గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ నిర్వహించడమనేది తల్లిదండ్రులకు నిజంగా ఒక ఉద్వేగభరితమైన సమయం, ఎందుకంటే ఇది వారి బిడ్డను చేతులతో పట్టుకోక ముందే చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది! కడుపులో ఉన్నశిశివును చూసే అవకాశం కలిగించే అల్ట్రాసౌండ్ పద్ధతులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. గర్భధారణ సమయంలో చేసే అల్ట్రాసౌండ్, దీనినే సోనోగ్రామ్ అని కూడా పిలుస్తారు, ఇది చాలా మంది కాబోయే తల్లులకు సూచించే ఇచ్చే ఒక ప్రినేటల్ పరీక్ష (prenatal test). గర్భధారణ యొక్క వివిధ సమయాల్లో శిశువు, మాయ (ప్లాసెంటా) మరియు అండాశయాల (ఓవరీ) చిత్రాలను చూపించడానికి అల్ట్రాసౌండ్ అధిక-ఫ్రీక్వెన్సీ గల ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ  విధానం ప్రతిధ్వనిలను (ఎకోలను) రికార్డ్ చేస్తుంది మరియు వాటిని చిత్రాలు లేదా వీడియోలుగా మారుస్తుంది. ఆ విధంగా, వైద్యులు శిశువు ఆరోగ్యం మరియు అభివృద్ధిని తనిఖీ చేయవచ్చు.

అల్ట్రాసౌండ్ ఎప్పుడు నిర్వచించారనే దాని బట్టి శిశువు యొక్క  చేతులు, కాళ్ళు మరియు ఇతర శరీర భాగాలను చూడవచ్చు. అల్ట్రాసౌండ్ పిండం అబ్బాయా లేదా అమ్మాయా అనే విషయాన్నీ కూడా తెలియజేస్తుంది. అయితే, భారతదేశంలో మరియు కొన్ని ఇతర దేశాలలో, పిండం యొక్క లింగ నిర్దారణ అనైతికమైనది మరియు నిషేధించబడింది.

శిశువు యొక్క హృదయ స్పందనను గ్రహించవచ్చు, శిశువు కడుపు లోపల ఈత కొట్టడాన్ని (తిరగడాన్ని) కూడా చూడవచ్చు. కాబట్టి, ఈ సాంకేతికత బిడ్డను కనేవారి ఆనందానికి మరో మూలంగా మారింది.

 1. గర్భధారణ అల్ట్రాసౌండ్ లేదా సోనోగ్రఫీ ఎందుకు చేస్తారు? - Why is pregnancy ultrasound or pregnancy sonography done? in Telugu
 2. గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ రకాలు - Types of ultrasound during pregnancy in Telugu
 3. గర్భధారణ అల్ట్రాసౌండ్ ఎలా జరుగుతుంది? - How is pregnancy ultrasound done?
 4. గర్భధారణ సమయంలో ఎన్ని అల్ట్రాసౌండ్లు నిర్వహిస్తారు? - How many ultrasounds are done during pregnancy? in Telugu
 5. కడుపులో కవలలు లేదా ముగ్గురు ఉన్న సందర్భంలో అల్ట్రాసౌండ్ స్కాన్ - Ultrasound scan in case of twins or triplets in Telugu
 6. గర్భధారణ అల్ట్రాసౌండ్ కోసం ఎలా సిద్ధం కావాలి? - How to prepare for the pregnancy ultrasound? in Telugu
 7. గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్లు సురక్షితమేనా? - Are ultrasounds during pregnancy safe? in Telugu
 8. గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్‌ యొక్క ఉపసంహారం - Takeaway on ultrasound during pregnancy in Telugu

గర్భధారణ అల్ట్రాసౌండ్ గర్భధారణ సమయంలో చాలాసార్లు నిర్వహిస్తారు. మొదటి సారి గర్భధారణను నిర్ధారించడం మరియు గర్భధారణ తేదీని తెలుసుకోవడం కోసం. తర్వాత, పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని చూడటానికి మరియు గర్భం యొక్క పురోగతిని తనిఖీ చేయడానికి ఈ ప్రక్రియ జరుగుతుంది. రెండవ త్రైమాసికంలో ఒక నిర్దిష్ట సమయంలో, అల్ట్రాసౌండ్ శిశువు యొక్క శరీర నిర్మాణం మరియు హృదయ స్పందనలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ చేయడానికి వివిధ కారణాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:

 1. గర్భ నిర్దారణ పరీక్షగా అల్ట్రాసౌండ్: స్త్రీ గర్భం ధరించిందా లేదా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ముందుగా జరుగుతుంది. కొన్ని సార్లు, పిండం గర్భాశయం వెలుపల అంటే ఫెలోపియన్ గొట్టాల వంటి భాగాలలో అభివృద్ధి చెందుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ఫెలోపియన్ గొట్టాలలో పిండం అభివృద్ధి చెందడం) గురించి మరియు శిశువు యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడానికి ఈ అల్ట్రాసౌండ్ సహాయపడుతుంది. (మరింత చదవండి: గర్భనిర్దారణ పరీక్ష)
 2. గర్భధారణ సమయంలో శిశువు వయస్సును తనిఖీ చేయడానికి అల్ట్రాసౌండ్: మొదటి త్రైమాసికంలో గెస్టేషనల్ శాక్‌ (శిశివు ఏర్పడే సంచి) ను గుర్తించడం ద్వారా కడుపులో శిశువు యొక్క వయస్సును నిర్ణయించవచ్చు. ట్రాన్స్‌వాజినల్ (Transvaginal) అల్ట్రాసౌండ్ గర్భధారణ యొక్క 4 వారాల లోపు వయసును నిర్ణయించగలదు మరియు ట్రాన్స్‌అబ్డోమినల్ (transabdominal) అల్ట్రాసౌండ్ గర్భధారణ యొక్క 5 వారాల లోపు వయసును గుర్తించగలదు. ప్రవాసవ తేదీని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.
 3. గర్భాల సంఖ్యను నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్: కడుపులోని పిల్లల సంఖ్యను నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ సహాయపడుతుంది,అంటే స్త్రీ గర్భంలో ఒకే బిడ్డ ఉందా లేదా కవలలు లేదా ముగ్గురిని మోస్తుందా అనే విషయాన్నీ తెలియజేస్తుంది. సాధారణంగా ఆమె 10 నుండి 13 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఇది తెలుస్తుంది.
 4. పిండం పెరుగుదలను అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్: గర్భధారణ యొక్క రెండవ మరియు మూడవ త్రైమాసికంలో శిశువు యొక్క పెరుగుదలను అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్ సహాయపడుతుంది. ఈ స్కాన్ శిశువు యొక్క చేతులు, కాళ్ళు మరియు ఇతర శరీర భాగాలను చూడటానికి సహాయపడుతుంది మరియు శిశువు గర్భధారణ వయస్సు కంటే పెద్దగా లేదా చిన్నగా ఉందా అనే దాన్ని అంచనా వేయడానికి ఇది వైద్యులకి సహాయపడుతుంది.
 5. శిశివులో పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలను గుర్తించడానికి అల్ట్రాసౌండ్: పెదవిలో చీలికలు (నోరు మరియు పై పెదవి కప్పులో చీలికలు లేదా బీటలు), గుండె మరియు మెదడులో క్రమరాహిత్యాలు లేదా స్పినా బిఫిడా [spina bifida] (శిశువు యొక్క వెన్నుముక వైఫల్యం లేదా సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం).
 6. అమ్నియోటిక్ ద్రవం మరియు మాయను తనిఖీ చేయడానికి అల్ట్రాసౌండ్: పిండం బొడ్డు తాడు ద్వారా మాయ (ప్లాసెంటా) కు అనుసంధానించబడి ఉంటుంది మరియు దాని ద్వారా అన్ని ముఖ్యమైన పోషకాలను పొందుతుంది. అల్ట్రాసౌండ్ మాయ స్థానాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది మరియు ఇది గర్భాశయానికి దగ్గరగా లేదా దూరంగా ఉందా అని పరిశీలిస్తుంది. శరీరంలోని అమ్నియోటిక్ ద్రవ స్థాయిలను అంచనా వేయడానికి కూడా అల్ట్రాసౌండ్ సహాయపడుతుంది. అమ్నియోటిక్ ద్రవం పిండం చుట్టూ ఉంటుంది మరియు శిశువును ఏదైనా ఒత్తిడి మరియు హాని నుండి రక్షిస్తుంది మరియు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది.
 7. గర్భం లోపల శిశువు యొక్క స్థితిని పరిశీలిస్తుంది: అల్ట్రాసౌండ్ శిశువు యొక్క స్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మీ బిడ్డ తల పైకి మరియు అడుగు భాగం కిందకి లేదా శిశువు కాళ్ళు విస్తరించి లేదా వంగి ఉన్నాయా అనే దాన్ని వైద్యులు అంచనా వేయవచ్చు. శిశువు ప్రసవం సాధారణముగా చేయవచ్చా లేదా సిజేరియన్ (శస్త్రచికిత్స) అవుతుందా అని నిర్ణయించడానికి ఇది సహాయపడుతుంది.
Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW
 1. గర్భధారణ సమయంలో ట్రాన్స్‌వాజినల్ (transvaginal) అల్ట్రాసౌండ్: గర్భధారణ సమయంలో, శిశువు చాలా చిన్నగా ఉన్నప్పుడు, శిశువు యొక్క మంచి చిత్రాన్ని పొందడానికి ట్రాన్స్‌వజైనల్ అల్ట్రాసౌండ్ లేదా ఎండోవజైనల్ (endovaginal) అల్ట్రాసౌండ్ సిఫార్సు చేయబడుతుంది. ఈ ప్రక్రియలో యోని లోపల 2 నుండి 3 అంగుళాల అల్ట్రాసౌండ్ ప్రోబ్‌ను చొప్పించడం జరుగుతుంది, అయితే ట్రాన్స్‌డ్యూసర్‌ను కటి (పెల్విస్) వెలుపల ఉంచుతారు. సాధారణంగా ఇది యోనిలో రక్తస్రావం ఏమైనా ఉందా, శిశువు యొక్క హృదయ స్పందనను పర్యవేక్షించడం, మాయని పరిశీలించడం, గర్భధారణ ప్రారంభ దశను లేదా గర్భస్రావ అనుమానం ఉన్నట్లయితే దానిని నిర్ధారించడానికి జరుగుతుంది.
 2. గర్భధారణ సమయంలో ప్రామాణిక ట్రాన్సాబ్డోమినల్ (transabdominal) అల్ట్రాసౌండ్: ట్రాన్స్అబ్డోమినల్ అల్ట్రాసౌండ్ అనేది 8 వారాల గర్భంలో పిండాన్ని అంచనా వేయడానికి చేసే ఒక ప్రామాణిక అల్ట్రాసౌండ్. ఈ విధానంతో, ట్రాన్స్‌డ్యూసర్‌ మానిటర్కు అనుసంధానించబడి ఉంటుంది, అయితే అది ఉదరం గుండా వెళుతుంది. ట్రాన్స్‌డ్యూసర్‌ను ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తుంది, అవి తిరిగి ప్రతిధ్వనించడం ద్వారా మానిటర్‌లో చిత్రాన్ని ఏర్పరుస్తుంది.
 3. గర్భధారణ సమయంలో డాప్లర్ (Doppler) అల్ట్రాసౌండ్: రక్త నాళాలలో రక్త ప్రవాహాన్ని పరిశీలించడానికి డాప్లర్ అల్ట్రాసౌండ్ ధ్వని తరంగాలను లేదా ఎకోలను ఉపయోగిస్తుంది. గర్భధారణ సమయంలో డాప్లర్ అల్ట్రాసౌండ్ శిశువు, గర్భాశయం మరియు మాయలో రక్త ప్రసరణను అంచనా వేయడానికి సహాయపడుతుంది.
 4. గర్భధారణ సమయంలో 3-డి (3-D) అల్ట్రాసౌండ్: 3-డి అల్ట్రాసౌండ్ అనేది శిశువు యొక్క 2-డి చిత్రాలను తీసే ఒక ట్రాన్స్‌బాడోమినల్ అల్ట్రాసౌండ్, తరువాత వాటిని కంప్యూటర్ ద్వారా 3-డైమెన్షనల్ చిత్రాలుగా మార్చుతారు, ఇవి నిజమైన ఛాయాచిత్రాలుగా వస్తాయి. అలాగే, 3-డి చిత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే, 3-డి అల్ట్రాసౌండ్ నిర్వహించడం యొక్క భద్రత పై అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను చూపుతున్నాయి.
 5. గర్భధారణ సమయంలో 4-డి అల్ట్రాసౌండ్: 2-డి లేదా 3-డి చిత్రాల మాదిరిగా కాకుండా, 4-డి స్కానర్లు అల్ట్రాసౌండ్ చిత్రాలతో పాటు శిశువు యొక్క కదలికను చూపిస్తాయి.
 6. గర్భధారణ సమయంలో పిండం ఎకోకార్డియోగ్రఫీ (Fetal echocardiography): ఈ పద్ధతిని ఉపయోగించి, వైద్యులు శిశువు యొక్క హృదయ స్పందనను అంచనా వేయవచ్చు. దీనిలో స్వయంగా అంటుకునే ఎలక్ట్రోడ్లను ఛాతీపై పెడతారు మరియు ఇది పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను తనిఖీ చేయడానికి ఎక్కువగా జరుగుతుంది.

సాధారణ అల్ట్రాసౌండ్ విషయంలో, వైద్యుడు మొదట స్త్రీ వేసుకున్న దుస్తుల నుండి గౌనులోకి మారమని తర్వాత పరీక్షా టేబుల్ (బల్ల) మీద పడుకోమని చెప్తారు. అప్పుడు పొత్తికడుపు చర్మంపై కొద్ది మొత్తంలో నీటిలో కరిగే (వాటర్ సోల్యూబీల్) జెల్ పూయబడుతుంది. తరువాత ​​ట్రాన్స్‌డ్యూసర్ అనే చిన్న పరికరాన్ని పొత్తికడుపు మీద ఉపయోగిస్తారు అది కడుపులోకి ధ్వని తరంగాలను పంపుతూ బిడ్డ చిత్రాలను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా, ప్రక్రియ నిర్వహిస్తున్నపుడు ఎటువంటి అసౌకర్యం ఉండదు. ప్రక్రియ పూర్తయిన తర్వాత టవల్ లేదా టిష్యూ పేపర్ ఉపయోగించి జెల్ తుడిచివేయబడుతుంది.

ప్రతి కాబోయే తల్లి అడిగే ప్రశ్న ఇది. సాధారణ ప్రినేటల్ కేర్ కోసం సిఫార్సు చేయబడే అల్ట్రాసౌండ్ల సంఖ్య నిర్దిష్టంగా ఉండదు. మరియు అల్ట్రాసౌండ్ల వలన శాస్త్రీయంగా నిరూపితమైన సమస్యలు ఏవి ఉండవు మరియు సాపేక్షంగా సురక్షితమైనవి, గర్భధారణ సమయంలో ఎప్పుడైనా వీటిని నిర్వహించవచ్చు.

సాధారణంగా, శిశువు ఆరోగ్యాన్ని మరియు తల్లి గర్భకోశాన్ని అంచనా వేయడానికి ప్రతి త్రైమాసికంలో అల్ట్రాసౌండ్ను నిర్వహిస్తారు.

 1. గర్భధారణ యొక్క మొదటి త్రైమాసికంలో అల్ట్రాసౌండ్: గర్భధారణ యొక్క మొదటి త్రైమాసికంలో, పిండం యొక్క సాధ్యతను (viability) తనిఖీ చేయడానికి, గడువు తేదీని తెలుసుకోవడానికి, శిశువు యొక్క హృదయ స్పందనను పరిశీలించడానికి, గర్భాల (పిండాల) సంఖ్యను, స్థానాలను మరియు ఏదైనా యోని రక్తస్రావం సంభావ్యతను తొలగించడానికి అల్ట్రాసౌండ్ జరుగుతుంది. సాధారణంగా స్త్రీ 6-8 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు దీనిని నిర్వహిస్తారు.
 2. గర్భం యొక్క రెండవ త్రైమాసికంలో అల్ట్రాసౌండ్: గర్భధారణ యొక్క రెండవ త్రైమాసికంలో, అనాటమీ అల్ట్రాసౌండ్ అని కూడా పిలువబడే ఈ అల్ట్రాసౌండ్ శిశువు యొక్క పెరుగుదలను పరిశీలించడానికి, ఏదైనా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా పుట్టుకతో వచ్చే వ్యాధులను అంచనా వేయడానికి, శిశువు యొక్క శరీర నిర్మాణాన్ని మరియు శిశువు యొక్క లింగాన్ని తెలుసుకోవడానికి  నిర్వహిస్తారు. భారతదేశంలో లింగాన్ని తెలుసుకోవడం నిషేధించబడింది. రెండవ అల్ట్రాసౌండ్ గర్భధారణ యొక్క 18-20 వారాలలో జరుగుతుంది.
 3. గర్భధారణ యొక్క మూడవ త్రైమాసిక సమయంలో అల్ట్రాసౌండ్: శిశువు యొక్క పెరుగుదల, ఏవైనా క్రమరాహిత్యాలు లేదా శిశువు యొక్క స్థితిలో ఏవైనా మార్పులను అంచనా వేయడానికి గర్భధారణ యొక్క మూడవ త్రైమాసికంలో ఈ అల్ట్రాసౌండ్ను నిర్వహిస్తారు. ఇది 32-34 వారాలలో జరుగుతుంది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ ప్రకారం, కడుపులో కవలలు లేదా ముగ్గురు ఉన్న గర్భిణీ స్త్రీలలో (వాటిని బహుళ గర్భాలు అని పిలుస్తారు) పిండాల స్థానాలను తెలుసుకోవడానికి 11 వారాల నుండి 13 వారాల 6 రోజుల గర్భధారణ సమయం మధ్య అల్ట్రాసౌండ్ స్కాన్ చేయమని సిఫార్సు చేయబడుతుంది. అలాగే బహుళ గర్భాల విషయంలో, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగించి, పిండాలను లేబుల్ చేసేలా వైద్యులు చూసుకుంటారు. అలాగే, బహుళ గర్భాలు ఉన్న స్త్రీల పిండాలలో ఏవైనా నిర్మాణ అసాధారణతలను పరిశీలించడానికి రెండవ త్రైమాసికం నుండి ప్రతి 4 వారాలకు ఒకసారి వివరంగా స్కాన్ చేయించుకోవాలని  సిఫార్సు చేయబడుతుంది.

అల్ట్రాసౌండ్ కోసం సిద్ధం కావడం చాలా సులభం. శిశువు యొక్క స్పష్టమైన స్కాన్లు మరియు అధిక-నాణ్యత చిత్రాలను పొందడానికి స్త్రీ తన మూత్రాశయాన్ని పూర్తిగా నింపి ఉంచుకోవాలి. కాబట్టి సోనోగ్రఫీ కోసం వెళ్ళే ముందు 8 గ్లాసుల నీరు లేదా అంతకంటే ఎక్కువ తాగాలని గుర్తుపెట్టుకోండి. మూత్రాశయం నిండి ఉండాలి మరియు ఎంత అత్యవసరం అని భావించినా మూత్రం పాస్ (మూత్రవిసర్జన) చెయ్యకూడదు.

గర్భధారణ విశ్లేషణ విధానాలలో అల్ట్రాసౌండ్ అత్యంత సాధారణ ప్రక్రియ. నిస్సందేహంగా ఇది అనుకూలమైన మరియు నొప్పిలేకుండా నిర్వహించే విధానం, అయితే ఈ స్కాన్ల భద్రతపై మహిళలు ఇప్పటికీ భయపడుతూ ఉంటారు. అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ ప్రకారం, “పిండంపై అధికంగా అల్ట్రాసౌండ్లు నిర్వహించడం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు పూర్తిగా తెలియవు. వైద్యపరంగా సూచించినప్పుడు మాత్రమే అల్ట్రాసౌండ్ ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది”

Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

ప్రెగ్నన్సీ అల్ట్రాసౌండ్ అనేది ఒక ప్రినేటల్ పరీక్ష, ఇది శిశువు మరియు తల్లి గర్భం యొక్క చిత్రాలను పొందడానికి అధిక-ఫ్రీక్వెన్సీ గల ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఖచ్చితంగా, ఇది తల్లిదండ్రులకు ఉద్వేగపూరితమైన సమయం కాని వైద్యపరంగా సిఫారసు చేసినప్పుడు మాత్రమే అల్ట్రాసౌండ్ కోసం వెళ్ళాలి. స్కాన్‌లను సురక్షితంగా పరిగణించినప్పటికీ, అల్ట్రాసౌండ్ను తక్కువగానే ఉపయోగించాలి మరియు అనవసరమైన స్కాన్‌లను నివారించాలి. అనుభవజ్ఞుడైన అల్ట్రాసౌండ్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లి, (ధ్వని తరంగాలకు) తక్కువ ఎక్స్పోజర్ ఉండే  మంచి ఫలితాలను ఇచ్చే విధానాలను ఎంచుకోవాలి.

వనరులు

 1. National Institute for Health and Care Excellence. Multiple pregnancy: twin and triplet pregnancies. [Internet]
 2. A. Khalil et al. ISUOG Practice Guidelines: role of ultrasound in twin pregnancy. Ultrasound in Obstetrics & Gynecology
 3. American Pregnancy Association. [Internet]; Ultrasound: Sonogram.
 4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy tests - ultrasound
 5. U. S Food and Drug Association. [Internet]. Ultrasound Imaging
 6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Ultrasound pregnancy
 7. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Prenatal care and tests.
Read on app