• తె
 • తె

తేనె అందరి వంటగదులలో తప్పకుండా ఉండే పదార్థాలలో ఒకటి. మానవుల ఆరోగ్యంలో తేనె మరియు నీటి యొక్క ప్రయోజనాలు అపారమైనవి. చర్మ ఆరోగ్యంలో తేనె యొక్క ప్రయోజనాల గురించి లేదా ఉదయం వేళా వేడినీటి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ వినేవుంటారు. అయితే రెండు, కలిసి, శరీరంలో (శరీర ఆరోగ్యంలో) అద్భుతాలను కలిగిస్తాయి, ప్రత్యేకించి అదనపు బరువును తొలగించడంలో.

నీరుని జీవితానికి అమృతం అని అంటారు మరియు ఆరోగ్య విషయంలో తేనె  యొక్క అద్భుతమైన ప్రభావాలు కోసం ప్రాచీన కాలం నుండి దానిని ఉపయోగిస్తున్నారు. తేనె, వేదిక నాగరికతలో మానవాళికి దొరికిన అత్యంత ముఖ్యమైన బహుమతులలో ఒకటిగా పరిగణించబడింది. ఆయుర్వేద గ్రంథాలు తేనెను 'మాధూ' అని ఉదాహరిస్తాయి మరియు శరీరంలో 'కల్ప దోష' పెరుగుదలను తగ్గించడంలో దాని పాత్రను సూచిస్తాయి. తేనె ఒక్కటే ఒక ఔషధంగా పరిగణించబడుతుంది మరియు అనేక మూలికా సూత్రీకరణలలో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది.

రోజూ, తేనె మరియు నీటిని సరైన నిష్పత్తిలో కలిపి, వినియోగించినప్పుడు, అది సమర్థవంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ వ్యాసంలో తేనె మరియు నీటిని కలిపి తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చర్చించబడ్డాయి.

 1. తేనె నీటి ఆరోగ్య ప్రయోజనాలు - Benefits of honey water in Telugu
 2. తేనె మరియు వెచ్చని నీటిని ఎలా తీసుకోవాలి - How to take honey and warm water in Telugu
 3. తేనె మరియు వెచ్చని నీటిని ఎప్పుడు తీసుకోవాలి - When to take honey and warm water in Telugu
 4. తేనె మరియు వేడి నీటి దుష్ప్రభావాలు - Side effects of honey and warm water in Telugu

తేనె అనేక ఖనిజాలు మరియు పోషకాలకు గొప్ప వనరు, అవి ఆరోగ్యంపై ప్రభావకరమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. తేనె మరియు నీటి యొక్క అనేక ప్రయోజనాలు ఈ క్రింద చర్చించబడ్డాయి.

 • బరువు తగ్గుదల కోసం: తేనెలో ఉండే అనేక బయోఆక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో జీవక్రియ (మెటబాలిజం) వేగవంతం అవుతుంది. ఇది కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది మరియు అనారోగ్యకరమైన ఆహారం కోసం కలిగే కోరికలను తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గడంతో సహాయపడుతుంది.
 • జీర్ణం కోసం: తేనె మరియు వెచ్చని నీటి వినియోగం జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తుంది. తేనెలో ఉండే అనేక ఎంజైమ్లు మంచి శోషణకు (absorption) సహాయపడతాయి అలాగే అవి కార్భోహైడ్రాట్ల మరియు చెక్కెరల వేగవంతమైన జీర్ణానికి కూడా సహాయపడతాయి. అలాగే ప్రేగులలో మంచి బాక్టీరియా సంఖ్యను కూడా తేనె పెంచుతుంది.  
 • చర్మం కోసం: తేనెలో నైట్రిక్ ఆక్సైడ్ మెటాబోలైట్స్ వంటి బయోఆక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి అవి చర్మ సౌందర్యానికి సహాయపడతాయి మరియు కొన్ని చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 • నోటి ఆరోగ్యం కోసం: తేనెకు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు ఉంటాయి అవి దంత సమస్యలను తగ్గిస్తాయి. తేనె యొక్క యాంటీ బాక్టీరియల్ పిరియోడొంటైటిస్, స్టోమటైటిస్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పనిచేస్తాయి మరియు చెడు శ్వాసను కూడా కలిగిస్తాయి.
 • గ్యాస్ట్రోఎంటిరైటిస్ కోసం: వీరేచనలు, వాంతులు, వికారం మరియు కడుపు తిమ్మిరి వంటి  గ్యాస్ట్రోఎంటిరైటిస్ లక్షణాలు తగ్గించడంలో తేనె చాలా సమర్థవంతంగా పని చేస్తుంది.  
 • పెప్టిక్ అల్సర్ల కోసం: కడుపులో పూతలు లేదా పెప్టిక్ అల్సర్లు ముఖ్యంగా హెచ్.పైలోరి అనే బాక్టీరియా వలన కలుగుతాయి. తేనెకు ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఈ బాక్టీరియా పై వ్యతిరేకంగా పనిచేసి, కడుపులో పూతలను తగ్గిస్తాయి.
 • క్యాన్సర్ కోసం: రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, మరియు పెద్దప్రేగు కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్లను నివారించడంలో తేనె కలిపిన వేడి నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచించించాయి. తేనెలో ఉండే వివిధ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

గొంతు సంక్రమణ కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for throat infection in Telugu

ఒక గొంతు యొక్క సమస్య, దానిని ఫారింజైటిస్ అని కూడా పిలుస్తారు, ఇది స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియా వలన కలిగే తీవ్రమైన వ్యాధి. ఈ బాక్టీరియాతో పాటుగా, అనేక రకాల వైరస్లు, ఫంగస్లు మరియు రసాయనిక కాలుష్య కారకాలు వంటి చికాకు కలిగించే పదార్దాలు కూడా గొంతు మంట/నొప్పిను కలిగించవచ్చు.

గొంతు నొప్పికి చికిత్స కోసం తేనె కలిపిన వేడి నీటిని త్రాగవచ్చు లేదా పుక్కిలించవచ్చు. తేనె యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటివైరల్, మరియు యాంటీ ఫంగల్ చర్యలను కలిగి ఉంటుంది.ఇది  గొంతు లోపలి పొరపై పూతను ఏర్పరుస్తుంది మరియు హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది అలాగే వెంటనే గొంతు నొప్పి ఉపశమన అనుభూతిని కలిగిస్తుంది.

తేనె మరియు వెచ్చని నీటి వినియోగం దగ్గు కోసం ఉపయోగించే ఇతర చికిత్సల కంటే మెరుగైనదని ఒక సర్వే గుర్తించింది, అది ప్రత్యేకించి ఎగువ శ్వాసకోశ మార్గ సంక్రమణల కారణంగా సంభవించిన దగ్గుకు  బాగా ఉపశమనం కలిగిస్తుంది.

తేనె యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీమైక్రోబియల్ లక్షణాలు నిరంతర దగ్గును తగ్గించడంలో సహాయం చేస్తాయి మరియు పిల్లలు మరియు పెద్దలకు నిద్ర వచ్చేలా చేస్తుంది.

The doctors of myUpchar after many years of research have created myUpchar Ayurveda Medarodh Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for weight loss with great results.

క్యాన్సర్ కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for cancer in Telugu

రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, మరియు పెద్దప్రేగు కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్లను నివారించడంలో తేనె కలిపిన వేడి నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచించించాయి. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి మరియు వ్యాప్తి గల ఒక ముఖ్యమైన కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలలో అసంతుల్యత.

తేనెకు ఈస్ట్రోజెనిక్ తక్కువ సాంద్రతలో ఉన్నపుడు యాంటీఈస్ట్రోజెనిక్ ప్రభావం మరియు అధిక సాంద్రతతో ఉన్నపుడు ఈస్ట్రోజెనిక్ ప్రభావం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

అంతేకాకుండా, తేనె రొమ్ము క్యాన్సర్ కణాల పట్ల అత్యంత స్పష్టంగా ఉంటుంది మరియు నిర్దిష్టమైన సైటోటాక్సిక్ ప్రభావాలను చూపిస్తుంది మరియు దీనిని మంచి కెమోథెరపీ ఏజెంట్ సామర్థ్యాలు ఉన్నాయి.

కాలేయ క్యాన్సర్ను రియాక్టివ్ ఆక్సిజెన్ స్పీసీస్ చాలా తీవ్రతరం చేస్తాయి. తేనె యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలను వాటిని న్యూట్రలైజ్ చెయ్యడంలో సహాయపడతాయి, ఇది వ్యాధి యొక్క సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్లు ఎక్కువగా పెద్దప్రేగు లేదా పురీషనాళం యొక్క వాపుతో ప్రారంభమవుతాయి. క్యాన్సర్ కణాల అభివృద్ధి మరియు వ్యాప్తిని తేనె నిరోధిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెచ్చని నీటితో తేనెను కలిపి తీసుకోవడం వలన పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు.

గుండె కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for the heart in Telugu

వెచ్చని నీటితో తేనె కలిపి తీసుకోవడం వలన  హృదయ సంబంధ వ్యాధులతో ముడిపడి ఉండే ప్రమాద కారకాల యొక్క గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఫ్లవానాయిడ్స్ వంటి బయోఆక్టివ్  సమ్మేళనాలు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను (LDL) తగ్గిస్తాయి మరియు అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను (HDL) పెంచుతాయి, అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు గుండె పనితీరుకు ఉపయోగకరంగా ఉంటాయి.

హైపెర్లిపిడిమియా ఉన్న రోగులపై నిర్వహించిన క్లినికల్ అధ్యయనంలో, తేనె మరియు వెచ్చని నీటి తీసుకోవడం వలన వారిలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు (total cholesterol levels) తగ్గిపోయాయని తేలింది. తేనెలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక మెటాబోలైట్ కార్డియోప్రొటెక్టివ్ చర్యలను కలిగి ఉంటుంది. అందువలన, వెచ్చని నీరు మరియు తేనె ఆరోగ్యకరమైన గుండె కోసం సిఫార్సు చేయబడింది.

(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

మధుమేహం కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for diabetes in Telugu

వినడానికి అసాధారణముగా ఉన్నప్పటికీ, తేనె రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. తేనెలో ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ చక్కెరలు సమాన నిష్పత్తిలో ఉంటాయి, అందువలన  ఇది రక్త చెక్కెర స్థాయిలను నిర్వహిచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా ఇది ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నవారిలో ప్రభావంతంగా ఉంటుంది. తేనె కాలేయ కణాల్లో తగినంత గ్లైకోజెన్ నిల్వను అందిస్తుంది. కాలేయంలో తగినంత గ్లైకోజెన్ నిల్వ లేకపోవడం వలన అది స్ట్రెస్ (ఒత్తిడి) హార్మోలను విడుదల చేసి గ్లోకోజ్ జీవక్రియ ప్రభావితమయ్యేలా చేస్తుంది. సరిలేని (నియంత్రణ లేని) గ్లూకోస్ జీవక్రియ ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) ను అభివృద్ధి చేస్తుంది మరియు ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన కారకం.

వెచ్చని నీటితో తేనెను కలిపి నియంత్రిత మోతాదులో తీసుకున్న రోగులలో రక్తంలో గ్లూకోస్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించిందని అధ్యయనాలు నివేదించాయి.

(మరింత సమాచారం: చెక్కెరవ్యాధి లక్షణాలు)

కాలేయం కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for liver in Telugu

తేనె మరియు వెచ్చని నీరు తీసుకోవడం అనేది కాలేయం యొక్క జీవక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఆక్సీకరణ నష్టం అనేది కాలేయ పనితీరు సమస్యలకు ప్రధాన కారణం. తేనె యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చెయ్యడం ద్వారా (అంతర్గత అవయవాలకు నష్టం జరగడం) దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుతుంది. వెచ్చని నీటి కలిపిన తేనె నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది మరియు టాక్సిన్లను న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి కాలేయ పనితీరును మెరుగుపరిచేందుకు వెచ్చని నీటితో కలిపిన తేనె తీసుకోవాలని సిఫార్సు చేయబడుతుంది.

ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ కోసం తేనె - Honey for irritable bowel syndrome in Telugu

తీవ్రమైన అతిసారం లేదా మలబద్ధకం, కడుపు ఉబ్బరం మరియు కడుపు అసౌకర్యంతో సహా ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడుతున్న రోగుల చికిత్సలో ఖాళీ కడుపుతో వెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి. చికిత్స కోసం ఉపయోగించే సాధారణ థెరపీలతో పోలిస్తే వైరల్ డయేరియా యొక్క వ్యవధిని తగ్గించడంలో తేనె సమర్థవంతంగా ఉన్నట్లు గుర్తించబడింది

పెప్టిక్ అల్సర్ మరియు గ్యాస్ట్రైటిస్ కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for peptic ulcer and gastritis in Telugu

పెప్టిక్ అల్సర్లు హెలికోబాక్టర్ పైలోరీ (Helicobacter pylori) కారణంగా కడుపు లేదా ఆంత్రము (డ్యూడినియం) లోపలి పొరలలో ఏర్పడే బాధాకరమైన పూతలు/పుండ్లు. అలాగే గ్యాస్ట్రైటిస్, కడుపు గోడల పొరల యొక్క మంట మరియు వాపును సూచిస్తుంది.

హెచ్. పైలోరి యొక్క శక్తివంతమైన నిరోధక కర్తగా తేనె గుర్తించబడింది. తేనె ఆమ్లత్వ మరియు యాంటీబాక్టీరియా చర్యలను కలిగి ఉంటుంది. తేనెలో ఉన్న గ్లూకోజ్ ఆక్సిడేస్ బ్యాక్టీరియా వల్ల కలిగే పూతల యొక్క చికిత్సలో సహాయపడుతుంది.

తేనెను గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావాన్ని తగ్గించి మరియు పుండ్లు నయమయ్యే ప్రభావాన్ని పెంచుతుందని క్లినికల్ అధ్యయనాలు సూచించాయి. అందువలన, తేనెను దాని బాక్టీరియల్ లక్షణాలు మరియు ప్రొటెక్టీవ్ (రక్షిత) చర్యల కోసం వెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు.

గ్యాస్ట్రోఎంటిరైటిస్ కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for gastroenteritis in Telugu

గ్యాస్ట్రోఎంటిరైటీస్ లేదా గ్యాస్ట్రిక్ లేదా స్టొమక్ (కడుపు) ఫ్లూ జీర్ణాశయా మార్గం యొక్క వాపు వల్ల సంభవించవచ్చు. అనారోగ్యకరమైన ఆహారం తినడం, కలుషితమైన నీరు త్రాగడం, లేదా వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమణ వ్యాప్తి కారణంగా ఇది సంభవించవచ్చు. గ్యాస్ట్రోఎంటిరైటీస్ యొక్క లక్షణాలు డీహైడ్రేషన్, నీళ్ళ విరేచనాలు, ఉబ్బరం, కడుపు తిమ్మిరి మరియు వికారం.

సాల్మోనెల్లా (Salmonella), షిజెల్లా (Shigella) మరియు క్లోస్ట్రిడియమ్ (Clostridium) వంటి అనేక వ్యాధికారక జీవులు ఈ పరిస్థితిని కలిగిస్తాయి. 2010 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో స్టాండర్డ్ ఎలక్ట్రోలైట్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) లో గ్లూకోస్ కు బదులు తేనెను చేర్చడం వలన రోగులలో రికవరీ (రోగం నయం కావడం) సమయం తగ్గిందని తెలిసింది. తేనెలో ఉండే అధిక చక్కెర శాతం కారణంగా ప్రేగులలో ఎలెక్ట్రోలైట్లు మరియు నీటి శోషణ పెరుగడం ద్వారా ఇది జరుగుతుంది. అందువల్ల, తేనె మరియు నీటి వినియోగం సహాయపడవచ్చు.

నోటి ఆరోగ్యం కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for oral hygiene in Telugu

తేనె మరియు నీటితో కలిపి తయారుచేసిన మౌత్ వాష్ అనేక నోటి సమస్యల చికిత్సకు సహాయపడుతుంది. అదనంగా, ఇది జింజివైటిస్, దంత ఫలకం, నోటి పూతల మరియు పిరియోడొంటైటిస్ వంటి సమస్యల నివారణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనె యొక్క యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు దంత కణజాలం యొక్క పెరుగుదలను ప్రేరేపించగలవు, దెబ్బతిన్న కణాలను బాగు చేస్తుంది.

పిరియోడొంటైటిస్ పోర్ఫిరోమోనాస్ జిన్జివాలిస్ (Porphyromonas gingivalis) అనే బాక్టీరియా వలన సంభవిస్తుంది. తేనె ఈ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటిమైక్రోబయాల్ చర్యలను చూపిస్తుంది మరియు ఈ వ్యాధి నివారణకు సహాయపడుతుంది. స్టోమటైటిస్ నోటి కణజాలపు ఎరుపుదనం మరియు వాపుకు కారణమవుతుంది మరియు స్పష్టమైన బాధాకరమైన పుండ్లను/పూతలను కలిగిస్తుంది. తేనె మరియు వేడి నీటి మిశ్రమం కణజాలంలోకి సులభంగా చొచ్చుకుపోయి స్టోమటైటిస్కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

హాలిటోసిస్ చెడు శ్వాసను కలిగించే మరొక నోటి ఆరోగ్య సమస్య. నోటి నుండి చెడు వాసన ఎక్కువగా డీగ్రేడ్ చేసే సూక్ష్మజీవుల చర్య వలన సంభవిస్తుంది.

తేనెలో ఉండే మిథైల్ గ్లైఆక్సల్ (methylglyoxal) భాగం (కాంపోనెంట్) యొక్క బలమైన యాంటీ బాక్టీరియల్ చర్య కారణంగా తేనె మరియు వెచ్చని నీటి వినియోగం ఈ పరిస్థితిని నిరోధించగలదని ఇటీవలి అధ్యయనం నిరూపించింది.

డయాబెటిక్ ఫుట్ అల్సర్ కు తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water for diabetic foot ulcer in Telugu

డయాబెటిక్ ఫుట్ అల్సర్ (చెక్కరవ్యాధి ఉన్నవారిలో పాదంలో ఏర్పడే పుండు) అనేది రక్తంలో అధిక చక్కెర ఉన్నవారిలో సంభవించే ఒక పరిస్థితి. ఇది తరచుగా సూక్ష్మజీవుల సంక్రమణాల వలన ఇంకా తీవ్రం అవుతుంది మరియు పుండు మానె (నయమయ్యే) ప్రక్రియ మందగిస్తుంది. తేనె ఈ పుండ్ల చికిత్సలో ఉపయోగించబడుతుంది మరియు అలాగే ఇది తెగిన గాయాలు మరియు కాలిన గాయాలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

వెచ్చని నీటిని తేనెతో కలిపి తగిన మోతాదులలో తీసుకుంటే అది డయాబెటిక్ ఫుట్ అల్సర్లను తగ్గించడంలో సహాయపడుతుంది అని అధ్యయనాలు కనుగొన్నాయి. తేనెలో ఉన్న బయోలాక్టివ్ సమ్మేళనాలు కూడా ఈ పరిస్థితి వల్ల కలిగే వాపును తగ్గిస్తాయి.

అందుచేత, డయాబెటిక్ ఫుట్ అల్సర్తో బాధపడుతున్న రోగులకు, వెచ్చని నీటిలో కలిపిన తేనెను తీసుకోమని సిఫార్సు చేయబడుతుంది.

చర్మం కోసం తేనె మరియు వెచ్చని నీటి ప్రయోజనాలు - Honey and warm water benefits for skin in Telugu

మృదువైన మరియుప్రకాశవంతమైన చర్మం కోసం న్యూట్రిషనిస్ట్లు తేనె కలిపిన వేడి నీటిని తీసుకోమని సిఫార్సు చేస్తారు. ఒక చెంచా తేనె కలిగిన వెచ్చని నీటిని త్రాగటం వలన అది బొబ్బలు మరియు మోటిమలు వంటి చర్మ సమస్యలను తొలగిస్తుంది. ప్రభావిత ప్రాంతాల్లో చర్మ కణజాలపు పునర్నిర్మాణాన్ని మెరుగుపరచడం ద్వారా తేనె చర్మ నస్టాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

తేనెలో నైట్రిక్ ఆక్సైడ్ మెటాబోలైట్స్ వంటి బయోఆక్టివ్ సమ్మేళనాలను కూడా  ఉంటాయి. ఈ బయోలాక్టివ్ సమ్మేళనాలు సోరియాసిస్ వంటి వ్యాధుల విషయంలో చర్మపు ఇన్ఫెక్షన్ల సంభావ్యతను తగ్గిస్తాయి.

జీర్ణం కోసం తేనె మరియు వెచ్చని నీరు - Honey water for digestion in Telugu

తేనె మరియు వెచ్చని నీటి వినియోగం జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తుంది. సహజ తేనెలో అనేక ఎంజైమ్లు ఉంటాయి అవి మంచి శోషణకు (absorption) మరియు పిండి పదార్ధాల మరియు చక్కెరల యొక్క జీర్ణానికి సహాయపడతాయి. తేనెలో ఉన్న చక్కెర అణువులు (sugar molecules) శరీరం సులభంగా శోషించగలిగే రూపంలో ఉంటాయి.

ఫైటోకెమికల్స్, ఖనిజాలు మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి కొన్ని ఇతర పోషకాలు కూడా తేనె ఉంటాయి, అవి శరీరంలోని జీర్ణ ప్రక్రియలను పెంచుతాయి. 

జీర్ణశయాంతర మార్గంలో శరీరానికి ఉపయోగకరమైన అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. ఉదాహరణకు, బీఫిడోబాక్టీరియా (Bifidobacteria) అనేది తేనెలో ప్రాధమిక సూక్ష్మజీవుల్లో ఒకటి, ఇది ప్రేగులలో కూడా ఉంటుంది, అంతేకాక ఇది ఆరోగ్యకరమైన ప్రేగుల కోసం కూడా అవసరం. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే అవి ప్రేగులలో బీఫిడోబాక్టీరియా యొక్క సంఖ్యను పెంచుతుందని ఒక పరిశోధన సూచిస్తుంది. అధ్యయనలలో సహజ తేనెలో ప్రోబయోటిక్స్ అధిక మొత్తం ఉంటాయని కనుగొన్నారు.

అందువలన, వెచ్చని నీటితో కలిపి తేనెను తీసుకోవడం అనేది జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బరువు తగ్గుదల కోసం నిమ్మరసం తేనె మరియు వెచ్చని నీరు - Honey and warm water with lemon for weight loss in Telugu

తేనె మరియు వెచ్చని నీటి లాభాలలో ముఖ్యమైనది మరియు బాగా తెలిసినది బరువు తగ్గడం. తేనె, దానిలో ఉన్న అనేక బయోలాక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో జీవక్రియ (మెటబాలిజం) ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది మరియు అనారోగ్యకరమైన ఆహారం కోసం కలిగే కోరికలను తగ్గిస్తుంది. తేనె చక్కెరకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది మరియు ఉదయం వేళా టీకి బదులుగా వెచ్చని తేనె నీటిని తీసుకోవడం అనేది బరువు తగ్గుదల ప్రభావాలను పెంచుతుంది.

అదనంగా, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నిమ్మకాయను కూడా ఈ పానీయంతో కలపవచ్చు. ఇది అవాంఛిత టాక్సిన్లను మరియు కొవ్వులను శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది.

కాబట్టి, అదనపు కొవ్వు తగ్గించుకోవాలంటే, ప్రతి రోజు వెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మరియు నిమ్మరసం కలిపి తీసుకోవడం ప్రారంభించండి.

(మరింత సమాచారం: యాంటీఆక్సిడెంట్ ఆహారాలు)

తేనె మరియు వెచ్చని నీటి తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి. ఇంతకు ముందు మీరు తేనె మరియు వేడినీటిని తీసుకోకపోతే కనుక, తేనె మరియు వెచ్చని నీటి మిశ్రమాన్ని తయారు చేయడం గురించి ఎలాగో ఈ కింద ఇవ్వడం జరిగింది.

 • ఒక గ్లాసు నీరు తీసుకొని దానిని ఒక ఐదు నిమిషాల పాటు కాచాలి. నీరు మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి.
 • ఏదైనా మలినాలను ఉంటే వాటిని తొలగించడానికి ఒక గ్లాసులోకి నీటిని వడకట్టాలి.
 • సిఫార్సు చేయబడిన మోతాదు ప్రకారం 1-2 టీస్పూన్ల తేనెను ఆ నీటిలో కలపాలి.
 • ఒకసారి బాగా కలిపి తేనె మరియు వేడినీటి మిశ్రమాన్ని ఆస్వాదించవచ్చు.

తేనె మరియు వెచ్చని నీటితో దాల్చిన చెక్క - Cinnamon with honey and warm water in Telugu

తేనె మరియు వేడి నీటి చప్పిడి రుచి నచ్చకపోతే, దానితో ప్రయోగాలు చేయవచ్చు. దాని రుచిని మెరుగుపరచడానికి ఆ మిశ్రమానికి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కూడా జోడించవచ్చు అది రుచిని మెరుగుపరచడమే కాక, శ్వాసకు ఒక మంచి వాసనను కూడా ఇస్తుంది.

తేనె మరియు వెచ్చని నీటితో నిమ్మ రసం - Lemon juice with honey and warm water in Telugu

కేవలం తేనె మరియు వెచ్చని నీటిని మాత్రమే తీసుకోకుండా, ఆ మిశ్రమానికి ఒక చిన్న టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు. తేనె యొక్క తియ్యని రుచితో పాటు నిమ్మకాయ యొక్క పులుపు దానిని మంచి తాజా పానీయంగా తయారు చేస్తుంది, ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

పువ్వుల నుండి మకరందమును(తేనె) సేకరించడం ద్వారా తేనెటీగలు తేనెను ఉత్పత్తి చేస్తాయి. తేనెటీగలు వాటి శరీర జీవక్రియ కోసం తేనేలో ఉండే చక్కెరలను ఉపయోగించుకుంటాయి మరియు సుదీర్ఘకాల ఆహారంగా తేనెను తేనెపట్టులలో నిల్వ ఉంచుకుంటాయి. తేనెపట్టు నుండి తేనె కొన్ని సేకరణ పద్దతుల ద్వారా సేకరించబడుతుంది. తేనెపట్టులో తేనె మరియు మైనపు మిశ్రమం ఉంటుంది. సాధారణంగా స్వచ్ఛమైన తేనె పొందేందుకు మైనం ఒక వడపోత పద్ధతి ద్వారా వేరు చేయబడుతుంది.

తేనె మరియు వెచ్చని నీటిని తీసుకునే ఖచ్చితమైన సమయాన్నిగురించి ఎటువంటి కచ్చితమైన నిర్దేశకాలు లేనప్పటికీ, రోజులో కొన్ని సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం అనేది మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

తేనె మరియు వెచ్చని నీటి తీసుకోవడానికి సరైన సమయం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం. ఇది సమర్థవంతమైన బరువు తగ్గుదలను సాధించడంలో సహాయపడుతుంది.

తేనె మరియు వెచ్చని నీళ్ళను భోజనానికి ముందు లేదా భోజనం చేసే సమయంలో తీసుకోవచ్చు తద్వారా ఇది ఎక్కువ సమయం పాటు కడుపు నిండి ఉన్న భావనను కలిగిస్తుంది. ప్రత్యామ్నాయంగా, రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకోవచ్చు అప్పుడు అది జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది.

మీరు తేనె మరియు వేడి నీటిని తీసుకోవడంలో ఏ విధానాన్ని ఎంపిక చేసుకున్నారో, మంచి ఫలితాల కోసం దానికి కట్టుబడి ఉండాలని గుర్తు ఉంచుకోవాలి.

(మరింత సమాచారం: బరువు తగ్గుదల ఆహార విధాన పట్టిక)

తేనె మరియు వేడి నీటిని తీసుకోవడం అనేది ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఇప్పటికరు తెలియదు. అయితే, కొంతమంది ఈ క్రింద పేర్కొన్న కొన్ని దుష్ప్రభావాలను అనుభవించవచ్చు.

 • ఎల్లప్పుడూ పాశ్చురైజ్ (శుద్ధి) చేసిన తేనెను తీసుకోవడం అవసరం. పాశ్చురైజ్ చెయ్యని తేనె ఫుడ్ పాయిజనింగ్ కలిగించవచ్చు, ఎందుకంటే అది జీర్ణవ్యవస్థలో సమస్యలు కలిగించే సామర్థ్యాన్ని ఉండే బయటి పదార్దాలను కలిగి ఉండవచ్చు.
 • ముడి లేదా పాశ్చురైజ్ చెయ్యని తేనె కూడా కొందరి వ్యక్తులలో అలెర్జీలు మరియు దద్దుర్లకు కారణం కావచ్చు. అలాంటి లక్షణాలు సంభవిస్తే, వెంటనే వైద్యులని  సంప్రదించాలి.
 • తేనె మరియు వెచ్చని నీటిని అధికమొత్తంలో తీసుకుంటే కడుపు నొప్పి మరియు కొందరిలో ఉబ్బరం కూడా కలిగించవచ్చు. ఇటువంటి సందర్భాల్లో తేనె మరియు వెచ్చని నీటిని తీసుకోవడం ఆపివేయాలి మరియు దాని తీసుకోవడం మళ్ళి ప్రారంభించే ముందు ఒకసారి వైద్యులని సంప్రదించాలి.
 • అధిక వేడి నీటిలో తేనెను కలపడం సిఫార్సు చేయబడదు. ఇది జీర్ణం కాదు మరియు వినియోగానికి కూడా పనికిరాదు (విషపూరితం అవుతుంది).

వనరులు

 1. Visweswara Rao Pasupuleti, Lakhsmi Sammugam, Nagesvari Ramesh, Siew Hua Gan. Honey, Propolis, and Royal Jelly: A Comprehensive Review of Their Biological Actions and Health Benefits . Oxid Med Cell Longev. 2017; 2017: 1259510. PMID: 28814983
 2. Omotayo O. Erejuwa, Siti A. Sulaiman, Mohd S. Ab Wahab. Honey - A Novel Antidiabetic Agent . Int J Biol Sci. 2012; 8(6): 913–934. PMID: 22811614
 3. Otilia Bobiş, Daniel S. Dezmirean, Adela Ramona Moise. Honey and Diabetes: The Importance of Natural Simple Sugars in Diet for Preventing and Treating Different Type of Diabetes . Oxid Med Cell Longev. 2018; 2018: 4757893. PMID: 29507651
 4. MG Miguel, Antunes, ML Faleiro. Honey as a Complementary Medicine . Integr Med Insights. 2017; 12: 1178633717702869. PMID: 28469409
 5. Abdulwahid Ajibola. Novel Insights into the Health Importance of Natural Honey . Malays J Med Sci. 2015 Sep; 22(5): 7–22. PMID: 28239264
 6. Abdulwahid Ajibola, Joseph P Chamunorwa, Kennedy H Erlwanger. Nutraceutical values of natural honey and its contribution to human health and wealth . Nutr Metab (Lond). 2012; 9: 61. PMID: 22716101
Read on app