గర్భ నిర్ధారణ పరీక్ష అనేది ఓ మహిళకు అత్యంత ఆందోళనకరమైన సమయం,  ఎందుకంటే ఆమె గర్భవతి కావాలో లేదా వద్దో అన్న మీమాంసపై ఆధారపడి ఉంటుంది. ఈ గర్భనిర్ధారణ హోంటెస్ట్ కిట్ పరీక్షలు ఎంతో సులభంగా మరియు ఎంతో త్వరితంగా అవుతున్నప్పటికీ, ఆ పరీక్షలు అందించే (results) వార్త ఎల్లప్పుడూ ప్రతి మహిళకు జీవితాన్నే మార్చేసే క్షణం. గర్భాశయ పరీక్షా వస్తు సామగ్రి గర్భధారణ హార్మోన్ (మానవ కోరియోనిక్ గోనాడోట్రోపిన్) అని పిలవబడే గర్భధారణ హార్మోన్ను గుర్తిస్తుంది. వివిధ రకాలైన గర్భ నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, ఈ పరీక్షలో ఉన్న ప్రక్రియను బట్టి  ఆరోగ్య నిపుణులు ఈ గర్భనిర్ధారణ పరీక్షల్ని ఉపయోగిస్తారు.

గర్భ నిర్ధారణ మూత్ర పరీక్షను నిర్వహించడానికి, ఒక స్ట్రిప్ (strip), క్యాసెట్, లేదా మిడ్ స్ట్రీమ్ (midstream) పరికరం వాడవచ్చు. దీని తరువాత, ఫలితాల యొక్క వివరణ తయారీదారు మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది. గర్భనిర్ధారణా పరీక్షా పరికరాలకు 100% కచ్చితత్వం లేనందున, ఒక ఆరోగ్యసంరక్షణా సౌకర్యాల కేంద్రంలో ఒక రక్తం నమూనాను ఉపయోగించి లేదా అల్ట్రాసౌండ్ను చేయడం ద్వారా గర్భధారణ నిర్ధారణా పరీక్ష (confirmatory pregnancy test) నిర్వహిస్తారు.

గర్భనిర్ధారణ పరీక్షలో ఏమి ఉంటుంది?

మూత్రం లేదా రక్తంలో గర్భధారణ హార్మోన్, hCG (మానవ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)ని గుర్తించడం లేదా కనుక్కోవడం గర్భనిర్ధారణ పరీక్షల యొక్క అంతర్లీనసూత్రం. కాబట్టి,  "గర్భనిర్ధారణ పరీక్ష" అనే పదాన్ని అపప్రయోగంగా లేదా పొరబాటుగా వాడటం జరుగుతోంది, నిజానికి ఈ పరీక్షలో హార్మోన్ను గుర్తించడం జరుగుతుంది కానీ గర్భస్థ పిండాన్ని కాదు. ఈ హార్మోన్ గర్భాశయ అంతర్గత గోడలకు ముందటి పిండము జతపడిన వెంటనే మాయ (దీన్నే గర్భస్థ మావి, పోషణావయవము అంటారు) నుండి విడుదల అవుతుంది.

అందువల్ల, ఇది గర్భధారణ యొక్క ఒక ముఖ్యమైన సూచిక. మూత్ర పరీక్షతో పాటు, ఆరోగ్య సంరక్షణాకేంద్రం (హెల్త్కేర్ సెంటర్) పరీక్షలో నిర్వహించే గర్భనిర్ధారణ పరీక్ష రక్తంలో HCG ఉనికిని గుర్తించడం జరుగుతుంది, ఇంకా, గర్భంలో పిండం యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి ఆల్ట్రాసౌండ్ ను ఉపయోగించడం జరుగుతుంది.

 1. గర్భనిర్ధారణ పరీక్షల్లో రకాలు - Types of pregnancy tests in Telugu
 2. గర్భ నిర్ధారణ పరీక్షను ఎప్పుడు చేయించుకోవాలి - When to take a pregnancy test in Telugu
 3. ఇంట్లోనే గర్భనిర్ధారణ పరీక్ష - Pregnancy test at home in Telugu
 4. గర్భ నిర్ధారణ పరీక్ష కిట్ ను ఎలా ఉపయోగించాలి - How to use pregnancy test kit in Telugu
 5. గర్భ నిర్ధారణ టెస్ట్ కిట్ ఫలితాలు - Pregnancy test kit results in Telugu
 6. గర్భ నిర్ధారణ పరీక్షలు ఎంత ఖచ్చితమైనవి - How accurate are pregnancy tests in Telugu
 7. ఇంట్లో గర్భనిర్ధారణ పరీక్ష చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు - Precautions while performing a pregnancy test at home in Telugu
 8. గర్భనిర్ధారణ పరీక్ష కిట్ ధర - Pregnancy test kit price in Telugu
 9. ఆసుపత్రుల్లో గర్భనిర్ధారణ పరీక్షలు - Pregnancy tests at clinics in Telugu
 10. క్లినికల్ గర్భనిర్ధారణ పరీక్ష ఖర్చు - Clinical pregnancy test cost in Telugu
గర్భనిర్ధారణ పరీక్షలు: హోంటెస్ట్ కిట్, వైద్య పరీక్ష, ఖర్చు మరియు ఫలితాలు వైద్యులు

గర్భనిర్ధారణ పరీక్షలు hCG మరియు అల్ట్రాసోనోగ్రఫీ (USG) వాడకం ఆధారంగా ఈ క్రింది విధంగా  విభజించబడ్డాయి:

hCG ఆధారంగా

 • రక్త పరీక్షలు
  ఈ రక్తపరీక్షలు సీరం hCG ను గుర్తించడానికి జరుగుతాయి మరియు సాధారణంగా చివరి ఋతు కాలం (LMP) అయిన మూడు వారాల తర్వాత నిర్వహిస్తారు. రక్త సీరంతో కూడిన గర్భనిర్ధారణ పరీక్షను ఆరోగ్య సంరక్షణా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు.
 • మూత్ర పరీక్ష
  ఈ మూత్ర పరీక్షలు మహిళ యొక్క మూత్రం నమూనాలో hCG హార్మోన్ల ఉనికిని గుర్తించడానికి ఉద్దేశించబడ్డాయి మరియు చివరి ఋతు కాలం తర్వాత ఐదు వారాల తర్వాత ఈ మూత్రపరీక్షలు నిర్వహిస్తారు. మహిళ యొక్క మూత్రం ఉపయోగించి గర్భంనిర్ధారణ పరీక్షను ఇంటిలోనే అయినా  చేయవచ్చు లేదా ఆరోగ్య సంరక్షణా కేంద్రాల్లో అయినా చేయవచ్చు.

USG ఆధారంగా

ఈ పరీక్షలను ధ్వని తరంగాలను పంపడం మరియు అందుకునేచర్యను కల్గిన ఒక ‘ప్రోబ్’ పరికరాన్ని ఉపయోగించి ఓ స్త్రీరోగ నిపుణ వైద్యుడు/వైద్యురాలు (గైనకాలజిస్ట్) ఈ USG పరీక్షలు నిర్వహిస్తారు.

 • ట్రాన్స్ వెజినాల్ (Transvaginal)
  ట్రాన్స్ వెజినాల్ USG పరీక్షలో, ప్రోబ్ పరికరం మహిళ యొక్క యోని లోనికి 2-3 అంగుళాల లోతుకు జొప్పించబడుతుంది, తద్వారా, యోని అంతర్గత పునరుత్పత్తి అవయవాలను పరిశీలించడం జరుగుతుంది. ఈ పరీక్ష సాధారణంగా గత ఋతు కాలం యొక్క ఐదు వారాల తర్వాత చేయబడుతుంది మరియు గర్భధారణ ప్రారంభాన్ని నిర్ధారిస్తుంది.
 • ట్రాన్స్ అబ్డోమినల్ (Transabdominal)
  ట్రాన్స్ అబ్డోమినల్ అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ పరీక్ష(Transabdominal USG) లో ఒక జెల్లీ పొత్తికడుపు మరియు కటి ప్రాంతం యొక్క చర్మం మీద పూయబడుతుంది. ఇలా చేయడంవల్ల ధ్వని తరంగాల మెరుగైన బదిలీలో సహాయపడుతుంది. ఆ తరువాత, ప్రోబ్ పరికరాన్ని జెల్లీ పై నుండి దిగవిడిచి మానిటర్ పైన ప్రొబేపరికరం చూపే యోని లోపలి చిత్రం కనబడుతుంది. ట్రాన్స్వజనల్ (transvaginal) USGని సాధారణంగా గత ఋతుసమయం (ముట్టు) అయిన  ఆరు నెలల తర్వాత నిర్వహిస్తారు.
Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

గర్భ పరీక్షను ఎప్పుడు తెలుసుకోవాలంటే, మహిళల్లో ఋతు చక్రం గురించి బిట్ నేర్చుకోవడం ముఖ్యం. ఋతు చక్రంలో, అండో (గుడ్డు) 14 నుండి చివరి రోజుకు (14 రోజుల తర్వాత చక్రం) రెండు లేదా మూడు రోజుల వ్యవధిలో విడుదల అవుతుంది. వీటిని సారవంతమైన రోజులగా పిలుస్తారు. మీరు ఈ సమయంలో సెక్స్ కలిగి ఉంటే, గర్భం యొక్క ఇతర రోజులు పోలిస్తే గర్భం యొక్క అవకాశాలు లేదా గర్భవతి పొందడం ఎక్కువ.

గుడ్డు ఫలదీకరణం చేసినట్లయితే, మావి గర్భాశయం యొక్క అంతర భాగంలో గర్భాశయం యొక్క అంతర్గత లైనింగ్కు ఒక వారం తర్వాత మాండేవా HCG ను ఉత్పత్తి చేయడాన్ని ప్రారంభిస్తుంది. ఈ హార్మోన్ తొమ్మిది రోజు తర్వాత మూత్రం మరియు రక్తంలో కనిపించడం ప్రారంభమవుతుంది మరియు గర్భం యొక్క ఏడవ మరియు తొమ్మిదవ వారానికి మధ్య ఉన్న శిఖరాన్ని చేరుకుంటుంది.

అందువల్ల, మీరు గర్భవతిగా ఉన్నారని అనుమానించినట్లయితే, మీరు గత ఋతు కాలం యొక్క మూడవ వారంలో గర్భధారణ కిట్ ఉపయోగించి ఇంట్లో గర్భ పరీక్షను తీసుకోవచ్చు. మీరు మీ ఫలితాలను ధృవీకరించడానికి అల్ట్రాసౌండ్ చేయటానికి ఒక స్త్రీ జననేంద్రియకు వెళ్లవచ్చు.

(మరింత చదువు - ఋతుక్రమనొప్పి చికిత్స)

మందుల దుకాణాలలో ఉన్న అనేక ఓవర్ ది కౌంటర్ (OTC) గర్భనిర్ధారణ పరీక్షా పరికరాలు (pregnancy test kits) సరసమైన ధరలకు లభిస్తాయి. అయినప్పటికీ, కిట్ ధర బ్రాండ్ మరియు ఆ కిట్లో లభించే పరీక్షల సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు అందుబాటులో ఉన్న ఎంపికల నుండి కిట్ ను కొనుగోలు చేయవచ్చు మరియు ఇంట్లో వాటిని గర్భ పరీక్ష చేయడానికి మీరే స్వయంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ గర్భనిర్ధారణ కిట్ల విషయంలో వైద్యుల సలహా ఏమిటంటే ఈ కిట్ లో లభించే పరీక్షలను కనీసం మూడు సార్లు చేయాలని, దానివల్ల ఆ వచ్చే మూడు దఫాల ఫలితాలు  ఒకదానికొకటి సరిపోతున్నాయని నిర్ధారించుకోవడానికి వీలుంటుంది. నిద్రలేచిన వెంటనే మొట్టమొదట చేసే మూత్ర విసర్జనలోనే hCG యొక్క ఎక్కువ మొత్తాన్ని (పరిమాణం) కలిగి ఉన్నందున ఈ పరీక్షను ఎప్పుడూ ఉదయాన్నే చేయాలి. అందువల్ల, నిజమైన ఫలితం పొందడానికి అవకాశాలు బాగుంటాయి.

(మరింత చదువు - బాధాకరమైన మూత్రవిసర్జనకు చికిత్స)

ఓటిసి (over the counter-OTC) గర్భ నిర్ధారణ కిట్లు ఉపయోగించడానికి మరియు స్వీయ-విశ్లేషణకు సులభరీతిలో ఉంటాయి. అయితే, నిజమైన ఫలితాలను పొందడానికి మరియు తప్పుడు వివరణలను నివారించడానికి సరైన పద్ధతిని వాడాలి. ప్రారంభించటానికి, టెస్ట్ కిట్ గది ఉష్ణోగ్రతకు సమానంగా ఉండేట్లు చూసుకోవాలి, ఇక ఈ కింద వివరించిన దశలను అనుసరించండి:

 • పరీక్షకు ముందుగా సబ్బుతో మీ చేతులను శుభ్రంగా కడగండి మరియు కిట్ మీద ఇచ్చిన సూచనలను చదవండి.
 • మూత్రాన్ని సేకరించేందుకు శుభ్రమైన (స్టరైల్ చేయబడిన) కంటైనర్ ను తీసుకోండి. మూత్రవిసర్జన ప్రారంభంలో మూత్రం ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది గనుక చాలా మటుకు పరీక్షలు మూత్రవిసర్జన మధ్యంతర నమూనా (మూత్రవిసర్జన మధ్యలో తీసుకోబడినవి) ను సేకరిస్తారు.
 • మూత్రం సేకరించిన కంటైనర్ ను ఒక స్థిరమైన సమతల ఉపరితలంపై ఉంచండి, కిట్ నుండి పరీక్ష స్ట్రిప్లను తీసుకుని, రంగు ముగింపు నుండి వాటిని చేతితో పట్టుకోండి. స్ట్రిప్ యొక్క ఇంకో కోన వైపు పరీక్షకు ఉపయోగించే భాగం, కాబట్టి ఆ భాగాన్నితాకవద్దు.
 • ఒక క్వార్టర్ (పావుభాగం) అంగుళాల వరకు కంటైనర్లోకి స్ట్రిప్ను ముంచండి. ఆ స్ట్రిప్ పైన స్టాప్ లైన్ కూడా ఉంటుంది, దానికి మించి మూత్రం నమూనాలోకి స్ట్రిప్ని ముంచకూడదు అని అర్థం.
 • తయారీదారు సిఫార్సు చేసినవిధంగా కొన్ని నిమిషాల పాటు వేచి చూడండి, అటుపైన మీ ఫలితాలను దానిపై చదవండి.
 • కొన్ని పరీక్షా సామగ్రిలో (test kits), స్ట్రిప్స్ కాకుండా, మూత్రాన్ని పారద్రోలేందుకు ఒక నమూనా బావిని కలిగి ఉన్న ఒక చిన్న పరికరం ఉంటుంది. ఒక చదునైన ఉపరితలంపై పరీక్ష కిట్ ను ఉంచండి మరియు కిట్ తో పాటు అందించిన డ్రాపర్ (dropper) ఉపయోగించి, నమూనా బావిలో మూత్రం యొక్క కొన్ని చుక్కలను వేయండి. తయారీదారుచే ఆదేశించిన కొంత సమయం వరకు వేచి ఉండండి మరియు స్ట్రిప్ యొక్క మరో కొనలో పంక్తుల రూపాన్ని గమనించండి.
 • కొన్ని కిట్లు కంటైనర్ మరియు ఒక డ్రాపర్ (dropper) ను కల్గి ఉండవు. వాస్తవానికి, వాటి ఒక చివరన పీల్చుకునే ప్యాడ్, ఇంకో చివరన పరీక్ష విండోను కలిగి ఉంటాయి. మీరు నేరుగా ఆ పీల్చుకునే ప్యాడ్ పైన మూత్ర విసర్జన చేయాలి, అటుపై కొన్ని నిమిషాలు వేచి ఉండండి మరియు ఆ తర్వాత ఫలితాలను అర్థం చేసుకోవాలి.
  (మరింత చదువు: ఋతుక్రమ సమయంలో గర్భం దాల్చవచ్చా)
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

డిజిటల్ స్క్రీన్ను కలిగి ఉన్న కొన్ని పరీక్షా పరికరాలు (test kits) మీ కోసం ఫలితాలను అర్థం అయ్యేలా వివరిస్తాయి, కాబట్టి టెస్ట్ ఫలితాల గురించి మీరు ఎలాంటి గందరగోళం చెందడం ఉండదు. ఫలితాలు "గర్భిణి" మరియు "గర్భిణీ కాదు" వంటి పదాలుగా కనిపిస్తాయి. ఏదేమైనప్పటికీ, విస్తృతంగా ఉపయోగించబడే కిట్లు స్వీయ-వ్యాఖ్యానించబడాలి మరియు పరీక్ష ఫలితాలు ప్రతికూలమైనవి లేదా అనుకూలమైనవిగా ఉండాలి. కొన్నిసార్లు, కేవలం ఓ క్షీణించిన లైన్ ను మాత్రమే చూసినప్పుడు మీరు అయోమయానికి గురికావచ్చు.

 • సానుకూల (పాజిటివ్) గర్భనిర్ధారణ పరీక్ష
  పరీక్షా పరికరంలో ఒకే సింగల్ లైను కనబడితే పరీక్ష సరిగ్గా ప్రదర్శించబడటాన్ని సూచిస్తుంది మరియు నియంత్రణ (control-సి) అని పిలుస్తారు, అయితే మరో ఇతర పంక్తి పరీక్ష లైన్ (టి)గా ఉంటుంది. రెండు పంక్తుల రూపాన్ని స్క్రీన్ పై మీరు చూసినట్లయితే మీరు గర్భవతి అని సూచిస్తుంది. ఈ పంక్తులు ఎరుపు, ఆకుపచ్చ లేదా నీలం వంటి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి.
 • ప్రతికూల గర్భ పరీక్ష
  నియంత్రణ (control line) రేఖ మాత్రమే కనిపించినప్పుడు మరియు రెండవ పంక్తి యొక్క ఏ సంకేతం లేనట్లయితే, మీరు గర్భవతి కాదని మరియు పరీక్ష ఫలితం నెగటివ్గా వ్యాఖ్యానించబడుతుంది.
 • మందమైన లైన్
  కొందరు మహిళలు పరీక్ష పరికరం విండోలో ఒక మందమైన లైన్ను చూసినప్పుడు అయోమయానికి గురవుతారు. మూత్రంలో ఉన్న HCG హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నందున, చెరిపేయబడినట్లున్న గీత (faded line) మీరు గర్భవతి అని సూచిస్తుంది అని తయారీదారులు సూచించారు.

(మరింత చదువు -  గర్భందాల్చడం ఎలా)

అనేకమంది స్త్రీరోగవైద్యులు స్వీయ-విశ్లేషణ గర్భనిర్ధారణ పరీక్ష యొక్క ఫలితాలు కింద పేర్కొన్న వివిధ కారణాల రీత్యా మారవచ్చని సూచిస్తున్నారు.

 • గర్భనిర్ధారణ పరీక్ష ఎలా జరుపబడింది.
 • స్ట్రిప్ / నమూనా బావి / పీల్చుకునే ప్యాడ్ కలుషితమై ఉంటే
 • డిజిటల్ స్క్రీన్ తప్పు గలదైఉంటే .
 • పరీక్షకు ఉపయోగించిన మూత్రం పరిమాణం.
 • ఫలితాన్ని అంచనా వేయడానికి ముందు స్త్రీ వేచి చూచిన వ్యవధి.
 • ఈ గర్భనిర్ధారక కిట్ల పట్ల వ్యక్తిగత పక్షపాతం, ఎందుకంటే అవి సరిగా ఉంటాయో లేదా తప్పుగా ఉంటాయోనన్న మీమాంస.

అందువల్ల చాలామంది వైద్యులు సూచించేదేమంటే ఈ పరీక్షగురించి ఓ అభిప్రాయానికి వచ్చే ముందుగా ఈ గర్భనిర్ధారణ పరీక్షను కనీసం మూడు సార్లు చేసుకోవాలని సూచించారు. స్త్రీ నిజంగా గర్భవతి అయిందా లేదా అని తుది నిర్ధారణకు రావడానికి వైద్యుడిచేత గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మీరు పొందే ఫలితం నిజమైనది లేదా తప్పుడుది కావచ్చు మరియు అవి ఆ పరీక్షల నిర్దిష్ట మరియు సున్నితత్వం గురించి కిందివిధంగా తెలియజేస్తారు

 • నిజమైన ప్రతికూల ఫలితం (True negative result)
  నిజమైన ప్రతికూల ఫలితం అంటే ఫలితంగా ప్రతికూలంగా ఉంటుంది మరి ఆ  స్త్రీ గర్భవతి కాదని అర్థం.
 • తప్పుడు సానుకూల ఫలితం (False positive result)
  తప్పుడు సానుకూల ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఒక మహిళ గర్భవతి కాదని గుర్తించడంలో పరీక్ష విఫలమైనప్పుడు మరియు ఆమె ఇప్పటికీ గర్భవతి అని చూపినప్పుడు. అందువల్ల ఇది తప్పుడు సానుకూల ఫలితమే. ఇది గర్భస్రావం (గర్భస్థ శిశువులో కనీసం ఆరు వారాల్లోపు హార్మోన్ కనిపించవచ్చు), గర్భస్రావం ( miscarriage or abortion) వంటి కొన్ని పరిస్థితులలో మరియు వ్యాధులు, వ్యాఖ్యాన లోపం (పూర్తిగా రంగులేకుండా కనిపించే లైన్ ను అనుకూల ఫలితంగా  వ్యాఖ్యానించవచ్చు), ఒత్తిడికి ఔషధాలను సేవించడం, మానసిక ఆరోగ్య సమస్యలు, మూర్ఛ, అధిక రక్తపోటు మరియు పార్కిన్సన్స్ వ్యాధి, మూత్ర నాళాల అంటువ్యాధులు-UTIs, మూత్రపిండ వ్యాధులు వంటి వైద్య పరిస్థితులు, క్యాన్సర్ , మరియు అండాశయ సమస్యలు కూడా ఒక తప్పుడు సానుకూల పరీక్షను చూపుతాయి.
 • నిజమైన సానుకూల ఫలితం (True positive result)
  నిజమైన సానుకూల ఫలితం పరీక్ష సానుకూలంగా ఉందని మరియు ఆ స్త్రీ కూడా గర్భవతి అని సూచిస్తుంది.
 • తప్పు ప్రతికూల ఫలితం (False negative result)
  ఒక తప్పుడు ప్రతికూల ఫలితం అంటే ఆ స్త్రీ నిజానికి గర్భవతి అని అర్థం కానీ పరీక్ష ఫలితాలను చూపించడంలో విఫలమై ఉంటుంది. గర్భాశయ గోడలకు పిండం అతుక్కుపోవడానికి ముందుగానే మిమ్మల్ని మీరు గర్భనిర్ధారణ పరీక్ష చేయించుకోవడం, పరీక్షా సామగ్రి గడువు ముగిసిపోయి ఉండడం లేదా తక్కువ-నాణ్యత గల పరీక్ష పేలికలు (స్ట్రిప్స్), రోజంతా గడిచాక ఆలస్యంగా పరీక్షను తీసుకోవడం వంటివి మరియు ఇతర పరిస్థితులు తప్పుడు ప్రతికూల ఫలితానికి కారకాలు.

కొన్నిసార్లు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, గర్భనిర్ధారణ కోసం మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు మీరు తప్పుడు ఫలితాన్ని పొందవచ్చు. అందువల్ల, గర్భనిర్ధారణ పరీక్ష చేయటానికి ముందు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్త, చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాం:

 • గర్భనిర్ధారణ పరీక్ష వస్తు సామగ్రిని (pregnancy test kit) కొనుగోలు చేయడానికి ముందు మీరు పరిశోధన చేయండి మరియు నిజమైన ఫలితాలను వెల్లడించడంలో ఇప్పటికే నిరూపించబడి ఉన్న కిట్లను మాత్రమే కొనుగోలు చేయండి.
 • పరీక్ష కిట్ యొక్క గడువు తేదీని తనిఖీ చేయండి.
 • పరీక్ష ప్రారంభించటానికి ముందు గది ఉష్ణోగ్రతకు సమానంగా పరీక్ష కిట్ ఉష్ణోగ్రతను కూడా తీసుకురండి.
 • అన్నివేళలా ఉదయాన్నే పరీక్షించుకోండి, ఎందుకంటే ఉదయాన అయితే  హెచ్సీజి (గర్భిణి స్త్రీల మూత్రము నుండి తయారు చేయబడిన పూర్వ పిట్యూటరి గుణము ఉన్న పదార్థము-hCG) స్థాయి ఎక్కువగా ఉంటుంది.
 • మురికి చేతులతో మూత్రం నమూనా తాకవద్దు.
 • మధ్యధారా (మిడ్ స్ట్రీమ్) నమూనాను సేకరించండి.
 • పేలికల్ని (strips) చాలా ఎక్కువగా ముంచకండి.
 • నమూనా బావిని పొంగి పొర్లేలా నింపకండి.
 • ఎల్లప్పుడూ సిఫార్సు చేసిన సమయం కోసం వేచి చూడండి.
 • ఎప్పుడైనా ఒకసారి చేసిన కిట్ పరీక్ష సందేహాస్పదంగా ఉంటే, గర్భనిర్ధారణ పరీక్షను మళ్లీ చేసుకోండి.
Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

విస్తృతంగా ఉపయోగించే కిట్ల ధర ఎక్కువగా ఉంటుంది, అయితే సరాసరి ధర 50 రూపాయలు ఉంటుంది. అయితే, కిట్లో ఉండే పరీక్షల సంఖ్యను బట్టి, టెస్ట్ కిట్ ధర 45 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది.

పైన చెప్పినట్లుగా, ఇంటిలో చేసుకునే గర్భనిర్ధారణ పరీక్షలు ఎల్లప్పుడూ 100% ఖచ్చితమైనవి కావు, అందువల్ల ఇంట్లో చేసుకున్న ఆ పరీక్ష ఫలితాన్ని నిర్థారించుకోవడానికి ఒక స్త్రీవ్యాధి నిపుణ వైద్యుడ్ని సందర్శించండి. ఇది ప్రారంభ గర్భధారణను గుర్తించడంలో సహాయపడడమే గాక స్థానభ్రంశమైన గర్భాన్ని (ఎక్టోపిక్ గర్భం-ఫెలోపియన్ గొట్టాలు మరియు అండాశయాల వంటి అసాధారణ ప్రదేశాలలో పిండం అతుక్కుని ఉండిపోవడం) నిర్ధారించడానికి కూడా సహాయపడుతుంది.

స్త్రీవ్యాధి నిపుణ వైద్యులు (gynecologists) రక్త పరీక్ష లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించమని సలహా ఇవ్వవచ్చు. ఈ పరీక్షల ఫలితాలపై ఆధారపడి, రక్త నమూనాను తీసుకోవచ్చు లేదా ట్రాన్స్వాజినాల్ లేదా ట్రాన్స్ అబ్డోమినల్ ఆల్ట్రాసౌండ్ను (పరీక్ష) జరపవచ్చు. రక్త పరీక్ష యొక్క ఫలితాలు ధృవీకరించబడటానికి మూడు రోజుల నుండి ఒక వారం వరకు అవసరం కావచ్చు, కాని అల్ట్రాసౌండ్ పరీక్ష తక్షణమే ఫలితాలను ఇస్తుంది.

హెల్త్ కేర్ సెంటర్లో చేసిన hCG గర్భనిర్ధారణ పరీక్ష (మూత్రం లేదా రక్తం) యొక్క రకాన్ని బట్టి, ఖర్చు రూ 200 నుంచి రూ 500 వరకు ఉంటుంది. హార్మోనల్ పరీక్షల కంటే అల్ట్రాసౌండ్ హార్మోన్ల పరీక్షలకుఎక్కువ ఖర్చు అవుతుంది,ఇది రూ 600 నుండి రూ 1200  వరకు ఉండవచ్చు.

Dr. Arpan Kundu

Dr. Arpan Kundu

Obstetrics & Gynaecology
7 Years of Experience

Dr Sujata Sinha

Dr Sujata Sinha

Obstetrics & Gynaecology
30 Years of Experience

Dr. Pratik Shikare

Dr. Pratik Shikare

Obstetrics & Gynaecology
5 Years of Experience

Dr. Payal Bajaj

Dr. Payal Bajaj

Obstetrics & Gynaecology
20 Years of Experience

వనరులు

 1. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Pregnancy tests.
 2. U. S Food and Drug Association. [Internet]. Pregnancy
 3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy testing
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pregnancy test
 5. Chard T. Pregnancy tests: a review. Hum Reprod. 1992 May;7(5):701-10. PMID: 1639991
 6. C. Gnoth, S. Johnson. Strips of Hope: Accuracy of Home Pregnancy Tests and New Developments. Geburtshilfe Frauenheilkd. 2014 Jul; 74(7): 661–669. PMID: 25100881
Read on app