుల పనితీరును పునరిద్ధరించేందుకు సహాయపడుతుందని మరొక అధ్యయనం సూచించింది. ఈ పునరుద్దరణ అన్నది ఆపిల్ పండ్లలో ఉండే క్వెర్సిటిన్ మరియు క్యాటెచిన్ వంటి కొన్ని సమ్మేళనాల యొక్క ఉనికి ద్వారా జరుగుతుందని ఆపాదించబడింది. ఈ సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యా‌న్సర్ నివారణలో కూడా ప్రభావం  చూపిస్తాయి

కడుపుకోసం ఆపిల్ ప్రయోజనాలు - Apple benefits for stomach in Telugu

జీర్ణవ్యవస్థ మనం తినే ఆహార పదార్థాలను ప్రాసెస్ చేసే బాధ్యతను వహిస్తుంది మరియు ఇది శరీరం ద్వారా పోషకాల శోషణకు దోహదం చేస్తుంది. అనారోగ్య జీవనశైలి మరియు ఫాస్ట్ ఫుడ్స్ యొక్క క్రమమైన వినియోగం అన్నది అతిసారంఇర్రిటబుల్ బవల్ సిండ్రో‌మ్ (ఐబిఎస్), మలబద్ధకం మరియు కడుపునొప్పి వంటి వివిధ జీర్ణసమస్యలకు దారితీస్తుంది.    

పరిశోధన ప్రకారం, ఎండిన ఆపిల్ తొక్క పొడిలోని పాలీఫినాల్స్ కడుపులో మంటను నివారించేందుకు సహాయపడతాయి. ఎండిన ఆపిల్ తొక్క పొడిలోని పాలీఫినాల్స్ బలమైన యాంటిఆక్సిడంట్ మరియు యాంటి‌ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శిస్తాయని జంతు నమూనాలపై చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది, ఇది ఇన్‌ఫ్లమేటరీ ప్రోస్టాగ్లాండి‌న్స్ వ్యక్తీకరణను నిరోధిస్తుంది మరియు ప్రేగులలో కణాల నష్టం తగ్గించేందుకు సహాయపడింది. ఈ ఫలితం ఐబిఎస్ చికిత్సలో ఆపిల్ యొక్క పొటెన్షియల్ ఉపయోగాన్ని సూచిస్తుంది.  

ఆపిల్ ‌లో ఉండే యాంటిఆక్సిడంట్ ఫాలీఫినాల్స్ వల్ల ఏర్పడే ఆపిల్ యొక్క గ్యాస్ట్రోప్రొటెక్టివ్ చర్యను ఇన్ విట్రో  మరియు ఇన్ వివో   (జంతు-ఆధారిత) అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి.  

అదనంగా, ఆపిల్ ఫైబర్‌‌ యొక్క ఒక మంచి వనరుగా ఉంది, ఇది మలం ఎక్కువగా ఏర్పడుటను పెంచుతుందని తెలియజేయబడింది మరియు పెద్ద ప్రేగు రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, అందువల్ల మలబద్ధకం నివారణ అవుతుంది. ఈ చర్య ఇతర ఫైబర్-అధికంగా ఉండే పండ్లలో లేదా గోధుమ ఊకలో అంత చెప్పబడినంతగా లేకపోయినప్పటికీ, ఇది గణనీయంగా ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది.    

(మరింత చదవండి: జీర్ణక్రియను మెరుగుపరచడం ఎలా)

చర్మ కోసం ఆపిల్ ప్రయోజనాలు - Apple benefits for skin in Telugu

వివిధ చర్మ రకాల కోసం మొత్తం మార్కెట్ చర్మ సంరక్షణ ఉత్పత్తులకు కేటాయించబడింది. అయితే, ఒకవేళ మీరు సహజ ప్రత్యామ్నాయం కలిగిఉంటే, అది చౌకగానే కాకుండా సులభంగా లభ్యమవుతుంది.   ఆపిల్ పండ్లు విటమిన్ సి మరియు పాలీఫినాల్స్‌ లను సమృద్ధిగా కలిగిఉంటాయి, అవి యాంటిఆక్సిడంట్ లక్షణాలను కలిగిఉంటాయి. ఈ సమ్మేళనాలు వృద్దాప్య చర్మం ఏర్పడకుండా నివారించేందుకు సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అదనంగా, ఇది వివిధ ఆరోగ్య నిర్మాణ పోషకాలను కలిగిఉంటుంది. దీని అర్థం ఏమిటంటే ఇది ముడుతలు మరియు నల్ల మచ్చలను తగ్గించడం మాత్రమే కాకుండా మీరు ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం పొందడానికి సహాయపడుతుంది. ఇది ఎవరికి అవసరముండదు ?       

(మరింత చదవండి: యాంటిఆక్సిడంట్ ఆహార వనరులు

బరువు తగ్గడం కోసం ఆపిల్ - Apple for weight loss in Telugu

ఎవరైతే శారీరక శ్రమ కలిగిఉండరో లేదా ఎవరు అధికంగా తింటారో అటువంటి ప్రజలకు ఊబకాయం అన్నది ఒక సాధారణ సమస్య. దీర్ఘకాలం‌లో, ఊబకాయం గుండె సమస్యలకు, అధిక రక్తపోటు మరియు మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి, శరీర బరువును నిర్వహించడం చాలా అవసరం. ఆపిల్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం, ఆ అదనపు పౌండ్లను తొలగించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆపిల్ పండ్ల యొక్క తక్కువ శక్తి సాంద్రత కారణంగా రోజుకు మూడు ఆపిల్ పండ్లను తినడం బరువు తగ్గడానికి దారితీస్తుందని 411 అంశాల పైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం తెలియజేసింది.      

అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం, ఆపిల్ పాలీఫినాల్స్ యాంటి-ఒబెసిటీ లక్షణాలను కలిగిఉంటాయి. కొవ్వు కణజాలంలోని సెల్యులర్ జీవక్రియతో జోక్యం మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఇవి ప్రాథమికంగా మధ్యస్తంగా ఉంటాయి. ఆపిల్ పండ్ల యొక్క క్రమమైన్ వినియోగం పైన ఆధారపడి మొత్తం శరీర బరువు మరియు శరీర ద్రవ్యరాశి సూచికలో గణనీయమైన తగ్గింపు ఉందని కొన్ని ప్రిక్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాలు కూడా నివేదిక ద్వారా తెలియజేసాయి. అయితే, తగిన మోతాదును కనుగొనేందుకు మరియు ఈ పండు నుండి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన నిర్వహణ ఫ్రీక్వె‌న్సీని కనుగొనేందుకు ఎక్కువ అధ్యయనాలు అవసరమవుతాయి.     

(మరింత చదవండి: బరువు తగ్గేందుకు ఆహార పట్టిక

ఈ అద్భుతమైన పండు విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలతో వచ్చినప్పటికీ, ఆపిల్ యొక్క అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దుష్ప్రభావాలు తక్కువగా మరియు అరుదుగా ఉన్నప్పటికీ, ఈ పండు నుండి గరిష్ట ప్రయోజనం పొందేందుకు, సమతుల్య ఆహారం‌తో ఆపిల్ పండ్ల యొక్క మితమైన వినియోగం సిఫార్స్ చేయబడింది. 

  • ఆపిల్ పండ్ల యొక్క సాగులో అధిక పురుగుమందుల వినియోగం అన్నది హానికరమైన రసాయనాలకు మనల్ని గురిచేస్తుంది. ఆపిల్ పండ్లను తినడానికి ముందుగా వాటి తోలును తీసివేయడం ప్రమాదాన్ని తొలగిస్తుంది. అయితే, ఆపిల్ పండ్ల యొక్క అధిక ఫైబర్ మరియు విటమిన్ కంటెంట్‌ను తొక్కలోనాయి కనుగొంటాము, ఆపిల్ పండ్ల నుండి తొక్కను తీసివేయడం వల్ల కొన్ని పోషక విలువల్లో రాజీపడవలసి ఉంటుంది. సేంద్రియ ఆపిల్ పండ్లను కొనుగోలు చేయడం ప్రమాదం నుండి తప్పించుకునే మరొక మార్గము.   
  • ఆపిల్ విత్తనాలు ఒక ముఖ్యమైన పరిమాణం‌లో టాక్సిజెనిక్ అమిగ్డాలిన్‌ను కలిగిఉంటాయి, సైనోజెనిక్ గ్లైకోసైడ్‌గా వర్గీకరించబడింది.అమిగ్డాలిన్ యొక్క దీర్ఘకాలిక వినియోగం ప్రమాదకరమైనదిగా భావిస్తారు మరియు జీవిలోని ప్రాథమిక శారీరకపరమైన విధులను భంగం చేస్తుంది మరియు కణాలు ప్రాణవాయువును ఉపయోగించుకోలేవు.     
  • పిల్లలలో ఆపిల్ పండ్ల రసం యొక్క వినియోగం పైన దీర్ఘకాలిక నిర్ధిష్టం-కాని అతిసారం (సిఎన్‌ఎస్‌డి) యొక్క కేసులు కొన్ని రిపోర్ట్ చేయబడ్డాయి.  
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

ఆపిల్ ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటి: ఇది వివిధ ఫ్లేవనాయిడ్లు మరియు పాలీఫినాల్స్‌ సమృద్ధిగా కలిగిఉంటుంది. ఆపిల్ పండ్లలో ఉండే క్వెర్సిటిన్ మరియు క్యాటెచిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉంటాయి. ఇవి బరువు తగ్గడం‌లో సహాయం చేస్తాయి, వీటి యాంటిఆక్సిడంట్ లక్షణాలు క్యా‌న్సర్ నివారణలో సహాయం చేస్తాయి. మధుమేహం నియంత్రణలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయం చేస్తుంది. ఆపిల్‌లో ఎటువంటి ప్రత్యేకమైన దుష్ప్రభావాలు లేవు. ఈ పండు యొక్క ఈ లక్షణాలు ప్రతీ ఒక్కరూ ఈ పండును ఎంపిక చేసుకునేలా చేసింది. 


Medicines / Products that contain Apple

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09003, Apples, raw, with skin (Includes foods for USDA's Food Distribution Program). National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Sesso HD, Gaziano JM, Liu S, Buring JE. Flavonoid intake and the risk of cardiovascular disease in women. Am J Clin Nutr. 2003 Jun;77(6):1400-8. PMID: 12791616
  3. Arts IC, Jacobs DR Jr, Harnack LJ, Gross M, Folsom AR. Dietary catechins in relation to coronary heart disease death among postmenopausal women. . Epidemiology. 2001 Nov;12(6):668-75. PMID: 11679795
  4. Guo XF, Yang B, Tang J, Jiang JJ, Li D. Apple and pear consumption and type 2 diabetes mellitus risk: a meta-analysis of prospective cohort studies. Food Funct. 2017 Mar 22;8(3):927-934. PMID: 28186516
  5. Dianne A. Hyson. A Comprehensive Review of Apples and Apple Components and Their Relationship to Human Health. Adv Nutr. 2011 Sep; 2(5): 408–420. PMID: 22332082
  6. Reagan-Shaw S, Eggert D, Mukhtar H, Ahmad N. Antiproliferative effects of apple peel extract against cancer cells. Nutr Cancer. 2010;62(4):517-24. PMID: 20432173
  7. Gerhauser C. Cancer chemopreventive potential of apples, apple juice, and apple components. Planta Med. 2008 Oct;74(13):1608-24. PMID: 18855307
  8. He X, Liu RH. Triterpenoids isolated from apple peels have potent antiproliferative activity and may be partially responsible for apple's anticancer activity. J Agric Food Chem. 2007 May 30;55(11):4366-70. Epub 2007 May 8. PMID: 17488026
  9. Butland BK, Fehily AM, Elwood PC. Diet, lung function, and lung function decline in a cohort of 2512 middle aged men. Butland BK1, Fehily AM, Elwood PC. PMID: 10639525
  10. Jeanelle Boyer, Rui Hai Liu. Apple phytochemicals and their health benefits. Nutr J. 2004; 3: 5. PMID: 15140261
  11. G Graziani et al. Apple polyphenol extracts prevent damage to human gastric epithelial cells in vitro and to rat gastric mucosa in vivo. Gut. 2005 Feb; 54(2): 193–200. PMID: 15647180
  12. Vanessa Palermo et al. Apple Can Act as Anti-Aging on Yeast Cells. Oxid Med Cell Longev. 2012; 2012: 491759. PMID: 22970337
  13. Conceição de Oliveira M, Sichieri R, Sanchez Moura A. Weight loss associated with a daily intake of three apples or three pears among overweight women. Nutrition. 2003 Mar;19(3):253-6. PMID: 12620529
  14. Asgary S, Rastqar A, Keshvari M. Weight Loss Associated With Consumption of Apples: A Review. J Am Coll Nutr. 2018 Sep-Oct;37(7):627-639. PMID: 29630462
  15. Hyams JS, Leichtner AM. Apple juice. An unappreciated cause of chronic diarrhea. Am J Dis Child. 1985 May;139(5):503-5. PMID: 3984976
  16. Bolarinwa IF, Orfila C, Morgan MR. Determination of amygdalin in apple seeds, fresh apples and processed apple juices. Food Chem. 2015 Mar 1;170:437-42. PMID: 25306368
Read on app