Fill out the form for surgery information.
We will contact you within 48 hours.

ఒక మహిళ లేదా జంట (భార్యా- భర్త) తమ జీవితంలో చాలా కష్టకరంగా మరియు నొప్పితో తీసుకునే బాధాకరమైన నిర్ణయాల్లో గర్భస్రావం ఒకటి. .

గర్భధారణ యొక్క ముగింపును వైద్యపరమైన పదాల్లో తెలపడంకోసం ‘గర్భస్రావం’ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది. గర్భస్రావాన్ని వైద్యపరంగా లేదా శస్త్రచికిత్స ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అనుసరించాల్సిన విధానం మరియు గర్భస్రావం యొక్క భద్రత గర్భం యొక్క త్రైమాసికం (మూణ్నెల్లు)  మీద ఆధారపడి ఉంటుంది. ఈ గర్భస్రావ ప్రక్రియ ఎంత ముందుగా జరిగితే ప్రక్రియసమస్యలు అంత తక్కువవుంటాయి.

గర్భస్రావ విధానం చాలా సందర్భాలలో సురక్షితం కాని సాధారణంగా భారీగా రక్తస్రావం కావడం, కటి భాగాన నొప్పులు (కటి తిమ్మిరి), వికారం, మరియు వాంతులు వంటి కొన్ని దుష్ప్రభావాలూ ఉంటాయి. అయినప్పటికీ, అధిక రక్తస్రావం ద్వారా రక్తనష్టం, జ్వరం మరియు తీవ్రమైన నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలను మీరు గమనించినట్లయితే వెంటనే మీరు మీ స్త్రీరోగ, ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్ట్కు) రిపోర్టు చేయాలి లేదా సంప్రదించాలి.

గర్భస్రావం భవిష్యత్తులో రానున్న గర్భాలు లేదా స్త్రీ యొక్క సంతానోత్పత్తి శక్తిని దెబ్బ తీయదు, అందుచేత, శిక్షణ పొందిన స్త్రీరోగ నిపుణులైన వైద్యుల (gynaecologist) మార్గదర్శకత్వంలో గర్భస్రావం నిర్వహించబడే  పక్షంలో గర్భస్రావాన్ని ఎంచుకోవడం ప్రమాదమేమాత్రం కాదు.

  1. గర్భస్రావం అంటే ఏమిటి - What is an abortion in Telugu
  2. గర్భస్రావం యొక్క రకాలు - Types of abortion in Telugu
  3. గర్భస్రావానికి సమయ పరిమితి - Time limit for abortion in Telugu
  4. సురక్షితమైన మరియు అసురక్షిత గర్భస్రావం - Safe and unsafe abortion in Telugu
  5. గర్భస్రావానికి కారణాలు - Causes of abortion in Telugu
  6. గర్భస్రావం విధానం - Abortion procedure in Telugu
  7. గర్భస్రావం యొక్క దుష్ప్రభావాలు - Side effects of abortion in Telugu
  8. గర్భస్రావంవల్ల కలిగే ప్రమాదాలు లేదా సమస్యలు - Risks or complications of abortion in Telugu
  9. గర్భస్రావం తర్వాత గర్భధారణకున్న అవకాశాలు - Chances of getting pregnant after abortion in Telugu
  10. గర్భస్రావానికి భారతీయ చట్టం - Indian law on abortion in Telugu
గర్భస్రావం: రకాలు, కారణాలు, మాత్రలు, ప్రక్రియ మరియు దుష్ప్రభావాలు వైద్యులు

గర్భస్రావం అనేది గర్భధారణను యొక్క రద్దును సూచిస్తుంది. స్త్రీ యొక్క గర్భం నుండి పిండం యొక్క తొలగింపు లేదా బహిష్కరణను నిర్వహించడమే గర్భస్రావం. గర్భస్రావం ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే గర్భం లోని పిండం లేక  శిశువు యొక్క మరణం కారణంగా చేయాల్సి వస్తుంది.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

గర్భస్రావం సాధారణంగా సంభవిస్తుందా లేదా ప్రేరేపించబడుతుందా అనేదాని మీద ఆధారపడి గర్భస్రావం కింది రెండు రకాలుగా  ఉంటుంది:

యథేచ్ఛ (Spontaneous) గర్భస్రావం లేదా సహజ గర్భస్రావం లేదా 6 వారాల్లోపు గర్భస్రావం

పిండం లేదా గర్భస్థ శిశువు గర్భధారణ యొక్క సంక్లిష్టత వలన చనిపోయినపుడు సహజ గర్భస్రావం ఏర్పడుతుంది. దీన్ని సాధారణంగా ‘6 వారాల్లోపు గర్భస్రావం’ అని పిలుస్తారు.

ప్రేరేపిత (Induced) గర్భస్రావం

ప్రేరేపిత గర్భస్రావం అంటే ఉద్దేశ్యపూర్వకంగా మహిళ గర్భాశయం నుండి తన పిండాన్ని తొలగించడమే, అపిండాన్ని తొలగించడానికి వైద్యపర ప్రక్రియను లేదా శస్త్రచికిత్స ప్రక్రియను చేపట్టవచ్చు. ఈ ప్రేరేపిత గర్భస్రావాన్ని ఆ మహిళ యొక్క ఆరోగ్యానికి మరియు ప్రాణ భద్రతకు హాని కలిగించే సందర్భాల్లో నిర్వహిస్తారు.

భారతదేశ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వశాఖ) ప్రకారం, గర్భధారణను 20 వారాల్లోగా గర్భస్రావం చేయడం సురక్షితం. ఈ సమయాన్ని (20 వారాలు) మించిన గర్భధారణను గర్భస్రావం చేయడం అనేది చాలా ఎక్కువ ప్రమాదకర సమస్యలతో కూడుకుని ఉంటుంది, సూచించిన ఈ ప్రమాదం ఆ మహిళకు గర్భస్రావ సమయంలో లేదా ఆ తర్వాత అయినా సంభవించవచ్చు.

మేము పైన చెప్పినట్లుగా, గర్భస్రావం యొక్క రెండవ-త్రైమాసికంలోగా లేక 20 వారాల లోపు గర్భాన్ని గర్భస్రావం చేయడం సురక్షితం. రెండవ త్రైమాసికాన్ని మించిన గర్భధారణలో పిండం మరింత పెరుగుతుంది కాబట్టి, ఇలా 20 వారాలు మించిన గర్భాన్ని   గర్భస్రావం చేస్తే ప్రమాదాలు మరియు సమస్యలు చాలా ఉంటాయి. అందువల్ల, మూడవ-త్రైమాసికంలోకి ప్రవేశించడానికి చాలా ముందే గర్భవతి అయిన మహిళ తన గర్భస్రావ నిర్ణయాన్ని తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

గర్భస్రావం యొక్క భద్రత తత్సంబంధ శస్త్రచికిత్స లేదా వైద్య గర్భస్రావం ఏ ఆరోగ్యసంరక్షణా కేంద్రంలో (healthcare facility) జరుగుతున్నదనే దానిపై ఆధారపడి ఉంటుంది. గర్భస్రావం మాత్రలు లేదా గర్భస్రావశస్త్రచికిత్సలను చేపట్టడానికి అర్హత , అధికారం కలిగిన వైద్యుడు లేదా గైనకాలజిస్ట్ చేత మాత్రమే గర్భస్రావం చేయించుకోవడం  సురక్షితం మరియు గర్భస్రావం విధానం కోసం సందర్శించేందుకు అది (అర్హత కల్గిన) కేంద్రంగా ఉండాలి. గర్భస్రావం చేయటానికి ముందు ఆ వైద్యకేంద్రం అంటువ్యాధులకు రక్షణ కల్పించే అన్ని స్టెరిలైజేషన్ విధానాలను అనుసరించాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

సహజ గర్భస్రావానికి మరియు ప్రేరిత గర్భస్రావానికి గల వివిధ కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ప్రేరేపిత గర్భస్రావం

తల్లి (గర్భవతి) మరియు డాక్టర్ నిర్ణయం ప్రకారమే ప్రేరేపిత గర్భస్రావం జరుగుతుంది. అందువల్ల, ఇది చాలా వ్యక్తిగత, సామాజిక మరియు వైద్య కారణాలను కలిగి ఉండవచ్చు. 14 దేశాల్లో నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, గర్భస్రావానికి గల ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి:

  • బిడ్డకు-బిడ్డకు అంతరం (childs pacing)
    దంపతులు కాన్పుకు-కాన్పుకు మధ్య కనీసం మూడు సంవత్సరాల వ్యత్యాసం కలిగి ఉండేట్లుగా చూసుకోవాలని  విస్తారంగా సూచించడమైంది, మహిళలు ఎప్పుడు గర్భస్రావాన్ని ఎంచుకుంటారంటే ఇటీవలే కాన్పు అయ్యున్నపక్షంలో వారు తమ  కాన్పుకు - కాన్పుకు మధ్య అంతరం (కనీసం మూడేళ్లు) కోసం చూస్తున్నపక్షంలో.
  • అవాంఛిత గర్భం
    కొందరు మహిళలు అజాగ్రత్త వల్లనో లేక అనుకోకుండానే కొన్ని సందర్భాల్లో గర్భధారణకు గురై ఆ తర్వాత గర్భస్రావం చేయించుకోవడానికి సిద్ధమవుతారు. ఇటువంటి గర్భాలు సాధారణంగా అసురక్షిత లైంగికచర్య లేదా గర్భనిరోధక వైఫల్యం కారణంగా సంభవిస్తాయి. మహిళల ప్రేరేపిత గర్భస్రావానికి పోవడానికున్న అత్యంత సాధారణ కారణాల్లో ఇది (అవాంఛిత గర్భం) ఒకటి.
  • ఆర్థిక సమస్యలు
    పిల్లల పెంపకం అనేది చాలా బాధ్యతలతో కూడుకుని ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవటానికి తగినంతగా సరిపోయే ఏదైనా ఓ సాధారణ ఆర్ధిక వనరు (ఉద్యోగంలాంటిది) కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, ఆర్ధిక సమస్యలతో ఉన్న జంటలు లేక దంపతులు గర్భస్రావానికి వెళ్తుంటారు.
  • జీవనోపాధి (కెరీర్) నిర్ణయాలు
    గర్భధారణ అనేది ఒక మహిళ యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని తీవ్రంగా మారుస్తుంది. కొన్నిసార్లు, ఆమె తన వృత్తిపరమైన లక్ష్యాలు మరియు ఆకాంక్షలను సవరించుకోవడం ఆమెకు కష్టతరం అవుతుంది. కొన్నిసార్లు జీవితంలో కీలకమైన దశలో, మహిళ మరింతగా పైచదువులు చదవాలనుకోవడం, ఉద్యోగం లేదా ఇతర జీననోపాధి (కెరీర్) కోసం గర్భస్రావం చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. .
  • భాగస్వామితో సమస్యలు
    అనేకమంది దంపతులు చెప్పేదేమంటే ఇద్దరూ ఇష్టపడటంవల్లనే గర్భవతి కావడానికి నిర్ణయించుకున్నామంటారు. సంతానం యొక్క బాధ్యత భార్యాభర్తలిరువురిపైనాఉంటుంది. కొన్ని సందర్భాల్లో మహిళలు తమ భాగస్వాములతో సంతోషంగా లేక బాధపడుతున్న సందర్భాల్లో, గర్భధారణ పట్ల సతిపతులిద్దరికీ సమ్మతి లేకపోవడంవల్ల, ఆర్థిక అభద్రత లేదా విడాకులు వంటి కారణాలవల్ల గర్భస్రావం నిర్ణయానికి వస్తున్నారు.
  • అతితక్కువ వయస్సులో గర్భందాల్చడం
    బాలికలైనవారు చాలా చిన్న వయస్సులోనే గర్భవతులవులైనప్పుడు  మరియు గర్భం కొనసాగించడానికి లేదా పిల్లలను పెంచుకోవటానికి భౌతికంగా లేదా మానసికంగా సిద్ధంగా ఉండరు, అట్టి సందర్భాల్లో తరచుగా వారి వైద్యులు గర్భస్రావం చేయించుకొమ్మని సలహా ఇస్తారు.
  • వివాహానికి ముందే గర్భిణీ
    స్త్రీలు, ప్రత్యేకించి భారతదేశంలో, పెళ్లికి ముందుగా గర్భవతులు కావడం, వివాహం కాకుండా గర్భాన్ని కొనసాగించటానికి అనుమతి లేదు, అలా అవివాహిత అయిన బాలిక గర్భవతిగా మనగల్గడం కష్టంతో కూడుకున్న పని. దీని చుట్టూ పెద్ద నిషిద్ధం భారతీయ సమాజంలో ఉంది. బాలికలు వివాహానికి ముందే గర్భవతులవుతున్న సందర్భాల్లో వారిపై గర్భస్రావం బలవంతంగా మోపబడుతోంది, దాంతోబాటు అవివాహితులై ఉండి గర్భవతులైన అమ్మాయిలు ఇతర మానసిక గాయాలకు గురికావలసి వస్తుంది. కొన్ని సంస్కృతులలో, పెళ్లి కాకుండానే గర్భవతి కావడమనేది అవమానకరమైనదిగా మరియు 'చెడు నడతకల్గిన వ్యక్తి' కి చిహ్నంగా భావిస్తారు.
  • ఆరోగ్య ప్రమాదాలు (హెల్త్ రిస్క్స్)
    గర్భధారణ కొనసాగింపు పిండానికి లేదా తల్లికి తీవ్రమైన ఆరోగ్య అపాయాన్ని కలిగించే అవకాశం ఉంటే, వైద్యులు గర్భస్రావం చేయించుకొమ్మని సలహా ఇస్తారు.
  • కుటుంబము లేదా పీర్ ప్రభావాలు
    ఒక స్త్రీ తన బంధువులు, స్నేహితులు లేదా కుటుంబముచే ప్రభావితమైన కొన్ని దురదృష్టకర సమయాలల్లో, ఆమె గర్భస్రావం చేయించుకోవాల్సి వస్తుంది. అందువల్ల, గర్భధారణ గురించి ఎల్లప్పుడూ ఒక సలహాదారునితో (కౌన్సెలర్) లేదా స్త్రీరోగ నిపుణవైద్యుడి తో (గైనకాలజిస్ట్తో) చర్చించాలని సూచించారు.
  • మగబిడ్డనే కనాలన్న భావన  
    చాలా భారతీయ రాష్ట్రాలలో మరియు కొన్ని ఆసియా దేశాల్లో మగబిడ్డనే కణాలన్న భావన విస్తృతంగా వ్యాపించి ఉంది, ఈ భావన వల్ల గర్భాస్రావాలు కొల్లలుగా సంభవిస్తున్నాయి. మగబిడ్డ కోసం ఆడ శిశువు యొక్క గర్భస్రావం (భ్రూణ హత్య) ఒక నేరమని తెలిసీ ఈనేరాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం (గర్భస్రావం) సాధారణంగా తల్లి లేదా తండ్రి (దంపతులు) యొక్క అనుమతి లేకుండానే (ఉమ్మడికుటుంబాల్లో) తీసుకోవడం జరుగుతుంది. 

యథేచ్ఛ (Spontaneous) గర్భస్రావాలు  
మహిళ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని కారణాలు ఉన్నాయి, అవి ఏవంటే:

  • జన్యుపరమైన అసాధారణతలు
    ఒక నిద్రాణమైన లేదా రహస్యమైన (దాచబడిన) జన్యుపరమైన అసాధారణత ఉన్న తల్లిదండ్రులు వారి జన్యువులను పిండానికి బదిలీ చేయగలరు, అది గర్భస్థ పిండం మనుగడకు అనానుకూలంగా ఉంటుంది.
  • రోగనిరోధక కారణాలు
    తల్లి రోగనిరోధక వ్యవస్థ పిండానికి వ్యతిరేకంగా పనిచేయడంతో కూడా గర్భస్రావం సంభవిస్తుంది.
  • మాయ (placenta)లో అసాధారణ గడ్డలు
    థ్రోంబోఫిలియా అనేది మాయలో అసాధారణ గడ్డలు ఏర్పడిన ఒక రుగ్మత. ఫలితంగా, పిండానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది, అటుపై దాని మరణానికి కారణం అవుతుంది.
  • హార్మోన్ల లోపాలు
    హైపో థైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు), సీరం థైరాయిడ్ ప్రతిరోధకాల అధిక స్థాయి, మరియు థైరాయిడ్ ప్రతిరోధకాల లేకపోవడం, కానీ పెరిగిన సీరం (TSH) థైరాయిడ్ ప్రేరేపక  (స్టిమ్యులేటింగ్) హార్మోన్ మరియు పిసిఒఎస్ (పాలీసిస్టిక్ అండాశయ సిండ్రోమ్) వంటి కొన్ని హార్మోన్ల లోపాలకు మరియు గర్భస్రావాలకు సంబంధం ఉన్నట్లు కనుక్కోబడింది.
  • తప్పుడు గర్భస్థ పిండం ఎంపిక 
    గర్భాశయంలో పిండం లోపభూయిష్టంగా ఉంటే లేదా ఇంప్లాంటేషన్కు తక్కువ సామర్ధ్యం కలిగి ఉన్నట్లయితే, పిండం సాధారణంగా పెరగడంలో విఫలమవుతుంది, ఈ పరిస్థితి గర్భస్రావానికి దారితీయవచ్చు.
  • జీవనశైలి
    ఏ మహిళలైతే ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినరో, ఎవరైతే (గర్భవతులు)  మద్యపానం, పొగ త్రాగడం చేస్తారో, ఎక్కువ కఠినమైన వ్యాయామాలు చేస్తారో, సరైన పరిశుభ్రత పాటించరో లేదా ఎలాంటి శారీరక శ్రమకు సంబంధించిన ప్రక్రియలు  చేపట్టరో అలాంటి గర్భవతుల కడుపులో ఎదిగే పిండానికి సరైన పోషకాహారం, రోగనిరోధకశక్తి అందక ఆ పిండం గర్భంలోనే చనిపోతుంది, ఈ విధంగా పిండం మరణానికి తల్లే బాధ్యత వహిస్తుంది.
  • గర్భాశయ వైకల్యాలు 
    గర్భాశయ నిర్మాణం మరియు దాని యొక్క పనితీరులో లోపాలు కూడా గర్భాశయంలో పిండంపేలవంగా అతుక్కుని  ఉండడం (అటాచ్మెంట్), పోషకాల బదిలీని తగ్గించడం మరియు తగ్గిన వ్యర్ధాల తొలగింపు వంటి పరిణామాలు కొంతకాలం తర్వాత గర్భస్థ శిశువు మరణానికి దారితీయవచ్చు.

 

గర్భస్రావం రెండు విధాలుగా జరుగుతుంది- వైద్యగర్భస్రావం మరియు శస్త్రచికిత్స గర్భస్రావం. రెండు విధానాలు కూడా మొదటి-త్రైమాసికం మరియు రెండో త్రైమాసికంలో గర్భధారణకి భిన్నంగా ఉంటాయి.

మొదటి త్రైమాసికంలో

గర్భధారణ నుండి మొదటి పదమూడు వారాల లోపల జరిగే గర్భస్రావాన్ని ‘మొట్టమొదటి త్రైమాసిక గర్భస్రావం’ అంటారు. మొదటి త్రైమాసికంలో చాలా వరకు గర్భాలు తొలగించబడతాయి, ఎందుకంటే రెండవ త్రైమాసికంలో జరిగే గర్భస్రావం కంటే మొదటి త్రైమాసికంలో జరిగే గర్భస్రావమే చాలా సురక్షితమైనది కాబట్టి.

  • వైద్య గర్భస్రావం
    మీ డాక్టర్ సూచించిన విధంగా 'గర్భస్రావం మాత్రలు' తీసుకోవడం మూలంగా మీకు కలిగేదే ‘వైద్య గర్భస్రావం.’ ఈ మందులు నోటిద్వారా కడుపులోకి తీసుకునే మందులు గాని లేదా యోనిలో ఉంచుకునేవిగా గాని ఉంటాయి, లేదా రెండూ కూడా కావచ్చు. శరీరం యొక్క తక్షణ ప్రతిస్పందనను గమనించడానికి ఈ వైద్యగర్భస్రావం అనేది ఎక్కువగా ఆసుపత్రిలోనే (క్లినిక్ లో) జరుగుతుంది. అయితే, మీ గైనకాలజిస్ట్ యొక్క సూచనల ప్రకారం ఈ మందులను మీ ఇంట్లోనే కూడా తీసుకోవచ్చు.
  • శస్త్రచికిత్సా గర్భస్రావం
    శస్త్రచికిత్సా గర్భస్రావం అనేది ‘చూషణ-తురమటం’ (suction-curettage) అనే పద్ధతిచే చేయబడుతుంది. ఈ ప్రక్రియ సమయంలో వచ్చే నొప్పిపట్ల కలిగే మీ సున్నితత్వాన్ని తగ్గించడానికి స్థానిక లేదా సాధారణ అనస్తీషియా, లేదా మత్తుమందులు ఇవ్వబడతాయి. ఈ పద్ధతిలో, మీ గర్భాశయాన్ని (జనన కాలువను) ఔషధాలను ఉపయోగించడం ద్వారా లేదా డిలేటర్ సాధనం సహాయంతో విస్తరించడం జరుగుతుంది. గర్భాశయం కావలసినంతగా విస్తరించాక ఒక చూషణ ట్యూబ్ (a suction tube) గర్భాశయం లోకి యోని ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ గొట్టం ఒక వాక్యూంతో అనుసంధానించబడుతుంది, దీనిద్వారా పిండాన్ని  బయటకు పీల్చడం జరిగి, గర్భాశయమ గోడ నుండి పిండాన్ని వేరుపరచడంలో సహాయపడుతుంది.

ఈ విధానం పూర్తి చేసిన తర్వాత, మీ డాక్టర్ ఇంట్లో తీసుకోవాల్సిన కొన్ని నొప్పి నివారణలను సూచించవచ్చు. మీరు రెండు వారాల వ్యవధిలోపు కనీసం ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. ప్రక్రియ తర్వాత పిండం యొక్క అవశేషాలు ఇంకా మిగిలి ఉంటే దాన్ని నిర్ధారించుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఇది ఏదైనా ఇతర దుష్ప్రభావాలను లేదా అంటురోగాలను గుర్తించడానికి కూడా సహాయపడుతుంది.

రెండవ త్రైమాసికంలో

పదమూడవ మరియు ఇరవయ్యో వారం మధ్య గర్భం తొలగించబడినపుడు, దీన్నే ‘రెండవ-త్రైమాసిక గర్భస్రావం’గా పిలువబడుతుంది. మొదటి త్రైమాసికంలో గర్భంలో లాగానే ఈ రెండవ-త్రైమాసిక గర్భస్రావంలో కూడా వైద్యపరంగా లేదా శస్త్రచికిత్స పరంగా నిర్వహించడం జరుగుతుంది. వైద్య సంబంధమైన గర్భస్రావానికి పోలిస్తే రెండవ-త్రైమాసిక శస్త్రచికిత్స విషయంలో తక్కువ సమస్యలుంటాయని వైద్యులు సూచించారు.  ----

  • మెడికల్ గర్భస్రావం
    రెండవ త్రైమాసికంలో, వైద్య గర్భస్రావం డాక్టర్ క్లినిక్లోనే  నిర్వహించబడుతుంది. మీరు నోటిద్వారా కడుపుకు గర్భస్రావం మాత్రలు తీసుకోవాలని, డాక్టర్ మిమ్మల్ని అడగవచ్చు. కొన్నిసార్లు, యోని మాత్రలు లేదా ఇంట్రావీనస్ (సిరలు లేక నరాల ద్వారా మందుల్ని శరీరంలోనికి సిరంజి ద్వారా ఎక్కించడం) సూది మందులూ ఇవ్వవచ్చు. ఈ మందులు సేవించిన పన్నెండు గంటల తర్వాత అవి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. పిండం (లేక పిండాడాల) యొక్క బహిష్కరణకు దారితీసే గర్భాశయ కండరాల సంకోచం ఆధారంగా ఈ మాత్రల చర్య యొక్క కార్యవైఖరి యంత్రాంగాన్ని వివరించవచ్చు.రెండవ త్రైమాసికంలో వైద్య గర్భస్రావం తీవ్రమైన నొప్పికి (తిమ్మిరికి) కారణమవుతుంది, కాబట్టి మీ వైద్యుడు కొన్ని నొప్పి నివారణలను సూచించవచ్చు.
  • శస్త్రచికిత్సా గర్భస్రావం
    రెండవ-త్రైమాసికంలో గర్భాన్ని (గర్భస్రావం చేయడానికి) తొలగించేందుకు విస్తరణ మరియు తొలగింపు (dilatation and evacuation) అని పిలువబడే శస్త్రచికిత్సను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో, శస్త్రచికిత్సకు ముందు రోజు ఇవ్వవచ్చు, ఇది గర్భాశయమును విస్తరించడంతో సహాయపడుతుంది. శస్త్రచికిత్స రోజున, విస్తరింపు చేయడానికి ఉపయోగించే పరికరాలతో గర్భాశయాన్ని ఇంకా విస్తరించడం జరుగుతుంది. అవసరమైతే, నొప్పి నుంచి ఉపశమనానికి స్థానిక లేదా సాధారణ అనస్థీషియా ఇవ్వబడుతుంది. ఒక చూషణ ట్యూబ్ (suction tube) ను గర్భాశయం నుండి పిండాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.

గర్భస్రావం చేయించుకొన్న తర్వాత, మీరు క్రింది లక్షణాలలో కొన్నింటిని అనుభవించవచ్చు:

  • వికారం మరియు వాంతులు
    గర్భస్రావకారక మాత్రలు సేవించడంవల్ల కల్గిన  వైద్య గర్భస్రావము (medical abortion) యొక్క దుష్ఫలితంగా మహిళలు సాధారణంగా వికారం, వాంతులు  అనుభవించడం జరుగుతుంది.
  • భారీ రక్తస్రావం
    గర్భకోశపు లోపలి పొర (ఎండోమెట్రియుమ్) సంకోచించడంవల్ల భారీ రక్తస్రావం ఏర్పడుతుంది, గర్భం నుండి పిండాన్ని తొలగించడానికి దాని అంతర్గత గోడల్ని (లైనింగ్ను) వదిలివేస్తుంది. ఈ పరిస్థితి రెండు వారాల వరకు ఉండవచ్చు.
  • కటిభాగంలో (పెల్విక్) తిమ్మిరి నొప్పులు
    గర్భస్రావం తరువాత మీ కటిభాగంలో (పెల్విక్ ప్రాంతంలో) వచ్చే తిమ్మిరి నొప్పులు, కొన్నిసార్లు మీరు సాధారణంగా అనుభవించేనొప్పి కంటే చాలా తీవ్రంగా ఉండవచ్చు.
Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

పైన పేర్కొన్న విధంగా ఆరోగ్య సంరక్షణా కేంద్రంలో నిర్వహించిన చాలా గర్భాలు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో, తీవ్రమైన సమస్యలు కూడా అనుభవించవచ్చు. వీటితొ పాటు:

భ్రూణ అవశేషాలు (Fetal remains)

కొన్ని సందర్భాల్లో, గర్భాశయ గోడల నుండి పిండం పూర్తిగా విడివడి (detachmen) రాకపోవడం జరగకపోవచ్చు. దీన్నే “అసంపూర్ణ గర్భస్రావం” అంటారు. అటువంటి సందర్భంలో, మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

అంటువ్యాధులు

శస్త్రచికిత్సా గర్భస్రావం విషయంలో సంక్రమణ (లేక అంటువ్యాధులు) సంభవించవచ్చు. అటువంటి సందర్భాలలో విషక్రిమినాశక (యాంటీబయాటిక్) మందులు మరియు నొప్పినివారణ మందులు (పెయిన్కిల్లర్లు) సూచించబడతాయి.

అవయవాలకు నష్టం

గర్భస్రావ ప్రక్రియ జరుపుతున్నప్పుడు, గర్భాశయానికి (cervix or uterus) నష్టం జరగవచ్చు. ఇదే గనుక జరిగినట్లయితే, వైద్యుడు మరొక శస్త్రచికిత్సను సూచించవచ్చు.

అధిక రక్తనష్టం
గర్భస్రావమైన రెండు వారాల తర్వాత మందులు లేదా శస్త్రచికిత్స తరువాత కూడా రక్తస్రావం ఆగని పక్షంలో అది రక్తహీనతకు దారి తీయవచ్చు. అలాంటి సందర్భాలలో, మహిళ యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి రక్త మార్పిడి అవసరం అవుతుంది.

ప్రేరేపించబడిన గర్భస్రావాలు భవిష్యత్తులో తిరిగి గర్భవతి కావాలనుకునే వారికి ఎలాంటి ఆటంకాన్ని ఏర్పరచవు. నిజానికి, గర్భస్రావం ప్రక్రియ తరువాత చాలా కొద్ది వ్యవధిలోనే తిరిగి గర్భవతి కావడం సాధ్యమవుతుంది. కానీ, ఎలాంటి అవాంఛిత గర్భధారణ మరియు గర్భస్రావాలను నిరోధించటానికి సరైన గర్భనిరోధక పద్ధతి కొరకు మీ స్త్రీరోగ నిపుణవైద్యుల్ని సంప్రదించండి.

సహజ గర్భస్రావాలు పదేపదే జరిగితే భవిష్యత్తులో గర్భస్రావానికి దారి తీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అంటే గర్భధారణ పొందే అవకాశమే లేకుండా పోయే ప్రమాదానికి దారితీస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన పూర్తి-కాలిక గర్భధారణకు సంపూర్ణమైన వైద్య పరీక్షలు చేయించుకుని అంతర్లీన వైద్య రుగ్మతలకు చికిత్స పొందడం అవసరం.

గర్భ నిరోధక చట్టం , 1971 (Medical Termination of Pregnancy Act, 1971,) లోని సెక్షన్ 3 ప్రకారం , గర్భస్రావాన్ని కింది పరిస్థితుల్లో చేయవచ్చు:

  • గర్భంతో కొనసాగితే తల్లికి ఆరోగ్య ప్రమాదం ఉన్న సందర్భంలో.
  • శారీరక లేదా మానసిక వైకల్యాలు కలిగిన బిడ్డ జన్మించేందుకు ఎక్కువ అవకాశం ఉన్నపుడు.
  • మానభంగం నేరానికి గురైన కారణంగా గర్భం సంభవించిన సందర్భంలో లేదా గర్భవతి అయిన ఆ స్త్రీ మానసికవైకల్యం కల్గిన సందర్భంలో గర్భస్రావం అనుమతించబడుతుంది.

ఇటీవల, మానభంగ నేరానికి గురైన బాధితురాలి గర్భస్రావ కాల పరిమితిని 24 వారాలకు పొడిగించడం జరిగింది..

ఇండియన్ పీనల్ కోడ్,సెక్షన్ 312 నుండి 315 చట్టంప్రకారం, చట్టవిరుద్ధ గర్భస్రావం నిర్వహించే వ్యక్తికి మూడేళ్ల జైలువాసం మరియు జరిమానా కూడా కట్టవలసి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.సెక్స్-సెలెక్టివ్ గర్భస్రావం (ఆడ శిశువు వద్దనుకుని చేసే గర్భస్రావం) నేరానికి ఆ దంపతులిద్దరికీ ఏడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు లేక జరిమానా లేకుండా శిక్ష పడుతుంది.

Dr Sujata Sinha

Dr Sujata Sinha

Obstetrics & Gynaecology
30 Years of Experience

Dr. Pratik Shikare

Dr. Pratik Shikare

Obstetrics & Gynaecology
5 Years of Experience

Dr. Payal Bajaj

Dr. Payal Bajaj

Obstetrics & Gynaecology
20 Years of Experience

Dr Amita

Dr Amita

Obstetrics & Gynaecology
3 Years of Experience

వనరులు

  1. Elisabeth Clare Larsen et al. New insights into mechanisms behind miscarriage. BMC Med. 2013; 11: 154. PMID: 23803387
  2. Tae Yeong Choi et al. Spontaneous abortion and recurrent miscarriage: A comparison of cytogenetic diagnosis in 250 cases. Obstet Gynecol Sci. 2014 Nov; 57(6): 518–525. PMID: 25469342
  3. Margreet Wieringa-de Waard et al. The natural course of spontaneous miscarriage: analysis of signs and symptoms in 188 expectantly managed women. Br J Gen Pract. 2003 Sep; 53(494): 704–708. PMID: 15103878
  4. National Health Service [Internet]. UK; Abortion.
  5. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; Induced Abortion
  6. National Health Service [Internet]. UK; Abortion.
Read on app