అంజూర పండు ఒక అద్వితీయమైన ఫలము, అది దాని యొక్క పాక శాస్త్రం మరియు వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ మధురమైన ఫలము దాని యొక్క మధురమైన రుచికే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనములకు కొరకు వేల ఏళ్లుగా పండింపబడుతుంది. అంతేకాక ఇది మానవులచే పండించబడుతున్నపురాతనమైన పండు అని బైబిల్లో కూడా రాయడం జరిగింది.ఇంకా ఈ అంజీర పండు యొక్క పాత ఆనవాళ్లు నియోలితిక్ ఎరా నందుకూడా దొరకటం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

గ్రీకులు దీనిని విలువైనదిగా పరిగణించి దాని యొక్క ఎగుమతికి అంగీకరించేవారు కాదు మరియు అంజీరపండను పోటీలలో విజేతలకు గౌరవార్ధం బహుకరించేవారు, అంతేకాకుండా రామన్ మైథాలజీ ప్రకార రోము యొక్క వ్యవస్థాపకులైన రీముస్ మరియు రోములుస్,ఆడ తోడేలు యొక్క పాలను అంజూర చెట్టు కింద సేవించినారు. వారు ఈ పండు యొక్క సంతానోత్పత్తి గుణాలు కూడా పేర్కొన్నారుకొన్నారు ఈ అద్భుతమైన పండు గురించి మరింత తెలుసుకోవడానికి

క్రింద చదవండి.

అంజూరపు పండు యొక్క కొన్ని ప్రాథమిక నిజాలు :

 • శాస్త్రీయ నామము: ఫైకస్ కరికా (Ficus carica)
 • కుటుంబము: మొరెసీ/ముల్బెర్రీ  (Moraceae/ Mulberry)
 • సంస్కృత నామము: అంజీర్, అంజీరా
 • ఉపయోగపడే భాగములు: పళ్ళు, ఆకులూ, బెరడు మరియు వేరులు
 • స్థానిక ప్రాంతము మరియు భౌగోళిక పంపిణీ: అంజీరా చెట్టు ఆసియా ఖండపు మధ్యధరా ప్రాంతం నందు పశ్యాత్త ప్రాంతము నందు పెరుగునని భావిస్తారు,ఇండియా చైనా మరియు ఆఫ్రికా యొక్క ఉష్ణమండల మండలాలు మరియు ఉప ఉష్ణ మండలాలలో పెరుగును. అంజీర చెట్టు అమెరికా మరియు యూరప్లో కొన్ని భాగాలలో కూడా పెరుగును. టర్కీ ప్రపంచంలోనే అతిపెద్ద అంజూర పండ్ల ఉత్పత్తి కేంద్రం.
 • శక్తి శాస్త్రము: చల్లదనం

అంజూర చెట్టు:

అంజూర ఒక ఆకురాల్చే చెట్టు (సంవత్సరానికి ఒక్కసారి ఆకులు రాల్చును) మరియు Ficus ప్రజాతికి చెందినది. ఈ ప్రజాతి లో కంబళి చెట్టు (mulberry), మర్రి చెట్టు (bargad, banyan) మరియు రావి చెట్టు ఉండును.

మీకు తెలుసా?

అంజిరాలులో నిజమైన పళ్లకి బదులుగా విలోమ పుష్పములు నిజానికి,ఎవరైనా అంజీర పువ్వులను చూడగలరు. అంజీర చెట్లు పెంచడానికి సులభమైనవి, ఒక్కసారి నాటితే సులువుగా, వేగముగా, చుట్టుపక్కల అలుముకునును, నిజానికి ఇది విషపరమైన కలుపు మొక్కలుగా “Global compendium of weeds”నందు ఉన్నవి. మాములుగా ఒక అంజూర చెట్టు 20 - 30 అడుగుల ఎత్తు పెరుగును మరియు సమానమైన విస్తీర్ణంలో ఉండును. ఆకులయందు తమ్మెలుండును, ఈ గుణము వేరే రకములైన ఫైకస్ (వివిధ రకములైన ఫైకస్ జాతి చెట్లు కేవలం అంజూరా మరియు కంబళి చెట్ట్లు మాత్రమే కాకుండా)ల నుండి వేరుచేయుట కొరకు ముఖ్యమైన ప్రమాణముగా ఉండును.

 1. అంజీర ఉపయోగాలు - Benefits of Figs in Telugu
 2. అంజీర పళ్ళను ఎలా తినాలి - How to eat Figs in Telugu
 3. రోజుకి ఎన్ని అంజీర పళ్లను తీసుకోవాలి - How many figs to take per day in Telugu
 4. అంజీర యొక్క దుష్ప్రభావాలు - Side effects of Figs in Telugu

అంజీరపళ్ళు వంటగదులలోకి మరియు రెఫ్రిజిరేటర్లలోకి వాటి యొక్క దారిని కనుగొన్నవి.

ఐతే అంజీర పండు తియ్యదనం వల్ల దానిని తీపి పదార్ధములలో (desserts) వాడుతున్నారు కానీ, దీని యొక్క పోషక మరియూ ఆరోగ్య ఉపయోగాలు ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ వ్యాసంలో మనం ఆరోగ్యములో అంజీరపళ్ళ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము.

 

యాంటియోక్సిడెంట్ వంటి అంజీర - Figs as antioxidant in Telugu

మీరు ఒక వేళా యవ్వనం గా, ప్రకాశవంతం గా కనిపించాలి అని కోరుకునే వారు ఐతే మీకు యాంటియోక్సిడెంట్స్ గురించి తెలిసే ఉంటుంది. అవి కేవలం ఫ్రీ రాడికల్స్ (ప్రమాదకరమైన ఆక్సిజన్ మన శరీరానికి విషతుల్యమైనది) ను శుద్ధి చేయడమే కాకుండా చాలా శరీర భాగాల (గుండె మరియు కాలేయము) ఆరోగ్యాన్ని నిర్వహించడానికి చాలా అవసరం. పరిశోధకులు ఫెనోల్స్ (phenols) మరియు ఫలావోనోయిడ్స్ (flavonoids) (ఒక రకమైన సహజముగా లభించు రసాయన సమ్మేళనం) ఉండడం వలన అంజుర పళ్ల ను అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గా చేస్తున్నాయని చెబుతున్నారు అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ (stress) ను శరీరం లో తగ్గించి వయసు పరమైన సమస్యలను అకాల వృద్దాప్యమును తగ్గిస్తాయి.

(మరింత సమాచారం: యాంటియోక్సిడెంట్ అధిక ఆహరం)  

గర్భ ప్రయోజనాల కొరకు అంజీర - Figs for pregnancy in Telugu

అధిక పోషక లక్షణాలు ఉన్న అంజీరాలను గర్భిణీ స్త్రీ లకు ఎక్కువగా సిఫారసు చేస్తారు. ఇది చాలా వరకు ఉన్న విటమిన్ల మరియు ఖనిజాల అవసరాలను తీర్చుతుంది ఈ సమయం లో. ముందుగా అంజీరాలు కాల్షియమ్ కు మంచి మూలకాలు అది పిండం ఎదుగుదలకు ఎక్కువ గా అవసరం అయ్యే మరియు తల్లి ఎముకలను ఆరోగ్యం గా ఉంచే ఒక ముఖ్యం గా అవసరమైన ఖనిజం. తర్వాత అంజీర పండు లో ఉండే విటమిన్ బి, గర్భం ధరించిన మొదటి త్రైమాసికం లో ఉండే ఉదయపు నీరసాన్ని తగ్గిస్తుంది. అయితే ఎక్కువ అంజీర పళ్ళను తినడం నివారించాలి మరియు సరిఅయిన డోసు కోసం వైద్యున్ని సంప్రదించాడం మంచిది ఒకవేళ అంజీర ను ఔషధం గా వాడుతుంటే.

ఎముకుల కొరకు అంజీర - Figs for bones in Telugu

ఎముకలు శరీర నిర్మాణానికి ప్రాధిమిక మద్దతును ఇస్తాయి మంచి ఎముకల ఆరోగ్య నిర్వహణ జీవితానికి ఒక ప్రాధిమిక అవసరం. దురదృష్టవశాత్తు మనం పెరిగే కొద్దీ సహజముగా కాల్షియమ్ ఎముకల నుండి తొలగిపోతుంది. కావున మన శరీర సహజ చక్రాలు సులభంగా ఎముకలను పగిలేలా చేసి అధిక భాదను కలిగిస్తాయి. కాల్షియమ్ అనుబంధకాలని ఆహరం లో తీసుకోవడం ద్వారా అదృష్టవశాత్తు మనం ఎముకల వయసు పెరుగుదలను నివారించడం కానీ తగ్గించడం కానీ చెయ్యవచు. అయితే బజారు లో చాలా వాణిజ్య కాల్షియమ్ అనుబంధకాలు ఉన్నప్పటికీ, అవి కొన్ని చిన్న చిన్న దుష్ప్రభావాలు, అధికముగా కాల్షియమ్ ను పెంచుట మరియు శరీరములో రాళ్ల ను ఏర్పాటు చేయుచున్నవి. అంజీరల లో ఉన్న సహజమైన కాల్షియమ్ మూలకాలు మన ఎముకలను మరియు పళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. అంజీరాలలో ఉన్న కాల్షియమ్ స్థాయిలు వెన్నతీసిన పాల తో సమానమైనవి (దాదాపు 28గ్రాముల అంజీరాలు రోజూ శరీరానికి అవసరమైన 5% కాల్షియమ్ ను అందిస్తాయి. కాల్షియమ్ తో పాటు గా అంజీరాలు మెగ్నీషియం ఫాస్ఫరస్ (ఇవి ఎముకల మెరుగుపరుస్తాయి) ను అందిస్తాయి.

అంజీర జ్వరాన్ని తగ్గిస్తుంది - Figs reduces fever in Telugu

ఆయుర్వేదం లో అంజీర ఆకులు ఆంటీపైరెటిక్ (antipyretic) (శరీర ఉష్ట్టానని తగ్గించడం మరియు జ్వరం) గా వాడుతారు. ఇటీవలి వైద్య పరిశోధనలు అంజీర ఆకుల యొక్క ఇథనాల్ (ethanol) సారానికి బలమైన ఆంటీపైరెటిక్ లక్షణాలు ఉన్నాయ్ అని అది ఇథనాల్ సారం యొక్క డోస్ పై ఆధారపడి ఉన్నాయ్ అని తెలిపాయి. దాని ప్రభావం దాదాపు 5 గంటల వరకు ఉందని ఇది అత్యంత సాధారణ వాణిజ్య ఆంటీపైరెటిక్స్ కంటే చాలా సమర్ధవంతమైనది అని తెలిసింది.

(మరింత సమాచారం: జ్వరం కారణాలు మరియు చికిత్స)  

మూత్రపిండాల ప్రయోజనాల కొరకు అంజీర - Figs benefits for kidney in Telugu

అంజీరాలు సహజముగా మూత్రవిసర్జన అంటే శరీరం లో ఉన్న విషతుల్య పదార్దాలను తొలగించడానికి మరియు అధికముగా ఉన్న ఉప్పులను మరియు నీటిని మూత్రపిండాల నుండి తీసివేయడానికి తద్వారా మూత్రపిండాలనును ఆరోగ్యం గా శరీరాన్ని విషపదార్దాల రహితంగా ఉంచేందుకు ఎంతనో ఉపయోగపడతాయి. విషపదార్దాల రహితమైన శరీరం కేవలం, మంచిగా పనిచేయడమే కాక సరదాగా ఉంచుతుంది.

రక్త పోటు కొరకు అంజీర - Figs for blood pressure in Telugu

అధిక రక్తపోటు అనేది ఒకానొక సాధారణ సమస్య ఈ రోజుల్లో. ఒకప్పుడు ఈ సమస్య కేవలం మధ్య వయసు వారికే వచ్చేది కానీ ఇప్పుడు అది అన్ని వయసుల మరియు లింగాల వారికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభలిస్తుంది. అయితే మానసిక ఒత్తిడి చాల మంది లో అధిక రక్తపోటు కి కారణం ; జీవనశైలి సమస్యలు ఊబకాయం మరియు ఆహార అలవాట్లు దీనిలో ముఖ్య పాత్ర వహిస్తాయి సాధారణం గా ఉప్పు ఎక్కువగా ఉండే మరియు ఇంపుగా ఉండే ఆహరం తీసుకోవడం వలన అధిక స్థాయి లో సోడియం శరీరం లోకి చేరి ఉప్పు యొక్క అసమతుల్యతకు దారి తీస్తుంది. శరీరం లో సోడియం స్థాయిలను సమతుల్యం చేసే ఉప్పు పొటాషియం. ఇది రక్తపోటు ను అదుపు చెయ్యడానికి చాల అవసరం. రోజూ అంజీరాలు తినడం అనేది పొటాషియం కు మంచి మూలకాలు అలాగే రక్తపోటు ని తగ్గిస్తాయి అని పరిశోధనలు చెప్తున్నాయి. పొటాషియం ఈ పండు లో అధికముగా ఉండటం వలన మాములు రక్తపోటు ను నిర్వహించడం లో భాద్యత వహిస్తుంది

ఊపిరి తిత్తుల సమస్యలకు అంజీర - Figs for lung problems in Telugu

అంజీర పళ్ళ రసం దగ్గు మరియు జలుబునకు తెలిసిన పరిహారం. అంజీర పళ్ళు గొంతులో అధికముగా ఉన్న శ్లేషాన్ని (mucus) తొలగించడానికి గొంతు కండరాలలో పోషకాలు పెంచడానికి ఉపయోగపడతాయి అని ఆయుర్వేదం లో ఉన్నది. కావున అంజీర పళ్ళు కేవలం గొంతు మంటను తగ్గించడమే కాక గొంతు బలాన్ని పెంచి గొంతు మంట మళ్ళి రాకుండా నివారిస్తుంది. ఈ లక్షణాలు అన్ని కలిపి అంజీర ను దీర్ఘకాలిక దగ్గు మరియు అలంటి శ్వాసకోశ సమస్యలకు వ్యతిరేకం గా పనిచేసే కర్త గా చేసాయి.

జుట్టు రాలుట కొరకు అంజీర - Figs for hair loss in Telugu

అంజీర పళ్లలో గల పోషక మారియు యాంటియోక్సిడెంట్ ప్రభావం నెత్తి సమస్యలకే కాక జుట్టును కాపాడటం లోను కండిషన్ చెయ్యడం లో కూడా సహాయం చేస్తుంది. అంజీర విత్తనాల నూనె ను సముచితంగా వాడడం వల్ల జుట్టుకి సమపాళ్లలో విటమిన్ ఈ (E) మరియు విటమిన్ కె (K) ఇస్తుంది ఇది జుట్టు యొక్క సహజ మెరుపుకి మరియు జుట్టు రాలుట నివారణకు ఎంతో ముఖ్యమైనది.

చర్మం కొరకు అంజీర ఉపయోగాలు - Figs benefits for skin in Telugu

అంజీర పళ్ళు సాంప్రదాయ మరియు జానపద ఔషధ విధానాలలో వాడడం జరుగుతుంది ఎందుకంటే వాటిని సోరియాసిస్, మొటిమలు మరియు తామర వంటి చర్మ వ్యాదులు తగ్గించడానికి ఉపయోగించేవారు. అంజీర పండు యొక్క రబ్బరు పాలు (లేటెక్స్) ను సమయోచితంగా వాడటం అనేది క్రయోజెనిక్ చికిత్స (cryogenic) (అతి తక్కువ ఉష్నోగ్రత వరకు ఘనీభవించి ముక్కలు చెయ్యడం) పిలిపిరులను నివారించవచ్చు అని ఇరాన్ లో జరిపిన పరిశోధన చెప్తుంది. కచ్చితమైన ఆ చర్యయొక్క మోడ్ తెలియనప్పటికీ పరిశోధకులులు అంజీర రబ్బరు పాలలో గల కొన్ని ప్రొటేయాలిటిక్ (proteolytic) చర్యలు (ప్రోటీన్ ను పగులగొట్టే) పులిపిరుల నివారణకు కారణం అని భావిస్తున్నారు.

మధుమేహం కొరకు అంజీర - Figs for diabetes in Telugu

అంజీర పళ్ళు సేవించడం వల్ల రక్తం లో చెక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంజీర పళ్ళ పై చేసిన ఒక పరిశోధన తరచుగా ఇవి సేవించడం వల్ల గ్లూకోజ్ పై ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి అధిక చెక్కరలు రక్తం లోకి తీసుకోవడం పెరిగిందని తెలిపింది. ఒకవేళ మీకు మధుమేహం ఉంటె వైద్యున్ని సంప్రదించడం మేలు.

రక్త హీనత కొరకు అంజీర - Figs for anemia in Telugu

ఇటీవలి పరిశోధన ప్రకారం, భారత దేశం లో 15 -50 వయసు మధ్య గల 51%మంది మహిళలు

రక్తహీనతతో భాదపడుతున్నారు అని తేలింది. తినే ఆహరం లో ఐరన్ లేకపోవడమే దేనికి ప్రధాన కారణం. అంజీర పళ్ళు ఐరన్ యొక్క సమృద్ధి మూలకాలు ఇది హేమోగ్లోబిన్ లో ముఖ్యమైన భాగము (రక్త కణాలల్లో ఆక్సిజన్ ను శరీరానికి సరఫరా చేసే భాగము). తరచూ ఈ అంజీర పళ్ళు తినడం వల్ల రక్తం లో హెమోగ్లోబిన్ శాతం పెరిగిందని అలాగే రక్త కణాల సంఖ్య పెరిగిందని పరిశోదనలు చెప్తున్నాయి. ఈ పళ్ళ లో గల ప్రోటీన్లు మరియు విటమిన్ బి (B)  కూడా రక్తకణాల పెరుగుదలకు ముఖ్య పాత్ర పోషింస్తాయి.

(మరింత సమాచారం: రక్తహీనత రకాలు

ఆరోగ్య కరమైన కాలేయం కొరకు అంజీర - Figs for a healthy liver in Telugu

అంజీర పండు యాంటియోక్సిడెంట్స్ (antioxidents) కు ఒక మంచి మూలము. యాంటియోక్సిడెంట్స్ శరీరము యొక్క ఏ విధమైన ఆక్సిడేటివ్ (oxidative) నష్టాన్ని నుంచి అయినా రక్షణ కలిపిస్థాయి. అంజీరా లు పోషకాల గుణాలతో పాటు విషాలను కాలేయము నుండి తీసివేయుటకు మరియూ మొత్తం కాలేయ ఆరోగ్యానికి ఎంతో అవసరం. జంతువుల మీద జరిపిన ప్రయోగాలు, అంజీర పండు యొక్క కాలేయ రక్షణ సామర్ధ్యాన్ని తెలిపినవి కానీ మానవ కాలేయం పై వాటి యొక్క ప్రయోజనాలు చూపినట్టి దాఖలాలు లేవు. కావున అంజీర పళ్ళ యొక్క కాలేయ ప్రత్యక్ష ప్రభావం కోసం వైద్యున్ని సంప్రదించడం మేలు.

మొలలు కొరకు అంజీర - Figs for piles in Telugu

మొలలు అనగా, పాయువు (Anus) చుట్టూతా వాపు వచ్చు ఒక పరిస్థితి ఇది రక్తస్రావానికి,నొప్పికి దారితీస్తుంది మల విసర్జన చేసే సమయములో.ఈ సమస్య యొక్క కచ్చితమైన కారణం ఇంకా పూర్తిగా తెలియలేదు కానీ ఒక సాధారణమైన కారణం మాత్రము తక్కువ పీచు పదార్దాలు ఉన్న ఆహారము మరియూ అసాధారణ ప్రేగు కదలికలు. అంజీర పండు వద్ద ఈ రెండు సమస్యలకు పరిష్కారం ఉన్నది. అంజీర పండ్లలో గల అధిక పీచు శాతము, ప్రేగు కదలికలను నియంత్రించి మలమును మెత్తపరచి సులభముగా మలవిసర్జన జరుగుటకు ఉపయోగపడుతుంది. పురీషనాళం పై వత్తిడి ని తగ్గిస్తుంది.

నిద్ర కొరకు అంజీర - Figs for sleep in Telugu

రాత్రుళ్ళు నిద్ర పోలేకపోతున్నారా? నిద్ర లేకపోవడం (insomnia) వల్ల బాధ పడుతున్నారా? మెలటోనిన్ (ఒక రకమైన హార్మోన్) నిద్ర/మేలుకొనిఉండుట యొక్క లయలను మన శరీరంలో నిర్వహించడంలో భాద్యత తీసుకుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.ఈ హార్మోన్లో అసమతుల్యత నిద్ర క్రమానికి భంగం కలిగించడమే కాక ఆత్రుత భావన మరియూ చిరాకు ని కలిగిస్తుంది. అంజీరపండ్లలో అధిక మోతాదులో ఉన్న అమైనో ఆమ్లము,ట్రీప్టోఫాన్నకు మెలటోనిన్ పెరుగుదలకు ప్రత్యక్ష ప్రభావము ఉన్నది మన శరీరములో.రోజూ అంజీర పండ్లను సెవించడం వలన మన శరీరంలో ట్రీప్టోఫాన్ స్థాయిలు పెరిగీ సమయానుకూల మెలటోనిన్ విడుదలకు ప్రేరేపించుచున్నవి అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి కావున ఇది నిజముగా “స్లీప్ హార్మోన్’’. చాలా పరిశోధనలు ట్రీప్టోఫాన్ను నిద్రించే ముందు తీసుకోవడం వలన మెలటోనిన్ సమతుల్యతకు సహాయం చేస్తుందని కాబట్టి సులువుగా నిద్రపోవుటకు ఉపయోగపడుతుందని తెలుపుతున్నాయి. ఇంకనూ అంజీర పళ్లలో మెగ్నీషియం అధికముగా ఉండును.వైద్యల అభిప్రాయం మేరకు మెగ్నీషియం ఎక్కువ మరియు మంచి నిద్రకు సహాయము చేస్తుంది.ఒకసారి ఆలోచిస్తే ట్రీప్టోఫాన్, ఉద్రేకమును మెరుగుపరిచే సెరోటోనిన్ అనే హార్మోన్ని కూడా ప్రేరేపిస్తుంది ఇది ప్రత్యక్షముగా మన మెదడు మీద చర్య చూపి ప్రశాంతతను మరియు సొంతోషమైన భావనను కలుగచేస్తుంది.పైపెచ్చు అంజీరపండ్లలో అధికముగా ఉండు సహజమైన చెక్కరలు ఉద్రేకమును పెంచే పదార్థములుగా వైద్యులచే పరిగణింపబడుతున్నాయి.సెరోటోనిన్ యొక్క మంచి స్థాయులు నరాల సమస్యలు, ఆందోళన మరియు నిరాశను (depression) నివారించేందుకు ఉపయోగపడతాయి.

కళ్ళ ఉపయోగాల కొరకు అంజీర - Figs benefits for eyes in Telugu

అంజీర పండ్లు విటమిన్ A నకు మంచి మూలకాలు,విటమిన్ A కంటి చూపు మెరుగుదలకు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజూ అంజీరపళ్ళను సేవించడం వలన కళ్ళకు మాత్రమే మంచిది కాకుండా వయసు పరముగా వచ్చు కంటి ఆరోగ్య సమస్యలు ఉదాహరణకి మచ్చల క్షిణత (macular degeneration), క్రమముగా కంటి చూపు పోవుట (కంటి యొక్క రెటినా కణములు చనిపోవుట వలన వచ్చును) అది ప్రస్తుతానికి తగ్గిచలేనిది. వంటివి కూడా రావు.

బరువు తగ్గుదలకు అంజీర - Figs for weight loss in Telugu

అంజీరపండ్లలో అధిక మోతాదులో ఉన్న పీచు పదార్థాలు ప్రేగుల్లో ఎక్కువ చేరి కడుపు నిండిన భావనను ఎక్కువ సమయము వరకు ఉంచును.ఇది భోజనాల మధ్య యొక్క సమయాన్ని అధికం చేసి తక్కువ తినుటకు ఉపయోగపడును. అలాగే అంజీర పండులో క్యాలరీలు తక్కువగా ఉండును, కాబట్టి కడుపు నిండిన భావన కలిగించి క్యాలోరీల సంఖ్యను పెరగనివ్వదు.మనము అందరం అలాంటి ఒక రుచికరమైన మరియు మన వస్త్రాలు బిగువ చెయ్యకుండా ఉండే తిండి కోసం కలలు కంటాం కదా. అంజీరను పాలుతో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. ఒకవేళా మీరు అధిక బరువుతో ఉండి ఉంటే,ఈ అంజీర పండ్లను తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

(మరింత సమాచారం: బరువు తగ్గుదలకు ఆహార విధాన పట్టిక)  

మలబద్దకము కొరకు అంజీర - Figs for constipation in Telugu

అంజీర పళ్ళులో చాలా అధిక మోతాదులో ఆహార పీచు పదార్దములు ఉండును మరియు అధిక మోతాదులో పీచు పదార్ధం ఉండటం వలన మలము సులభంగా శరీరము నుండి బయటకు వెళ్లి పావును. కాబట్టి ఒక గిన్నెడు అంజీర పళ్ళ సలాడ్ను ఉదయము అల్పాహారంగా తీసుకొని మీ మలబద్దక బాధల నుండి విముక్తి పొందండి.

అంజీర పళ్ళను ఎలా వాడాలి? 

చెట్టు నుండి తెంపిన వెంటనే తాజాగా అంజీరలను తినవచ్చు. కానీ తాజా పళ్ళ యొక్క అందుబాటు మరియు నిల్వ సామర్ధ్యాలు అంత సాధారణం కాదు. కాబట్టి సంరక్షించబడినవి కాని ఎండబెట్టినవి కానీ ఎక్కువ తినెదరు.

అయితే తాజా పండు కొంచెం రసాలూరును. ఎండు పండు తియ్యగా, మెత్తగా ఉండును. దాని యొక్క విత్తనాలు ప్రతి కాటు లోను ప్రత్యేకమైన క్రంచ్ ను కలుగచేస్తాయి. పరిమళమైన డోసు తో ఆరోగ్యకరమైన పండు కంటే మంచిది ఎం ఉంటుంది?  ఒకవేళ మీరు మీ రోజువారీ పాలనలో అంజీర పళ్ళను తీసుకోవాలనుకుంటుంటే, వాటిని ఎండు పళ్ళుగా కానీ సలాడ్స్ లో కానీ ఉదయపు ధాన్యాలతో కానీ మొక్కజొన్న ఫ్లక్స్ తో కానీ తీసుకోవచ్చు అని తెలుసుకోవడానికి మీరు సంతోషిస్తారు. వాటిని పాలతో కానీ ఇతర ఫలాలతో కలిపి స్మూతీస్ మరియు మిల్క్ షేక్స్ గా చేసుకొని కానీ హల్వా కేక్ లు రొట్టె, పుడ్డింగ్స్ గా చేసుకొని తినవచ్చు. ఇవి బజారు లో చాలా రకాలైన మిఠాయిల రూపం లో దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు మీ అధిక డోసు లో ఉన్న కాఫీ కోసం ప్రత్యామ్నాయం కావాలంటే, అంజీర తక్షణ (instant) కాఫీ ప్యాక్ లో కూడా దొరుకుతుంది.

దీని యొక్క తియ్యని రుచి డస్సెర్ట్స్ కు పరిపూర్ణమైన సహజ తీపి ని అందిస్తుంది. అయినప్పటికీ మీరు బజారు లో అంజీర పళ్ళను కొనేముందు వాటి లేబెల్స్ ను మరియు గడువు తేదీని జతపర్చిన సంరక్షణకారులను జాగ్రత్త గా పరిశీలించాలి.

ఎండు అంజీర?తాజా అంజీరా? - Dried fig or fresh fig in Telugu?

కొద్ది మొత్తం లో నీటిలో కరిగిపోవుగల పోషకాలు మరియు నేటి నష్టం కాకుండా పోషక విలువలతో ఎండు అంజీర కు తాజా అంజీరకు పెద్ద తేడా లేదు. నిజానికి అంజీర పండు మేలైన పోషక అనుబంధకాలను ఎండు రూపం లోనే

ఇస్తుందని తెలుస్తుంది. ఫెనోలిక్ (phenolic) విషయాలు మరియు యాంటీఆక్సిడాంట్

లక్షణాలు తాజా అంజీర కంటే ఎండు అంజీర లో నే ఎక్కువ ఉంటాయి.

తాజా అంజీర ను కొనుట - Buying fresh figs in Telugu

ఒకవేళా మీరు తాజా అంజీరలను బజారు లో కొంటుంటే గాయాలు లేని ప్రకాశమైన రంగు ఉన్న వాటిని చూసి కొనాలి. తాజా పళ్లలో అధిక శాతం చెక్కరలు మరియు మంచి మొత్తం లో నీరు ఉంటుంది కాబట్టి వాటిని కొన్న 2 రోజులలో నే తినేయాలి. ఒకవేళ చేదుగా కానీ బూజుగా కానీ ఉంటే దానిని తినకూడదు. తాజా అంజీరలను భద్రంగా ఉంచాలి ఎందుకంటే అవి చాల సున్నితం గా ఉండి సులభం గా గాయాల పాలు అవుతూ ఉంటాయి.

మీరు పండని అంజీరలను కొని వాటిని సహజం గా గది ఉష్నోగ్రత వద్ద పండించి తినవచ్చు. నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల ఎండు అంజీరాలు పండని అంజీరాల కంటే గది ఉష్నోగ్రత వద్ద ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మీరు వేడి మరియు తేమ ప్రదేశాలలో ఉంటె కనుక అంజీరాలను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది అప్పుడు అవి 6-8నెలలు వరకు నిల్వ ఉంటాయి. కుళ్ళు కంపు కానీ బూజు కానీ గమనిస్తే వాటిని పాడవేయడం మంచిది.

ఊహాగా ఒక 3-5 పళ్లను కానీ 40 గ్రాములు కానీ ఒక రోజు కి తీసుకోవచ్చు వాటివలన పెద్ద

దుష్ప్రభావాలు ఉండవు, కానీ మీ శరీర రకము వయసు లింగము బట్టి ఒకసారి ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి వీటిని తినడం మేలు.

అంజీర మరియు పెరుగును ముద్దగా చేసి సముచితముగా రాస్తే శరీరం ప్రకాశవంతంగా మరియు కాంతి వంతంగా అవుతుంది.

 • కొంత మంది సహజం గానే అంజీరకు ఎలర్జిక్ అయ్యి ఉంటారు. అంజీరపండు దాని యొక్క భేదిమందు ప్రభావం వలన మలబద్దకాన్ని నివారించడంలో చాలా ప్రభావం చూపిస్తుంది, కానీ ఎక్కువ మోతాదులో అంజీర తినడం వలన అతిసారం కలుగవచ్చు.
 • ఒకవేళ మీరు రక్తాన్ని పీల్చే (blood thinning) మందులు వాడుతున్నట్లు ఐతే మీరు తినే ఆహారంలో అంజీర కలిస్తే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది ఎందుకంటే అంజీర లో ఉన్న విటమిన్ కె (K) కి సహజగా రక్తాన్ని పీల్చే గుణం ఉండటం వలన అది మందులపై మరింత ప్రభావం చూపిస్తుంది.
 • అంజీర ఆకులు సముచితముగా చర్మానికి వాడటం వలన చర్మ సున్నితత్వం పెరుగుతుంది. ఎండ లోకి వెళ్ళేటప్పుడు అంజీర ఆకుల ముద్దను రాసుకోకూడదని సూచిస్తారు.
 • అంజీర రక్తం లోని చెక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, కాబట్టి మీకు మధుమేహం ఉంటే ఇప్పటికే మందులు వాడుతుంటే, లేక మాములుగా రక్త చెక్కెర స్థాయిలు తక్కువుగా ఉంటే అంజీర ను తినేముందు వైద్యున్ని సంపాదించడం ఎంతో ముఖ్యము.
 • అంజీర సహజముగానే రక్తాన్ని పీలుస్తుంది, కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా శాస్త్ర చికిత్స చేయించుకోవాలి అనుకుంటుంటే లేక ఇటీవలి కాలం లో శాస్త్ర చికిత్స చేయించుకుంటే అంజీర పళ్ళను ఒక రెండు వారాల వరకు తినకపోవటమే మంచిది. అయితే అంజీర పండు మూత్రపిండాలలో అదనపు విషాలను బయట కు నెట్టడంలో చాలా గొప్పది. దీనిలో చాలా ఎక్కువ ఆక్సలేట్స్ (oxalates) (ఒకరకమైన సహజంగా లభించు జీవ సమ్మేళనం). ఈ ఆక్సలేట్స్ కాల్షియమ్ తో తగులుకొని శరీరం లో కాల్షియమ్ -ఆక్సలేట్స్ గా మారుతాయి ఇవే మూత్రపిండాలలో మరియు పిత్తాశయం లో రాళ్లు తయారుకావడానికి ముఖ్య అపరాదులు. కాబట్టి అంజీరను మితముగా తినడం మంచిది.

उत्पाद या दवाइयाँ जिनमें Figs है

వనరులు

 1. Russo F1, Caporaso N, Paduano A, Sacchi R. Phenolic compounds in fresh and dried figs from Cilento (Italy), by considering breba crop and full crop, in comparison to Turkish and Greek dried figs.. J Food Sci. 2014 Jul;79(7):C1278-84. PMID: 24888706
 2. Sergio D. Paredes, et al. Melatonin and Tryptophan Affect the Activity–Rest Rhythm, Core and Peripheral Temperatures, and Interleukin Levels in the Ringdove: Changes With Age. J Gerontol A Biol Sci Med Sci. 2009 Mar; 64A(3): 340–350. PMID: 19211547
 3. Glenda Lindseth, Brian Helland, Julie Caspers. The Effects of Dietary Tryptophan on Affective Disorders. Arch Psychiatr Nurs. 2015 Apr; 29(2): 102–107. PMID: 25858202
 4. Simon N. Young. How to increase serotonin in the human brain without drugs. J Psychiatry Neurosci. 2007 Nov; 32(6): 394–399. PMID: 18043762
 5. Inam QU1, Ikram H1, Shireen E1, Haleem DJ2. Effects of sugar rich diet on brain serotonin, hyperphagia and anxiety in animal model of both genders.. Pak J Pharm Sci. 2016 May;29(3):757-63. PMID: 27166525
 6. National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases [Internet]. National Institute of Health; Healthy Bones Matter.
ऐप पर पढ़ें